రోహిత్‌ శర్మకు చేదు అనుభవం | Rohit Sharma fans tried to snatch his Rs 3.25 Cr Giraffe watch from his wrist | Sakshi
Sakshi News home page

రోహిత్‌ శర్మకు చేదు అనుభవం

May 9 2026 11:16 AM | Updated on May 9 2026 11:38 AM

Rohit Sharma fans tried to snatch his Rs 3.25 Cr Giraffe watch from his wrist

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రోహిత్‌ శర్మకు చేదు అనుభవం ఎదురైంది. కారులో ప్రయాణిస్తూ అభిమానులకు అభివాదం చేస్తుండగా.. సడెన్‌గా ఇద్దరు కుర్ర అభిమానులు రోహిత్‌ చేతికి ఉన్న ఖరీదైన వాచీని లాగే ప్రయత్నం చేశారు. 

వెంటనే అప్రమత్తమైన రోహిత్‌ సదరు కుర్రాళ్లను మందలిస్తూ.. అద్దాలు మూసివేశాడు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింతో తెలీదు కానీ, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం​ సోషల్‌మీడియాలో వైరలవుతుంది. రోహిత్‌ ధరించిన ఆ వాచీ విలువు రూ.3.25 కోట్లని తెలుస్తోంది. వాచీ బ్రాండ్‌ నేమ్‌ రోలెక్స్‌ జిరాఫ్‌ అని అంటున్నారు.

ఇదిలా ఉంటే, రోహిత్‌ ప్రస్తుతం​ ఐపీఎల్‌ 2026తో బిజీగా ఉన్నాడు. సీజన్‌ ఆర​ంభంలో గాయపడిన అతను.. ఇటీవలే రీఎంట్రీ ఇచ్చాడు. వచ్చీరాగానే లక్నో సూపర్‌ జెయింట్స్‌పై మెరుపు ఇన్నింగ్స్‌ (44 బంతుల్లో 84) ఆడాడు. ఫలితంగా ముంబై 229 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలుండగానే ఛేదించింది.

అయితే ఈ గెలుపు ముంబైకి కంటితుడుపుగా మాత్రమే పనికొచ్చింది. ఎందుకంటే ఆ జట్టు అప్పటికే ప్లే ఆఫ్స్‌ అవకాశాలను చాలా సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం ముంబై 10 మ్యాచ్‌ల్లో మూడే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఆ జట్టు ఇకపై ఆడాల్సిన నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచినా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దక్కడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి.

Advertisement
 
Advertisement
Advertisement