రోహిత్‌ శర్మ అభిమానులకు చేదు వార్త | IPL 2026, MI vs SRH: No Rohit Sharma again, Hardik Pandya gives big comeback update | Sakshi
Sakshi News home page

రోహిత్‌ శర్మ అభిమానులకు చేదు వార్త

Apr 29 2026 8:07 PM | Updated on Apr 29 2026 8:20 PM

IPL 2026, MI vs SRH: No Rohit Sharma again, Hardik Pandya gives big comeback update

ముంబై ఇండియన్స్ అభిమానులకు చేదు వార్త. ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌ మరోసారి జట్టుకు దూరమయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 29) జరుగుతున్న కీలక పోరులో కూడా రోహిత్ ఆడటం లేదు. హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా అతడు వరుసగా నాలుగో మ్యాచ్‌కు దూరమయ్యాడు.

టాస్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా రోహిత్‌ గాయంపై కీలక అప్డేట్ ఇచ్చాడు. "రోహిత్ ఇంకా పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించలేదు. అతడు తిరిగి రావడానికి ఇంకొన్ని మ్యాచ్‌లు పట్టొచ్చు" అని స్పష్టం చేశాడు. దీంతో ముంబై అభిమానులు అతని రీ-ఎంట్రీ కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రోహిత్ గైర్హాజరీ ముంబైకి భారీ ఎదురుదెబ్బగా పరిగణించబడుతుంది. అతని అనుభవం, ఆరంభ ఓవర్లలో దూకుడు జట్టుకు ఎంతో అవసరం. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ఓపెనర్లుగా ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్ బరిలోకి దిగారు. ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.

ఆరంభ ఓవర్లలో ముంబై ఓపెనర్లు చెలరేగిపోతున్నారు. జాక్స్‌, రికెల్టన్‌ పోటీపడి బౌండరీలు, సిక్సర్లు బాదుతున్నారు. 6 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 78-0గా ఉంది. జాక్స్‌ 38, రికెల్టన్‌ 37 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇప్పటివరకు బౌలింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో ఎసాన్‌ మలింగ ఒక్కడే జాక్స్‌-రికెల్టన్‌ జోడీ ధాటి నుంచి తప్పించుకున్నాడు. కమిన్స్‌, హింగే, హర్ష్‌ దూబే, సాకిబ్‌ హుసేన్‌ను వీరి జోడీ చెడుగుడు ఆడుకుంది.

ఈ మ్యాచ్‌లో ముంబై రెండు మార్పులతో బరిలోకి దిగింది. డికాక్‌ స్థానంలో రికెల్టన్‌, సాంట్నర్‌ స్థానంలో రాబిన్‌ మింజ్‌ బరిలోకి దిగారు. ఎస్‌ఆర్‌హెచ్‌ విషయానికొస్తే.. ఈ జట్టు ఓ మార్పు చేసింది. శివాంగ్‌ కుమార్‌ స్థానంలో హర్ష్‌ దూబే తుది జట్టులోకి వచ్చాడు.

తుది జట్లు..
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(w), నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(సి), హర్ష్ దూబే, సకీబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే, ఎషాన్ మలింగ

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), విల్ జాక్స్, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, AM గజన్‌ఫర్, అశ్వనీ కుమార్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement