Politics
-
‘జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తుంటే చూస్తూ ఊరుకోం’
ప్రొద్దుటూరు: తమ నాయకుడు వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని పదే పదే హననం చేయడానికి ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి. గత కొన్నేళ్లుగా షర్మిల, సునీతలు వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకే యత్నిస్తున్నారని రాచమల్లు ధ్వజమెత్తారు. ఈ రోజు(శుక్రవారం, మార్చి 20 వ తేదీ) వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నుంచి మీడియాతో మాట్లాడిన రాచమల్లు.. షర్మిలను ప్రొటెక్ట్ చేయడంలో భాగంగా కుమారుడు వైఎస్ జగన్‌పై నిందలు వేయడం సరైనదేనా? అని విజయమ్మను ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే.. ‘ విజయమ్మ విడుదల చేసిన లేఖ టీడీపీ సోషల్ మీడియాలో మొదట వస్తోంది. దీన్ని బట్టే అర్థం అవుతోంది.. దీని వెనుక ఎవరున్నారో .. ఎక్కడ తయారవుతున్నాయో?, షర్మిల ప్రొటెక్ట్ చేయడంలో భాగంగా కుమారుడు జగన్‌పై నిందలు వేయడం సరైనదా?, షర్మిల కోసం వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని దిగజార్చేందుకు యత్నిస్తున్నారు. షర్మిల, సునీత ఇంటి గుట్టును వీధికెక్కించారు. ఆస్తుల పంపకం అంటే పంచివ్వడం కాదా?, మీరు చెబుతున్నారు కదా.. షర్మిలకు ఇచ్చినట్లే వైఎస్ జగన్‌కు ఇచ్చారని.. మరి ఇది ఆస్తుల పంపకం కాదా?, చెల్లెలి మీద ప్రేమతో ఇవ్వాల్సినదానికంటే ఎక్కువే వైఎస్ జగన్ ఇచ్చారు. 2019 ఆగస్టులో వైఎస్ జగన్ ఓ ఎంఓయూ రాశారు. ఎంఓయూలో పెట్టింది చెల్లికి ప్రేమతో వైఎస్ జగన్ ఇవ్వాలనుకున్నది. 2024 వచ్చేసరికి తనతో విభేదించడంతో వైఎస్ జగన్ ఎంఓయూ రద్దు చేసుకున్నారు. వైఎస్ జగన్ తన సొంత డబ్బును చెల్లి షర్మిలకు రూ. 236 కోట్లు ఇచ్చారు. మంచి మనసు ఉంది కాబట్టే షర్మిలకు సొంత డబ్బును ఇచ్చారు జగన్. చంద్రబాబు తన ఆస్తిలో వాటాను ఆయన సోదరీమణులకు ఇచ్చాడా?, ఆస్తుల పంపకం జరగకపోతే జగన్ ఆస్తులనే ఎందుకు అటాచ్ చేశారు?, ఆస్తుల పంపకం జరిగింది కాబట్టే షర్మిల ఆస్తులను అటాచ్ చేయలేదు’ అని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ సహనంతో భరించారుఎన్ని విమర్శలు చేసినా వైఎస్ జగన్ సహనంతో భరించారు. అందరూ కలిసి వైఎస్ జగన్‌పై పగబట్టారు. వైఎస్ జగన్‌కు మీరంతా ఇంతా అన్యాయం చేస్తారా?, మన శత్రువులతో చేతులు కలపడం కంటే అన్యాయం మరొకటి ఉంటుందా?, వైఎస్ జగన్ తరఫున ఆయన భక్తుడిగా ఇకపై ప్రశ్నిస్తూనే ఉంటా. కనురెప్ప మూసి తెరిచేలోపల వైఎస్ జగన్ కోసం నా ప్రాణం ఇస్తా. నీ కొడుకును జైల్లో పెట్టిన పార్టీలోకి షర్మిల వెళ్తుంటే మీరెందుకు నిరోధించలేదు?, కొడుకును ఓడించమని ఏ తల్లైనా కోరుతుందా?, సరస్వతీ ప్లాంట్విషయంలో షేర్లు బదిలీ చేస్తే.. జగన్ జైలుకు పోతాడని తెలిసి కూడా బదలాయిస్తారా?, ఇది జగన్‌కు అన్యాయం చేయడం కాదా?, షర్మిల ప్రవర్తన వల్లే ఆమెకు చేసిన ఎంఓయూ రద్దు చేసుకున్నారు. మీరు బెయిల్ రద్దుకు దిగారు.. ఆయన ఎంఓయూ రద్దు చేసుకున్నారు’ అని స్పష్టం చేశారు రాచమల్లు. -
‘తెలంగాణ మరో శ్రీలంక కాబోతోంది’
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌పై బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ పెదవి విరిచారు. తెలంగాణ మరో శ్రీలంక కాబోతోందంటూ విమర్శించారు బండి సంజయ్. ‘ చిప్ప చేతికిచ్చే పాలన కాంగ్రెస్‌ది. మనది బిచ్చపు బతుకులేనా...?, ఇప్పుడు తెలంగాణా సమాజం ఆలోచించాల్సిన సమయం.. ఇది ప్రజలను వంచించే బడ్జెట్. అంకెల ఆర్భాటాలు, కేటాయింపుల ప్రగల్భాలే తప్ప ఒరిగేదేమీ లేదు. రైతుభరోసా విషయంలో రైతులు అమాయకులనుకుంటున్నాడు ముఖ్యమంత్రి. కేవలం పద్దెనిమిది వేల కోట్ల రూపాయిలు మాత్రమే కేటాయిస్తావా..?, ఆరు వాయిదాలకు నాల్గు వాయిదాలు మాత్రమే ఇస్తుండు. మిగిలిన రెండు వాయిదాలు ఎగ్గొట్టే ప్లాన్ వేసిండు. ఈ ఒక్కసారిచ్చి పాతదివ్వక, వచ్చేదివ్వక ఖేల్ ఖతం, దుకాణం బంద్ అంటుడు ఈ ముఖ్యమంత్రి. రైతుకూలీలకు 12 వేలిస్తామని చెప్పి ఏమైందిప్పుడు..?బీఆర్ఎస్ చేసిన 8 లక్షల కోట్లు అప్పు తీరుస్తామన్నవాడు.. ఇంకా అదే పాట పాడుతున్నాడు. ఆరు గ్యారంటీలు గాలికొదిలేసిండు ఈ సీఎం. ఇంకా లక్ష కోట్ల అప్పు చేస్తానని చెబుతుండు.. బీఆర్ఎస్ ఏం ఇచ్చిందని గాడ్ది గుడ్డు చూపిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా గాడ్ది గుడ్డు చూపించిండు’ అని ధ్వజమెత్తారు. -
మహారాష్ట్రలో మరో రాజకీయ దుమారం..!
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో రాజకీయ దుమారం చెలరేగింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ మర్చంట్ నేవీ ఆఫీసర్, స్వయం ప్రకటిత జ్యోతిష్కుడు అశోక్ ఖారత్‌తో ఆ రాష్ట్ర మహిళా చైర్పర్సన్ రూపాలి చకాంకర్ కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రాజకీయ వివాదం చెలరేగింది. మహిళా చైర్‌పర్సన్స్ పదవికి రూపాలి రాజీనామా చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. చైర్పర్సన్ పదవికి చకాంకర్ తక్షణమే రాజీనామా చేయాలని వివిధ రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.ప్రస్తుతం మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రుపాలి చకాంకర్.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో ఉన్నారు. అజిత్ పవార్ వర్గానికి చెందిన నాయకురాలు. మహారాష్ట్ర అధికార పార్టీలో బీజేపీ, శివసేన(ఏక్నాథ్ షిండే), అజిత్ పవార్ ఎన్సీపీలు భాగస్వాములుగా ఉన్నాయి. ఇదిలా ఉంచితే, ఆ రిటైర్డ్ మర్చంట్ నేవీ ఆఫీసర్ అశోక్ ఖారత్.. ఓ మహిళను ఆస్ట్రాలజీ పేరుతో మోసం అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆమె బెదిరించి, భయపెట్టి గత మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే బుధవారం పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఒక పెన్‌డ్రైవ్‌లో 58 వీడియోలు, అందులో కొన్ని అభ్యంతరకరమైన క్లిప్స్ కూడా ఉన్నట్లు కనుగొన్నారు. తన రాజకీయ-సామాజిక సంబంధాలను ఉపయోగించి, ఆధ్యాత్మిక కర్మకాండల పేరుతో వారిని దుర్వినియోగం చేసినట్లు అధికారులు తెలిపారు. అత్యాచారం, బెదిరింపు సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అదనంగా, మహారాష్ట్రలో అమలులో అఘోరి ఆచారాలు, నల్లమంత్రికలు వంటి అమానుష పద్ధతుల నిర్మూలన చట్టం కింద కూడా అతనిపై కేసులు పెట్టారు.అయితే ఇప్పుడు మహిళా చైర్పర్సన్ రూపాలి .. ‘కెప్టెన్’ అని చెప్పుకునే సదరు ఆస్ట్రాలజర్ అశోక్‌తో దిగిన ఫోటోలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. -
‘జాబ్ క్యాలెండర్‌ను లోకేష్ జోక్ క్యాలెండర్‌గా మార్చేశారు’
సాక్షి, తాడేపల్లి: నారా లోకేష్ జాబ్ కేలండర్‌ని జోక్ కేలండర్‌గా మార్చారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆ కేలండర్లో డేట్లు ఉన్నాయి.. గానీ ఉద్యోగాల డేటా లేదు. తూతూమంత్రంగా 10 వేల ఉద్యోగాలు ప్రకటించి చేతులు దులుపున్నారు. లోకేష్, చంద్రబాబే కొన్ని వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని గతంలో చాలాసార్లు చెప్పారు. మాటల్లో మాత్రం గ్లోబల్ లెవల్లో మాట్లాడతారు. చేతల్లో మాత్రం ఏమీ ఉండదు’’ అంటూ తాటిపర్తి ధ్వజమెత్తారు.‘‘నారా వారు కాదు.. నీరో వారని నిరూపించుకున్నారు. నిరుద్యోగ భృతి రెండేళ్లుగా ఇవ్వలేదు. లోకేష్ చదువుకున్న వ్యక్తి కాదు.. చదువుకొన్న వ్యక్తి. అందుకే నిరుద్యోగుల కష్టాలు ఆయనకు తెలియవు. అరచేతిలో వైకుంఠం చూపించటం తప్ప లోకేష్ చేస్తున్నది లేదు. అర్హత లేని లోకేష్, పవన్ కళ్యాణ్ మంత్రులు అయ్యారుగానీ నిరుద్యోగులకు ఉద్యోగాల్లేవ్..వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను చంద్రబాబు తీసేశారు. ఔట్ సోర్సింగ్‌లోనే 9 వేల ఉద్యోగాలు తొలగించారు. ఏపీ ఫైబర్‌లో 2 వేల మంది ఉద్యోగులను తొలగించారు. రేషన్ వాహనాల్లో పని చేసే 2,900 ఉద్యోగులను తొలగించారు. బేవరేజ్ కార్పొరేషన్‌లోని 18 వేల మందిని తొలగించారు. తొలగించటమే తప్ప చంద్రబాబు ఇచ్చేదేమీ ఉండదు. గ్రూప్-2 కోసం ఏళ్లుగా ఎదురు చూస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. నిరుద్యోగుల జీవితాలతో లోకేష్ బంతాట ఆడుకుంటున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ భృతి పేరుతోనూ మోసం చేశారు. బడ్జెట్లో నిరుద్యోగ భృతికి కేటాయింపుల్లేవ్. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఊసే లేదు. వారి సమస్యలను పట్టించుకునే పరిస్థితే లేదు’’ అంటూ తాటిపర్తి చంద్రశేఖర్ దుయ్యబట్టారు. -
భట్టి బడ్జెట్.. అంతా బోగస్: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: భట్టి బడ్జెట్ బోగస్ బడ్జెట్ అని అర్థమవుతోందని.. ఈ బడ్జెట్లో సకల జనులకు దక్కింది గుండు సున్నా అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మండిపడ్డారు. ‘‘మీ ప్రభుత్వంలో స్కాములు తప్ప.. స్కీములు ఉన్నాయా?. మూడేళ్లు కూడా నిండకముందే రూ.3 లక్షల కోట్లు అప్పు చేశారు. వెనుక ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోపెట్టుకుని రాజ్యాంగ విలువలపై మాట్లాడటం సిగ్గుచేటు’’ అంటూ హరీష్‌రావు దుయ్యబట్టారు.‘‘టెండర్ల మీద ఉన్న ప్రేమ పేదల మీద లేదు. పాలన గాడి తప్పడంతో తలసరి ఆదాయం తగ్గింది. బడ్జెట్ ప్రజల్ని తీవ్ర నిరాశపరిచింది. ఆరు గ్యారెంటీలకు నిధుల కేటాయింపు జరగలేదు. గత బడ్జెట్లో నిధులు కేటాయింపు చేసినా ఖర్చు చేయలేదు. తిరిగి ఈ బడ్జెట్లో అదే పాట పాడారు. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై శ్వేత పత్రం ఇవ్వాలని డిమాండ్ చేసినా.. పట్టించుకోలేదు. క్యూర్,ప్యూర్,రేర్ పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారు. తెలంగాణను మూడు ముక్కలు చేశారు. హైదరాబాద్‌ను మూడు ముక్కలు చేశారు. బడ్జెట్ అంతా బోగస్ అని తేలిపోయింది, ముచ్చటంతా మూడు ముక్కలాట కోసమే ఆరు గ్యారెంటీలపై లేదు’’ అని హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘ఉగాది రోజు కూడా చంద్రబాబు అబద్ధాలు’
తిరుపతి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉగాది పండుగ నాడు కూడా అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక జనం నవ్వుతున్నారని సిగ్గులేకుండా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. ‘జగనన్న పాలనలో ప్రతి పేదవాడు,ఉద్యోగి, రైతు, సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక మొదటి రోజు నుంచి సూపర్ సిక్స్ అని ,మ్యానిఫెస్టోలో పెట్టారు. సూపర్ సిక్స్‌తో సూపర్ మోసం చేశారు. 18 ఏళ్లు దాటిన మహిళలకు 1500 ఇస్తామని,మోసం చేశారు. రైతులుకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఎక్కడైనా ఇచ్చారా..? ఏవిధంగా సంతోషంగా ఉంటారు. నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఎవరు సంతోషంగా లేరు. కూటమి ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సిగ్గులేని బీఆర్ నాయుడు.. చైర్మన పదవి నాకు ఏమైనా అన్నం పెడుతుందా అంటాడు.. హైదరాబాద్‌లో వ్యాపారాలు ఉన్నాయి అంటాడు.. అర్హత లేని వాళ్లకు గౌరవం ఇస్తే ఇలానే ఉంటుంది.. రాజీనామా చెయ్.. బీఆర్ నాయుడు లాంటి అర్హత లేని వాళ్లను తరిమి తరమి కొట్టాలి’ అని ఆర్కే రోజా విమర్శించారు. -
బీజేపీ టికెట్ అడిగా: ఆర్జీ కర్ బాధితురాలి తల్లి
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్య విద్యార్థిని రేప్, హత్య ఘటనలో బాధితురాలి తల్లికి ఈసారి టికెట్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. పనిహాతీ నియోజకవర్గం నుంచి ఈమెను బరిలో దింపాలని విపక్ష బీజేపీ గతంలో నిర్ణయించుకున్నా అందుకు అప్పట్లో ఈమె తన సమ్మతి తెలపలేదు. తాజాగా రంగంలోకి దూకాలని నిర్ణయించుకున్నట్లు ఆమె గురువారం ప్రకటించారు. ‘‘మమతా బెనర్జీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే హత్యాచార ఘటనలో మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. నా కూతురు విషయంలో న్యాయపోరాటంలో భాగంగా బరిలోకి దిగుతా. పనిహాతీ నియోజకవర్గం నుంచి నాకు టికెట్ ఇవ్వాలని బీజేపీ నాయకులను వ్యక్తిగతంగా అడిగాను. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ నాకు అవకాశం కల్పిస్తే బెంగాల్లో తణమూల్ ప్రభుత్వాన్ని ఓడించి మహిళలకు భద్రత కల్పించడానికి ప్రయత్నిస్తాను’’ అని ఆమె అన్నారు. కాగా, బీజేపీ తాజాగా విడుదల చేసిన బీజేపీ రెండో జాబితా లోనూ ఆమె పేరు లేదు.కచ్చితంగా టికెట్ వస్తుందిబాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. తన భార్య అభ్యర్థిత్వం గురించి బీజేపీ నాయకులతో ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిగాయన్నారు. తాము లాంఛనంగా పార్టీలో చేరిన తర్వాతే తన భార్యను అభ్యర్థిగా ప్రకటిస్తారని వెల్లడించారు. తమకు కచ్చితంగా పోటీ చేసే అవకాశం బీజేపీ కల్పిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మహిళల భద్రత కోసం పోరాడటానికే తన భార్య ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తోందని చెప్పారు. 112 మందితో బెంగాల్లో బీజేపీ రెండో జాబితా న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ శాసనసభలో పోటీచేసే 112 మంది అభ్యర్థులతో బీజేపీ తమ రెండో జాబితాను గురువారం విడుదలచేసింది. హింగాల్‌గంజ్‌లో రేఖా పాత్రాను, సోనార్పూర్ దక్షిణ్‌లో రూపా గంగూలీని బీజేపీ బరిలోకి దింపుతోంది. ఇతాహర్లో సబితా బర్మన్, నబగ్రామ్‌లో దిలీప్ సాహా, ఖర్గ్రామ్లో మిథాలీ మాల్, కండీలో గర్గీదాస్ ఘోష్‌ను పోటీకి నిలబెడుతున్నట్లు బీజేపీ ఒక ప్రకటనలో పేర్కొంది.భరత్పూర్ నుంచి అనామికా ఘోష్, బొంగావ్ దక్షిణ్ నుంచి స్వపన్ మజూందర్, కమర్హాతిమ్ నుంచి అరూప్ చౌదరీ, సందేశ్‌ఖాలీ నుంచి సనత్ సర్దార్, మందిర్బజార్ నుంచి మల్లికా పైక్, ఎంటలీ నుంచి ప్రియాంకా తిబేరేవాల్, బాలాగఢ్ నుంచి సుమనా సర్కార్ పోటీకి నిలబడుతున్నారు. చదవండి: కేరళ సీఎం విజయన్ ఆస్తులు ఎంతో తెలుసా? -
బడ్జెట్ అంతా మోసం.. చెవిలో పువ్వులు పెట్టుకుని..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. బడ్జెట్ అంతా మోసం అంటూ చెవులకు పువ్వులు పెట్టుకుని అసెంబ్లీ ఎంట్రీ మెట్ల వద్ద నిరసన చేపట్టారు. బీసీ, ఎస్సీ సబ్ ప్లాన్లు మోసం మోసం అంటూ నినాదాలు చేశారు.ఆరు గ్యారెంటీలు మోసం మోసం అంటూ నినాదాలు.. 420 హామీలు మోసం మోసం. ఉద్యోగులకు సీఆర్సీ మోసం మోసం.. మహిళలకు మోసం.. మోసం’’ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం ప్రారంభించగానే బీఆర్ఎస్ సభ్యులు నిరసన చేపట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కూడా నిరసనకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ప్రభుత్వం హామీలను విస్మరించిందంటూ నినాదాలు చేశారు. -
శశికళ వెన్నుపోటు.. ‘నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్’!
తెలుగు రాష్ట్రాల్లో తరచూ వినిపించే వెన్నుపోటు రాజకీయాలు ఇప్పుడు తమిళనాట ప్రభావాన్ని చూపిస్తున్నాయి. జయలలిత మరణం తర్వాత ఆమె నెచ్చెలి శశికళ రాజకీయంగా ఒంటరయ్యారు. అప్పట్లో ఆమెకు మద్దతుగా నిలిచిన ఆర్బీ ఉదయ్‌కుమార్ ఇప్పుడు అదే శశికళ వ్యూహాలకు బలవుతున్నారా? ఆనాడు అండగా నిలిచిన ఉదయ్ ఓటమికి శశికళ పావులు కదుపుతున్నారా? అందుకే ఆమె తిరుమంగళం నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారా? ఇప్పుడు దక్షిణ తమిళనాడులో.. ఇంకా చెప్పాలంటే మదురైలో ఇదే చర్చ జరుగుతోంది.మదురై జిల్లాలోని తిరుమంగళం నియోజకవర్గానికి వీఐపీ అసెంబ్లీ సెగ్మెంట్‌గా పేరుంది. ప్రస్తుత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. శశికళ ఇప్పుడు ఈ నియోజకవర్గంపై దృష్టిసారించడం ఇందుకు ప్రధాన కారణం. శశికళ శిష్యుడు, మాజీ మంత్రి, ప్రస్తుతం ప్రతిపక్ష ఉపనేత అయిన ఆర్బీ ఉదయ్‌కుమార్‌ని ఓడించేందుకు శశికళ వ్యూహాలకు పదునుపెడుతున్నారనే చర్చ తిరుమంగళంలో జరుగుతోంది. నిజానికి ఉదయ్‌కి ఈ నియోజకవర్గం కంచుకోటగా మారింది. ఇప్పటి వరకు రెండుసార్లు అప్రతిహతంగా విజయం సాధించారు. ముచ్చటగా మూడోసారి విజయం సాధించి, హ్యాట్రిక్ కొట్టాలని తహతహలాడుతున్నారు.జయలలిత మరణం తర్వాత.. శశికళకు మద్దతుగా నిలిచిన వారిలో ఉదయ్ ముందంజలో ఉంటాడు. అయితే.. ఆ తర్వాత వీరి మధ్య దూరం ఎందుకు పెరిగింది?? ఈ ప్రశ్నకు తదనంతర పరిణామాలే ప్రధాన కారణమనే సమాధానం వస్తోంది. జయ మరణం తర్వాత ఎడప్పాడి పళనిస్వామి సీఎం అయ్యారు. దాంతో.. ఉదయ్ ఆయన వర్గానికి దగ్గరయ్యారు. అయితే.. ఇప్పుడు పరిణామాలు మారిపోయాయి. సొంతపార్టీలోనే వ్యతిరేకులు ఉన్నారు. అంతేకాదు.. పొత్తుధర్మంలో భాగంగా ఈ సీటును ఎన్డీయేకు ఇవ్వడానికి కూడా పళనిస్వామి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ తనకే టికెట్ దక్కినా.. ఉదయ్‌ని ఓడించడమే లక్ష్యంగా శశికళ పావులు కదుపుతున్నారు. దీంతో.. ఉదయ్ విజయం అంత సులభమేమీకాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పైగా.. ఇక్కడ దళపతి విజయ్ పార్టీ టీవీకే చాపకింద నీరులా విస్తరిస్తోంది. అటు పన్నీర్ సెల్వం డీఎంకేలో చేరాక.. తిరుమంగళంలో కూడా పరిణామాలను అంచనావేసే పరిస్థితి లేదని విశ్లేషకులు చెబుతున్నారు.జయలలితకు నెచ్చెలిగా ఉంటూ.. రాజకీయాలను బాగా వంటబట్టించుకున్న శశికళ.. ఇప్పుడు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో ముందుకు వస్తున్నారు. టీటీవీ దినకరన్ పార్టీ ఏఎంఎంకే నుంచి బహిష్కరణకు గురైన సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయన్సర్ జీవా నాచియార్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న జీవా నాచియార్ ముక్కులత్తోర్ ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే వర్గానికి చెందిన ఉదయ్‌కుమార్‌కు ఇది ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. అదే సమయంలో పన్నీర్ సెల్వం కూడా ఉదయ్ వర్గీయులపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించారు. ఉదయ్ మద్దతుదారులను డీఎంకేలో చేర్చుకున్నారు. ఈ పరిణామాలు పళనిస్వామి వర్గానికి ఆగ్రహం తెప్పిస్తోంది.ఒకప్పుడు ఉదయ్ మద్దతుదారులుగా ఉన్నవారు ఇప్పుడు పళనిస్వామికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఈ పరిణామాలను తట్టుకుని ఉదయ్ విజయం సాధించి, హ్యాట్రిక్‌ను నమోదు చేసుకుంటారా? శశికళ తన వ్యూహాన్ని పక్కాగా అమలు చేసి, విజయం సాధిస్తుందా? పిట్టపోరు పిల్లి తీర్చిన చందంగా.. వీరి వివాదం మూడో వ్యక్తి విజయానికి బాటలు వేస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే.. ఎన్నికల ఫలితాల వరకు వేచిచూడాల్సిందే..! -
జలుక్బరి నుంచి హిమంత బిశ్వ శర్మ పోటీ
న్యూఢిల్లీ: అసోం అసెంబ్లీ ఎన్నికల కోసం 88 మంది అభ్యర్థులతో కూడిన తన తొలి జాబితాను బీజేపీ గురువారం విడుదల చేసింది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పేరు కూడా ఉంది. జలుక్బరి నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగనున్నారు. తొలి జాబితాలో 11 మంది ఎమ్మెల్యేలకు చోటు దక్కలేదు.బుధవారమే బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ నాయకుడు ప్రద్యుత్ బోర్డోలోయ్‌ను దిస్పూర్ అసెంబ్లీ స్థానం నుంచి తమ అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీని వీడి ఇటీవల బీజేపీలో చేరిన భూపేన్ కుమార్ బోరా, బిహ్‌పురా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.అసెంబ్లీ స్పీకర్ బిశ్వజిత్ డైమరీ తముల్పూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. జోర్హాట్ స్థానంలో మాజీ స్పీకర్ హితేంద్ర నాథ్ గోస్వామి, గౌరవ్ గోగోయ్‌తో తలపడనున్నారు. రాష్ట్ర మంత్రులు పిజూష్ హజారికా, జయంత మల్లా బారుహ్, అశోక్ సింఘాల్, అజంతా నియోగ్, చంద్రమోహన్ పట్వారీ, రూపేష్ గోవాలా తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. హఫ్లాంగ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న నందితా గర్లోసా ఈసారి అక్కడ నుంచి బరిలోకి దిగడం లేదు. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సిద్ధార్థ భట్టాచార్యకు ఆయన ప్రస్తుత స్థానమైన గౌహతి తూర్పు నుంచి పోటీ చేసే అవకాశం దక్కలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అమియా కుమార్ భూయాన్ (బిహ్పురియా), అతుల్ బోరా (దిస్పూర్)లకు మొండిచేయి చూపారు. ఈ రెండు స్థానాల నుంచి ఫిరాయింపుదారులు బోరా, బోర్డోలోయ్‌లకు టికెట్ ఇచ్చారు. కాగా, అసోం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 9న జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడతాయి.చదవండి: కేరళ సీఎం విజయన్ ఆస్తులు ఎంతో తెలుసా? -
కేరళ కాంగ్రెస్‌లో ‘కుంపటి’?
తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలో అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ నాలుగు రోజుల అంతర్గత చర్చల తర్వాత మొత్తం 92 అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. చివరగా 37 మంది పేర్లను గురువారం రాత్రి ప్రకటించింది. దీంతో, సీటు దక్కని నేతలు అసంతృప్తి వ్యక్తమవుతున్నట్టు సమాచారం. నేమోం, కన్నూర్, పెరుంబవూర్ వంటి కీలక నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది.అయితే, కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో భాగంగా కన్నూర్ అసెంబ్లీ స్థానం నుంచి కేపీసీసీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఎంపీ కే.సుధాకరన్‌కు టికెట్ ఇవ్వలేదు. ఆయన సూచించిన అభ్యర్థి కూడా తిరస్కరించబడ్డారు. బదులుగా కన్నూర్ మేయర్ మోహనన్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. ఈ క్రమంలో ఎంపీ సుధాకరన్ స్పందిస్తూ.. పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చారు. అలాగే, స్వతంత్రంగా పోటీ చేయను అని కూడా వెల్లడించారు. అయితే, ఆయన అనుచరులు మాత్రం అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనకు మద్దతుగా కొంతమంది ఎంపీలు కూడా ఉన్నారని సమాచారం.ఇక, మరో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎల్దోస్ కున్నాపిల్లిల్ పెరుంబపూర్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. అక్కడి అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ దక్కకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఎల్దోస్ మాట్లాడుతూ.. పార్టీ కింద స్థాయి కార్యకర్త వరకు నన్ను అభ్యర్థిగా కోరుకుంటున్నారు. మేము మా నియోజకవర్గంలో దాదాపు 9,000 కొత్త ఓటర్లను జమ చేశాం. 15,000 ఇళ్లను సందర్శించాం. కానీ నా కృషిని హైకమాండ్ పట్టించుకోలేదు. అయినప్పటికీ, పార్టీని వదిలిపెట్టను. ఇది కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, పెరుంబవూర్‌లో ఎల్డోస్ స్థానంలో మనోజ్ మూథేదన్ను కాంగ్రెస్ పోటీలో నిలిపింది.మరోవైపు.. నేమోం నియోజకవర్గంలో కాంగ్రెస్ కేఎస్ సబరీనాథన్‌ను బరిలో నిలిపింది. ఇక్కడి నుంచే కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ పోటీలో ఉన్నారు. ఇక, సీపీఎం నుంచి శివంకుట్ట పోటీ చేస్తున్నారు. నేమోం నియోజకవర్గం గత ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీని ప్రతిబింబిస్తున్నాయి. 2016లో బీజేపీ నుంచి రాజగోపాల్ మొదటిసారి విజయం సాధించగా, 2021లో సీపీఎం తిరిగి సీటు గెలుచుకుంది. 2021లో సీపీఎం నుంచి శివంకుట్టి విజయం సాధించారు. 2006లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మొత్తంగా కాంగ్రెస్ జాబితాపై పలువురు అభ్యర్థులు అసంతృప్తితో ఉన్నట్టు కార్యకర్తలు బహరంగంగానే చెబుతున్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ, పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని అంగీకరించి, నేతలు చివరికి విధేయత చూపుతున్నారు. -
దురంధర్గా ఇళయ దళపతి విజయ్?
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైందే తడవుగా తమిళనాట రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. ముఖ్యంగా వరుసగా రెండోసారి విజయం కోసం డీఎంకే సారథి ఎంకే స్టాలిన్ సిద్ధమవుతుండగా.. ఎన్డీయేతో పొత్తు ఉన్నప్పటికీ అన్నాడీఎంకే తడబడుతోంది. జయలలిత మరణానంతరం ఆ పార్టీకి సరైన దిశానిర్దేశం చేసే నేత లేరనే అపవాదును పళనిస్వామి కొంత వరకు దూరం చేస్తున్నా.. పొత్తు ధర్మంలో స్వతంత్ర నిర్ణయాలు పనికి రావనే విషయాలను విస్మరిస్తున్నారు. దీంతో డీఎంకే ఆయనను పది ఓటముల పళనిస్వామి అని హేళన చేస్తుండగా.. అన్నాడీఎంకే నేతలు మాత్రం అధికార పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలంటే.. మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు తప్పనిసరి. పళనిస్వామి మాత్రం అన్నాడీఎంకే ఆ లక్ష్యాన్ని సునాయాసంగా సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. అన్నాడీఎంకే పొత్తు ధర్మాన్ని పాటించాల్సిందే. ఎన్డీయే కూటమిలో ఉన్న అన్నాడీఎంకేకి సీట్ల సర్దుబాటు కలిసి వస్తుందా? తలనొప్పిని తెచ్చిపెడుతుందా? అనేది ఇంకా తేలాల్సి ఉంది. అదే సమయంలో సినీనటుడు విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కళగంతో పొత్తుకోసం బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. దక్షిణాదిలో పాగా కోసం తహతహలాడుతున్న బీజేపీ.. విజయ్‌కి పెద్దపీట వేసే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే.. ఆ పరిణామం అన్నాడీఎంకేకు ప్రతికూలంగా మారే ప్రమాదం లేకపోలేదని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దళపతి విజయ్ రాజకీయ దురంధురుడుప్రస్తుతానికి విజయ్ మాత్రం తాను బీజేపీతో కలిసే ప్రసక్తే లేదంటున్నారు. అయితే.. రాజకీయాల్లో చివరి క్షణం వరకు సమీకరణాలు ఎలామారిపోతాయో పసిగట్టడం కష్టమే..! ఒకవేళ బీజేపీతో కలిసి వెళ్లాలని టీవీకే భావిస్తే.. అన్నాడీఎంకే పొత్తుధర్మంలో భాగంగా పలు స్థానాలను మిత్రపక్షాలకు వదిలేయాల్సి ఉంటుంది. దాంతో.. పార్టీలో రెబెల్స్ పుట్టుకొచ్చి, మరింత తలనొప్పిని తెచ్చిపెట్టే ప్రమాదం లేకపోలేదు. మరోవైపు బీజేపీ మాత్రం తమిళనాట పాగా వేయడమే పరమావధిగా భావిస్తూ.. దళపతి విజయ్‌ని తమిళ రాజకీయ దురంధరుడిగా భావిస్తోంది. అంటే.. పొత్తు కుదిరితే.. ఎన్డీయే ఘనవిజయం సాధిస్తే.. కింగ్ మేకర్ విజయ్ అవుతారన్నమాట..!సామ, దాన, బేధ, దండోపాయాలతో ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ భావిస్తే.. రాజనీతిని ప్రయోగిస్తుంది. రాజనీతిలో అత్యంత కీలకమైన నియమం.. సామ, దాన, బేధ, దండోపాయాలను అందిపుచ్చుకుంటుందని సమాచారం. నామినేషన్ల తేదీ సమీపిస్తున్నా.. అన్నాడీఎంకే తన అభ్యర్థులను ప్రకటించలేదు. ఇప్పుడు తమిళనాట విజయం అనేది అన్నాడీఎంకేకు సీట్ల కేటాయింపు సమస్యే కాదు.. ఒకవేళ మళ్లీ ఓటమిపాలైతే పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం లేకపోలేదు.ఎన్డీయే కూటమిలో దళపతి విజయ్?ఒకవేళ ఎన్డీయే కూటమిలో దళపతి విజయ్ చేరితే.. అన్నా డీఎంకే పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఈ ప్రశ్నలు తమిళ తంబీలను వేధిస్తోంది. అటు డీఎంకే కూడా ఈ పరిణామాలను అత్యంత సమీపం నుంచి పరిశీలిస్తోంది. అయితే.. అన్నాడీఎంకే వర్గాల మేరకు.. ఆ పార్టీ కచ్చితంగా తమకు 130 సీట్లు కావాలనే డిమాండ్‌ను బీజేపీ ముందు పెడుతుంది. పట్టణ, నగర ప్రాంతాల్లో బీజేపీ కొద్దోగొప్పో పుంజుకుంటోంది. టీవీకే విజయ్‌కి కూడా అక్కడ ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా ఉంది. అందుకే.. పళనిస్వామి తనకు పట్టున్న ప్రాంతాలను కోరే అవకాశాలున్నాయి.అగమ్య గోచరంగా అన్నాడీఎంకే అవి.. అన్నాడీఎంకేకు సంప్రదాయ ఓటు బ్యాంకు ఉన్న కొంగు ప్రాంతం. అంటే పశ్చిమ తమిళనాడులోని నియోజకవర్గాలు. అదేవిధంగా దక్షిణ జిల్లాల్లోనూ అన్నాడీఎంకేకు మంచి పట్టున్నప్పటికీ.. మదురై, ఈరోడ్, దిండిగల్, థేని వంటి ప్రాంతాల్లో టీవీకేకు ఆదరణ పెరుగుతోంది. దీంతో ఆ ప్రాంతాల్లో అన్నాడీఎంకేకు పరిమిత సీట్లే దక్కే అవకాశాలున్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతాలన్నీ అన్నాడీఎంకేకు కంచుకోటల్లాంటివి. ఇప్పటికీ అక్కడ సంప్రదాయ ఓటర్లున్నా.. పొత్తు ధర్మంలో భాగంగా ఆ స్థానాలను కోల్పోతే.. పార్టీ ఆదరణ క్రమంగా తగ్గిపోయే ప్రమాదం లేకపోలేదు.మొత్తానికి ఇప్పుడు టీవీకే తమిళనాడులో అన్నాడీఎంకే పాలిట శరాఘాతంగా మారుతోంది. టీకప్పులో తుఫానును పుట్టిస్తోంది. పొత్తు ఉన్నా.. లేకున్నా.. అన్నాడీఎంకే పట్టున్న ప్రాంతాల్లో పాగావేసి, పెను విధ్వంసం సృష్టించేలా ఎదిగే ప్రమాదముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లైతే.. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. -
అభ్యర్థులుగా నటీమణులు.. ఓటర్ లిస్టులో పేర్లు మాత్రం..
కొచ్చి: కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎర్నాకుళం జిల్లాలో ఎన్డీఏకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఎన్డీఏలోని ‘ట్వంటీ20’ అనే పార్టీకి ట్విస్ట్ ఎదురైంది. ట్వంటీ20 పార్టీ ప్రకటించిన ఇద్దరు అభ్యర్థుల పేర్లు ఓటర్ల జాబితాలో లేవు. దీంతో వారు పోటీకి అనర్హులు.పెరుంబవూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ‘ట్వంటీ20’ అభ్యర్థిగా నటి లక్ష్మీ ప్రియ పేరును ఆ పార్టీ ప్రకటించింది. ఆమె ప్రచారం కూడా మొదలుపెట్టారు. అయితే, లక్ష్మీ ప్రియ పేరు ఓటర్ల జాబితాలో లేదన్న విషయం బయటకు వచ్చింది. దీంతో తాజాగా నిర్వహించాలనుకున్న రోడ్‌షోను చివరి నిమిషంలో రద్దు చేశారు. మొదట రోడ్ షో రద్దు లక్ష్మీ ప్రియకు ఆరోగ్య సమస్యలే కారణమని, అందుకే ప్రచారంలో పాల్గొనలేదని అన్నారు. లక్ష్మీ ప్రియ పేరు ఓటర్ల జాబితాలో లేదన్న విషయం బయటకు రావడంతో దీనిపై ‘ట్వంటీ20’ పార్టీ సీనియర్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలో ఆమె పేరు లేకపోవడం నిజమైతే పెరుంబవూర్‌లో మరో అభ్యర్థిని నిలబెట్టాల్సి రావచ్చని తెలిపారు. ఇవాళ లక్ష్మీ ప్రియ స్థానంలో జీబీ వర్గీస్ పతిక్కల్ను ట్వంటీ20 పార్టీ పెరుంబవూర్ అభ్యర్థిగా ప్రకటించింది.లక్ష్మీప్రియ ప్రస్తుత నివాసం త్రిపుణితుర సమీపంలోని కారింగచిరలో ఉంది. ఆమె పేరు ఓటర్ల జాబితాలో నిజంగానే లేదని తెలిసింది. ఆమె గతంలో నివసించిన త్రిక్కాకరలో కూడా ఓటరు జాబితాలో ఆమె పేరు లేదు. దీనిపై ఆమె ఇప్పటివరకు స్పందించలేదు.లక్ష్మీ ప్రియ వివాదం మరవకముందే..లక్ష్మీ ప్రియ ఘటనను మరవకముందే అదే ట్వంటీ20 పార్టీలో అటువంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఎట్టుమనూరు నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా నటి వీణా నాయర్‌ను ప్రకటించారు. అయితే, ఆమె పేరు కూడా ఓటర్ల జాబితాలో నమోదు కాలేదని బయటపడింది. ఆమె స్థానంలో మరో అభ్యర్థిని నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వీణా నాయర్ స్థానంలో కొత్త అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. తాను పోటీ చేయడం లేదని వీణా నాయర్ తెలిపారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేని ఇద్దరు సినీ నటీమణులను అభ్యర్థులుగా ప్రకటించడం ఎన్డీఏకు ఇబ్బందికరంగా మారింది. మరోవైపు, త్రిపుణితుర నియోజకవర్గంలో నటి అంజలిని ట్వంటీ20 పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది. అక్కడ ఆమె ప్రచారం ఇప్పటికే ప్రారంభమైంది. -
షర్మిల మాటలు హద్దులు దాటుతున్నాయి: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: గత మూడు, నాలుగేళ్లుగా షర్మిల, సునీత.. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్న షర్మిలమ్మ మాట్లాడిన మాటలు హద్దులు దాటాయన్నారు. కనీస ఆలోచన లేకుండా హద్దులు దాటి సొంత అన్నపై వ్యక్తిత్వ దాడి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘వైఎస్సార్ కుమార్తె, జగన్‌కు చెల్లెలు కదా అని మేం చాలా వరకూ మిన్నకుండిపోయాం. ఆమె నిన్న మాట్లాడుతూ అన్న అనే పదానికే నువ్వు కలంకం అన్నారు. ఈ మాట మమ్మల్ని చాలా బాధించింది. బట్ట కాల్చి మసి మీ అన్న ముఖాన వేసి తుడుచుకో అంటే ఒప్పుకోరు తల్లీ. అన్న అనే పదానికే ఆయన అనర్హుడు అన్న తర్వాత మీ అన్న మీకు చేసిన అన్యాయం ఏంటో మీరు చెప్పాలి. నువ్వు ఏదేదో మాట్లాడి బురద జల్లి పోతానంటే కుదరదు. నీ పట్ల మీ అన్న చేసిన అన్యాయం ఏంటో స్పష్టంగా తెలుగు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.’’ అని రాచమల్లు పేర్కొన్నారు.‘‘మీ అన్నపై ఇంతటి విషాన్ని చిమ్మడానికి ఏం కారణం..? ఏమి నీకు అన్యాయం జరిగింది..?. నాలుగు గోడల మధ్య ఏదైనా సమస్యలుంటే పరిష్కరించుకోవాల్సింది. పోయి పులివెందుల పూల అంగళ్ల సర్కిల్లో పరిచినారు. మీ ఇంట్లో ఏదైనా చర్చించుకుంటే మరుసటి రోజే ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్ ఐటమ్‌గా వస్తుంది. ఇవన్నీ వారికి ఎవరు చెప్తున్నారు. షర్మిల, సునీతల ఫోన్లు పరిశీలిస్తే ఏబీఎన్ రాధాకృష్ణ, చంద్రబాబుతో టచ్‌లో ఉన్న విషయం ఇట్లే బయటపడుతుంది. మీ తండ్రి చనిపోతే సంతోషించిన చంద్రబాబు లాంటి వ్యక్తితో మీరు చెలిమి చేస్తారా?. అన్న అనే పదానికే కళంకం తెచ్చాడంటున్న నీవు నీకు ఏ విషయంలో అన్యాయం చేశాడు..?’’ అంటూ రాచమల్లు ప్రశ్నించారు.‘‘ఆస్తి విషయంలో చేశాడా..? అధికారం విషయంలో అన్యాయం చేశాడా..?. వైఎస్సార్ 2004లో అఫిడవిట్లో చూపించిన ఆస్తులు 2009లో లేవు. ఈ మధ్య కాలంలో రాజశేఖరరెడ్డి తన ఆస్తులను నీకు, జగన్‌కు పంచేశారు. మీ తండ్రి చట్ట ప్రకారం మీ అన్నకు, నీకు సమానంగా ఆస్తులు పంచారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఇళ్లు షర్మిలమ్మకే ఇచ్చారు. ఇడుపులపాయలో 51 ఎకరా వ్యవసాయ భూమిని షర్మిల పేరుతో రిజిస్టర్ చేయించారు. 15 మెగావాట్ల ఎస్సారెస్ స్మాల్ హైడ్రో ప్రాజెక్టు ఆమెకే ఇచ్చారు. స్వస్తిక్ హైడ్రో పవర్ ప్రాజెక్టునూ ఆమెకే ఇచ్చాడు...విజయవాడ యువరాజ్ థియేటర్లో 36 శాతం భాగం షర్మిలమ్మకే రాసిచ్చాడు. పులివెందులలో 7 ఎకరాల 60 సెంట్ల స్థలాన్ని ఆమెకే రాసిచ్చారు. విజయలక్ష్మి ట్రేడ్ అండ్ మినరల్స్ వంద శాతం వాటా ఆమెకే ఇచ్చేశారు. రాజారెడ్డి గారి హయాం నుంచి రైల్వే కోడూరులో ఉన్న ఇంటిని కూడా ఆమెకే రాసిచ్చాడు. రైల్వే కోడూరు మండలం శెట్టిగుంటలో 90 ఎకరాల వ్యవసాయ భూమిని ఆమెకే ఇచ్చారు. ఇలా నీకు సగం వాటాను ఇస్తుంటే అంగీకరించడం అనేది జగన్ గొప్పతనం. మీరిద్దరూ ఒకే కడుపున పుట్టారు కాబట్టి మీ అన్న ఒప్పుకున్నాడు అంటే సరే.. మీ వదిన ఎలా ఒప్పుకుంది..?..సమాజంలో ఏ ఇంటి కోడలూ ఆడబిడ్డకు సమాన ఆస్తి ఇస్తే అంగీకరిస్తుందా..?. అయినా భారతమ్మ ఒప్పుకున్నారు అంటే మీ తండ్రి, మీ అన్న కంటే వెయ్యి రెట్లు ఆమె గొప్పది. ఇన్ని ఆస్తులు తీసుకున్నందుకేనా వైఎస్ జగన్ అన్న అనే పదానికి కళంకం...?. వైఎస్సార్ మరణించినప్పటి నుంచీ నువ్వు జగన్‌తో విభేదించే వరకూ తాను సంపాదించుకున్న దాంట్లో జగన్ నీకు రూ.236 కోట్లు ఇచ్చారు...అయినా మీరు ఆయన వ్యక్తిత్వంపై దాడి చేస్తూ మా అన్న దుర్మార్గుడు అంటున్నారు. మీ అన్న ముఖ్యమంత్రిగా చేసిన పనులకు దేశమంతా పొగుడుతుంటే నువ్వు విమర్శలు చేశావు. అవన్నీ చాలవన్నట్లు వివేకానందరెడ్డి హత్య రక్తపు మరకలను జగన్ నెత్తిన వేసి ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేసేందుకు ఇంత నిందలు వేస్తావా..?. ఇవన్నీ చాలవన్నట్లు చంద్రబాబుతో చెలిమి చేస్తూ.. ఏబీఎన్ రాధాకృష్ణకు ఉప్పందించి బజారుకీడుస్తావా...?. నీకు ఎక్కడ న్యాయం ఉంది.. ఎక్కడ కృతజ్ఞత ఉందమ్మా నీకు..?. నీ స్థానంలో ఏ చెల్లి ఉన్నా జగన్ లాంటి అన్నను గుండెల్లో పెట్టుకుని ఉండేవారు...నువ్వు కొంగుపట్టుకుని జగన్‌కి, అవినాష్‌కి ఓటు వేయవద్దని పులివెందుల పూలఅంగళ్ల సర్కిల్లో అర్థించావు. అవినాష్ రెడ్డి వివేకాను చంపి ఉంటే నాకు ఓటు వేయండి.. లేదంటే అవినాష్‌కు ఓటు వేయండి అని కొంగుపట్టి మరీ అడిగావు. నువ్వు చెప్పిన మాటలు ప్రజలు నమ్మారా? అవినాష్‌రెడ్డి గెలిచాడు. నువ్వు చెప్పిన తప్పుడు మాటల వల్ల జిల్లాలో మేం ఐదుమంది ఎమ్మెల్యేలం ఓడిపోయాం. నీ లెక్క ప్రకారం వివేకా హత్యలో అవినాష్‌రెడ్డికి సంబంధం లేదని ప్రజలు నమ్మారు కాబట్టే ప్రజలు ఆయన్ను గెలిపించారు...అంతటితో ఆగకుండా చంద్రబాబు ఏ కీ ఇస్తే దాన్ని సునీతమ్మ మాట్లాడుతుంది. మూడు నాలుగు రోజుల తర్వాత మీరొచ్చి అవే మాటలు మాట్లాడతారు. జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసి ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనేదే మీ లక్ష్యం. నీకు ఆస్తి పంపకానికి ఒప్పుకుని, సొంతంగా డబ్బిచ్చి.. తన సొంత ఆస్తుల నుంచి కూడా నీకు భాగాలిస్తే.. నీకు సంతృప్తి లేదు. సరస్వతి భూముల విషయంలో ఆమె చేసిన వ్యవహారం వింటే చాలా బాధ కలుగుతుంది...జగన్‌పై కేసుల కారణంగా ఆ భూములు అటాచ్‌మెంటులో ఉంటే.. దానిలోని విజయమ్మ పేరుపై ఉన్న భూములను తన పేరుపై రాయించుకోవాలని చూశారు. దాని కోసం ఆ షేర్ కాగితాలు పోయాయని కేసు పెట్టి.. ఆ తర్వాత విజయమ్మ ఆస్తిని తన పేరుపై బదలాయింపు చేసుకుంది. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తిని బదలాయింపు చేయకూడదని అందరికీ తెలుసు. అలా చేస్తే వైఎస్ జగన్ బెయిల్ రద్దు అవుతుందని కూడా అందరికీ తెలుసు. అయినా బదలాయింపు చేశావంటే.. మీ అన్న మళ్లీ జైలుకు పోవాలనేగా..?..పగోడు పదహారు నెలలు జైల్లో పెడితే.. చెల్లెలు 32 నెలలు జైల్లో పెట్టాలనుకుంది. వైఎస్ జగన్ ఆ విషయం తెలుసుకుని ఎన్సీఎల్టీకి వెళ్లి జాగ్రత్త పడ్డాడు. ఆ కేసులో షర్మిలమ్మ ఓడిపోయింది. మళ్లీ విజయమ్మతో చెన్నై కోర్టులో కేసు వేయించింది. ఆ కేసు కాగితాలు చెన్నై కోర్టులో వేయించిన గంటకే చంద్రబాబు చేతిలో ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతి ఒక్క విషయం చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణలకు తెలుసు. షర్మిల, సునీతలు జగన్‌కు ఒక్క చెల్లెల్లే. కానీ రాష్ట్రంలో కోటి మంది మహిళలు ఆయనకు ఓటేశారు. వారంతా వైఎస్ జగన్ మాకు దేవుడిచ్చిన అన్న అంటున్నారు...వాళ్లంతా దేవుడిచ్చిన అన్న అంటుంటే రక్త సంబంధం కలిగిన నీకు మాత్రం కళంకితుడా..?. ఈ రాష్ట్రంలో షర్మిలమ్మ, సునీతలను చూసిన తర్వాత చెల్లెల్లు అంటే భయపడే పరిస్థితికి వచ్చింది. నీలాంటి చెల్లెలు కావాలని ఏ అన్నా కోరుకోడు. వారి వారి స్థాయిని బట్టి నువ్వొక్కదానివే కాదు. .మేమంతా పార్టీ కోసం కష్టపడ్డాం. షర్మిలమ్మ జగన్‌తో గొడవ పడకుండా ఉండాలంటే ముఖ్యమంత్రి పదవినే పంచాలి. అప్పుడే ఆమె శాంతిస్తుంది. ఇప్పుడు జగన్ పెట్టుబడులు, ఆస్తులు మొత్తం ఊడ్చి షర్మిలకు ఇస్తే అప్పుడు శాంతిస్తుందేమో..?. ఎక్కడన్నా జగన్ వ్యాపారాల్లో నువ్వు పెట్టుబడి పెట్టావా..? ఏమీ లేకపోయినా తన సొంత సంపాదనలో నీకు వాటా ఇచ్చాడు...మీరు టీడీపీ కండువా కప్పుకోకపోయినా.. సైకిల్ ఎక్కకపోయినా మీరు మాత్రం టీడీపీనే. వైఎస్సార్ కూతురు ఇలా టీడీపీకి వెళ్తుందని మేము కలలో కూడా ఊహించలేదు. రాష్ట్రంలో చంద్రబాబు ఇన్ని తప్పులు చేస్తున్నా, లక్షల కోట్ల అప్పులు చేస్తున్నా ఆమె ఒక్క మాట కూడా విమర్శించదు. ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ప్రశ్నించాల్సిన నువ్వు జగన్‌ను టార్గెట్ చేస్తున్నావు. ఇక మీదట మీరు జగన్ వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఎన్ని సార్లైనా మిమ్మల్ని ప్రశ్నిస్తాను. ఇక మా దృష్టిలో మీరు రాజశేఖరరెడ్డి కూతురు అని కానీ, జగన్ చెల్లెలు అని కాని ఉండదు. నాకైతే నువ్వు ఒక చెడ్డ చెల్లెలు అనే అభిప్రాయం మాత్రమే ఉంది. ఇంత మేలు చేసిన అన్నను పట్టుకుని అన్ననే పదానికే కళంకం అంటావా..?..చంద్రబాబుకు ఒక చెల్లెలు ఉందన్న విషయమే ప్రపంచానికి తెలియదు. అలాంటి చంద్రబాబు వద్దకు మాకు న్యాయం చేయండి అని ఈ చెల్లెల్లు వెళ్లారు. ఇదిగో నా చెల్లెలు షర్మిల.. నేను వదిలిన రామబాణం అని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి జగన్. నువ్వు ఇన్ని మాటలు ఆయన్ను మాట్లాడుతున్నా ఒక్క రోజు కూడా జగన్ నీపై నోరెత్తలేదు. అది ఆయన సంస్కారం.. నా చెల్లిపై మాట్లాడితే అది నాకే కదా అవమానం అనుకున్నాడు జగన్. కానీ మీరు ఒకే సారి వంద ఈటెలు తీసుకుని పొడిచినట్లు చేస్తున్నారు...తల్లికి చెల్లికి న్యాయం చేయలేనోడని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. చంద్రబాబూ అసలు నీ చెల్లెలు ఎవరో ఈ సమాజానికి తెలుసునా..?. చంద్రబాబుకు తమ్ముడున్నాడని తెలుసు.. ఆయన ఎలా చనిపోయాడో కూడా ప్రజలకు తెలుసు. చంద్రబాబుకు కుటుంబ వ్యవస్థపై గౌరవం ఉందా..? అలా ఉంటే హరికృష్ణకు, ఆయన పిల్లలకు అన్యాయం చేస్తాడా?. సొంత వారినే మోసం చేసిన చంద్రబాబు.. షర్మిలమ్మ, సునీతమ్మలకు న్యాయం చేస్తాడా..?. మీ ఇద్దరిని నడి ఏట్లోకి తీసుకెళ్లి ముంచేస్తాడు.. గుర్తుంచుకోండి...5 కోట్ల మంది ప్రజలను, సొంత కుటుంబ సభ్యులను మోసం చేసిన చంద్రబాబుకు షర్మిల, సునీతలను మోసం చేయడం ఒక లెక్కా?. ఆ చంద్రబాబు చేతిలో మోసం పోయి చిట్టచివరకు మళ్లీ ఆ అన్న వద్దకే మీరిద్దరూ చేరతారు. అన్నా.. తప్పయిందని ప్రాయశ్చిత్తం మీ అన్నా, వదిలనల వద్దకే వచ్చే రోజు ముందుంది. షర్మిలమ్మ.. అన్నతో సమానంగా వైఎస్సార్ ఆస్తులు పంచిన విషయంపై సమాధానం చెప్పాలి. నీకు అవసరం అయినప్పుడల్లా రూ.236 కోట్లు ఇచ్చినది నిజమా? కాదా? అనేది షర్మిల చెప్పాలి. జగన్, భారతీలు వివేకాను చంపారని మీరు మీ పిల్లలపై ఒట్టేసి చెప్పగలరా?. చంద్రబాబుకు కష్టం వచ్చినప్పుడల్లా.. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా సునీత, షర్మిల తెరమీదకు వస్తారు...నిజంగా షర్మిలమ్మకు చిత్తశుద్ధి ఉంటే మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మాట్లాడితే నీ సైతాన్ సైన్యం అంటున్నారు.. కానీ నువ్వు జగన్‌కు రక్తం పంచుకుపుట్టిన చెల్లివి అయినా.. మేం రక్తం పంచుకోకపోయినా చివరికి వరకూ ఆయన కోసం, ఆయన వెంటే ఉంటాం. ఆస్తులకు మీరు భాగస్థులు.. కానీ మేం అభిమానానికి భాగస్థులం.. సైతాన్ సైన్యం కానే కాము. జగన్ కోసం ప్రాణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న మమ్మల్ని పట్టుకుని సైతాన్ అంటారా..?. మన ఇంటి గుట్టును ఏబీఎన్ రాధాకృష్ణకు, చంద్రబాబుకు ఇస్తున్న మీరు తప్పు చేసిన మనుషులు. అన్ననే పదానికి కళంకం అన్నందుకు బాధతో మేం మాట్లాడుతున్నాం. అన్న అనే పదానికి, వదిన అనే పదానికి అర్థం చెప్పిన వాళ్లు జగన్, భారతమ్మలు. షర్మిలమ్మ ప్రెస్‌మీట్ పెట్టి వీటన్నిటికీ సమాధానం చెప్పాలి’’ అని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. -
ఎన్నికల వేళ విజయ్ ‘టీవీకే’కి మరో షాక్
చెన్నై: సినీనటుడు, టీవీకే అధినేత విజయ్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తమిళనాడు ఎన్నికల వేళ కూడా ఆయనకు పలువురి రూపంలో షాక్ తగులుతోంది. మొదట కరూర్ తొక్కిసలాట, ఆ తర్వాత భార్యతో విడాకులు, హీరోయిన్ త్రిష ఇష్యూ. ఇప్పుడు నటి రంజనా నాచియార్ కూడా టీవీకే పార్టీకి గుడ్‌బై చెప్పారు. అంతేగాక, ఆ పార్టీపై రంజనా తీవ్ర ఆరోపణలు చేశారు. “విజయ్ పార్టీలో మహిళలకు ఎల్లప్పుడూ అవమానం జరుగుతూనే ఉంటుంది” అని తెలిపారు. ఇవాళ రంజనా నాచియార్ టీవీకే నుంచి డీఎంకేలో చేరారు. చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమక్షంలో ఆమె డీఎంకే కండువా కప్పుకున్నారు. “టీవీకే అగ్ర నాయకులను ఎవరూ కలవలేకపోతున్నారు. పార్టీ నాయకులు కార్యకర్తల బాధను పట్టించుకోరు. పార్టీలో మహిళలకు నిరంతరం అవమానం జరుగుతోంది’’ అని రంజనా అన్నారు. డీఎంకే రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.ఆమె గతంలో బీజేపీలో సుమారు ఎనిమిది సంవత్సరాలు ఉన్నారు. 2025 ఫిబ్రవరిలో ఆ పార్టీని ఆమె వీడారు. ఆ తర్వాత టీవీకేలో చేరారు. ఇప్పుడు టీవీకేను వీడి డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు.మరోవైపు, నటి, తమిళనాడు బీజేపీ నాయకురాలు కస్తూరి శంకర్ డీఎంకేపై విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. “డీఎంకే కమల్ హాసన్ పార్టీని, చిన్న మిత్ర పార్టీలన్నింటిని మింగేసింది... అవన్నీ తమ గుర్తులను వదిలి డీఎంకే గుర్తుపై పోటీ చేస్తున్నాయి. ఇటువంటివి బీజేపీలో జరగవు...” అని అన్నారు. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చేనెల 23న జరగనున్నాయి. -
‘కూటమి నేతలకు రాజపూజ్యం.. ప్రజలకు అవమానం’
సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వం అబద్ధాల నక్షత్రంలో వెన్నుపోటు రాశిలో ఏర్పడిందని.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. కూటమి నేతల ఆదాయం పెరిగింది.. పేద ప్రజల ఆదాయం పెరగలేదు. కూటమి మంత్రులకు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు రాజ్యపూజ్యం.. ప్రజలకు అవమానం. నిరుద్యోగులు, రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులను కూటమి మోసం చేసింది’’ అని వరుదు కల్యాణి మండిపడ్డారు.‘‘ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థులకు కాలేజీలు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. రైతులకు పెట్టుబడిసాయం లేదు.. గిట్టుబాటు ధర లేదు. మహిళలకు ఎన్నోహామీలు ఇచ్చి ఒక్కటి అమలు చేయలేదు. మహిళల రక్షణ పూర్తిగా గాలికి వదిలేశారు. ఉద్యోగుల పరిస్థితి కక్కలేక.. మింగలేక అన్నట్టు ఉంది. కూటమి పాలన అత్యంత దారుణంగా ఉంది. ఎన్నికల కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు మోసానికి మరోసారి గురికావద్దని రాష్ట్ర ప్రజలను కోరుతున్నాం’’ అని వరుదు కల్యాణి పేర్కొన్నారు.ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు: కల్పలతారెడ్డివైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏవర్గం ప్రజలు పండగ చేసుకోలేదని.. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని ప్రభుత్వం అమలు చేయలేదని మండిపడ్డారు. ‘‘ప్రభుత్వ ఉద్యోగులు బకాయిలు విడుదల చేస్తారని ఎదురు చూస్తున్నారు. ఉగాది కాదు దగాదిగా భావిస్తున్నారు. ఈ ఉగాదికి అయినా మేలు జరుగుతుందని ఉద్యోగులు ఆశించారు. పీఆర్సీ, ఐఆర్, డీఏకి సంబంధించిన జీవోలు విడుదల చేస్తారని ఆశించారు. వెయ్యి రూపాయిలు కూడా ప్రభుత్వం వేతనం పెంచలేదు..అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి చేస్తామని చెప్పారు. మంచి ఐఆర్ అన్నారు, పెండింగ్ బకాయిలు అని ఉద్యోగులను మోసం చేసింది. ఉద్యోగస్తులపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రతి పండగకి ఉద్యోగస్తులు ఎదురుచూస్తున్నారు. పండగ వచ్చి పొతుంది తప్ప ఒక్క మేలు మాత్రం జరగడం లేదు. గతంలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే 27 శాతం ఐఆర్ ఇచ్చారు. కరోనా సమయంలో 23శాతం పిట్మెంట్ ఇచ్చారు. ఉద్యోగస్తులు రోడ్డెక్కుతున్న కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పీఆర్సీ కమిషన్ని నియమించాలని కోరుతున్నా కానీ ప్రభుత్వం స్పందించడం లేదు. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు. పిఆర్సీ కమిషన్ని త్వరగా నియమించాలి. పిఆర్సీ ఆలస్యం అయితే ఐఆర్ ప్రకటించాలి. 29 శాతం పిఆర్సీని అమలు చేయాలి. ఉద్యోగస్తులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలి’’ అని కల్పలతారెడ్డి డిమాండ్ చేశారు. -
ఎన్నికల్లో షర్మిల ఖర్చు పెట్టిన ప్రతీ పైసా చంద్రబాబుదే: సతీష్ రెడ్డి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌ను విమర్శిస్తే కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలను ఎల్లో మీడియా హైలైట్ చేస్తోందన్నారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో షర్మిల, సునీత పావులు అని విమర్శించారు. జగన్‌తో యుద్ధం చేయలేక చంద్రబాబు.. షర్మిల, సునీతను వాడుకుంటున్నారని ఆరోపించారు. గత ఎన్నికలలో షర్మిల ఖర్చు పెట్టిన ప్రతీ పైసా చంద్రబాబు ఇచ్చినదే అని వ్యాఖ్యలు చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌రెడ్డి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిలకు ఏనాడూ ఎల్లో మీడియా వార్తలు రాయలేదు. వైఎస్ జగన్‌ను షర్మిల విమర్శిస్తే మాత్రం పెద్ద అక్షరాలతో వార్తలు రాస్తారు. వైఎస్సార్ బతికున్నప్పుడే షర్మిలకు ఆస్తి రాసిచ్చారు. జూబ్లీహిల్స్‌లో ఇల్లు, ఇడుపులపాయలో భూమి, హైడ్రో ప్రాజెక్టు, స్వస్తి హైడ్రో ప్రాజెక్టులో వాటా.. ఇలా అనేక ఆస్తులు రాసిచ్చారు. కొడుకు కన్నా షర్మిలకే వైఎస్ఆర్ ఎక్కువ ఆస్తి ఇచ్చారు. ఇప్పుడు జగన్ సొంతంగా సంపాదించుకున్న ఆస్తిలో కూడా వాటా కావాలని అడగటం అన్యాయం. గత ఎన్నికలలో షర్మిల ఖర్చు పెట్టిన ప్రతీ పైసా చంద్రబాబు ఇచ్చినదే. షర్మిల లాంటి చెల్లెలు తమకు వద్దని సామాన్యులు కూడా అనుకుంటున్నారు.దస్తగిరి అనే వ్యక్తి వివేకానంద రెడ్డిని హత్య చేశారు. వివేకానందరెడ్డికి కొన్ని బలహీనతలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఇమేజ్‌కి దెబ్బ తగలకూడదని అవినాష్ భావించారు. ఇప్పటికీ సునీతక్క, వివేకం పెదనాన్న అనే అవినాష్ మాట్లాడతారు. అవినాష్ అంత ప్రేమను చూపిస్తుంటే సునీత మాత్రం వివేకా పేరును చెడగొడుతోంది. సీబీఐతో విచారణ కావాలని పిటిషన్ వేసిందే సునీత. ఆమె కోరిక ప్రకారం సీబీఐ విచారణ జరిపింది. ఒక భూమి విషయంలో ఎర్ర గంగిరెడ్డి, వివేకానందరెడ్డికి వివాదాలు వచ్చాయని దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చారు. సునీల్ యాదవ్ వివేకానంద రెడ్డిపై దాడి చేశాడని దస్తగిరి చెప్పాడు. వివేకానందరెడ్డిని హతమార్చే సమయంలో కొన్ని పేపర్ల కోసం వెతికారని కూడా చెప్పాడుఆ పేపర్లు ఏంటి? వివేకానంద రెడ్డికి ఇతర మహిళలతో ఉన్న సంబంధాలు ఏంటి?. అవినాష్ రెడ్డి జీవితంలో చిన్న మరక కూడా లేదు. కానీ అవినాష్‌ను అభాసు పాలు చేసేలా సునీత వ్యవహరిస్తున్నారు. ఎంపీ సీటు కోసం హత్య చేశారన్న షర్మిల మాటలు అవివేకం. వివేకా హత్య జరిగే సమయానికే అవినాష్ రెడ్డికి జగన్ సీటు ఇచ్చారు. వివేకా కూడా అవినాష్ గెలుపు కోసం ప్రచారం చేశారు. సునీత, చంద్రబాబు, షర్మిల, దస్తగిరి ఒక్కటే. వారందరికీ కోర్టులో వాదించేది ఒక్కరే న్యాయవాది. ఈ విషయాలపై చర్చించేందుకు మేము సిద్దమే. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టి ఎందుకు వదిలేశారు?. ఏపీలో జగన్‌ను ఓడించటానికి చంద్రబాబు ఆడిన నాటకంలో షర్మిల పాత్రధారి. తాను చెప్పినట్టే సీబీఐ, సుప్రీంకోర్టు వినాలి అన్నట్టుగా సునీత వ్యవహరిస్తున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
బీజేపీ ఆఫీసులో కలకలం.. పార్టీ నేతపై మహిళ దాడి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ఆఫీసులో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పార్టీ కార్యవర్గ సభ్యుల అభినందన కార్యక్రమంలో ఓ మహిళ.. బీజేపీ నేతపై దాడి చేసింది. అతడిని చెంపదెబ్బ కొట్టి, అతడి కాలర్ పట్టుకుని బయటకు లాగేందుకు ప్రయత్నించింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఖంగుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో బుధవారం బీజేపీ కార్యాలయంలో జరిగిన అభినందన కార్యక్రమం గందరగోళానికి దారితీసింది. నామినేటెడ్ కౌన్సిలర్లు, పార్టీ కార్యవర్గ సభ్యులను అభినందించడానికి పార్టీ నేతలు ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికే ఆ మహిళ ప్రాంగణంలోకి ప్రవేశించి, ఆర్థిక వివాదంపై పార్టీ నేతను కార్యకర్తను నిలదీసింది. తనను లక్షల రూపాయలు మోసం చేశాడని ఆరోపించి, పార్టీ కార్యకర్తల సమక్షంలో అతనిపై దాడి చేసింది. చెంపదెబ్బ కొట్టి, అతని కాలర్ పట్టుకుని బయటకు లాగడానికి ప్రయత్నించింది. దీంతో ఆ ప్రాంగణంలో కలకలం రేగింది. దీంతో, అక్కడున్న వారంతా జోక్యం చేసుకోవడానికి పరుగెత్తుకొచ్చారు. ఈ ఘర్షణలో తోపులాటలు, మాటల దూషణలు, చెప్పులతో కొట్టుకోవడం వంటివి జరిగినట్లు సమాచారం.यूपी – जिला महराजगंज में BJP के कार्यक्रम में एक महिला कार्यकर्ता ने पुरुष कार्यकर्ता का कॉलर पकड़ लिया, हाथापाई की, उसे चप्पल दिखाई। महिला कार्यकर्ता का आरोप था कि LIC पॉलिसी के नाम पर साढ़े 4 लाख रुपए लिए, लेकिन इस व्यक्ति ने वो पैसे खाते में जमा .!#UttarPradesh #Maharganj pic.twitter.com/IzETG53KxF— Anil Yadav (Journalist) (@AnillYadavIN) March 19, 2026రూ.4.5 లక్షల మోసం ఆరోపణ..ఈ సందర్భంగా సదరు మహిళ మాట్లాడుతూ.. తాను ఎల్ఐసీ డిపాజిట్ల పేరుతో సుమారు రూ.4.5 లక్షలు అతడికి అప్పగించానని.. అయితే నిందితుడు ఆ డబ్బును జమ చేయకపోగా దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. ఆమె చాలా కాలంగా తన డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా ఇవ్వడం లేదని మండిపడ్డారు. బుధవారం ఆమె తన కుమారుడితో కలిసి ఆ కార్యక్రమానికి హాజరైనట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ, వారిద్దరూ వెంటనే డబ్బు తిరిగి చెల్లించాలని పట్టుబట్టారు.పోలీసుల జోక్యంసమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ వివాదంలో పాల్గొన్న మహిళను, ఇతరులను బీజేపీ కార్యాలయం నుంచి బయటకు తీసుకువెళ్లడంతో, దాదాపు గంటపాటు అంతరాయం తర్వాత కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది.పార్టీ స్పందనఆర్థిక వివాదం కారణంగా ఈ ఘర్షణ అకస్మాత్తుగా చెలరేగిందని మాజీ జిల్లా అధ్యక్షుడు, మాజీ అభ్యర్థి సమీర్ త్రిపాఠి తెలిపారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ..‘నామినేటెడ్ కౌన్సిలర్లు మరియు మండల అధ్యక్షుల సన్మాన కార్యక్రమం సందర్భంగా, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఒక వివాదం తలెత్తింది. మాకు ముందే సమాచారం అంది ఉంటే, ఈ పరిస్థితిని నివారించే వాళ్లం. వీరిద్దరూ బీజేపీకి చెందినవారే. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించడానికి కృషి చేస్తాం’ అని చెప్పుకొచ్చారు. -
‘నవ కేరళ సర్వే’ టార్గెట్.. బీజేపీ ప్లాన్ ఫలించిందా?
కేరళలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ముందుకు సాగుతున్నాయి. అయితే, ఎన్నికల వేళ కేరళలోని పినరయి విజయన్ సర్కార్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కేరళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘నవ కేరళ సర్వే’ను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. అయితే, దీనిపై సుప్రీంకోర్టులో సానుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి.కేరళలో ఎల్డీఎఫ్ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల అభిప్రాయాలను సేకరించి “నవ కేరళ సర్వే” అనే అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని ప్రయత్నించింది. ఈ క్రమంలో కేరళలో దాదాపు 95 లక్షల ఇళ్లలో ప్రజల అభిప్రాయాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, సర్వేలో భాగంగా కేవలం 49.42 లక్షలు మాత్రమే సేకరించినట్టు సమాచారం. కాగా, సర్వేల సందర్బంగా ప్రభుత్వ పెద్దల ఆడియో లీక్ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. సర్వే అసలు ఉద్దేశ్యం ఎల్డీఎఫ్ను తిరిగి అధికారంలోకి తేవడమే అని బయటపడింది. దీంతో, కేరళ బీజేపీ నేతలు రంగంలోకి దిగి తీవ్ర ఆరోపణలు చేశారు.రాజకీయ ఉద్దేశంతోనే నవ కేరళ సర్వేను చేపట్టినట్టు ఆరోపించారు. అనంతరం, కాషాయ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. బీజేపీ నేతల పిటిషన్లపై విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్థిక అనుమతి లేకుండా ప్రభుత్వ నిధులను వాడటం అన్యాయమని పేర్కొంటూ సర్వేను రద్దు చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ సర్వేను చేపట్టినట్టు తెలిపింది. అనంతరం, హైకోర్టు తీర్పుపై కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇది పబ్లిక్ అవుట్‌రీచ్ & డెవలప్మెంట్ ఫీడ్‌బ్యాక్ ఇనిషియేటివ్ మాత్రమే, ఎన్నికల ప్రచారం కాదని తెలిపింది. ఈ సందర్బంగా సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. సర్వే కొనసాగించడానికి అనుమతించింది. ఇదే సమయంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసే సంక్షేమ పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయా? అని తెలుసుకోవడంలో తప్పు లేదంటూ వ్యాఖ్యలు చేసింది.అయితే, ఈ సర్వేలో ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్న నెంబర్ కంటే తక్కువ సంఖ్యలో సర్వే జరగడం, పలు చోట్ల ప్రజల నుంచి వ్యతిరేకంగా కనిపించడంతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే, సర్వేలో తక్కువ సంఖ్యలో పాల్గొనడం వల్ల సర్వే విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తాయి.సర్వే ముఖ్యాంశాలుసర్వే లక్ష్యం: 95 లక్షల ఇళ్లలో ప్రజల అభిప్రాయాలు సేకరించడం.నిజంగా చేరుకున్న ఇళ్లు: 49.42 లక్షలు.సేకరించిన అభిప్రాయాలు: కేవలం 4.5 లక్షలు.ఫోకస్ గ్రూప్ చర్చలు: కుడుంబశ్రీ వంటి సంఘాల ద్వారా 46,000 అభిప్రాయాలు మాత్రమే సేకరించబడ్డాయి.వాలంటీర్లు: 96,200 మంది నమోదు చేసుకున్నా, శిక్షణకు హాజరైన వారు చాలా తక్కువ.ఆర్థిక వ్యయాలుస్టేషనరీ, బ్రోచర్లు, పుస్తకాలు: సర్వే కోసం రూ.8 కోట్లు ఖర్చు చేశారు.85,000 బుక్లెట్లు ముద్రించబడ్డాయి.ఫారమ్‌లు, ఫీడ్‌బ్యాక్ ప్యాడ్లు, నోటు బుక్స్ కోసం భారీగా ఖర్చు జరిగింది.ఇక, నవ కేరళ సర్వేలో ప్రజలు ప్రధానంగా ఉద్యోగాలు, ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలపై సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా యువత ఉపాధి అవకాశాలు, గ్రామీణ ఆరోగ్య సదుపాయాలు, పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్, రహదారులు–నీటి సరఫరా, మహిళా సాధికారత, రైతు సహాయం వంటి అంశాలు ఎక్కువగా ప్రస్తావించబడ్డాయి.ప్రజలు ఇచ్చిన ప్రత్యేక సూచనలు1. ఉద్యోగాలు & ఉపాధికొత్త పరిశ్రమలు, ఐటీ పార్కులు, స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు.యువతకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లు పెంచాలని సూచించారు.ప్రభుత్వ రంగంలో ఖాళీలను త్వరగా భర్తీ చేయాలని అభిప్రాయపడ్డారు.2. ఆరోగ్యంగ్రామీణ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది కొరతను తీర్చాలని కోరారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు, ఔషధాలు, అత్యవసర సేవలు పెంచాలని సూచించారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరింత బలోపేతం చేయాలని అభిప్రాయపడ్డారు.3. విద్యపాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు పెంచాలని కోరారు.స్కాలర్షిప్లు మరియు ఆర్థిక సహాయం విస్తరించాలని సూచించారు.గ్రామీణ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని అభిప్రాయపడ్డారు.4. మౌలిక సదుపాయాలురహదారులు, నీటి సరఫరా, గృహ నిర్మాణం, శుద్ధి వ్యవస్థలు మెరుగుపరచాలని సూచించారు.పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు పెంచాలని కోరారు.5. సంక్షేమ పథకాలుకుడుంబశ్రీ వంటి మహిళా సాధికారత కార్యక్రమాలను విస్తరించాలని సూచించారు.పింఛన్లు, రైతు సహాయం, గృహ పథకాలు మరింత పారదర్శకంగా అమలు చేయాలని కోరారు.సామాజిక భద్రతా పథకాలు విస్తరించాలని అభిప్రాయపడ్డారు. -
బిహార్ సీఎంగా ‘సామ్రాట్’.. నితీష్ వ్యాఖ్యలకు మంత్రి క్లారిటీ!
పట్నా: బిహార్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే చర్చ.. సీఎం నితీష్ కుమార్ వారసుడు ఎవరు? ఆయన తన వారసుడిగా డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరీని ప్రొజెక్ట్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వీటికి సీనియర్ మంత్రి విజయ్ కుమార్ చౌదరి బ్రేక్ వేశారు. ఆ వార్తల్లో నిజం లేదని, మీడియా కేవలం ఊహాగానాలతో వార్తలు సృష్టిస్తోందని ఆయన మండిపడ్డారు.అసలేం జరిగింది?ఇటీవల జముయి జిల్లాలో జరిగిన ‘సమృద్ధి యాత్ర’లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పక్కనే ఉన్న సామ్రాట్ చౌదరీని చూపిస్తూ.. ‘ఇకపై ఈయనే బీహార్ బాధ్యతలను చూసుకుంటారు, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది’ అని పేర్కొన్నారు. నితీష్ రాజ్యసభకు వెళుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్ని రేపాయి. సామ్రాట్ చౌదరిని నితీష్ తన రాజకీయ వారసుడిగా ప్రకటించేశారని అంతా భావించారు.మంత్రి క్లారిటీ ఇదీ..ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఇఫ్తార్ వేడుక అనంతరం మంత్రి విజయ్ కుమార్ చౌదరి మీడియాతో మాట్లాడారు. నితీష్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని ఆయన కోరారు. ‘ఆ సమయంలో నేను కూడా అక్కడే ఉన్నాను. నితీష్ కుమార్ ఎప్పుడూ తన కేబినెట్ సహచరులను ఇలాగే ప్రోత్సహిస్తుంటారు. బాధ్యతలు చూసుకోమని చెప్పడం ఆయనకు అలవాటే. ఇందులో కొత్త సిగ్నల్స్ ఏమీ లేవు’ అని స్పష్టం చేశారు.మారుతున్న రాజకీయ సమీకరణలునితీష్ కుమార్ తన పదవిని వదులుకున్నాక, బీహార్‌లో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. నితీష్ కుమారుడు నిశాంత్ కుమార్ గత వారమే పార్టీలో చేరారు. కొత్త ప్రభుత్వంలో ఆయనకు డిప్యూటీ సీఎం పదవి దక్కవచ్చని జేడీయూ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు, మైనారిటీల పట్ల నితీష్‌కు ఉన్న అంకితభావాన్ని మంత్రి కొనియాడారు. రాజకీయం అనేది భావోద్వేగాలతో కాకుండా సమీకరణలతో నడుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు జేడీయూలో కీలక నేత కేసీ త్యాగి రాజీనామా చేయడంతో బిహార్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.ఇది కూడా చదవండి: నవరాత్రి శోభ: వర్షంలోనూ వైష్ణోదేవికి పోటెత్తిన భక్తులు -
అసెంబ్లీలో పాడి వేడి!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సీపీ గౌస్ ఆలం, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మధ్య వార్ ముదురుతోంది. ఇంతకాలం జిల్లాకు పరిమితమైన ఈ గొడవకు ఇప్పుడు అసెంబ్లీ వేదికగా మారింది. సీపీ గౌస్ ఆలంపై ఎమ్మెల్యే పాడి ఆరోపణల డోసు పెంచారు. ఎలగందుల ఫైరింగ్ రేంజ్లో సీపీ ఆయన మిత్రులతో కలిసి ఫైరింగ్ సాధన చేయడంతోనే బోనాలపల్లెలో అమృతమ్మ అనే వృద్ధురాలికి తూటా గాయమైందని ఆరోపించారు. కరీంనగర్ కమిషనరేట్‌కు చెందిన పలువురు కానిస్టేబుళ్లు, వాహనాలను హైదరాబాద్‌లో సీపీ ఇతర పనులకు మోహరిస్తున్నారని సభలో పేర్కొన్నారు. జిల్లాలో ఎమ్మెల్యేలు ఎవరు ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. దీనిపై స్పందించాలని మంత్రి శ్రీధర్‌బాబుతోపాటు, మంత్రులు పొన్నం, అడ్లూరికి విజ్ఞప్తి చేశారు. పాడి ఆరోపణలపై స్పందించిన మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.దొంగ ఆఫీసర్లు.. డ్రగ్స్ తీసుకున్నారా? అంటూ..సభ అనంతరం పాడి కౌశిక్ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎలగందుల ఫైరింగ్ రేంజ్లో కాల్పులు జరిగిన సమయంలో సీపీ గౌస్ ఆలం లీవ్‌లో ఉన్నట్లుగా పోలీసులు విడుదల చేసిన ప్రకటనను తప్పుబట్టారు. అదంతా డీటీపీ చేశారంటూ కొట్టిపారేశారు. ముందే రాసుకున్న లీవ్ లెటర్‌పై పెన్నుతో డేటు వేసుకున్నారని ఆరోపించారు. ఇలాంటి దొంగ పోలీసాఫీసర్లకు మద్దతుగా నిలవడమేంటని ఐపీఎస్ ఆఫీసర్లను ప్రశ్నించారు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జమ్మికుంట రూరల్ సీఐ, హుజురాబాద్ ఏసీపీలపైనా చర్యలు తీసుకోవాలన్నారు. తన ఆరోపణలపై విచారణ జరిపించి తప్పు మాట్లాడితే.. ముక్కు భూమికి రాస్తానంటూ పునరుద్ఘాటించారు. కరీంనగర్ పోలీసు డిపార్ట్మెంట్ అంతా ఆలంకు వ్యతిరేకంగా ఉన్నారని, అందువల్లే తనకు సీపీ గురించిన సమాచారం అంతా అందుతోందని వెల్లడించారు. తన మీద సీఐడీ కేసులు పెట్టడం కాదని, చేతనైతే సీపీ మీద విచారణకు సిట్ వేయాలని కోరారు.ఈనెల 30వ తేదీ వరకే డెడ్లైన్సీపీ పవిత్ర రంజాన్‌మాసంలో జల్సాలు చేసుకున్నారని, ఆ పార్టీలో పోలీసులు ఎగిరిన తీరు చూస్తుంటే.. పీకల్లోతు మందు తాగారా, డ్రగ్స్, గంజాయి ఉన్నాయా అని ప్రశ్నించారు. కరీంనగర్ యువతకు పోలీసులు ఏం సందేశం ఇస్తున్నారు అని నిలదీశారు. వెంటనే డీజీపీ, మంత్రి శ్రీధర్‌బాబు చర్యలు తీసుకోవాలని, 30వ తేదీలోగా చర్యలు తీసుకోవాలని లేకపోతే మరిన్ని విషయాలు బయటికి వస్తాయని తెలిపారు. ఇటీవల ప్రెస్మీట్లో సీపీకి సంబంధించిన ఆధారాలు బయటపెడతానని చెప్పిన పాడి అన్నంత పనిచేశారు. 30వ తేదీలోగా సీపీపై చర్యలు లేకపోతే మరిన్ని విషయాలు వెల్లడిస్తానని చెబుతుండటంతో.. పాడి ఆరోపణలపై ఇటు డిపార్ట్మెంట్, అటు రాజకీయ నాయకుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. -
మమతా బెనర్జీకి బిగ్ షాక్.. సుప్రీంకోర్టు ఝలక్
న్యూఢిల్లీ: ఐప్యాక్ కేసులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ కేసులో సోదాలు చేపట్టడానికి వెళ్లిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడ్డుకోవడం, దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం ఎంతమాత్రం సమంజసం కాదని తేల్చిచెప్పింది. ఇలాంటి సందర్భాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలను నిస్సహాయంగా వదిలివేయలేమని, ఏదో ఒక పరిష్కారం కావాల్సిందేనని పేర్కొంది.జనవరి 8న కోల్‌కతాలో రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్ కార్యాలయంతోపాటు ఆ సంస్థ అధినేత ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ సోదాలు చేపట్టింది. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ప్రతీక్ జైన్ ఇంట్లో ఈడీ సోదాలు చేస్తుండగా, మమతా బెనర్జీ అక్కడకి దూసుకొచ్చారు. సోదాలకు అడ్డు తగలడంతోపాటు అక్కడున్న ల్యాప్‌టాప్, ఫోన్, కొన్ని ఫైళ్లు బలవంంతంగా లాక్కొని వెళ్లిపోయా రు. తర్వాత ఐప్యాక్ కార్యాలయంలోనూ హల్చల్ చేశారు. ఈడీ బృందం పట్ల దురుసు గా ప్రవర్తిస్తూ కొన్ని పత్రాలు తీసుకెళ్లారు. తమ దర్యాప్తు విషయంలో ముఖ్యమంత్రితోపాటు ప్రభుత్వ జోక్యాన్ని సవాలు చేస్తూ ఈడీ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియాల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.‘‘ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యాలయంలోకి బలవంతంగా ప్రవేశించి, కేంద్ర దర్యాప్తు సంస్థ విధుల్లో జోక్యం చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇలాగైతే ఏం చేయాలి? రేపు మరో ముఖ్యమంత్రి కూడా ఇలాగే చేస్తే పరిస్థితి ఏమిటి? ఇలాంటి వాటికి ఏదో ఒక పరిష్కారం ఉండాల్సిందే’’ అని ధర్మాసనం పేర్కొంది. అనుచిత, అభ్యంతరకర పరిణామాలు పునరావృతం కాకుండా ప్రామాణిక కార్యాచరణ నియమావళి(ఎస్ఓపీ)ని రూపొందించాలని తేలి్చచెప్పింది. ఈడీ పిటిషన్‌పై విచారణ వాయిదా వేయాలన్న బెంగాల్ ప్రభుత్వ విజ్ఞప్తిని తిరస్కరించింది. విచారణ యథావిధిగా కొనసాగుతుందని పేర్కొంది. తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదావేసింది. -
కాంగ్రెస్‌తో బలవంతపు పెళ్లి
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీని బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వచి్చందని మాజీ ప్రధానమంత్రి, జేడీ (ఎస్) అధినేత హెచ్.డి.దేవెగౌడ అన్నారు. ఆ బంధం సరిగ్గా సాగకపోవడంతో నచ్చక విడాకులు తీసుకున్నానని చెప్పారు. దేవెగౌడ్ కాంగ్రెస్‌తో ప్రేమాయణం సాగించి, మోదీని పెళ్లి చేసుకున్నారంటూ బుధవారం రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ ఖర్గే చేసిన వ్యాఖ్యపై దేవెగౌడ ‘ఎక్స్’లో స్పందించారు. ఖర్గే మాట్లాడినప్పుడు సభలో లేనని పేర్కొన్నారు. 2018లో కాంగ్రెస్ నాయకత్వం గులాం నబీ ఆజాద్‌ను తన వద్దకు రాయబారానికి పంపించిందని గుర్తు చేసుకున్నారు. తన తనయుడు కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసినప్పటికీ తాను అంగీకరించలేదని వెల్లడించారు. మల్లికార్జున ఖర్గేను ముఖ్యమంత్రిని చేయాలంటూ సూచించానని స్పష్టం చేశారు. కుమారస్వామి విషయంలో ఆజాద్ పట్టుబట్టారని అన్నారు. కానీ, 2019లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమను పక్కనపెట్టి బీజేపీలో చేరిపోయారని చెప్పారు. వారిని బీజేపీలోకి ఎవరు పంపించారో అందరికీ తెలుసని ఉద్ఘాటించారు. ఫిరాయింపులను ప్రోత్సహించిన వ్యక్తిని కాంగ్రెస్ పెద్దలు ఆనాడు అడ్డుకోలేదన్నారు. కాంగ్రెస్ కూటమిని తాను వదిలేయలేదని, వారే వెళ్లిపోయారని స్పష్టంచేశారు. విడాకులు ఇవ్వడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితిని వారే సృష్టించారని దేవెగౌడ తేలి్చచెప్పారు. -
ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘‘సబ్కో అస్సలామ్ అలై కుమ్.. (అందరికీ అల్లా కృప ఉండాలి).. అడ్వాన్స్ ఈద్ ముబారక్ (ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు)..’’ అంటూ ముస్లిం సోదరులకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని బుధవారం రాత్రి వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్‌లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైఎస్ జగన్‌కు ముస్లిం మతపెద్దలు, నేతలు చౌకత్తో సన్మానించి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలసి వైఎస్ జగన్ ప్రార్థనలు (నమాజ్) నిర్వహించారు. అనంతరం ఉపవాస దీక్షను విరమింపజేస్తూ వైఎస్ జగన్ వారికి ఖర్జూరం తినిపించారు. ముస్లిం మత పెద్దలు, మైనార్టీ నేతలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరైన ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ అందరికీ ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి, సోదరభావం, పరస్పర గౌరవం సమాజానికి అత్యంత అవసరమని పేర్కొన్నారు. రంజాన్ మాసం సేవా భావం, సామరస్యం, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా, సామరస్యంతో జీవించాలని ఆకాంక్షించారు.ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆత్మీయంగా ఖర్జూరం తినిపిస్తున్న ముస్లిం సోదరులు జగన్ సీఎం కావాలంటూ ‘దువా..’మాజీ ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా, వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు ఖాదర్‌బాషా, ఎంఎస్ మక్బూల్, పలు జమాత్‌ల పెద్దలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి కృషి చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. మైనార్టీలను ఆర్థిక, రాజకీయ, సామాజికంగా వైఎస్ జగన్ చేయిపట్టుకుని ముందుకు నడిపించారన్నారు. ముస్లింల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేసిన వైఎస్ జగన్‌కు అల్లా దయ, అందరి ప్రేమాభిమానాలు ఉంటాయన్నారు. కాబోయే సీఎం వైఎస్ జగన్ అంటూ దువా (ప్రార్థన) చేశారు.ఇఫ్తార్ ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లిం సోదరులు హోరెత్తిన అభిమానం..వైఎస్ జగన్‌ను చూసేందుకు విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ వద్దకు భారీగా తరలివచ్చిన ప్రజలు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇఫ్తార్ విందుకు అభిమాన జనం పెద్ద ఎత్తున పోటెత్తారు. సీఎం.. సీఎం.. అనే నినాదాలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖాదర్‌బాషా, ఎమ్మెల్సీలు ఎండీ రుహుల్లా, ఇస్సాక్ బాషా, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, రమేష్‌యాదవ్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, అత్తర్ చాంద్‌బాషా, మల్లాది విష్ణు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఉప్పాల రాము, పి.గౌతంరెడ్డి, దేవభక్తుని చక్రవర్తి, తన్నీరు నాగేశ్వరరావు, పోతిన మహేష్, ముస్లిం నేతలు మక్బుల్, నదీమ్ అహ్మద్, అసిఫ్, అహ్మద్ అలీ, ఫారుఖీ, షేక్ మునీర్ అహ్మద్ తదితర జమాత్‌ల పెద్దలు పాల్గొన్నారు. -
విజయ్‌కు సీఎం పదవి, పార్టీకి 50 శాతం సీట్లు ఆఫర్ చేశారు
చెన్నై: రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ అధినేత విజయ్‌కు ముఖ్యమంత్రి పదవితో పాటు ఏకంగా 50 శాతం అసెంబ్లీ సీట్లను ఒక పార్టీ ఆఫర్ చేసిందని తమిళిగ వెట్రి కళగం (టీవీకే) ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున తెలిపారు. ముఖ్యమంత్రి పదవిని రెండున్నరేళ్లపాటు పంచుకునే అవకాశాన్ని కూడా ఇచ్చారని, కానీ తమ అధ్యక్షుడు విజయ్ ఆ ప్రతిపాదనను తిరస్కరించారని అర్జున వెల్లడించారు. ‘పదవి కోసం ఢిల్లీ పెద్దల ముందు తలవంచే వ్యక్తి విజయ్ కాదు. వారు మాకు 50 నుంచి 90 సీట్ల వరకు రకరకాల ఆఫర్లు ఇచ్చారు. అయితే విజయ్ మాత్రం తనకు ముఖ్యమంత్రి పదవి కాదు, తమిళనాడు ప్రజల నమ్మకం మాత్రమే కావాలని స్పష్టం చేశారు’ అని పేర్కొన్నారు. అయితే ఆఫర్ ఇచ్చిన పార్టీ పేరును మాత్రం ఆయన వెల్లడించలేదు. టీవీకే ఒక బలమైన శక్తిగా ఎదుగుతుందని, రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లోనూ పోటీ చేసి, లౌకిక, సామాజిక న్యాయంతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో టీవీకే ఎన్నికల ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. పొత్తులపై ఇటీవల మీడియాతో మాట్లాడిన ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి పొత్తుల కోసం తమ పార్టీ టీవీకేతో చర్చలు జరపలేదన్నారు. టీవీకేతో పొత్తు కోసం బీజేపీ సన్నిహితుల ద్వారా ప్రయత్నం చేసిందనే ప్రచారం జరిగింది. ఈ వార్తలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తోసిపుచ్చారు. ఇదిలా ఉంటే ఇటీవల రజనీకాంత్‌పై చేసిన వ్యాఖ్యలకు అధవ్ అర్జున క్షమాపణలు చెప్పారు. -
మూసీ మంటలు.. కేటీఆర్ వర్సెస్ శ్రీధర్‌బాబు
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రక్షాళన, సుందరీకరణ ప్రాజెక్టు అంశం బుధవారం శాసనసభను కుదిపేసింది. బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్, మంత్రి శ్రీధర్‌బాబు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ సభ్యులు కేటీఆర్, సు«దీర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, బండారి లక్ష్మారెడ్డిలు మూసీ పునరుజ్జీవం అంశంపై ప్రశ్నించారు. దాని డీపీఆర్ సిద్ధమైందా, ప్రాజెక్టు వ్యయం అంచనా ఎంత, నిర్వాసితుల సంఖ్య, వారి పునరావాస చర్యల గురించి ప్రశ్నించారు. దీనికి మంత్రి శ్రీధర్‌బాబు, ప్రాజెక్టు మొదటి దశకు డీపీఆర్ సిద్ధమైందని, మొదటి దశ అంచనా వ్యయం రూ.ఆరున్నర వేల కోట్ల నుంచి రూ.ఏడు వేల కోట్లని, దాదాపు 1,435 నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశముందని, నిర్వాసిత కుటుంబాలకు టీడీఆర్‌ను జారీ చేస్తామని, 2013 చట్టం ప్రకారం సహాయ పునరావాసాలు ఉంటాయని పేర్కొన్నారు. దీనిపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి, మంత్రి, మూసీనది అభివృద్ధి సంస్థ ఎండీ భిన్న ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. డీపీఆర్ తయారీకి 18 నెలల సమయం అవసరమవుతుందని రెండు నెలల క్రితం ఇదే సభలో ప్రకటించిన శ్రీధర్‌బాబు, ఇప్పుడు డీపీఆర్ సిద్ధమైందని చెప్పటం వింతగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణం ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించిందని సభలోనే శ్రీధర్‌బాబు చెప్పారని, కానీ, ఆ బ్యాంకును జనవరి, మార్చి నెలల్లో రెండు పర్యాయాలు సంప్రదిస్తే... తమకు డీపీఆరే అందలేదని, ఎలాంటి లోన్ మంజూరు చేయలేదని వెల్లడించినట్టు పేర్కొన్నారు. సమాచార లోపం వల్ల ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తున్నారా, లేదా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చెబుతున్నారా అంటూ నిలదీశారు. ప్రాజెక్టుకు ముఖ్యమంత్రేమో రూ.లక్షన్నర కోట్లని చెబుతుంటే, ఇప్పుడు మంత్రి శ్రీధర్‌బాబు ఆరేడువేల కోట్లని అంటున్నారని నిలదీశారు. మంత్రి శ్రీధర్‌బాబు 1,400 ఇళ్లు కూలుస్తామని అంటున్నారని, మరి గెజిట్‌లో 10 వేలకుపైగా నిర్మాణాలు ప్రభావితానికి గురవుతాయని ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. బఫర్ జోన్ విషయంలో 50 మీటర్లని మంత్రి అంటే, అధికారుల మాటల్లో అది చాలా ఎక్కువగా కనిపిస్తోందన్నారు. బురద చల్లటం ఆపాలి: మంత్రి శ్రీధర్‌బాబు కేటీఆర్ మాటలపై మంత్రి శ్రీధర్‌బాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పార్టీ నేతల వైఖరి ముందు నుంచీ మేం బురద చల్లుతాం...మీరు తుడుచుకోండి అన్నట్టుగా ఉంటోందని అసహనం వ్యక్తం చేశారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు మొదటి దశ డీపీఆర్‌లో రూ.6,500 నుంచి రూ.7,000 కోట్లు వ్యయం అవుతుందని తాము స్పష్టంగా చెప్పామన్నారు. కేటీఆర్ మాత్రం రూ.లక్షన్నర కోట్ల కుంభకోణం అని అవాస్తవాలతో మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. తాము చేస్తున్న ప్రతి ప్రయత్నానికి అడ్డుగోడ కట్టాలని ఆ పార్టీ సంకుచిత ఆరోపణలు చేస్తోందని తిప్పికొట్టారు. మూసీకి రెండు వైపులా 50 మీటర్ల బఫర్ జోన్‌గా గుర్తిస్తూ 2016 లో అప్పటి ప్రభుత్వం జీఓ ఇచ్చింది నిజం కాదా అని శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. ఇప్పుడేమో ఇళ్లెలా తొలగిస్తారని ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మూసీ ప్రాజెక్టు కోసం డీపీఆర్ రూపొందించిన మెయిన్ హార్ట్ అనే సింగపూర్ ఇంజనీరింగ్ సంస్థకు ఇటువంటి పనుల్లో అనుభవం ఉందని శ్రీధర్‌బాబు తెలిపారు. కేవలం రెండు నెలల్లో డీపీఆర్ ఎలా తయారైందని కేటీఆర్ ప్రశ్నించటం విడ్డూరమని, డీపీఆర్ తయారీ ఏడాది సమయం పట్టిందన్నారు. రుణం కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకుకు డీపీఆర్ ఇచ్చామని, తన తదుపరి బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఏదైనా కారణం చేత ఆ బ్యాంకుకు సాధ్యం కాని పక్షంలో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తామన్నారు. బీఆర్ఎస్కు మూసీ ప్రక్షాళన ఇష్టం లేదా: భట్టి బీఆర్ఎస్ సభ్యుల తీరుపై ఉప ముఖ్యమంత్రి భట్టి తీవ్రంగా స్పందించారు. మూసీ ప్రక్షాళన ఆ పారీ్టకి ఇష్టం లేదోమోనని, దాని పరీవాహక ప్రాంత పేదల జీవితాలు బాగవ్వాలని ఆ పార్టీ కోరుకోవటం లేదేమోనని ఆరోపించారు. మూసి నిర్వాసిత పిల్లల కోసం యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఆ ప్రాంతంలోనే నిర్మిస్తామన్నారు. ఈ విషయంలో తమ ప్రశ్నలకు మంత్రి నుంచి సరైన సమాధానాలు రాలేదని, ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నామని కేటీఆర్ ప్రకటించడంతో ఆ పార్టీ సభ్యులు సభ నుంచి నిష్క్రమించారు. -
మళ్లీ తొక్కుకుంటూ వస్తాం.. : సీఎం రేవంత్‌రెడ్డి
⇒ రామాయణంలో రావణాసురునికి పట్టిన గతే ప్రతిపక్ష నేతలకు పడుతుంది. మంచి ఆలోచనతో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఆలోచనలు చేస్తూ పథకాలు అమలు చేస్తుంటే.. రాక్షసుల మాదిరి విఘ్నాలు కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి రాక్షసులకు రామబాణం సమాధానం చెబుతుంది ⇒ మేం ఏం చేసినా కించపరిచేలా, అహంకారంతో మాట్లాడుతున్నారు. అది తమ జన్మహక్కు అని అనుకుంటున్నారు. ప్రజలు ఆగ్రహిస్తే ఈసారి అది కూడా (ప్రతిపక్ష హోదా) ఉండదు. భూకంపంలో కొట్టుకుపోతారు⇒ టీడీఆర్, హిల్ట్ పాలసీపై విచారణకు లేఖ రాయండి. వెంటనే మా ప్రభుత్వం విచారణ చేపడుతుంది. విచారణకు వెనకాడినా లేదా వెనక్కి తగ్గినా క్షమాపణ చెబుతాంసాక్షి, హైదరాబాద్: 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ మిమ్మల్ని మళ్లీ తొక్కుకుంటూ అధికారంలోకి వస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. ‘2023 ఎన్నికల్లో బరాబర్ మీ నెత్తిపై కాళ్లు పెట్టి తొక్కుకుంటూ ఇక్కడకు వచ్చాను. 2029లో మళ్లీ చూసుకుందాం. మళ్లీ తొక్కకపోతే చూడండి. మీరు ఎట్లా గెలుస్తారో చూస్తాను’అని ఆవేశంగా ప్రకటించారు. బుధవా రం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమాధానమిస్తూ రెండున్నర గంటలకుపైగా సుదీర్ఘంగా సీఎం ప్రసంగించారు. ‘ఇప్పటికైనా మీరు మర్యాదగా ఉండడం నేర్చుకుంటే మంచిది. కనీస మర్యాద దక్కుతుంది’అని హెచ్చరించారు. 2029 ఎన్నికలు కూడా కేవలం పాసింగ్ క్లౌడ్ మాత్రమే. 2034 వరకు ఈ ప్రభుత్వమే ఉంటుంది. అప్పటికే తెలంగాణ ఒక ట్రిలియన్ ఎకానమీగా ఎదుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు’అని చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్న హిల్ట్–పి, టీడీఆర్‌లకు సంబంధించి వారు లేఖ రాస్తే ఏ విచారణ కోరినా చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ‘కొందరు తమను తాము రాజులుగా భావిస్తున్నారు. రాచరిక పోకడలతో ప్రజాతీర్పును అవమానిస్తున్నారు. వారసత్వ రాజకీయాలను నమ్ముకుని అధికారం దక్కలేదనే దుఃఖంతో ఆరోపణలు, దు్రష్పచారంతో సభను తప్పుదోవ పట్టించారు. రాజులు పోయినా రాజ్యాలు పోయినా వారి పోకడలు మారలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులుగా మారి తమ సేవకులను నియమించుకుంటారన్న విషయాన్ని ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది’అని బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం వల్లనే ఈ దుస్థితి రాష్ట్ర ఆదాయంపెంచాలి.. పేదలకు పంచాలి అనే పాలసీ తీసుకొస్తే కూడా అభినందించాలనే ఆలోచన ప్రతిపక్షాలకు రాకపోతే వారిని ఏమనాలని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘తెలంగాణ అభివృద్ధి, ప్రజల భవిష్యత్ పట్ల సభావేదిక నుంచి వివరించాను. అధికారం పోయిందనే బాధతో ఇది కొందరికి రుచించదు. వారు కక్కిన విషాన్ని శివుడి మాదిరిగా గొంతులోనే పెట్టుకుంటాను’అని అన్నారు. తమపై గత ప్రభుత్వం పదేళ్లలో రూ.8.11 లక్షల కోట్ల అప్పు భారాన్ని, దానికి 11 శాతం అధిక వడ్డీ మోపినందుకు, దానిని భరించడం వల్లనే తమ ప్రభుత్వానికి ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణ ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని, గొప్ప విజన్‌ను ఆవిష్కరిస్తూ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేసిన ప్రసంగం చరిత్రాత్మకమని రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘గవర్నర్ ప్రసంగం కేవలం అక్షరాల రూపంలో ఉన్న ఆలోచనలు కాదు. తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శి. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదగడానికి అవసరమైన విశిష్ట ప్రణాళిక’అని రేవంత్ పేర్కొన్నారు. విపరీత పోకడలకు పోవద్దు ‘కొత్త గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు విపక్షనేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనిప్రజలు ఆశించారు. సభాసంప్రదాయాలను గౌరవించకపోవడం తెలంగాణకు, ప్రజలకు తీరని మచ్చ’అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘వారసత్వాలతో అధికారం రాదు.. చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకుంటామంటే కుదరదు. సొంతంగా సత్తా ఉండాలి. ఔరంగజేబుగా మారతామంటే అది దురాశగా మారుతుంది. విపరీత పోకడలు, విధానాలకు పోవద్దు, అధికారం రాలేదని బాధ, దుఃఖం ఉండొద్దు’అని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘కొందరు తమను తాము దైవాంశ సంభూతులమని అనుకుంటున్నారు. మీరు (బీఆర్ఎస్ నేతలు) దేవుళ్లు కాదు, దోపిడీదారులు. నోటిఫికేషన్లు, ఆర్డర్లు ఎందుకు ఇవ్వలేకపోయారు. అసంపూర్తిగా వదిలి వేసిన అసమర్థులు మీరు. మీలాగా గాలికి వచ్చిన వాళ్లం కాదు. ‘నేను కష్టజీవిని. తెలియకపొతే నేర్చుకుంటాను. ఇతరులకు నేర్పుతాను. ఇదే పంథాలో ముందుకు సాగి అనుకున్నవి కచ్చితంగా సాధిస్తాను’అని ఆయన పేర్కొన్నారు. ‘పారిశ్రామిక భూముల బదలాయింపులపై 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు హిల్ట్ పాలసీతో సహా దేనిపై అయినా సీబీఐ, ఈడీ, సిట్, లేదా ఏ అంతర్జాతీయ సంస్థతో విచారణకైనా మేం సిద్ధం. అని బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్‌ను ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు.. ‘కేసీఆర్ అసెంబ్లీలో ఇదే స్థానం నుంచి తెలంగాణ ఇచ్చిన సోనియాగాందీకి శాసనసభ కృతజ్ఞతలు చెబుతున్నది, ఆమె దయతోనే తెలంగాణ వచ్చిందన్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు’అని సీఎం రేవంత్ అన్నారు. తండ్రి బతికి ఉండగానే తద్దినం పెట్టడం అంటే ఏమిటో ఇప్పుడు అర్థమవుతోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బావమరుదులు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారన్నారు. వారిద్దరు అలాగే వ్యవహరిస్తే.. పార్టీ ముక్కలు అవుతుందని, అది కాకుండా చూసుకోవాలని, అధికారంలోకి వచ్చేది కల్ల అని వ్యాఖ్యానించారు. మేము చేసిన అప్పులు రూ. 3.47,294 కోట్లు తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన మొత్తం అప్పులు రూ. 3,47,294 కోట్లు అయితే.. తాము చెల్లించిన అసలు, వడ్డీ కలుపుకొని రూ. 3,30,570 కోట్లు అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. తాము అధికారంలో ఉన్న ఈ రెండున్నరేళ్లలో నికరంగా చేసిన అప్పు కేవలం రూ.17 వేల కోట్లు మాత్రమేనని స్పష్టంచేశారు. 2014 జూన్ 2న అధికారం చేపట్టిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్)కు అప్పటి వరకున్న అప్పులు కేవలం రూ.69 వేల కోట్లు అయితే.. వారు తమకు 2023 డిసెంబర్లో అధికారం అప్పగించే నాటికి అప్పులు రూ. 6,71,757 కోట్లకు తోడు చేతి బదులుగా, కాంట్రాక్టర్లకు బకాయిలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సినవి కలుపుకొంటే మరో రూ. 1.40 లక్షల కోట్లు ఉన్నాయని మొత్తంగా తమకు వారు అందించిన అప్పులు రూ. 8.11 లక్షల కోట్లు అని రేవంత్ వెల్లడించారు. కమీషన్లకు కక్కుర్తిపడి వారు 11 శాతం వడ్డీకి కూడా రుణాలు తీసుకున్నారని దుయ్యబట్టారు. దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలను రీస్ట్రక్చర్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని, అలా చేయడం వల్ల వడ్డీ భారం ఏటా దాదాపు రూ. 4000 కోట్లు ఆదా అవుతాయన్నారు. వైద్యానికి రూ. 4400 కోట్లు వ్యయం చేశాం పేదల వైద్యం కోసం తమ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 4,400 కోట్లు వ్యయం చేసిందని సీఎం రేవంత్ చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం కింద రూ. 2,300 కోట్లు, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 2046 కోట్లు పేదల వైద్యం కోసం ఖర్చు చేశామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రుల వద్ద పనిచేసిన పీఏలు ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పేద వారిపేట తీసుకుని వాటిని స్వాహా చేశారని, అలాంటి వారు తమను ప్రశ్నిస్తారా అని దుయ్యబట్టారు. ఆరోగ్యశ్రీని బీఆర్ఎస్ పూర్తిగా నాశనం చేసిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన రెండురోజుల్లోనే రూ. 5 లక్షలున్న ఆరోగ్యశ్రీని రూ. 10 లక్షలకు పెంచామని స్పష్టం చేశారు. నా కాలి గోటికి సరిపోవు... ‘వార్డు మెంబర్ కూడా కాని వ్యక్తి (హరీశ్‌రావు)ని మంత్రిగా చేసింది దివంగత నేత, నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. కనీసం కృతజ్ఞతా భావం ఉండాలి కదా? చంద్రబాబు దయాదాక్షిణ్యాలతో సిరిసిల్ల ఎమ్మెల్యేగా (కేటీఆర్) గెలిచారు. నేను స్వశక్తితో జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై ఆ తర్వాతే రాజకీయ పారీ్టలోకి వచ్చాను. నాతో నీకు పోలిక ఏమిటి? నాతో పోటీ ఏమిటి? నా కాలిగోటికి కూడా సరిపోవు’ అని సీఎం రేవంత్ అన్నారు. ‘2009లో పొత్తుధర్మంలో భాగంగా పాలమూరు బిడ్డలం కేసీఆర్‌ను భుజాన వేసుకుని ఎంపీగా గెలిపించాం. అన్నం పెట్టిన మాకు సున్నం పెట్టారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఏదైనా పూర్తిచేశారా?’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. విధులకు హాజరుకాకుండా జీతాలా? ‘2023 డిసెంబర్ 1 నుంచి ఇప్పటివరకు ప్రధాన ప్రతిపక్ష నేత రూ.1,06,56,674 జీతభత్యాలు పొందారు. విధులకు హాజరుకాకుండా జీతభత్యాలు తీసుకోవడంపై ఒక నిర్ణయం తీసుకోవాలి. అది ఉద్యోగులైనా రాజకీయ నేతలైనా కూడా చర్యలు తీసుకోవాలి’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు విజ్ఞప్తి... సభకు రండి, చర్చలో పాల్గొనండి.. మాజీ సీఎంకు ఆహ్వానం పలుకుతున్నాం. గవర్నర్ ప్రసంగంపై ప్రభుత్వానికి సూచనలు, సలహాలు వస్తా యని ఆశించాను. ఆశించిన మేర ప్రధాన ప్రతిపక్షం వ్యవహారశైలి లేదు’ అని అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ సభకు రావాలని, వస్తారని ఆశిస్తున్నామన్నారు. ఏఐ సునామీ రాబోతుంది... భవిష్యత్‌లో ఏఐ సునామీ రాబోతుందని రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘దీనిని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందించిన ఒక పాలసీ డాక్యుమెంట్‌ను గవర్నర్ ప్రసంగంలో వివరించారు. రాబోయే రోజుల్లో వైట్‌కాలర్ జాబ్‌లు పోయి బ్లూకాలర్ జాబ్‌లు రానున్నాయి. ప్రతిపక్ష నాయకులు తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్‌ను కనీసం చూశారా? గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మనం భవిష్యత్ ప్రణాళికలు రూపొందించకపోతే తరువాతి తరాలు మనల్ని క్షమించవు. అన్ని రంగాల మేధావులతో సమన్వయం చేసుకుని 2047 విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించుకున్నాం. తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్‌గా విభజించుకున్నాం’ అని సీఎం వివరించారు. మూసీ కాలుష్యం కంటే వీరి కడుపుల్లో విషం ఎక్కువ...గత ప్రభుత్వంలో అక్రమ నిర్మాణాలపై సభలో సీఎంగా కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ మాట్లాడిన మాటలను ట్యాబ్ ద్వారా సభలో సభ్యులకు సీఎం వినిపించారు. ‘వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆక్రమణలను నిర్దాక్షిణ్యంగా కొట్టిపారేయాలని మాట్లాడారు. అప్పుడు సక్రమమని చెప్పిన వాళ్లకు ఇప్పుడు అక్రమం ఎలా అయింది? మీరు మాట్లాడిన మాటలను ప్రజలు అప్పుడే మర్చిపోయారనుకున్నారా? మూసీ ఉప్పల్ భగాయత్‌లో మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూద్దాం రండి. ఎవరెవరు ఎక్కడ ఆక్రమించుకున్నారో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం. మూసీ కాలుష్యం కంటే వీరి కడుపుల్లో విషం ఎక్కువగా ఉంది. బుల్డోజర్లతో కొట్టేయమని చెప్పింది అప్పుడే మరిచిపోయారా’ అని పేర్కొన్నారు.ఈవీ వాహనాలకు పన్ను మినహాయింపుకాలుష్య నియంత్రణలో భాగంగా ఈవీ వాహనాలు కొనుగోలు చేసేవారికి పన్ను మినహాయించామని సీఎం తెలిపారు. త్వరలో క్యూర్ పరిధిలోని ఆటోలను ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేసి ఈవీ వాహనాలుగా మార్చబోతున్నట్టు ప్రకటించారు. ‘క్యూర్ ప్రాంతంలో ప్రక్షాళన చేస్తాం. 3 వేలకు పైగా డీజిల్‌తో నడుపుతున్న ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులతో ప్రత్యామ్నాయం చేశాం. డీజిల్, కిరోసిన్‌తో నడిచే ఆటోలను రెట్రోఫిటింగ్తో ప్రత్యామ్నాయం చేస్తాం. కాలుష్య నియంత్రణకు గట్టి చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు. హైదరాబాద్‌ను పట్టిపీడిస్తున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి మెట్రో విస్తరించాలని నిర్ణయించాం. అందులో భాగంగా రూ.25 వేల కోట్ల విలువైన మెట్రోను రూ.15 వేల కోట్లకు కొంటున్నాం. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటుంటే.. మేం మాత్రం ప్రైవేట్ సంస్థను కొనుగోలు చేస్తున్నాం. 76 కి.మీ. మెట్రోకు మేం కేంద్రానికి ప్రతిపాదనలను పంపాం’ అని చెప్పారు. చైనా నుంచి నేర్చుకుని ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. ‘కొంగరకలాన్ రోడ్డుకు టాటా దిగ్గజం రతన్ టాటా పేరు పెడితే అడ్డం పడుకుంటున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీతో మార్పు తీసుకురావాలని చూస్తే పాలకుండలో విషం చుక్కలాగా ప్రవర్తిస్తున్నారు. పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయి’ అని సీఎం రేవంత్ చెప్పారు. -
సీఎం రేవంత్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన మూడు గంటల ప్రసంగంపై తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మూడు గంటల ప్రసంగంలో సరుకు లేదు, సబ్జెక్ట్ లేదు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే మోడల్ చోర్ మోడల్. మూసి సుందరీకరణకు 16 వేల కోట్ల రూపాయలతో చేయొచ్చు. దానికి లక్ష కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ చెప్పాల్సింది అభినందన కాదు, అభిశంసన.వీధి రౌడీ మాదిరి మాట్లాడిన రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలి. స్పీకర్‌కు ఇంగితం ఉంటే ముఖ్యమంత్రి వ్యాఖ్యలను రికార్డ్స్ నుంచి తొలగించాలి. రేవంత్ రెడ్డి కన్ను తెలంగాణ భూములపై ఉంది. రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఇలానే ఉంటుందని కేటీఆర్ విమర్శించారు. -
‘దివ్యాంగులకు 16 సర్వీసుల్లో ఫ్రీ బస్సు వర్తింపచేయాలి’
సాక్షి, తాడేపల్లి: కేవలం 5 సర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ దివ్యాంగుల జీవితాలను మార్చేసినట్టు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లు బస్సెక్కి హడావుడి చేశారని వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి ఆక్షేపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే దివ్యాంగులకు ఆర్టీసీ ప్రయాణ ఛార్జీలో 50 శాతం సబ్సిడీ ఉందని గుర్తు చేశారు.చంద్రబాబుకి దివ్యాంగుల సంక్షేమం పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే మొత్తం 16 బస్సు సర్వీసుల్లోనూ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, దివ్యాంగుల సహాయకులకు 50 శాతం సబ్సిడీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దివ్యాంగుల బతుకు భారంగా మారిందని, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకపోగా సదరం సర్టిఫికెట్ల పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇంద్రధనస్సు పేరుతో ఇచ్చిన ఏడు హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రెస్మీట్లో పులిపాటి దుర్గారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..ప్రచార ఆర్భాటంతో సరి:కేవలం 5 ఆర్టీసీ సర్వీసుల్లోనే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ దివ్యాంగుల జీవితాలు మార్చేసినట్టు కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దివ్యాంగులకు మేలు చేసినట్టు ఆర్భాటంగా మంగళగిరిలో బస్సెక్కి హడావుడి చేశారు. ఇప్పటికే దివ్యాంగులకు ఆర్టీసీ బస్సు చార్జీలో 50 శాతం సబ్సిడీ పథకం అమల్లో ఉంది. ఇప్పుడు చంద్రబాబు కల్పిస్తున్నది కేవలం 50 శాతం మాత్రమే.అది కూడా 5 సర్వీసులకే వర్తింపజేస్తున్నారు. చంద్రబాబుకి దివ్యాంగుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే మిగిలిన 11 సర్వీసుల్లోనూ ఉచిత బస్సు ప్రయాణం కల్పించేవాడు. వారితోపాటు వచ్చే సహాయకులకు 50 శాతం రాయితీని అన్ని ఆర్టీసీ సర్వీసుల్లో వర్తింపజేసేవారు. టిడ్కో ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఇళ్లు కేటాయిస్తామని చెప్పినా రెండేళ్లలో ఒక్క ఇల్లు ఇచ్చింది లేదు. అమరావతిలో దివ్యాంగులకు దివ్యాంగ భవన్ కడతామని చెప్పారు. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు.2016 నాటి చట్టం అమలు చేయాలి:ఇప్పటికే మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం, వాటిలో ఎక్కడా దివ్యాంగుల ఊసే ఎత్తలేదు. 2016 నాటి చట్టం ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో 4 శాతం నిధులు అంటే, రూ.12 వేల కోట్లు దివ్యాంగుల సంక్షేమానికి కేటాయించాలి. కానీ రెండేళ్లలో కనీసం రూ.100 కోట్లు కూడా కేటాయించలేదు. నియోజకవర్గానికి 5 ట్రై మోటార్ సైకిళ్లు ఇస్తామని చెప్పినా అరకొరగా పంపిణీ చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఆ ఇచ్చే వాటిని కూడా అర్హులైన వారికి కాకుండా టీడీపీ కార్యకర్తలకు ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. దివ్యాంగులు ఎక్కడికెళ్లినా ఇబ్బందులు:చంద్రబాబు దివ్యాంగులకు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చకపోగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్నో విధాలుగా వేధిస్తున్నాడు. గతంలో వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 365 రోజులపాటు ఎప్పుడైనా సదరం సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకుంటే వలంటీర్ వ్యవస్థ ద్వారా డాక్టర్లు నేరుగా ఇంటికొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేసేవారు.కానీ నేడు కూటమి పాలనలో సోమ, మంగళవారాలు మాత్రమే దరఖాస్తు చేసుకునే నిబంధన పెట్టారు. పైగా వైద్య పరీక్షల కోసం సొంత జిల్లాలకు కాకుండా పక్క జిల్లాలకు వెళ్లే నిబంధన పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. పైగా సదరం సర్టిఫికెట్లలో తప్పులు దొర్లితే వాటిని సరి చేసుకునే అవకాశం కూడా ఉండటం లేదు.డిజెబిలిటీ శాతం తక్కువగా చూపించి పింఛన్లలో కోతలు విధిస్తున్నారు. పింఛన్ల మీద ఆధారపడి బతుకుతున్న దివ్యాంగులకు పింఛన్లు తీసేసి వారి బతుకులను చంద్రబాబు అంధకారంలోకి నెట్టేశాడు. రెండేళ్లలో పింఛన్లు తీసేయడమే కానీ, దివ్యాంగులకు కొత్తగా ఒక్క పింఛన్ ఇచ్చిన పాపాన పోలేదు. గతంలో దివ్యాంగులకు అందజేసే ట్రై మోటార్ సైకిళ్లు, హియరింగ్ యంత్రాలు, బ్లైండ్ పర్సన్స్ కి స్టిక్స్ వంటివి ఇవ్వడం ఆపేశారు. దివ్యాంగుల పిల్లలకు ప్రత్యేకమైన స్కూల్స్, ప్రత్యేక వైద్యసేవలు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి మోసగించారు.దివ్యాంగ విద్యార్థులకు వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అందే స్కాలర్షిప్స్ కూడా అందకుండా చేశారు. ప్రభుత్వ కాలేజీలు, స్కూల్స్, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు, వీల్ చైర్లు ఉండటం లేదు. దివ్యాంగులకు హక్కుగా దక్కాల్సిన సౌకర్యాలు కల్పించడం లేదు. దివ్యాంగులు ఆలయాలకు వెళ్లినా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ ఎప్పుడు?:వైఎస్సార్సీపీ తరఫున రోడ్డెక్కి ఉద్యమిస్తే కానీ 2024–25, 2025–26 బ్యాక్ లాగ్ ఉద్యోగాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదు. తూతూమంత్రంగా కడప, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో నోటిఫికేషన్ ఇప్పించారు. కానీ ఇంతవరకు ఆ ప్రక్రియ మొదలు కాలేదు. 3 జిల్లాల్లో నోటిఫికేషన్ ఇచ్చేస్తే మిగతా జిల్లాల పరిస్థితి ఏంటో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.వైఎస్సార్సీపీ హయాంలో రుణ సబ్సిడీలు ఇచ్చి స్వయం ఉపాధిని ప్రోత్సహించడంతో పాటు, నైపుణ్యాభివృద్ధికి తోడ్పడడం జరిగింది. కానీ నేడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడంతో దివ్యాంగులకే ఎక్కువ నష్టం జరిగింది టీడీపీ కూటమి ఎన్నికల ముందు దివ్యాంగులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని పులిపాటి దుర్గారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
ఎన్నికల వేళ పొత్తులపై కుండబద్దలు కొట్టిన విజయ్
చెన్నై: పొత్తులపై టీవీకే చీఫ్, సినీనటుడు విజయ్ క్లారిటీ ఇచ్చారు. ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. ఎన్డీఏ కూటమిలోకి వెళ్లే ప్రసక్తే లేదని అన్నారు. తనను అణచివేయాలని కుట్ర పన్నుతున్నారని చెప్పారు.తమిళనాడులోని మహాబలిపురంలో విజయ్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... "మేము ప్రజల టీమ్. కొందరు మమ్మల్ని దెబ్బతీయడానికి చాలా ప్రయత్నించారు... కానీ, అది పని చేయలేదు. మేము ఏదో ఒక కూటమిలో చేరతామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేము ఎప్పుడూ లౌకికవాదం, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటామని స్పష్టంగా చెబుతున్నాను. దానిపై రాజీ పడము. ఎవరైనా వదంతులు వ్యాప్తి చేస్తే నమ్మవద్దు. మన లక్ష్యాన్ని కచ్చితంగా సాధించగలం" అని అన్నారు.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 23న జరగనున్నాయి. టీవీకేను నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. విజయ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి.కాగా, దీనిపై ఇప్పటికే టీవీకే నేత ఆధవ్ అర్జునా మాట్లాడుతూ.. అలాంటి వదంతులను నమ్మవద్దని చెప్పారు. ఇటీవల కొన్ని మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమ వేదికల్లో రాజకీయ లబ్ధి కోసం ఉద్దేశపూర్వకంగా కొన్ని తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా బీజేపీ/ఏఐఏడీఎంకే, శశికళ, డాక్టర్ అయ్యా రామదాస్‌తో చర్చలు జరుగుతున్నాయనే సమాచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. -
రాహుల్‌పై కంగనా ‘పోకిరి’ వ్యాఖ్యల దుమారం
సాక్షి,న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ప్రవర్తన మహిళలకు అసౌకర్యాన్ని కలిగిస్తుందని, ఆయన వ్యవహరించే తీరుతో మహిళలందరమూ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నామన్నారు. అంతేకాదు రాహుల్ ఒక "టపోరీ"(ఆకతాయి)లా వచ్చి వెడతారన్న వ్యాఖ్యలు దుమారాన్ని రాజేశాయి.పార్లమెంటరీ నిబంధనలను ఉల్లంఘించినందుకు రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ 200కుపైగా మాజీ అధికారులు రాసిన బహిరంగ లేఖ రాజకీయ చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రవర్తనపై వచ్చిన విమర్శలపై రనౌత్ స్పందిస్తూ, రాహుల్‌ని చూస్తే మహిళలంతా అసౌకర్యానికి గురవుతారని, ఎందుకంటే ఒక పోకిరిలాగా దూకుడుగా మాట్లాడటం, ఇంటర్వ్యూలు ఇచ్చే వారిని ఎగతాళి చేస్తూ ఇబ్బంది పెడతారని ఆమె మండిపడ్డారు.Delhi: On Leader of Opposition Rahul Gandhi, BJP MP Kangana Ranaut says, "Hum mahilaon ko bahut zyada unko dekhkar uncomfortable feel hota hai, Kyunki ekdum jaise tapori ki tarah wo aate hain aur kisi ko bhi 'aae tu aise karke, tu tadak kar' kehte hain...'' pic.twitter.com/XzZ62MmLbg— IANS (@ians_india) March 18, 2026ప్రియాంకతో పోలికఅయితే రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా హుందాగా ప్రవర్తిస్తారని కంగనా పేర్కొన్నారు. రాహుల్ తన సోదరి ప్రియాంకగాంధీని చూసి నేర్చుకోవాలని హితవు పలకం విశేషం. ప్రియాంక ప్రవర్తన చాలా బాగుంటుందని, కానీ రాహుల్ ప్రవర్తన మాత్రం "సిగ్గుచేటు" అంటూ కంగనా రనౌత్ ఘాటు విమర్శలు చేసారు. ఇదీ చదవండి: బిడ్డల కోసం...గుండెల్ని పిండేసే అమ్మ కథ!రాహుల్ గాంధీపై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్రంగా స్పందించారు. వ్యక్తిగత, రాజకీయ విభేదాలు ఉండవచ్చు, కానీ రాహుల్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. మహిళల గౌరవం, వారి అభ్యున్నతి పట్ల ఆయన చాలా నిబద్ధతతగా ఉంటారనీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడు ఆయనతో కలిసి పనిచేశానని చెప్పారు. ఇందిరా గాంధీ, సోనియా లాంటి మహిళా నాయకత్వ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిపై ఇటువంటి ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.#WATCH | Delhi | Over Kangana Ranaut's comments on Rahul Gandhi, Shiv Sena (UBT) MP Priyanka Chaturvedi says, "There could be personal or political disagreements, but saying something like this for Rahul ji is wrong. I have seen Rahul ji's commitment towards the upliftment of… pic.twitter.com/w5tzBvsjax— ANI (@ANI) March 18, 2026 -
‘కోర్టు తీర్పులకు భిన్నంగా పోలీసులు వ్యవహరించారు’
సాక్షి, తాడేపల్లి: న్యాయ స్థానాల తీర్పులకు భిన్నంగా పోలీసులు వ్యవహరించారని.. తనపై పెట్టిన అక్రమ కేసులపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశానని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సత్తెనపల్లి, నల్లపాడు, పట్టాభిపురం పోలీస్ స్టేషన్లలో అక్రమ కేసులు నమోదు చేశారన్నారు.‘‘ఏడేళ్ల లోపు శిక్షలు పడే కేసులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలి. నేను 18 రోజులు సెంట్రల్జైల్లో ఉండాల్సి వచ్చింది. ఏడు సంవత్సరాలకు లోబడి శిక్ష పడే కేసుల్లో ముద్దాయిని కోర్టులో ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని గత జడ్జిమెంట్లు చెబుతున్నాయి. చట్టాన్ని పోలీసులు ఉల్లంఘించారు. రాజకీయ ఒత్తిళ్లతో నన్ను ఎక్కువ రోజులు జైల్లో పెట్టేందుకు చిన్న కేసులో కూడా కోర్టులో ప్రవేశపెట్టారు. చంద్రబాబు, లోకేష్ చెప్తే పోలీసులు నన్ను కోర్టులో ప్రవేశపెట్టారు’’ అని అంబటి మండిపడ్డారు‘‘నా అరెస్టు, రిమాండ్ విధించిన వైనంపై న్యాయ పోరాటం చేస్తున్నా. సుప్రీంకోర్టు తీర్పులకు భిన్నంగా నన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులకు కోర్టులో హాజరుపరచాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలు అలాగే ఉంది. నా మీద ఉన్న కేసులన్నీ ఏడేళ్లలోపు శిక్ష పడేవే. అయినాసరే పోలీసులు రాజకీయ ఒత్తిడికి గురై ఎక్కువ కాలం జైల్లో ఉంచేందుకు ప్రయత్నించారు. దీనిపై నేను హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాను. కోర్టు అయినా రిమాండ్ విధించకుండా ఉండాల్సింది. ఈ విషయంపై కూడా హైకోర్టు రిజిస్టారుకి ఫిర్యాదు చేశాం’’ అని అంబటి పేర్కొన్నారు...మా ఇల్లు, కార్ల మీద దాడి ధ్వంసం చేసిన వారికి స్టేషను బెయిల్ ఇచ్చారు. ఈ వ్యవహారం పై కూడా న్యాయపోరాటం చేయబోతున్నా. నన్ను లాకప్ లో హింసించారు. ఈ కస్టోడియల్ టార్చర్ మీద కూడా న్యాయపోరాటం చేస్తా. ప్రజాస్వామ్యంలో అలా జరగటానికి వీల్లేదు. రాష్ట్రంలో పోలీసులు, దొంగలు కలిసిపోయినట్టుగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ ఒక్కటే మార్గం. చట్టం మీద గౌరవం పెంచటానికే న్యాయపోరాటం చేస్తున్నా. 7 గంటల 25 నిమిషాల పాటు నా ఇంటి మీద దాడి జరిగింది. మరి పోలీసులు ఏం చేస్తున్నట్టు?. నాపై దాడిని ఎందుకు అడ్డుకోలేదు?..ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ లేదని ఆ సంఘటన నిరూపించింది. నా ఇల్లు, కార్లు ధ్వంసం చేయడానికి పోలీసులు సహకరించారు. తమ కళ్ల ముందు జరుగుతున్న దాడులను అడ్డుకోని పోలీసులు కూడా నేరస్థులే. ఇలాగే పోలీసులు వ్యవహరిస్తే వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుందా?. పోలీసు వ్యవస్థ సరైనదారిలో నడవాలంటే న్యాయవ్యవస్థ స్పందించాలి. దీనిపై ఎంతదూరం వెళ్లటానికైనా సిద్ధమే...రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలం అయ్యాయన్న సంగతి అందరికీ తెలిసి పోయింది. పోలీసులను మేనేజ్ చేస్తే ఏమైనా చేయొచ్చని జనం అనుకుంటే అరాచకం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగటానికి వీల్లేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే. ప్రజలకు మాత్రం దుర్మార్గమైన ప్రభుత్వం. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేదే లేదు. ఉన్నదంతా ఆటవిక సమాజమే. పవన్ కళ్యాణ్ ఇంటిపై కూడా ఇలాంటి దాడి జరిగితే అప్పుడు తెలుస్తుంది’’ అని అంబటి రాంబాబు అన్నారు. -
‘ముస్లింలను చంద్రబాబు మోసం చేశారు’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ముస్లింలను మోసం చేశారని.. పవిత్ర ఇఫ్తార్‌లో పాల్గొని కూడా అబద్ధాలు చెప్పటం బాధాకరమని వైఎస్సార్సీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇమామ్‌లకు రూ. 10 వేలు, మౌజన్లకు రూ.5 వేలు ఇస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే అధికారంలోకి రాగానే ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది’’ అని అంజాద్ బాషా గుర్తు చేశారు.‘‘చంద్రబాబు 2019-24 మధ్య పెట్టిన బకాయి రూ.24 కోట్లను కూడా జగనే తీర్చారు. మొన్నటి ఎన్నికలకు ముందు ముస్లింలకు ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదు. 50 ఏళ్లు దాటిన ముస్లింలకు పెన్షన్ ఇస్తానన్న చంద్రబాబు ఎందుకు ఇవ్వటం లేదు?. ఈద్గాలు, ఖబరస్థాన్లకు భూమి ఇస్తానన్న చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదు?’’ అంటూ అంజాద్ బాషా నిలదీశారు.‘‘విజయవాడలో హజ్ హౌస్ నిర్మిస్తానని చెప్పి, ఇప్పటికీ స్థలం కూడా కేటాయించలేదు. నూర్ బాషా కార్పోరేషన్‌కు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. గౌరవ వేతనం కూడా ఆర్నేళ్లుగా ఇవ్వకుండా బకాయి పెట్టారు. గట్టిగా పోరాటం చేస్తే రిలీజ్ చేసి పండుగ చేసుకోమంటున్నారు. అడ్వాన్స్ ఇచ్చి పండగ చేసుకోమన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. హజ్ యాత్రికులకు వైఎస్ జగన్ ఆర్థిక సహాయం అందించారు. 1870 మంది యాత్రికులు వెళ్తే కేవలం 72 మందికే చంద్రబాబు ఆర్థిక సాయం చేశారు. ఇదే మా ముస్లింల మీద చంద్రబాబుకు ఉన్న ప్రేమ?. ఈ ఏడాది వెళ్తున్న 2005 మంది హజ్ యాత్రికులకు అందరికీ లక్ష చొప్పున ఇవ్వాల్సిందే’’ అని అంజాద్ బాషా డిమాండ్ చేశారు.‘‘వైఎస్ జగన్ హయాంలో విజయవాడలోనే ఎంబార్కేషన్ పాయింట్‌ను ఓపెన్ చేశారు. ఒక్కొక్క ముస్లిం మీద పడిన రూ.83 వేలు అదనపు భారాన్ని కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే భరించింది. వైఎస్ జగన్ ముస్లింల సంక్షేమం కోసం రూ.24,304 కోట్లు ఖర్చు చేశారు. ముస్లింల మీద జగన్ ఎంత ప్రేమ చూపిస్తారో అర్థం చేసుకోవచ్చు. మైనారిటీలకు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఐదుగురికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. ఇక్బాల్‌కి ఎమ్మెల్సీ ఇచ్చారు. జకియాఖానంకి ఎమ్మెల్సీ ఇచ్చి మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. 12 కార్పొరేషన్లకు ముస్లింలను ఛైర్మన్లుగా చేశారు. చంద్రబాబు హామీలు ఇవ్వటమే తప్ప.. ముస్లింలకు చేసింది ఏమీ చేయలేదు..వక్ఫ్ ఆస్తులు కాపాడటంలో కూటమి ప్రభుత్వం విఫలం. 460 ఎకరాల వక్ఫ్ భూమి కబ్జాకు గురైంది. చినకాకాని దగ్గర ఉన్న 71 ఎకరాల వక్ఫ్ భూమి మీద నారా లోకేష్ కన్ను పడింది. పరిశ్రమల పేరుతో తీసుకునేందుకు జీవో ఇచ్చారు. రాజధానిలో ఉన్న వేల ఎకరాల భూములను కాదని వక్ఫ్ భూములు ఎందుకు తీసుకుంటున్నారు?. వక్ఫ్ భూములను కాపాడుకోవటానికి మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. కూటమి ప్రభుత్వంలో ముస్లింలకు రక్షణ లేదు..వినుకొండలో రషీద్ అనే ముస్లిం యువకుడిని నడిరోడ్డు మీద చంపేశారు. పుంగనూరులో మైనారిటీ బాలికను హత్య చేసి నీళ్లలో పడేశారు. రాయచోటిలో కౌన్సిలర్ మీద టీటీడీ గూండాలు దాడి చేశారు. పులివెందులలో బీటెక్ రవి అనుచరులు.. దంపతుల మీద దాడి చేశారు. నెల్లూరు జిల్లాలో ఒక ముస్లింని హత్య చేశారు’’ అంటూ అంజాద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
డ్రగ్స్ కేసు.. సిట్ అంటేనే కూర్చోవడం: బీజేపీ సెటైర్లు
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సెటైరికల్ కామెంట్స్ చేశారు. డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో సిట్ వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. సిట్ అంటేనే కూర్చోవడం అంటూ ఎద్దేవా చేశారు. నాయకులే డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం బాధాకరం అని వ్యాఖ్యానించారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలిస్తామని రేవంత్ చెప్పినవన్నీ ఉత్త మాటలే అలా జరిగితే.. ఫాంహౌస్‌కు డ్రగ్స్ ఎలా వచ్చాయి. నాయకులే డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం బాధాకరం. స్కూలు పిల్లలకు కూడా డ్రగ్స్ సరఫరా అవుతోంది. డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో సిట్ వల్ల ఒరిగేదేమీ లేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరిగిందో ఇక్కడా అదే జరుగుతుంది. సిట్‌తో జరిగేదేమీ ఉండదు. డ్రగ్స్, ల్యాండ్, లిక్కర్ దందాలన్నీ కాంగ్రెస్ కనుసన్నల్లో సాగుతోందిఆర్ఎస్ఎస్ ని నిషేధించాలని కాంగ్రెస్ అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. భారత నిఘా విభాగం ‘రా’ను కూడా నిషేధించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. చండూరులో కాంగ్రెస్ దుండగులు బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం చేశారు. ఆస్పత్రిలో చికిత్స అందించకుండా కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు. తెలంగాణలో దారుణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. నల్లగొండలో ప్రజాస్వామ్యం లేదు. రాచరిక పాలన కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిపై పోలీసులు చేయి చేసుకున్నారు.పెద్దపల్లి, మంచిర్యాలలో పోలీసుల బలంతో బీజేపీని అణిచివేసే ప్రయత్నం జరుగుతోంది. బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం చేస్తే ఓ చిన్న కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నాయకులు స్వార్థం కోసమే పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నారు. తెలంగాణలో గూండా రాజ్యం నడుస్తోంది. బీజేపీ కార్యకర్తలపై దాడి చేస్తే తిరగబడతాం అని హెచ్చరించారు. అలాగే, తెలంగాణలో కరెంట్ కోతలు విపరీతంగా ఉన్నాయి. కరెంట్ సరఫరా పూర్తి స్థాయిలో కొనసాగించాలి. పంటలు కూడా ఎండిపోతున్నాయి అని వ్యాఖ్యలు చేశారు. -
‘నేను భోజనం చేస్తున్నాను.. ప్రస్తుతం పాయసం తింటున్నాను’
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాలంటేనే.. ఐతే డీఎంకే.. లేకపోతే అన్నాడీఎంకే అన్నట్లుగా పరిస్థితులుంటాయి. ఈ రెండు పార్టీలు మినహా.. మరో పార్టీ పాగా వేసే అవకాశాలే ఉండవంటే.. అక్కడి పరిస్థితులను, ఓటర్ల విస్పష్ట తీర్పును అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు ఒక్కటిగా ఉన్న డీఎంకే.. అలనాటి మేటి నటుడు ఎంజీఆర్‌ను కరుణానిధి అణచివేయడంతో అన్నాడీఎంకేగా చీలిపోయింది. ఒక్క మంత్రి పదవి విషయంలో కరుణానిధి మంకుపట్టు.. తమిళనాట మరో ద్రావిడ పార్టీ పుట్టుకకు కారణమైంది. ఒక్క మంత్రి పదవి విషయంలో ఎంజీఆర్‌ను దేశంలో ఎన్నికల సందడి మొదలైంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. తమిళనాడు ఎన్నికలపై ఇప్పుడు దేశమంతా దృష్టిసారించింది. ఒకప్పుడు తమిళగళాన్ని దేశానికి వినిపించేందుకు ఒక్క డీఎంకే పార్టీ ఉండేది. ద్రావిడ వాదంతో ఆ పార్టీ ముందుకు సాగేది. అలనాటి మేటి నటుడు ఎంజీఆర్ తోడవ్వడంతో... కరుణానిధి దూసుకుపోయారు. అయితే.. ఒక్క మంత్రి పదవి విషయంలో ఎంజీఆర్‌ను పక్కన పెట్టడమే కాకుండా.. కరుణానిధి ఆయనను రాజకీయంగా సినిమాలపరంగా అణచివేయడం.. పార్టీ నుంచి బహిష్కరించినా.. పరోక్ష టార్చర్‌ను నిలిపివేయకపోవడం వంటి పరిణామాలు డీఎంకే చీలికకు దారితీశాయి. అప్పటి నుంచి తమిళ రాజకీయాల్లో అయితే డీఎంకే.. లేకపోతే అన్నాడీఎంకే అన్నట్లుగా పరిస్థితులు మారడమే కాకుండా.. ఎవరు అధికారంలోకి వచ్చినా.. ప్రత్యర్థులపై కక్షసాధింపు రాజకీయాలు తీవ్రమయ్యాయి.ఎంజీఆర్ క్రేజ్.. అక్కసు వెళ్లగక్కిన కరుణానిధిఅది 1971.. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో డీఎంకే ఘనవిజయం సాధించింది. కరుణానిధికి ఇది రెండోసారి వరుస విజయం. రాజాజీ నేతృత్వంలోని కూటమి ఆ ఎన్నికల్లో ఓటమిపాలైంది. కేంద్రంలోని అప్పటి ఇందిరాగాంధీ సర్కారుకు డీఎంకే దన్నుగా నిలిచింది. నిజానికి అప్పటి డీఎంకే సారధి కరుణానిధే అయినప్పటికీ.. ఆ పార్టీ అభివృద్ధికి ఎంజీఆర్ ఎనలేని సేవ చేశారు. ఆయనకున్న ఫేమ్.. ఫ్యాన్స్ ఫాలోయింగ్ పార్టీని విజయాల బాట పట్టించింది. ఆ తర్వాత.. పార్టీలో ఎంజీఆర్‌కు క్రమంగా పెరుగుతున్న ఆదరణను గుర్తించిన కరుణానిధి.. అణచివేత ధోరణిని ప్రారంభించారు. ఎంజీఆర్ తనకు ఆరోగ్యశాఖ కావాలని కోరుతూ.. మంత్రిపదవిని ఆశించారు. ఆ క్రమంలోనే ఇందిరాగాంధీ శ్రీలంకను సందర్శించడం డీఎంకేకు ససేమిరా నచ్చలేదు. ఆయన శ్రీలంకలో తమిళుల కోసం వేర్పాటువాదాన్ని ప్రోత్సహించారు. ఈ పరిణామాలన్నీ.. డీఎంకేలో చీలిక వస్తుందనే సందేశాలకు దారితీశాయి.సినిమా వర్సెస్ రాజకీయం.. ఏదో ఒకటే కరుణానిధి మంత్రిపదవుల విషయంలో తన మంకుపట్టును వదల్లేదు. ఎంజీఆర్‌ను ఈ విషయంలో పక్కనబెట్టారు. ఆ సమయంలో జమ్మూకశ్మీర్‌లో ఓ చిత్ర షూటింగ్లో ఉన్న ఎంజీఆర్.. స్వయంగా కరుణానిధికి ఫోన్ చేశారు. తనకు ఆరోగ్యశాఖ మంత్రిగా అవకాశమివ్వాలని కోరారు. అయితే.. నటనకు దూరమైతేనే మంత్రిగా ప్రజాసేవకు అవకాశమిస్తానని కరుణానిధి తేల్చిచెప్పారు. ఎందుకంటే.. అప్పటికే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ యాక్షన్ నిబంధనలను తూచ తప్పకుండా పాటించే పార్టీగా డీఎంకేకు పేరుంది. జోడుపదవులు తగదనేది కరుణానిధి ఆలోచన. ‘నేను భోజనం చేస్తున్నాను. ప్రస్తుతం పాయసం తింటున్నాను’అయినప్పటికీ ఆయన ఎంజీఆర్‌కు క్యాబినెట్ హోదాను కల్పిస్తూ.. రాష్ట్ర చిన్నమొత్తాల పొదుపు పథకానికి చైర్మన్‌గా అవకాశం కల్పించారు. అప్పటి నుంచి కరుణానిధితో ఎంజీఆర్ అంటీముట్టనట్లుగా వ్యవహరించారు. 1971 అక్టోబరులో ఎంజీఆర్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ వెంటనే కరుణానిధి అమెరికా వెళ్లారు. అదే సమయంలో.. అప్పటి రాష్ట్రపతి వీవీ గిరి డిసెంబరు 3న దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. దాంతో అమెరికా పర్యటనలో ఉన్న కరుణానిధి డిసెంబరు 5న ఆగమేఘాల మీద చెన్నైకి తిరిగి వచ్చారు. ఈ పరిణామాలకు సంబంధించి అప్పట్లో ’ద హిందూ‘ విలేకరి సత్య స్టూడియోలో షూటింగ్లో ఉన్న ఎంజీఆర్ స్పందన కోసం ఫోన్ చేశారు. ఆ ఫోన్‌ను లిఫ్ట్ చేసిన ఎంజీఆర్ అసిస్టెంట్ మహాలింగం.. విషయాన్ని ఎంజీఆర్‌కు చేరవేశారు. దానికి ఎంజీఆర్ స్పందిస్తూ.. ‘నేను భోజనం చేస్తున్నాను. ప్రస్తుతం పాయసం తింటున్నాను’ అని సమాధానమిచ్చారు. అప్పట్లో ఆ మాట పతాకశీర్షికలకెక్కింది.కరుణానిధిలో భయం పుట్టించిన ఎంజీఆర్?వేగంగా మారుతున్న పరిణామాలు కరుణానిధికి మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి. దాంతో ఆయన ఎంజీఆర్‌కు పోటీగా తన కుమారుడు ఎంకే ముత్తును వెండితెరకు పరిచయం చేశారు. ఎంజీఆర్‌కు సినిమా అవకాశాలు రాకుండా తెరవెనక మంత్రాంగం నెరిపారు. కరుణానిధి ఆదేశాలతో.. పోలీసులు కూడా ఎంజీఆర్ అభిమాన సంఘాలపై అణచివేత ధోరణిని కొనసాగించారు. ఎంకే ముత్తు అభిమాన సంఘాలు పెరిగేందుకు చర్యలు ప్రారంభించారు. ఎంజీఆర్‌ను అభిమానించే 700 ఫ్యాన్స్ క్లబ్ నేతలపై ఒత్తిడి మొదలైంది. ఈ పరిణామాలన్నీ ఎంజీఆర్‌కు మరింత చిరాకు పుట్టించాయి. దాంతో.. ఎంజీఆర్ వేరుకుంపటి ప్రకటన వెలువడింది. ఆ ప్రకటనతో వెనక్కి తగ్గిన కరుణానిధి ఓ అడుగు వెనక్కి తగ్గారు. ఎంకే ముత్తు ఫ్యాన్స్ క్లబ్‌లను రద్దు చేయాలని ఆదేశించారు. ఈ ఒక్క ఆదేశంతో డీఎంకేలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కరుణానిధి భయపడ్డారనే ప్రతికూల సందేశం దేశంలో వ్యాపించింది.పురుడు పోసుకున్న అన్నాడీఎంకేఎంజీఆర్ అంతటితో ఆగలేదు. డీఎంకే పరిపాలనలో లోపాలను ఎత్తిచూపుతూ ప్రజల్లోకి వెళ్లారు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గళమెత్తారు. అవినీతి పాతుకుపోయిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. మద్యపానం కారణంగా ప్రాణాలు పోతున్నాయంటూ సమాజానికి చాటిచెప్పారు. నిజానికి ఎంజీఆర్‌ను డీఎంకే నుంచి బహిష్కరించడం వల్ల ఆయనకు జరిగిన నష్టం లేదు కానీ.. డీఎంకే పార్టీ ఎంతగానో ప్రజాదరణను కోల్పోవడానికి కారణమైంది. తనను పార్టీ నుంచి బహిష్కరించిన ఏడాది కాలంలోనే.. అంటే.. 1972 అక్టోబరు 17న ఎంజీఆర్ అన్నాడీఎంకేను స్థాపించారు. 1986లో ఎంజీఆర్ భార్య జానకీరామచంద్రన్ పార్టీకి విరాళంగా చెన్నైలోని రాయపేటలో ఉన్న తన భవనాన్ని విరాళంగా ఇచ్చారు. అప్పటి నుంచి అయితే డీఎంకే.. లేకపోతే అన్నాడీఎంకే అన్నట్లుగా తమిళ రాజకీయాలు కొనసాగాయి. ఎంజీఆర్ వారసురాలిగా 1989 నుంచి 2016 వరకు అన్నాడీఎంకేను జయలలిత నడిపించారు. -
‘మలయాళ’ రాజకీయం మారుతోందా?
కేరళలో పొలిటికల్ హీట్ పెరిగింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 140 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష కూటమి పక్కా ప్లాన్‌తో ఉండగా.. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు హస్తం పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఇక, తొలిసారి ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాషాయ పార్టీ బీజేపీ.. ఉవ్విళ్లూరుతోంది. దీంతో,‘గాడ్స్ ఓన్ కంట్రీ’ కేరళలో ముక్కోణపు పోటీ నెలకొంది. ఎన్నికల వేళ పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి? కేరళ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉందంటే..విజయన్ 3.0 సాధ్యమేనా?ప్రస్తుతం కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలో ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది. గత రెండు ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమి భారీ విజయాలను దక్కించుకుంది. దీంతో 'విజయన్ '3.0' కోసం వామపక్షాలు వ్యూహ రచన చేస్తున్నాయి. అభివృద్ధి మార్కు పాలనతో హ్యాట్రిక్ కొట్టి చరిత్ర సృష్టించాలని సీపీఎం నాయకత్వంలోని కూటమి ఆశపడుతోంది. అయితే, విజయ్ పేరు, ఆయన నాయకత్వమే కూటమి పెద్ద సానుకూలత. ఆయన నాయకత్వంలో ఎన్నికలకు పోవడం కూటమికి కలిసొచ్చే అంశం. రాష్ట్రంలో ఏ కూటమికి, పార్టీకి కానీ ఇంత స్థాయి ఉన్న లీడర్ లేకపోవడం వామపక్షాలకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. ఇదే సమయంలో సీనియర్ లీడర్‌గా, సీఎంగా విజయన్‌కు అనుభవం కూడా ఉంది. అలాగే, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఎల్డీఎఫ్ భావిస్తోంది.మరోవైపు.. ఇటీవలి కాలంలో శబరిమల బంగారు ఆభరణాల మాయం వంటి అంశాలు విజయన్ ప్రభుత్వం పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. ఈ పరిణామం హిందూ ఓటర్లను ప్రభావితం చేయవచ్చు. అలాగే, శబరిమల విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని పలువురు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కేరళకు రావాల్సిన నిధులను కేంద్రం ఆపేస్తోందని, అప్పుల పరిమితిని తగ్గించి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటోందని ప్రాంతీయ సెంటిమెంట్‌ను రగిలిస్తోంది. ఇక, వయనాడ్ భూకంప బాధితులకు కేంద్రం నుంచి ఆశించిన సాయం అందలేదని ప్రభుత్వం ఆరోపిస్తున్నప్పటికీ, రాష్ట్ర యంత్రాంగం వైఫల్యాలను ప్రతిపక్షాలు ఎత్తిచూపుతున్నాయి.హస్త‘గతం’ అవుతుందా?కేరళలో పదేళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్‌కు ఈ ఎన్నికలు ఎంతో కీలకం కానున్నాయి. విజయన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని యూడీఎఫ్ భావిస్తోంది. రాష్ట్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న ముస్లిం, క్రైస్తవ ఓటర్లను ఆకర్షించడంలో యూడీఎఫ్ పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా జేడీఎస్ వంటి పార్టీలు ఎన్డీఏ వైపు వెళ్లడం, విజయన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల మైనారిటీలు యూడీఎఫ్‌కు దగ్గర అయినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి సీట్ల సర్దుబాటు విషయంలో మిత్రపక్షాల మధ్య పెద్దగా వివాదాలు తలెత్తకపోవడం యూడీఎఫ్ కలిసొచ్చే అంశం.అలాగే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని 20 స్థానాలకు గానూ 18 స్థానాలను యూడీఎఫ్ గెల్చుకుంది. ఈ విజయం యూడీఎఫ్ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అయితే, కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు యూడీఎఫ్‌కు ప్రతికూలంగా మారాయి. అలాగే, యూడీఎఫ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై స్పష్టత లేదు. అన్నింటికి మించి పాలక్కాడ్ మాజీ ఎమ్మెల్యే రాహుల్ మామ్కూటత్తిల్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి. ఈ వ్యవహారం కేరళలో తీవ్ర చర్చకు దారి తీసింది.కాషాయ జెండా ఎగిరేనా?కేరళ రాజకీయ చరిత్రలో బీజేపీ ఏనాడూ పెద్దగా విజయాలు సాధించిన దాఖలాలు లేవు. కేరళలో గతంలో ఒక్క సీటు కోసం పోరాడిన బీజేపీ ఇప్పుడు నిర్ణయాత్మక శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. కాగా, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఊహించని విధంగా విజయాలను అందుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్ గెలిచిన తర్వాత బీజేపీ కేడర్‌లో ఫుల్ జోష్ వచ్చింది. మరోవైపు.. కేంద్రంలోని పెద్దలు ప్రధాని మోదీ సహా పలువురు కేరళకు వెళ్లడం ప్రచారంలో పాల్గొనడం కాషాయదళానికి ఊపునిచ్చింది. ఈ నేపథ్యంలో కేరళంలో బలమైన ముద్ర వేయాలని బీజేపీ భావిస్తోంది. అలాగే, ప్రాంతీయ పార్టీలతో పొత్తు కుదుర్చుకోవడం ద్వారా బీజేపీ తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. దీంతో, హిందువుల ఓట్లపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.త్రిముఖ పోరు.. కేరళ రాజకీయాల్లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతుందనే ఆనవాయితీ గతంలో ఉండేది. కానీ, 2021లో ఎన్నికల్లో ఆ ఆనవాయితీని సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ బద్దలు కొట్టింది. దీంతో ఈసారి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయనే ఆసక్తి నెలకొంది. ఇక, 2021 ఎన్నికల్లో ఫలితాలు ఇలా ఉన్నాయి. ఎల్డీఎఫ్ మొత్తం 99 స్థానాలను గెల్చుకోగా.. అందులో సీపీఎం 62, సీపీఐ 17, కేరళ కాంగ్రెస్ (ఎం) 5, జేడీఎస్ 2, ఎన్సీపీ 2, ఇతరులు 11 సీట్లను సాధించాయి. ఇక యూడీఎఫ్ విషయానికి వస్తే, కాంగ్రెస్ 21 సీట్లు, ముస్లిం లీగ్ 15, కేరళ కాంగ్రెస్ 2, ఇతర మిత్రపక్షాలు 3 సీట్లను గెల్చుకున్నాయి. 2016 ఎన్నికల్లో గెలిచిన ఏకైక స్థానాన్ని (నెమమ్) కూడా బీజేపీ ఈ ఎన్నికల్లో కోల్పోయింది.మ్యాజిక్ ఫిగర్.. కేరళలో 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 71 స్థానాల్లో విజయం సాధించాలి. -
అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్‌కు బిగ్ షాక్
గువాహటి: అస్సాంలో మరో 20 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో విపక్ష కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రం నుంచి లోక్‌సభకు ఎన్నికైన సిట్టింగ్ ఎంపీ ప్రద్యుత్ బోర్దోలీ మంగళవారం కాంగ్రెస్ పార్టీని వీడారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన ఈ మేరకు తన రాజీనామా లేఖను పంపారు.ఈ సందర్భంగా లేఖలో..‘తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అన్ని పదవులకూ రాజీనామా చేస్తున్నా’ అని ప్రద్యుత్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అస్సాం కాంగ్రెస్ చీఫ్ గౌరవ్ గొగోయ్ స్పందిస్తూ..‘ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మీడియా ద్వారా ప్రద్యుత్‌ను రాజకీయంగా మభ్యపెట్టారు. అదీ కాకుండా ఆయనకు కుటుంబ విబేధాలు ఉన్నాయి’ అని అన్నారు. మరోవైపు ప్రద్యుత్ కుమారుడు ప్రతీక్ ఏప్రిల్ 9న జరగబోయే శాసనసభ ఎన్నికల్లో మార్గేరీటీ స్థానం కాంగ్రెస్ తరఫున పోటీపడుతున్నారు. కాగా, ఎంపీ ప్రద్యుత్ బోర్దోలీ బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. -
ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం వేర్వేరుగా భేటీ అయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తో కలిసి ఇటీవల ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్‌రెడ్డిని ఖర్గే, కేసీల వద్దకు తీసుకెళ్లిన ముఖ్యమంత్రి ఆయన్ను పరిచయం చేశారు. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి మొన్నటి వరకు ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా వేం నరేందర్‌రెడ్డి చేసిన కృషిని వారికి వివరించారు. కాగా.. రాజ్యసభ సభ్యుడిగా తనకు అవకాశం ఇచ్చినందుకు ఖర్గే, కేసీలకు వేం నరేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా.. నరేందర్ రెడ్డిని వారు అభినందించారు. ఎంపీగా తనదైన ప్రత్యేక ముద్ర కనిపించేలా పనిచేయాలని ఖర్గే సూచించినట్లు తెలిసింది. ఈ సందర్భంగానే.. ఆయనతో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పథకాల అమలు, ఇటీవల ఏఐసీసీ ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ పనితీరుపై చర్చించినట్లు సమాచారం. పార్టీ, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం కుదిరేలా, ప్రభుత్వ పథకాల అమలులో పార్టీ నేతల భాగస్వామ్యం ఉండేలా చూసుకుకోవాలని ఖర్గే సూచించినట్లుగా తెలిసింది. ప్రతీ రెండు నెలలకోసారి ఈ కమిటీ సమావేశమై.. సమన్వయ అంశాలపై చర్చించాలని ఖర్గే తెలిపినట్లు చెబుతున్నారు. బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి.. సీపీపీ చైర్మన్ సోనియాగాంధీ, లోకస్భలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాం«దీలను కలిసే అవకాశం ఉంది. అలాగే.. రాష్ట్ర అభివృద్ధి అంశాలపై పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో జరిగిన భేటీలో సీఎం వెంట ఎంపీలు మల్లు రవి, బలరామ్ నాయక్, సురేశ్ షెట్కార్ ఉన్నారు. -
చంద్రబాబు హామీలన్నీ 'మోసాలుగా తేలాయ్': వైఎస్ జగన్
దోచుకో... పంచుకో... తినుకో...! ఈరోజు ప్రతి అడుగులో ఇదే కనిపిస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు ఖజానాకు రానివ్వకుండా.. మీ సొంత జేబులు నింపుకొంటుంటే ఖజానా దివాలా తీయకుండా ఏమవుతుంది? అందుకే మీ ప్రభుత్వంలో రాష్ట్ర పరిస్థితి ఇంత అధ్వాన్నంగా మారింది. – బాబు పాలనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: చంద్రబాబు హామీలన్నీ మోసాలుగా తేలిపోయాయని.. ఒకవైపు జగన్ ఇచ్చిన పథకాలన్నీ రద్దు చేస్తూ, మరోవైపు రికార్డు స్థాయిలో అప్పులు చేస్తూ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికీ మేలు చేయని టీడీపీ కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో తీవ్ర అసంతృప్తి మొదలైందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. నాడు కోవిడ్ లాంటి పరిస్థితుల్లోనూ జగన్ సంక్షేమాభివృద్ధి పథకాలన్నీ అమలు చేసినప్పుడు.. ఇప్పుడు చంద్రబాబు ఎందుకు ఇవ్వలేపోతున్నారనే చర్చ ప్రతి ఇంట్లోనూ జరుగుతోందన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో మొత్తం రూ.3.31 లక్షల కోట్లు అప్పులు చేస్తే.. రూ.2.73 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా వేశామని గుర్తు చేశారు. ఇప్పుడు రెండేళ్లు తిరగకుండానే చంద్రబాబు ప్రభుత్వం రూ.3.30 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసినా పథకాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. గత ప్రభుత్వంలో ఎక్కడా అవినీతికి తావు లేకుండా పథకాలను ఇంటివద్దకే అందిస్తే.. ఇప్పుడు అంతా దోచుకో.. పంచుకో.. తినుకో.. సాగుతోందని మండిపడ్డారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డా.. చంద్రబాబు ‘నో యాక్షన్’..! మహిళలపై కూటమి ఎమ్మెల్యేలు అరవ శ్రీధర్, కోనేటి ఆదిమూలం, నసీర్, కూన రవికుమార్ అఘాయిత్యాలపైనా... బాబు ‘నో యాక్షనే..!’ అంటూ ధ్వజమెత్తారు. మన పాలనకు, బాబు పాలనకు మధ్య తేడాను ప్రజలు ఇప్పటికే గుర్తించారని.. జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని ప్రకటించారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. నిత్యం ప్రజలతో మమేకం అవుతూ, పార్టీలో అందరినీ కూడగట్టి ముందుకు సాగుతున్న చుండూరి రవిబాబుకు పార్టీ బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. ఏడాదిన్నరగా ఆయన అంకితభావంతో పని చేస్తున్నారని అభినందించారు. ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కూడా చాలా చురుగ్గా పని చేస్తున్నారని ప్రశంసించారు. దేవుడి దయ, అందరి ఆశీస్సులుంటే ఆయన ఇంకా ఎదుగుతారని ఆకాంక్షించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సందర్భంగా శ్రేణులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ చుండూరి రవిబాబుతో పాటు పార్టీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టో విశిష్టతను చాటాం... మన హయాంలో చరిత్రలో కనీవిని ఎరుగని మంచి చేశాం. మేనిఫెస్టో విశిష్టతను చాటి చెప్పాం. మేనిఫెస్టో అంటే ఏదో ప్రజలను నమ్మించడానికి కాదు. అదో చెత్త పేపర్ అన్న ముద్ర నుంచి దాన్ని ఒక పవిత్ర గ్రంథంగా భావించేలా పని చేశాం. మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో ఏడాది కాలంలోనే 99 శాతం హామీలను అమలు చేసి ప్రజల్లో గుర్తుండిపోయేలా మంచి పరిపాలన చేశాం. అందుకే ఈరోజుకీ గర్వంగా కాలర్ ఎగరేసుకుని తిరగ్గలం. క్యాలెండర్ ప్రకటించి పథకాలు అమలు..రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ పాలన గురించి ఈ రోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. మనది సుపరిపాలన అయితే.. చంద్రబాబు పాలన మొత్తం అవినీతిమయం. ఎక్కడా దేన్నీ వదలడం లేదు. ప్రజలకు మేలు చేయడం లేదు. నాడు మనం అధికారంలోకి వచ్చినప్పుడు ట్రెజరీ (ఖజానా)లో రూ.100 కోట్లు కూడా లేవు. రెండేళ్లు కోవిడ్‌తో అంతా అతలాకుతలం. ఒకవైపు ఆదాయం తగ్గింది. మరోవైపు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. అలాంటి ఆర్థిక చిన్నాభిన్నం మధ్య మన వైఎస్సార్సీపీ పాలన సాగింది. అయినా కూడా ఏనాడూ ఆ సాకు చూపలేదు. ముందుగానే క్యాలెండర్ ప్రకటించి పథకాలు అమలు చేశాం. క్రమం తప్పకుండా బటన్ నొక్కి ప్రజలకు మేలు చేశాం. హామీలన్నీ అమలు చేశాం.రెండేళ్లలోనే రూ.3.30 లక్షల కోట్ల అప్పులు..మన ఐదేళ్ల పాలనలో దాదాపు రూ.3.31 లక్షల కోట్లు అప్పు చేస్తే, అందులో డీబీటీ ద్వారా ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం. ఆ వివరాలన్నీ ఆధార్‌తో సహా చెప్పగలం. అదే ఈ రెండేళ్లలోనే చంద్రబాబు ప్రభుత్వం అప్పులు రూ.3.30 లక్షల కోట్లు దాటాయి. అయినా కూడా హామీల అమలు లేదు. మనం ఇచ్చిన పథకాలన్నీ రద్దయ్యాయి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలుగా తేలిపోయాయి. బటన్లు లేవు.. ప్రజలకు ఇచ్చిందీ లేదు..! మనం ఐదేళ్లలో చేసిన అప్పులు.. చంద్రబాబు రెండేళ్లలోనే దాటేశారు. మరి ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళుతోంది? ప్రజలంతా దీన్నే చర్చించుకుంటున్నారు. అంతా జేబులు నింపుకొంటున్నారు..దోచుకో... పంచుకో... తినుకో...! ఈరోజు ప్రతి అడుగులో ఇదే కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు ప్రభుత్వంలో ఏదీ జరగడం లేదు. రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆదాయాలూ రావడం లేదు. లిక్కర్ మాఫియాతో మొదలు పెడితే ఇసుక, మట్టి, మద్యం, సిలికా, క్వార్ట్జ్, ల్యాటరైట్, గ్రానైట్.. అన్ని వనరులూ దోచేస్తున్నారు. అధిక ధరలకు పీపీఏలు చేసుకుంటున్నారు. అమరావతిలో చదరపు అడుగు రూ.10 – 12 వేల చొప్పున నిర్మాణం చేస్తున్నారు. ఇక ప్రభుత్వ భూములను పప్పు బెల్లాలకు ఇచ్చేస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలురానివ్వకుండా, మీ సొంత జేబులు నింపుకుంటుంటే ఖజానా దివాలా తీయకుండా ఏమవుతుంది? ప్రభుత్వ మైండ్‌సెట్ సరిగా లేదు కాబట్టే..ఈ ప్రభుత్వ మైండ్‌సెట్ సరిగా లేదు కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకనే.. విద్యా రంగాన్ని నాశనం చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తీసేశారు. పిల్లలకు ట్యాబ్‌లు లేవు. టోఫెల్ శిక్షణ లేదు. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లు లేరు. విద్యాదీవెన, వసతి దీవెన లేవు. రైతులకు పెట్టుబడి సాయం లేదు. ఉచిత పంటల బీమా లేదు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. పేదలకు ఉచిత వైద్యం లేదు. ఆరోగ్యశ్రీ గాలికెగిరిపోయింది. నెట్వర్క్ ఆస్పత్రులు వైద్యం చేయడం లేదు. రూ.6 వేల కోట్లకు పైగా బకాయి పడ్డారు. వీరి మైండ్‌సెట్.. పేదలు, అక్క చెల్లెమ్మలకు మంచి చేయాలని కాదు. చివరకు మహిళలకు సున్నా వడ్డీని కూడా చంద్రబాబు ఎగ్గొట్టాడు. మనం అమలు చేసిన చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, తోడు, చేదోడు... ఇవాళ ఏదీ కనిపించడం లేదు. 31 లక్షల ఇళ్ల పట్టాలు, 20 లక్షల ఇళ్ల మంజూరు... 10 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం... ఇప్పుడు ఏవీ లేవు. పాలనపై ధ్యాస లేదు. అంతా దోచుకో.. పంచుకో...తినుకో.. ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడీ!హాజరైన ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలుజగన్ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యంఈ ప్రభుత్వంలో చూస్తుండగానే మూడు బడ్జెట్లు అయిపోయాయి. ఇక మిగిలింది రెండు బడ్జెట్లు మాత్రమే. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. మరో ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర మొదలవుతుంది. ఏడాదికి పైగా నేను ప్రజల్లో ఉంటా. మన కార్యకర్తలంతా ప్రజలకు తోడుగా నిలబడి వారి సమస్యలపై పోరాడాలి. లీగల్ సెల్‌ను పటిష్టం చేశాం. ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుంది. రాబోయేది మనందరి ప్రభుత్వం. జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. ప్రతి ఒక్కటీ వారి ద్వారానే అమలు చేస్తాం.ఏం చర్యలు తీసుకున్నావు చంద్రబాబూ..?టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్... డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఏకైక పార్లమెంట్ సభ్యుడు. పార్లమెంటు చరిత్రలో గతంలో ఇలాంటివి ఎన్నడూ లేవు. ఇది చంద్రబాబు అనుసరించే వైఖరితో మొదలైంది. చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నాడు? ఏం చేశాడు? అని చూస్తే ఎక్కడా డ్రగ్స్‌ను నియంత్రించలేదు. ఒక పాలకుడు, నాయకుడికి ఉండాల్సిన గుణాలు చంద్రబాబులో ఎక్కడా కనిపించవు. అందుకే విచ్చలవిడిగా అరాచకాలు జరుగుతున్నాయి. రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అత్యాచారం చేశాడని, ఆపై మోసం చేశాడని బాధితురాలు నేరుగా ముఖ్యమంత్రికి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరి ఏం చర్యలు తీసుకున్నావు చంద్రబాబూ? అని అడుగుతున్నా... నో యాక్షన్...! కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మీద ఏం చర్యలు తీసుకున్నావు చంద్రబాబూ..? నో యాక్షన్...! మహిళలతో అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ మీద ఏం చర్యలు తీసుకున్నావు..? నో యాక్షన్...! టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళ మీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు? నో యాక్షన్! మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పీఏ! అక్కడా నో యాక్షన్! పైగా బాధితురాలి మీద తప్పుడు కేసు, ఉల్టా కేసు పెట్టారు. ఎమ్మెల్యేలు, లీడర్ల కథ దేవుడెరుగు.. కనీసం పీఏల మీద కూడా చర్యలు తీసుకోలేకుండా ఉన్నాడు. ప్రస్తుత టీటీడీ చైర్మన్ ఒక మహిళను మోసం చేసి వీడియోతోనూ, ఫొటోలతోనూ అడ్డంగా దొరికిపోయినా చంద్రబాబు ఏం చేశాడు..? నో యాక్షన్...! బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు డ్రగ్స్ తీసుకుంటూ హైదరాబాద్‌లో పట్టుబడితే నో యాక్షన్... చంద్రబాబు కుమారుడు స్విమ్మింగ్‌పూల్ వద్ద తాగుతూ, తూగుతూ అమ్మాయిలతో డ్యాన్స్.. నో యాక్షన్..! ఇంకా చంద్రబాబునాయుడు బావమరిది, బాలకృష్ణ ఏమన్నాడు...? అమ్మాయి కనబడితే కడుపైనా చేయాలి... లేదా ముద్దు అయినా పెట్టాలి...అని! ఆయన అంత దారుణంగా మాట్లాడితే, చెంప పగలగొట్టకుండా.. హాహా! అని నవ్వుతారు. వీటన్నింటి మీదా చర్యలు తీసుకోని చంద్రబాబు ఏమన్నారు? తాను అవన్నీ చిన్నప్పుడే అంతకంటే బాగా చేశానని చెప్పుకొచ్చారు!గుండె ధైర్యం.. వైఎస్సార్సీపీ ట్రేడ్ మార్క్విలువలు, విశ్వసనీయతే మన పార్టీ పునాదులు‘‘మనమంతా కలసికట్టుగా, ఒక్కటై ఈ పార్టీని నిర్మించుకున్నాం. ఈ పార్టీ జగన్ ఒక్కడిదే కాదు.. వైఎస్సార్‌ను ప్రేమించే ప్రతి గుండె ఒక్కటై, మనమంతా కలసి ఈ పార్టీని నిర్మించుకున్నాం. విలువలు, విశ్వసనీయత అన్న రెండు పదాల మీదే మన పార్టీ పుట్టింది, నడుస్తోంది. మన పార్టీ ఎప్పటికీ విలువలకు కట్టుబడి ఉంటుంది. విశ్వసనీయతకు పెద్దపీట వేస్తుంది. పోరాటాలు మనకు కొత్త కాదు. గుండె ధైర్యం అన్నది వైఎస్సార్సీపీ ట్రేడ్ మార్క్. మన పార్టీ చరిత్ర, 15 ఏళ్ల ప్రయాణం చూస్తే.. కేవలం ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉన్నాం. విపక్షంగానే మొదలయ్యాం. అధికారంలో లేనప్పుడు కార్యకర్తలకు మరింత తోడుగా, దగ్గరగా ఉండాలి...’’ -
కేటీఆర్ X మంత్రులు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల రెండోరోజు మంగళవారం అధికార, ప్రతిపక్ష సభ్యుల సవాళ్లు, ప్రతిసవాళ్లకు శాసనసభ వేదికైంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడే సమయంలో విపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వర్సెస్ మంత్రులు అన్నట్టుగా సభ సాగింది. కేటీఆర్.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు చట్టబద్ధతను ప్రశ్నిస్తూ, ఆ ఆరు అంశాలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని ధ్వజమెత్తారు. కేటీఆర్‌కు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ప్రశ్నల వర్షం సుమారు 1.40 గంటల పాటు మాట్లాడిన కేటీఆర్.. గవర్నర్ ప్రసంగంలోని అంశాలతో పాటు రెండున్నరేళ్ల ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో ప్రభు త్వం విఫలమైనందుకు ధన్యవాదాలు తెలపాలా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రేషన్‌కార్డుల విషయంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మధ్య సమన్వయ లోపం ఉందని వ్యాఖ్యానించారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత అన్న సీఎం సంతకానికి విలువలేకుండా పోయిందని విమర్శించారు. ఎందుకు చట్టబద్ధత కల్పించలేదని ప్రశ్నించారు. దీనిపై సిట్ వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి, సీఎం సంతకానికి జీరో వాల్యూ అంటూ ఎద్దేవా చేశారు. ప్రతి విమర్శలతో మంత్రుల ఫైర్ కేటీఆర్ ప్రసంగానికి పలుమార్లు అడ్డుపడిన మంత్రులు.. ప్రతి విమర్శలకు దిగారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్, సన్నబియ్యం, మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా వంటి పథకాలను ప్రస్తావించారు. గవర్నర్ ప్రసంగాన్ని చదివి ఉపన్యాసా లు ఇవ్వాలని మంత్రి శ్రీధర్‌బాబు హితవు పలికా రు. గోబెల్స్ సదస్సులో రూ.లక్షల కోట్లు పెట్టుబడు లు వచ్చాయని చెప్తున్నా, టీజీఐఐసీ గణాంకాలు అందుకు భిన్నంగా ఉన్నాయన్న కేటీఆర్ వ్యాఖ్యల పై స్పందిస్తూ.. ఎంఓయూలు కుదిరినా అవి ఆచరణలోకి వచ్చేందుకు సమయం పడుతుందంటూ వివరణ ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి.. తెల్లరేషన్‌కార్డులు, సన్న బియ్యం వంటి అంశాలను ప్రస్తావిస్తూ కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశా రు. మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా మిస్ బ్రిటన్ చేసిన ఆరోపణలను కేటీఆర్ ప్రస్తావించడంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి..సీతక్కకు మద్దతుగా మాట్లాడారు. అనర్హత పిటిషన్లపై కేటీఆర్ మాట్లాడినప్పుడు మంత్రి పొంగులేటి..కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్!‘శోభాకృత నామ, క్రోదీకృత నామ సంవత్సరాలు పోయాయి. విశ్వావసునామ సంవత్సరం 19న పోతోంది. రేపు పరాభవ నామ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. ఈ రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు మిగిలింది పరిహాసమే. ప్రతి సంవత్సరం పరిహాసనామ సంవత్సరమే. ఉగాదులు వస్తున్నయి.. పోతున్నయి. గ్యారంటీలు మాత్రం రావడం లేదు. గవర్నర్ ప్రసంగంలో గ్యారంటీలు, డిక్లరేషన్ల ఊసే లేదు. మూడో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నా రు. ప్రభుత్వ అర్ధభాగం గడిచిపోయింది. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్. సినిమా పేరు అభయహస్తం.. లోపల కథ చూస్తే భస్మాసుర హస్తం అని ప్రజలకు అర్థమైంది. మూడు ముక్కల్లో చెప్పాలంటే హామీలు ఎగ్గొట్టు.. కట్టిన వాటిని కూలగొట్టు.. ఉన్న పథకాలను చెడ గొట్టు..అన్నట్టుగా కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలన ఉంది..’ అంటూ బీఆర్ఎస్ సభ్యుడు కేటీ రామారావు ధ్వజమెత్తారు. రైతు భరోసా, మహాలక్ష్మీ, గృహజ్యోతి, చేయూత, యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లను ఉద్దేశించి..ఈ ఆరు గ్యారంటీల (అభయ హస్తం) ఫైలు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ఆ ఫైలు ఆచూకీ కోసం సిట్ వేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. మీ ప్రభుత్వానికే జీరో వేల్యూ ‘ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ఫైలుపై సీఎం రేవంత్ తొలి సంతకం చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధి, సంకల్పానికి నిదర్శనమని 2023 డిసెంబర్ 15న కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన తన తొలి ప్రసంగంలో నాటి గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. సీఎం సంతకం చేసిన ఆ ఫైల్ ఎక్కడ పోయింది? ఎఫ్ఎస్ఎల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా? తొలి కేబినెట్లోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. ఇప్పటికే 50–60 కేబినెట్ సమావేశాలు జరిగినా అతీగతీ లేదు. కొంతమంది ఆస్తులకు జీరో వేల్యూ చేసినట్టు సీఎం రేవంత్ అన్నారు. సీఎం సంతకానికి, ఆయన సంతకం చేసిన ఫైల్‌కి, మీ గ్యారంటీల కార్డుకి, మీ డిక్లరేషన్లకి, విశ్వసనీయత కోల్పోయిన మీ ప్రభుత్వానికే జీరో వేల్యూ..’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రతి కుటుంబానికి రూ.2.5 లక్షల లబ్ధి ఎక్కడ? ‘ఆరు గ్యారంటీలతో ఏటా ప్రతి కుటుంబానికి రూ.2.50 లక్షల లబ్ధి కలుగుతుందని హామీ ఇచ్చారు. ఏటా రూ.2.75 లక్షల కోట్లను కేటాయించాల్సి ఉంటుంది. ఆ మేరకు ఖర్చు చేశారా? రూ.2.5 లక్షల లబ్ధి పొందిన ఒక్క కుటుంబాన్నైనా చూపించగలరా? నేనే రాజు నేనే మంత్రి.. అని మిడిసిపడ్డ వారెవరూ సంపదలను, పదవులను మూటగట్టుకుని పోలేదని భాగవతంలో బలి చక్రవర్తి అన్నారు..’ అని కేటీఆర్ గుర్తు చేశారు. ఇటీవల ‘నేనే రాజు..నేనే మంత్రి’ అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించడంపై పరోక్ష విమర్శలు చేశారు. ఎవరికి ధన్యవాదాలు తెలపాలి? ‘ధన్యవాద తీర్మానంపై చర్చలో ఎవరికి ధన్యవాదాలు చెప్పాలి? రూ.4 వేల పెన్షన్ కోసం నిరీక్షిస్తున్న 46 లక్షల మందికా? రూ.6 వేల పెన్షన్ కోసం నిరీక్షిస్తున్న దివ్యాంగులకా? యూరియా బస్తాల కోసం లాఠీ దెబ్బలు తింటున్న 72 లక్షల మంది రైతులకా? డీఏలు, పీఆర్సీ, బెనిఫిట్స్ అందని 10 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకా? నెలకు రూ.2,500 కోసం నిరీక్షిస్తున్న కోటి 65 లక్షల మంది ఆడపడుచులకా? విషాహారంతో చస్తున్న లక్షలాది మంది విద్యార్థులు ధన్యవాదాలు చెప్పాలా?..’ అని కేటీఆర్ నిలదీశారు. 420 వరల్డ్ కప్ పెడితే గెలిచేది కాంగ్రెస్సే.. ‘ఇండియా టీ 20 వరల్డ్ కప్ గెలిచింది. 420 వరల్డ్ కప్ పెడితే గెలిచేది కాంగ్రెస్సే. నేను కర్ణుడిలాంటి వాడిని అని ఇటీవల సీఎం అన్నారు. ఎన్నికలయ్యాక కుంభకర్ణుడు అయ్యారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరి గినా తెలంగాణలో గొప్ప పాలన చేస్తున్నామంటూ ప్రజాధనంతో ప్రకటనలు ఇస్తున్నారు. పీసీ సర్కారు మాయాజాలాన్ని ఈ సర్కారు మరిపించింది. అట్టర్ ఫ్లాప్ సినిమాకి సంబరాలు చేస్తారా?. ఢిల్లీకి పోయి నిధులు తెస్తారనుకుంటే ఇచ్చి వస్తున్నారు. బాకీలు.. బకాయిలు.. డైవర్షన్లు.. కమీషన్లు! చెప్పుకోవడానికి ఏం ఉంది? బాకీలు..బకాయిలు.. డైవర్షన్లు.. కమీషన్లు. బుల్డోజర్ల చప్పుళ్లు..బూతుల మోతలు. ఆల్‌టైమ్ రికార్డు అప్పులు.. క్యూలైన్లో చెప్పులు. 420 హామీల ఎగనామాలు.. మూడున్నర కోట్ల మందికి పంగనామాలు. నోటిఫికేషన్లు నిల్.. లూటిఫికేషన్లు ఫుల్లు. చెక్‌డ్యామ్‌ల పేలి్చవేతలు..అడుగడుగున అణచివేత. క్రెడిట్ చౌర్యం.. భూముల బేరం. స్కాముల కళకళ.. స్కీముల వెలవెల. రైతన్నలకు బేడీలు.. నిరుద్యోగులపై లాఠీలు. ఫిరాయింపుల కంపు.. బస్సు చార్జీల వాయింపు. ఫుడ్ పాయిజనింగ్ చావులు.. ఫుట్‌బాల్ సరదాలు. గల్లీల్లో చెత్తకుప్పలు.. ఢిల్లీలో విమానయాత్రలు. మాటలు ధడేల్.. చేతలు తుఫేల్. దరఖాస్తులు.. దండాలు.. దఫ్తర్లు..’ అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇంకో 4 రోజులైతే ట్రిలియన్ డాలర్లు వచ్చేవి..! ‘గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ఐటీ ఎగుమతులు రూ.3.13 లక్షల కోట్లకు, ఐటీ ఉద్యోగాలు 9.39 లక్షలకు చేరుకున్నట్టు పేర్కొన్నారు. అయితే 2023–24లోనే 9.46 లక్షల ఐటీ ఉద్యోగాలున్నాయి. మరి కాంగ్రెస్ వచ్చాక 7 వేల ఉద్యోగాలు తగ్గాయా? ఐటీ ఎగుమతులు రూ.3.60 లక్షల కోట్లకు చేరాయని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పినట్టు పత్రికల్లో వచ్చింది. తప్పుదోవ పట్టించిన ఐటీ శాఖ కార్యదర్శిని తీసి చెత్తబుట్టలో పారేయండి. గోబెల్స్ (గ్లోబల్) సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం పేర్కొంది. కానీ టీజీఐఐసీ వెబ్సైట్ ప్రకారం 2022–23లో 3,010, 2023–24లో 4 వేలు కొత్త పరిశ్రమలు వస్తే కాంగ్రెస్ వచ్చాక 2024–25లో 2,050, 2025–26లో 1,026కి ఎందుకు తగ్గాయి? 2031 కల్లా ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేస్తామన్నారు. గ్రాఫిక్స్ మాయాజాలంతో రూ.100 కోట్లు పెట్టి డేరా నగర్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించగలినప్పుడు.. సమ్మిట్ ఇంకో నాలుగు రోజులు నడిపిస్తే అక్కడే ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధ్యమయ్యేది. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నారు. రూ.కోటి కోట్లు సమకూరితే రాష్ట్రం 100 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అవుతుంది. పెట్టుబడులు వెల్లువెత్తినట్టు చెబుతున్నారు. పారిశ్రామికవేత్తల కణతపై తుపాకులు పెడితే వారు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం తర్వాత. ముందు వారికి నెలకు రూ.2,500 ఇచ్చేందుకు బడ్జెట్లో నిధులు పెట్టాలి. రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఇవ్వలేదు..’ అంటూ కేటీఆర్ విమర్శించారు. ఎంఓయూలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫార్మా సిటీ స్థలాలపై కోర్టుకు ఒకటి.. బయటకు ఇంకొకటి ‘ఫార్మాసిటీ కోసం మా ప్రభుత్వం 14వేల ఎకరాలను సేకరిస్తే అప్పుడు భట్టి రైతులకు వెనక్కి ఇస్తామన్నారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ప్రభు త్వం చెప్పుతున్నట్టు అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జర్నలిస్టులకు ఇళ్లు, జూపార్క్, స్టేడియం కట్టడం కుదరదు. ఫార్మాసిటీకి ఆ స్థలాలను వాడతామని ప్రభు త్వం కోర్టుకు చెప్పింది. బయట ఇంకొకటి అంటున్నారు..’ అని తప్పుబట్టారు. ‘హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలప్పుడు మిస్ బ్రిటన్ దేశం వదిలి పారిపోయింది. ఆమెను వ్యభిచారిణిలాగా భావన కలిగేలా వ్యవహరించారని సన్ మ్యాగజైన్లో వచ్చింది. మిస్ బ్రిటన్‌కు వేధింపులు ఘటనపై సిట్ ఏర్పాటు చేయాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ధనిక రాష్ట్రాన్ని చేతుల్లో పెడితే జీరో చేశారు ‘రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్‌గా చేసి ధనిక రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెట్టాం. ఈ రోజు ఆదాయం అంచనాలు తప్పుతున్నాయి. బడ్జెట్ అంచనాలు బోల్తా కొడుతున్నాయి. కరోనా కాలం తరహాలో తిరోగమనం చూస్తున్నాం. రియల్ ఎస్టేట్ ఢమాల్ అన్నది. డే ఎకానమీ ఢమాల్ అన్నది. ఇప్పుడు నైట్ ఎకానమీ తెస్తారట. మేము దిగేసరికి రూ.3.47 లక్షలతో తలసరి ఆదాయంలో నంబర్ వన్‌గా ఉండగా, ఈ రోజు అదీ తగ్గింది. జీఎస్టీ, వాహనాల రిజిస్ట్రేషన్లు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం పడిపోయింది. మందుగమనం ఒక్కటే జోరుగా ఉంది. 2023 డిసెంబర్ నుంచి ఈ రాష్ట్రంలో జీరో వేల్యూ మిషన్ ప్రారంభమైంది. అన్నీ ఫాల్.. మీరేమో జాకీలు పెట్టి రైజింగ్ అంటున్నారు. నీరో చక్రవర్తి గురించి విన్నాం. జీరో చక్రవర్తిని చూస్తున్నాం..’ అని కేటీఆర్ విమర్శించారు. మాజీ సీఎంలు చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డిలను ప్రస్తావించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పేరును విస్మరిస్తున్నారని విమర్శించారు.మీదే ఫ్లాప్ సినిమా!‘శాసనసభకు 2023లో జరిగిన ఎన్నికల్లో ఫ్లాప్ అయింది మీరు. లోక్‌సభ ఎన్నికల్లో పూర్తిగా ఫ్లాప్ అయ్యారు. మల్ల సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ఫ్లాప్ అయ్యారు. అన్నిసార్లు ఫ్లాప్ అయ్యి మమ్మల్ని ఫ్లాప్ అంటారు ఏంటి?’ అని బీఆర్ఎస్ నేత కేటీఆర్‌పై శాసనసభా వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబు మండిపడ్డారు. తీరు మార్చుకుంటే రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మెరుగయ్యే అవకాశం ఉంటదని హితవు పలికారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం శాసనసభలో జరిగిన చర్చలో సర్కారుపై కేటీఆర్ చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు. ఎవరో రాసిన స్క్రిప్‌్టను చదువుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అని, అధిష్టానాన్ని కలిసేందుకు ఎన్నిసార్లు అయినా ఢిల్లీకి వెళ్తామని అన్నారు. ‘రాష్ట్ర ప్రయోజనాల కోసం మేం ఎన్నిసార్లు అయినా ప్రధానిని, మంత్రులను కలుస్తాం. రాష్ట్ర ప్రజల అబివృద్ధి. సంక్షేమానికి నిధులు ఇచ్చేందుకు తప్పకుండా ఢిల్లీకి పోతాం. మీరు ప్రాంతీయ పార్టీ (బీఆర్ఎస్)గా ఉండి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మీరు ఎన్నిసార్లు బీజేపీ ప్రధానమంత్రి వద్దకు పోలేదు?..’ అని శ్రీధర్‌బాబు నిలదీశారు. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో కాలుష్య రహిత గ్రీన్ ఫార్మా తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ పరిశ్రమలు వస్తే వాటికి అనుబంధంగా నివాస, వినోద, క్రీడా, ఐటీ రంగ సదుపాయాలూ వృద్ధి చెందుతాయన్నారు. గ్రీన్ఫార్మా పరిశ్రమలనే ఏర్పాటు చేస్తామని కోర్టుకు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంవోయూలపై శ్వేతపత్రం ప్రకటిస్తాం.. ‘గ్లోబల్ సమ్మిట్‌లో రూ.5.75లక్షల కోట్ల పెట్టుబడులకి ఎంవోయూలు ఎందుకు చేసుకున్నారని కేటీఆర్ అంటున్నారు. ఎంవోయూలు చేసుకోకపోతే బాగుండుననేది వారి ఆలోచనగా కనపడుతోంది. కేటీఆర్ కూడా దావోస్‌కు వెళ్లారు. ఆయనకు అన్నీ తెలుసు. ఎంవోయూల్లో 30–40 శాతమే సఫలీకృతం అవుతాయని మన సీఎంకు మహారాష్ట్ర సీఎం తెలియజేశారు. త్వరలో వీటిపై శ్వేతపత్రం ప్రకటిస్తాం. మహిళలను లక్షాధికారులను చేస్తామని దివంగత సీఎం రాజశేఖరరెడ్డి అన్నారు. దానికి కొనసాగింపుగానే వారిని కోటీశ్వరులను చేయాలని సంకల్పించాం. ఈ విజన్‌ను కూడా హేళనగా, చులకనగా మాట్లాడడం సరికాదు. తెలంగాణ ఏర్పాటుకు సోనియాగాంధీ నిర్ణయం తీసుకోకుంటే ఈ రోజు బీఆర్ఎస్ వారు ఇక్కడ ఉండేవారా? సోషల్ మీడియాలో గోబెల్స్ ప్రచారంలో బీఆర్ఎస్కు మించిన దిట్ట లేరు. ఐటీ ఉద్యోగాలు తగ్గిన విషయం పరిశీలిస్తాం. ఐటీ ఎగుమతుల విలువలో సంఖ్యాపరంగా తప్పులుంటే సరిచేసుకుంటాం..’ అని మంత్రి అన్నారు. దళితుడిని సీఎం చేశారా?: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ‘హామీలు అమలు కావడం లేదని ఆరోపించడం సరికాదు. దళితుడిని సీఎం చేస్తామనని..భూమి లేని పేదలకు మూడెకరాల భూమి ఇస్తామని మీ లెక్క హామీలిచ్చి విస్మరించలేదు. మీరు చేసిన అప్పులకు అసలు, వడ్డీలు కడుతూ పథకాలు అమలు చేస్తున్నాం..’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఆరు గ్యారంటీలతో ఒక్కో కుటుంబానికి రూ.2.5 లక్షల లబ్ధి కలుగుతుందని హామీ ఇచ్చింది వాస్తవమేనని, ఒక్కో కుటుంబానికి ఎన్ని లక్షలు వారి ఖాతాల్లో జమ చేశామో లెక్కలతో సహా వివరిస్తానన్నారు. 53–54లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలుంటే 1.06 కోట్ల కుటుంబాలకు సన్న బియ్యం, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినట్టు గుర్తుచేశారు. రైతుల ఖాతాల్లో 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా వేశామన్నారు. సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్‌కి రూ.500 బోనస్ ఇస్తున్నామని, రూ.12 వేలు రైతు భరోసా, బోనస్ కలిపి ఒక్కో ఎకరానికి రూ.25 వేలు చొప్పున రైతులకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు. మహిళలంటే కోపం ఎందుకు ?: సీతక్క మహిళలంటే మీకు ఎందుకంత వ్యతిరేకత అని కేటీఆర్‌పై మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. తరతరాలుగా అణచివేతకు గురైన మహిళలు స్వశక్తితో ఎదుగుతుంటే సహకరించాలని హితవు పలికారు. వైఎస్ ప్రభుత్వం తెచ్చిన అభయహస్తం పథకం నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకుందని ఆరోపించారు. ‘పదేళ్లలో ఎన్ని ఇళ్లు ఇచ్చారు? ధనిక రాష్ట్రంలో ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? దళితులకు భూములు ఎందుకు పంచలేదు?’ అని నిలదీశారు. దళితుడిని సీఎం చేసిందుకా? బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క తెల్లరేషన్‌కార్డు ఇవ్వలేదని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తామని హామీ ఇచ్చి చేసినందుకు మీకు ధన్యవాదాలు చెప్పాలా? సన్న బియ్యం ఇస్తున్నందుకు, యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణం, ఆరీ్టసీలో మహిళలకు ఉచిత ప్రయాణాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టినందుకు తమ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలన్నారు. మా హక్కులను రక్షించాలి.. తలసాని కేటీఆర్ మాట్లాడుతుంటే మంత్రులు పదేపదే జోక్యం చేసుకోవడం సభా మర్యాదలకు భంగం కలిగించడమేనని బీఆర్ఎస్ సభ్యుడు తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. తమ హక్కులను సభాపతి రక్షించాలని విజ్ఞప్తి చేశారు.అలా ఎలా సార్?‘అధ్యక్షా మీరు కూడా.. మాపార్టీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యే ఆ పార్టీ టికెట్ మీద ఎంపీగా పోటీ చేస్తే ఎలా సార్?, ఆయనను ఆడ కూర్చోబెడితే..’అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం శాసనసభలో ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా పలు అంశాలపై మాట్లాడిన ఆయన.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్‌ను ఇటీవల స్పీకర్ కొట్టివేయడాన్ని ప్రస్తావించారు. ‘మీరు నిర్ణయం తీసుకున్నారు. దాంతో మాకు విభేదం లేదు.. నా ప్రార్థన..’అని కేటీఆర్ ఇంకా ఏదో చెప్పబోతుండగా స్పీకర్ అడ్డు తగిలారు. ‘కోర్టులో జడ్జి తీర్పు ఇస్తే నచ్చకపోతే పైకోర్టుకు పోతాం. మీరు కూడా జడ్జిమెంట్ చదవకుండానే ఎన్నో అభియోగాలు చేసిన్రు. అయినా నేను మీడియా ముందుకు రాలేదు. జడ్జిమెంట్ పూర్తిగా చదివితే మాట్లాడాలి. మీకు చెపుతున్నా..ఈ ప్రశ్నించేదానిని తగ్గించుకుంటే మంచిగుంటది..’అని అన్నారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. ‘మీరు తీసుకున్న నిర్ణయం తప్పు అయినా ప్రశ్నించే అధికారం సభ్యుడిగా నాకుంటది. మీరు జ్యుడీషియరీ నేను కాదనడం లేదు. ప్రజాస్వామ్యంలో నిలదీయడం, అడగడం మా బాధ్యత..’అని అన్నారు. మంత్రి పొంగులేటి ఆగ్రహం కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని అన్నారు. ‘జడ్జి స్థానంలో ఉన్న మిమ్మల్ని, మీ జడ్జిమెంట్‌ను కూడా ప్రశ్నించే స్థాయిలో మాట్లాడుతున్నారంటే..వారు ఏ రకమైన అహంకారంతో మాట్లాడుతున్నారో గమనించాలి. అసెంబ్లీ, పార్లమెంటుతో పాటు గ్రామ పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో నాలుగుసార్లు ఎందుకు ఓడిపోయారో ఇప్పటికైనా మీరు గమనించాలి. పార్టీలు మారడాన్ని పోత్సహించిందే మీరు..’అని బీఆర్ఎస్పై ధ్వజమెత్తారు. మంత్రి మాటలకు కేటీఆర్ స్పందిస్తూ.. ‘హైకోర్టు తీర్పు ఇస్తే సుప్రీంకోర్టుకు, సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే రివిజన్‌కు వెళ్లే హక్కు ఉంటుంది. హరియాణలో ఆయారాం గయారాం విధానాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ..’అని చెప్పారు. స్పీకర్ స్థానంలో ఉన్న వారు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నారు. ‘ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నా, మీరు అడ్డుకోవడం లేదు. మీరు మారాలి. బడివె అని సీఎం అంటే కూడా స్పందించలేదు. గ్రహణం కొన్ని గంటలే ఉంటుంది. ఏదీ శాశ్వతం కాదు..’అని వ్యాఖ్యానించారు. -
మమత Vs సువెందు : రసవత్తరంగా బెంగాల్ పోరు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోరు ఆరంభంలోనే రసవత్తరంగా మారుతోంది. 2026 ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్న ఎన్నికలకు గాను అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) మొత్తం 294 స్థానాలకు గాను 291 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన 3 స్థానాలను డార్జిలింగ్ ప్రాంతంలో అనిత్ థాపా నేతృత్వంలోని BGPM పార్టీకి కేటాయించారు. ఈ మేరకు అభ్యర్థుల వివరాలను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. బీజేపీ10 మంది మహిళలకు చోటివ్వగా టీఎంసీ లిస్టులో 52 మంది మహిళలు ఉన్నారు.సై అంటే సై అంటున్న దీదీబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తన నియోజకవర్గమైన భవానీపూర్ నుండి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. బీజేపీ సీఎం అభ్యర్థిగా భావిస్తున్న సువేందు అధికారిపై తలపడేందుకు దీదీ సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఓడించిన సువేందు అధికారిపై ఆమె మరోసారి నేరుగా ఢీకొంటుండటం విశేషం. భవానీపూర్, నందిగ్రామ్ రెండింటి నుండి సువేందును బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది.గెలుపు మాదే దీదీ ధీమా: వరుసగా నాలుగోసారి అధికారాన్ని దక్కించుకుంటామని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఈసారి తాము 226 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా మమతా బెనర్జీ ఎస్ఐఆర్పై ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని బీజేపీని తిప్పికొట్టి, తృణమూల్‌కు ఓటు వేసి గెలిపించాలని దీదీ విజ్ఞప్తి చేశారు. బెంగాల్ అస్థిత్వం కోసం జరిగే పోరు ఇది అని మమతా వ్యాఖ్యానించారు.కాగా 2021 ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఓడిపోయిన తర్వాత, మమత భవానీపూర్ ఉప ఎన్నిక ద్వారా అసెంబ్లీలోకి ప్రవేశించారు. 2021లో TMC 213 సీట్లు సాధించగా, బీజేపీ 77 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఈ సారి ఎలామైనా మమతను ఓడించి బెంగాల్లో పాగా వేయాలని బీజేపీ భారీ ఆశలే పెట్టుకుంది. అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్న ఈ పోరులో ఇప్పటికే బీజేపీ 144 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. 2021లో ఇలా2021 అసెంబ్లీ ఎన్నికలలో, టీఎంసీ 213 స్థానాలను గెలుచుకుని హ్యాట్రిక్ గెలుపు సాధించింది. నందిగ్రామ్‌లో మమత ఓడిపోయినప్పటికీ టీఎంసీ తన స్థానాల సంఖ్యను రెండు పెంచుకుంది. 2016లో కేవలం మూడు స్థానాలకు పరిమితమైన బీజేపీ 2021 లో 77 స్థానాలకు పుంజుకుని ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ప్రచారంలోదూకుడుతోపాటు, కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్‌ల వైఫల్యం బీజేపీకి కలిసి వచ్చింది. -
రైతు సమస్యలపై చంద్రబాబు సర్కార్ స్పందించాలి: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రైతులు, రైతు కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ అనే రీతిలోనే ఇప్పటికీ చంద్రబాబు ఆలోచిస్తున్నారంటూ దుయ్యబట్టారు.‘‘సగటున రోజుకు 8 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభమే ఈ ఆత్మహత్యలకు కారణం. విపత్తులు వచ్చినా ప్రభుత్వం మాటలు తప్ప.. లబ్ధి చేకూర్చడం లేదు. ఎన్నికల ముందు రైతులకు, రైతు కూలీలకు అనేక హామీలు ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అరకొర మినహా ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేవు...మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చినా ధరల స్థిరీకరణ నిధికి రూ.3,000 కోట్లు కూడా కేటాయించలేదు. వైఎస్సార్, జగన్ పరిపాలనలో రైతే రాజు అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించక రైతులు విపత్తులతో నష్టపోయారు. అన్నంపెట్టే రైతుల సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వం వెంటనే స్పందించాలి. చిన్న, సన్నకారు రైతాంగాన్ని ఆదుకోవాలి’’ అని సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. -
ఆకు రౌడీలంతా బీఆర్ నాయుడు చెంత చేరారు: భూమన
సాక్షి, తాడేపల్లి: ఆకు రౌడీలంతా బీఆర్ నాయుడు చెంత చేరారంటూ వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ నాయుడిని టీటీడీ ఛైర్మన్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ.. ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆందోళనలు చేపట్టింది. ఈ సందర్భంగా భూమన కరుణాకర్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆకు రౌడీలను బీఆర్ నాయుడు పెంచి పోషిస్తున్నారంటూ దుయ్యబట్టారు.‘‘తిరుమల అరాచక శక్తుల, అసాంఘిక కార్యక్రమాలతో తల్లడిల్లుతోంది. బీఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత టీటీడీ ఔన్నత్యం, విశిష్టత దెబ్బతింది. టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు పూర్తిగా అనర్హుడు. బీఆర్ నాయుడు తీరుపై రాష్ట్ర ప్రజలు, హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా ప్రభుత్వం వెనకేసుకొస్తోంది.’’ అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.రూ.300 రూపాయల టికెట్లను కూడా ఆకు రౌడీలకు ఇచ్చి టీటీడీ ఛైర్మన్ వాళ్ళని పోషిస్తున్నారు. టీటీడీ చైర్మన్ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపితే ఆకు రౌడీలు మా వారిపై దాడి చేశారు. శాంతి యుతంగా నిరసన తెలిపిన మహిళలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. అనుగ్రహ భాషనలతో ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరియాల్సిన చోట ఆకు రౌడీల బూతులు వినిపిస్తున్నాయి. అసాంఘిక శక్తులపై ఉద్యమ నాయకుడిగా 50 ఏళ్ల క్రితమే పోరాటం చేశాను’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. -
వాళ్లంతా అడ్డంగా దొరికినా.. బాబు నో యాక్షన్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డ్రగ్స్ తీసుకుంటూ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ పట్టుబడ్డాడని.. పార్లమెంటు చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ ‘పుట్టా’నేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఒంగోలు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘పుట్టా మహేష్‌తో మొదలై... పుట్టా మహేష్‌తో ఆగిపోలేదు.. ఇలాంటి వాటిపట్ల చంద్రబాబు వ్యవరించిన తీరు అత్యంత దారుణం’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు.‘‘ఒక పాలకుడిగా ఆయన వ్యవహరించలేదు. తప్పు చేసిన వారిపట్ల తయన చర్యలు తీసుకోలేదు. అందుకనే విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు స్వయంగా మోసం చేశారని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తే.. దానిపై కమిటీలు అంట.. కోనేటి ఆదిమూలం మహిళ మీద దారుణమైన లైంగిక దాడిచేస్తే పంచాయితీ చేశారు. కేజీబీవీ మహిళా ప్రిన్సిపాల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మీద నో యాక్షన్...మహిళలతో అశ్లీల వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మీద నో యాక్షన్. చివరకు మంత్రి సంధ్యారాణి పీఏ మీదా నో యాక్షన్. ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ మీదా నో యాక్షన్. వీడియో, ఫొటోలతో పట్టుబడ్డా.. నో యాక్షన్. ఆదినారాయణరెడ్డి కొడుకు డ్రగ్స్ తీసుకుంటూ.. పట్టుబడితే.. నో యాక్షన్. ఇలాంటి వాటికి వత్తాసు పలికే భావన చంద్రబాబుకు ఉంది కాబట్టే.. ఇలాంటివి జరుగుతున్నాయి’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు.‘‘తన కొడుకు స్విమ్మింగ్ పూల్స్ వద్ద తాగుతూ, తూలుతూ అమ్మాయిలతో డ్యాన్స్‌లు చూస్తే నో యాక్షన్. తన బావమరిది అమ్మాయిలకు ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలని అని బహిరంగంగా మాట్లాడితే నో యాక్షన్. చిన్నప్పుడు తాను ఇంతకంటే ఎక్కువే చేశానని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు మైండ్ సెట్ ఎలాంటిదో ఇవన్నీ సూచిస్తున్నాయి. వీళ్లకు ప్రజలకు మంచి చేయాలన్న మైండ్ సెట్ లేదు’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జగిత్యాల జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, జగిత్యాల: మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీలో ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్లో ఉన్నానని చెబుతున్న సంజయ్.. నన్ను తనతో కలిసి పనిచేయాలని ఎలా అడుగుతారంటూ ప్రశ్నలు సంధించారు. నాడు ప్రతిపక్షంలో ఉండి ఒంటిచేత్తో అధికారపార్టీతో పోరాటం చేసిన నేను మంత్రి కావాలనుకోవడం తప్పా?. పార్టీ ఫిరాయింపునకు నాకు అవకాశం లేకుండేనా? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘నాలుగు దశాబ్దాల బంధాన్ని విడిచి పెట్టుకోవడం ఎవరికైనా ఇబ్బందే. ఆ స్థితిలో నేను ఇవాళ బాధ పడుతున్నాను. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్.. ఆయన ఏ పార్టీలో ఉన్నారో తెలియదు కానీ.. నన్నే తనతో కలిసి పని చేయాలని ఆఫర్ ఇస్తున్నారు. అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పని చేయడంలో తప్పు లేదు. కానీ, కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, హక్కులను కాల రాయడం, అభ్యర్థుల ఎంపిక చేయడం ఇవన్నీ సమంజసమా?. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నేను పార్టీలో ఎదురవుతున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశాను. ఇందుకు ఎమ్మెల్యే సంజయ్ కారణం కాదా. 1995లో చంద్రబాబు సీఎం అయిన సమయంలో ఎక్కడా పోటీకి కూడా వెనుకంజ వేసిన కాలంలో జగిత్యాల నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మేం అన్నీ గెల్చుకున్నాం. వీడిపోవడానికి కారకుడైన వ్యక్తి ఇవాళ కలిసి పని చేస్తానంటున్నాడు. నేను ఎక్కడ ఉన్నా అంకితభావంతో పనిచేస్తా. ఈ ఎమ్మెల్యే సంజయ్ ఒత్తిడితో ఓ ఆడబిడ్డ మున్సిపాలిటీలో ఇబ్బంది పడింది నిజం కాదా?. నాకు ఆఫర్ ఇవ్వడానికి సంజయ్ ఎవరు?. నేను పార్టీ వీడుతానని ఆయనకు చెప్పానా?. పార్టీ వీడాలని కోరుకోవడం లేదని ఎలా అంటారు?. అసలు సంజయ్ ఏ పార్టీలో ఉన్నారు?. నన్ను ఎలా కలిసి రమ్మంటారు?. సంజయ్ బీఆర్ఎస్లో ఉన్నారని స్పీకర్ అంటున్నారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని సంజయ్ అంటున్నారు. అసలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఈ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు పట్టించుకోడు. చట్టసభల్లో ఎంపికైన వాళ్ళు ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకోవాలి. నేను ఇంతవరకు కూడా కాంగ్రెస్‌లోనే ఉన్నాను. ఉండాలని ఇంకా కోరుకుంటున్నా. ఇంట్లో ఉడుం లాగా వచ్చి చేరితే ఆయనతో కలిసి ఎలా పనిచేస్తాం. నిన్నటి వరకు రాష్ట్రానికి జగిత్యాల ఆదర్శంగా ఉంటే ఇవాళ వివాదాలకు కేరాఫ్ చేశాడు. రాముడు నాకు ఆదర్శం. అందుకే శ్రీరామనవమి సందర్భంగా ఫ్లెక్సీలు పెట్టుకున్నా. నేను పార్టీ మారితే దానికి కారణం ఎమ్మెల్యే సంజయ్, ఆయన వెనుకున్న వారే కారణం అవుతారు. ఈ ఎపిసోడ్లో కాంగ్రెస్ అధిష్టానానిదే బాధ్యత. నాకు పార్టీ మారాలనే యోచనకు కారణం ఈ ఆవేదనే’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
తిరుపతిలో వైఎస్సార్సీపీ నేతల నిరసన..
వైఎస్సార్సీపీ నేతల నిరసనలు అప్డేట్స్..అనంతపురం..అనంతపురం అంబేద్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్సీపీ నేతల నిరసనటీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్తిరుపతిలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై కేసు పెట్టడంపై ఆగ్రహంచంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులునంద్యాల జిల్లా...నంద్యాలలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ నేతల నిరసనలు.కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన.టీటీడీ పవిత్రతను బీఆర్ నాయుడు, చంద్రబాబు అభాసు పాలు చేస్తున్నారని ఆగ్రహంబీఆర్ నాయుడుని పదవి నుండి తొలగించి డిమాండ్. ఏపీలో కూటమి ప్రభుత్వంలో తప్పుడు కేసులకు నిరసనగా తిరుపతిలో వైఎస్సార్సీపీ నేతలు నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో, తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.తిరుపతితో పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో నిరసన కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కొనసాగుతున్న తప్పుడు కేసులకు నిరసనగా పార్టీ నేతలు నిరసనలకు దిగారు. కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు, తప్పుడు కేసులు నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ నేతలు భూమన అభినయ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, నూకతోటి రాజేష్, సుధాకర్ రెడ్డి.. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి, నిరసన చేపట్టారు.ఈ సందర్బంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. నిన్న గ్రాండ్ రిడ్జ్ హోటల్ ఎదుట రోడ్డుపై శాంతియుతంగా నిరసన తెలిపిన వైఎస్సార్సీపీ శ్రేణులు 13 మందిపై అట్రాసిటీ కేసులు పెట్టడాన్ని నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కూటమి ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు. అనంతరం, భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ..‘రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలుచేస్తున్నారు.. అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టేశారు. అట్రాసిటీ కేసులతో వేధింపులకు గురిచేస్తున్నారు. తిరుమల పవిత్రతను కాపాడాలి అంటే బీఆర్ నాయుడు పదవికి రాజీనామా చేయాలి అని కామెంట్స్ చేశారు. -
జీవన్‌రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీల తొలగింపు
జగిత్యాల : కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఆయన నివాసం వద్ద ఉన్న పార్టీ ప్రోటోకాల్ ఫ్లెక్సీలను తొలగించారు. జగిత్యాలలోని జీవన్‌రెడ్డి రెడ్డి నివాసం వద్ద ఉన్న కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించారు. ఇంటి ముందు ఉన్న ఫ్లెక్సీలతో పాటు ఇంటి లోపల ఉన్న ఫ్లెక్సీలను కూడా కార్యకర్తలు తొలగించారు. ఫ్లెక్సీలపై ఉన్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి అడ్లూరి ఫోటోలను కూడా కార్యకర్తలు తొలగించారు. ఈనెల 24 లేదా 25వ తేదీన జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారనే వార్తల నేపథ్యంలో ఇది చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇంటివద్ద ఉన్న కాంగ్రెస్ ఫ్లెక్సీల తొలగింపు చర్య రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జీవన్‌రెడ్డి తదుపరి రాజకీయ నిర్ణయంపై ఉతంఠ నెలకొంది.బీఆర్ఎస్లో చేరతారా..?తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తర్వాత ప్రముఖంగా ఉన్న పార్టీలు బీఆర్ఎస్, బీజేపీలు. మరి జీవన్‌రెడ్డి ఏ పార్టీలో చేరతారనే దానిపై చర్చ నడుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్లో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారనే టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించి రెండు రోజుల క్రితం వార్త హల్చల్ చేసింది. బీఆర్ఎస్ గూటికి జీవన్‌రెడ్డి చేరబోతున్నారనేది ఆ వార్త సారాంశం. దీనిలో భాగంగా జగిత్యాలలో భారీ ఎత్తున సభ ఏర్పాటు చేయడానికి జీవన్‌రెడ్డి సన్నద్ధమవుతున్నారని, ఆ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల తర్వాత తనకు కాంగ్రెస్‌లో తగిన గౌరవం లభించలేదని భావిస్తున్న జీవన్‌రెడ్డి.. దానికి పార్టీని వీడటం ఒక్కటే సరైన మార్గమని అనుకుంటున్నారని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. -
ఎన్నికల వేళ తమిళనాడులో ఈసీ కీలక నిర్ణయం
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల వేళ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తమిళనాడులో నలుగురు పోలీసు సూపరింటెండెంట్ల(ఎస్పీ)ను బదిలీ చేసింది. ఈసీ ఆదేశాలతో కరూర్, ఈరోడ్, నాగపట్నం, విరుదునగర్ జిల్లాల ఎస్పీలు తక్షణ బదిలీ అవుతారు. తాజాగా, ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్లో భాగంగా తమిళనాడులోని 234 స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. షెడ్యూల్‌తో పాటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఈసీఐ కరూర్ ఎస్పీగా హరికిరణ్ ప్రసాద్, కిరణ్ శ్రుతిని ఈరోడ్, సుజిత్ కుమార్‌ను నాగపట్నం, శ్రీనాథను విరుదునగర్ ఎస్పీగా నియమించారు. ఈ జిల్లాల ఎస్పీలు అధికార డీఎంకే పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలతో బదిలీ జరిగినట్లు తెలుస్తోంది.మరోవైపు, పశ్చిమ బెంగాల్లోనూ కీలక అధికారులను ఈసీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ప్రధాన అధికారి నందిని చక్రవర్తిని తొలగించి దుష్యంత్ నరియాలా (ఐఏఎస్-1993 బ్యాచ్)ను నియమించింది. ప్రిన్సిపల్ సెక్రటరీ, హోం అండ్ హిల్ అఫైర్స్ జగదీశ్ ప్రసాద్ మీనాను తొలగించి సంగమిత్ర ఘోష్ (ఐఏఎస్-1997 బ్యాచ్)ను నియమించింది. -
‘సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు?’
హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు. అసెంబ్లీ మీడియా హాల్లో హరీష్ మాట్లాడుతూ.. ‘ నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నీళ్ల హక్కులను కాపాడటం కోసం కేసీఆర్ పోరాటం చేశారు. కృష్ణా నదీ జలాల పున:పంపిణీని కేసీఆర్ సాధించారు. గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీలు,ఏపీకి 531 టీఎంసీలు వచ్చాయి. కేసీఆర్ సీఎం అయ్యాక గోదావరిపై ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు.కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు. నేను మాట్లాడిన తర్వాత రెండు రోజుల క్రితం లెటర్ రాశామని లెటర్ రిలీజ్ చేస్తున్నారు. గోదావరి జలాలపై ఏపీ కన్ను పడింది. జనవరి 30 న ఢిల్లీలో రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారుల మీటింగ్ జరిగింది. తెలంగాణ నుంచి వెళ్లిన అధికారులు డూడూ బసవన్నల్లా తల ఊపారు. గోదావరిలో ఏ రాష్ట్రానికి కేటాయింపులు లేవని సీడబ్ల్యూసీ చెప్పింది. ఫిబ్రవరి 12 వ తేదీన తెలంగాణకు మినిట్స్ వచ్చాయి. రేవంత్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి దాసోహం అయ్యారా...?, రేవంత్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని ఏపీకి తాకట్టు పెట్టారా...?’ అని ప్రశ్నించారు. -
దీదీకి ఝలక్ : 144 రేసు గుర్రాలు రెడీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన వేళ బీజేపీ (BJP) తన రేసు గుర్రాలను ప్రకటించింది. 2026 ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్న ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఈ నేపథ్యంలో 144 మందితో తొలి జాబితాను ప్రకటించింది.ఈ జాబితాలో మొత్తం 10 మంది మహిళా అభ్యర్థులకు చోటు దక్కింది.ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో 10మంది మహిళలు బరిలోకి దిగనున్నారు. అసన్సోల్ దక్షిణ నియోజకవర్గం నుండి అగ్నిమిత్ర పాల్, బెంగాల్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు (LoP) సువేందు అధికారి (భవానీపూర్ నియోజకవర్గం), దిలీప్ ఘోష్ (ఖరగ్‌పూర్ సదర్) వంటి ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. మరోవైపు ఈసారి ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య జాబితా తగ్గిపోవడం ప్రధాన వివాదంగా మారింది. గత ఏడాది నవంబర్‌లో ఓటర్ల సంఖ్య 7.66 కోట్లుగా ఉండగా, ఫిబ్రవరి 28న విడుదల చేసిన తుది జాబితాలో అది 6.44 కోట్లకు తగ్గింది.BJP announces first list of 144 candidates for the upcoming West Bengal Assembly Elections pic.twitter.com/QHLfHAUNFF— ANI (@ANI) March 16, 2026 "లాజికల్ డిస్క్రెపెన్సీ" విభాగం కింద వర్గీకరించి, న్యాయపరమైన పరిశీలన కోసం పంపిన దాదాపు 42 లక్షల మందికి పైగా ఓటర్ల భవిష్యత్తు మాత్రం ఇంకా సందిగ్ధంలోనే ఉంది.ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల నుండి వచ్చిన వారితో కలిపి మొత్తం 732 మంది జుడీషియల్ ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు.(అట్టుడుకుతున్న దుబాయ్ : విమానాశ్రయం వద్ద డ్రోన్ దాడి)ప్రధాని పర్యటన సందర్భంగా తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలపై కేంద్ర ఎన్నికల సంఘం (ECI) సీరియస్ అయింది. షెడ్యూల్ ప్రకటించడంతో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని, హింసాత్మక ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రధాన కమిషనర్ హెచ్చరించారు.కాగా పశ్చిమ బెంగాల్‌తో సహా నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ECI) ఆదివారం నాడు ప్రకటించిన వెంటనే బీజేపీ తొలి జాబితా సిద్ధం కావడం విశేషం. ఈ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడతాయి.కేరళలో కూడాకేరళ అసెంబ్లీ ఎన్నికలు 2026 కోసం బిజెపి సోమవారం (మార్చి 16) 47 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. క్రైస్తవ ఓటు బ్యాంకును ఆకర్షించే ప్రయత్నాల్లో భాగంగా. క్రైస్తవుల కోట అయిన కొట్టాయంలోని కంజిరపల్లిలో కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి,రాజ్యసభ సభ్యుడు జార్జ్ కురియన్ను పోటీకి దింపగా, ప్రాంతీయ పార్టీ కేరళ కాంగ్రెస్ మాజీ నాయకులు మరియు మాజీ ఎమ్మెల్యే పిసి జార్జ్ మరియు అతని కుమారుడు షోన్ జార్జ్‌లను వరుసగా కొట్టాయం జిల్లాలోని పూంజర్ , పాలాలో పోటీకి దింపడం గమనార్హం. ఇదీ చదవండి: అమ్మానాన్నకు సర్ప్రైజ్ గిఫ్ట్ : ఎమోషనల్ వీడియో -
తీవ్ర ఉత్కంఠ మధ్య రాజ్యసభ ఎన్నికలు
దేశంలోని 10 రాష్ట్రాల్లో 37 స్థానాలను భర్తీ చేయడానికి సోమవారం రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు సాయంత్రం 5 గంటలకు జరగనుంది. మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పదవీ విరమణ చేస్తున్న 37 మంది సభ్యుల పదవీకాలం ఏప్రిల్‌లో ముగుస్తుంది.ఇప్పటికే 37 స్థానాల్లో 26 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మిగిలిన 11 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. వీటిలో బిహార్ నుంచి 5, ఒడిశా నుంచి 4, హరియాణా నుంచి 2 స్థానాలు ఉన్నాయి.ఏకగ్రీవంగా గెలిచిన 26 మందిలో బీజేపీ ఏడు స్థానాలు సాధించింది. ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ ఐదు స్థానాలు గెలుచుకుంది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి నలుగురు అభ్యర్థులు, డీఎంకే నుంచి ముగ్గురు అభ్యర్థులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా, క్రాస్ ఓటింగ్ భయంతో తీవ్ర ఉత్కంఠ మధ్య ఎన్నికలు జరున్నాయి.హరియాణాలో 2 స్థానాలకు ముగ్గురి పోటీహర్యానా అసెంబ్లీ మొత్తం 90 స్థానాలు ఉన్నాయి. రెండు స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. కానీ ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. విజయం కోసం 31 ఓట్లు అవసరం. భారతీయ జనతా పార్టీకి 48 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీ అభ్యర్థి సంజయ్ భాటియా విజయం ఖాయమైంది. 17 ఓట్లు మిగులుతాయి. అవి స్వతంత్ర అభ్యర్థి సతీశ్ నందాల్కు పడతాయి. ముగ్గురు స్వతంత్రులు తప్ప ఇనెలో ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే సంఖ్య 22 అవుతుంది. అంటే విజయవానడికి తొమ్మిది ఓట్లు తక్కువ అవుతాయి. కాంగ్రెస్ వద్ద 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఐక్యంగా ఉంటే పార్టీ అభ్యర్థి కర్మవీర్ బౌద్ధకు 31 కంటే ఎక్కువ ఓట్లు రావచ్చు. కానీ క్రాస్ ఓటింగ్ జరిగితే ఫలితాలు మారవచ్చు. ఇంతకు ముందు కూడా ఇలానే జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య ఎక్కువ ఉన్నా అభ్యర్థి ఓడిపోయారు. 2016, 2022లో ఇలా జరిగింది.బిహార్‌లో 4 స్థానాలకు ఓటింగ్బిహార్ అసెంబ్లీ 243 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఐదు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు ఉన్నారు. ఎన్డీఏకు 202 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మహాఘట్బంధన్కు 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఎన్డీఏకు 4 స్థానాలు సులభంగా వస్తాయి. ఒక్కో స్థానానికి 41 ఓట్ల లెక్కలో నాలుగు స్థానాలు గెలవడానికి 164 మంది ఎమ్మెల్యేలు అవసరం. తర్వాత ఎన్డీఏ వద్ద 38 ఎమ్మెల్యేలు మిగులుతారు. 5వ స్థానానికి గెలవడానికి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు మద్దతు అవసరం. ఒడిశాలో 4 స్థానాలకు 5 అభ్యర్థుల మధ్య పోటీఒడిశా అసెంబ్లీ 147 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ రాజ్యసభ 4 స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. కానీ 5 అభ్యర్థులు ఉన్నారు. ఒక స్థానానికి విజయం కోసం 30 ఎమ్మెల్యేలు మద్దతు అవసరం. భారతీయ జనతా పార్టీ రెండు అభ్యర్థులు మన్మోహన్ సామల్, సుజీత్ కుమార్ విజయం ఖాయం. బీజేడీ వద్ద 48 ఓట్లు ఉన్నాయి. రెండు అభ్యర్థులు నిలబెట్టింది — సంత్రుప్త మిశ్రా, దత్తేశ్వర్ హోతా. మిశ్రా విజయం ఖాయం. చిక్కు నాలుగో స్థానంలో ఉంది. భారతీయ జనతా పార్టీ దిలీప్ రాయ్‌కు మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ 14 ఎమ్మెల్యేలు, మాకపా ఒక ఎమ్మెల్యే హోతా వద్ద ఉన్నారు. క్రాస్ ఓటింగ్ జరిగితే ఫలితాలు మారవచ్చు.ముఖ్యాంశాలుబిహార్లో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటు వేయలేదు, ఫోన్లు ఆఫ్ చేసుకున్నారు.హరియాణా, బిహార్, ఒడిశా నుంచి 11 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు ఉదయం 9 గంటల నుంచి ఓటింగ్ కొనసాగుతోంది. ఈ మూడు రాష్ట్రాల్లో క్రాస్ ఓటింగ్ భయం ఉంది.తేజస్వీ యాదవ్ పార్టీ ఆర్జేడీ ఒక ఎమ్మెల్యే కోసం ఎదురుచూస్తోంది. ఆయన కూడా ఇప్పటివరకు ఓటు వేయడానికి రాలేదు.బిహార్‌లో ఇప్పటివరకు ఎన్డీఏ తరఫున 201 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. మహాఘట్బంధన్ తరఫున 37 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు.హరియాణాలో ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ తొలి ఓటు వేశారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ ఎన్నికల్లో 70 ఓట్లు పడ్డాయి. ఓటింగ్ కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హిమాచల్ కసౌలి నుంచి బయలుదేరి చండీగఢ్‌లో భూపేందర్ హుడ్డా ఇంటి వద్ద చేరారు. తర్వాత అందరూ కలిసి బస్సులో అసెంబ్లీకి వద్దకు చేరుకున్నారు. -
‘బాబూ.. ఎంపీ మహేష్ తాట తీస్తావా?.. కేవలం డైలాగులేనా?’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ లోక్‌సభ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌పై చర్యలు తీసుకోకపోవడంపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని అడ్డంగా దొరికితే, పట్టుబడితే హాట్‌లైన్ రాజకీయాలతో బెయిల్ ఇప్పించడమే కాకుండా, షోకాజ్ నోటీసు పేరిట డ్రామా చేస్తారా? అని ప్రశ్నించింది. కోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి.. డ్రగ్స్ తీసుకునే వారిని వదిలేస్తారా? అంటూ ఘాటు విమర్శలు చేసింది.వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా..‘కోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి, రాజకీయ కక్షలతో అమయాకులను రోడ్ల మీద పరేడ్ చేయించడమే కాకుండా, జైళ్లకు పంపిన మీరు, మీ పార్టీకి చెందిన లోక్‌సభ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని అడ్డంగా దొరికితే, పార్లమెంటు చరిత్రలో ఒక ఎంపీ ఇలా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే హాట్‌లైన్ రాజకీయాలతో బెయిల్ ఇప్పించడమే కాకుండా, షోకాజ్ నోటీసు పేరిట డ్రామా చేస్తారా?. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్, హోం మంత్రి అనిత.. మీరు అనుసరించే చట్టం, న్యాయం, ధర్మం ఇదేనా? ఇలా చేసి సమాజానికి, యువతకు తప్పుడు సందేశం ఇస్తున్న మాట వాస్తవం కాదా?. హైదరాబాద్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పాల్గొన్నారన్నది వాస్తవం కాదా? ఆధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారన్నది వాస్తవం కాదా? డ్రగ్ నిర్ధారణ పరీక్షలను తారుమారు చేయడానికి యూరిన్ శాంపిల్స్‌లో భాగంగా యూరిన్ బదులు నీరు ఇచ్చారన్న ఆరోపణ కూడా ఉంది. చివరకు కొకైన్ తీసుకున్నట్టుగా రక్త పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. ఇన్ని పక్కా ఆధారాలతో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తిని ఎంపీ పదవికి రాజీనామా చేయించాల్సింది పోయి, తేలుకుట్టిన సామెత మాదిరిగా మౌనం దాల్చడం, పైగా పలుకుబడిని ఉపయోగించి, బెయిల్ మీద తీసుకురావడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. డ్రగ్స్ వ్యవహారాల్లో, మహిళలపై నేరాల విషయంలో ఎవరైనా తప్పులు చేస్తే తాటతీస్తా అని పదేపదే చెప్తున్న మాటలు కేవలం డైలాగులు మాత్రమేనని, చేతల్లో శూన్యమని, మీ అసలు రంగు ఇదేనని మరోసారి రుజువు అయ్యింది.కూటమికి చెందిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా మీకే స్వయంగా ఫిర్యాదు చేసినా కమిటీల పేరుతో ఇంకా ఇంకా డ్రామా చేస్తూనే ఉన్నారు.టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళమీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే, పంచాయతీ చేశారు తప్ప నో యాక్షన్.KGBV మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌మీద కూడా నో యాక్షన్. మహిళలకు అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మీద కూడా నో యాక్షన్.మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పీఏ మీద నో యాక్షన్.ఇక ప్రస్తుత టీటీడీ ఛైర్మన్, ఒక మహిళను మోసం చేసి, వీడియో, ఫొటోలతో అడ్డంగా దొరికిపోయినా నో యాక్షన్. తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వొద్దని, విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలు నేరుగా మీకే లేఖ రాసినా టీటీడీ చైర్మన్‌లాంటి పోస్టులో పెట్టారు.కమిటీల విచారణ, షోకాజ్ నోటీసుల పేరిట చేస్తున్న డ్రామాలు ఇకనైనా కట్టిపెట్టి, డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎంపీ చేత తక్షణమే రాజీనామా చేయించడంతోపాటు, వీళ్లందరి మీద చర్యలు తీసుకోండి. లేకపోతే మీ పార్టీని ప్రజలు క్షమించరు’ అంటూ ఘాటు విమర్శలు చేసింది. 🚨 #TDPDrugMafiaకోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి, రాజకీయ కక్షలతో అమయాకులను రోడ్ల మీద పరేడ్ చేయించడమే కాకుండా, జైళ్లకు పంపిన మీరు, మీ పార్టీకి చెందిన లోక్‌సభ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని అడ్డంగా దొరికితే, పార్లమెంటు చరిత్రలో ఒక ఎంపీ ఇలా డ్రగ్స్… pic.twitter.com/uzpnXwd562— YSR Congress Party (@YSRCParty) March 16, 2026 -
అసెంబ్లీలో చిరునవ్వులు.. రాజాసింగ్‌ను ఆటపట్టించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆటపట్టించారు. వారిద్దరి మధ్య సరదా సంభాషణ కొనసాగింది. అనంతరం, మీడియ ఏదో అనుకుంటుంది అంటూ.. ఇరువురు నేతలు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి నేడు గవర్నర్ ప్రసంగం కొనసాగింది. అనంతరం, అసెంబ్లీ లాబీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. బీజేఎల్పీ చాంబర్ నుంచి బయటకు వచ్చారు. అదే సమయంలో మాజీ మంత్రి కేటీఆర్ అటుగా వెళ్తుండగా.. రాజాసింగ్‌ను గమనించారు. దీంతో, బీజేపీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తి బీజేఎల్పీలోకి ఎలా వెళ్లారు అంటూ నువ్వుతూ సెటైర్ వేశారు.బీజేఎల్పీ నుంచి బయటికి రా అంటూ రాజాసింగ్‌ను సరదాగా కేటీఆర్ ఆటపట్టించారు. ఇంతలో అక్కడే ఉన్న మరో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కల్పించుకుని.. సరదాగా మీరు కూడా బీజేఎల్పీ చాంబర్లోకి రండి అంటూ కేటీఆర్‌ను ఆహ్వానించారు. వెంటనే కేటీఆర్ స్పందిస్తూ.. తాను బీజేఎల్పీ చాంబర్లోకి వస్తే మీడియా వాళ్ళు ఇంకేదో రాస్తారు అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు. దీంతో, ఇరు పార్టీల నేతల మధ్య సరదా సంభాషణ కొనసాగింది.అనంతరం, బీజేఎల్పీలోకి వెళ్ళడంపై ఎమ్మెల్యే రాజసింగ్ స్పందిస్తూ..‘పాత ఇల్లు.. పాత ఫ్రెండ్స్ ఎప్పుడైనా పోతాను.. ఎప్పుడైనా వస్తాను. పార్టీలో మళ్లీ చేరడంపై ఇంకా డిసైడ్ కాలేదు. ఎవరు ఎవరిని బతిమాలుతున్నారో భవిష్యత్తులో తెలుస్తుంది’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు అధికార పార్టీ పక్షంవైపు కూర్చోవడం గమనార్హం. ఈ కమ్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యే కాలే యాదయ్యను బీఆర్ఎస్ వైపు కూర్చోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు. కానీ, కాలే యాదయ్య మాత్రం తాను కాంగ్రెస్ వైపే కూర్చుంటానని చెప్పుకొచ్చారు. ఇక, ఇటీవలే పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫిరాయింపుల విషయంలో క్లీన్చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. -
ఎల్పీజీ సంక్షోభంపై కేంద్రం అబద్దాలు చెబుతోంది : మల్లిఖార్జున ఖర్గే
న్యూఢిల్లీ: ఇరాన్ వార్తో దేశంలో ఎల్పీజీ గ్యాస్ లభ్యంత గందరగోళంగా మారింది. సోమవారం పార్లమెంటులో ఈ సంక్షోభంపై దుమారం రేగింది. ఒకవైపు ఎల్పీజీ కొరతలేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి ఆందోళనగా కరంగా ఉందని కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు. దీంతో ప్రతిపక్ష నాయకుడు (ఎల్ఓపి) మల్లికార్జున్ ఖర్గే, జె.పి. నడ్డా మధ్య వాగ్వాదంచోటు చేసుకుంది. జీరో అవర్ సందర్భంగా మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, గల్ఫ్ యుద్ధం మరియు హార్ముజ్ జలసంధి దిగ్బంధనం వల్ల ఏర్పడిన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఎల్పిజి సరఫరాపై ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో, కాంగ్రెస్ కేంద్రంపై మండిపడింది. రాజ్యసభలో ఎల్పిజి సంక్షోభ అంశాన్ని లేవనెత్తిన మల్లికార్జున్ ఖర్గే సిలిండర్ల ప్యానిక్ బుకింగ్‌పై ఖర్గే విమర్శలు గుప్పించారు. ఎల్పిజి సమస్య మధ్యతరగతి, రెస్టారెంట్లు, హాస్టళ్లు , వాణిజ్య వినియోగ దారులను ప్రభావితం చేస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో, ఎల్పిజి లభ్యత, ధర స్థిరత్వం తీవ్రమైన సమస్యలుగా మారాయనే విషయాన్ని కేంద్రం గుర్తించాలన్నారు. కేంద్ర పెట్రోలియం మంత్రి ఎల్పిజి కొరత లేదని లోక్‌సభలో ప్రకటించిన వైనాన్నిఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చెబుతున్న వాదనలు తప్పు అని వాస్తవాలు రుజువు చేస్తున్నామని మండిపడ్డారు.హార్ముజ్ జలసంధి దిగ్బంధనంతో తలెత్తిన ఇంధన సంక్షోభాన్ని ప్రభుత్వం సరిగ్గా నిర్వహించలేదని ఖర్గే ఆరోపించడంతో జీరో అవర్ సమయంలో ఘర్షణ చెలరేగింది.దేశవ్యాప్తంగా ఎల్పిజి సిలిండర్ల తీవ్ర కొరతకు ప్రభుత్వమే కారణమని ఖర్గే అన్నారు. మధ్యతరగతి , పేద కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని అన్నారు. రెస్టారెంట్లు, హాస్టళ్లు కమ్యూనిటీ కిచెన్లను మూసివేయాల్సి వచ్చిందని, ఎల్పిజి సిలిండర్లను అధిక ధరలకు అమ్ముతున్నారని ఆయన పేర్కొన్నారు.దేశంలో 60 శాతం ఎల్పిజి దిగుమతి అవుతుందని, ఇందులో 90 శాతం సరఫరా హోర్ముజ్ జలసంధి ద్వారా జరుగుతుంద న్నారు. ప్రపంచ చమురు సంక్షోభానికి దారితీసే కీలకమైన సముద్ర మార్గం ఇది అని అన్నారు. ఎల్పిజి సరఫరాపై కేంద్రం ముందస్తు ప్రణాళిక వేసుకుని ఉంటే, ఈపరిస్థితి తలెత్తేది కాదన్నారు. ఖర్గే ఎరువుల సరఫరా కొరతను కూడా ఎత్తిచూపారు.అలాగే సిలిండర్ కోసం వెయిటింగ్ సమయాన్ని కూడా 21 - 25 రోజులకు పెంచారు, ఇది, బ్లాక్ మార్కెటింగ్‌కు దారితీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంక్షోభం ప్రభుత్వ పేలవమైన ప్రణాళిక నిదర్శనమని, ఇది విదేశాంగ విధానంపై కూడా ప్రశ్నలను లేవనెత్తుతుదని ఖర్గే మండిపడ్డారు. ప్రణాళిక లేకపోవడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి దేశంలో ఎల్పిజి సరఫరాపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు.నడ్డా కౌంటర్ ఖర్గే విమర్శలతో సభలో వేడి రాజుకుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు, నడ్డా కూడా స్పందించారు. జీరో అవర్ కారణంగా సభ్యులు ప్రజా సమస్యలపై లేవనెత్తాల్సిన అవసరం ఉందని, చైర్ జోక్యం చేసుకోవాలని నడ్డా కోరారు. సభలో తీవ్రమైన అంశాలపై చర్చలు జరుగుతున్నపుడు వాటిపై శ్రద్ధపెట్టకుండా ప్రతిపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయని ఆరోపించారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు LPG సమస్యపై మాట్లాడకుండా ఇతర అంశాలపై మాట్లాడటానికే మొగ్గు చూపారంటూ రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాల ఆందోళన అయితే ప్రతిపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, LPG సంక్షోభం విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడిని కొనసాగించాయి. ప్రతిపక్షాల వైపు నుంచి గందరగోళం కొనసాగుతుండగానే, సభ ఛైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ ముగించాలని ఖర్గేను కోరారు. ఖర్గే చేసిన ఆరోపణలకు బదులిస్తూ, నడ్డా ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగారు. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు అసలు ఈ సంక్షోభం దేశం వల్ల కాదని, ప్రపంచవ్యాప్త కారణాల వల్లే తలెత్తిందని పేర్కొన్నారు. కాగా దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు మరియు వంట గ్యాస్ నిరంతరాయంగా లభ్యతను నిర్ధారించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
పొట్టి శ్రీరాములును అవమానించిన వ్యక్తి చంద్రబాబు: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: ఏపీలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు నిధులు విడుదల చేయలేదని ప్రశ్నించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితమే ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు జ్ఞాపకాలను లేకుండా చేయాలని కుట్ర చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ ఘాటు విమర్శలు చేశారు.అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను వైఎస్సార్సీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. విజయవాడ త్రిమూర్తి చౌక్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ నేతలు నివాళులర్పించారు. అనంతరం, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘ఆర్య వైశ్యుల చందాలతో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక అంగుళానికి 5 వేల చొప్పున వసూలు చేశారు. 158 అడుగుల ఎన్టీఆర్ విగ్రహానికి మాత్రం 17వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు.పొట్టి శ్రీరాములు రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించారు. ఆయన ప్రాణత్యాగ ఫలితమే ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. ఆయన త్యాగాన్ని గుర్తించిన పార్టీ వైఎస్సార్సీపీ. నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాం. వైఎస్సార్సీపీ హయాంలో ఆంధ్రరాష్ట్ర అవతరణ వేడుకలు మూడు రోజుల పాటు నిర్వహించాం. పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులను సన్మానించాం. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఒక్కసారి కూడా పొట్టి శ్రీరాములు జయంతి కానీ, ఆంధ్రరాష్ట్ర అవతరణ వేడుకలు కానీ నిర్వహించలేదు. పొట్టి శ్రీరాములుని అవమానించిన వ్యక్తి చంద్రబాబు. ఆయన జ్ఞాపకాలను లేకుండా చేయాలని కుట్ర చేసిన వ్యక్తి చంద్రబాబు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే మొదటి ఏడాది ఘనంగా అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు’ అని చెప్పుకొచ్చారు. -
బెంగాల్ ఎన్నికలు.. సీఎస్, హోం సెక్రటరీపై వేటు
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పశ్చిమబెంగాల్ చీఫ్ సెక్రటరీ, హోం సెక్రటరీపై ఈసీ బదిలీ వేటు వేసింది. అలాగే, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎలాంటి పోస్టింగ్ వద్దని ఆదేశాల్లో పేర్కొంది. అనంతరం, కొత్త చీఫ్ సెక్రటరీగా దుష్యంత్ నరియాల, హోం సెక్రటరీగా సంఘమిత్ర ఘోష్‌లను నియామకం చేసింది. ఈ మేరకు ఆదివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ లేఖలో స్పష్టం చేసింది. తన ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని, అధికారులు విధుల్లో చేరిన వివరాలతో కూడిన నివేదికను సోమవారం మధ్యాహ్నం 3 గంటల లోపు పంపాలని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇక, ఇప్పటివరకు నందిని చక్రవర్తి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతల్లో ఉన్నారు. కాగా, పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు రెండు దశల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. Following the announcement of the West Bengal Assembly Elections 2026 schedule on 15 March 2026, the Election Commission of India announced the transfer of senior officers. Dushyant Nariala (IAS-1993) appointed Chief Secretary, Govt. of West Bengal, and Sanghamitra Ghosh… pic.twitter.com/pqXt0fWD8b— ANI (@ANI) March 15, 2026 -
కాంగ్రెస్ పార్టీకి త్వరలో రాజీనామా
రాయికల్ (జగిత్యాల): కాంగ్రెస్ పార్టీకి త్వరలో రాజీనామా చేయనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జీవన్‌రెడ్డి తెలిపారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, దశాబ్దాలకాలం కాంగ్రెస్‌కు సేవలందించానని, ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇమడలేకపోతున్నానని, ఈ క్రమంలో మొదటగా పార్టీకి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. రాజీనామా లేఖను ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి అందజేస్తారా? అని ప్రశ్నించగా.. ఇక్కడే చేస్తానని తెలిపారు. రంజాన్, ఉగాది పండుగల అనంతరం మరోసారి అభిమానులతో సమావేశమై ఏ పార్టీలోకి వెళ్లాలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. -
డ్రగ్స్ కేసు వివాదం: టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ బుకాయింపు
సాక్షి, విజయవాడ: ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసు మరోసారి చర్చనీయాంశమైంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం రక్త పరీక్షల్లో మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయ్యింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఎంపీ మహేష్ యాదవ్ ఖండిస్తూ నేను ఎలాంటి తప్పు చేయలేదు, మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని వీడియో విడుదల చేశారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన తర్వాత స్టేషన్ బెయిల్ పై విడుదలైన మహేష్, వీడియోలో తన నిర్దోషిత్వాన్ని వాదించుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. తెలంగాణ పోలీసులు మాత్రం స్పష్టంగా మహేష్ డ్రగ్స్ తీసుకున్నట్టు ప్రకటించారు. దాంతో ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. సోషల్ మీడియాలో ఆయన వీడియోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫాంహౌస్‌లో టీడీపీ నేత, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డ విషయం తెలిసిందే. అయినప్పటికీ, షోకాజ్ నోటీసుతో సరిపెట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పుట్టా మహేష్‌ను టీడీపీ ఆదేశించింది. డ్రగ్స్ ఘటనపై పుట్టా మహేష్ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోపు లిఖితపూర్వక వివరణ ఇవాలని కోరారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు. పుట్టా మహేష్‌ను టీడీపీ నుంచి సస్పెండ్ చేసి, ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని సర్వత్రా డిమాండ్ వస్తోంది. అయినప్పటికీ డ్యామేజ్ కంట్రోల్ కోసం షోకాజ్ నోటీసులతో సరిపెట్టారు చంద్రబాబు. అరవ శ్రీధర్, కోనేటి ఆదిమూలం తరహాలోనే నోటీసుల డ్రామా వేస్తున్నారు. గలీజ్ కూటమి ఎమ్మెల్యేలపై ఇప్పటికీ చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోలేదు. దేశంలోనే డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డ ఏకైక ఎంపీ పుట్టా మహేష్. -
పుట్టా మహేష్ ఇష్యూ: షోకాజ్ నోటీసుతో సరిపెట్టిన చంద్రబాబు
సాక్షి, విజయవాడ: టీడీపీలో డ్రగ్స్ కలకలం చెలరేగుతోంది. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫాంహౌస్‌లో టీడీపీ నేత, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డ విషయం తెలిసిందే. అయినప్పటికీ, షోకాజ్ నోటీసుతో సరిపెట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పుట్టా మహేష్‌ను టీడీపీ ఆదేశించింది. డ్రగ్స్ ఘటనపై పుట్టా మహేష్ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోపు లిఖితపూర్వక వివరణ ఇవాలని కోరారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు. పుట్టా మహేష్‌ను టీడీపీ నుంచి సస్పెండ్ చేసి, ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని సర్వత్రా డిమాండ్ వస్తోంది. అయినప్పటికీ డ్యామేజ్ కంట్రోల్ కోసం షోకాజ్ నోటీసులతో సరిపెట్టారు చంద్రబాబు. అరవ శ్రీధర్, కోనేటి ఆదిమూలం తరహాలోనే నోటీసుల డ్రామా వేస్తున్నారు. గలీజ్ కూటమి ఎమ్మెల్యేలపై ఇప్పటికీ చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోలేదు. దేశంలోనే డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డ ఏకైక ఎంపీ పుట్టా మహేష్. ఇవీ చదవండి: పుట్టా మహేష్, ప్రియాంక రెడ్డికి నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు పుట్టా మహేష్‌ను రక్షించడానికి రంగంలోకి చంద్రబాబు -
‘కాంగ్రెస్ పాలనపై తిరగబడే కాలం వచ్చింది’
హైదరాబాద్: ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను మోసం చేసినట్లే, బీసీలకు ద్రోహం చేశాడని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన బీసీ డిక్లరేషన్‌కు అతిగతి లేకుండా పోయిందన్నారు. ఏటా 20 వేల కోట్ల చొప్పున 5 ఏళ్లలో లక్ష కోట్లు బీసీల కోసం ఖర్చు చేస్తామని మాట తప్పారన్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం వల్ల బీసీ వర్గాల ప్రజల అభివృద్ధి ప్రశ్నార్ధకంగా మారిందన్నారుస్థానిక సంస్థల్లో బీసీలకు హామీ ఇచ్చిన రిజర్వేషన్లపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదన్న హరీశ్ రావు.. రేవంత్ రెడ్డి బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గా మాత్రమే చూస్తున్నారని విమర్శించారు. బీసీ సంక్షేమం మాటల్లోనే తప్ప పనుల్లో కనిపించడం లేదనీ, రాబోయే బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని, వారంతా ఇప్పుడు తిరగబడే కాలం వచ్చిందన్నారు.అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడాతా అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, పటాన్ చెరు మండల ఇంచార్జ్ మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో క్యాసారం కాంగ్రేస్ నాయకులు, కార్యకర్తలు హరీశ్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా హరీశ్ రావు గారు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో నక్క మల్లేష్ గౌడ్, కాసా ధనుంజయ్ గౌడ్, నక్క పవన్ గౌడ్, నక్క చరణ్ గౌడ్, నక్క వికాస్ గౌడ్, కాసా వినయ్ గౌడ్, పట్లోళ్ల తిరుపతి రెడ్డి, నక్క వీర స్వామి గౌడ్, నక్క సాయి గౌడ్, బచ్చుగూడెం ఎల్లయ్య యాదవ్, కాసా రాజు గౌడ్, అత్తెల్లి శ్రీకాంత్ రెడ్డి, పెద్దోళ్ల రాజు, ఇతర కార్యకర్తలు ఉన్నారు. -
పుట్టా మహేష్, ప్రియాంకరెడ్డికి నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు
హైదరాబాద్ శివారులోని మొయినాబాద్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన వీకెండ్ పార్టీలో డ్రగ్స్ లభ్యం కావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇందులో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఈగిల్ ఫోర్స్ పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. పుట్టా మహేష్, ప్రియాంకరెడ్డికి నోటీసులు ఇచ్చి పోలీసులు వదిలేశారు. పెద్దల ఒత్తిళ్లతోనే వదిలేశారని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు, శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్‌రెడ్డి, నితిన్ శర్మను పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చనున్నారు. కాగా, ఫాంహౌస్‌లో దొరికిన 11 మందిలో ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రైడ్స్ సమయంలో కాల్పులు జరిపిన వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. -
‘చంద్రబాబు.. ఇదేనా మీరు చెప్పుకునే క్రమశిక్షణ?’
తిరుపతి: డ్రగ్స్ కేసులో పట్టుబడిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తిరుపతి వైఎస్సార్సీపీ ఇంచార్జ్ భూమన అభినయ్‌రెడ్డి డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసులో పుట్టా మహేష్ యాదవ్ హైదరాబాద్ పోలీసులకు పట్టుబడటం సంచలనం రేకెత్తిస్తోందన్నారు అభినయ్‌రెడ్డి. టీడీపీ అంటే క్రమ శిక్షణకు మారుపేరు అని చెప్పుకునే చంద్రబాబు మాటలకు అర్థం ఇదేనా? అని నిలదీశారు. ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోక, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని రంగంలోకి దించారని విమర్శించారు. ‘పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనకుండా, ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఏవిధంగా పక్కదారి పడుతున్నారో చూడండి. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ,పిస్టల్ తో కాల్పులు జరిపినట్లు సమాచారం కూడా ఉంది. పుట్టా మహేష్ యాదవ్‌ను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలి. డ్రగ్స్ నిర్మూలిస్తాం అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు.. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు?, ఏపీలో రెండున్నరేళ్ల లో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు, జరుగుతున్నాయిటిటిడి చైర్మన్‌గా త్యంత చెత్త చైర్మన్ గా బీఆర్ నాయుడు ఉన్నారు. తిరుమల క్యూ లైన్ లో భక్తులు నిరసన చేపట్టారు , గతంలో ఎన్నడు క్యూ లైన్ లో నిరసన తెలిపింది లేదు’ అని స్పష్టం చేశారు. ఎంపీ డ్రగ్స్ తో పట్టుబడటం హేయమైన చర్యవిజయవాడ: ఓ ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తి డ్రగ్స్‌తో పట్టుబడటం హేయమైన చర్య అని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ఎంపీ స్థానంలో ఉండి ఈ తరహా పనులు చేయడమేంటి?, భారతదేశ చరిత్రలో ఒక ఎంపీ డ్రగ్స్ తో పట్టుబడానికి పుట్టా మహేష్ ఒక నిదర్శనం. కూటమి వచ్చిన నాటి నుంచి ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా బయటికి వస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో అమ్మాయిల పై అరాచకాలు, దుర్మార్గాలు , రెడ్ బుక్ సిద్ధాంతాలు, కేసులు ఇవే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఎంపీ డ్రగ్స్ తో దొరకడమంటే మాటలు కాదు. తమ ఎంపీ డ్రగ్స్ తో దొరికడం పై కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది. ఎంపీ మహేష్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలి. ఏపీలో ప్రభుత్వం డ్రగ్స్, గంజాయిని అరికట్టాలంటున్నారు. ఏపీలో ప్రస్తుతం స్కూల్స్ లో కూడా గంజాయి దొరుకుతుంది. టీడీపీ ఎంపీలు డ్రగ్స్ కల్చర్ కు స్వాగతం పలుకుతున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఏమనాలి. టీడీపీ మంత్రులు,ఎమ్మెల్యేలకు హైదరాబాద్ ఆటవిడుపుగా మారింది. శుక్రవారం సాయంత్రం అవ్వగానే హైదరాబాద్‌కు వెళ్లిపోతున్నారు. టిడిపి నేతలు ఏం చేస్తున్నారో అంతా చూస్తున్నారు’ అని విమర్శించారు. -
చంద్రబాబు, రేవంత్‌కు హాట్‌లైన్ సంబంధాలు: మార్గాని భరత్
తూర్పుగోదావరి జిల్లా: రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన ఎంపీ మహేష్ యాదవ్‌పై టీడీపీ ఓ నిర్ణయం తీసుకుంటుందో.. లేదో స్పష్టం చేయాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. ఇంతవరకు టీడీపీ నాయకులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ మార్గాని భరత్ మాట్లాడుతూ.. ‘ఏపీ సీఎం చంద్రబాబుకు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హాట్‌లైన్ సంబంధాలు ఉన్నాయి. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టును చంద్రబాబుతో చెప్పి నిలుపు చేయించానని రేవంత్ రెడ్డి ఏకంగా అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నప్పటికీ చంద్రబాబు పట్టించుకోలేదు.పైకి నో టు డ్రగ్స్ అంటూ క్యాంపెయిన్ చేస్తున్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ అందుబాటులో ఉంటున్నాయి. రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన మహేష్ యాదవ్‌తో పదవికి రాజీనామా చేయించాలి, ఆయనను చంద్రబాబు పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయాలి. గత ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ అదుపు చేయటానికి అనేక చర్యలు తీసుకున్నారు’ అని తెలిపారు. ఇదీ చదవండి: పుట్టా మహేష్‌ను రక్షించడానికి రంగంలోకి చంద్రబాబు -
‘పుట్టా మహేష్‌ను రక్షించడానికి రంగంలోకి చంద్రబాబు’
హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసిన వీకెండ్ పార్టీలో డ్రగ్స్ లభ్యం కావడం కలకలం రేపుతోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ (ఈగిల్) ఫోర్స్ పోలీసుల ప్రకటించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పందిస్తూ పుట్టా మహేష్ తీరుపై మండిపడ్డారు.‘చంద్రబాబు బ్రాండ్.. డ్రగ్స్ బ్రాండ్. డ్రగ్స్ మాఫియాను చంద్రబాబు పెంచి పోషిస్తున్నారు. సామాన్యుడికి ఒక రూల్.. ఎంపీకి మరో రూల్ ఉండకూడదు. పుట్టా మహేష్‌ను రక్షించడానికి చంద్రబాబు రంగంలోకి దిగారు. పుట్టా మహేష్‌కు ఎంపీగా కొనసాగే అర్హత లేదు’ అని కాకాణి అన్నారు. కాగా, వీకెండ్ పార్టీలో డ్రగ్స్ లభ్యం కావడంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఫాంహౌస్‌లో కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు ప్రకటించారు. -
‘ఇంత జరుగుతున్నా.. చంద్రబాబు నోరు విప్పరేం?’
సాక్షి, కాకినాడ జిల్లా: టీడీపీ.. తెలుగు డ్రగ్స్ పార్టీలా మారిందన్న అనుమానం ప్రజలకు వచ్చిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ పార్టీలో దొరికారు. ఇప్పటి వరకు దీనిపై చంద్రబాబు కానీ.. టీడీపీ నేతలు కానీ నోరెత్తలేదు. తెల్లవారు లేస్తే ప్రవచనాలు చెప్పే చంద్రబాబు.. డ్రగ్స్ తీసుకుని దొరికిన ఎంపీపై ఏం చెబుతారు అని మేము అడుగుతున్నాం’’ అంటూ కన్నబాబు నిలదీశారు.‘‘డ్రగ్స్ రహిత సమాజం సృష్టించాలని.. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ మంత్రి లోకేష్ ఉద్యమంలా ప్రచారం చేశారు. డ్రగ్స్ వద్దని ప్రజలకు చెబుతారు కానీ.. మీ పార్టీలో వారు మాత్రం సేవిస్తూ ఉంటారు. ఎదుట వారికి చెప్పడానికే నీతులు.. మేము మాత్రం అన్ని పనులు చేస్తాం అన్నట్లు ఉంది టీడీపీ పరిస్థితి. ఒకాయన మహిళలతో రాసలీలలు.. మరోకరు డ్రగ్స్‌తో దొరికిన ప్రభుత్వ పరంగా ఏలాంటి చర్యలు ఉండవు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలిస్తామని హోమంత్రి అనిత ప్రకటించిన పది రోజుల వ్యవధిలోనే చంద్రబాబు సొంత జిల్లాలో గంజాయి పట్టుబడింది...పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు.. తప్పుడు కేసులు కట్టడంలో బిజీగా ఉన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికి వదిలేశారు. టీడీపీ ఎంపీ డ్రగ్స్ కేసులో దొరికితే పార్టీ స్పందన ఏంటీ?. అంతకు ముందు కూటమి ఎమ్మెల్యేల బాగోతం.. తరువాత టీవీ 5 చైర్మన్ బాగోతం.. ఇప్పుడు ఏలూరు ఎంపీ బాగోతం చూస్తున్నాం’’ అంటూ కన్నబాబు దుయ్యబట్టారు. -
‘దళపతి’ మైండ్ గేమ్.. దిక్కుతోచని బీజేపీ?
తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో అక్కడి రాజకీయ సమీకరణలు అత్యంత వేగంగా మారుతున్నాయి. దళపతి విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని తమ గూటికి చేర్చుకునేందుకు బీజేపీ భారీ స్కెచ్ వేసింది. ‘ఇండియా టుడే’ పేర్కొన్న సమాచారం ప్రకారం విజయ్ పార్టీతో బీజేపీ జరుపుతున్న చర్చలు ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి.బంపర్ ఆఫర్.. కానీ మెలిక!ఈ పొత్తులో భాగంగా విజయ్‌కి బీజేపీ కళ్లు చెదిరే ఆఫర్ ప్రకటించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కూటమిలో చేరితే విజయ్‌కి ఏకంగా ‘డిప్యూటీ సీఎం’ పదవితో పాటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 80 సీట్లు కేటాయిస్తామని బీజేపీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే విజయ్ మాత్రం నేరుగా ‘ముఖ్యమంత్రి’ పీఠంపైనే కన్నేసినట్లు సమాచారం. సీట్ల సర్దుబాటు కంటే సీఎం కుర్చీ కారణంగా చర్చలు ప్రస్తుతం ఒక కొలిక్కి రావడం లేదని తెలుస్తోంది.రంగంలోకి పొరుగు రాష్ట్ర డిప్యూటీ సీఎం..విజయ్ను ఎన్డీయే కూటమిలోకి తీసుకువచ్చేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇందులో భాగంగా పక్క రాష్ట్రానికి చెందిన ఒక ఉప ముఖ్యమంత్రిని మధ్యవర్తిగా రంగంలోకి దింపినట్లు సమాచారం. విజయ్‌తో నేరుగా మంతనాలు జరిపే బాధ్యతను సదరు నేతకు అప్పగించినట్లు తెలుస్తోంది. విజయ్‌కి ఉన్న భారీ ఫ్యాన్ బేస్ ఎన్నికల్లో అత్యంత కీలకం కానుంది. కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో గెలుపోటములు మారిపోయే తమిళనాడు రాజకీయాల్లో, విజయ్ క్రేజ్ తమకు కలిసొస్తుందని బీజేపీ వ్యూహకర్తలు గట్టిగా నమ్ముతున్నారు.విజయ్ క్యాంపులో అంతర్మథనంమరోవైపు, బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై విజయ్ సన్నిహితుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని స్థాపించిన కొత్తలోనే ఒక జాతీయ పార్టీతో చేతులు కలిపితే, స్వతంత్ర ప్రత్యామ్నాయంగా తాము నిర్మించుకున్న ఇమేజ్ దెబ్బతింటుందని కొందరు సలహాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని ఒక కొత్త మార్గంలో మొదలుపెట్టిన తరుణంలో, ఈ కూటమి నిర్ణయం పార్టీ విశ్వసనీయతను ఎలా ప్రభావితం చేస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి ‘దళపతి’ వేసే తదుపరి అడుగు తమిళ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: ట్రంప్ కోడలా మజాకా.. షాకిస్తున్న ఐదు సంచలనాలు.. -
టీడీపీ.. తెలుగు డ్రగ్స్ పార్టీగా మారింది: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: పుట్టా మహేష్‌ను ఎంపీ పదవి నుంచి తొలగించాలంటూ వైఎస్సార్సీపీ నేత టీజేఆర్ సుధాకర్‌బాబు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ.. తెలుగు డ్రగ్ పార్టీగా మారిపోయిందన్నారు. టీడీపీ ఎంపీ మద్యం తాగుతూ డ్రగ్స్ తీసుకోవడం సిగ్గుచేటు. క్యారెక్టర్ లేని వ్యక్తులను చంద్రబాబు లోక్‌సభకు పంపారు. పార్లమెంట్లో అడుగుపెట్టే నైతిక హక్కు మహేష్‌కు లేదు’’ అంటూ టీజేఆర్ మండిపడ్డారు.‘‘రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసులో దొరకటం సిగ్గుచేటు. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌కు పార్లమెంటుకు వెళ్లే అర్హత లేదు. ఎంపీ మహేష్‌ను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. ఎంపీ పదవి నుండి తొలగించాలి. డ్రగ్స్ నెట్‌వర్క్‌తో ఎంపీ పుట్టాకు సంబంధం ఉంది. రాజస్థాన్‌కి చెందిన మాజీ ఎమ్మెల్యేని డ్రగ్స్ పార్టీకి పిలవడమే ఇందుకు నిదర్శనం. టీడీపీ నేతలు బరితెగించారు...తప్పులు చేసి కూడా అయితే ఏంటంటా? అంటున్నారు. ఎంపీ పుట్టా మహేష్ అనేకమంది యువత జీవితాలను పెడదోవ పట్టించేలా వ్యవహరించారు. టీటీడీకి ఛైర్మన్‌గా పని చేసిన సుధాకర్ యాదవ్ కొడుకే ఎంపీ మహేష్. టీటీడీ ప్రస్తుత ఛైర్మన్ బీఆర్ నాయుడు ఇటీవలే వీడియోలతో దొరికాడు. అయినాసరే చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు...ఇప్పుడు పుట్టా మహేష్ విషయంలో ఏం చర్యలు తీసుకుంటారు. పుట్టా మహేష్ యాదవ్ కు పార్లమెంటులోకి ప్రవేశించే అర్హత లేదు. ఆయన్ను ఎంపీ పదవి నుండి వెంటనే తొలగించాలి. గుంటూరు, విజయవాడ, అమరావతిలో ఇటీవల డ్రగ్స్, గంజాయి విపరీతంగా దొరుకుతోంది. అయినాసరే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. చంద్రబాబుకు రేవంత్, రాహుల్ గాంధీతో హాట్ లైన్ సంబంధం ఉంది. కాబట్టి రేవంత్‌తో మాట్కాడి పుట్టా కేసును నీరుగార్చుతారనే అనుమానం ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్‌తో తిరుగుతున్న వ్యక్తి చంద్రబాబు. అలాంటి చంద్రబాబును ఎలా నమ్ముతున్నారో బీజేపీ, జనసేనకే తెలియాలి. రాయలసీమ లిఫ్టును కాంగ్రెస్ సీఎం అడిగాడని చంద్రబాబు ఆపేశారు. చంద్రబాబుతో సంబంధం లేకపోతే రేవంత్ రెడ్డి వెంటనే ఎంపీ మహేష్ పై చర్యలు తీసుకోవాలి. తెలంగాణ పోలీసుల నిజాయితీకి ఇది పరీక్ష. రెండు రాష్ట్రాలను డ్రగ్స్ రాష్ట్రాలుగా మార్చటం సిగ్గుచేటు’’ అంటూ టీజేఆర్ సుధాకర్‌బాబు మండిపడ్డారు. -
‘మూసీ’.. కాంగ్రెస్ భూ ఆక్రమణ పథకం : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్/బండ్లగూడ: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రూ.16వేల కోట్లతో ఒక్క ఇల్లూ కూల్చకుండా మూసీని అభివృద్ధి చేసే ప్రణాళికలు సిద్ధం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే ఉప్పల్, నాగోల్ ప్రాంతాల్లో 6 కి.మీ. మేర విజయవంతంగా అభివృద్ధి చేశామన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రూ.లక్షన్నర కోట్ల అంచనాలతో సామాన్యుల ఇళ్లను కూల్చివేస్తూ విధ్వంసానికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. శనివారం హిమాయత్ సాగర్ వేదికగా ‘మూసీ పునరుజ్జీవం– పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వర్సెస్ పబ్లిక్ పాయింట్‘కార్యక్రమాన్ని కేటీఆర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి ప్లానింగ్ రిపోర్టు లేకుండా సోషల్ ఇంపాక్ట్ స్టడీ, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ స్టడీ వంటి నివేదికలు లేకుండా, ప్రజలతో చర్చలు నిర్వహించకుండా వేలాదిమంది ఇళ్లను కూలగొడతామని కాంగ్రెస్ ప్రభుత్వం భయాందోళనకు గురిచేస్తోందని మండిపడ్డారు. ‘అభివృద్ధికి మేము ఏమాత్రం వ్యతిరేకం కాదు. అవినీతికి, కాంగ్రెస్ భూదాహానికి, రేవంత్ రెడ్డి లక్షల కోట్ల అవినీతి ప్రణాళికలకు మాత్రం వ్యతిరేకం. రేవంత్ రెడ్డి అవినీతిని అడ్డుకుంటాం. పార్టీలకు అతీతంగా హైదరాబాద్ నగర ప్రజలను కాపాడుకుంటాం. బాధితుల వెంట బీఆర్ఎస్ ఉంటుంది’అని కేటీఆర్ చెప్పారు. రెండేళ్లపాటు మూసీ బాధితులు సమష్టిగా ప్రభుత్వంపై పోరాడితే, తమ ప్రభుత్వం వచ్చాక కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యాన్ని పారదోలి అందరి ఇళ్లు, భూములను కాపాడతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవన్నారు.. ఇచ్చిన హామీలకు, అభివృద్ధికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, విపరీతంగా అప్పులు ఉన్నాయని చెబుతున్న రేవంత్ రెడ్డి.. మూసీ కోసం వేల కోట్లు ఖర్చు పెడతానంటున్నాడని కేటీఆర్ ఎద్దేవాచేశారు. ‘రూ.లక్షన్నర కోట్లతో మూసీని అభివృద్ధి చేస్తామంటున్నారు... అందాల పోటీలకు, ఫుట్‌బాల్ ఆటలకు వందల కోట్లు ఖర్చు పెడుతూ, మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె లెక్క రేవంత్ తీరు తయారైంది. గత ప్రభుత్వంలో కేసీఆర్ పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా నదుల నీటి వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణం గురించి వివరిస్తే, రేవంత్ రెడ్డి పీపీటీ ద్వారా ఎవరి ఇల్లు ఎట్లా కూలగొట్టాలి, ఎవరి భూములు ఎట్లా లాక్కోవాలి అనే విధ్వంసం గురించి పీపీటీ ఇచ్చాడు’అని విమర్శించారు. రూ.లక్షన్నర కోట్లు ఎందుకు? నిజాం కట్టించిన అద్భుతమైన జంట జలాశయాలను ఖరాబ్ చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల పాలన ఫలితంగానే మూసీ సర్వనాశనమైందని కేటీఆర్ ధ్వజమెత్తారు. మూసీని మురికి కుప్పగా మార్చిన పాపానికి రేవంత్‌రెడ్డి ముక్కు నేలకి రాసి, ప్రజలకు క్షమాపణ చెప్పి పాపాన్ని కడుక్కోవాలని హితవు పలికారు. వందల కిలోమీటర్ల నమామి గంగే పథకానికి కేవలం రూ.42 వేల కోట్లు వ్యయమైతే, 55 కి.మీ. మూసీకి రూ.లక్షన్నర కోట్లు ఎందుకు ఖర్చవుతుందో రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రాన్ని, ఈ నగరాన్ని ప్రేమించే పార్టీగా, వ్యక్తులుగా మూసీ అభివృద్ధిని ఏమాత్రం అడ్డుకోబోమన్నారు. మూసీ పేరుతో రూ.వేల కోట్ల సొమ్మును దోచుకుంటామంటే మాత్రం కచ్చితంగా అడ్డుకుంటామని చెప్పారు. గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ ఆయన పేరుతో మూసీలో దోపిడీ చేయొద్దని విజ్ఞప్తి చేసినా రేవంత్‌రెడ్డి పట్టించుకోవడం లేదని కేటీఆర్ అన్నారు. ఎవరూ అడ్డుకోవద్దని మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెట్టే కుట్ర చేస్తున్నాడని చెప్పారు. ఒక్క ఇల్లు కూలగొట్టకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం 6 కి.మీ. మూసీని విజయవంతంగా అభివృద్ధి చేసిందని, అయినా కాంగ్రెస్ మాదిరి ప్రచారం చేసుకోలేకపోయామన్నారు.మా అంచనా వ్యయం 16 వేల కోట్లు గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూసీలోకి మంచినీళ్లను వదలాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని కేటీఆర్ తెలిపారు. దాని కోసం కేవలం రూ.1100 కోట్లతో కొండపోచమ్మ నుంచి నీళ్లు తెచ్చే అవకాశం ఉందన్నారు. కానీ ఇదే కార్యక్రమానికి రూ. 10 వేల కోట్లకు అంచనాలు పెంచిన రేవంత్ రెడ్డి కొత్త ప్లాన్ ద్వారా అవినీతి కోసం ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. మూసీని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి తమకు వచ్చిన అంచనా వ్యయం రూ. 16 వేల కోట్లు మాత్రమే కాగా, రేవంత్ రెడ్డి మాత్రం ఇవన్నీ పక్కన పెట్టి రూ.లక్షల కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రయతి్నస్తున్నారన్నారు. బఫర్ జోన్‌తో భయపెట్టి.. ప్రభుత్వం బఫర్ జోన్ పేరు చెప్పి ప్రజలను భయపెట్టి వారి ఇళ్లను కూలుస్తోందని కేటీఆర్ విమర్శించారు. ‘డబ్బులు ఉన్న వాళ్లకే బఫర్ జోన్లు ఉంటాయా? రేవంత్ రెడ్డి సొంత ఇల్లు రెడ్డికుంట బఫర్ జోన్లో ఉంది కదా., దాని గురించి ఎందుకు మాట్లాడరు? వాళ్ల సోదరుడి ఇల్లు హైదరాబాద్‌లో బఫర్ జోన్లో ఉంది. మంత్రుల ఫామ్‌హౌస్‌లు, ఇళ్లు బఫర్ జోన్లో ఉన్నా.. వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు’అని పేర్కొన్నారు. 20 ఏళ్ల కింద కట్టుకున్న అపార్ట్మెంట్లు, ఇళ్లను కూలగొడతా అంటున్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు మూసీ బఫర్ జో¯న్లో కడుతున్న రియల్ ఎస్టేట్ సంస్థల అపార్ట్మెంట్లను మాత్రం ముట్టుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు.3,300 ఎకరాలపై కన్నేసి.. రేవంత్ 3,300 ఎకరాల భూమిపై కన్నేసి మూసీ ప్రణాళికను తెరపైకి తెచ్చాడని కేటీఆర్ ఆరోపించారు. ఈ మొత్తం భూముల విలువ రూ.1,50,000 కోట్లని, ఇందుకోసమే రియల్ ఎస్టేట్ వ్యాపార ఆధారిత మూసీని రూపొందిస్తున్నారన్నారు. డిజైన్ చేసే కంపెనీకే రూ.160 కోట్లు ఇచ్చారంటే, ఎంత అవినీతి జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇవ్వాల్సిన పరిహారం ఎంత ఉందో కూడా అవగాహన లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానందగౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, స్వామి గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. -
బీఆర్ఎస్లోకి జీవన్‌రెడ్డి..?
జగిత్యాల: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల అనంతరం పార్టీ అధిష్టానం పట్ల తీవ్ర అసంతృప్తిలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి.. బీఆర్ఎస్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి.. కారు ఎక్కేందుకు జీవన్‌రెడ్డి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20లోపే కాంగ్రెస్ రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఉగాది పండుగ లోపే కొత్త నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే కార్యకర్తలతో జీవన్‌రెడ్డి మాట్లాడారని, ఈ క్రమంలోనే ఆయన అనుచరుల సోషల్ మీడియా డీపీలు కూడా మారిపోవడంతో రాజీనామా వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. అదే సమయంలో జీవన్‌రెడ్డి సోషల్ మీడియా గ్రూపుల డీపీలు, ప్రొఫైల్స్ కూడా మారిపోతున్నాయి. తాను కాంగ్రెస్‌లో సీనియర్‌గా ఉండి కూడా ఆ పార్టీలో ప్రాధాన్యత లేకపోవడాన్ని జీవన్‌రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి కాంగ్రెస్ అధిక ప్రాధాన్యత ఇచ్చి.. ఆయన్ను పెద్దగా పట్టించుకోకపోవడంతో జీవన్‌రెడ్డి వేరే స్టెప్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ప్రధానంగా జగిత్యాలలో కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్ గెలుపుపై విచారం వ్యక్తం చేశారు. ఛైర్మన్ స్థానం దక్కినందుకు సంతోష పడలా లేక బాధ పడాలా అర్థం కావడం లేదన్నారు. సమిండ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఎమ్మెల్యే సంజయ్ ని కలిసిన కొద్ది రోజుల్లోనే ఛైర్పర్సన్ పదవిలో కూర్చోవడమేంటని విచారం వ్యక్తం చేశారు కూడా. ఇదే జీవన్‌రెడ్డిలో అసంతృప్తి జ్వాలలు పుట్టడానికి ప్రధాన కారణమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో కార్యకర్తలతో సుదీర్ఘ మంతనాల తర్వాతే జీవన్‌రెడ్డి పార్టీ మారే యోచనకు వచ్చారనే చర్చ నడుస్తోంది. జగిత్యాలలో భారీ సభ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ కండువా కప్పుకోవడానికి ఇప్పటికే జీవన్‌రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నారట. ఈ విషయంపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
‘చంద్రబాబు సర్కార్ అప్పుల్లో రికార్డులు సృష్టిస్తోంది’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: సుదీర్ఘ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు.. ఆ అనుభవాన్ని రాష్ట్ర శ్రేయస్సు కోసం ఉపయోగించడం లేదంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు తన అనుభవాన్ని ఊరారా తప్పుడు ప్రచారాన్ని చేయడానికే వినియోగిస్తున్నారంటూ దుయ్యబట్టారు.‘‘దేశంలో నాకంటే సీనియర్ లేడని చెప్పుకునే చంద్రబాబు.. అబద్ధాలపైనే బతకాల్సిన పరిస్థితి. ఇతరుల వ్యక్తిత్వాన్ని హననం చేసి ఓటుగా మార్చుకోవాలని చంద్రబాబు చూస్తాడు. అందుకే ఇన్నాళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా చెప్పుకోడానికి ఏమీ లేని పరిస్థితి. ఆధారాలు లేకుండా తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు అన్నాడు. వైఎస్సార్సీపీని మిగిలిన వారికి దూరం చేయాలని దుష్ప్రచారానికి దిగాడు. సుప్రీం కోర్టు చెప్పినా ఇంకా అదే దుష్ప్రచారాన్ని చేస్తూనే ఉన్నాడు...చివరికి మండలి చైర్మన్ కులాన్ని ప్రశ్నించే స్థాయికి మీ పార్టీ దిగజారింది. లడ్డూ విషయంలో చంద్రబాబు ప్రపంచ వ్యాప్తంగా పరువు పోగొట్టుకున్నాడు. మా నాయకుడు వైఎస్ వివేకా అంశంలోనే ఇదే తరహా రాజకీయం చేశాడు. ఆ కుటుంబంలో చిచ్చు పెట్టడం కోసం కుటిల రాజకీయం చేశాడు. పాశవికంగా చంపిన వారీని దగ్గర పెట్టుకుని విషప్రచారం చేశాడు. నేడు సుప్రీం కోర్టులో వాస్తవలేంటి అనేది అందరికీ తెలిసిపోయింది. చంపిన వారు చంద్రబాబు ప్రభుత్వంలో సెటిల్మెంట్లు చేసుకుంటున్నాడు..ఆనాడు 14 లక్షల కోట్ల అప్పు అన్న వ్యక్తి.. ఇప్పుడు 3 లక్షల కోట్లు మాత్రమే అంటున్నాడు. నేడు రెండేళ్లలోనే మా ఐదేళ్లలో చేసిన అప్పులు చేశాడు. ఎవరు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది ఎవరో ప్రజలు గమనించాలి. అన్ని అంశాల్లో మోసంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. నిరుద్యోగ భృతి నుంచి సూపర్ సిక్స్ గురించే కేటాయింపులు లేవు. చివరికి కేబినెట్‌పై కూడా పట్టు కోల్పోతున్నారు. పవన్ కళ్యాణ్ నిన్నటి కేబినెట్ మీటింగ్‌కు రాలేదు. పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ ధరలు పెంచుకునే బిజీలో ఉన్నాడు. రాష్ట్రంలో రైతులు నానా తంటాలు పడుతుంటే వీళ్లు సినిమా ప్రమోషన్లో ఉన్నారు..గత ఏడాది రైతులు అన్ని విధాల మోసం పోయారు. మళ్ళీ ఈ ఏడాది కూడా అదే తీరు. అన్నీ నేనే చేశాను అంటాడు. ఒక్క ప్రాజెక్ట్ డిజైన్ అయినా నువ్వు చేసావా బాబు..?. నేడు రాయలసీమ లిఫ్ట్ ఫణంగా పెట్టిన నువ్వు రాయలసీమను ఉద్ధరిస్తావా?. ఇన్ని రకాలుగా మా కడుపు కొడుతున్న నీకు దేవుడు కచ్చితంగా మొట్టికాయలు వేస్తాడు. నేడు పాలల్లో, నెయ్యిలో ఎక్కడ చూసినా అన్నిటా కల్తీ. ఇందాపూర్ ద్వారా హెరిటేజ్ నెయ్యి సప్లై చేసి కోట్లు కొల్లగొట్టవ్. హెరిటేజ్‌కి ఎన్ని రాయితీలు తీసుకున్నావో ప్రజలు గమనిస్తున్నారు. అప్పుడు, ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు. వివేకా కేసులో విచారించి వాస్తవాలెంటో తేల్చండి. ఎవరు తప్పు చేసినా మీరే చర్యలు తీసుకోండి’’ అంటూ శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. -
నీకు నచ్చింది చేసుకో.. మేమూ చూసుకుంటాం..!
రాజమహేంద్రవరం సిటీ: మీ స్కామ్‌లు, దందాల వ్యవహారాన్ని ప్రెస్‌మీట్ పెట్టి చెబుతానన్న ఒక వ్యక్తితో ‘నీకు నచ్చింది చేసుకో.. మేమూ చూసుకుంటాం’ అంటూ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తండ్రి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఫోన్‌చేసి మరీ బెదిరించిన ఆడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఆడియోలో అప్పారావు అటువైపు వ్యక్తిని దుర్భాషలాడడంతో పాటు బెదిరింపులకు పాల్పడటం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆడియో ప్రకారం.. ఎమ్మెల్యేగా గెలిపించిన తమకు శ్రీనివాస్ ఏమీ చేయలేదని, ఆయన చేయలేని పనులు తాము చేస్తున్నామని అవతలి వ్యక్తి చెబుతుండగా అప్పారావు ఎదురుదాడికి దిగి తిట్టడానికి యత్నించారు. దీంతో ‘తాను లీగల్‌గా చర్యలు చేపడతా’ అని ఆ వ్యక్తి అప్పారావుకు సమాధానమిచ్చారు. కొద్దిసేపు వాగ్వాదం సాగిన అనంతరం.. ఆ వ్యక్తి ‘మీ అబ్బాయిని ఎంచుకుని తప్పు చేశాం. ప్రెస్‌మీట్ పెట్టి మీ స్కామ్‌లు, దందాలు బయటపెడతా’ అని చెప్పాడు. దీనికి అప్పారావు బదులిస్తూ ‘నీకు నచ్చిన పని చేసుకో.. మేమూ చూసుకుంటాం’ అని పేర్కొన్నారు. కాగా, వివాదం ఏమిటి? బెదిరింపులకు గురైన వ్యక్తి ఎవరన్నది తెలియాల్సి ఉంది. -
పోలీసుల ఓవరాక్షన్.. పేర్ని నాని ఇంటి వద్ద ఆంక్షలు
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కోసం పేర్ని నాని ఇంటి వద్ద ఆంక్షలు విధించారు. పేర్ని నాని ఇంటికి ఎవరినీ రాకుండా పోలీసులు మోహరించారు. పేర్ని నాని ఇంట్లో పనివారిని కూడా రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పేర్ని నాని ఇంటి వద్దే కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయం ఉండగా.. పార్టీ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని కూడా పోలీసులు వెళ్లనివ్వలేదు.పేర్ని నాని ఇంటికి వెళ్లే మార్గాన్ని బారికేడ్లతో పోలీసులు మూసేశారు. వైఎస్సార్సీపీ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్‌ను పోలీసులు తోసేశారు. పోలీసుల తీరుపై పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్షన్ 30 అమలులో ఉందంటూ పోలీసులు వింత సమాధానం ఇచ్చారు. జనసేన కార్యక్రమానికి వర్తించని సెక్షన్ 30.. తమకు ఎలా వర్తిస్తుందని పోలీసులను పేర్ని నాని నిలదీశారు. సెక్షన్ 30 ఆర్డర్ చూపించమంటూ పేర్ని నాని ప్రశ్నించారు. -
బెంగాల్ ఎన్నికలు: షాకిస్తున్న లేటెస్ట్ సర్వే రిపోర్ట్!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న తరుణంలో బెంగాల్ ప్రజల మనోగతం ఎలా ఉందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా వెలువడిన ‘ఓట్ వైబ్’ (Vote Vibe) సర్వే ఫలితాలు ఎంతో ఆసక్తి కలిగిస్తున్నాయి. ముఖ్యమంత్రి పీఠంపై మమతా బెనర్జీ పట్టు ఏ మేరకు ఉన్నదనేది ఈ సర్వే తేల్చిచెప్పింది.దీదీకే జై కొడుతున్న జనం!తాజా సర్వే వివరాల ప్రకారం బెంగాల్ ముఖ్యమంత్రిగా 42 శాతం మంది మమతా బెనర్జీ వైపే మొగ్గు చూపారు. ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారికి కేవలం 19 శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. ఐప్యాక్ (ఐ-పాక్)సంస్థపై ఈడీ దాడులు జరిగినప్పటికీ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పర్సెప్షన్ యుద్ధంలో గెలిచిందని, ముఖ్యంగా ముస్లిం ఓటర్ల మద్దతును పదిలపరుచుకుందని సర్వే పేర్కొంది.ప్రభుత్వ పనితీరుపై మిశ్రమ స్పందనమమత ప్రభుత్వ పనితీరుపై జనం భిన్నంగా స్పందిస్తున్నారు. సుమారు 34 శాతం మంది ‘అద్భుతం’ అని కితాబివ్వగా, 18 శాతం మంది మాత్రం ‘చాలా దారుణం’ అంటూ పెదవి విరిచారు. సర్వేలో అధికార పార్టీకి కొన్ని హెచ్చరికలు కూడా వెలువడ్డాయి. దాదాపు 36 శాతం మంది ఓటర్లు నిరుద్యోగాన్ని ప్రధాన సమస్యగా భావిస్తున్నారు. మరోవైపు టీఎంసీ.. అక్రమ వలసలను ప్రోత్సహిస్తోందన్న బీజేపీ ప్రచారాన్ని 47 శాతం మంది నమ్ముతుండటం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ, యువ ఓటర్లు టీఎంసీకి దూరమయ్యే అవకాశం ఉందని సర్వే హెచ్చరించింది.ఎన్నికల నగారాకు అంతా సిద్ధంవచ్చే వారం రోజుల్లో పశ్చిమ బెంగాల్‌తో పాటు కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్ ఇప్పటికే 294 నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను నియమించింది. ప్రధాని మోదీ అస్సాం పర్యటన ముగిసిన వెంటనే ఎన్నికల తేదీలు ప్రకటించే అవకాశం ఉన్నదని సమాచారం. 2021లో భారీ మెజారిటీతో గెలిచిన దీదీ, ఈసారి నాలుగోసారి అధికారాన్ని దక్కించుకుంటారా? లేక బెంగాల్ కోటను బీజేపీ బద్దలు కొడుతుందా? అనేది వేచి చూడాలి.ఇది కూడా చదవండి: శబరిమల వివాదం.. కేరళ సర్కార్ ‘యూ టర్న్’ -
‘చంద్రబాబు.. ఇరాన్లో మాత్రమే ఆ పదవి ఖాళీ ఉంది’
విస్సన్నపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ ధ్వజమెత్తారు. తాను జైలు నుంచి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడనని చంద్రబాబు అనుకున్నారని, నిక్కర్లు వేసుకున్నప్పటి నుండి తాను రాజకీయం చేస్తున్నానని, ఇటువంటి బెదిరింపులకు భయపడనని జోగి రమేష్ స్పష్టం చేశారు. తాను జైలు నుంచి వచ్చిన తర్వాత తగ్గుతా అనుకున్నావా.. వైఎస్సార్సీపీ జెండాను భుజం దింపుతా అనుకున్నావా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్న పేటలో మీడియాతో మాట్లాడారు జోగి రమేష్. ‘ తిరువూరు గడ్డ అంటే వైఎస్సార్సీపీ అడ్డా. గ్రామాల్లో ఏ ఊరికి వెళ్ళినా కూడా చంద్రబాబు ఎప్పుడు దిగిపోతాడు.. జగనన్న ఎప్పుడు సీఎం అవుతాడు అంటున్నారు. నేను చంద్రబాబును ఒక మాటే కదే అన్నాను. కల్తీ లిక్కర్ నారా వారి సారా ఏరులై పారుతుంది అనే కదా అన్నాను. ఒక్క మాటకే 83 రోజులు జైలుకు పంపించావు. చంద్రబాబు విద్య,వైద్యాన్ని పడకెత్తించాడు. సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అంటూ మోసగించావు. లోకేష్ ఏమన్నాను చిప్ దొబ్బిందా అన్నాను అంతేగా. దానికై ఇంటిపై యాసిడ్ బాంబులతో దాడులు చేశారు. కల్తీ నెయ్యి గురించి నానా యాగీ చేస్తున్నారే. సుప్రీంకోర్టు సైతం చెంప చెల్లుమనిపించింది’ అని మండిపడ్డారు.ఇరాన్లో మాత్రమే ఖాళీ ఉంది..చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలా. చంద్రబాబు ప్రధానమంత్రి అవకాశం వస్తేనే వదిలేసుకున్నాడట. ఉపప్రధాని పదవి చాలా చీప్ అట.. మోదీ స్థాయి అయితేనే కావాలట. మోదీ స్థాయి పదవి కావాలంటే చంద్రబాబుకు ఇరాన్లో మాత్రమే ఖాళీ ఉంది’ అని ఎద్దేవా చేశారు. -
మీ రూ.3.27 లక్షల కోట్ల అప్పులకు లెక్కలివిగో: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: ఇరవై నెలల కూటమి పాలనలో కేవలం రూ.1.05 లక్షల కోట్ల అప్పులే చేశామని, ఏనాడూ నెట్ బారోయింగ్ సీలింగ్ (ఎన్బీసీ) అధిగమించలేదని చెబుతున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి ఇవే మాటలను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శితో రాయించి అధికారికంగా ప్రకాటన విడుదల చేసే దమ్ముందా అంటూ కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని పేర్ని వెంకట్రామయ్య (నాని) సవాల్ చేశారు.తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చాక రూ.3.27 లక్షల కోట్ల అప్పులు చేసినట్టు పేర్ని నాని కాగ్ లెక్కలతో వివరించారు. ఎన్బీసీ దాటి అప్పులు చేయలేదని పయ్యావుల పచ్చి అబద్దం చెప్పాడని కాగ్ వెబ్సైట్ సాక్షిగా ఆయన నిరూపించారు. మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పినట్టు కూటమి అప్పులు రూ. 1.05 లక్షల కోట్లని వారం రోజుల్లో నిరూపించలేకపోతే అబద్ధాల కేశవ్ అని నేమ్ బోర్డు మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అప్పులపై అసెంబ్లీ, మండలిలో తప్పుడు సమాచారం ఇచ్చిన సంబంధిత అధికారులపై డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ), మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ మంత్రి అయిన ప్రధానికి ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. చంద్రగిరిలో ఉన్న చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ యూనిట్లో మెషినరీ అప్‌గ్రడేషన్ కోసం ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై ఆయన మండిపడ్డారు. దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఏం ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..అప్పుల మంత్రి, అబద్ధాల కేశవ్రాష్ట్ర అప్పులపై పచ్చి అబద్ధాలతో వైఎస్ జగన్ మీద మరోసారి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తప్పుడు ప్రచారానికి పూనుకున్నాడు. పేరుకి ఆర్థికశాఖ మంత్రేకానీ నోటి మాటలతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడే ఆయన, తాను చేసిన ఆరోపణలు ఏ ఒక్కదానికీ ఆధారాలు చూపించే ధైర్యం చేయలేదు. ఈ అబద్ధాల అప్పుల మంత్రి ఏ ఒక్కరోజూ డాక్యుమెంట్ ఎవిడెన్స్‌తో మాట్లాడలేదు. వైఎస్ జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందనడానికి ఆయన దగ్గరున్న ఆధారాలుంటే చూపించాలి కదా. వైఎస్ జగన్ ప్రెస్మీట్లో చెప్పినవన్నీ అబద్ధాలని తేల్చేసిన పయ్యావుల.. ఏయే అంశాలు అబద్ధాలు చెప్పారు, వాటికి సంబంధించి నిజమైన ఆధారాలు దగ్గరుంటే బయటపెట్టాలి.మీ రూ.3.27 లక్షల కోట్ల అప్పులకు లెక్కలివిగో20 నెలల పాలనలో మా ప్రభుత్వం చేసింది కేవలం రూ.1.05 లక్షల కోట్ల అప్పేనని, కానీ వైయస్ జగన్ గారు రూ. 3.20 లక్షల కోట్ల అప్పులు చేసినట్టు చెప్పారని పయ్యావుల చెబుతున్నాడు. కానీ కరెక్టుగా చెప్పాలంటే ఆ అప్పు రూ. 3,27,370.37 కోట్లు. (రూ. 3.27 లక్షల కోట్లు). కాగ్ లెక్కల ప్రకారం 2024-25లో బడ్జెట్ బారోయింగ్స్ రూ.81,082.51 కోట్లని వెబ్సైట్లో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ దానికి పయ్యావుల మాత్రం రూ.69 వేల కోట్లేనని పచ్చి అబద్ధం చెబుతున్నాడు. ఏప్రిల్ 1, 2025 నుంచి 2026 జనవరి 31నాటికి బడ్జెట్ బారోయింగ్స్ రూ. 87,674.04 కోట్లని కాగ్ వెబ్సైట్ చెబుతోంది.అంటే, ప్రత్యక్షంగా ప్రభుత్వం నుంచి తీసుకున్న అప్పులు రూ. 1.70 లక్షల కోట్లు. ప్రభుత్వ గ్యారెంటీ ఇచ్చి వివిధ కార్పోరేషన్ల ద్వారా తీసుకొచ్చిన అప్పులు మరో రూ. 89,026.82 కోట్లు. ఇవేకాకుండా ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ బాండ్ల ద్వారా రూ.11,850 కోట్లు. ఫిబ్రవరి 2026, మార్చిలో ఎస్డీఎల్ బాండ్స్ ద్వారా రూ. 9,900 కోట్లు అప్పులు తెచ్చారు. మొత్తం 20 నెలల్లో కూటమి ప్రభుత్వం తెచ్చిన అప్పు రూ.3,27,370.37 కోట్లు. ఇవన్నీ రాష్ట్ర ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు.అప్పులు రూ.1.05 లక్షల కోట్లేనని లేఖ ఇప్పించు..వైయస్సార్సీపీ ప్రభుత్వం రూ.9.74 లక్షల కోట్ల అప్పులను వారసత్వంగా ఇచ్చిందని చెబుతున్న పయ్యావుల కేశవ్.. ఇదే మాటను రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శితో రాయించి స్టేట్మెంట్ రిలీజ్ చేసే దమ్ముందా? మంత్రి మాట్లాడింది అబద్ధం కాదని, రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు కేవలం రూ. 1.05 లక్షల కోట్లేనని వారం రోజుల్లో రాయించి ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇవ్వగలరా? ఇవ్వలేకపోతే పయ్యావుల కేశవ్ ఛాంబర్ బయట అబద్దాల కేశవ్ అని పేరు మార్చుకోవాలని ఛాలెంజ్ విసురుతున్నా.నెట్ బారోయింగ్ ఎక్కడా మా ప్రభుత్వం అధిగమించలేదని పయ్యావుల మరో అబద్ధం చెప్పాడు. రాష్ట్ర జీఎస్డీపీ మీద 3 శాతం నెట్ బారోయింగ్ దాటి అప్పులు చేసినట్టు కాగ్ వెబ్సైట్లో చెప్పింది. ఏపీ ప్రభుత్వం 2024 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు ఎక్కడా నెట్ బారోయింగ్ అధిగమించలేదని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శితో ప్రభుత్వం తరఫున స్టేట్మెంట్ ఇప్పించే ధైర్యం పయ్యావులకు ఉందా? అసెంబ్లీ, కౌన్సిల్లో అప్పులపై తప్పుడు లెక్కలు రాసి ఇచ్చారో ఆ అధికారులందరిపై డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ మంత్రి అయిన ప్రధాని మోడీ గారికి ఫిర్యాదు చేస్తాం.ఎమ్మెల్యే బాధితురాలికి నేరం జరిగిందా?నిందితులను బాధితులుగా చేర్చడమే వైయస్ జగన్ పరిపాలన అంటాడు.. కూటమి ప్రభుత్వంలో రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే ఒక మహిళకు మాయమాటలు చెప్పి వివాహం చేసుకుంటానని నమ్మించి వేధించి పలుమార్లు అబార్షన్లు చేయిస్తే.. ఆమెకు మీ ప్రభుత్వం ఏం న్యాయం చేసిందో చెప్పాలి. మహిళలకు అన్యాయం చేసిన వాడికి అదే ఆఖరి రోజు అని పదే పదే చెప్పుకుని తిరిగే సీఎం చంద్రబాబు.. ఆ బాధిత మహిళకు ఏం న్యాయం చేశాడు? మీ ముఖ్యమంత్రి, మీ ఉప ముఖ్యమంత్రి, మీ మంత్రి లోకేష్‌లను కలిసి మొర పెట్టుకుంటే ఆమె జరిగిన న్యాయం ఏంటి? ఆ కూటమి ఎమ్మెల్యేని శిక్షించకపోగా తిరిగి ఆమె మీదనే కేసులు పెట్టి వేధించింది మీరు కాదా? ఆ కేసులను చూసి హైకోర్టు చీవాట్లు పెట్టలేదా? బాధితులను వేధించింది మీరు కాదా?హెరిటేజ్ మెషినరీ అప్‌గ్రేడ్ కోసం రూ.200 కోట్లు హెరిటేజ్ వ్యాపారం తన కుటుంబ సభ్యులు జీవనోపాధి కోసం చేస్తున్నారని, వారు ఏనాడూ ప్రభుత్వ టెండర్లలో పాల్గొనలేదని చంద్రబాబు అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పాడు. ఎప్పుడెప్పుడు టెండర్లలో పాల్గొన్నారు. నెయ్యితో పాటు టెండర్లలో ఏవేవీ సప్లై చేశారు? ఎల్ -3 గా ఎప్పుడు వచ్చారు. 2 వేల కేజీల పాల పొడిని ఏ రేటుకు సప్లై చేశారు వంటి అన్ని వివరాలు ఆయన మాట్లాడిన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన అబద్ధం చెప్పాడని ప్రజలే తేల్చేశారు. అవేకాదు.. టీటీడీ సొమ్ము దోచుకోవడానికి హెరిటేజ్ డెయిరీ సిండికేట్ చేసిన దారుణాలు కూడా అన్ని వెలుగులోకి వచ్చాయి. ఇదంతా దేవుడి మహిమ. చంద్రబాబు పాపాలను దేవుడే దగ్గరుండి బయటపెట్టిస్తున్నాడు.ఇది కాకుండా ఈరోజు కేబినెట్లో చంద్రగిరి ప్రాంతంలో ఉన్న హెరిటేజ్ డెయిరీలో రూ. 200 కోట్లతో మిషనరీ అప్‌గ్రేడ్ కోసం ఇండస్ట్రియల్ పాలసీలో ఇచ్చే రాయితీలు కాకుండా టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ సిద్ధం చేసి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా కొత్తగా 35 మందికి ఉద్యోగాలిస్తారట. నా జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పుకునే చంద్రబాబు కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎందుకు దాచిపెట్టారు? దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం ఏమిటని అడిగితే ఫ్లేవర్డ్ పాలు 131 శాతం అదనంగా ఉత్పత్తి జరుగుతుందని చెబుతున్నారు. పన్నీరు 400 శాతం అదనంగా వస్తుందట. వాటి వల్ల ప్రయోజనం ప్రజలకా? లేక హెరిటేజ్‌కా? పైగా ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 పేరుతో హెరిటేజ్‌కి భారీ రాయితీలు ప్రకటించారు. కరెంట్ యూనిట్‌కి రూపాయి తగ్గింపు. ఐదేళ్లపాటు 100 శాతం జీఎస్టీ రీయింబర్స్మెంట్ ఇచ్చారు.బీఆర్ నాయుడితో రాజీనామా చేయించలేరా?టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడి అశ్లీల వీడియో బయటకొచ్చినా ఆయనతో ఇప్పటివరకు రాజీనామా చేయించని చంద్రబాబుకి దేవుడంటే భయం, భక్తి ఉందని ఎలా అనుకోవాలి? వీడియో బయటకొచ్చిన తర్వాతైనా పశ్చాత్తాపం చెందకుండా అంతలా బరితెగించి మాట్లాడుతున్న బీఆర్ నాయుడిని వెనకేసుకు రావడం సిగ్గుచేటు. టీటీడీ చైర్మన్‌కి ఉన్న పాత బాగోతాలను ఆపాదించవచ్చా అని ప్రశ్నిస్తున్న ఎల్లో మీడియాకి నా సూటి ప్రశ్న.. అలాంటి బాగోతాలున్న వ్యక్తిని దేవుడి సేవకు వాడటం కరెక్టా? ఇలాంటి బాగోతం గురించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కి తెలిసే టీటీడీ చైర్మన్‌గా నియామకం జరిగిందని బాధితురాలి లేఖల ద్వారా ప్రపంచానికి తెలిసింది. అయినప్పటికీ ఆయన్ను చైర్మన్‌గా నియమించారు. వీడియోలు బయటకొచ్చినప్పుడైనా నిఆయనతో రాజీనామా చేయించి టీటీడీ ప్రతిష్ట కాపాడాలని అనిపించలేదా? లోకేష్ పాపానికి హెడ్ మాస్టర్ బలి రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగోలేదని రోజూ పేపర్ల నిండా వార్తలు, సోషల్ మీడియా నిండా వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. కానీ ఏనాడూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించలేదు. రెండేళ్లుగా ఈ సమస్య ఉన్నా నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడానికి ఆయన ఏనాడూ ప్రయత్నించలేదు. పిల్లల ఆవేదన ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. దేశాలు దాటి క్రికెట్ మ్యాచ్‌లు చూడటంపైన ఆయనకున్న శ్రద్ధ పిల్లలకు మంచి భోజనం పెట్టడం పైన లేదు.మధ్యాహ్న భోజనం బాగోలేదని మైలవరం తారకరామ నగర్ పాఠశాల హెచ్ఎం డ్రామా చేశాడని ఆంధ్రజ్యోతిలో వార్త రాస్తే, హెచ్ఎం బాధ్యత లేకుండా ప్రవర్తించాడన్న కారణంతో డీఈవో ఆయన్ను సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. కానీ వాస్తవానికి వంట బాగోలేదని ఎన్నోసార్లు విద్యార్థులు పోరు పెడుతున్నట్టు హెచ్ఎం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. ఎంక్వయిరీకి వెళ్లిన అధికారుల ముందు అన్నం బాగుండటం లేదని విద్యార్థులు ఏడుస్తూ చెప్పిన మాటలను కూడా ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు? సోషల్ మీడియా దెబ్బకి నారా లోకేష్ వైఫల్యం గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగడంతో హెడ్ మాస్టర్‌ను బలి తీసుకున్నారు. ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉంటుందా? విద్యాశాఖను నిర్వహించడం చేతకానప్పుడు ఏశాఖా లేని మంత్రి పదవి తీసుకుని లోకేష్ బయట తిరుగుతూ ఎంజాయ్ చేసినా విద్యార్థులకు మేలు చేసిన వాడవుతాడని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. -
మచిలీపట్నంలో మరోమారు ఉధ్రిక్తత
మచిలీపట్నం: కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో మరోమారు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పదే పదే రాజకీయ విద్వేషాలతో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు జనసేన నేతలు. గత రాత్రి మాజీమంత్రి పేర్ని నాని ఇంటి సమీపం రామానాయుడుపేట సెంటర్లో జనసేన జెండా ఏర్పాటుకు జనసేన నాయకుల యత్నించారు. అయితే వారిని వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. అయితే ఈరోజు(శుక్రవారం, మార్చి 13వ తేదీ) మళ్లీ కాంక్రీట్‌తో జనసేన పార్టీ జెండా దిమ్మ ఏర్పాటు చేశారు జనసేన కార్యకర్తలు. ఈ క్రమంలోనే జనసేన కార్యకర్తలను అడ్డుకోబోయిన వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ నేత బొర్రా విఠల్‌ను బలవంతంగా పోలీస్ వాహనం ఎక్కించారు. ఇలా ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన జనసేన కార్యకర్తలకు పోలీసులు సహకరించారు. పోలీసుల వైఖరిపై వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘ఏపీ రైతుల మోయలేని రుణభారానికి చంద్రబాబే కారణం’
కాకినాడ: ఏపీలోని రైతులు రుణభారాన్ని మోయలేని స్థితిలోకి రావడానికి చంద్రబాబు సర్కారే కారణమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ఏపీలో రైతులపై అత్యధిక రుణభారం ఉందనే విషయాన్ని ఇటీవల కేంద్ర మంత్రి పార్లమెంట్ వేదికగా వెల్లడించారని కురసాల ఈ సందర్భంగా గుర్తుచేశారు. మీ నిర్లక్ష్యం కారణంగా... రుణాభారంలో ఏపీ రైతులు రెండవ స్ధానంలో ఉన్నారు. 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సగటున నలుగురు రైతు కూలీలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మీరు ఇస్తానన్న అన్నదాత సుఖీభవ... వైఎస్ జగన్ అమలు చేసిన రైతు భరోసకు కాపీ.మొదటి ఏడాది అన్నదాత సుఖీభవకు మంగళం పాడేశారు. రెండవ ఏడాది రూ.10 వేలు ఇచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయంలో 53 లక్షల 58 వేల మందికి ఏటా పెట్టుబడి సాయం అందించారు. మీ హయంలో ఏడు లక్షల మంది రైతులు తగ్గిపోయారు. పథకమే పూర్తిగా అమలు చేయ్యకుండా ఏడు లక్షలమందికి కోత విధించారు. గడిచిన రెండేళ్ళల్లో కౌలు రైతుకు ఒక్క సహయం అందించలేదు. కౌలు రైతుల పట్ల ఎందుకు అంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. కూటమి పాలన లో ఇప్పటి వరకు 16 సార్ల ప్రకృతి విపత్తు వచ్చాయి. ఏ రైతుకు సాయం అందించారో చెప్పండి. వందల కోట్లు ప్రీయమం కట్టడానికి డబ్బులు లేకపోతే ...రెండేళ్ళ కాలంలో చేసిన రూ.3 లక్షల కోట్ల అప్పులు ఏమైయ్యాయి. ఆత్మహత్య చేసుకున్న రైతులకు సహయం చేయడ్యానికి బడ్జెట్ లో ఇది పెట్టామని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు.*కోవిడ్‌లో కూడా పంటలకు మార్కెట్ స్ధిరికరణ చేసి..చివరకు మేము బూడిద గుమ్మడి కాయాలు కూడా కొనుగోలు చేశాం. ఏ సీజన్ లో పంట నష్టపోతే ... ఆ సీజన్ లోనే వైఎస్ జగన్ నష్టపరిహారం అందించారు.ఇవాళ వ్యవసాయ ఉత్పత్తులను కొనే పరిస్ధితిలో ప్రభుత్వం లేదు. అరటిని ఇప్పుడు టన్ను రూ.ఐదు వేలకు అమ్ముకునే దుస్ధితికి రైతు వచ్చాడు. టమాటకు గిట్టుబాటు ధర లేక రోడ్ల మీద పాడేసుకుంటున్నాడు. ఇది రైతుల పట్ల మీ నిర్లక్ష్యం కాదా? చంద్రబాబు’ అని ప్రశ్నించారు కురసాల కన్నబాబు. -
అలిగిన పిఠాపురం వర్మ.. అధికారులపై ఆగ్రహం
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం మున్సిపల్ అధికారులపై టీడీపీ నేత వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ కార్మికుల శిక్షణ కార్యక్రమం మధ్యలో నుంచి వర్మ అలిగి వెళ్లిపోయారు. ఫ్లెక్సీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పెద్దదిగా.. సీఎం చంద్రబాబు ఫోటో చిన్నదిగా వేశారంటూ వర్మ రగిలిపోయారు. చంద్రబాబుకు గౌరవం లేనప్పుడు ఇక్కడ ఉండమంటూ వర్మ అసహనం వ్యక్తం చేశారు. వర్మ అసహనంతో జనసేన నేతలు మౌనంగా ఉండిపోయారు.పిఠాపురంలో జనసేన, టీడీపీ మధ్య రాజకీయం రచ్చ రచ్చగా మారుతోంది. కాగా, గత ఏడాది.. వర్మ సంచలన ట్వీట్ కలకలం రేపిన సంగతి తెలిసిందే.. ‘కష్టపడి సాధించే విజయానికి గౌరవం’ అంటూ తన ఎక్స్ హ్యాండిల్లో విడుదల చేసిన వీడియో దుమారం రేపింది. పవన్ కల్యాణ్ గెలుపు కోసం తాను చేసిన ఎన్నికల ప్రచారాలన్నీ కలిపి వీడియోగా రూపొందించి, పోస్టు చేశారు. ఆ వీడియోలో ఎక్కడా పవన్ కల్యాణ్ ఫొటో కూడా లేకపోవడం సంచలనంగా మారింది.ఇదిలా ఉండగా, తన సోషల్ మీడియా అకౌంట్‌ను మూడేళ్లుగా హైదరాబాద్‌కు చెందిన సోషల్ ప్లానెట్ సంస్థ నిర్వహిస్తోందని.. తన ఎక్స్ అకౌంట్లో వచ్చిన వీడియోతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని వర్మ తన అకౌంట్లో పోస్టు పెట్టారు. తన ప్రమేయం లేకుండా సోషల్ ప్లానెట్ సంస్థ తప్పుడు వీడియో పోస్టు చేసిన విషయం తెలుసుకుని, వెంటనే డిలీట్ చేయించానని, తన పర్మిషన్ లేకుండా తప్పుడు వార్తలు పోస్టు చేస్తే తగిన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. అలాగే, పిఠాపురం నియోజకవర్గంలో యథేచ్ఛగా జనసేన నేతలు ఇసుక దందా చేస్తున్నారంటూ గతంలో వర్మ సాక్ష్యాలతో సహా బయటపెట్టిన సంగతి తెలిసిందే. -
రేవంత్ రెడ్డి కాదు.. గోబెల్స్ రెడ్డి : హరీష్
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రేవంత్‌రెడ్డికాదు.. గోబెల్స్ రెడ్డి’ అని దుయ్యబట్టారు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. బీఆర్ఎస్ మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.మూసి సుందరీకరణకు మేం ఎప్పుడూ వ్యతిరేకం కాదు. మూసీ సుందరీకరణ ముసుగులో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. డీపీఆర్ లేకుండానే 10 వేల 17 ఇళ్లు కూలగొట్టేందుకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. హైడ్రా పేరుతో ఇప్పటికే లక్షకు పైగా ఇళ్లు కూల్చారు. లక్ష జీవితాలను మూసీలో ముంచేస్తారా? మూసీని శుద్ధి చేస్తావా?. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా?.రియల్ ఎస్టేట్ దందా కోసమే మూసీ మీద పడ్డారు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు. మూసీ సుందరీకరణ కోసం 3,279 ఎకరాల భూ సేకరణ అవసరమా..!.మూసీ బ్యూటీఫికేషన్ పేరుతో లూటీఫికేషన్ చేస్తున్నారు’అని ఆరోపించారు. -
ద్రవిడ కోటలో టీవీకే గర్జన.. షాకిస్తున్న సర్వే ఫలితాలు
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అంకానికి తెరలేచింది. దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకేల చుట్టూనే తిరుగుతున్న ద్రవిడ పాలిటిక్స్‌లో ఇప్పుడు ‘దళపతి’ విజయ్ రూపంలో ఒక పెను తుపాను ముంచుకొస్తోంది. ప్రముఖ పరిశోధనా సంస్థ ‘పారావీల్’ తాజాగా వెల్లడించిన సర్వే ఫలితాలు రాజకీయ విశ్లేషకులనే కాదు, అధికార, ప్రతిపక్ష పార్టీల గుండెల్లోనూ రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. రాజకీయ అరంగేట్రం చేసిన అతి తక్కువ కాలంలోనే విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) రాష్ట్రంలో మూడో ప్రధాన శక్తిగా అవతరించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.నిర్ణయాత్మక శక్తిగా 13.6 శాతం ఓట్లుపారావీల్ సీఈఓ కిరణ్ కొండేటి విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. విజయ్ పార్టీ ఏకంగా 13.6 శాతం ఓట్ల వాటాను కొల్లగొట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా 234 నియోజకవర్గాల్లో సుమారు 70.2 లక్షల మంది ఓటర్ల నాడిని సంగ్రహించిన ఈ సర్వేలో తమిళనాట ముక్కోణపు పోటీ అనివార్యమని స్పష్టం అయ్యింది. అధికార డీఎంకే 41.5 శాతం, ఏఐఏడీఎంకే 36.2 శాతంతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నప్పటికీ, టీవీకే సాధిస్తున్న ఈ ఓట్ల శాతం షాకిచ్చేలా ఉంది. ఈ సర్వే ప్రకారం రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటును శాసించే ‘కింగ్ మేకర్’ స్థాయికి విజయ్ చేరుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.నవతరం ఓటర్లంతా..ఈ సర్వేలో వెల్లడైన అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. యువత, తొలిసారి ఓటు వేస్తున్న నవతరం ఓటర్లంతా విజయ్ వైపు మొగ్గు చూపుతుండటం విశేషం. కేవలం సినిమా అభిమానులే కాకుండా, సాంప్రదాయ రాజకీయాలపై విరక్తి చెందిన విద్యావంతులు, మార్పును కోరుకుంటున్న యువత టీవీకేను తమ ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారని తేలింది. ముఖ్యంగా చెన్నై లాంటి పట్టణ ప్రాంతాల్లో విజయ్ మేనియా ఏ స్థాయిలో ఉందంటే, కొన్ని సెగ్మెంట్లలో ఏఐఏడీఎంకే వంటి బలమైన పార్టీని వెనక్కి నెట్టి టీవీకే రెండో స్థానానికి దూసుకెళ్లడం ఖాయమని తెలుస్తోంది.పక్కా వ్యూహం.. క్షేత్రస్థాయి విశ్లేషణకేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ సహకారంతో నిర్వహించిన ఈ అధ్యయనంలో కుల సమీకరణలు, ప్రాంతీయ సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేకతను లోతుగా విశ్లేషించారు. దీనిలో దక్షిణాది జిల్లాల నుంచి పశ్చిమ తమిళనాడు వరకు విజయ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని తేలింది. సినిమా గ్లామర్‌ను పొలిటికల్ పవర్‌గా మార్చడంలో టీవీకే కేడర్ సక్సెస్ అవుతోందని ఈ సర్వే చెబుతోంది. ముఖ్యంగా మహిళా ఓటర్ల ప్రాధాన్యతలు మారుతుండటం, స్వింగ్ నియోజకవర్గాల్లో టీవీకే పుంజుకోవడం ప్రధాన పార్టీలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.వార్ రూమ్ టెక్నాలజీతో..ఎన్నికల కురుక్షేత్రంలో విజయ్ సరికొత్త సాంకేతికతను జోడించబోతున్నారు. పారావీల్ సంస్థ పరిచయం చేస్తున్న ‘వన్ క్యాండిడేట్ - వన్ వార్ రూమ్’ కాన్సెప్ట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రతి అభ్యర్థికి క్షేత్రస్థాయి డేటా విశ్లేషణను అందిస్తూ, గెలుపు గుర్రాలను సిద్ధం చేసే ఈ వ్యూహం పాత తరం రాజకీయ నాయకులకు సవాల్ విసురుతోంది. సంప్రదాయ ప్రచార శైలిని పక్కన పెట్టి, డేటా ఆధారిత వ్యూహాలతో విజయ్ అడుగులు వేస్తుండటం ఆయన రాజకీయ పరిణతికి నిదర్శనంగా నిలిచింది.ద్రవిడ గడ్డపై సరికొత్త చరిత్ర?కరుణానిధి, జయలలిత తదితర రాజకీయ దిగ్గజాల నిష్క్రమణ తర్వాత తమిళనాట ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేసే సత్తా విజయ్‌లో ఉందని ఈ సర్వే ఫలితాలు నిరూపిస్తున్నాయి. 13.6 శాతం ఓట్ల వాటా అంటే అది కేవలం సంఖ్య కాదు, తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేయగల ఒక బలమైన శక్తి అని విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా చూస్తే ద్రవిడ కోటలో దళపతి విజయ్ సరికొత్త చరిత్ర లిఖించడం ఖాయంగా కనిపిస్తోంది.ఇది కూడా చదవండి: మార్చి ప్రత్యేకం: విశ్వం మెచ్చిన వింత పూలు -
వైఎస్సార్సీపీ.. 'కోట్లాది మంది అభిమానులది': వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: విలువలతో కూడిన రాజకీయాలు మర్చిపోయి ఉన్న పరిస్థితుల మధ్య.. విలువలు, విశ్వసనీయత అనే పదాలకు అర్థం చెబుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక, ఆ తర్వాత ఎదుగుదల కొనసాగిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తు చేశారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక్క జగన్‌ది మాత్రమే కాదు.. కొన్ని కోట్ల మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులది.. వైఎస్సార్‌ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న నా కుటుంబ సభ్యులది అని నేను గర్వంగా చెబుతున్నా..’’ అని స్పష్టం చేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారీ ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, నాయకులు తరలిరావడంతో పార్టీ కేంద్ర కార్యాలయం జనసంద్రంగా మారింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలు సమర్పించి నివాళులర్పించిన అనంతరం వైఎస్ జగన్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున పార్టీ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున తరలి వచ్చిన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులనుద్దేశించి వైఎస్ జగన్ ఏమన్నారంటే.. నల్లకాలువలో ఇచ్చిన మాటతో..మన పార్టీ ఆవిర్భవించి ఈరోజుకు 15 ఏళ్లు పూర్తయింది. 2011 మార్చి 12న పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే ఒక మార్క్‌గా నిల్చింది. రాష్ట్రంలోనే కాదు, దేశ రాజకీయాల్లోనే ప్రబలంగా మన పార్టీ కనిపిస్తోంది. 15 సంవత్సరాల క్రితం పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో పుట్టింది అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే.. ఆరోజు నల్లకాలువలో ఇచ్చిన ఒక మాట, మన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపన, ఎదుగుదలకు కారణమైంది. ఆ ఒక్క మాట నా కుటుంబ పరిస్థితుల్ని మార్చింది. రాష్ట్రం దశ, దిశ మార్చింది. ఆ ఒక్క మాట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంకురార్పణకు శ్రీకారం చుట్టింది. కాలర్ ఎగరేసుకుని గర్వంగా చెప్పుకునేలా పార్టీ అడుగులు వేస్తుంది..ఆరోజు జగన్ అనే వాడు ఒకే ఒక్కడు... కానీ జగన్ ఏనాడూ భయపడలేదు. ఆరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ, దేశంలోనూ అధికారంలో ఉంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి కుట్రలు, కుతంత్రాలు పన్నిన పరిస్థితి చూశాం. కానీ, జగన్ ఏనాడూ భయపడలేదు. కారణం జగన్‌కు నమ్మకం ఉన్నది పైన ఉన్న దేవుడు, కింద ఉన్న మీమీద మాత్రమే అని గర్వంగా చెబుతా. నేను నమ్ముకున్న నా ప్రజలు, నేను నమ్ముకున్న నా దేవుడు.. ఇద్దరూ తోడుగా ఉండి నన్ను నడిపించారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విలువలు, విశ్వసనీయతకు ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని, నాతో పాటు నడిచే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా కాలర్ ఎగరేసుకుని.. అదిగో అతడే మా నాయకుడు, అదిగో అదే మా పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెప్పుకునేలా పార్టీ అడుగులు వేస్తుందని మరొక్కసారి మీ అందరికీ వినమ్రంగా, వినయపూర్వకంగా చెబుతున్నా. మీ అందరి ప్రేమాభిమానాలకు మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. వైఎస్సార్‌ను అభిమానించే ప్రతి గుండెకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడికి, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వైఎస్సార్‌ను ప్రేమించే ప్రతి గుండె ఏ రాష్ట్రంలో ఉన్నా, ఆ ప్రతి గుండెకు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. -
చమురు కొరతలేదు : వదంతులకు ఇది సమయం కాదు : హర్దీప్ పూరి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఎల్పీజీ సిలిండర్లపై ఏర్పడిన సంక్షోభంపై లోక్‌సభలో దుమారం రేగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతలు గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన చేపట్టారు. గ్యాస్ సంక్షోభంతో దేశం అల్లాడిపోతోందంటూ ఆరోపించారు. దీంతో కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి. హర్దీప్ సింగ్ పూరి (Hardeep Singh Puri) వివరణ వచ్చారు. దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై ఆందోళన అవసరం లేదని తెలిపారు. గృహాసరాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఆసుపత్రులు , విద్యా సంస్థలకు ఆటంకం లేకుండా సరఫరా చేస్తామని మంత్రి అన్నారు. గ్యాస్ సరఫరాపై రాష్ట్రాలకు ఎప్పటికపుడు సూచనలి స్తున్నామని కేంద్రమంత్రి తెలిపారు. విపక్షాల ఆందోళన మధ్యే మంత్రి ఈ వివరణ ఇచ్చారు. వదంతలను వ్యాప్తి చేయడానికి ఇది సమయం కాదంటూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. దేశంలో డీజిల్, పెట్రోల్ లేదా కిరోసిన్ కొరత లేదని హామీ ఇచ్చారు. సరఫరా గొలుసులు సజావుగా పనిచేస్తున్నాయన్నారు.మధ్యప్రాచ్య యుద్ధం కారణంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంధన సంక్షోభం ప్రపంచ వ్యాప్తంగా ఉందని కానీ, భారతదేశ ముడి చమురు సరఫరా స్థానం సురక్షితంగా ఉందని, హార్ముజ్ అందించే దానికంటే ఎక్కువ పరిమాణంలో లభించిందని చెప్పారు.90 మిలియన్ల మెట్రిక్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నాం. గల్భ్కు బదులుగా నార్వే కెనడా నుంచి దిగుమతికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా కేంద్ర మంత్రి వివరణ ఇచ్చారు. ఇంధన సరఫరాను నిర్ధారించేందుకు కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తున్నా యన్నారు.ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా వివాదం ఉన్నప్పటికీ భారతదేశ ముడి చమురు సరఫరాకు ఇబ్బంది లేదని చెప్పారు.కొన్ని ప్రాంతాలలో కనిపించే ఒత్తిడి ఏదైనా ఉత్పత్తి లేదా సరఫరా వైఫల్యం వల్ల కాదని, తాత్కాలిక డిమాండ్ కారణంగా ఉందని పూరి అన్నారు.LPG వినియోగదారులకు డెలివరీ ప్రామాణీకరణ కోడ్ కవరేజీని 50శాతం నుండి 90శాతానికి విస్తరిస్తున్నా మని, దీని కింద వినియోగదారు OTP నిర్ధారణ తర్వాత మాత్రమే సిలిండర్ డెలివరీ అయినట్లు గుర్తిస్తామని ఇది మళ్లింపు అవకాశాలను తగ్గిస్తుందని ఆయన సభకు తెలియజేశారు. బుకింగ్-టు-డెలివరీ చక్రం దాదాపు 2.5 రోజులు కొనసాగుతుందని, సిలిండర్ల బుకింగ్ , సరఫరా పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు , గ్రామీణ, ప్రాంతాలలో 45 రోజుల గ్యాప్ ఉంటుందని ఆయన అన్నారు.కాగా గ్యాస్ కొరత సమస్యను త్వరగా పరిష్కరించాలంటూ విపక్షాలు చేపట్టిన నిరసనలో పాల్గొన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఏ దేశానికైనా ఇంధన భద్రత ప్రాథమికమని నొక్కి చెబుతూ, భారతదేశం తన గ్యాస్‌ను ఎక్కడి నుండి కొనుగోలు చేస్తుందనే దానిపై నిర్ణయాలను ప్రభావితం చేయడానికి అమెరికాను ఎందుకు అనుమతించాలని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ప్రభుత్వ తప్పుడు విదేశాంగ విధానాల కారణంగా గ్యాస్, పెట్రోల్ వంటి ఇంధనాల విషయంలో తీవ్ర సవాళ్లు ఎదుర్కోబోతోందని హెచ్చరించారు.ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికన్-ఇజ్రాయెల్ దాడుల కారణంగా ప్రారంభమైన ఈ వివాదం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చమురు సరఫరాను, ఉత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తోంది. -
‘చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే ఆలయాల్లో అపచారాలు’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వల్లే ఆలయాల్లో అపచారాలు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. టీటీడీ లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు విష ప్రచారం తర్వాత రాష్ట్రంలోని ఆలయాల్లో అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయన్నారు.ఈరోజు(గురువారం, మార్చి 12వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన మల్లాది విష్ణు.. కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘ చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగా ఆలయాలకు వెళ్లిన భక్తులు క్షేమంగా తిరిగి వస్తారో లేదో అనే అనుమానం కలుగుతోంది. దసరా సమయంలో కనకదుర్గ ఆలయంలో విద్యుత్ సరఫరా నిలిపేసిన చరిత్ర కూటమి ప్రభుత్వానిది. ఆలయాల్లో జరుగుతున్న అపచారాలపై ఎన్నిసార్లు ప్రశ్నించినా ప్రభుత్వంలో స్పందన లేదు.శ్రీశైలంలో శివభక్తులపై లాఠీచార్జ్ చేసిన చరిత్ర కూటమి ప్రభుత్వానిదే. గతంలో ఆలయాల్లో ఇలాంటి అపశృతులు జరగలేదు. తిరుమల పరకామణిలో కోటి విలువైన బంగారం చోరీ కేసును సీరియస్‌గా తీసుకోలేదు. కూటమి ప్రభుత్వంలో ఆలయాల్లో విపరీతంగా అపచారాలు జరుగుతున్నాయి. చివరకు దేవునికి కూడా సరైన నైవేద్యం కూడా పెట్టటం లేదు.కోటప్పకొండ ఆలయంలో నాసిరకం ప్రసాదాలు పెట్టి అపచారం చేశారు. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా?, పంచారామాలలో సైతం అపచారాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. బీఆర్ నాయుడు రాసలీల వీడియోలు బయటకు వచ్చాయి. అయినాసరే చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయించలేదు?, పైగా నిస్సిగ్గుగా ఎదురుదాడి చేస్తారా?, హిందూ ధర్మాన్ని కాపాడే వారైతే కచ్చితంగా బీఆర్ నాయుడుతో రాజీనామా చేయించాలి’ అని డిమాండ్ చేశారు. -
విజయ్ వైపు.. ఆ ముగ్గురి చూపు
సాక్షి, చెన్నై: తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే కూటముల్లో చేరే పార్టీల జాబితా దాదాపుగా ఖరారైంది. అయితే టీవీకే అధినేత విజయ్ ఇచ్చిన పిలుపునకు ఎట్టకేలకు ముగ్గురు స్పందించారు. ఈ ముగ్గురి విజయ్‌తో కలిసి మెగా కూటమి దిశగా కసరత్తులలో ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. డీఎంకే మెగా కూటమి అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. ఇందులో ఏఏ పారీ్టలు ఉన్నాయో దాదాపుగా క్లారిటీ వచ్చినట్లే. ఇక, అన్నాడీఎంకే– బీజేపీ కూటమిలోనూ అదే పరిస్థితి. కాగా సంకీర్ణ ధర్మం మేరకు పాలనలోనూ భాగస్వామ్యం అన్న నినాదంతో తనతో కలిసి వచ్చేవారికి అధికారంలో వాటా ఇస్తానన్న విజయ్ వైపుగా ఇంత వరకు ఎవ్వరూ దృష్టి పెట్ట లేదు. చివరకు ఒంటరిగానైనా ఎన్నికలను ఎదుర్కొనేందుకు సన్నద్ధమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్‌కు మరింత బలాన్ని ఇచ్చేందుకు పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్ ఓ వైపు ,దివంగత సీఎం జె. జయలలిత నెచ్చెలి శశికళ మరోవైపు సన్నద్ధమవుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అన్బుమణి పీఎంకే అన్నాడీఎంకే కూటమిలో చేరిన దృష్ట్యా, డీఎంకేలో తమకు అవకాశం లేక పోవడంతో ఇక విజయ్ పక్షాన నిలబడేందుకు రాజకీయ అనుభవజు్ఞడైన రాందాసు నిర్ణయించి, అందుకు సంబంధించిన సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. అదే సమయంలో రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రకటన చేసిన దివంగత సీఎం జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ సైతం రాందాసు పిలుపునకు స్పందించినట్టు ప్రచారం. రహస్యంగా చర్చలు.. ఈ ప్రచారానికి అద్దం పట్టే విధంగా ఆమె మంగళవారం రాత్రి తైలాపురంలో రాందాసుతో భేటీ కావడం ప్రాధాన్యతకు దారి తీసినట్లయ్యింది. తనకు వెన్నుపోటు పొడిచిన పళణిస్వామి, టీటీవీ దినకరన్‌కు గట్టిగా బుద్ది చెప్పే రీతిలో అన్నాడీఎంకే కేడర్‌ను విజయ్ వైపుగా మళ్లించే దిశగా చిన్నమ్మవ్యూహాలకు పదును పెట్టనున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వన్నియర్ సామాజిక వర్గం ఓటు బ్యాంక్, ముక్కళత్తోర్ సామాజిక వర్గం ఓటు బ్యాంక్‌ను విజయ్ వైపుగా మళ్లించే దిశగా ఆయనకు దన్నుగా నిలబడేందుకు సన్నద్ధమవుతున్నట్టు చర్చలు జోరందుకున్నాయి. అదే సమయంలో దక్షిణ తమిళనాడులో వెనుకబడిన సామాజిక వర్గం ఓటు బ్యాంక్‌ను కలిగిన పుదియ తమిళగం నేత కృష్ణస్వామి సైతం విజయ్‌కు దన్నుగా నిలబడే రీతిలో సిద్ధమైనట్టు ఆయన మద్దతు దారులు పేర్కొంటున్నారు. అయితే సజావుగా వ్యవహారాలన్నీ సాగి, వ్యూహాలు ఫలించిన పక్షంలో విజయ్ నేతృత్వంలోమెగా కూటమి తథ్యమని రాందాసు ,చిన్నమ్మ శశికళ శిబిరంలోని కొందరు నేతలు పేర్కొంటుండటం గమనార్హం. -
వైఎస్సార్సీపీ అభిమాని కాలర్ ఎగరేసేలా పార్టీ ఉంటుంది : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: ‘అభిమాని కాలర్ ఎగరేసేలా పార్టీ ఉంటుందని’ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం (మార్చి 12) వైఎస్సార్సీపీ ఆవిర్భవించి 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా తాడేపల్లి పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ వేడుకల్లో వైఎస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం ప్రసంగించిన వైఎస్ జగన్ పార్టీ భవిష్యత్తుపై తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘2011 మార్చి 12న పార్టీ ఆవిర్భవించింది. వైఎస్సార్సీపీ ఆవిర్భావంతో దేశ రాజకీయాల్లోనే మార్పు కనిపించింది. నల్లకాల్వలో ఇచ్చిన మాట వైఎస్సార్సీపీ ఆవిర్భావానికి కారణమైంది. ఆ ఒక్క మాట రాష్ట్ర దశ, దిశను మార్చింది. వైఎస్సార్సీపీ పార్టీ కోట్లాది మంది ప్రజలది. మొదట్నుంచీ ప్రజలు,దేవుడినే నమ్ముకున్నా. విలువలు, విశ్వసనీయతకు ఎప్పటికీ కట్టుబడి ఉంటా. వైఎస్సార్సీపీ అభిమాని కాలర్ ఎగరేసేలా పార్టీ ఉంటుంది. మీ ప్రేమాభిమానాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. వైఎస్సార్సీపీ అభిమానించే ప్రతి గుండెకు శుభాకాంక్షలు’ తెలిపారు. ఇచ్చిన మాట కోసం ఎందాకైనా... వరుస ఓటములతో జీవచ్ఛవంలా మారిన కాంగ్రెస్‌కు ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్రతో జీవం పోసి... టీడీపీ దుర్మార్గపు పాలనకు తెరదించుతూ 2004 ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కాంగ్రెస్‌ను మహానేత ఒంటిచేత్తో అధికారంలోకి తెచ్చారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా 2004 మే 14న ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్సార్... రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బాటలు వేశారు. జనరంజక పాలనను మెచ్చిన ప్రజలు వైఎస్ నాయకత్వానికి దన్నుగా 2009 ఎన్నికల్లోనూ మళ్లీ అధికారాన్ని కట్టబెట్టారు. 2009 మే 20న రెండోసారి ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక... అదే ఏడాది సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందారు. ఈ విషాద వార్తకు తాళలేక వందలాది మంది మరణించడం జగన్ ను కలిచి వేసింది. ప్రమాదం చోటుచేసుకున్న కర్నూలు జిల్లా నల్లకాలువ వద్ద 2009 సెప్టెంబరు 25న నిర్వహించిన సంస్మరణ సభలో మాట్లాడుతూ... మరణించిన వారి కుటుంబాలను పరామ ర్శించడానికి ఓదార్పు యాత్ర చేపడతానని ప్రకటించారు. ఆ మాటకు కట్టుబడి 2010 ఏప్రిల్ 9న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రను ఆపేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించింది. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై కుట్రలు చేస్తుండటంతో తన తల్లి విజయమ్మతో కలిసి జగన్ కాంగ్రెస్ పార్టీకి, పులివెందుల శాసనసభ, కడప లోక్‌సభ స్థానాలకు రాజీనామాలు చేశారు. వైఎస్ ఆశయ సాధనే లక్ష్యంగా 2011 మార్చి 11న వైఎస్సార్సీపీ పేరును ప్రకటించారు. ఆ మరుసటి రోజే వైఎస్ సమాధి వద్ద పతాకాన్ని ఆవిష్కరించి, పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. -
హామీలపై నోరు మెదపరేమి? : వైఎస్ జగన్
మహిళలకు మళ్లీ మోసం.. సూపర్ సిక్స్, సెవెన్ అని మోసం చేశావ్.. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మళ్లను అన్ని విధాలా దగా చేశావ్.. మహిళలకు అందించిన పథకాలన్నీ రద్దు చేశావ్. ఆఖరికి సున్నా వడ్డీ కూడా ఇవ్వకుండా దారుణంగా వంచించావ్.. ఇప్పుడు మరోసారి మభ్యపెడుతున్నావ్.. మహిళలకు ఆడబిడ్డ నిధి ఎప్పుడు ఇస్తారు? ఉద్యోగులకు రూ.35 వేల కోట్ల బకాయిలుఅధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ‘ఐఆర్’ ఇస్తామన్న హామీకి అతీగతీ లేదు. పీఆర్సీ ప్రస్తావనే లేదు. నాలుగు పెండింగ్ డీఏలు ఎప్పుడిస్తారో స్పష్టత లేదు. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్ కింద ఉద్యోగులకు రూ.35 వేల కోట్లు బాకీపడ్డారు. చివరికి ఆశ వర్కర్లు, అంగన్వాడీలకు ఇచ్చిన హామీలనూ నెరవేర్చకుండా పోలీసులతో దాడి చేయించారు.నెయ్యిపై దుమారం రేపి.. స్కామ్లుతిరుమలకు సరఫరా అయిన నెయ్యి టెండర్లను గమనిస్తే రూ.200 కోట్ల స్కామ్ బయటపడుతుంది. ఉద్దేశపూర్వకంగానే ఏడాదిలోనే కిలో నెయ్యి రేటును రూ.351 నుంచి రూ.716కు పెంచేశారు. ఇది ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని స్కామ్. దేవుడంటే భయభక్తులు లేకుండా.. ఒక పక్కన నెయ్యిపై దుమారం రేపి.. అదే నెయ్యిని అడ్డుపెట్టుకుని స్కామ్‌లు చేస్తున్నారు. ఇదేనా తాట తీయడం? తాట తీస్తామని డైలాగులు చెప్పడం కాదు.. మహిళలపై దారుణాలకు పాల్పడ్డ కూటమి నేతల్లో ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు? రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని బాధితురాలు నీకే ఫిర్యాదు చేసింది బాబూ! టీటీడీ చైర్మన్ ఓ మహిళను మోసం చేసి వీడియోలు, ఫొటోలతో దొరికిపోతే ఏం చేశావ్ బాబూ? కేజీబీవీ ప్రిన్సిపాల్‌పై టీడీపీ ఎమ్మెల్యే కూన వేధింపుల మీద చర్యలేవి? – మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ‘ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ హామీలను ఎప్పుడు అమలు చేస్తారు? మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఉద్యోగులకు మీరు బకాయి పడిన నిధులు ఎప్పుడు ఇస్తారు? బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో నేను అడిగిన ప్రశ్నలకు.. 16 రోజులపాటు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో నోరు మెదపలేదెందుకు?’ అంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. ‘బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత మళ్లీ అడుగుతున్నా.. ఇప్పటికే మూడు బడ్జెట్లు పెట్టారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చీ రాగానే 2024 జూన్ నుంచే అమలులోకి వస్తాయన్నారు. హామీల పేరిట బాకీ పడ్డ సొమ్ములు ఎప్పుడిస్తావు? అని అడిగితే మాత్రం నోరు మెదపడం లేదు’ అంటూ నిలదీశారు. గిట్టుబాటు ధర లేక, అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ఆదుకోవాల్సింది పోయి 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ఆటలు.. పాటలు.. స్కిట్లతో కాలక్షేపం చేస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎత్తిచూపుతూ.. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీల వీడియోలు ప్రదర్శిస్తూ.. పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలను గుర్తు చేస్తూ.. ఆ హామీల అమలుకు బడ్జెట్లో కేటాయింపులను వివరిస్తూ.. ప్రజలకు చంద్రబాబు సర్కార్ చేస్తున్న మోసాన్ని ఆధారాలతో సహా చూపుతూ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..అన్నదాత సుఖీభవ.. నిలుపునా మోసం⇒ పీఎం కిసాన్ కాకుండా అన్నదాత సుఖీభవ పేరిట ఏటా రూ.20 వేలు ఇస్తామన్నాడు (గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే రూ.6 వేలు కాకుండా ప్రతి ఏటా రైతుకు రూ.20 వేలు ఇస్తామంటూ ఎన్నికల్లో చంద్రబాబు మాట్లాడిన మాటలతో కూడిన వీడియోను ప్రదర్శించారు). తొలి ఏడాది ఎగ్గొట్టాడు. రెండో ఏడాది రూ.20 వేలకు గాను అప్పుడో రూ.ఐదు వేలు.. అప్పుడో రూ.ఐదు వేలు ఇచ్చాడు. అంటే రెండేళ్లలో రూ.40 వేలకు గాను రూ.10 వేలు ఇచ్చాడు. ఒక్కో రైతుకు రూ.30 వేలు బాకీ పడ్డారు. మా హయాంలో 53.58 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇస్తే చంద్రబాబు ప్రభుత్వంలో వారి సంఖ్యను 46.85 లక్షల మందికి కుదించేశారు. దాదాపు 7 లక్షల మందికి ఎగ్గొట్టారు. పైగా కౌలు రైతులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా ఒక్క పైసా ఇచ్చింది లేదు. ఈ బాకీ సొమ్ములు ఎప్పుడిస్తావు అని అడిగితే అసెంబ్లీ సమావేశాల్లో నోరు మెదపలేదు. ⇒ 2023–24 ఖరీఫ్‌కు సంబంధించి 2024 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం రైతుల తరఫున ఇన్సూ రెన్స్ ప్రీమియం కట్టి ఉంటే.. కేంద్రం ఇవ్వాల్సింది జత చేసేది. ఆ వెంటనే రైతులకు ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా పరిహారం చెల్లించేవి. ఈ పెద్దమనిషి 2024 జూన్‌లో ప్రీమియం డబ్బులు కట్టక పోవడంతో రైతులు రూ.1,324 కోట్లు నష్టపోయారు. ఉచిత పంటల బీమాను రద్దు చేసి రైతులను గాలికొదిలేశారు. చంద్రబాబు నిర్వాకాల వల్ల 2023–24, 2024–25 సీజన్లలో రూ.3,500 కోట్ల మేర బీమా పరిహారం నష్టపోయారు. ఇది ఎప్పుడు ఇస్తారని అడిగితే సమాధానం లేదు. ⇒ అక్టోబర్‌లో మోంథా తుపాన్‌తో నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారని అడిగితే వీళ్ల నోటి నుంచి ఒక్క మాట రాదు. ⇒ మా ప్రభుత్వ హయాంలో ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లు పెట్టి.. రూ.7,500 కోట్లు వెచ్చించి అండగా నిలిచాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి ఎకరాలో సాగైన ప్రతి పంటను ఈ–క్రాప్‌లో నమోదు చేసేవాళ్లం. ఏ రైతుకు అయినా తాను వేసిన ఏ పంటకైనా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉంటే సీఎం యాప్ (కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్) ద్వారా పర్యవేక్షిస్తూ ధరలు పడిపోయినా ప్రతిసారీ ఆదుకున్నాం. పైగా ప్రతీ ఆర్బీకేలో ప్రతి పంటకు నిర్దేశించిన మద్దతు ధరలతో బోర్డులు పెట్టి దళారుల వెన్నులో వణుకు పుట్టించేవాళ్లం. అంతకంటే తక్కువ రేటుకు కొనేందుకు సాహసిస్తే.. వెంటనే స్పందించేవాళ్లం. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు. ఇంత దారుణమా.. రైతులంటే ఇంత చులకనేంటయ్యా.. అని అడిగితే సమాధానం చెప్పకపోగా ఎదురుదాడి చేస్తున్నారు.ఏ ఒక్క పంటకు మద్దతు ధర లేదు⇒ గతేడాది వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, శనగలు, మిర్చి, టమాటా, చీనీ, పత్తి అన్ని పంటలకు ధరలు పడిపోతే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా మళ్లీ మిర్చి, శనగ, అరటి, మొక్కజొన్న పంటలకు ధరలు పడిపోయాయి. నెల క్రితం క్వింటా రూ.26 వేలున్న మిర్చి.. ఈ రోజు రూ.18 వేలకు పడిపోయింది. శనగ కనీస మద్దతు ధర రూ.5,875.. రైతులకు రూ.5 వేలకు మించి రావడం లేదు. మొక్కజొన్న మద్దతు ధర రూ.2,400 అయితే, రైతులు కేవలం రూ.1400–1500కు అమ్ముకుంటున్నారు. ఈ ఒక్క పంటపైనే రూ.3,500 కోట్లు నష్టపోతున్నారు.⇒ అరటి ఈ ఏడాది కూడా టన్ను రూ.5 వేలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. మా హయాంలో టన్ను రూ.30 వేలు పలుకగా, ఈ రోజు రూ.5 వేలకు తెగనమ్ముకుంటున్నారు. టమాటా కిలో రూ.2కు అమ్ముకోవాల్సి వస్తోంది. బత్తాయి, పుచ్చకాయ, మస్క్‌మెలన్, సజ్జలు ఇలా అన్ని పంటల పరిస్థితి ఇలాగే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా ఉండేందుకు ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3 వేల కోట్లు పెట్టి రైతులకు తోడుగా నిలవాల్సింది పోయి బడ్జెట్లో రూ.300 కోట్లు పెట్టారు. ఇంత తక్కువ ఎందుకు పెట్టారని అడిగితే నోరు మెదపడం లేదు.⇒ రైతులు ఇంత దారుణమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపం చేశారు. అసెంబ్లీలో వీళ్ల ప్రవర్తన చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. వ్యవసాయ రంగం ఎంత సంక్షోభంలో ఉందంటే.. వందలాది మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2025–26లో 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడితే ఒక్క పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. వీరికి పరిహారం ఎప్పుడు ఇస్తారని అడిగితే అసెంబ్లీలో ఒక్క మాట చెప్పలేదు. కనీసం వ్యవసాయ రంగంలో సంక్షోభం, రైతుల కష్టాలపై అసెంబ్లీలో చర్చించడం, వారికి భరోసా కల్పించడం మచ్చుకైనా చేయలేదు. మరో 7.46 లక్షల పింఛన్లు కోత వేయబోతున్నారు⇒ 2024 ఎన్నికల షెడ్యూల్ నాటికి మార్చిలో మేము ఇచ్చిన పింఛన్ల సంఖ్య 66,34,372. ఈ నెలలో ఇచ్చిన పింఛన్ల సంఖ్య 60,69,664. అంటే ఇప్పటికే 5,64,708 పింఛన్లు కట్ చేశారు. 2026 ఫిబ్రవరిలో 60,96,108 మందికి పింఛన్లు ఇస్తే.. మార్చిలో 60,69,664 మందికి ఇచ్చారు. అంటే ఈ ఒక్క నెలలోనే 26 వేల పింఛన్లు కట్ చేశారు. ఇలా ప్రతీ నెలా పింఛన్లు కట్ చేసూ్తనే ఉన్నారు. కొత్తగా ఒక్క పింఛన్ ఇవ్వలేదు. ఇప్పటికే ప్రభుత్వం వద్ద పింఛన్ కోసం 2.50లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.⇒ కొత్త పింఛన్ల మంజూరు కోసం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. మా హయాంలో ప్రతి ఆర్నెల్లకోసారి జూన్, డిసెంబర్లలో పింఛన్లు అప్డేట్ చేసే వాళ్లం. ఈరోజు ఆ పరిస్థితి కన్పించడం లేదు. కనీసం మార్చిలో ఇచ్చిన పింఛన్ల సంఖ్యను బట్టి చూసినా ఈ ఏడాది బడ్జెట్లో రూ.31,554 కోట్లు పెట్టాలి. కానీ బడ్జెట్లో పెట్టింది కేవలం రూ.27,719 కోట్లు. అంటే మరో 7,45,993 పింఛన్లు కట్ చేయబోతున్నామని చెప్పకనే చెప్పారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని, బడ్జెట్లో ఎందుకు తగ్గించి చూపిస్తున్నారో చెప్పాలని అడిగాం. 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో కనీస ప్రస్తావన కూడా లేదు.తల్లికి వందనం పేరిట దగా⇒ తల్లికి వందనం కింద చదువుకునే ప్రతీ పిల్లాడికి రూ.15 వేలు చొప్పున ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఇస్తామన్నారు. తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది ఏకంగా 20 లక్షల మంది పిల్లలకు పథకాన్ని కత్తిరించారు. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆన్ ఎడ్యుకేషన్ (యూడీఐఎస్ఈ–యూడైస్) ప్రకారం 2023–24లో బడికి వెళ్లే పిల్లలు 87,41,885 మంది ఉన్నారు. కానీ ఇచ్చింది 67 లక్షల మందికే.తల్లికీ వంచనే.. యూడైస్ ప్లస్ ప్రకారం 87,41,885 మంది పిల్లలకు తల్లికి వందనం కింద రూ.13,112 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఈ బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.8,456.48 కోట్లు మాత్రమే ⇒ పైగా ఏ ఒక్కరికి రూ.15 వేలు ఇవ్వలేదు. కొంత మందికి రూ.8 వేలు, మరికొంత మందికి రూ.9 వేలు, ఇంకొంత మందికి రూ.10 వేలు, అక్కడక్కడా అతి కొద్ది మందికి రూ.13 వేలు చొప్పున ఇచ్చారు. మొదటి ఏడాది ఎగ్గొట్టిన డబ్బులతో పాటు రెండో ఏడాది ఇవ్వాల్సిన మిగిలిన డబ్బులు ఎప్పుడిస్తారని అడిగితే సమాధానం లేదు. ⇒ ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. తీరా ఇప్పుడు షరతులు పెట్టారు. ఆర్టీసీలో 16 రకాల సర్వీసులుంటే కేవలం 5 రకాల సర్వీసులకే పరిమితం చేశారు. ఎందుకు ఈ మాదిరిగా షరతులు పెట్టారని అడిగితే నోరు మెదపడం లేదు. ⇒ దీపం పథకం కింద ప్రతి మహిళకు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నారు. తొలి ఏడాది ఒక సిలిండర్‌కే ఇచ్చి మిగిలిన రెండు సిలిండర్లు డబ్బులు ఎగ్గొట్టారు. గ్యాస్ కంపెనీల డేటా ప్రకారం రాష్ట్రంలో కోటి 59 లక్షల కనెక్షన్లున్నాయి. ఒక్కో గ్యాస్ సిలిండర్‌కు రూ.855 చొప్పున 3 సిలిండర్లకు ఏడాదికి రూ.4 వేల కోట్లు ఖర్చు చేయాలి. అంటే మూడేళ్లకు రూ.12 వేల కోట్లు ఖర్చు చేయాలి. కానీ తొలి ఏడాది రూ.786 కోట్లు ఖర్చు చేశారు. రెండో ఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్స్‌లో రూ.2,199 కోట్లుగా చూపించారు. ఇచ్చారో లేదో కూడా తెలియదు. ఈ బడ్జెట్లో రూ.2,600 కోట్లు పెట్టారు. మరి రూ.12 వేల కోట్లకు గానూ ఇచ్చింది సగం కూడా లేదు. ఈ పథకం కింద మహిళలకు రూ.6,144 కోట్లు బాకీ పడ్డారు. ఈ సొమ్ములు ఎప్పుడు ఇస్తారని అడిగితే నోరు మెదపడం లేదు.నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఏమైంది?⇒ యువగళం పేరు పెట్టి నిరుద్యోగ భృతి కింద రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఏటా రూ.36 వేల చొప్పున మూడేళ్లకు ప్రతి నిరుద్యోగికి బాకీపడ్డ రూ.1.08 లక్షలు ఎప్పుడు ఇస్తారో చెప్పమంటే నోరు మెదపడం లేదు. ఆడబిడ్డలకూ తీవ్ర అన్యాయం రాష్ట్రంలో 18 నుంచి 60 ఏళ్ల వయసు గల మహిళలు 1,78,99,440 మంది ఉండగా.. ఒక్కరికి కూడా ఆడబిడ్డ నిధి కింద ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదు ⇒ సూపర్ సిక్స్‌లో రెండో కీలకమైన హామీ..18 ఏళ్లు నుంచి 60 ఏళ్ల వయసులోపు ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి పేరిట నెలకు రూ.1,500 ఇస్తామన్నారు. ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 2,10,58,615 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. వీరిలో 60 ఏళ్లు పైబడిన వారిని తీసేస్తే 1,78,99,440 మంది అర్హులు. వీరికి ప్రతి నెలా రూ.1,500.. ఏడాదికి రూ.18 వేలు చొప్పున మూడేళ్లకు బాకీ పడ్డ రూ.54 వేలు ఎప్పుడు ఇస్తారని అడిగితే 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో కనీస ప్రస్తావన కూడా చేయలేదు. ⇒ మరో ముఖ్యమైన హామీ.. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ పథకం. ఈ పథకం కింద నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.48 వేలు..ఇలా మూడేళ్లలో రూ.1.44 లక్షలు బాకీ పడ్డారు. ఎప్పుడు ఇస్తారని అడిగితే కనీసం మాట్లాడటం లేదు.ప్రతినెలా 25 వేలకు పైగా పింఛన్ల కోత వైఎస్ జగన్ 2024 మార్చిలో 66,34,372 మందికి పింఛన్లు ఇవ్వగా.. చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో పింఛన్లు ఇచ్చినది 60,69,664 మందికి మాత్రమే ఆరోగ్యశ్రీ నిర్వీర్యం.. ఆరోగ్యశ్రీ పథకం నడవాలంటే బకాయిలతో కలిపి రూ.7,150 కోట్లు కావాలి. బడ్జెట్లో రూ.4 వేల కోట్లు మాత్రమే కేటాయించిన చంద్రబాబు గతంలో రూ.2 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. నెట్వర్క్ ఆస్పత్రుల్లో సేవలు ఆగిపోతున్నా చంద్రబాబుకు చీమ కుట్టినట్లైనా లేదు. పిల్లల చదువులెలా సాగుతాయి? ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద బకాయిలతో కలిపి మొత్తం రూ.10,328 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఈ ఏడాది బడ్జెట్లో కేటాయింపులు రూ.2,766 కోట్లు మాత్రమే. ఇలా అయితే పిల్లల చదువులు ఎలా సాగుతాయి? ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానేస్తున్నారు. పెన్షన్లు కటింగ్...50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ హామీని నెరవేర్చకుండా మూడేళ్లలో ఒక్కొక్కరికీ రూ.1.44 లక్షలు బాకీ పడ్డారు. మరోవైపు సామాజిక పెన్షన్లు ఇప్పటికే 5,64,708 కట్ చేశారు. ఒక్క నెలలోనే 26 వేల పింఛన్లు కట్ చేశారు. ప్రతీ నెలా పింఛన్లు కట్ చేస్తూనే ఉన్నారు. కొత్తగా ఒక్క పింఛనూ ఇవ్వలేదు. పింఛన్ కోసం 2.50లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. బడ్జెట్ కేటాయింపులను బట్టి మరో 7,45,993 పింఛన్లు కట్ చేయబోతున్నామని చెప్పకనే చెబుతున్నారు. 50 ఏళ్లకే పింఛన్ ఇంకెప్పుడు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని ఎన్నికల ముందు పచ్చ పత్రిక ఈనాడులో చంద్రబాబు ఇచ్చిన ప్రకటన అన్నదాతకు దగా...పీఎం కిసాన్ కాకుండా అన్నదాత సుఖీభవ పేరిట ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేలు చొప్పున ఇస్తామన్నాడు. రెండేళ్లలో రూ.40 వేలకు గాను రూ.10 వేలు ఇచ్చాడు. ఒక్కో రైతుకు రూ.30 వేలు బాకీ పడ్డారు. 7 లక్షల మందికి ఎగ్గొట్టారు. కౌలు రైతులకు ఒక్క పైసా ఇవ్వలేదు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా ఒక్క పైసా ఇచ్చింది లేదు. ఉచిత పంటల బీమాను రద్దు చేసి రైతులను గాలికొదిలేశారు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఏ ఒక్క పంటకూ మద్దతు ధర లేదు. ధరల స్థిరీకరణ నిధికి తూట్లు పొడిచారు. రైతులు ఇంత దారుణమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఆటపాటలు, స్కిట్లతో కాలక్షేపం చేశారు. ఇళ్లపై దొంగ మాటలు..మేం 31 లక్షల పట్టాలిచ్చి 21 లక్షల ఇళ్లు శాంక్షన్ చేశాం. 10 లక్షల ఇళ్లను పూర్తి చేశాం. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. కేంద్రం ఇచ్చిన డబ్బులను చంద్రబాబు మళ్లించడంతో ఈ పథకం ఆగిపోయింది. కనీసం మేం మంజూరు చేసిన ఇళ్లను పూర్తి చేసేందుకు డబ్బులు ఇవ్వాలని అడుగుతుంటే త్రిబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని దొంగ మాటలు చెబుతున్నారు. ఈ రెండేళ్లలో ఒక్క అక్క చెల్లెమ్మకైనా గజం స్థలం ఇచ్చారా? ఒక్క ఇంటి పట్టా ఇవ్వలేదు. కొత్తగా ఒక్క ఇంటిని కూడా మంజూరు చేయలేదు.ఇవన్నీ ఎవరి హయాంలో జరిగాయి?జగన్‌కు ఎలాంటి క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకు నచ్చదు. కనీసం క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఉద్యోగులకూ థ్యాంక్స్ చెప్పరు. సర్వేయర్ల వ్యవస్థ, సచివాలయాల వ్యవస్థ ఎవరి వల్ల వచ్చింది? సర్వే పరికరాలు, కోర్ స్టేషన్లు, రోవర్స్ ఎవరు తీసుకొచ్చారు? విమానాలు, హెలికాప్టర్లలో సర్వేలు ఎవరి హయాంలో జరిగాయి? ఓఆర్ఐ రికార్డులు, సర్వే అనంతరం హద్దుల్లో పాతడానికి కోట్ల హద్దు రాళ్లు ఎవరి హయాంలో సమకూర్చారు? పాస్‌బుక్‌లో క్యూఆర్ కోడ్, జియో ట్యాగింగ్ హద్దు నిర్ణయం ఎవరి హయాంలో ప్రారంభమైంది? -
ఫిరాయింపుల్లో ప్రథమ ముద్దాయి రాహుల్‌గాంధీ
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పు అత్యంత అప్రజాస్వామికం, దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆడిస్తున్న ఆటలో భాగంగానే స్పీకర్ ప్రసాద్‌కుమార్ పిటిషన్లు డిస్మిస్ చేశారన్నారు. అసెంబ్లీ స్పీకర్‌పై రాహుల్‌గాంధీ నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉందని చెప్పారు. తెలంగాణ నుంచి వస్తు న్న డబ్బు సంచుల కోసం ఇలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఫిరాయింపుల వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ నడిపించిందని, స్పీకర్ చేతుల్లో నిర్ణయాధికారం లేదన్నారు. పార్టీ ఫిరాయింపుల్లో ప్రథమ ముద్దాయి రాహుల్‌గాంధీ అని, ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగంపై కాంగ్రెస్ చేస్తున్న దాడిలో ప్రధాన నేరస్తుడు రాహుల్‌గాంధీ అని కేటీఆర్ విమర్శించారు. ఆయన అనుమతి లేకుండా అనర్హత పిటిషన్లు డిస్మిస్ చేసేంత సాహసం స్పీకర్ చేయలేరన్నారు. మాజీ మంత్రులు జోగు రామన్న, పువ్వాడ అజయ్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ తాతా మధు, పార్టీ నేతలు కర్నె ప్రభాకర్, డాక్టర్ ఆనంద్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తదితరులతో కలిసి కేటీఆర్ బుధవారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలి. ఈ నిర్ణయంతో రాహుల్ గాంధీ జోకర్‌గా నిలిచిపోయారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే వెనువెంటనే సభ్యత్వం కోల్పోయేలా చట్టం తెస్తామని ప్రకటించిన రాహుల్‌గాంధీకి ఏమాత్రం సిగ్గూ, గౌరవం ఉన్నా స్పీకర్ నిర్ణయంపై స్పందించాలి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. వెలుగుమట్ల కూల్చివేతలపై వదిలిపెట్టం ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో పేదల ఇళ్ల కూల్చివేత అంశాన్ని అసెంబ్లీ ఉభయ సభల్లో ప్రశ్నించి తీరుతామని కేటీఆర్ అన్నారు. ‘ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల బినామీలు భూ మాఫియాగా ఏర్పడి పేదల మీద దాడి చేసి బయటకు పంపుతున్నారు. వెలుగుమట్లతోపాటు రాష్ట్రంలో కూలగొడుతున్న ప్రతీ ఇంటికి తిరిగి పట్టా ఇచ్చేంత వరకు వదిలిపెట్టం. ఇళ్లు కోల్పోయి ఏడుస్తున్న బాధితులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ మృగాల్లా మాట్లాడుతున్నారు. మంత్రుల ఆదేశాలతో ఖమ్మం ఏసీపీ బాధితులపైనే కేసులు పెడుతున్నారు’అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్, రాహుల్‌నుసన్మానించాలి‘ఒక పార్టీ బీ ఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండానే మరో పార్టీ బీ ఫామ్ మీద ఎంపీగా ఎలా పోటీ చేస్తారు. ఇంత అద్భుత నిర్ణయం తీసుకున్న స్పీకర్‌ను, ఆయన వెనుక ఉన్న రాహుల్‌గాందీని బహిరంగ సభ వేదికపై సత్కరించాలి’అని కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘అన్ని సాక్ష్యాలు ప్రజల ముందు ఉన్నా, విచారణ చేయాల్సిన అవసరం ఏముంది. ఫిరాయింపుల సంస్కృతి గురించి ఇకపై మాట్లాడే నైతిక హక్కు రాహుల్‌గాం«దీ, కాంగ్రెస్ పార్టీకి లేదు. పార్టీ ఫిరాయింపుల అంశంపైన దానం నాగేందర్, కడియం శ్రీహరిలు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం. కడియం శ్రీహరికి బీఆర్ఎస్ ఇచ్చిన గౌరవం, వచి్చన పదవులపై ఆయనే ప్రశ్నించుకోవాలి. మురికి మాటలు మాట్లాడుతున్న కడియం శ్రీహరి బీఆర్ఎస్లో కొనసాగుతున్నట్టు చేస్తున్న ప్రకటనలు ఆయన నైతిక పతనానికి అద్దం పడుతున్నాయి’అని కేటీఆర్ విమర్శించారు. -
పార్టీ మారలేదు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరారని పేర్కొంటూ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్లను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ కొట్టేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభా పక్షం నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై ఇటీవల విచారణ పూర్తి చేసిన స్పీకర్ బుధవారం ఉదయం 10 గంటలకు తన తుది తీర్పును ప్రకటించారు. వాస్తవానికి తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే 8 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను గతంలోనే డిస్మిస్ చేసిన స్పీకర్ తాజాగా.. దానం, కడియంకు సంబంధించి తీర్పు వెలువరించారు. వారు పార్టీ మారలేదని స్పష్టం చేశారు. కాగా స్పీకర్ నిర్ణయంతో దానం, కడియంపై కచ్చితంగా అనర్హత వేటు పడుతుందని భావించిన బీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. స్పీకర్ ట్రిబ్యునల్ నుంచి తీర్పు కాపీ అందిన తర్వాత తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి.. రాష్ట్రంలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలకే పరిమితమైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆరోపణలు వచ్చాయి.టి.ప్రకాశ్‌గౌడ్ (రాజేంద్రనగర్), పోచారం శ్రీనివాస్‌రెడ్డి (బాన్సువాడ), దానం నాగేందర్ (ఖైరతాబాద్), కాలే యాదయ్య (చేవెళ్ల), డాక్టర్ ఎం.సంజయ్‌కుమార్ (జగిత్యాల), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి (గద్వాల), అరెకపూడి గాంధీ (శేరిలింగంపల్లి), గూడెం మహీపాల్ రెడ్డి (పటాన్చెరు) వీరిలో ఉన్నారు. అయితే దానం నాగేందర్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోవైపు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వగా ఆమె చివరి నిమిషంలో కాంగ్రెస్‌లో చేరి ఎంపీగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కడియం కావ్య తరఫున కడియం శ్రీహరి ప్రచారం చేసినట్లు బీఆర్ఎస్ ఆరోపించింది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారంటూ భారత రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ (ఫిరాయింపుల నిరోధక చట్టం)లోని పేరా 2(1) ప్రకారం వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ 2024 జూలైలో శాసనసభ స్పీకర్ వద్ద వేర్వేరుగా అనర్హత పిటిషన్లు దాఖలు చేసింది. కోర్టుల్లో బీఆర్ఎస్ సుదీర్ఘ న్యాయపోరాటం తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ ఆలస్యం చేస్తున్నారని పేర్కొంటూ బీఆర్ఎస్ 2024 డిసెంబర్లో హైకోర్టును ఆశ్రయించింది. దీంతో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ స్పీకర్‌ను ఆదేశించింది. అయితే స్పీకర్‌కు కాల పరిమితి విధించడం తగదంటూ ఆ ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది. డివిజన్ బెంచ్ ఆదేశాలను సవాలు చేస్తూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. డివిజన్ బెంచ్ తీర్పును రద్దు చేసిన సుప్రీంకోర్టు.. 3 నెలల్లో అన్ని పిటిషన్లు పరిష్కరించాలని ఆదేశించింది దీంతో 2025 ఆగస్టులో 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన స్పీకర్ దశల వారీగా విచారణ జరిపారు. అయితే నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలనే ఆదేశాలను స్పీకర్ పాటించక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. 2025 నవంబర్ 17న ఆయనకు కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పదింటిలో ఏడు పిటిషన్లు డిస్మిస్ చేసినట్లు 2026 జనవరి 16న సుప్రీంకోర్టుకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌పై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన స్పీకర్.. తాజాగా కడియం, దానంలకు అనర్హత వర్తించదని పేర్కొంటూ పిటిషన్లు డిస్మిస్ చేశారు. -
లావు శ్రీకృష్ణ దేవరాయలకు కేటీఆర్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడి 13 ఏళ్లు అయిందని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ, ఆంధ్ర బాగుండాలని కోరుకుంటున్నామని చెప్పారు. ‘మా తమ్ముడు కృష్ణ దేవరాయలు మంచిగా మాట్లాడాలని కోరుతున్నా. తెలంగాణపై ఏడుపు బంద్ చేయాలి’ అని అన్నారు. కాగా, లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంపై లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. 2014 ఫిబ్రవరి 14ను బ్లాక్ డేగా అనడంతో తెలంగాణ నేతలు మండిపడుతున్నారు.శ్రీహరికి కేసీఆర్ ఏం తక్కువ చేశారు?తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ఆరోపణలపై కేటీఆర్ మాట్లాడుతూ.. ‘దేశ చరిత్రలో ఏ స్పీకర్ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. పార్టీ ఫిరాయింపులను స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీనే. 2004లో పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎత్తుకుపోయింది. కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎం, ఎంపీ, ఎమ్మెల్సీని చేశారు కేసీఆర్. ఆయన బిడ్డకు ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. కడియం శ్రీహరికి కేసీఆర్ ఏం తక్కువ చేశారు? కడియం శ్రీహరి బుద్ధి ఉండి మాట్లాడుతున్నారా? స్పీకర్ కార్యాలయం ఆర్డర్ కాపీ ఇవ్వడానికి భయపడుతోంది. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ అద్భుతంగా పని చేసి ఉంటే ఎన్నికలకు వెళ్లడానికి ఎందుకు భయం? రాహుల్ గాంధీ ఎలా చెప్తే అలా స్పీకర్ నడుస్తున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంచివారే, ఆయనపై మాకు గౌరవం ఉంది. రాహుల్ గాంధీకి పార్టీ ఫిరాయింపులపై స్పందించాలి. కడియం శ్రీహరి థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడుతున్నారు’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బాబును సీఎంగానే భరించకపోతున్నాం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దేశానికి ఉప ప్రధాని అవుతారని ఎల్లో మీడియా చేస్తున్న హడావుడిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం. ఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఎలా భరిస్తారు? అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఈరోజు తాడేపల్లిలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తూ.. రాబోయే రోజుల్లో చంద్రబాబు దేశానికి ఉప ప్రధాని కాబోతున్నారని ఎల్లో మీడియాతో వార్తలు వినిపిస్తున్నాయని అన్నారు. దీనికి వైఎస్ జగన్ బదులిస్తూ.. చంద్రబాబును ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం. ఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఎలా భరిస్తారు? అని అన్నారు.ఇక, అంతకుముందు.. ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైఎస్సార్సీపీ సభ్యులు 11 మందే ఉన్నా 1100 మందిలా మాట్లాడుతున్నారని మరో మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. వైఎస్ జగన్ స్పందిస్తూ.. మా పార్టీ ప్రతినిధులు అంత నిబద్ధతతో ఉన్నారని బదులిచ్చారు. అది మంచి విషమమేనని చెప్పుకొచ్చారు. -
బీఆర్ నాయుడు, జనసేన శ్రీధర్‌పై చర్యలేవి?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మహిళలపై దాడులు, అఘాయిత్యాలు చేసిన వారి తాట తీస్తామని చంద్రబాబు చెప్పారు.. మరి ఎంత మందిపై యాక్షన్ తీస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. మహిళలపై దారుణాలపై పాల్పడ మీ ఎమ్మెల్యేలపై చర్యలేవి? అని నిలదీశారు. వీడియోలతో అడ్డంగా దొరికిన టీటీడీ చైర్మన్‌పై చర్యలేవి?. మంత్రులు, ఎమ్మెల్యేలు కాదు, కనీసం పీఏలు తప్పులు చేసినా చర్యలు తీసుకోవడం లేదన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘కళ్లార్పకుండా అబద్దాలు చెప్పడంతో చంద్రబాబు దిట్ట. తాను ఇచ్చిన హామీలు అమలు చేయకుండానే ప్రతి జంట కనీసం ముగ్గురు, నలుగురు పిల్లల్ని చంద్రబాబు కనమంటున్నాడు. పెళ్లిచేసుకున్న ప్రతి జంటకూ చంద్రన్నపెళ్లికానుక కింద రూ. లక్ష ఇస్తానంటూ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడు. ఇప్పటివరకూ ఒక్క జంటకూ ఒక్కరూపాయి ఇచ్చింది లేదు. కానీ, మూడో బిడ్డను కంటే డబ్బులు ఇస్తాడంట. చంద్రబాబు మాటలను ఎవరైనా నమ్ముతారా? ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ కాదా?. మహిళల జోలికి వస్తే, తాటతీస్తానని చంద్రబాబుగారు డైలాగులు మీద డైలాగులు చెప్తున్నారు. మహిళలపై దారుణాలకు పాల్పడ్డ తన పార్టీకి చెందిన వారిపై ఎంతమంది మీద చర్యలు తీసుకున్నాడు. మహిళలపై దారుణాలపై పాల్పడ మీ ఎమ్మెల్యేలపై చర్చలేవి?’ అని ప్రశ్నించారు.లిస్ట్ ఇదే.. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నాడు?KGBV మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌మీద చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు?మహిళలతో అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌మీద ఏం చర్యలు తీసుకున్నారు?టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడితే, ఈ చంద్రబాబుగారు ఏం చర్యలు తీసుకున్నారు?మంత్రి సంధ్యారాణి పీఏ మీద చంద్రబాబుగారు ఏం చర్యలు తీసుకున్నారు?. బాధితురాలి మీదే తప్పుడు కేసుపెట్టి జైలుకు పంపారు.ప్రస్తుత టీటీడీ ఛైర్మన్, ఒక మహిళను మోసంచేసి, వీడియో, ఫొటోలతో అడ్డంగా దొరికిపోయారు, అయినా చంద్రబాబు ఏం చేశాడు.తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వొద్దని, విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలు నేరుగా చంద్రబాబుకు లేఖ రాసింది.దేవుడి పట్ల భయం, భక్తి, నిష్ట కలిగినవారే, టీటీడీ ఛైర్మన్ లాంటి పోస్టులో పెట్టాలని తెలిసి కూడా చంద్రబాబునాయుడు.. బీఆర్ నాయుడికే అప్పగించాడు. దేవుడి గురించి, పవిత్రత గురించి, ఆడవాళ్ల గురించి, వారి రక్షణ గురించా వీరు మాట్లాడేది? వీళ్లకి అసలు ఆ అర్హత ఉందా. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు శ్రద్దలేదు. తిరుపతి, సింహాచలం, పలాసలో భక్తులు చనిపోయినా ఏం చర్యలు తీసుకున్నారు. కదిరి రథోత్సవంలో భక్తులు గాయపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగిందన్నారు. బాబు పాలనలో పాలు తాగినా, నీళ్లు తాగినా చావే.. రెండేళ్లలో అక్కచెల్లెమ్మలకు చంద్రబాబు గజం స్థలం ఇచ్చారా? పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. మా హయాంలో అక్కచెల్లమ్మలకు 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాం. బాబు పాలనలో పాలు తాగినా, నీళ్లు తాగినా చనిపోతున్నారు. స్కూల్స్, హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం పెట్టడం లేదు. కలుషిత ఆహారం తిని విద్యార్థులు చనిపోతున్నారు. ప్రభుత్వం ఆసుపత్రుల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లీనిక్‌లను రద్దు చేశారు. పది లక్షల మంది ప్రభుత్వ స్కూల్స్ నుంచి వెళ్లిపోయారు. ప్రభుత్వ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియం గాలికెగిరిపోయింది. కళ్లార్పకుండా అబద్దాలు చెప్పడంతో చంద్రబాబు దిట్ట. చంద్రన్న పెళ్లి కానుక ఏమైంది?. పెళ్లి కానుక గురించి మాట్లాడరు. ముగ్గురు, నలుగురు పిల్లలను కనాలట!. మహిళలపై దారుణాలపై పాల్పడ మీ ఎమ్మెల్యేలపై చర్చలేవి? అని ప్రశ్నించారు.లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం.. పది లక్షల ఇళ్లు పూర్తి అయ్యాయి. వివిధ దశల్లో ఉన్న మిగతా ఇళ్లకు నిధులు కేటాయించడం లేదు. చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. సచివాలయాలు ఏర్పాటు చేసి రీసర్వేలు మేము మొదలుపెట్టాం. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ ఎక్కడ?. ఉద్యోగులకు పెండింగ్ డీఏలు ఎప్పుడు ఇస్తారు? అని ప్రశ్నించారు. ఓఆర్ఐ, పాస్‌బుక్ క్యూఆర్ కోడ్ భూమలు జియో ట్యాగింగ్ తెచ్చింది మేమే. సచివాలయాలతో డిజిటల్ అసిస్టెంట్ వ్యవస్థను బలోపేతం చేశాం. గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగులను వేధిస్తున్నారు’ అని మండిపడ్డారు. -
బాబు, లోకేష్ కోసం పవన్ జాకీలు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అసెంబ్లీ సమావేశాల్లో తప్పులు లెక్కలు, సెల్ప్ డబ్బాలేనని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. ఒకరిని మరొకరు జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై అసెంబ్లీ ప్రస్తావన ఏదీ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం.. ఇటు విద్యార్థులను, అటు రైతులను మోసం చేస్తోందన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీలో 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు ఒరిగింది సున్నా. అసెంబ్లీ సమావేశాల్లో తప్పులు లెక్కలు, సెల్ప్ డబ్బాలే. చంద్రబాబు తన కుమారుడికి జాకీలు వేసుకోవడమే సరిపోయింది. లోకేష్.. చంద్రబాబు కోసం జాకీలు వేశారు. చంద్రబాబు, లోకేష్ కోసం పవన్ కల్యాణ్ జాకీలు లేపే ప్రయత్నం చేశారు. అంతేకానీ, ప్రజలకు చేసిందేమీ లేదు. మీరు ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో ప్రస్తావనే లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రతీ నిరుద్యోగికి రూ.1.08 లక్షలు బకాయి పడ్డారు. నిరుద్యోగ భృతి అడుగుతుంటే సమాధానం లేదు. 18 ఏళ్లు నిండిన 60 ఏళ్ల లోపు మహిళలకు ఆడబిడ్డ నిధి కింద రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు 4000 పెన్షన్ ఇస్తామన్నారు.. హామీ అమలు చేశారా?.ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు?60 ఏళ్ల లోపు మహిళలకు మా ప్రభుత్వ హయాంలో 66,34,372 మందికి పెన్షన్లు ఇచ్చాం. కూటమి ప్రభుత్వంలో 2026 ఫిబ్రవరి నాటికి 60,96,108 మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చారు. ఒక్క నెలలోనే 25వేల పెన్షన్లు కట్ చేశారు. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. పెన్షన్ల కింద బడ్జెట్లో పెట్టాల్సింది రూ.31,554 కోట్లు అయితే బడ్జెట్ కేటాయించింది రూ.27,719 కోట్లు మాత్రమే. భవిష్యత్‌లో ఇంకా పెన్షన్లు కట్ చేసే అవకాశం ఉంది. పెన్షన్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం లేదు. మా ప్రభుత్వంలో యూడీఐఎస్‌సీ ప్రకారం 87,41,885 మందికి అమ్మఒడి ఇచ్చాం. కానీ, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తల్లికి వందనం పేరుతో 20 లక్షల మంది పిల్లలను తొలగించారు. తల్లికి వందనం కింద ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు?. ఏ ఒక్కరికి రూ.15000 ఇవ్వలేదు.అన్నదాత సుఖీభవ పేరుతో మోసం.. ఉచిత బస్సు హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేకపోయారు. షరతులు పెట్టారు. ప్రతీ మహిళకు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. తొలి ఏడాది ఒక సిలిండర్ ఇచ్చి.. మిగతా రెండు ఎగ్గొట్టారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులను మోసం చేశారు. రెండేళ్లలో ప్రతీ రైతుకు రూ.40వేలకు గాను పదివేలే ఇచ్చారు. అన్నదాత సుఖీభవ నుంచి 7 లక్షల మంది రైతులను తొలగించారు. కౌలు రైతుల ప్రస్తావనే లేదు. ఉచిత పంటల బీమాను చంద్రబాబు రద్దు చేశారు. మోంథా తుపాను కారణంగా నష్టపోయిన లక్షల మంది రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటికీ ఇవ్వలేదు. ఒక్క రూపాయి కూడా రైతులకు చెల్లించలేదు. ఎప్పుడు ఇస్తారో వ్యవసాయశాఖ మంత్రైనా, ముఖ్యమంత్రి అయినా చెప్పారా?. ధరల స్థిరీకరణ నిధి కోసం రూ.300 కోట్లే కేటాయించడం ఏంటని శాసనమండలిలో మా సభ్యులు అడిగితే మంత్రులు ఎదురుదాడి చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏయే పంటలు ఎంత ఖర్చుచేసి కొన్నామో సమగ్రమైన వివరాలను ప్రభుత్వానికి మా సభ్యులు చైర్మన్ ద్వారా ఇచ్చారు. ధరల స్థిరీకరణ నిధికి కేటాయింపులు పెంచి రైతులను ఆదుకోవాలన్న స్పృహ వారికి లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ మిర్చి, శనగ, మొక్కజొన్న, అరటి పంటలకు ధరలు పడిపోయాయి. నెలరోజుల క్రితం రూ.26వేలు ఉన్న క్వింటా మిర్చి ధర, ఇప్పుడు రూ.18వేలకు తగ్గింది.ఆదుకోకుండా.. ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపం.. శనగ ఎంఎస్పీ రూ.5,875 అయితే రైతులు రూ.5000లోపే అమ్ముకుంటున్నారు. మొక్కజొన్న MSP రూ.2,400 అయితే రైతులకు రూ.1400 నుంచి రూ. 1,500 కూడా దక్కని పరిస్థితి. ఒక్క మొక్కజొన్న విషయంలోనే రైతులు రూ.3,500 కోట్లు నష్టపోతున్నారు. అరటి మళ్లీ టన్ను రూ.5వేలకు పడిపోయింది. మా హయాంలో అరటి టన్ను రూ.30వేలకు అమ్ముకున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో దళారులకు వణుకు పుట్టించేవాళ్లం. రైతులకు భరోసా ఇవ్వాల్సింది పోయి ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు, రైతు కూలీల కుటుంబాలకు ఎప్పుడు పరిహారం ఇస్తారో చెప్పలేదు. వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభం గురించి, రైతుల కష్టాల గురించి చర్చించడం, మాట్లాడ్డం మచ్చుకైనా మాట్లాడలేదు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. -
చంద్రబాబు పాలనంతా ఆర్థిక విధ్వంసమే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు పాలనంతా ఆర్థిక విధ్వంసమేనని ఆరోపించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్టు కాగ్ రిపోర్టు చెప్పిందన్నారు. చంద్రబాబు హయాంలో రాబడులు తగ్గాయన్నారు. రాష్ట్ర ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగాయని తెలిపారు. చంద్రబాబు ప్రతీసారి ఎన్బీసీని చంద్రబాబు ఉల్లంఘిస్తూనే ఉన్నారని క్లారిటీ ఇచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా?. బడ్జెట్లో మోసాలు కల్పిత లెక్కలు మాత్రమే కనిపించాయి. కూటమి ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్టు కాగ్ రిపోర్టు చెప్పింది. నేను చెప్పిన విషయాలనే కాగ్ రిపోర్టు చెప్పింది. 2023-24లో ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు 2,36,486 కోట్లు. 2023-24లో రాబడులు రూ.1,70,767 కోట్లు. 2023-24లో రెవెన్యూ లోటు రూ.32,680 కోట్లు. ద్రవ్యలోటు రూ.62,719 కోట్లు. చంద్రబాబు వచ్చాక తొలి ఏడాది ఖర్చు రూ.2,49,096 కోట్లు. చంద్రబాబు ప్రభుత్వంలో రాబడులు 1,68,024 కోట్లు మాత్రమే. చంద్రబాబు హయాంలో రెవెన్యూ లోటు రూ.60,285 కోట్లు.అప్పుల్లోనూ ఉల్లంఘనలే.. చంద్రబాబు హయాంలో రాబడులు తగ్గాయి. రాష్ట్ర ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగాయి. చంద్రబాబు వచ్చాక రెవెన్యూ లోటు 56 శాతం పెరిగింది. కూటమి వచ్చాక ద్రవ్య లోటు 32.5 శాతం పెరిగింది. చంద్రబాబు పాలనంతా ఆర్థిక విధ్వంసమే. 2024-25లో జీఎస్డీపీలో అప్పుల శాతం 5.89 శాతం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పుల శాతం 4.1 శాతమ మాత్రమే. మేము తూచా తప్పకుండా మేనిఫెస్టోను అమలు చేశాం. కోవిడ్ పరిస్థితులను ఎదుర్కొన్నాం. అయినా అప్పులు 4.1 శాతం మాత్రమే చేశాం. ఎన్బీసీకి లోబడే ఎవరైనా అప్పులు తీసుకోవాలి. చంద్రబాబు ప్రతీసారి ఎన్బీసీని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. 2014-19 మధ్య అనుమతించిన దాని కన్నా అధికంగా అప్పులు చేశారు. చంద్రబాబు రూ.29,099 కోట్లు అధికంగా అప్పులు చేశారు. మా హయాంలో పరిమితి కన్నా తక్కువగా అప్పులు చేశాం. రూ.12,708 కోట్లు తక్కువగా అప్పులు చేశాం. కరోనా పరిస్థితులు కూడా తక్కువగానే అప్పులు చేశాం. చంద్రబాబు రాగానే మళ్లీ సీన్ రివర్స్ అయ్యింది. 2024-25లో పరిమితికి మించి 17,953 కోట్లు అధిక అప్పులు. 20 నెలల్లో బాబు తెచ్చిన అప్పులు 3.20 లక్షల కోట్లు దాటాయి. మేము ఐదేళ్ల కాలంలో రూ.3 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశాం. మేము ఐదేళ్లలో చేసిన అప్పు.. బాబు రెండేళ్లలోనే చేశారు. ఏపీని దోచుకుంటున్నారు కాబట్టే ఆదాయం పెరగడం లేదు.కేంద్రానికి లేఖ రాస్తాం..బినామీలు, ఎల్లో మీడియా సహచరులు దోచుకుంటున్నారు. విశాఖలో రూ.5000 కోట్ల విలువైన భూమిని దోచిపెట్టారు. చంద్రబాబు సమీప బంధువుకు భూములు కట్టబెట్టారు. ఇలా దోచిపెడుతుంటే రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుంది?. రాష్ట్ర ఖజానాలో మినిమమ్ బ్యాలెన్స్ కూడా లేదు. చంద్రబాబు పాలన చేయడం లేదు.. బిల్డప్ మాత్రమే. 2024-25 కాగ్ రిపోర్టు ప్రకారం అప్పు రూ.81,082 కోట్లు. అసెంబ్లీ సాక్షిగా రూ.60,485 కోట్లు అని బాబు తప్పుడు సమాచారం ఇచ్చారు. చంద్రబాబు తప్పుడు సమాచారంపై కేంద్రానికి లేఖ రాస్తాం. డీవోపీటీకి, కేబినెట్, ఫైనాన్స్ సెక్రటరీలకు లేఖ రాస్తాం' అని అన్నారు. -
స్పీకర్ తీర్పుపై కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీ-ఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికి క్లీన్చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడమే అంటూ ఘాటు విమర్శలు చేశారు.తెలంగాణ స్పీకర గడ్డం ప్రసాద్ తీర్పుపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ క్లీన్చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి. కాంగ్రెస్ పార్టీ బీ-ఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికి క్లీన్చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడమే అవుతుంది. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు.ఇది కేవలం ఒక తీర్పు మాత్రమే కాదు.. అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించే ఉదాహరణ. ప్రజల ఓట్లతో గెలిచి.. పదవులను వ్యక్తిగత లాభాల కోసం మార్చుకుంటే, స్పీకర్ దానికి ముద్ర వేస్తే ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ నిలుస్తాయి?. ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సరైన సమయంలో సమాధానం చెబుతారు అంటూ పోస్టు చేశారు. పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి లకు స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి.కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడం.పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్…— KTR (@KTRBRS) March 11, 2026ఇది కూడా చదవండి: తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు.. -
దానం, కడియంకు ఊరట.. స్పీకర్ సంచలన తీర్పు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన తీర్పు వెల్లడించారు. రాజకీయ ఉత్కంఠకు తెరదించుతూ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు క్లీన్ చిట్ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక తీర్పు వెల్లడించారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలు పార్టీ మారారు అనడానికి సరైన ఆధారాలు లేవని స్పీకర్ ప్రకటించారు. అనంతరం, ఇద్దరిపై వేసిన రెండు పిటిషన్లకు డిస్మిస్ చేశారు. దీంతో ఇప్పటివరకు పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇంతటితో స్పీకర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుకు తెరపడింది. కాగా, పార్టీ ఫిరాయింపుల కేసులో ఇప్పటికే ఈ కేసులో ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రేపటి వరకు ఫిరాయింపు కేసులో ఏదో ఒకటి తేల్చాలని గతంలో సుప్రీంకోర్టు గడువు విధించింది. సుప్రీంకోర్టు డెడ్ లైన్ నేపథ్యంలో నేడు స్పీకర్ తీర్పును వెల్లడించారు. మరోవైపు.. తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి.. స్పీకర్‌కు చెప్పుడం కొసమెరుపు. ఈ నేపథ్యంలో స్పీకర్ తీర్పుపై పిటిషనర్లు మరోసారి కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇక, స్పీకర్ తీరుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందిస్తూ..‘స్పీకర్ తీర్పును స్వాగతిస్తున్నాను. పార్టీ ఫిరాయిస్తే షోకాజ్ నోటీసులు ఇవ్వాలి. కానీ, నాకు పార్టీ షోకాజ్ నోటీసులు ఇవ్వలేదు’ అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ..‘స్పీకర్ పరిధిలో నేను ఏ తప్పూ చేయలేదు. కేసీఆర్ అంటే అపారమైన గౌరవం ఉంది. నన్ను కేసీఆర్ ప్రశ్నించాలి. కౌశిక్ రెడ్డికి ఏం సంబంధం?. అసెంబ్లీలో బీఆర్ఎస్ నాకు ఎలాంటి విప్ జారీ చేయలేదు. కేసీఆర్ నన్ను వివరణ అడగలేదు. నేను బీఆర్ఎస్ మెంబర్షిప్ వదులుకోలేదు.. ఎక్కడా తీసుకోలేదు అని వ్యాఖ్యలు చేశారు. -
