ముంబైని చిత్తు చేసిన సన్‌రైజర్స్
244 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ మరో 8 బంతులు మిగిలుండగానే ఛేదించింది. అభిషేక్ శర్మ (45), ట్రవిస్ హెడ్ (76), హెన్రిచ్ క్లాసెన్ (65 నాటౌట్) ఊచకోత కోసి సన్‌రైజర్స్‌ను గెలిపించారు. ఆఖర్లో సలీల్ అరోరా (30 నాటౌట్) సైతం విధ్వంసం సృష్టించాడు. మిగతా ఆటగాళ్లలో ఇషాన్ కిషన్ డకౌట్ కాగా.. నితీశ్ కుమార్ రెడ్డి 21 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో ఘజన్‌ఫర్ 2 వికెట్లు తీయగా.. బౌల్ట్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీశారు.
అంతకుముందు రికెల్టన్ (123 నాటౌట్) శతక్కొట్టుడుతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లలో విల్ జాక్స్ 46, సూర్యకుమార్ యాదవ్ 5, నమన్ ధిర్ 22, హార్దిక్ పాండ్యా 31, తిలక్ వర్మ 7, రాబిన్ మింజ్ 1 (నాటౌట్) పరుగు చేశారు. సన్‌రైజర్స్ బౌలర్లలో హింగే 2, ఎషాన్ మలింగ, నితీశ్ కుమార్ రెడ్డి, సాకిబ్ తలో వికెట్ తీశారు.
4 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్
9.4వ ఓవర్- 4 పరుగుల వ్యవధిలో సన్‌రైజర్స్ 3 వికెట్లు కోల్పోయింది. తొలుత అభిషేక్, ఇషాన్ కిషన్ వరుస బంతుల్లో ఔట్ కాగా.. ఆతర్వాత హెడ్ (76) హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో జాక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్
తొమ్మిదో ఓవర్ 4, 5 బంతులకు సన్‌రైజర్స్ అభిషేక్ (45), ఇషాన్ కిషన్ (0) వికెట్లు కోల్పోయింది.
అభిషేక్ శర్మ (45) ఔట్
8.4వ ఓవర్- 129 పరుగుల వద్ద సన్‌రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఘజన్‌ఫర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అభిషేక్ శర్మ (45) ఔటయ్యాడు.
సన్‌రైజర్స్ ఓపెనర్ల ఊచకోత
244 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ ఓపెనర్లు ట్రవిస్ హెడ్ (48), అభిషేక్ శర్మ (36) చెలరేగిపోతున్నారు. 6 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 92-0గా ఉంది.
ముంబై ఇండియన్స్ భారీ స్కోర్
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. ర్యాన్ రికెల్టన్ (123 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లలో విల్ జాక్స్ 46, సూర్యకుమార్ యాదవ్ 5, నమన్ ధిర్ 22, హార్దిక్ పాండ్యా 31, తిలక్ వర్మ 7, రాబిన్ మింజ్ 1 (నాటౌట్) పరుగు చేశారు. సన్‌రైజర్స్ బౌలర్లలో హింగే 2, ఎషాన్ మలింగ, నితీశ్ కుమార్ రెడ్డి, సాకిబ్ తలో వికెట్ తీశారు.
నమన్ ధిర్ ఔట్
13.4వ ఓవర్- 165 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. హింగే బౌలింగ్‌లో హర్ష్ దూబేకు క్యాచ్ ఇచ్చి నమన్ ధిర్ (22) ఔటయ్యాడు.
రెండో వికెట్ డౌన్
8.3వ ఓవర్- 110 పరుగుల వద్ద ముంబై రెండో వికెట్ కోల్పోయింది. ఎషాన్ మలింగ బౌలింగ్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ (5) ఔటయ్యాడు.
తొలి వికెట్ కోల్పోయిన ముంబై
7.1వ ఓవర్- 93 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్ కోల్పోయింది. నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి విల్ జాక్స్ (46) ఔటయ్యాడు.
దుమ్మురేపుతున్న ముంబై ఓపెనర్లు
ముంబై ఓపెనర్లు చెలరేగిపోతున్నారు. జాక్స్, రికెల్టన్ పోటీపడి బౌండరీలు, సిక్సర్లు బాదుతున్నారు. 6 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 78-0గా ఉంది. జాక్స్ 38, రికెల్టన్ 37 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇప్పటివరకు బౌలింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో ఎసాన్ మలింగ ఒక్కడే జాక్స్-రికెల్టన్ జోడీ ధాటి నుంచి తప్పించుకున్నాడు. కమిన్స్, హింగే, హర్ష్ దూబే, సాకిబ్ హుసేన్‌ను వీరి జోడీ చెడుగుడు ఆడుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 29) జరుగుతున్న 41వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఐదు సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఈ ఎడిషన్‌లో చెత్త ప్రదర్శనలు చేస్తూ పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించింది. సన్‌రైజర్స్ విషయానికొస్తే.. ఈ జట్టు మధ్యమధ్యలో తడబడినా, ఓ మోస్తరు ప్రదర్శనలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించింది.
తుది జట్లు..
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(w), నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(సి), హర్ష్ దూబే, సకీబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే, ఎషాన్ మలింగ
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), విల్ జాక్స్, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, AM గజన్‌ఫర్, అశ్వనీ కుమార్


