ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ కథ ఏ మాత్రం మారలేదు. బుధవారం వాంఖడే స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై ఓటమి పాలైంది. 244 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ బౌలర్లు డిఫెండ్ చేసుకోలేకపోయారు. సీనియర్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రాలు దారుణంగా విఫలమయ్యారు.
ఈ ఏడాది సీజన్‌లో ముంబైకి ఇది ఆరో ఓటమి. దీంతో ముంబై ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించినట్లే. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. బ్యాటింగ్ మెరుగు పడినప్పటికి, బౌలింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయామని హార్దిక్ అన్నాడు.
"భారీ స్కోర్‌ను నమోదు చేసినప్పటికి ఓడిపోవడం మమ్మల్ని తీవ్ర నిరాశపరిచింది. ఈ రోజు మంచు ప్రభావం పెద్దగా లేదు. వారు అద్భుతమైన షాట్లు ఆడారు. మేము కొన్ని చెత్త బంతులు వేశాం. సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయకపోవడంతో వారు దూసుకుపోయారు.
గత మ్యాచ్‌తో పోలిస్తే మేము పుంజుకున్నాము అన్పించింది. ముఖ్యంగా బ్యాటింగ్ పరంగా చాలా మెరుగయ్యాం. కానీ బౌలింగ్ పరంగా మాత్రం విఫలమయ్యాము. 244 పరుగుల టార్గెట్‌ను మా బౌలర్లు డిఫెండ్ చేసుకోగలరని నమ్మాను. కానీ మేము అనుకున్నది ఈ రోజు జరగలేదు. మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాము.
ఇక నా విషయానికి వస్తే.. చివరి మూడు బంతులు మినహా, మిగిలన ఓవర్లు మొత్తం బాగానే బౌలింగ్ చేశాను. అయితే కొన్ని క్యాచ్‌లను విడిచిపెట్టడం మా గెలుపు అవకాశాలను దెబ్బ తీసింది. క్రికెట్‌లో క్యాచ్‌లు పట్టినప్పుడే మొమెంటం మారుతుంది. మా కుర్రాళ్లందరూ జట్టును గెలిపించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఫలితం మాకు అనుకూలంగా రాలేదు.
బౌలింగ్ విభాగంలో ఈ సీజన్‌లో మాకు పెద్దగా ఆప్షన్లు లేవు. అందుబాటులో ఉన్న బౌలర్లనే రొటేట్ చేయాల్సి వస్తుంది. అయినప్పటికి ఎట్టి పరిస్థితుల్లోనూ మా బౌలర్లను బలిపశువులు చేయను. ఓటుములకు జట్టు మొత్తం బాధ్యత వహించాల్సిందే. ముంబై ఇండియన్స్ అంటే ఒక బ్రాండ్. కానీ మా స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాము.
సొంత ప్రేక్షకుల ముందు మ్యాచ్‌లను ఓడిపోతుండడం చాలా బాధగా ఉంది. కొన్ని సందర్భాల్లో హోమ్ గ్రౌండ్‌లో ప్రత్యర్థి జట్టు పేరు మారుమోగుతుంటే ఆ బాధ మరింత ఎక్కువ అవుతోంది. అభిమానుల ప్రేమను తిరిగి పొందాలంటే మేము తిరిగి మ్యాచ్‌లను గెలవాలి.
అందుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తాము. మా యజమానులు, కోచింగ్ స్టాఫ్ అందరూ ఎంతో సపోర్ట్‌గా ఉన్నారు. మేము లోపాలను సరిదిద్దుకుని తిరిగి పుంజుకుంటామని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో హార్దిక్ పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో ఉంది.
చదవండి: హెడ్, క్లాసెన్ ఊచకోత.. భారీ లక్ష్యాన్ని ఊదేసిన సన్‌రైజర్స్


