ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మరో క్రికెటర్‌ | Tamil Nadu Murugan Ashwin Announces His Retirement From Domestic Cricket And The IPL, Check Out Post Went Viral | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మరో క్రికెటర్‌

May 25 2026 9:01 PM | Updated on May 26 2026 12:46 PM

Murugan Ashwin announces his retirement from domestic cricket and the IPL

తమిళనాడు చెందిన మరో క్రికెటర్‌ ఐపీఎల్‌ సహా దేశవాలీ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. కొద్ది రోజుల కిందట ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ దేశవాలీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు వీడ్కోలు పలకగా.. తాజాగా మురుగన్‌ అశ్విన్‌ కూడా రెండు విభాగాలకు బై బై చెప్పాడు.

35 ఏళ్ల అశ్విన్‌ లెగ్‌ బ్రేక్‌ బౌలర్‌గా సుపరిచితుడు. 2016లో రైజింగ్‌ పూణే సూపర్‌ జెయింట్స్‌ తరఫున ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన మురుగన్‌.. 2018లో ఆర్సీబీకి, 2019-21 వరకు పంజాబ్‌ కింగ్స్‌కు, 2022లో ముంబై ఇండియన్స్‌కు, 2023లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడాడు. 

అప్పటి నుంచి అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దీంతో అతను ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నాడు. మురుగన్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌లో 44 మ్యాచ్‌లు ఆడి 35 వికెట్లు తీశాడు.

2012లో తమిళనాడు తరఫున దేశవాలీ అరంగేట్రం చేసిన మురుగన్‌.. 2023, 24లో చండీఘడ్‌కు, 2025లో జమ్మూ కశ్మీర్‌కు ఆడాడు. దేశవాలీ కెరీర్‌లో 7 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు, 29 లిస్ట్‌-ఏ, 105 టీ20లు ఆడిన మురుగన్‌.. మొత్తంగా 130 వికెట్లు తీశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement