ముంబైపై ఆర్సీబీ ఘన విజయం | IPL 2026: Mumbai Indians vs Royal Challengers Bengaluru Live updates | Sakshi
Sakshi News home page

IPL 2026: ముంబైపై ఆర్సీబీ ఘన విజయం

Apr 12 2026 7:07 PM | Updated on Apr 12 2026 11:55 PM

IPL 2026: Mumbai Indians vs Royal Challengers Bengaluru Live updates

MI vs RCB Live Updates: ఐపీఎల్‌-2026లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి.

ఆర్సీబీ ఘన విజయం
ఆర్సీబీ తిరిగి గెలుపు బాట పట్టింది. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. 

ముంబై బ్యాట‌ర్ల‌లో షెర్ఫేన్‌ రూథర్‌ఫర్డ్‌(71 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(40), ర్యాన్‌ రికెల్టన్‌(37), సూర్యకుమార్‌ యాదవ్‌(33) ఫర్వాలేదన్పించారు. ఆర్సీబీ బౌలర్లలో సుయాశ్‌ శర్మ రెండు, జాకబ్‌ డఫీ, కృనాల్‌ పాండ్యా తలా వికెట్‌ సాధించారు.

ముంబై నాలుగో వికెట్‌ డౌన్‌
ముంబై ఇండియన్స్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 40 పరుగులు చేసిన కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా.. జాకబ్‌ డఫీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ముంబై ఇండియన్స్‌ మూడో వికెట్‌ డౌన్‌
ముంబై ఇండియన్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 33 పరుగులు చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌.. కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ముంబై విజయానికి 46 బంతుల్లో 120 పరుగులు కావాలి.
ఒకే ఓవర్‌లో ముంబై రెండు వికెట్లు డౌన్‌
ముంబై ఇండియన్స్‌ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. సుయాశ్‌ శర్మ బౌలింగ్‌లో తొలి బంతికి ర్యాన్‌ రికెల్టన్‌(37) ఔట్‌ కాగా.. ఐదో బంతికి తిలక్‌ వర్మ(1) ఔటయ్యారు. 9 ముంబై ఇడియన్స్‌కు స్కోర్‌: 85/2

రోహిత్‌ రిటైర్డ్‌ హార్ట్‌
ముంబైకి భారీ షాక్‌ తగిలింది. స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తొడ కండరాల గాయం కారణగా రిటైర్డ్‌ హార్ట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి సూర్యకుమార్‌ యాదవ్‌ వచ్చాడు. 7 ఓవర్లకు ముంబై స్కోర్‌: 72/0

దూకుడుగా ఆడుతున్న ముంబై ఓపెనర్లు
3 ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్‌ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. క్రీజులో ర్యాన్‌ రికెల్టన్‌(29), రోహిత్‌ శర్మ(9) ఉన్నారు.

దుమ్ములేపిన ఆర్సీబీ బ్యాటర్లు.. ముంబై ముందు భారీ టార్గెట్‌
వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాట‌ర్లు బీభత్సం సృష్టించారు.  టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో ఫిల్‌ సాల్ట్‌ (36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 78) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. రజత్‌ పాటిదార్‌(53), విరాట్‌ కోహ్లి(50) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటారు. వీరితో పాటు టిమ్‌ డేవిడ్‌(16 బంతుల్లో 34) మెరుపులు మెరిపించాడు.

ఆర్సీబీ మూడో వికెట్‌ డౌన్‌
రజత్‌ పాటిదార్‌ రూపంలో ఆర్సీబీ మూడో వికెట్‌ కోల్పోయింది. కేవలం 20 బంతుల్లోనే 53 పరుగులు చేసిన పాటిదార్‌.. శాంట్నర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 16 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 194/3

ఆర్సీబీ రెండో వికెట్‌ డౌన్‌
ఆర్సీబీ రెండో వికెట్‌ కోల్పోయింది. 38 బంతుల్లో 58 పరుగులు చేసిన విరాట్‌ కోహ్లి.. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14.4 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 185-2

ఆర్సీబీ తొలి వికెట్‌ డౌన్‌
ఫిల్‌ సాల్ట్‌ రూపంలో ఆర్సీబీ తొలి వికెట్‌ కోల్పోయింది.  కేవలం 36 బంతుల్లో 78 పరుగులు చేసిన సాల్ట్‌.. శార్థూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 167/1. క్రీజులో విరాట్‌ కోహ్లి(47), రజత్‌ పాటిదార్‌(9 బంతుల్లో 34)ఉన్నాడు.

దూకుడుగా ఆడుతున్న ఆర్సీబీ ఓపెనర్లు
7 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ వికెట్‌ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. క్రీజులో ఫిల్‌ సాల్ట్‌(49), విరాట్‌ కోహ్లి(24) ఉన్నారు.

3 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 33/0
3 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్‌ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. క్రీజులో విరాట్‌ కోహ్లి(13), ఫిల్‌ సాల్ట్‌(17) ఉన్నారు.

ఐపీఎల్‌-2026లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్‌ తమ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి మిచెల్‌ శాంట్నర్‌, మయాంక్‌ మార్కండే  వచ్చారు. మరోవైపు ఆర్సీబీ కూడా ఓ మార్పుతో బరిలోకి దిగింది. జోష్‌ హాజిల్‌వుడ్‌కు విశ్రాంతి ఇవ్వగా జాకబ్‌ డఫీ తుది జట్టులోకి వచ్చాడు.

తుది జట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్‌), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ(వికెట్ కీపర్‌), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, ట్రెంట్ బౌల్ట్, మయాంక్ మార్కండే, జస్ప్రీత్ బుమ్రా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement