ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 29) జరిగిన 41వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ముంబైని 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.
రికెల్టన్ రికార్డు సెంచరీ
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. ర్యాన్ రికెల్టన్ (123 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లలో విల్ జాక్స్ 46, సూర్యకుమార్ యాదవ్ 5, నమన్ ధిర్ 22, హార్దిక్ పాండ్యా 31, తిలక్ వర్మ 7, రాబిన్ మింజ్ 1 (నాటౌట్) పరుగు చేశారు. సన్‌రైజర్స్ బౌలర్లలో హింగే 2, ఎషాన్ మలింగ, నితీశ్ కుమార్ రెడ్డి, సాకిబ్ తలో వికెట్ తీశారు.
సన్‌రైజర్స్ బ్యాటర్ల ఊచకోత
244 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ మరో 8 బంతులు మిగిలుండగానే ఛేదించింది. అభిషేక్ శర్మ (45), ట్రవిస్ హెడ్ (76), హెన్రిచ్ క్లాసెన్ (65 నాటౌట్) ఊచకోత కోసి సన్‌రైజర్స్‌ను గెలిపించారు. ఆఖర్లో సలీల్ అరోరా (30 నాటౌట్) సైతం విధ్వంసం సృష్టించాడు. మిగతా ఆటగాళ్లలో ఇషాన్ కిషన్ డకౌట్ కాగా.. నితీశ్ కుమార్ రెడ్డి 21 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో ఘజన్‌ఫర్ 2 వికెట్లు తీయగా.. బౌల్ట్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీశారు.


