వరుస ఓటములు.. అయినా ముంబై ఇండియన్స్‌కు ప్లే ఆఫ్‌ ఛాన్స్‌? | Mumbai Indians playoff qualification chances | Sakshi
Sakshi News home page

IPL 2026: వరుస ఓటములు.. అయినా ముంబై ఇండియన్స్‌కు ప్లే ఆఫ్‌ ఛాన్స్‌?

Apr 30 2026 1:25 PM | Updated on Apr 30 2026 1:56 PM

Mumbai Indians playoff qualification chances

ఐపీఎల్‌-2026 సీజన్‌లో ఐదు సార్లు ఛాంపియ‌న్‌ ముంబై ఇండియన్స్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న కొనసాగుతోంది. బుధ‌వారం వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై ఓట‌మి పాలైంది. ముంబై బ్యాటింగ్‌లో అద‌ర‌గొట్టిన‌ప్ప‌టికి, బౌలింగ్‌లో మాత్రం అందుకు భిన్నంగా ఘోరంగా విఫ‌లమైంది. 

244 ప‌రుగుల భారీ టార్గెట్‌ను సైతం ముంబై బౌల‌ర్లు డిఫెండ్ చేసుకోలేక‌పోయారు. ముంబైకి ఇది ఆరువ ఓట‌మి. దీంతో  హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్ త‌మ ప్లే ఆఫ్‌ అవ‌కాశాల‌ను సంక్లిష్టం చేసుకుంది.

ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 8 మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవ‌లం రెండింట మాత్ర‌మే విజ‌యం సాధించింది. ఆ జ‌ట్టు ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో తొమ్మిద‌వ స్ధానంలో ఉంది. పాయింట్ల ప‌రంగా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో ముంబై స‌మానంగా ఉన్న‌ప్ప‌టికి ర‌న్‌రేట్ ప‌రంగా హార్దిక్ సేన (-0.784) వారి కంటే కాస్త మెరుగ్గా ఉంది.

ముంబై ప్లే ఆఫ్స్ చేరాలంటే?
ప్రస్తుతం నెగటివ్ రన్ రేట్‌తో ఉన్న ముంబైకి ప్రతి మ్యాచ్ ఇప్పుడు చావో రేవో అన్నట్లుగా మారింది. ముంబైకి ఇంకా  6 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ముంబై ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ భారీ విజయాలు సాధించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ముంబై ఇండియ‌న్స్ భ‌వితవ్యం ఇత‌ర జ‌ట్ల ఫ‌లితాల‌పై కూడా ఆధార‌ప‌డి ఉంటుంది.

అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల బ‌ట్టి చూస్తే ముంబై మ‌రోసారి లీగ్ స్టేజీలోనే ఇంటిముఖం ప‌ట్టే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. ముఖ్యంగా జ‌స్ప్రీత్ బుమ్రా పేల‌వ ఫామ్ ముంబైకి ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది. ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ బౌల‌ర్ అయిన బుమ్రా ఈ ఏడాది సీజ‌న్‌లో త‌న మార్క్‌ను చూపించ‌లేక‌పోతున్నాడు. జూనియ‌ర్ క్రికెట‌ర్లు సైతం అత‌డి బౌలింగ్‌ను ఉతికారేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు అత‌డు కేవ‌లం రెండే రెండు వికెట్లు సాధించాడు. ఆఖ‌రిగా ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఏదైన అద్భుతం జ‌రగాలి.
చదవండి: IPL 2026: భారీ తప్పిదం.. ముంబై ఇండియన్స్‌ ఓటమికి కారణం ఇదే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement