ఆరోగ్యం బాగోలేక‌పోయిన స్టేడియంకు వ‌చ్చిన వినోద్ కాంబ్లీ | Vinod Kambli Appears Frail At Wankhede Stadium During MI Vs SRH Match, Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

IPL 2026: ఆరోగ్యం బాగోలేక‌పోయిన స్టేడియంకు వ‌చ్చిన వినోద్ కాంబ్లీ

Apr 30 2026 11:58 AM | Updated on Apr 30 2026 12:48 PM

Vinod Kambli Looks Frail During Wankhede Visit For MI vs SRH, Fans React

ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ చాన్నాళ్ల తర్వాత పబ్లిక్‌లో కన్పించారు. సచిన్ టెండూల్కర్ ప్రాణస్నేహితుడు అయిన కాంబ్లీ.. బుధవారం ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ను వీక్షించేందుకు వాంఖడే స్టేడియంకు వచ్చారు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో కాంబ్లీ చాలా బలహీనంగా ఉండి, నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ కన్పించారు. ఇద్దరు వ్యక్తులు ఆయనను చేతులు ప‌ట్టుకుని బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. కేవ‌లం 54 ఏళ్ల వయసులోనే ఆయ‌న ఆరోగ్యం ఇంతలా క్షీణించడం చూసి నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్టేడియంలోని ప్రేక్ష‌కులు  "గెట్ వెల్ సూన్ సార్" అని అర‌వ‌గా.. ఆయ‌న చిరునవ్వుతో థమ్సప్ చూపిస్తూ అందరికీ అభివాదం చేశారు. వినోద్ కాంబ్లీ గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధ‌ప‌డుతున్నారు. నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ, క్రికెట్ పట్ల ఉన్న మ‌క్కువ‌తో కాంబ్లీ స్టేడియం రావ‌డం విశేషం.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ముంబై ఇండియన్స్‌పై 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. 244 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 18.4 ఓవర్లలోనే ఊదిపడేసింది.



 

 

Advertisement
 
Advertisement
Advertisement