IPL 2026: ముంబైపై ఆర్సీబీ ఉత్కంఠ విజయం | IPL 2026: Mumbai Indians Vs Royal Challengers Bangalore Match Live Updates | Sakshi
Sakshi News home page

IPL 2026: ముంబైపై ఆర్సీబీ ఉత్కంఠ విజయం

May 10 2026 7:12 PM | Updated on May 10 2026 11:54 PM

IPL 2026: Mumbai Indians Vs Royal Challengers Bangalore Match Live Updates

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ ఆట ముగిసింది. ఆర్సీబీ చేతిలో ఓట‌మితో ఈ సీజ‌న్ నుంచి ముంబై ఇండియ‌న్స్ నిష్క్ర‌మించింది. ఆదివారం రాయ్‌పూర్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్‌పై ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విజ‌యాన్ని అందుకుంది. 167 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆర్‌సీబీ ఆఖ‌రి బంతికి విజ‌యాన్ని అందుకుంది. 

కృనాల్ పాండ్యా (46 బంతుల్లో 73) త‌న కెరీర్‌లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించగా.. చివ‌ర్లో భువ‌నేశ్వ‌ర్ సిక్స‌ర్ కొట్టి ఆర్సీబీకి థ్రిల్లింగ్ విజ‌యాన్ని అందించాడు. జాక‌బ్ బెతెల్ (27) ప‌ర్వాలేద‌నిపించాడు. అంత‌క‌ముందు టాస్ ఓడి తొలుత‌ బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియ‌న్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.

కార్బిన్‌ బాష్‌కు నాలుగు వికెట్లు
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ కష్టాల్లో పడింది. కార్బిన్‌ బాష్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. 18 పరుగులు చేసిన జితేశ్ శర్మ కార్బిన్ బోష్ బౌలింగ్‌లో నమన్ ధిర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాతి బంతికే టిమ్ డేవిడ్ కూడా గోల్డెన్ డక్‌గా వెనుదిరగడంతో ఆర్సీబీ ఆరో వికెట్ కోల్పోయింది. అంతకముందు కృనాల్ పాండ్యా అర్థశతకంతో  మెరిశాడు. 33 బంతుల్లో అర్థశతకం సాధించిన కృనాల్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. 16 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.

నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
జాక‌బ్ బెతెల్ (27) రూపంలో ఆర్సీబీ 94 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. కార్బిన్ బోష్ బౌలింగ్‌లో తిల‌క్ వ‌ర్మ‌కు క్యాచ్ ఇచ్చి బెతెల్ పెవిలియ‌న్ చేరాడు. 13 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ఆర్సీబీ 4 వికెట్ల న‌ష్టానికి 94 ప‌రుగులు చేసింది. కృనాల్ పాండ్యా (41) ప‌రుగుల‌తో ఆడుతున్నాడు.

మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
కెప్టెన్‌ పటీదార్ (8) రూపంలో ఆర్సీబీ 39 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. కార్బిన్ బోస్క్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి రికెల్‌టన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 7 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది.

రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
ముంబైతో మ్యాచ్‌లో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. ముంబై స్కోరు 24 పరుగుల వద్ద ఉన్నప్పుడు దీపక్ చాహర్ బౌలింగ్‌లో 12 పరుగులు చేసిన దేవదత్ పడిక్కల్ కీపర్ రికెల్టన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  

కోహ్లీ గోల్డెన్ డక్‌.. తొలి వికెట్ డౌన్‌
167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. దీపక్ చాహర్ బౌలింగ్‌లో రాజ్ బవాకు క్యాచ్ ఇచ్చిన కోహ్లీ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.

ఆర్సీబీ టార్గెట్ 167 పరుగులు
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఆర్సీబీకి ముంబై ఇండియన్స్ 167 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. తిలక్ వర్మ (57) హాఫ్ సెంచరీతో రాణించగా.. నమన్ ధిర్ (47) కీల​క ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు మినహా మిగతా ముంబై బ్యాటర్లు విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లతో అదరగొట్టగా, హాజిల్‌వుడ్‌, రసిక్ సలామ్‌, షెపర్డ్ తలా ఒక వికెట్ తీశారు.

ఐదో వికెట్ కోల్పోయిన ముంబై
విల్ జాక్స్ (10) రూపంలో ముంబై ఇండియ‌న్స్ 132 ప‌రుగుల వ‌ద్ద ఐదో వికెట్ కోల్పోయింది. షెపర్డ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు య‌త్నించిన విల్ జాక్స్ జాక‌బ్ బెతెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 15.2 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 132 ప‌రుగులు చేసింది.

