ముంబైపై ఘన విజయం.. ప్లే ఆఫ్స్‌కు రాజస్తాన్‌ రాయల్స్‌ | IPL 2026: Rajasthan royals vs Mumbai indians live updates and highlights | Sakshi
Sakshi News home page

IPL 2026: ముంబైపై ఘన విజయం.. ప్లే ఆఫ్స్‌కు రాజస్తాన్‌ రాయల్స్‌

May 24 2026 3:06 PM | Updated on May 24 2026 7:59 PM

IPL 2026: Rajasthan royals vs Mumbai indians live updates and highlights

RR vs MI live updates and highlights: వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 30 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. దీంతో రాజస్తాన్ 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. రాజస్తాన్ క్వాలిఫై కావడంతో పంజాబ్ కింగ్స్‌, కేకేఆర్ ఇంటిముఖం పట్టాయి. 

206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 175 పరుగులకు పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్‌ యాదవ్‌(60) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. హార్దిక్‌ పాండ్యా(34), విల్‌ జాక్స్‌(33) పర్వాలేదన్పించారు.

సూర్యకుమార్ అవుట్‌
ముంబై ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 60 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్‌.. బర్గర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 

ముంబై ఇండియన్స్‌ ఏడో వికెట్‌ డౌన్‌
ముంబై ఇండియన్స్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. 2 పరుగులు చేసిన కార్భిన్‌ బాష్‌.. యశ్‌రాజ్‌ పుంజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ముంబై విజయానికి 21 బంతుల్లో 54 పరుగులు కావాలి.

దూకుడుగా ఆడుతున్న హార్దిక్‌ పాండ్యా
13 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్యా దూకుడుగా ఆడుతున్నాడు. పాండ్యా కేవలం 7 బంతుల్లోనే 25 పరుగులు చేశాడు.

ముంబై ఐదో వికెట్‌ డౌన్‌
ముంబై ఐదో వికెట్‌ కోల్పోయింది. 33 పరుగులు చేసిన విల్‌ జాక్స్‌.. యశ్‌రాజ్‌ పుంజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ముంబై విజయానికి 51 బంతుల్లో 105 పరుగులు కావాలి.

ముంబై మూడో వికెట్‌ డౌన్‌
ముంబై ఇండియన్స్‌ మూడో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన ర్యాన్‌ రికెల్టన్‌.. నండ్రే బర్గర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ముంబై స్కోర్‌: 35-3. క్రీజులో సూర్యకుమార్‌ యాదవ్‌(16), తిలక్‌ వర్మ(1) ఉన్నారు.

తిలక్‌ వర్మ అవుట్‌
తిలక్‌ వర్మ(3) రూపంలో ముంబై ఇండియన్స్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. బ్రిజేష్‌ శర్మ బౌలింగ్‌లో తిలక్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. 9 ఓవర్లకు ముంబై స్కోర్‌: 81/4

పంజాబ్‌ రెండో వికెట్‌ డౌన్‌
నమన్‌ ధీర్‌ రూపంలో ముంబై రెండో వికెట్‌ కోల్పోయింది. 6 పరుగులు చేసిన నమన్‌ ధీర్‌.. ఆర్చర్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.

ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌
206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌ తగిలింది. జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.

రాణించిన రాజస్తాన్‌ బ్యాటర్లు.. ముంబై టార్గెట్‌ ఎంతంటే?
వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో రాజస్తాన్ బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో ధ్రువ్‌జురెల్‌(38), జోఫ్రా ఆర్చర్‌(32) జడేజా(19), శనక(29) రాణించారు. ముంబై బౌలర్లలో దీపక్‌ చాహర్‌, శార్థూల్‌ ఠాకూర్‌ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. విల్‌ జాక్స్‌, ఘజన్‌ఫర్‌,బాష్‌ తలా వికెట్‌ సాధించారు.

రాజస్తాన్‌ ఏడో వికెట్‌ డౌన్‌
రాజస్తాన్ ఏడో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన శుభమ్ దూబే.. శార్థూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 17.4 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 174/7

👉16 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రాజ‌స్తాన్ రాయ‌ల్స్ 6 వికెట్ల న‌ష్టానికి 148 ప‌రుగులు చేసింది. క్రీజులో జోఫ్రా ఆర్చ‌ర్‌(10), శుభబ్ దూబే(3) ఉన్నారు.

రాజస్తాన్‌ ఐదో వికెట్‌ డౌన్‌
రాజస్తాన్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. 38 పరుగులు చేసిన ధ్రువ్‌ జురెల్‌.. కార్భిన్‌ బాష్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 122/5

రాజస్తాన్‌ నాలుగో వికెట్‌ డౌన్‌
రాజస్తాన్‌ రాయల్స్‌ నాలుగో వికెట్లు కోల్పోయింది. 29 పరుగులు చేసిన దసున్‌ శనక.. రనౌట్‌గా వెనుదిరిగాడు.

రాజస్తాన్ మూడో వికెట్ డౌన్‌
రాజస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన రియాన్ పరాగ్‌.. ఘజన్‌ఫర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 9 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 84/3

రాజస్తాన్‌ రెండో వికెట్‌ డౌన్‌
వైభ‌వ్ సూర్య‌వంశీ రూపంలో రాజ‌స్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 4 ప‌రుగులు చేసిన సూర్య‌వంశీ.. దీప‌క్ చాహ‌ర్ బౌలింగ్‌లో న‌మ‌న్ ధీర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. 4.1 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్‌ రెండు వికెట్ల నష్టానికి 4 పరుగులు చేసింది. క్రీజులో ధ్రువ్‌ జురెల్‌, రియాన్‌ పరాగ్‌ ఉన్నాడు.

రాజస్తాన్‌ తొలి వికెట్‌ డౌన్‌
యశస్వి జైశ్వాల్‌ రూపంలో రాజస్తాన్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 27 పరుగులు చేసిన యశస్వి జైశ్వాల్‌.. విల్‌ జాక్స్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

దూకుడుగా ఆడుతున్న రాజస్తాన్‌
3 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్‌ రాయల్స్‌ వికెట్‌ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. క్రీజులో యశస్వి జైశ్వాల్‌(21), వైభవ్‌ సూర్యవంశీ(3) ఉన్నారు.

ఐపీఎల్‌-2026లో మ‌రో కీల‌క పోరుకు తెరలేచింది. ఈ మెగా టోర్నీలో భాగంగా వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌, ముంబై ఇండియ‌న్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తమ చివరి మ్యాచ్‌లో ముంబై మేనెజ్‌మెంట్‌ స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చింది.

మరోవైపు రాజస్తాన్‌ మూడు మార్పులు చేసింది. కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌తో పాటు రవీంద్ర జడేజా, బర్గర్‌ తుది జట్టులోకి వచ్చారు. కాగా ఈ మ్యాచ్ రాజ‌స్తాన్‌కు అత్యంత కీల‌కం. ముంబైపై గెలిస్తే రాజ‌స్తాన్ నాలుగో జ‌ట్టుగా ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధిస్తోంది. లేదంటే ఇంటిముఖం ప‌ట్ట‌క త‌ప్ప‌దు.

తుది జ‌ట్లు
రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), రియాన్ పరాగ్ (కెప్టెన్‌), డోనోవన్ ఫెరీరా, శుభమ్ దూబే, దసున్ షనక, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, యశ్ పుంజా, బ్రిజేష్ శర్మ

ముంబై ఇండియన్స్: ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీప‌ర్‌), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), విల్ జాక్స్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, రఘు శర్మ, అల్లా మహ్మద్ గజన్‌ఫర్, శార్దూల్ ఠాకూర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement