ముంబై ఇండియ‌న్స్‌కు చావోరేవో మ్యాచ్‌.. ఓడితే ఇంటికే? | Mumbai Indians playoff qualification chances: Can Hardik Pandya-led side end up in top four? | Sakshi
Sakshi News home page

IPL 2026: ముంబై ఇండియ‌న్స్‌కు చావోరెవో మ్యాచ్‌.. ఓడితే ఇంటికే?

May 2 2026 1:45 PM | Updated on May 2 2026 1:55 PM

Mumbai Indians playoff qualification chances: Can Hardik Pandya-led side end up in top four?

ఐపీఎల్‌-2026లో ముంబై ఇండియ‌న్స్ కీల‌క పోరుకు సిద్ద‌మైంది. శ‌నివారం చెపాక్‌ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో ముంబై ఇండియ‌న్స్ అమీతుమీ తెల్చుకోనుంది. ప్లే ఆఫ్ రేసులో నిల‌వాలంటే ముంబై ఈ మ్యాచ్‌లో క‌చ్చితంగా గెల‌వాల్సిందే. ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 8 మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవ‌లం రెండింట మాత్ర‌మే విజ‌యం సాధించింది.

ఆ జ‌ట్టు ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో తొమ్మిద‌వ స్ధానంలో ఉంది. దీంతో ప్లే ఆఫ్ రేసులో ముంబై ఉండాలంటే మిగిలిన సీఎస్‌కేతో పాటు మిగిలిన‌ అన్ని మ్యాచ్‌ల్లోనూ భారీ విజయాలు సాధించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ముంబై ఇండియ‌న్స్ భ‌వితవ్యం ఇత‌ర జ‌ట్ల ఫ‌లితాల‌పై కూడా ఆధార‌ప‌డి ఉంటుంది.

ముంబై జ‌ట్టులోకి ప్రోటీస్ ఆల్‌రౌండ‌ర్‌
ఇక సీఎస్‌కేతో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ ప‌లు మార్పుల‌తో బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. చెపాక్ మైదానం స్పిన్ అనుకూలించే అవ‌కాశ‌మున్నంద‌న మాయాంక్ మార్కండేను తిరిగి తుది జ‌ట్టులోకి తీసుకురావ‌ల‌ని ముంబై మేనెజ్‌మెంట్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

మ‌రో స్పిన్న‌ర్ అల్లా ఘ‌జ‌న్‌ఫ‌ర్‌తో మార్కండే బంతిని పంచుకోనున్నాడు. అదేవిధంగా గ‌త మ్యాచ్‌లో విఫల‌మైన పేస‌ర్ ట్రెంట్ బౌల్ట్‌పై వేటు ప‌డ‌నున్న‌ట్లు వార్త‌లు అత‌డి స్ధానంలో ప్రోటీస్ ఆల్‌రౌండ‌ర్ కార్భిన్ బాష్ ఆడడం దాదాపు ఖాయ‌మైంది. ఈ మ్యాచ్‌కు కూడా స్టార్ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ దూరం కానున్నాడు.

దీంతో ముంబై ఇన్నింగ్స్‌ను ర్యాన్ రికెల్ట‌న్‌, విల్ జాక్స్ ప్రారంభించ‌నున్నారు. మిడిలార్డ‌ర్‌లో తిల‌క్ వ‌ర్మ‌, సూర్య‌కుమార్ యాద‌వ్‌, నమ‌న్ ధీర్ ఉండ‌నున్నారు. గ‌త మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవ‌కాశం రాక‌పోయిన యువ ఆట‌గాడు రాబిన్ మింజ్‌ను తుది జ‌ట్టులో కొన‌సాగించే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి.

ముంబై ఇండియ‌న్స్ తుది జ‌ట్టు(అంచ‌నా)
ర్యాన్ రికెల్టన్(వికెట్ కీప‌ర్‌), విల్ జాక్స్, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), రాబిన్ మింజ్, శార్దూల్ ఠాకూర్, కార్బిన్ బాష్, జస్ప్రీత్ బుమ్రా,  గజన్‌ఫర్, మయాంక్ మార్కండే
చదవండి: Heinrich Klaasen: 'క్షమించండి.. అది సాధ్యం కాదు'

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement