ఆర్సీబీ జోరు.. ముంబైకి హ్యాట్రిక్‌ ఓటమి | Bengaluru beat Mumbai Indians in Ipl 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: ఆర్సీబీ జోరు.. ముంబైకి హ్యాట్రిక్‌ ఓటమి

Apr 12 2026 11:56 PM | Updated on Apr 12 2026 11:56 PM

Bengaluru beat Mumbai Indians in Ipl 2026

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ వ‌రుస‌గా హ్యాట్రిక్ ఓట‌ముల‌ను చ‌విచూసింది. ఆదివారం వాంఖ‌డే వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో 18 ప‌రుగుల తేడాతో ముంబై ఓట‌మి పాలైంది. 241 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన హార్దిక్ సేన‌.. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 222 ప‌రుగులు చేయ‌గ‌ల్గింది.

ముంబై బ్యాట‌ర్ల‌లో షెర్ఫేన్‌ రూథర్‌ఫర్డ్‌(71 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(40), ర్యాన్‌ రికెల్టన్‌(37), సూర్యకుమార్‌ యాదవ్‌(33) ఫర్వాలేదన్పించారు. ఆర్సీబీ బౌలర్లలో సుయాశ్‌ శర్మ రెండు, జాకబ్‌ డఫీ, కృనాల్‌ పాండ్యా తలా వికెట్‌ సాధించారు.

సాల్ట్‌, పాటిదార్ విధ్వంసం..
అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు నిర్ణీత 20 ఓవర్ల‌లో 4 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో ఫిల్‌ సాల్ట్‌ (36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 78) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. రజత్‌ పాటిదార్‌(53), విరాట్‌ కోహ్లి(50) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటారు. వీరితో పాటు టిమ్‌ డేవిడ్‌(16 బంతుల్లో 34) మెరుపులు మెరిపించాడు. ముంబై బౌల‌ర్ల‌లో ట్రెంట్‌ బౌల్ట్‌, హార్దిక్‌ పాండ్యా, శార్థూల్‌ ఠాకూర్‌, మిచెల్‌ శాంట్నర్‌ తలా వికెట్‌ సాధించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement