KKR Vs Mumbai Indians Match Live Updates From Kolkata: ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘన విజయం సాధించింది. 148 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 6 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో చేధించింది. కేకేఆర్ బ్యాటర్లలో మనీష్ పాండే(45) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రావ్‌మన్ పావెల్(40) రాణించాడు.
ముంబై బౌలర్లలో కార్భిన్ బాష్ మూడు వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ఘజన్‌ఫర్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ముంబై ఇన్నింగ్స్‌లో టాపర్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముంబై బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(26), కార్భిన్ బాష్(32) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో సౌరభ్ దూబే, కామోరూన్ గ్రీన్, కార్తీక్ త్యాగి తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.
కేకేఆర్ ఐదో వికెట్ డౌన్
కేకేఆర్ ఐదో వికెట్ కోల్పోయింది. 40 పరుగులు చేసిన రోవ్‌మన్ పావెల్.. ఘజన్‌ఫర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.కేకేఆర్ విజయానికి 24 బంతుల్లో 20 పరుగులు కావాలి.
విజయం దిశగా కేకేఆర్
12 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజులో మనీష్ పాండే(36), పావెల్(23) ఉన్నారు. కేకేఆర్ విజయానికి ఇంకా 48 బంతుల్లో 51 రన్స్ కావాలి.
కేకేఆర్ రెండో వికెట్ డౌన్
అజింక్య రహానే రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన రహానే.. బాష్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 7 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 54/2
కేకేఆర్ తొలి వికెట్ డౌన్
కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన ఫిన్ అలెన్ దీపక్ చాహర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
తేలిపోయిన ముంబై బ్యాటర్లు.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు తేలిపోయారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.
లోయార్డర్ బ్యాటర్ కార్భిన్ బాష్(18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) మెరుపులు మెరిపించడంతో ముంబై ఈ మాత్రం స్కోర్ అయినా సాధించగల్గింది. కేకేఆర్ బౌలర్లలో సౌరభ్ దూబే, గ్రీన్, కార్తిక్ త్యాగి తలా రెండు వికెట్లు సాధించగా.. సునీల్ నరైన్ ఓ వికెట్ పడగొట్టాడు.
17 ఓవర్లలో ముంబై 106/7
17 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ 7 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. కార్బిన్ బాష్ (2) పరుగులతో ఆడుతున్నాడు.
తిరిగి మొదలైన ఆట.. 9 ఓవర్లలో ముంబై 61-4
9 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. తిలక్ వర్మ (10), హార్దిక్ పాండ్యా (8) పరుగులతో ఆడుతున్నారు.
ఆటకు ఆటంకం కలిగించిన వరుణుడు
ఆటకు వరుణుడు ఆటంకం కలిగించాడు. ముంబై ఇండియన్స్ స్కోరు 8 ఓవర్లకు 57-4గా ఉన్న సమయంలో వర్షం పడడంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.
నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై
కేకేఆర్‌తో మ్యాచ్‌లో ముంబై దారుణ ఆటతీరును ప్రదర్శిస్తోంది. 41 పరుగుల వద్ద సూర్యకుమార్ (15) రూపంలో నాలుగో వికెట్ కోల్పోయింది. 7 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. పాండ్యా (6), తిలక్ వర్మ (5) పరుగులతో ఆడుతున్నారు.
రోహిత్ (15) ఔట్.. మూడో వికెట్ డౌన్
కేకేఆర్‌తో మ్యాచ్‌లో ముంబై కష్టాల్లో పడింది. 15 పరుగులు చేసిన రోహిత్ శర్మ సౌరబ్ దూబే బౌలింగ్‌లో గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ముంబై 23 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 5 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. సూర్యకుమార్ (9), తిలక్ వర్మ (0) క్రీజులో ఉన్నారు.
మెరిసిన గ్రీన్.. రెండు వికెట్లు కోల్పోయిన ముంబై
కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 17 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. కామెరున్ గ్రీన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లతో మెరిశాడు. తొలుత 6 పరుగులు చేసిన రికెల్‌టన్ గ్రీన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి పాండే స్టన్నింగ్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఓవర్ చివరి బంతికి నమన్ ధిర్‌ను గ్రీన్ డకౌట్ చేశాడు.
టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. ముఖాముఖి పోరులో ఇరుజట్లు 36 సార్లు తలపడితే ముంబై 25 సార్లు, కేకేఆర్ 11 సార్లు నెగ్గాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే కేకేఆర్ ప్లేఆఫ్స్ రేసులో నిలుస్తుంది. ఒకవేళ ఓడితే మాత్రం ఇంటిబాట పట్టనుంది. ప్రస్తుతం కేకేఆర్ 12 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 11 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది.
ఈ మ్యాచ్‌లో గెలిస్తే కేకేఆర్ ఖాతాలో 13 పాయింట్లు చేరుతాయి. తమ చివరి మ్యాచ్‌లో ఢిల్లీని ఓడిస్తే అప్పుడు 15 పాయింట్లతో నిలవనుంది. ఇదే సమయంలో రాజస్తాన్, పంజాబ్‌లు తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడితే మాత్రం కేకేఆర్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఇక ముంబై ఇండియన్స్ ఇప్పటికే ఎలిమినేట్ కావడంతో వారు గెలిచినా పెద్దగా ఉపయోగం ఉండదు.
తుది జట్లు:
ముంబై ఇండియన్స్: ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్) , రోహిత్ శర్మ, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కె ప్టెన్), విల్ జాక్స్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, రఘు శర్మ.
కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్య రహానె(కెప్టెన్), అంగ్‌క్రిష్ రఘువంశీ(వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, రింకూ సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, కార్తీక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి, సౌరభ్ దూబే.
🚨Toss update from Kolkata 🚨@kkriders won the toss and elected to bowl first against @mipaltan
Updates ▶️ https://t.co/Aw11jLoww5#TATAIPL | #KhelBindaas | #KKRvMI pic.twitter.com/YoNaUICl30— IndianPremierLeague (@IPL) May 20, 2026


