IPL 2026: ముంబైపై సీఎస్‌కే ఘ‌న విజ‌యం | IPL 2026: Chennai Super Kings Vs Mumbai Indians Match Live Updates | Sakshi
Sakshi News home page

IPL 2026: ముంబైపై సీఎస్‌కే ఘ‌న విజ‌యం

May 2 2026 7:07 PM | Updated on May 2 2026 11:14 PM

IPL 2026: Chennai Super Kings Vs Mumbai Indians Match Live Updates

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్‌కింగ్స్ నాలుగో విజ‌యాన్ని సాధించింది. శ‌నివారం ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 160 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సీఎస్‌కే 18.1 ఓవ‌ర్ల‌లో 2 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 
లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (67 నాటౌట్‌), ఇంపాక్ట్ ప్లేయ‌ర్ కార్తిక్ శ‌ర్మ (54 నాటౌట్‌) అజేయంగా నిలిచి సీఎస్‌కేను గెలిపించారు. ముంబై బౌల‌ర్ల‌లో బుమ్రా, గ‌జ‌న్‌ఫ‌ర్ చెరొక వికెట్ తీశారు. అంత‌క‌ముందు ముంబై ఇండియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు చేసింది.

గైక్వాడ్ హాఫ్ సెంచరీ
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అర్థసెంచరీ సాధించాడు. 34 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న రుతురాజ్ ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం సీఎస్‌కే 14 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది.

రెండో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే
160 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన సీఎస్‌కే 63 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది. 24 ప‌రుగులు చేసిన ఉర్విల్ ప‌టేల్ గ‌జ‌న్‌ఫ‌ర్ బౌలింగ్‌లో బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్ర‌స్తుతం సీఎస్‌కే 7 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి 69 ప‌రుగులు చేసింది.

సంజూ శాంస‌న్ (11) ఔట్‌.. తొలి వికెట్ డౌన్‌
160 ప‌రుగుల ల‌క్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూప‌ర్‌కింగ్స్ 13 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది. 11 ప‌రుగులు చేసిన శాంస‌న్ బుమ్రా బౌలింగ్‌లో రికెల్‌ట‌న్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

సీఎస్‌కే టార్గెట్ 160 పరుగులు
సీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. నమన్ ధిర్ (57 పరుగులు) అర్థసెంచరీతో రాణించాడు. రియాన్ రికెల్‌టన్ (37), సూర్యకుమార్ (21) పర్వాలేదనిపించారు.  సీఎస్‌కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్ మూడు వికెట్లు తీయగా, నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు.

ఆరో వికెట్‌ డౌన్‌..
5 పరుగులు చేసిన రాబిన్‌ మింజ్‌ అన్షుల్‌ కంబోజ్‌ బౌలింగ్‌లో వెనుదిరగడంతో ముంబై ఇండియన్స్‌ 139 పరుగుల వద్ద ఆరో వికెట్‌ కోల్పోయింది. 

16 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ముంబై ఇండియ‌న్స్ 4 వికెట్ల న‌ష్టానికి 124 ప‌రుగులు చేసింది. న‌మ‌న్ ధిర్ (48), పాండ్యా (9) ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై
సీఎస్‌కేతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన తిలక్ వర్మ నూర్ అహ్మద్ బౌలింగ్‌లో రుతురాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. నమన్ ధిర్ 44, పాండ్యా 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

  • 12 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్‌ 3 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. నమన్ ధిర్ 42, తిలక్ వర్మ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 7  ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్‌ 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. నమన్‌ ధిర్‌ 25,  సూర్యకుమార్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 4 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్‌ వికెట్‌ నష్టానికి 29 పరుగులు చేసింది. రికిల్‌టన్‌ 15, నమన్‌ ధిర్‌ 13 పరుగులతో ఆడుతున్నారు.

తొలి వికెట్ కోల్పోయిన ముంబై
సీఎస్‌కేతో మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసిన ఓపెన‌ర్ విల్‌జాక్స్ అన్షుల్ కంబోజ్ బౌలింగ్‌లో రామ‌క్రిష్ణ ఘోష్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ముంబై ఒక ప‌రుగు వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది.

టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఏంచుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. ర‌ఘుశ‌ర్మ సీజ‌న్‌లో తొలి మ్యాచ్ ఆడ‌నుండ‌గా, అశ్వ‌నీ స్థానంలో క్రిష్ భ‌గ‌త్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. ఇక చెన్నై సూప‌ర్‌కింగ్స్ కూడా రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. 

అకిల్ హొసేన్ స్థానంలో ప్ర‌శాంత్ వీర్‌, గుర్జప్‌నీత్ సింగ్ స్థానంలో రామ‌క్రిష్ణ ఘోష్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. ఈ సీజ‌న్‌లో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి అంచె పోరులో సీఎస్‌కే 103 ప‌రుగుల తేడాతో ముంబై ఇండియ‌న్స్‌పై విజ‌యం సాధించింది.

చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రీవిస్, శివమ్ దూబే, జామీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి

ముంబై ఇండియన్స్: విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీప‌ర్‌), సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, క్రిష్ భగత్, జస్ప్రీత్ బుమ్రా, గజన్‌ఫర్
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement