ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే సూప‌ర్ బాల్‌.. దెబ్బకు స్టంప్స్ ఎగిరిపోయాయి | Kagiso Rabadas Ball Of The Tournament Shatters Suryakumar Yadavs Confidence | Sakshi
Sakshi News home page

IPL 2026: ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే సూప‌ర్ బాల్‌.. దెబ్బకు స్టంప్స్ ఎగిరిపోయాయి

Apr 20 2026 9:05 PM | Updated on Apr 20 2026 9:05 PM

Kagiso Rabadas Ball Of The Tournament Shatters Suryakumar Yadavs Confidence

ఐపీఎల్‌-2026లో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ త‌న పేలవ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో సూర్య తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియ‌న్స్‌కు క‌గిసో ర‌బాడ ఆరంభంలోనే బిగ్ షాకిచ్చాడు.

అత‌డు బౌలింగ్ ధాటికి ఓపెన‌ర్లు వికెట్లు కోల్పోయి ముంబై క‌ష్టాల్లో ప‌డింది. ఈ స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన సూర్య‌కుమార్‌పై ముంబై ఫ్యాన్స్ ఆశ‌లు పెట్టుకున్నారు. అందుకు త‌గ్గ‌ట్టే 6 ఓవ‌ర్ వేసిన ర‌బాడ బౌలింగ్‌లో సూర్య‌  ఓ సిక్స్, ఫోర్ బాది మంచి ట‌చ్‌లో క‌న్పించాడు. కానీ అదే ఓవ‌ర్‌లో ర‌బాడ అద్భుత‌మైన బంతితో సూర్య‌కుమార్‌ను బోల్తా కొట్టించాడు.

ఐదో బంతిని ర‌బాడ లెంగ్త్ బాల్ సంధించాడు. ఆ డెలివరీని సూర్య స్ట్రైట్ డ్రైవ్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి ఇన్ స్వింగ్ అయ్యి బ్యాట్‌, ప్యాడ్ మధ్య నుంచి వెళ్లి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో సూర్య కేవలం 15 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఈ వికెట్ సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.


 

 

Advertisement
 
Advertisement
Advertisement