రోహిత్‌ శర్మకు సంబంధించి బిగ్‌ న్యూస్‌ | Is Rohit Sharma set for Netflix acting debut or Is a biopic coming, Viral post sparks buzz | Sakshi
Sakshi News home page

రోహిత్‌ శర్మకు సంబంధించి బిగ్‌ న్యూస్‌

Apr 9 2026 6:14 PM | Updated on Apr 9 2026 6:28 PM

Is Rohit Sharma set for Netflix acting debut or Is a biopic coming, Viral post sparks buzz

దిగ్గజ బ్యాటర్‌ రోహిత్‌ శర్మకు సంబంధించి ఓ బిగ్‌ న్యూస్‌ అందుతుంది. హిట్‌మ్యాన్‌పై బయోపిక్‌ రాబోతుందని సోషల్‌మీడియా కోడై కూస్తోంది. ఇవాళ (ఏప్రిల్‌ 9) రోహిత్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేరిన స్టోరీ ఈ పుకార్లకు తావిచ్చింది.

రోహిత్‌ షేర్‌ చేసిన క్రిప్టిక్‌ పోస్ట్‌లో నెట్‌ఫిక్స్‌ లోగో కలిగిన డ్రాఫ్ట్‌ #45 అనే స్క్రిప్ట్‌ డాక్యుమెంట్‌ కనిపిస్తుంది. దీనిపై Champion అని రాసి ఉంది. Rohit Sharma’s copy అనే వాటర్‌మార్క్‌ ఉండటంతో, హిట్‌మ్యాన్‌ ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం అయ్యాడని అభిమానులు భావిస్తున్నారు. #collab అనే క్యాప్షన్‌ Netflix‌తో అధికారిక ఒప్పందం ఉందని సూచిస్తోంది.  

వీటన్నిటినీ బట్టి హిట్‌మ్యాన్‌పై డాక్యుమెంటరీ లేదా బయోపిక్‌ రాబోతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్‌-రోహిత్‌ బ్యాక్‌డ్రాప్‌లో డాక్యూ–సిరీస్‌ ఉంటుందని కొందరనుకుంటున్నారు. మరికొందరేమో, రోహిత్‌ స్పోర్ట్స్‌–థీమ్‌ షోలో పాల్గొనబోతున్నాడని చర్చించుకుంటున్నారు.

ఇదిలా ఉంటే, అంతర్జాతీయ స్థాయిలో టెస్ట్‌, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన రోహిత్‌ శర్మ వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. మరోవైపు ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ 2026లో హిట్‌మ్యాన్‌ ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపిస్తున్నాడు. 

తొలి మ్యాచ్‌లో 78 (38) పరుగులు, ఆతర్వాతి మ్యాచ్‌లో 35 పరుగులు చేశాడు. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో 5 పరుగులు సహా.. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 118 పరుగులు చేశాడు. హిట్‌మ్యాన్‌ తన తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 12న ఆడనున్నాడు. వాంఖడే జరిగే ఆ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఆర్సీబీతో తలపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement