ఐపీఎల్ చ‌రిత్ర‌లో అరుదైన దృశ్యం.. | First Time Two South Africa Batters Opener For Mumbai Indians IPL History | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ చ‌రిత్ర‌లో అరుదైన దృశ్యం..

Apr 16 2026 7:59 PM | Updated on Apr 16 2026 10:05 PM

First Time Two South Africa Batters Opener For Mumbai Indians IPL History

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్‌, పంజాబ్ కింగ్స్ మ‌ధ్య మ్యాచ్‌లో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. టాస్ గెలిచిన పంజాబ్ ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్‌కు రోహిత్ శ‌ర్మ దూరం కావ‌డంతో అత‌డి స్థానంలో క్వింట‌న్ డికాక్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. డికాక్‌తో క‌లిసి రియాల్ రికెల్‌ట‌న్ ముంబై ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. 

గ‌మ‌నించాల్సిన అంశం ఏంటంటే ఈ ఇద్ద‌రు సౌతాఫ్రికాకు చెందిన వారే కావ‌డం విశేషం. ఐపీఎల్‌లో ఇలాంటి ఘ‌ట‌న‌లు అరుదుగా జ‌రుగుతుంటాయి. ముంబై ఇండియన్స్‌ తరఫున ఇద్దరు సౌతాఫ్రికా బ్యాటర్లు ఓపెనింగ్‌ చేయడం ఐపీఎల్‌లో ఇదే తొలిసారి. ఇక ఇన్నింగ్స్ రెండో ఓవ‌ర్ మార్కో యాన్సెన్ వేశాడు. ఈ స‌మ‌యంలో స్ట్రైకింగ్‌లో, నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌తో పాటు బౌలర్ కూడా సౌతాఫ్రికాకు చెందిన వారే ఉండ‌డం మ‌రో గ‌మ‌నించద‌గ్గ అంశం. 

Advertisement
 
Advertisement
Advertisement