చరిత్ర సృష్టించిన సీఎస్‌కే చిచ్చర పిడుగు | Karthik Sharma Unbeaten 54 Powers CSK Vs MI, Becomes Youngest To Score Fifty Against Mumbai Indians | Sakshi
Sakshi News home page

IPL 2026: చరిత్ర సృష్టించిన సీఎస్‌కే చిచ్చర పిడుగు

May 3 2026 4:40 PM | Updated on May 3 2026 5:28 PM

Kartik Sharma Scripts History Vs Mumbai Indians

ఐపీఎల్‌-2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ యువ ఆట‌గాడు కార్తీక్ శ‌ర్మ ఎట్ట‌కేల‌కు త‌న బ్యాట్ ఝుళిపించాడు. ఈ ధనాధన్ లీగ్‌లో భాగంగా శనివారం చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కార్తీక్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. 160 పరుగుల లక్ష్య చేధనలో అతడు కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

రుతురాజ్‌ గైక్వాడ్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మొత్తంగా 40 బంతులు ఎదుర్కొన్న కార్తీక్‌.. 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో కార్తీక్ శర్మ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్‌పై సీఎస్‌కే తరపున హాఫ్ సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా కార్తీక్ నిలిచాడు. కార్తీక్ కేవలం 20 ఏళ్ల 6 రోజుల్లో ఈ ఫీట్‌ను సాధించాడు. ఓవరాల్‌గా ముంబైపై తక్కువ వయసులో 50కు పైగా పరుగులు చేసిన జాబితాలో కార్తీక్ మూడో స్ధానంలో నిలిచాడు. తొలి రెండు స్ధానాల్లో సంజూ శాంసన్‌, శుభ్‌మన్ గిల్ ఉన్నారు.

కాగా గతేడాది జరిగిన మినీ వేలంలో కార్తీక్ శర్మను రూ.14 కోట్ల భారీ ధరకు సీఎస్‌కే కొనుగోలు చేసింది. అయితే సీజన్ ఆరంభ మ్యాచ్‌లలో అతడు రాణించకపోవడంతో ఫ్యాన్స్ విమర్శించారు. కానీ ఇప్పుడు తనలోని అసలైన ఆటను కార్తీక్ బయటపెట్టాడు.
చదవండి: IPL 2026: వైభవ్ సూర్యవంశీ 'అన్ ప్రొఫెషనల్'?.. తన వ్యాఖ్యలపై జితేష్‌ క్లారిటీ
 

Advertisement
 
Advertisement
Advertisement