ముంబై ఇండియన్స్‌పై సీఎస్‌కే ఘన విజయం | IPL 2026: Chennai super kings vs Mumbai indians Live updates | Sakshi
Sakshi News home page

IPL 2026: ముంబై ఇండియన్స్‌పై సీఎస్‌కే ఘన విజయం

Apr 23 2026 7:04 PM | Updated on Apr 23 2026 11:24 PM

IPL 2026: Chennai super kings vs Mumbai indians Live updates

Chennai super kings vs Mumbai indians Live updates: ముంబై ఇండియన్స్‌పై 103 పరుగుల తేడాతో సీఎస్‌కే ఘన విజయం సాధించింది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ 19 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. సీఎస్‌కే స్పిన్నర్‌ అకిల్‌ హుస్సేన్‌ నాలుగు వికెట్లు పడగొట్టి ముంబై నడ్డివిరిచాడు.

అతడితో పాటు నూర్‌ అహ్మద్‌ రెండు, గుర్‌జప్‌నీత్‌, కాంబోజ్‌, ముఖేష్‌ చౌదరి, కాంబోజ్‌ తలా వికెట్‌ సాధించారు. ముంబై బ్యాట‌ర్ల‌లో సూర్య‌కుమార్ యాద‌వ్‌(36), తిల‌క్ వ‌ర్మ‌(37) మిన‌హా మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. ఈ విజయంతో సీఎస్‌కే పాయింట్ల పట్టికలో ఐదో స్దానానికి చేరుకుంది.

ముంబై ఏడో వికెట్ డౌన్‌
సూర్య‌కుమార్ యాద‌వ్ రూపంలో ముంబై ఇండియ‌న్స్ ఏడో వికెట్ కోల్పోయింది. ముంబై విజ‌యానికి 41 బంతుల్లో 121 ప‌రుగులు కావాలి.

కష్టాల్లో ముంబై
13 ఓవర్‌ వేసిన నూర్ అహ్మద్‌ బౌలింగ్‌లో వరుస బంతుల్లో ముంబై ఇండియన్స్‌ రెండు వికెట్లు కోల్పోయింది. తొలి బంతికి హార్దిక్‌ పాండ్యా(1), రెండో బంతికి షెర్ఫేన్‌ రూథర్‌ ఫర్డ్‌(0) పెవిలియన్‌కు చేరాడు. 13 ఓవర్లకు ముంబై ఇండియన్స్‌ స్కోర్‌: 86/6

ముంబై ఐదో వికెట్‌ డౌన్‌
తిలక్‌ వర్మ రూపంలో ముంబై ఇండియన్స్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 37 పరుగులు చేసిన తిలక్‌.. అకీల్ హొసేన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ముంబై మూడో వికెట్‌ డౌన్‌
ముంబై మూడో వికెట్‌ కోల్పోయింది. అకిల్‌ హుస్సేన్‌ బౌలింగ్‌లో నమన్‌ ధీర్‌ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.

ముంబై రెండో వికెట్‌ డౌన్‌
ముంబై ఇండియన్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 7 పరుగులు చేసిన క్వింటన్‌ డికాక్‌.. ముఖేష్‌ చౌదరి బౌలింగ్‌లో ఔటయ్యాడు. 2 ఓవర్లకు ముంబై ఇండియన్స్‌ స్కోర్‌: 11/2

ముంబై తొలి వికెట్ డౌన్‌
ముంబై ఇండియ‌న్స్ తొలి వికెట్ కోల్పోయింది. యువ ఓపెన‌ర్ దానిష్ మలేవార్ మ‌రోసారి డౌక‌ట‌య్యాడు. అకిల్ హోస్సేన్ బౌలింగ్‌లో మలేవార్ ఔట‌య్యాడు. 

సంజూ శాంసన్‌ సూపర్‌ సెంచరీ
వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ అజేయ సెంచరీతో చెలరేగాడు. సంజూ 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. అతడితో పాటు డెవాల్డ్‌ బ్రెవిస్‌(21), గైక్వాడ్‌(22) రాణించారు.

దీంతో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో ఘజన్‌ఫర్‌, అశ్విని కుమార్‌ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, శాంట్నర్‌ తలా వికెట్‌ సాధించారు.

సీఎస్‌కే ఐదో వికెట్ డౌన్‌
కార్తీక్ శ‌ర్మ రూపంలో సీఎస్‌కే ఐదో వికెట్ కోల్పోయింది. 18 ప‌రుగులు చేసిన కార్తీక్ శ‌ర్మ‌.. జ‌స్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 17 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్‌: 166/5. క్రీజులో సంజూ శాంసన్‌(78) ఉన్నాడు.

12 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్‌: 128/4
12 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే 4 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. క్రీజులో సంజూ శాంసన్‌(57), కార్తీక్‌ శర్మ(2) ఉన్నారు.

సీఎస్‌కే రెండో వికెట్‌ డౌన్‌
సీఎస్‌కే రెండో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్‌.. శాంట్నర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్‌: 73/2

సీఎస్‌కే తొలి వికెట్ డౌన్‌
32 పరుగుల వద్ద సీఎస్‌కే తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌.. గజన్‌ఫర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

దూకుడుగా ఆడుతున్న రుతురాజ్‌
2 ఓవర్లు ముగిసే సరికి చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ గైక్వాడ్‌(17), సంజూ శాంసన్‌(5) ఉన్నారు.

ఐపీఎల్‌-2026లో మ‌రో కీల‌క పోరుకు తెర‌లేచింది. వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది.

ఈ మ్యాచ్‌కు కూడా ముంబై, సీఎస్‌కే లెజెండ‌రీ ప్లేయ‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, ఎంఎస్ ధోని దూర‌మ‌య్యారు. వీరిద్ద‌రూ గాయాల‌తో బాధ‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. అదేవిధంగా సీఎస్‌కే జట్టులోకి ఆయూశ్‌ మాత్రే స్ధానంలో యువ ఆటగాడు కార్తిక్‌ శర్మ వచ్చాడు.

తుది జట్లు
చెన్నై సూపర్ కింగ్స్ : సంజూ శాంసన్ (వికెట్ కీపర్‌), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), సర్ఫరాజ్ ఖాన్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ముఖేష్ చౌదరి

ముంబై ఇండియన్స్: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్‌), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), తిలక్ వర్మ, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, జస్ప్రీత్ బుమ్రా, క్రిష్ భగత్, అల్లా మహ్మద్ గజన్‌ఫర్, అశ్వనీ కుమార్

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement