ముంబై ఇండియన్స్‌కు శుభవార్త. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ అందుబాటులోకి వచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా అతడు ముంబై తరఫున బరిలోకి దిగే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో విల్ జాక్స్ అద్భుత ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే.
వరల్డ్‌కప్‌లో సూపర్‌హిట్
ఇంగ్లండ్ తరఫున ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి 226 పరుగులు చేసిన విల్ జాక్స్ (Will Jacks).. తొమ్మిది వికెట్లు కూల్చాడు. ఈ టోర్నీలో ఇంగ్లండ్ సెమీస్ ప్రయాణానికి దోహదం చేసిన ఈ ఆల్‌రౌండర్ నాలుగుసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు. ఈ పవర్ హిట్టర్‌ను ముంబై ఇండియన్స్ రూ. 5.25 కోట్లకు కొనుగోలు చేసింది.
వ్యక్తిగత సెలవు
అయితే, వరల్డ్‌కప్ తర్వాత వ్యక్తిగత సెలవుపై వెళ్లిన విల్ జాక్స్ ముంబై ఆరంభ మ్యాచ్‌లకు మాత్రమే దూరమవుతాడని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఆరు మ్యాచ్‌లు పూర్తైనా అతడు జట్టుతో చేరలేదు. తాజా సమాచారం ప్రకారం విల్ జాక్స్ తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతడు భారత్‌లో అడుగుపెట్టినట్లు సమాచారం.
కాగా ముంబై ఇండియన్స్ ఇప్పటికి ఆరు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండే గెలిచింది. ఇలాంటి తరుణంలో స్టార్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ జట్టుతో చేరనుండటం సానుకూలాంశం. కాగా ముంబై గురువారం చెన్నై జట్టుతో తలపడనుంది. ఇందుకు వాంఖడే వేదిక.
చదవండి: తిలక్ వర్మపై హార్దిక్ పాండ్యా సీరియస్.. స్పందించిన స్టార్