నమన్‌ ధిర్‌ హాఫ్‌ సెంచరీ మిస్‌  
ముంబై ఇండియన్స్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. నమన్‌ ధిర్‌ 47 పరుగులు చేసి రసిఖ్ సలాం దార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో తిలక్‌ వర్మ 41, విల్‌ జాక్‌ 5 పరుగులతో ఉన్నారు. స్కోరు 114-4 (13 ఓవర్లకు)గా ఉంది. 

10 ఓవర్లకు 82 పరుగులు 
ముంబై ఇండియన్స్‌ 10 ఓవర్లు ముగిసేనాటికి మూడు వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. క్రీజులో నమన్‌ ధిర్‌ 34, తిలక్‌ వర్మ 25 పరుగులతో ఉన్నారు. 

క్రీజులో నమన్‌, తిలక్‌ వర్మ 
7 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ముంబై ఇండియ‌న్స్ మూడు వికెట్ల న‌ష్టానికి 57 ప‌రుగులు చేసింది.  న‌మ‌న్ ధిర్ (16), తిల‌క్ వ‌ర్మ (13) ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

సూర్య‌ గోల్డెన్ డ‌క్‌.. మూడో వికెట్ డౌన్‌
ఆర్సీబీతో మ్యాచ్‌లో స్టాండ్ ఇన్ కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ గోల్డెన్ డ‌క్‌గా వెనుదిరగ‌డంతో ముంబై మూడో వికెట్ కోల్పోయింది. భువ‌నేశ్వ‌ర్ బౌలింగ్‌లో తాను ఆడిన తొలి బంతికే సూర్య‌ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంత‌క‌ముందు రోహిత్ శ‌ర్మ (28)ను కాట్ అండ్ బౌల్డ్ చేశాడు. 4 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ముంబై మూడు వికెట్ల న‌ష్టానికి 34 ప‌రుగులు చేసింది. న‌మ‌న్ ధిర్ (5), తిల‌క్ వ‌ర్మ (1) ప‌రుగుతో ఆడుతున్నారు.

తొలి వికెట్ కోల్పోయిన ముంబై
ఆర్సీబీతో మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ 4 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న రికెల్ట‌న్ 2 ప‌రుగులు మాత్ర‌మే చేసి భువ‌నేశ్వ‌ర్ బౌలింగ్‌లో ప‌టీదార్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

టాస్‌ గెలిచిన ఆర్సీబీ
టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు రెగ్యుల‌ర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరం కావ‌డంతో సూర్య‌కుమార్ యాద‌వ్ స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా ఉన్నాడు. ముఖాముఖి పోరులో ఇప్ప‌టివ‌ర‌కు ఇరుజ‌ట్లు 35 సార్లు త‌ల‌ప‌డ్డాయి. ముంబై ఇండియ‌న్స్ 19 సార్లు, ఆర్సీబీ 16 సార్లు గెలిచాయి. 2023 నుంచి ఐదు మ్యాచ్‌లు ఆడితే ఆర్సీబీ మూడు గెలిస్తే, ముంబై రెండు విజ‌యాలు సాధించింది. 

తొలి అంచె పోటీలో ముంబై ఇండియన్స్‌పై ఆర్సీబీ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాయింట్ల పరంగా చూసుకుంటే ఆర్సీబీ 10 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించి 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ముంబైపై గెలిస్తే 14 పాయింట్లతో ఎస్‌ఆర్‌హెచ్‌ను వెనక్కి నెట్టి టేబుల్ టాపర్‌గా నిలవనుంది. మరోవైపు ఇప్పటికే ప్లేఆఫ్ ఆశలు క్లిష్టం చేసుకున్న ముంబై 10 మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో పట్టికలో 9వ స్థానంలో ఉంది.

తుది జట్లు:
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, రికెల్టన్(వికెట్ కీపర్‌), నమన్ ధిర్‌, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), తిలక్ వర్మ, విల్ జాక్స్, రాజ్ బావా, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, గజన్‌ఫర్‌.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, జాకబ్ బెథెల్, రజత్ పటీదార్ (కెప్టెన్‌), జితేష్ శర్మ(వికెట్ కీపర్‌), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్.

ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ సబ్స్: ట్రెంట్ బౌల్ట్, రఘు శర్మ, మయాంక్ రావత్, రాబిన్ మింజ్, శార్దూల్ ఠాకూర్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ సబ్స్: దేవదత్ పడిక్కల్, జోర్డాన్ కాక్స్, మంగేష్ యాదవ్, స్వప్నిల్ సింగ్, వెంకటేష్ అయ్యర్

Advertisement
 
Advertisement
Advertisement