చరిత్ర సృష్టించిన తిలక్‌ వర్మ.. ఫాస్టెస్ట్‌ సెంచరీ | Tilak Varma Rewrites History,Slams Fastest 100 For Mumbai Indians By An Indian | Sakshi
Sakshi News home page

IPL 2026: చరిత్ర సృష్టించిన తిలక్‌ వర్మ.. ఫాస్టెస్ట్‌ సెంచరీ

Apr 20 2026 10:03 PM | Updated on Apr 20 2026 10:18 PM

Tilak Varma Rewrites History,Slams Fastest 100 For Mumbai Indians By An Indian

ఐపీఎల్‌-2026లో ముంబై ఇండియ‌న్స్ స్టార్ బ్యాట‌ర్ తిల‌క్ వ‌ర్మ ఎట్ట‌కేల‌కు త‌న ఫామ్‌ను అందుకున్నాడు. అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో తిల‌క్ అద్బుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. న‌రేంద్ర మోడీ స్టేడియంలో తిల‌క్ విధ్వంసం సృష్టించాడు.

ముంబై ఇండియన్స్ 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన తిలక్.. తొలుత ఆచితూచి ఆడాడు. ఈ హైదరాబాదీ తను ఎదుర్కొన్న తొలి 22 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత తిలక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గుజరాత్ బౌలర్లను ఉతికారేశాడు. 

అతడిని ఆపడం ఎవరి తరం కాలేదు. తొలి 50 పరుగులను 33 బంతుల్లో పూర్తి చేసిన తిలక్.. చివరి 50 పరుగులను కేవలం 12 బంతుల్లోనే బాది తన మొదటి ఐపీఎల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా 45 బంతులు ఎదుర్కొన్న తిలక్‌ వర్మ 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి.

ఫాస్టెస్ట్ సెంచరీ
ఈ మ్యాచ్‌లో 45 బంతుల్లోనే శతకొట్టిన తిలక్ వర్మ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ముంబై ఇండియన్స్ తరపున ఫాస్టెస్ సెంచరీ చేసిన ఆటగాడిగా సనత్ జై సూర్య రికార్డును తిలక్ సమం చేశాడు. జైసూర్య 2008 సీజన్‌లో సీఎస్‌కేపై 45 బంతుల్లోనే శతక్కొట్టాడు.

ఇప్పుడు మళ్లీ 18 ఏళ్ల తర్వాత తిలక్ 45 బంతుల్లో సెంచరీ చేశాడు. ముంబై ఇండియన్స్‌ తరపున ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన ఇండియన్‌ మాత్రం తిలక్‌ వర్మనే కావడం గమనార్హం.

అదేవిధంగా ముంబై ఇండియన్స్‌ తరపున సెంచరీ చేసిన రెండువ అతి పిన్నవయష్కుడిగా తిలక్‌ నిలిచాడు. 23 ఏళ్ల 163 రోజుల్లో తిలక్‌ ఈ ఫీట్‌ సాధించాడు. ఈ జాబితాలో కామోరూన్‌ గ్రీన్‌(22 ఏళ్ల 352 రోజులు) అగ్రస్ధానంలో ఉన్నాడు.
చదవండి: IPL 2026: ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే సూప‌ర్ బాల్‌.. దెబ్బకు స్టంప్స్ ఎగిరిపోయాయి


 

 

Advertisement
 
Advertisement
Advertisement