ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. సోమవారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 99 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 15.5 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలి దారుణ ఓటమిని మూటగట్టుకుంది. వాషింగ్టన్ సుందర్ 26 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో అశ్వనీ కుమార్ 4 వికెట్లతో చెలరేగగా, గజన్‌ఫర్, మిచెల్ సాంట్నర్ 2 వికెట్లు పడగొట్టారు. సొంతగడ్డపై ఆడిన గుజరాత్ ముంబై బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.
గుజరాత్ మూడో వికెట్ డౌన్
గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్.. అశ్విన్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 45/3
గుజరాత్ రెండో వికెట్ డౌన్
గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన జోస్ బట్లర్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.
గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్
200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగిలింది. బుమ్రా వేసిన మొదటి ఓవర్‌లో తొలి బంతికే సాయిసుదర్శన్ పెవిలియన్‌కు చేరాడు.
తిలక్ వర్మ విధ్వంసం
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 45 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. తిలక్ వర్మకు ఇదే తొలి ఐపీఎల్ సెంచరీ.
అతడితో పాటు నమన్ ధీర్(32 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 45) రాణించాడు. ఫలితంగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో కగిసో రబాడ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలా వికెట్ సాధించారు.
తిలక్ వర్మ హాఫ్ సెంచరీ
తిలక్ వర్మ ఎట్టకేలకు తన ఫామ్‌ను అందుకున్నాడు. అహ్మాదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తిలక్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. 59 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.
దూకుడుగా ఆడుతున్న తిలక్
16 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. క్రీజులో తిలక్ వర్మ(37), హార్దిక్ పాండ్యా(7) ఉన్నారు.
ముంబై నాలుగో వికెట్ డౌన్
98 పరుగుల వద్ద ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన నమన్‌ధీర్.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోర్: 103/4
ముంబై మూడో వికెట్ డౌన్
44 పరుగుల వద్ద ముంబై మూడో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. రబాడ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు
ముంబై రెండో వికెట్ డౌన్
23 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన క్వింటన్ డికాక్.. కగిసో రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు.
తొలి వికెట్ డౌన్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. అరంగేట్ర ఆటగాడు డానిష్ మాలెవర్(2).. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లకు ముంబై స్కోర్: 21/1
ఐపీఎల్-2026 సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు కూడా ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ దూరమయ్యాడు.
కాగా ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తరపున యువ ఆటగాళ్లు డానిష్ మలేవార్, క్రిష్ భగత్ అరంగేట్రం చేశాడు. అదేవిధంగా మిచెల్ శాంట్నర్ తిరిగి జట్టులోకి వచ్చాడు. గుజరాత్ టైటాన్స్ మాత్రం తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.
తుది జట్లు
గుజరాత్ టైటాన్స్ : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(వికెట్‌కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, మహ్మద్ సిరాజ్, కగిసో రబడ, ప్రసిద్ధ్ కృష్ణ, అశోక్ శర్మ
ముంబై ఇండియన్స్ : డానిష్ మాలెవార్, క్వింటన్ డి కాక్(వికెట్‌కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(సి), తిలక్ వర్మ, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, క్రిష్ భగత్, జస్ప్రీత్ బుమ్రా, ఘజన్‌ఫర్


