IPL 2026: పంజాబ్ కింగ్స్‌ ఘన విజయం | IPL 2026: Mumbai Indians Vs Punjab Kings Match Live Updates | Sakshi
Sakshi News home page

IPL 2026: ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ పంజాబ్‌ కింగ్స్‌ అప్‌డేట్స్‌

Apr 16 2026 7:03 PM | Updated on Apr 16 2026 11:07 PM

IPL 2026: Mumbai Indians Vs Punjab Kings Match Live Updates

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. సీజన్‌లో పంజాబ్‌కు ఇది నాలుగో విజయం. ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ (80 నాటౌట్‌), శ్రేయస్ అయ్యర్ (65) వీరవిహారంతో 196 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించడం విశేషం. ముంబై బౌలర్లలో గజన్‌ఫర్ 2 వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల నష్టానికి 195 ప‌రుగులు చేసింది. క్వింట‌న్ డికాక్ (112 నాటౌట్‌) అజేయ శ‌త‌కంతో అద‌ర‌గొట్ట‌గా.. న‌మ‌న్ ధిర్ అర్థ‌శ‌త‌కంతో రాణించాడు. 

ప్రబ్‌సిమ్రన్‌ హాఫ్‌ సెంచరీ
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ విజయం దిశగా సాగుతుంది. ఓపెనర్‌ ప్రబ్‌సిమ్రన్‌ అర్థసెంచరీతో చెలరేగగా, అయ్యర్‌ (34) దూకుడుగా ఆడుతున్నాడు. ప్రస్తుతం పంజాబ్‌ 12 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. 

  • ఆరు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ కింగ్స్‌ 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. శ్రేయస్‌ (12), ప్రబ్‌సిమ్రన్‌ (16) క్రీజులో ఉన్నారు. అంతకముందు కూపర్‌ కన్నోలి (17) రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.

తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్‌
197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన ప్రియాన్ష్ ఆర్య గజన్‌ఫర్ బౌలింగ్‌లో దీపక్ చాహర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  ప్రస్తుతం పంజాబ్ వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది. అంతకముందు ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో పంజాబ్ 21 పరుగులు పిండుకోవడం విశేషం.

పంజాబ్ టార్గెట్ 196 ప‌రుగులు
పంజాబ్ కింగ్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల నష్టానికి 195 ప‌రుగులు చేసింది. క్వింట‌న్ డికాక్ (112 నాటౌట్‌) అజేయ శ‌త‌కంతో అద‌ర‌గొట్ట‌గా.. న‌మ‌న్ ధిర్ అర్థ‌శ‌త‌కంతో రాణించాడు. ఒక ద‌శ‌లో డికాక్, న‌మ‌న్ ధిర్‌ల జోరుతో ముంబై ఇండియ‌న్స్ 200 ప్ల‌స్ ప‌రుగులు చేస్తుంద‌నిపించింది. కానీ న‌మ‌న్ ధిర్ ఔటైన త‌ర్వాత వ‌రుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ముంబై 195 ప‌రుగుల వ‌ద్దే ఆగిపోయింది. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు తీయ‌గా, యాన్సెన్‌, శ‌శాంక్ సింగ్ చెరొక వికెట్ ప‌డ‌గొట్టారు.

బార్ట్‌లెట్ క‌ళ్లు చెదిరే క్యాచ్‌.. పాండ్యా (14)ఔట్‌
14 ప‌రుగులు చేసిన పాండ్యా మార్కో యాన్సెస్ బౌలింగ్‌లో గ్జేవియ‌ర్ బార్ట్‌లెట్ అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. 

డికాక్ సెంచ‌రీ
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ ఓపెన‌ర్ క్వింట‌న్ డికాక్ సెంచ‌రీ బాదాడు. 53 బంతుల్లో సెంచ‌రీ మార్క్ అందుకున్న డికాక్‌కు ఐపీఎల్‌లో ఇది మూడో సెంచ‌రీ. ప్ర‌స్తుతం ముంబై ఇండియ‌న్స్ 4 వికెట్ల న‌ష్టానికి 175 ప‌రుగులు చేసింది.

నమన్‌ ధిర్‌ ఔట్‌.. మూడో వికెట్‌ డౌన్‌
పంజాబ్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ మూడో వికెట్ కోల్పోయింది. అర్థ‌సెంచ‌రీ సాధించిన న‌మ‌న్ ధిర్ శ‌శాంక్ సింగ్ బౌలింగ్‌లో బార్ట్‌లెట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్ర‌స్తుతం ముంబై 15 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 145 ప‌రుగులు చేసింది. డికాక్ (82), పాండ్యా (3) క్రీజులో ఉన్నారు.

7 ఓవ‌ర్లలో ముంబై 67/2
ఏడు ఓవ‌ర్లు ముగిసేస‌రికి ముంబై ఇండియ‌న్స్ రెండు వికెట్ల న‌ష్టానికి 67 ప‌రుగులు చేసింది. న‌మ‌న్ ధిర్ (34), డికాక్ (25) క్రీజులో ఉన్నారు.

సూర్య‌కుమార్ గోల్డెన్ డ‌క్‌.. 
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ రెండో వికెట్ కోల్పోయింది. అర్ష‌దీప్ సింగ్ వ‌రుస బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. సూర్య‌కుమార్ యాద‌వ్‌ను గోల్డెన్ డ‌క్‌గా పెవిలియ‌న్ చేర్చిన‌ అర్ష‌దీప్ సింగ్ అంత‌క‌ముందు రియాన్ రికెల్‌ట‌న్‌ను ఔట్ చేశాడు. ప్రస్తుతం ముంబై ఇండియ‌న్స్ 3 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల నష్టానికి 15 ప‌రుగులు చేసింది.

బౌలింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గురువారం వాంఖడే వేదికగా 24వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్‌ ఎంచుకుంది. ముంబై జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. రోహిత్‌ శర్మ, మిచెల్‌ సాంట్నర్‌ స్థానం డికాక్‌, మయాంక్‌ రావత్‌ తుది జట్టులోకి వచ్చారు. పంజాబ్‌ మాత్రం తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.

ముఖాముఖి పోరులో ఇరుజ‌ట్లు 35 సార్లు త‌ల‌ప‌డగా.. ముంబై ఇండియ‌న్స్ 17 సార్లు, పంజాబ్ కింగ్స్ 17 సార్లు నెగ్గాయి. ఒక మ్యాచ్‌లో ఫ‌లితం రాలేదు. ఇక వాంఖ‌డే స్టేడియంలో మాత్రం పంజాబ్ కింగ్స్ రికార్డు మెరుగ్గా ఉంది. వాంఖ‌డేలో పంజాబ్ ముంబై పై 5 సార్లు గెలిచింది. గత ఐదు మ్యాచ్‌ల్లో ముంబై మూడింటింలో, పంజాబ్‌ రెండు మ్యాచ్‌ల్లో గెలిచాయి.

ముంబై ఇండియన్స్ తుదిజట్టు: క్వింటన్ డికాక్(వికెట్‌ కీపర్‌), ర్యాన్ రికెల్టన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా( కెప్టెన్‌), రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, మయాంక్ రావత్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జస్‌ప్రీత్‌ బుమ్రా.

పంజాబ్ కింగ్స్ తుదిజట్టు: ప్రభ్‌సిమ్రాన్ సింగ్(వికెట్‌ కీపర్‌), ప్రియాన్ష్‌ ఆర్య, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్‌), కూపర్ కొన్నోలీ, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైశాక్, అర్ష్‌దీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్.

Advertisement
 
Advertisement
Advertisement