పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమిపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. పరాజయాలపై సమీక్ష నిర్వహిస్తామని.. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదేమోనని వ్యాఖ్యానించాడు. మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్-2026లో వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే.
కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు
సొంతమైదానం వాంఖడేలో గురువారం పంజాబ్ కింగ్స్ (MI vs PBKS)తో మ్యాచ్‌లో ముంబై ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘మేము ఎక్కడ పొరపాటు చేస్తున్నామో తెలుసుకునేందుకు సమీక్ష నిర్వహిస్తాము.
వ్యక్తిగత వైఫల్యమా? సమిష్టి వైఫల్యమా? మా ప్రణాళికల్లోనే లోపాలున్నాయా? అన్న అంశాలపై చర్చించాల్సి ఉంది. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. లేదంటే ఇలాగే కొనసాగుతూ పరిస్థితులు చక్కదిద్దాలా అన్న విషయం గురించి ఆలోచిస్తాము. కొన్ని కఠినమైన ప్రశ్నలకు జవాబులు వెదకక తప్పదు. వైఫల్యాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు.
ఆ ముగ్గురే టార్గెట్?
ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ సీనియర్లు పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు సూర్యకుమార్ యాదవ్.. మరో ప్లేయర్ తిలక్ వర్మ (Tilak Varma)ను ఉద్దేశించే హార్దిక్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రపంచస్థాయి బౌలర్ అయిన బుమ్రా ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లలో కలిపి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
మరోవైపు.. సూర్య చేసిన పరుగులు వరుసగా 16, 51, 6, 33, 0. ఇక తిలక్ వర్మ రాబట్టిన రన్స్ 20, 0, 14, 1, 8. ఇదిలా ఉంటే.. పంజాబ్ జట్టుకు ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా క్రెడిట్ ఇచ్చాడు. ‘‘వాళ్లు మాకంటే మెరుగ్గా బౌలింగ్ చేశారు. మెరుగ్గా బ్యాటింగ్ చేశారు.
ఫీల్డింగ్ అద్భుతం. వారి ప్రదర్శనకు మేము మూల్యం చెల్లించాల్సి వచ్చింది’’ అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో పాండ్యా 14 పరుగులు చేశాడు. మూడు ఓవర్ల బౌలింగ్‌లో 39 రన్స్ ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు.
ముంబై వర్సెస్ పంజాబ్ స్కోర్లు
ముంబై- 195/6(20)
పంజాబ్- 198/3(16.3)
ముంబైపై ఏడు వికెట్ల తేడాతో పంజాబ్ గెలుపు.
The winning momentum refuses to stop 🌪️
A flawless record remains perfectly intact 🛡️
Punjab Kings conquer the Wankhede to climb up to the top spot in the table! ❤️
Updates ▶️ https://t.co/Fn2dxJ429j#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/LUuZx5nlbf— IndianPremierLeague (@IPL) April 16, 2026


