ఐపీఎల్-2026లో ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు ఏది కలిసిరావడం లేదు. గురువారం వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ముంబై పరాజయం పాలైంది. ముంబైకి ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. ముంబై పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్దానంలో కొనసాగుతోంది.
కాగా వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌లో అంతర్గత విభేదాలు చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా- స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మధ్య జరిగిన మాటల యుద్దం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
ఏమి జరిగిందంటే?
196 పరుగుల భారీ లక్ష్య చేధనలో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దూకుడుగా ఆడుతూ క్రీజులో పాతుకుపోయాడు. అతడిని ఔట్ చేసేందుకు హార్దిక్ పాండ్యా తీవ్ర ప్రయత్నాలు చేశాడు. అయినప్పటికి ఫలితం మాత్రం దక్కలేదు. దీంతో పాండ్యా తన సహనాన్ని కోల్పోయాడు. బుమ్రా బౌలింగ్ చేస్తున్నప్పుడు పాండ్యా పదే పదే ఫీల్డర్లను మారుస్తూ విసుగు తెప్పించాడు.
తన బౌలింగ్‌కు తగ్గట్టుగా ఫీల్డింగ్ పెట్టుకునే అవకాశం ఇవ్వకుండా, హార్దిక్ జోక్యం చేసుకోవడం బుమ్రాకు నచ్చలేదు. దీంతో ఇద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్దం జరిగింది. బుమ్రా అసహనంతో నీవు నాకు చెప్పొద్దు అన్నట్లు సైగలు చేశాడు. ఏదేమైనప్పటికి బుమ్రా చివరికి నిర్ణయానికే తలవంచాల్సి వచ్చింది.
ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా ఈ ఏడాది సీజన్‌లో బుమ్రా దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ టీమిండియా పేస్ గుర్రం ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడి ఒక్క వికెట్ కూడా సాధించలేదు.
చదవండి: IND vs IRE: సూర్యకు షాక్..! టీమిండియా కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్?


