ముంబై ఇండియన్స్‌లోకి కొత్త ఆల్‌రౌండర్‌ | IPL 2026: MI rope in Krish Bhagat for injured Ankolekar | Sakshi
Sakshi News home page

ముంబై ఇండియన్స్‌లోకి కొత్త ఆల్‌రౌండర్‌

Apr 16 2026 1:24 PM | Updated on Apr 16 2026 1:39 PM

IPL 2026: MI rope in Krish Bhagat for injured Ankolekar

ముంబై ఇండియన్స్‌లోకి కొత్త ఆల్‌రౌండర్‌ వచ్చాడు. గాయపడిన అథర్వ అంకోలేకర్ స్థానంలో జట్టులో చేరాడు. అతని పేరు కృష్ణ్‌ భగత్. 21 ఏళ్ల కృష్‌ పంజాబ్‌కు చెందిన ఆల్‌రౌండర్‌. ఇతన్ని ముంబై ఇండియన్స్‌ రూ. 30 లక్షల బేస్‌ప్రైజ్‌కు సొంతం చేసుకుంది. 

లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన అంకోలేకర్‌ స్థానాన్ని కృష్‌ భర్తీ చేశాడు. ముంబైకి చెందిన అంకోలేకర్‌ను ఈ సీజన్‌ వేలంలో రూ. 30 లక్షల బేస్‌ ప్రైజ్‌కు దక్కించుకున్నారు. అయితే అతను గాయం కారణంగా సీజన్‌ మొత్తం నుంచే తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో కృష్‌ జట్టులోక వచ్చాడు.

కృష్‌ రైట్‌ ఆర్మ్‌ మీడియం పేస్‌ బౌలింగ్‌తో పాటు లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ కూడా చేయగలడు. కృష్‌ పంజాబ్‌ తరఫున 7 ఫస్ట్‌క్లాస్‌, 9 లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు ఆడాడు. గత రెండు సీజన్లలో అతను ముంబై ఇండియన్స్‌ ట్రైల్స్‌లో పాల్గొన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే ఎంఐ బృందంలో నెట్‌ బౌలర్‌గా ఉన్నాడు.  

ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ వరుస పరాజయాలతో సతమతమవుతుంది. సీజన్‌ను గెలుపుతో బోణీ కొట్టిన ఈ మాజీ ఛాంపియన్‌, ఆతర్వాత హ్యాట్రిక్‌ పరాజయాలు ఎదుర్కొంది. తాజాగా ఆర్సీబీ చేతిలో చతికిలబడిన ఈ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 పరాజయాలతో 2 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. 

ఇవాళ (ఏప్రిల్‌ 16) జరుగబోయే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ వారి సొంత ఇలాకా వాంఖడేలో జరుగనుంది. ఈ మ్యాచ్‌కు స్టార్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ అందుబాటులో ఉండడని తెలుస్తుంది. ఆర్సీబీ మ్యాచ్‌లో గాయపడిన రోహిత్‌ పూర్తిగా కోలుకోలేదని సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement