ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఇవాళ (ఏప్రిల్ 29) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. దీని వెనుక ఓ హృదయ విదారక కారణం ఉంది.
జట్టు సహాయక సిబ్బందిలో ఒకరి కుమార్తె ఇటీవల అకాల మరణం చెందింది. ఆమె స్మారకార్థం, అలాగే ఆ కుటుంబానికి సంఘీభావం తెలియజేయడానికి ఆటగాళ్లు నల్ల ఆర్మ్‌బ్యాండ్లు ధరించి మైదానంలోకి దిగారు.
ఫ్రాంచైజీకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. "మా సహాయక సిబ్బందిలో ఒకరి కుమార్తె అకాల మరణం చెందింది. వారి కుటుంబానికి మద్దతుగా, ఆమె జ్ఞాపకార్థం ఈరోజు మా ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించారు" అని వెల్లడించారు.
ఈ విషాద సమయంలో ఆ కుటుంబ గోప్యతను గౌరవిస్తూ, సంబంధిత సిబ్బంది వివరాలను ముంబై ఇండియన్స్ వెల్లడించలేదు.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 15 ఓవర్ల అనంతరం ఆ జట్టు స్కోర్ 181-3గా ఉంది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ 44 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 100 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు.
అతనికి జతగా హార్దిక్ పాండ్యా (2) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు విల్ జాక్స్ 46, సూర్యకుమార్ యాదవ్ 5, నమన్ ధిర్ 22 పరుగులు చేసి ఔటయ్యారు. హింగే, ఎషాన్ మలింగ, నితీశ్ కుమార్ రెడ్డి తలో వికెట్ తీశారు.


