ఐపీఎల్-2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ గ్రాండ్ విక్టరీ సాధించింది. 163 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలో చేధించింది.
ఢిల్లీ యువ సంచలనం సమీర్ రిజ్వీ మరోసారి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన రిజ్వీ.. ముంబై బౌలర్లను ఉతికారేశాడు. ఓ దశలో తొలి ఐపీఎల్ సెంచరీ చేసేలా కన్పించిన రిజ్వీ.. ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయాడు. మొత్తంగా 51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90 పరుగులు చేసి రిజ్వీ ఔటయ్యాడు.
అతడితో పాటు పాటు ఫాథుమ్ నిస్సాంక 44 పరుగులతో రాణించాడు. ముంబై బౌలర్లలో దీపక్ చాహర్, శాంట్నర్, బాష్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(51) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రోహిత్ శర్మ(35), నమన్‌ధీర్(28) రాణించారు.
ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఎంగిడి, అక్షర్ పటేల్, నిగమ్, నటరాజన్ తలా వికెట్ సాధించారు. ఈ విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరుకుంది. సమీర్ రిజ్వీకి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.
చదవండి: IPL 2026: అర్జున్ సంచలన బౌలింగ్.. స్టంప్స్ ఎగిరిపోయాయి! వీడియో


