శ్రేయ‌స్ స్టన్నింగ్ క్యాచ్‌.. షాకైన‌ రోహిత్‌, సూర్య‌! | Rohit-Suryakumar Reaction Viral After-Shreyas Iyer Stunning Catch | Sakshi
Sakshi News home page

శ్రేయ‌స్ స్టన్నింగ్ క్యాచ్‌.. షాకైన‌ రోహిత్‌, సూర్య‌!

Apr 16 2026 10:26 PM | Updated on Apr 16 2026 11:25 PM

Rohit-Suryakumar Reaction Viral After-Shreyas Iyer Stunning Catch

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ స్ట‌న్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. గురువారం ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా బౌండరీ లైన్ వ‌ద్ద అయ్యర్ అదిరిపోయే క్యాచ్ అందుకున్నాడు. అతని స్టన్నింగ్ క్యాచ్‌ను క‌ళ్లారా చూసిన‌ ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఆశ్చ‌ర్య‌పోయారు. 

మార్కో యాన్సెన్ వేసిన 18వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని భారీ సిక్సర్ బాదిన హార్దిక్ రెండో బంతిని డాట్ చేశాడు. మూడో బంతిని లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడగా.. సిక్సర్‌గా దూసుకొచ్చిన బంతిని బౌండరీ లైన్‌పై అయ్యర్ అద్భుతంగా అందుకొని చాకచక్యంగా లోపలికి విసిరేసాడు. అక్కడే ఉన్న బార్ట్‌లెట్ ఏ తప్పిదం చేయకుండా అందుకున్నాడు. 

ఎడమవైపు గాల్లోకి ఎగురుతూ బంతిని అందుకోవడంతో పాటు అంతే సమర్థవంతంగా అయ్యర్ లోపలికి విసిరేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. క్యాచ్ పూర్తయిన వెంటనే శ్రేయస్ అయ్యర్.. ఇప్పుడు అరవండంటూ ప్రేక్షకులను ఉద్దేశించి సైగలు చేశాడు. అప్పటి వరకు అరిచిన ముంబై ఫ్యాన్స్.. ఈ క్యాచ్‌తో మౌనం వహించారు. 

దాంతో వారిని ఇంకా గట్టిగా అరవాలంటూ అయ్యర్ కోరాడు. అయితే అయ్య‌ర్ ప‌ట్టిన క్యాచ్‌కు డ‌గౌట్‌లో ఉన్న రోహిత్‌, సూర్య‌కుమార్‌లు ఫిదా అయ్యారు. వాట్ ఏ క్యాచ్ అని రోహిత్ సూర్య‌తో చెబుతున్న‌ట్లు కెమెరాల్లో క‌నిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement