Photo Courtesy: IPL 2026
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ భువనేశ్వర్ కుమార్ లేటు వయసులోనూ తన బౌలింగ్‌తో ఇరగదీస్తున్నాడు. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఈ వెటరన్ బౌలర్ నాలుగు వికెట్లు పడగొట్టి బౌలింగ్‌లో ఇంకా పదును తగ్గలేదని మరోసారి నిరూపించాడు.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ 19వ సీజన్‌లో 20 వికెట్లు పూర్తి చేసుకున్న భువనేశ్వర్ ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్‌లో 20 వికెట్లు తీయడం భువనేశ్వర్‌కు ఇది నాలుగోసారి. తొలిసారి 2014లో 20 వికెట్ల మార్క్ దాటిన భువనేశ్వర్, ఆ తర్వాత 2016, 2017లోనూ ఈ ఫీట్ నమోదు చేశాడు. తాజాగా నాలుగోసారి 20 ప్లస్ వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు.
తద్వారా ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్‌గా భువనేశ్వర్ నిలిచాడు. భువనేశ్వర్ కంటే ముందు యజ్వేంద్ర చాహల్ ఐదుసార్లు, లసిత్ మలింగ, జస్‌ప్రీత్ బుమ్రాలు నాలుగేసిసార్లు ఈ ఫీట్‌ను సాధించారు. ముంబైతో మ్యాచ్‌లో భువనేశ్వర్ తాను వేసిన తొలి రెండు ఓవర్లలోనే 17 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. ఆ తర్వాత అర్థసెంచరీతో ముంబై ఇన్నింగ్స్‌ను నిలబెట్టిన తిలక్ వర్మను క్లీన్‌బౌల్డ్ చేసి నాలుగో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు.
మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. తిలక్ వర్మ (57) హాఫ్ సెంచరీతో రాణించగా.. నమన్ ధిర్ (47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు మినహా మిగతా ముంబై బ్యాటర్లు విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లతో అదరగొట్టగా, హాజిల్‌వుడ్, రసిక్ సలామ్, షెపర్డ్ తలా ఒక వికెట్ తీశారు.
𝘽𝙝𝙪𝙫𝙞-𝙛𝙪𝙡 exhibition of new-ball magic! 🤌
🎥 Just sit back and admire the swing of things! ❤️
Updates ▶️ https://t.co/wYlCB10dhm#TATAIPL | #KhelBindaas | #RCBvMI | @RCBTweets | @BhuviOfficial pic.twitter.com/STbZ16mzbj— IndianPremierLeague (@IPL) May 10, 2026
The 𝘀𝘁𝘂𝗺𝗽𝘀 𝗹𝗶𝗴𝗵𝘁 𝘂𝗽 courtesy of the Purple Cap holder 👏🔥
🎥 Bhuvneshwar Kumar with his 4️⃣th wicket tonight 🙇
Updates ▶️ https://t.co/wYlCB10dhm#TATAIPL | #KhelBindaas | #RCBvMI | @RCBTweets | @BhuviOfficial pic.twitter.com/7q5TqfkHNs— IndianPremierLeague (@IPL) May 10, 2026


