ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన రాజస్తాన్‌ | IPL 2026 RR vs MI: Rajasthan Royals won by 27 runs | Sakshi
Sakshi News home page

IPL 2026: ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన రాజస్తాన్‌

Apr 8 2026 12:34 AM | Updated on Apr 8 2026 12:35 AM

IPL 2026 RR vs MI: Rajasthan Royals won by 27 runs

ఐపీఎల్‌-2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో ముంబై పరాజయం పాలైంది. వర్షం కారణంగా  ఈ మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన  రాజస్తాన్ నిర్ణీత  ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 150 పరుగులు చేసింది. రాజస్తాన్‌ బ్యాటర్లలో జైశ్వాల్‌ విధ్వంసం సృష్టించాడు.

జైశ్వాల్‌ కేవలం 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు వైభవ్‌ సూర్యవంశీ(14 బంతుల్లో 1 సిక్స్‌, 5 సిక్సర్లతో 39), రియాన్‌ పరాగ్‌(10 బంతుల్లో 1 ఫోర్లు, 2 సిక్స్‌లతో 20) మెరుపులు మెరిపించారు. ముంబై బౌలర్లలో ఘజన్‌ఫర్ రెండు, శార్థూల్ ఠాకూర్ ఓ వికెట్ సాధించాడు.

అనంతరం 151 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులకే పరిమితమైంది. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్(25), నమన్‌ ధీర్‌(25) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. రాజస్తాన్‌ బౌలర్లలో రవి బిష్ణోయ్‌ రెండు, సందీప్‌ శర్మ, బర్గర్‌ తలా రెండు వికెట్లు సాధించారు. 

Advertisement
 
Advertisement
Advertisement