ఆరు గ్యారంటీల చట్టబద్ధతకు ప్రైవేట్ బిల్లు : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలకు మొదటి కేబినెట్ సమావేశంలోనే చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావొ స్తున్నా అమలు చేయడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టేందుకు సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రవేశపెట్టే ప్రైవేట్ మెంబరు బిల్లుకు అధికార పార్టీ మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగర శివారులోని గోల్కొండ రిసార్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంయుక్తంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమం ముగిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న మూడో వార్షిక బడ్జెట్‌కు అత్యంత ప్రాధాన్యం ఉంది. ప్రభుత్వ పదవీకాలం సగం పూర్తయినా హామీల అమలు జరగడం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హామీల వైఫల్యం, మోసాన్ని ఎండగట్టేందుకు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాం. రెండేళ్లుగా అసెంబ్లీ కమిటీలు లేకుండానే ప్రభుత్వం సమావేశాలను బలవంతంగా నడిపిస్తోంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని మా పార్టీకి ద్రోహం చేసి వెళ్లిన వ్యక్తికి ఇచ్చారు. సెలెక్ట్, స్టాండింగ్, పిటిషన్స్ తదితర 14 అసెంబ్లీ కమిటీలు పెండింగ్‌లో ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్, చీఫ్‌విప్ లాంటి పదవులు భర్తీ చేయకుండా మందబలంలో బుల్డోజర్ టాక్టిక్స్‌ను ప్రభుత్వం ప్రయోగిస్తోంది. అసెంబ్లీ ఉభయ సభల్లో అబద్ధాలు, అసత్యాలతో అంకెలను తారుమారు చేస్తూ తూతూమంత్రంగా సమావే శాలు నిర్వహిస్తోంది’అని కేటీఆర్ మండిపడ్డారు. అసెంబ్లీలో కాంగ్రెస్‌ను నిలదీసేందుకే.. ‘ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి అసెంబ్లీలో నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలంగా నిలదీయడానికే అవగాహన సమావేశాలు బీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. రైతుబంధు, ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేత, మూసీ బాధితులు తదితర అంశాలతోపాటు ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అసెంబ్లీలో ప్రభుత్వం చేస్తున్న అంకెల గారడీని, లేని అప్పులను ఉన్నవిగా చూపిస్తున్న కాంగ్రెస్ అబద్ధాలను అంకెలతో సహా ఎండగడతాం. భవిష్యత్‌లోనూ బీఆర్ఎస్ శాసన మండలి, శాసనసభ సభ్యుల నడుమ మా పార్టీ సమన్వయం కోసం మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆరు గ్యారంటీలు, హామీల అమలుకు నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం మూసీ ప్రక్షాళన పేరిట భారీ అవినీతికి తెరలేపింది. మేము సుందరీకరణకు కాకుండా దాని పేరిట జరుగుతున్న అవినీతిని వ్యతిరేకిస్తున్నాం. ఢిల్లీకి నిధులు పంపేందుకే రేవంత్‌రెడ్డి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును చేపడుతున్నాడు. రేవంత్‌రెడ్డి చెబుతున్న మాటలకు ఎంత మాత్రం విలువ లేదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పట్టపగలు నాశనం చేసిన సీఎం ‘నైట్ ఎకానమీ’గురించి మాట్లాడుతున్నాడు. రేవంత్‌రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ఒక్క ఇళ్లు కట్టినా నేను రాజీనామా చేస్తాను అని చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఇళ్లు, ఫైఓవర్లు, ప్రాజెక్టులకు రంగులు పూసి రేవంత్ తమ ఘనతగా చెప్పుకుంటున్నాడు’అని కేటీఆర్ విమర్శించారు. ముగిసిన అవగాహన కార్యక్రమం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఎస్.మధుసూదనాచారి తదితరులు ప్రసంగించారు. పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డి వివిధ అంశాలపై ప్రసంగించారు. -
‘కూటమి నేతల తీరు ఆకతాయితనంగా ఉంది’
రాజమహేంద్రవరం : కల్తీ పాల ఘటన బాధితుల గురించి కూటమి నేతలు పట్టించుకునే స్థితిలో లేరని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. కూటమి నేతలకు నాటకాలు వేయడానికి టైం ఉంది.. కానీ కల్తీ పాల బాధితుల గురించి పట్టించుకునే టైం లేదా అని ప్రశ్నించారు. ఈరోజు(మంగళవాం, మార్చి 10వ తేదీ) రాజమహేంద్రవరం ఆసుపత్రిలో కల్తీ పాల బాధితులను పరామర్శించారు మాజీ ఎంపీ మార్గాని భరత్.రాజమండ్రిలో కూటమి నేతల తీరు ఆకతాయితనంగా ఉంది. నాటకాలు వేయడానికి టైం ఉంది కానీ... చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మంత్రి సత్య కుమార్‌లకు కల్తీ పాల బాధితుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదా?, దీన్నో యాక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. బాధితుల శాంపిళ్ళు నేషనల్ ఫోరెన్సిక్ లేబరేటరీకి ఎందుకు పంపలేదు. ఈ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించాలి. అప్పుడే నిజానిజాలు వెల్లడవుతాయి. పోలీసులు అన్ని రకాలుగా దర్యాప్తు జరపాలి. 160 లీటర్ల పాలు తీసుకొస్తే 20 కుటుంబాలు మాత్రమే ఎందుకు ఎఫెక్ట్ అయ్యాయి. పాలలో యూరియా కలిసిందా... ఫార్మాలిన్ కలిసిందా... గిట్టని వాళ్లు ఏమైనా పురుగుల మందు కలిపారా... అన్న విషయాలు ఇప్పటివరకు స్పష్టం కాలేదు. బాధితు కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ ఘటనలు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ మిల్క్ ప్రొక్యూర్ మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. ఆ చట్టాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు. చిన్నారులు సైతం మృతువుతో పోరాడుతున్నారు. మీ కుటుంబంలోనే ఇటువంటి ఘటనలు జరిగితే ఇలాగే ప్రవర్తిస్తారా?, పురుగుల మందు తీసుకుని ఎలా తీవ్ర అనారోగ్యం ఎదుర్కొంటారో అటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ల్యాబ్ నుంచి రిపోర్టు రావడానికి వారాలు ఎందుకు పడుతుంది.ప్రభుత్వం హైడ్రామా ఆడుతోంది.ఈ ఘటన జరిగిన తర్వాత హెరిటేజ్ అడ్వర్టైజ్మెంట్లు విపరీతంగా పెంచింది. ఈ ఘటనను కూడా వ్యాపారం కోసం వాడుకుంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కల్తీయే. బాధిత కుటుంబాలకు 25 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలి’ అని డిమాండ్ చేశారు. -
‘టీటీడీని చంద్రబాబు రాజకీయ వేదికగా వాడుకుంటున్నారు’
నెల్లూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల ప్రాశస్త్యం మసకబారిందన్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి. టీటీడీనే స్వయంగా చంద్రబాబే రాజకీయ వేదికా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. గో శాల, లడ్డూ, బిఆర్ నాయుడు రాసలీలు అనేక సంఘటనలు చూశాం. పరకామణీ కేసులో పెంచులయ్య 2025లో పట్టుబడ్డాడు. అతనికి బెయిల్ కూడా మంజీరా చేశారు. అదే రకమైన కేసులో రవి కుమార్ అనే నిందితుడు ఆస్తులు శ్రీవారికి రాసి ఇచ్చారు. కేసు నమోదు చేసి లోకాదలత్కు వెళ్ళింది.. పరకామణీ చోరి కేసులో కూటమి అధికారంలోకి వచ్చాక కేసును నీరు గార్చే ప్రయత్నాలు జరిగాయి. పెంచులయ్య ఎంత బంగారు చోరి చేశాడో అసలు నిజాలు బయటపెట్టలేదు. 2024 చివరిలో పెంచులయ్య చోరి చేస్తే బయటకు పొక్కకుండా చూశారు. పెంచులయ్య వెనుక ఎవరు వున్నారు. అసలు భద్రతా వ్యవస్థ పనిచేస్తుందా.. భద్రతా వైఫల్యం క్లియర్ గా కనబడుతుంది. శ్రీవారి పరకామణీలో చోరీ చేసిన నగలు కార్పొరేట్ దుకాణాల్లో మార్పిడి జరిగింది. మరీ వింతగా బ్యాంకులో శ్రీవారి నగలతో రుణాలు కూడా పొందారు.ఈ చోరీ వెనుక వున్న వారిని ఎవ్వరినీ విచారించిన పాపాన పోలేదు’ అని విమర్శించారు కాకాణి. -
కబ్జాలకు చరమ‘గీతం’ పాడండి
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ ఎంపీ భరత్‌కు చెందిన గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణలపై జనాగ్రహం కట్టలు తెంచుకుంది. దురాక్రమణకు తెగబడిన ప్రభుత్వం గీతం వర్సిటీ నుంచి భూములను వెనక్కి తీసుకోవాల్సిందేనంటూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రజలు విశాఖపట్నం కలెక్టరేట్‌కు భారీగా పోటెత్తారు. టీడీపీ ఎంపీ భరత్ దురాగతాలపై గళమెత్తారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి జీవో రాకముందే రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిలో లెవెలింగ్ పనులు చేపట్టిన వర్సిటీ యాజమాన్యంపై ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ అండతోనే ఎంపీ భరత్ చెలరేగిపోతున్నారని మండిపడ్డారు. తక్షణం భూములు వెనక్కి తీసుకోవాలని భారీగా గ్రీవెన్స్‌కు ఫిర్యాదులు తీసుకొచ్చారు. దీంతో కౌంటర్లు కిక్కిరిసిపోయాయి. ఏం చేయాలో పాలుపోని అధికారులు కంప్యూటర్లు పనిచేయడం లేదంటూ మీనమేషాలు లెక్కించారు. పోలీసులు ప్రజలపై జులుం ప్రదర్శించేందుకు యత్నించారు. దీంతో అధికారుల తీరుకు నిరసనగా ప్రజలు ఒక్కసారిగా నినాదాలు చేశారు. కలెక్టరేట్ ముందు వైఎస్సార్సీపీ నేతలతో కలిసి బైఠాయించారు. ఫలితంగా జన నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఒకానొక దశలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫిర్యాదులు తీసుకోవాల్సిందేనని వైఎస్సార్సీపీ నేతలు అధికారులను నిలదీశారు. దీంతో దిగొచ్చిన అధికారులు ఎట్టకేలకు 200 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భరత్‌పై ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదు చేయాలి : కేకే రాజు ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్ అండతోనే విశాఖ టీడీపీ ఎంపీ భరత్ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నాడని విమర్శించారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి జీవో రాకముందే రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసి లెవెలింగ్ పనులు చేపడుతున్న భరత్‌పై ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాఖ జిల్లాలో జరిగిన భూ ఆక్రమణలపై చర్యలు తీసుకుని సుమారు 2 వేల ఎకరాల భూమిని సంరక్షించిందని గుర్తుచేశారు. ఇందులో భాగంగా గీతం ఆక్రమించిన రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాలకు పైగా భూమిని అప్పట్లో స్వాధీనం చేసుకుని అందులో ప్రభుత్వ భూమి అని బోర్డులు ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఇంకా 14 ఎకరాలకుపైగా భూమిపై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని, తుది తీర్పు వచ్చే వరకు ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని కోర్టు స్టేటస్ కో ఇచ్చిందని వివరించారు. అయినప్పటికీ అధికారుల అండతో బోర్డులు పీకేసీ గీతం యాజమాన్యం లెవెలింగ్ పనులు చేపట్టడం ఏమిటని కేకే రాజు మండిపడ్డారు. బోర్డులు తొలగించిన గీతం యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తప్పు తెలుసుకుని భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేయాల్సిన ఎంపీ.. తమ తాతల కాలం నుంచి ఆక్రమించామని, తమకు ఇచ్చేయాలని మీడియా ముందే నిస్సిగ్గుగా చెప్పడం గర్హనీయమన్నారు. గీతం భూకబ్జాపై కలెక్టరేట్లో గ్రీవెన్స్‌కు ప్రజలు భారీగా తరలివస్తే అధికారులు ఫిర్యాదులను స్వీకరించకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. పోలీసుజులుం ద్వారా తమ పోరాటాన్ని అణిచివేయాలని యత్నిస్తున్నారని కేకే రాజు మండిపడ్డారు. గీతం భూకబ్జాపై ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. గీతం యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు టీడీపీ కూటమి నాయకులకు బానిసలు కాదని ఆయన ధ్వజమెత్తారు. భూములను పరిరక్షించాలి : వాసుపల్లి గణేశ్మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ... టీడీపీ నాయకుల అవినీతి కేంద్రానికి మాయని మచ్చగా మిగులుతుందని హెచ్చరించారు. తక్షణం ఎంపీ భరత్‌ను జైల్లో పెట్టి ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గాల సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, దేవాన్‌రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. -
75 శాతం ఆస్తులు దానం చేసిన చరిత్ర మాది
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి రెవెన్యూ వ్యవహారాలపై అవగాహన ఇంతేనా అని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నిం చారు. సోమవారం డోన్ నియోజకవర్గంలో నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలకు బుగ్గన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సభలో ఒక అర్జీదారుడు రెండేళ్లుగా పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా తనకు న్యాయం జరగలేదని చెప్పిన విషయాన్ని సీఎం రాజకీయంగా మలచడం సరైంది కాదని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. అది ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్న వ్యక్తిగత సమస్య కావడంతో అధికారులు దానిని పరిష్కరించలేకపోయారని తెలిపారు. నిజంగా అర్జీదారుకు న్యాయం చేయాలనే ఉద్దేశం ఉంటే సంబంధిత విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు అప్పగించి నిజ నిర్ధారణ చేయాలని సూచించాలని పేర్కొన్నారు.ప్రతి విషయాన్ని రాజకీయంగా మార్చడం ముఖ్యమంత్రి స్థాయి నాయకుడికి తగదని వ్యాఖ్యానించారు. తమ కుటుంబానికి, తమ అనుచరులకు ఇతరుల ఆస్తులపై ఎలాంటి ఆశలూ, ఆపేక్ష లేవని స్పష్టం చేశారు. వందేళ్ల క్రితం నుంచి తమ కుటుంబం ఏ ఇంట్లో నివసిస్తుందో ఈ రోజుకీ అదే ఇంట్లో ఉంటున్నామని చెప్పారు. తమ కుటుంబం వద్ద ఉన్న ఆస్తుల్లో 75 శాతం దానం చేసిన చరిత్ర ఉందని బుగ్గన పేర్కొన్నారు. తాము దానం చేసిన ఆస్తులను చూడాలంటే ఒక రోజు సమయం పడుతుందని, సమయం చూసుకుని వస్తే వ్యక్తిగతంగా చూపిస్తానని చెప్పారు.సభలో ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆర్డీవో ఆ భూమి అసైన్డ్ అని, అర్జీదారుడికి సంబంధం లేదని చెప్పినప్పటికీ ఆ విషయాన్ని బుల్డోజ్ చేసి సీఎం ఆరోపణలు గుప్పించారని విమర్శించారు. ఇది తిరుమల లడ్డూ వ్యవహారంలా ఉందని పేర్కొంటూ, అప్పట్లో ఈవో శ్యామలరావు వాస్తవాలు చెప్పినా వాటిని పట్టించుకోలేదని అన్నారు. అనంతరం సీబీఐ సిట్ కూడా శ్యామలరావు చెప్పినదే నిజమని తేలి్చందని గుర్తుచేశారు. వయస్సు, పదవికి తగిన విధంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు నాయుడికి బుగ్గన రాజేంద్రనాథ్ సూచించారు. అవాస్తవమైన, అన్యాయమైన ఆరోపణలు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. -
‘కూటమి పాలనలో అన్ని రంగాల్లో విధ్వంసమే’
తాడేపల్లి : కూటమి పాలనలో అన్ని రంగాల్లో విధ్వంసమే కనిపిస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు. ఏ రంగంలో చూసినా అంత విధ్వంసమేనన్నారు. ఈరోజు(సోమవారం, మార్చి 9వ తేదీ) తాడేపల్లి నుంచి మాట్లాడిన శైలజానాథ్.. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారన్నారు. ‘నిరుద్యోగుల జీవితాలను అన్యాయం చేశారు. వ్యవసాయ రంగాన్ని మరింత నాశనం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని మోసం చేశారు. PPP మోడ్ కింద ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వారికి అప్పనంగా ఇస్తున్నారు. కొన్ని జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీలను రుణాలు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు.. ఎస్సీ,ఎస్టీలకు వివిధ కార్పొరేషన్ల కింద ఇచ్చిన రుణాలను భేషరతుగా మాఫీ చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
కొత్తగా రాహుల్ బంధు పథకం తెచ్చారు..: కేటీఆర్
సిరిసిల్ల: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్తగా రాహుల్ బంధు పథకం తెచ్చాడంటూ ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతుబంధు పథఖం బంద్ చేసి.. కొత్తగా రాహుల్ బంధు పథకం తెచ్చిండు అంటూ సెటైర్లు వేశారు. సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయిలు రాహుల్ గాంధీకి పంపించడమే రాహుల్ బంధు పథకం అంటూ విమర్శించారు. ఈరోజు(సోమవారం, మార్చి 9వ తేదీ) మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లను సిరిసిల్లలో కేటీఆర్ ఘనంగా సన్మానించారు. దీనిలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో నాట్లు వేసే టైమ్‌లోన రైతుబంధు పడుతూ ఉండేదని, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు. ఇప్పటివరకూ ఎవరికైనా రైతుబంధు పడిందా? అంటూ అక్కడున్నవారిని ఉద్దేశించి ప్రశ్నించారు. సంవత్సరానికి వేయి కోట్లు కట్టి పదవి కాపాడుకుంటుండు. ఖమ్మం వెలుగుమట్లలో వెయ్యి ఇళ్లు కూల్చిండు.మహబూబ్‌నగర్‌లో దివ్యాంగుల ఇళ్ళు కూల్చారు. సీఎం సొంత ఇల్లు కొడంగల్ కోస్గిలో రెడ్డికుంటలో కట్టుకున్నాడు. రేవంత్ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు దుర్గం చెరువులో ఉంది. 6 గారంటీలు నూరు రోజుల్లో అమలు చేస్తా అన్నాడు.. వెయ్యి రోజులు కావస్తున్నా అమలు చేయలేదు. అనాడు మూడో పంటకు రైతుబంధు వేయాలన్నారు.. ఇవాళ మూడో నెల వచ్చినా రైతుబంధు వేయడంలేదు. ఆడపిల్ల పెళ్ళికి కళ్యాణ లక్ష్మీ కింద లక్ష రూపాయలతోపాటు తులం బంగారం ఇస్తా అన్నారు. పంట పంటకు బోనస్ ఇస్తా అన్నారు. అత్తలకు 4 వేలు కోడలు 2,500 ఇస్తా అన్నాడు ఇప్పటి వరకు ఇచ్చిండా..?’అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు కేటీఆర్. -
టీడీపీ ప్రభుత్వంలో ‘వైఎస్సార్సీపీ అంటే ఓట్లు తొలగింపే’
సాక్షి,తాడేపల్లి: 2019 ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం 40 లక్షల ఓట్లు తొలగించింది. మన ఓటర్లను మనమే కాపాడుకోవాలి. వారి ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాలని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.సోమవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బూత్ లెవల్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా, జోనల్ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ, నియోజకవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడారు. ‘ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడా పార్టీ ఓట్లు తొలగించకుండా జాగ్రత్త పడాలి. అవసరమైతే టాస్క్‌ఫోర్స్‌లా ఏర్పడి పని చేయాలి. ఈ విషయంలో బూత్ కమిటీలదే కీలకపాత్ర. 2019 ఎన్నికలకు మందు టీడీపీ ప్రభుత్వం 40 లక్షల ఓట్లు తొలగించింది. ఇంటింటికి వెళ్లి వైఎస్సార్సీపీ సానుభూతిపరులని తెలియగానే ఓట్లు తీసేశారు.దీనిపై అప్పట్లో మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. మన ఓటర్లను కాపాడుకోవాలి. వారి ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాలి.అందుకు అవసరమైతే టాస్క్‌ఫోర్స్ కూడా ఏర్పాటు చేసుకుందాం. బూత్ లెవెల్ పరిధిలో నాయకులను ఈ ప్రక్రియలో ప్రమేయం చేయాలి’ అని సూచించారు. -
‘చంద్రబాబు విజనరీ కాదు.. పాయిజనరీ’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. సూపర్ సిక్స్ పేరుతో మహా దగా చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. మహిళలను మోసం చేసి మహిళా దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారని ప్రశ్నించారు. ఈరోజు(సోమవారం, మార్చి 9వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన వరుదు కళ్యాణి.. చంద్రబాబు విజనరీ కాదు.. పాయిజనరీ అంటూ ధ్వజమెత్తారు.‘మూడు జనరేషన్లను ఛీట్ చేసిన వ్యక్తి చంద్రబాబు. మహిళలను వేధించిన ఎమ్మెల్యేలను పక్కన కూర్చోపెట్టుకుని మహిళా దినోత్సవం జరుపుకుంటారా?, మహిళా ద్రోహి పార్టీ టీడీపీ. జగన్ తెచ్చిన పథకాలను కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారు. ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు ఇప్పటికీ రాయితీలు ఇవ్వలేదు. డ్రాక్రా మహిళలకు సున్నా వడ్డీ డబ్బులే ఇవ్వకుండా వారిని కూడా పారిశ్రామిక వేత్తలను చేస్తానంటున్నారు. చంద్రబాబు పాలనలో డ్వాక్రా గ్రూపుల పరపతి తగ్గింది. బ్యాంకర్లు రుణాలను ఇవ్వటం తగ్గించారు. మరి పారిశ్రామిక వేత్తలను చేస్తానంటూ ఎలా మాట్లాడతారు?, జగన్ సున్నావడ్డీ కింద దాదాపు రూ.5 వేల కోట్లు మహిళలకు ఇచ్చారు. చంద్రబాబు వలన డ్వాక్రా గ్రూపులన్నీ నిర్వీర్యం అవుతున్నాయి. ఫ్రీ బస్, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలెండర్ పథకాలు ఎవరికిచ్చారు?, సగం మందికి కూడా ఇవ్వకుండా సక్సెస్ చేశామని ఎలా చెప్పుకుంటారు?, అసెంబ్లీలో, బయటా డ్రామా చేయడమే చంద్రబాబుకు తెలుసు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. అన్నీ చంద్రబాబేమంత్రులు, ఎమ్మెల్యేలు కేరక్టర్ ఆర్టిస్టులుగా మిగిలి పోయారు. చంద్రబాబు, వైఎస్ జగన్ పాలనకు నక్కకు, నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది. జగన్ అన్ని వర్గాల మహిళలకూ మేలు చేశారు. చంద్రబాబు అందరినీ నిలువునా మోసం చేశారు. మహిళా ద్రోహిగా చంద్రబాబు చరిత్రలో మిగిలిపోతారు. పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు మహిళలకు కనపడకుండా తిరుగుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై నిలదీస్తారని భయపడుతున్నారు. రాష్ట్రంలో రోజూ మహిళలపై లైంగిక దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?, కాల్ సెంటర్‌కు కాల్ చేసినా ఏపీ పోలీసులు స్పందించటం లేదని సాక్షాత్తూ కేంద్ర మంత్రి అమిత్‌షానే లెటర్ రాశారుదేశంలోనే అట్టడుగు స్థానంలోకి ఏపీ పోలీసు వ్యవస్థ వెళ్లిపోయింది. మహిళలు, చిన్నారులకు ఏపీలో అసలు రక్షణే లేదు. హోంమంత్రి అనిత సొంత నియోజకవర్గంలోనే గంజాయి, డ్రగ్స్ దొరుకుతున్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా గంజాయి పండించటం సిగ్గుచేటు. మహిళను వేధించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు?, లోకేష్ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త మహిళల ఫోటోలు తీస్తూ దొరికాడు. మహిళలు అర్ధరాత్రి వరకు ధర్నాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. చంద్రబాబు విజనరీ కాదు.. పాయిజనరీ. మూడు జనరేషన్లను ఛీట్ చేసిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని కనమంటూ ఉచిత సలహా ఇస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. -
‘ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్‌దా..?, ఓవైసీదా?’
హైదరాబాద్: తెలంగాణలో ప్రజాపాలన నడవడంలో లేదని, రజాకార్ పాలన నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ధ్వజమెత్తారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ నిర్ణయం తీసుకునే ముందు ఓవైసీ అనుమతిని సీఎం రేవంత్‌రెడ్డి తీసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ పరిపాలన ఓవైసీ చేతుల్లో ఉందా ? అంటూ ప్రశ్నించారు. ప్రజల కోసం కాదు…ఓవైసీ కోసం ప్రభుత్వం నడుస్తోందా ?’ అని నిలదీశారు. తెలంగాణలో ప్రభుత్వం ఎవరిది?, కాంగ్రెస్‌దా.. లేక ఓవైసీదా? అని ట్వీట్ చేశారు.❌Praja Palana✅ Razakar PalanaFor every decision, Revanth Reddy needs the permission of Owaisi.Such is the state of affairs in Congress-ruled Telangana. pic.twitter.com/pYMQHwFFxT— N Ramchander Rao (@N_RamchanderRao) March 9, 2026 ఓవైసీ పిలుపుతో వేల కోట్లు సమీకరిస్తామని అంటున్నారుతెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డాఉ. ‘ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు రోజుకొక లాగా మారుతున్నాయి. ఒకవైపు పేదలు, దళితులు, గిరిజనులకు భూమి లేదని చెబుతున్నారు. కానీ జర్నలిస్టులకు, మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు భూమి ఇస్తామని హామీ ఇస్తున్నారు. పెన్షన్లు క్లియర్ చేయడానికి ప్రభుత్వానికి డబ్బులు లేవని అంటున్నారు. కానీ ఓవైసీ ఒక పిలుపు ఇస్తే మూసీ ప్రాజెక్ట్‌కు వేల కోట్ల రూపాయలు సమీకరిస్తామని చెబుతున్నారు. కాలేజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. కానీ అమ్మాయిలకు ఉచిత EV స్కూటీలు ఇస్తామని కొత్త హామీలు ఇస్తున్నారు’ అని విమర్శించారు. -
లోక్ సభ రేపటికి వాయిదా
లోక్ సభ రేపటికి వాయిదా పశ్చిమాసియా యుద్ధం పై చర్చించాలని విపక్షాల పట్టుఅధికారపక్షం అంగీకరించకపోవడంతో సభా కార్యక్రమాలను అడ్డుకున్న విపక్షాలులోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానంపై చర్చకు ముందుకు రావాలని కోరిన ప్యానెల్ స్పీకర్స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి, ఇరాన్ యుద్ధం పై చర్చించాలనడం ఏమిటని ప్రశ్నిస్తున్న అధికారపక్షంవిపక్ష పార్టీలు అయోమయంలో ఉన్నాయన్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజులోక్సభ మరోసారి వాయిదా..మధ్యాహ్నం మూడు గంటల వరకు లోక్‌సభ వాయిదా.స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లి విపక్ష ఎంపీల ఆందోళన.గల్ఫ్ యుద్ధంపై చర్చించాలని విపక్షాల పట్టు.విపక్షాల ఆందోళన మధ్య లోక్‌సభ వాయిదా. పెట్రోల్, గ్యాస్ ధరలపై జైశంకర్ ప్రకటనపశ్చిమాసియాలో యుద్ధంపై రాజ్యసభలో కేంద్రం ప్రకటన.రాజ్యసభలో ప్రకటన చేస్తున్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్.రాజ్యసభలో జైశంకర్ ప్రసంగానికి అడ్డుపడుతున్న ప్రతిపక్షాలు.ముందుగా విపక్షాలకు అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష నేతల డిమాండ్. విపక్షాల ఆందోళనల మధ్యే ప్రకటన చేస్తున్నా మంత్రి జైశంకర్.మంత్రి జైశంకర్ కామెంట్స్..మార్చి ఒకటో తేదీ సీసీఎస్ సమావేశం నిర్వహించాం.ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్చలు జరుపుతున్నాం.యుద్ధ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాం.సంబంధిత శాఖలన్నింటికీ తగిన చర్యలు తీసుకోవాలని సూచించాం.కోటి మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారు.పెట్రోల్, గ్యాస్ ధరలపై దృష్టి సారించాం.ఇరాన్‌కు వెళ్లవద్దని జనవరిలోనే భారతీయులకు సూచించాం.ఇరాన్‌లోని భారతీయుల భద్రతకు ఎంబసీ అన్ని చర్యలు తీసుకుంటోంది.పరిస్థితులు చక్కబడగానే టెహ్రాన్‌లోని భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం. గల్ఫ్‌లో చిక్కుకున్న వారిని భారత్ రప్పించేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తున్నాం.ఈరోజు 50 విమానాలు నడుస్తున్నాయి.పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధంపై భారత్ తీవ్ర ఆందోళన చెందుతోంది.ఫిబ్రవరి 28 నాటి పరిణామాల తర్వాత యుద్ధం తీవ్రరూపం దాల్చింది.యుద్ధ ప్రాంతాల నుంచి 67వేల మందిని సురక్షితంగా తరలించాం.ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు ఆమోదయోగ్యం కాదు.యుద్ధం వల్ల అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతినే ప్రమాదం ఉంది.హింస దేనికీ పరిష్కారం కాదు.తక్షణమే చర్యల బాట పట్టాలని అన్ని దేశాలకు పిలుపునిచ్చాం.శాంతి స్థాపన కోసం భారత్ తన వంతు దౌత్య ప్రయత్నాలు చేస్తోంది.అంతర్జాతీయ మానవతా చట్టాలను ప్రతీ ఒక్కరూ గౌరవించాలి. శాంతిని నెలకొల్పేందుకు అన్ని ప్రయత్నాలు జరగాలిఇంధన భద్రతకు, కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తున్నాంఇరాన్ నౌకను డాకింగ్ చేసేందుకు సహకరించాంEAM Dr S Jaishankar makes a statement in the Rajya Sabha on the situation in West Asia, amid sloganeering by Opposition MPsEAM says," Our government had issued a statement on 20th February expressing deep concerns and urging all sides to exercise restraint. We continue to… pic.twitter.com/whk4pOE259— ANI (@ANI) March 9, 2026లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా.కాసేపట్లో పశ్చిమాసియా యుద్ధంపై విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటన.పార్లమెంట్ ఆవరణలో సస్పెండ అయిన ఎంపీల ఆందోళనలు.పార్లమెంట్లో ఇండియా బ్లాక్ ఎంపీల సమావేశం. After making obituary references, the Lok Sabha adjourned to meet again at 12 Noon today. pic.twitter.com/7Twxxz1HUP— ANI (@ANI) March 9, 2026 👉పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంఅందుకే స్పీకర్‌పై అవిశ్వాసం పెట్టాం: చామల కిరణ్కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కామెంట్స్..ప్రతిపక్ష పార్టీల ఎంపీలు, లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడకుండా స్పీకర్ అడ్డుకుంటున్నారుబీజేపీ ఎంపీలు, ఎన్డీఏ ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ ప్రాధాన్యత ఇస్తున్నారుస్పీకర్ అనే వ్యక్తి లోక్‌సభలో ఉన్న అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి18వ లోక్ సభలో ప్రతిపక్షాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదురాహుల్ గాంధీ మాట్లాడే ప్రతీసారి అసౌకర్యం కల్పిస్తున్నారు.నిషికాంత్ దూబే, అనురాగ్ ఠాకూర్ లాంటి వాళ్లకు అవసరం లేకపోయినా మైక్ ఇస్తున్నారుదేశంలో ఉన్న ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా లోక్ సభను నడుపుతున్నారుమహిళా ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దాడి చేయాలని చూశారని తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారుఅందుకే లోక్‌సభ స్పీకర్ పై అవిశ్వాసం పెట్టాముఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంపై లోక్ సభలో చర్చ చేయాలినరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా కాకుండా ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్నారుఅమెరికా నుంచి దిగుమతులపై సుంకాలను వైట్ హౌస్ నుంచి ట్రంప్ డిసైడ్ చేశారుపార్లమెంట్ లో చర్చ జరగాల్సిన అంశాలను ట్రంప్ ఎలా డిసైడ్ చేస్తారుమోదీ ఎందుకు ట్రంప్‌తో కాంప్రమైజ్ అయ్యారో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలిలోక్ సభలో ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్ చేసిన అంశంపై చర్చ జరగాలిలోక్సభ స్పీకర్‌పై అవిశ్వాసం సందర్భంగా ఎనిమిది మంది ఎంపీలకు ఓటు వేసే అవకాశం ఇవ్వాలిప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మేము ధర్నా చేస్తాముప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వాలిలోక్ సభలో ఉన్న 543 మంది ఎంపీలకు అవిశ్వాసంపై ఓటు వేసే అవకాశం ఉంటుందిగ్యాస్, క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెంచారు.దీనిపై లోక్‌సభలో చర్చ చేపట్టాలి. పార్లమెంట్‌కు చేరుకున్న ప్రియాంక, రాహుల్పశ్చిమ ఆసియాలో పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు.విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఏం చేబుతారో వినాలని ఉందన్న ప్రియాంక. #WATCH | Delhi: On EAM Dr S Jaishankar to make a statement in Parliament today on the situation in West Asia, Congress MP Priyanka Gandhi Vadra says, "I am keen to hear what he will say." pic.twitter.com/gc26kjlKuJ— ANI (@ANI) March 9, 2026బడ్జెట్ సమావేశాలు.. స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై చర్చనేటి నుంచి పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలుఏప్రిల్ 2 వరకు కొనసాగనున్న సమావేశాలునేడు స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై చర్చించనున్న లోక్సభతీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న కాంగ్రెస్ ఎంపీలు మహమ్మద్ జావేద్, కే సురేష్, మల్లు రవిఅవిశ్వాసం తీర్మానంపై చర్చలో స్పీకర్ స్థానంలో కాకుండా సభ్యుల మధ్యలో కూర్చొనున్న ఓం బిర్లా తొలి విడత సమావేశాల్లో లోక్‌సభ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ సహా విపక్షాలుస్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నోటీసుపై సంతకం పెట్టిన కాంగ్రెస్, సమాజ్‌వాద్ పార్టీ, డీఎంకే, లెఫ్ట్ పార్టీలకు చెందిన 118 మంది ఎంపీలుతమ ఎంపీలకు విప్ జారీచేసిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలుతప్పనిసరిగా లోక్‌సభకు హాజరుకావాలని ఆదేశం#WATCH | Delhi: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi, Congress President Mallikarjun Kharge, arrive at the ParliamentThe second phase of the budget session of Parliament will commence today and will continue till the 2nd of April pic.twitter.com/GFIWWyVSMG— ANI (@ANI) March 9, 2026 -
ట్రంప్‌కు బానిసలా మోదీ.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు
కలబురిగి (కర్నాటక): పశ్చిమాసియా సంక్షోభం, అమెరికాతో వాణిజ్య ఒప్పందం, టారిఫ్ అంశాల్లో కేంద్రంలోని బీజేపీ వైఖరిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఒక నియంతగాను, ప్రధాని మోదీని ఆయనకు బానిసగాను అభివర్ణించారు. ట్రంప్ ఎప్స్టీన్ ఫైళ్లను అడ్డుపెట్టుకుని మోదీని ఆడిస్తున్నారన్నారు.కర్నాటకలోని కలబురిగి జిల్లా చిత్తాపూర్లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఖర్గే మాట్లాడారు. ‘ఇరాన్ సుప్రీం నేతను అమెరికా చంపేసింది. ఏకంగా దేశ నేతనే చంపేస్తే ఆ దేశం, ఇక ప్రపంచం సురక్షితంగా ఉంటుందా? ఇరాన్ నేత ఖమేనీ లేదా వెనెజువెలా నేత మదురో..ఇలా ఎవరైనా కావచ్చు. దేశాల నేతలను ఇలా బెదిరింపులకు గురిచేస్తే ప్రపంచంలో శాంతి అనేదే ఉండదు. అమెరికా తన అహంకారంతో అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కుతోంది’ అని ఖర్గే మండిపడ్డారు. భారత్‌ను టారిఫ్‌ల పేరుతో బెదిరింపులకు గురి చేస్తూ అమెరికా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయించిందన్నారు. మోదీ, ట్రంప్‌లు మన దేశాన్ని నాశనం చేస్తూ, అమెరికాకు దాసోహమనేలా చేస్తున్నారని ఆరోపించారు. -
చీకటి కాలం.. దుశ్శాసన పర్వం
సాక్షి, అమరావతి: మహిళాభ్యుదయానికి, మహిళా సాధికారతకు చంద్రబాబు పాలన చీకటి కాలమని, ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నదంతా దుశ్శాసన పర్వమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎంవైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేసిన చంద్రబాబుకు మహిళా సాధికారత అన్న పదం పలికే అర్హత కూడా లేదని నిప్పులు చెరిగారు. మూడు రోజులుగా చంద్రబాబు సర్కారు ప్రజలకు మూడు డ్రామాలు చూపించిందని, అసెంబ్లీలో ఒక డ్రామా.. పగటి వేషాలు వేసుకున్న అదే ఎమ్మెల్యేతో మరో డ్రామా.. ఈ రెండింటికీ కొనసాగింపుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున చంద్రబాబు నాయుడు ట్రూప్ ఇంకో డ్రామా ఆడిందంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆదివారం ఆయన పోస్టు చేశారు. ‘నేను నేరుగా చంద్రబాబునాయుడిని అడుగుతున్నా.. జనాభాలో 50 శాతం ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల ముందు మీరిచ్చిన ఏ ఒక్క హామీని ఇప్పటి వరకు సక్రమంగా అమలు చేయకపోయినా, అన్నీ చేసేసినట్లు విజయవాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, పట్టపగలు డ్రామాలాడిన మీకు మహిళా సాధికారత అన్న పదం పలికే అర్హత ఉందా?’ అని నిలదీశారు. ఈ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..⇒ సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లో భాగంగా 19–59 మధ్య వయసున్న ప్రతి అక్కచెల్లెమ్మకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పారు. రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడి, 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలు ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం కోటి 80 లక్షల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.1,500 అంటే సంవత్సరానికి రూ.18 వేల చొప్పున ఒక్కో అక్కచెల్లెమ్మకు మూడేళ్లలో రూ.54 వేల చొప్పున బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడిస్తారు చంద్రబాబు గారూ?⇒ 50 ఏళ్లకే పింఛన్ మరో హామీ. 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.4 వేలు చొప్పున ఒక్కొక్కరికి ఏటా రూ.48 వేలు ఇవ్వాలి. మూడేళ్లలో రూ.1.44 లక్షలు బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడిస్తారు? ⇒ బడికి వెళ్లే ప్రతి పిల్ల వాడికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం కింద ఇస్తామన్నారు. మొదటి ఏడాది పూర్తిగా ఎగనామం పెట్టారు. రాష్ట్రంలో యూడీఐఎస్ఈ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్–యూడైస్) ప్రకారం 2023–24 నాటికి బడికి పోయే పిల్లలు 87,41,885 మంది ఉంటే రెండో ఏడాది 20 లక్షల మందికి ఎగరగొట్టారు. చివరకు 67.27 లక్షల మందికి మాత్రమే.. అది కూడా కొందరికి రూ.8 వేలు.. రూ.9 వేలు.. రూ.10 వేలు, మరి కొంత మందికి రూ.13 వేలు ఇచ్చారు. మరి వీళ్లందరికీ మిగిలిన డబ్బులు ఎప్పుడిస్తారు? ఎగ్గొట్టిన మొదటి ఏడాది డబ్బులు ఎప్పుడిస్తారు? ⇒ సూపర్ సిక్స్‌లో ఉచిత గ్యాస్ చిన్న హామీ. ఇక్కడ కూడా మోసాలే. రాష్ట్రంలో యాక్టివ్‌గా ఉన్న గ్యాస్ కనెక్షన్ల సంఖ్య దాదాపు 1.59 కోట్లు. వీరికి ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. సిలిండర్ ధర రూ.855 చొప్పున మూడు సిలిండర్లకు ఏడాదికి రూ.3,990 కోట్లు కేటాయించాలి. మొదటి ఏడాది కేవలం రూ.786 కోట్లు, రెండో ఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం బడ్జెట్లో రూ.2,199.99 కోట్లు కేటాయించారు. 2026–27లో బడ్జెట్లో ఈ పథకానికి పెట్టింది రూ.2,601 కోట్లు. అంటే మొత్తంగా రూ.6,143 కోట్లు బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారు చంద్రబాబు గారూ?⇒ ఉచిత బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లవచ్చని మహిళలకు హామీ ఇచ్చారు. కడప నుంచి వైజాగ్‌కు పోవచ్చు.. శ్రీకాకుళం వాళ్లు తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు.. మధ్యలో కనకదుర్గమ్మను కూడా దర్శనం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఫ్రీ అన్నారు. ఏపీఎస్ ఆర్టీసీలో 16 రకాల సర్వీసులుంటే.. కేవలం ఐదు సర్వీసులకు మాత్రమే పరిమితం చేశారు. ఈ పథకం అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్లు ఖర్చు చేయాలి. మొదటి ఏడాది ఈ స్కీమ్ ఎగరగొట్టేశారు. రెండో ఏడాది ఆర్నెల్ల తర్వాత ఆగస్టులో అరకొరగా మొదలు పెట్టారు. చేసిన ఖర్చు రూ.1,040 కోట్లు. ఈ స్కీమ్ కోసం ఈ బడ్జెట్లో కేటాయించిన మొత్తం రూ.1,420 కోట్లు. అంటే మూడేళ్లలో రూ.9,600 కోట్లకు గాను రూ.2,460 కోట్లు కేటాయించారు. అంటే రూ.7,140 కోట్లు బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడిస్తారు చంద్రబాబు గారూ?⇒ సూపర్ సిక్స్‌లో అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఇలా వంచనగా మార్చటం వల్ల ప్రతి కుటుంబాన్ని, అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతను, మొత్తంగా మన రాష్ట్రంలో ఇంటింటి భవిష్యత్తును మీరు ఎంతగా దెబ్బతీశారో అర్థమవుతోందా?⇒ అక్కచెల్లెమ్మల పేరిట వాళ్లకు మంచి చేస్తూ ఏకంగా 31 లక్షల ఇళ్లపట్టాలిచ్చాం. అందులో 21 లక్షల ఇళ్లు మంజూరు చేయించాం. అందులో 10 లక్షల పైచిలుకు ఇళ్లు పూర్తి చేశాం. చంద్రబాబునాయుడు అక్కచెల్లెమ్మలకు ఇచ్చే ఇంటి స్థలాలకు సంబంధించి చేసిన ప్రామిస్ ఏంటి? పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. 3 బడ్జెట్లు అయిపోయాయి. ఈ రోజుకు కూడా ఒక్క కుటుంబానికి ఒక్క పట్టా ఇవ్వలేదు. దీని కోసం ఒక్క గజం కూడా స్థలం కొనలేదు. ఉన్న ఇళ్ల నిర్మాణాలను గాలికొదిలేశారు. మరి ఆ ఇళ్ల నిర్మాణాలను అక్కచెల్లెమ్మలకు ఎప్పుడు పూర్తి చేసి ఇస్తారు? ⇒ డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకానికి మూడు బడ్జెట్లలో అతీగతీ లేదు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని చెప్పారు. పెంచడం సంగతి దేవుడెరుగు.. మామూలుగా ఇంతకు ముందు ఇస్తున్నట్టు ఇచ్చేది కూడా ఆగిపోయింది. మా హయాంలో కోటి మంది మహిళలకు వడ్డీ లేని రుణాల కింద రూ.4,969 కోట్లు ఇచ్చాం. మీరు వచ్చి మూడు బడ్జెట్లు పెట్టారు. ఇప్పటికి ఒక్క పైసా కూడా సున్నా వడ్డీ కింద ఇవ్వలేదు. ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ⇒ వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 26,98,931 మంది అక్కచెల్లెమ్మలకు రూ.19,189 కోట్లు.. వైఎస్సార్ ఆసరా కింద 78,94,169 మందికి రూ.25,570 కోట్లు.. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 3,58,613 మందికి రూ.2,029 కోట్లు.. వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 4,95,269 మంది అక్కచెల్లెమ్మలకు మరో రూ.1,876 కోట్లు ఇచ్చాం. నిజంగా స్త్రీ శక్తి ఎక్కడైనా లభించింది అంటే, వారి సాధికారత ఎక్కడైనా జరిగింది అంటే అది వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే అని గర్వంగా చెప్పగలుగుతాం. ఈ పథకాలన్నీ మీరు అధికారంలోకి వచ్చాక రద్దు చేశారు. మరి మీకు మహిళా సాధికారత గురించి మాట్లాడే అర్హత ఉందా?⇒ మీ పాలనలో ఈబీసీ అక్కచెల్లెమ్మలకు ఈబీసీ నేస్తం అనే పథకమే లేదు. మీకు కాపుల్ని మభ్య పెట్టి.. వారి ఓట్లు కొల్లగొట్టే ప్యాకేజీ పథకాలు బాగా తెలుసుగానీ, కాపు నేస్తంగా ఒక్క రూపాయి కూడా ఆ అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన చరిత్ర మీకు కానీ, మీకు మద్దతిస్తున్న వారికి కానీ లేదు.⇒ ఇలా ఇవ్వక పోవటం కూడా మీకున్న విజన్‌లో భాగమే అని నమ్మించగల ఎల్లో మీడియా మీ చేతిలో ఉంది కాబట్టి.. ఇదీ గొప్ప ఎంపవర్మెంట్ అని పత్రికల్లో రాయించటం, టీవీల్లో వేయించటమే ఇక మిగిలింది!⇒ అక్కచెల్లెమ్మల కాపురాల్లో చిచ్చుపెట్టేలా వీధికో బెల్టుషాపు, ఊరికో మద్యం షాపు, బారు తెరవటమే మీకు తెలిసిన మహిళా సాధికారత. అదే మీకు తెలిసిన మహిళా భద్రత.⇒ దిశ పోలీస్ స్టేషన్లను, దిశ యాప్‌ను కూడా నిర్వీర్యం చేశారు. చివరికి రాష్ట్రాన్ని మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ టీటీడీ చైర్మన్.. అత్యాచార ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించారు. పసి పిల్లల్ని, ఆడపిల్లల్ని, చివరికి ఉద్యోగాలు చేసుకుంటున్న మహిళల్ని మీరు, మీకు మద్దతిస్తున్న వాళ్లు పెంచి పోషిస్తున్న కామాంధులంతా ఎలా చిదిమేస్తున్నారో చూసి కూడా మీకు సిగ్గనిపించడం లేదా?⇒ మా పాలనలో 90 శాతం అక్కచెల్లెమ్మల పేరిట డీబీటీ పథకాలే. మేం ఇచ్చిన ఇళ్ల స్థలాలన్నీ అక్కచెల్లెమ్మల పేరుమీదే. దేశ చరిత్రలో తొలిసారిగా.. మేం ఇచ్చిన వేల కొద్దీ నామినేటెడ్ పదవుల్లో 50 శాతం వాటా వారికే.⇒ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఎక్కువ మంది మహిళలకు ఎమ్మెల్సీలు, క్యాబినెట్ మంత్రులుగా అవకాశం ఇచ్చింది కూడా మా పాలనలోనే. అందుకే మా పాలన మహిళా సంక్షేమ చరిత్రలో సువర్ణ అధ్యాయం అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ⇒ ఇప్పటి పరిస్థితి ఏమిటంటే.. మహిళాభ్యుదయానికి, మహిళా సాధికారతకు చంద్రబాబు పాలన చీకటి కాలం. రాష్ట్రంలో నడుస్తున్నదంతా దుశ్శాసన పర్వం. -
జనసేన సభ్యత్వ నమోదులో రచ్చకెక్కిన ఇరు వర్గాలు
కంకిపాడు: కృష్ణా జిల్లాలోని కంకిపాడులో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఇరు వర్గాల వార్ రచ్చకెక్కింది. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటే తమకు ఇవ్వడం లేదంటూ జనసేనలోని రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. చింతకింద సునీల్, మేక స్వాతి తేజ్‌ల మధ్య వివాదం రాజుకుంది. ఫ్లెక్సీ ఏర్పాటు విషయమై రగడ చోటు చేసుకుంది. బ్యానర్లు కట్టుకోవడాని తనకు అనుమతి ఇవ్వకపోవడం జనసేనకు చెందిన స్వాతీ తేజ్ మండిపడ్డారు. పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మహిళలకు మేలు చేసిన వ్యక్తి వైఎస్ జగన్: సజ్జల
సాక్షి, తాడేపల్లి: మహిళలకు మేలు చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని.. ఐదేళ్లలోనే యాభై ఏళ్ల సంస్కరణలు తెచ్చారని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఉమెన్స్ డే వేడుకల్లో మాట్లాడుతూ.. పార్టీలో మహిళా విభాగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అన్నిఅనుబంధ విభాగాల్లోనూ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని సజ్జల అన్నారు.‘‘మండల, గ్రామస్థాయిలో కమిటీలను పూర్తి చేయాలి. అప్పుడు క్షేత్రస్థాయిలో మహిళా విభాగం మరింత పటిష్టంగా మారుతుంది. ఏదైనా సమస్యలపై గట్టిగా పోరాటం చేయవచ్చు. స్థానికంగా ఉన్న సమస్యలపై అక్కడే పోరాటం చేయాలి. పార్టీ పిలుపునిచ్చే రాష్ట్రస్థాయి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి. మీ దృష్టికి వచ్చిన సమస్యలను స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు చేయాలి. లీడర్లుగా ఎదగాలంటే చొరవ చూపి ముందుకు నడవాలి. చంద్రబాబు మహిళలకు అన్యాయం చేశారు. ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయకుండానే చేసినట్లు చెప్పుకుంటున్నారు...వైఎస్ జగన్ అనేక పథకాలను మహిళలే కేంద్రంగా అమలు చేశారు. మహిళల జీవన ప్రమాణాలను పెంచేలా కృషి చేశారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. దీని వలన జరుగుతున్న నష్టాలపై ఎక్కడికక్కడే సమావేశాలు పెట్టాలి. అందరిలోనూ చైతన్యం తీసుకు రావాలి. వచ్చే ఎన్నికల నాటికి మహిళలే కీలక పాత్ర పోషించేలా నాయకత్వం వహించాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. -
ఏపీలో నారావారి నరకాసుర పాలన: ఆర్కే రోజా
సాక్షి, తాడేపల్లి: మహిళా సాధికారత కోసం కృషి చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. మహిళలు రాజకీయాల్లో ఎదగాలంటే చాలా కష్టమని.. కానీ వైఎస్ జగన్ ప్రోత్సాహంతో పార్టీలో ఎంతోమంది మహిళలు ఎదిగారని ఆమె పేర్కొన్నారు. ఆదివారం.. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం నిర్వహించారు. మహిళా నేతలు ఆర్కే రోజాతో పాటు వరుదు కళ్యాణి, రాయన భాగ్యలక్ష్మి, పూజిత, హారిక సహా పలువురు పార్టీ నేతలు కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ.. ‘‘నన్ను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి, మంత్రి పదవి ఇచ్చి వైఎస్ జగన్ ప్రోత్సాహించారన్నారు. కష్టపడే వారికి, టాలెంట్ఉన్న వారికి వైఎస్ జగన్ ఎప్పుడూ అవకాశం కల్పిస్తారు. వరుదు కళ్యాణి తన ఎమ్మెల్సీ పదవి అలంకార ప్రాయం కాదని.. ఆయుధమని నిరూపించారు. ప్రతి మహిళ ఒక శక్తిగా ఎదగాలి. టీమ్ వర్క్‌గా పని చేసి మళ్లీ జగన్‌ను సీఎంగా చేసుకోవాలి’’ అని ఆర్కే రోజా పేర్కొన్నారు.‘‘రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన సాగుతోంది. మహిళలకు రక్షణ కల్పించలేని దిక్కమాలిన ప్రభుత్వం ఇది. హోంమంత్రి అనిత తన పదవిని పట్టించుకోకుండా ఆట, పాటలతో కాలం గడుపుతోంది. అనితతో పాటు మరో ఇద్దరు మంత్రులు మహిళలకు ఏం మేలు చేశారు?. అలాంటి మంత్రులు సబిత, అనిత, గుమ్మడి సంధ్యారాణిలకు మహిళా దినోత్సవం జరుపుకునే అర్హత లేదు. అన్యాయానికి గురైన మహిళలు ఫిర్యాదులు చేస్తే వారిమీదే కేసులు పెడుతున్న దుస్థితి నెలకొంది...కులం, మతం, పార్టీ చూడకుండా వైఎస్ జగన్ అందరికీ మేలు చేశారు. చంద్రబాబు మాత్రం కులం, మతం, పార్టీ చూసి అందరికీ వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇలాంటి వ్యక్తికి మహిళా దినోత్సవం జరుపుకునే అర్హత లేదు. పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి పేరు చెప్పుకుని, ఆమె తల్లి కన్నీటిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేసిన వ్యక్తి. ముప్పై వేల మంది మహిళలు కనిపించకపోయారని చెప్పిన పవన్ ఈ ఇరవై నెలల్లో ఎంతమందిని తిరిగి తీసుకు వచ్చారు?.మనం చేసిన మంచి వలనే ఇప్పటికీ జనం మనల్ని గౌరవవిస్తున్నారు. కూటమి నాయకులు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితే లేదు. చంద్ర మండలానికి కూడా చంద్రబాబు సీఎం అవుతాడని ఎల్లో మీడియా జాకీలు ఎత్తుతోంది. బీఆర్ నాయుడు తప్పు చేస్తే అందులో తప్పేం ఉందని ఎల్లోమీడియా ప్రశ్నిస్తోంది. బీఆర్ నాయుడుకి ఒళ్లంతా అహంకారమే. లడ్డూపై విష ప్రచారం చేసిన వారందరి లెక్కలూ వెంకటేశ్వరస్వామి తేల్చుతున్నాడు’’ అని ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. -
బిహార్ డిప్యూటీ సీఎంగా నిశాంత్ కుమార్?
పాట్నా: బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ రాజ్యసభలో అడుగు పెట్టనున్న తరుణంలో ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ జేడీయూలో చేరారు. ఆదివారం నితీష్ ఆధ్వర్యంలో నిశాంత్ పార్టీ సభ్యత్వం పొందారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ తన కుమారుడికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.రెండు దశాబ్దాలకు పైగా రాష్ట్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించిన నితీష్ కుమార్ త్వరలో రాజ్యసభకు వెళ్లనున్నారు. ఆయన నిర్ణయంతో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న నిశాంత్ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. త్వరలో బిహార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది.బిహార్‌లో అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ‘సుశాషన్ బాబు’ (మంచి పాలన అందించే వ్యక్తి) అనే పేరు తెచ్చుకున్న నితీష్ మార్చి 16న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేశారు. త్వరలో ముఖ్యమంత్రి పదవిని వదులుకోనున్నారు. -
టీవీకే చీఫ్ విజయ్ మ్యానిఫెస్టో.. వారికి బంపరాఫర్
చెన్నై: త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అక్కడ పొలిటికల్ హీట్ ఊపందుకుంది. తమిళనాడులో కొత్తగా ఆవిర్భించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే ఎన్నికలకు భారీ హామీలతో ముందుకెళ్లడానికి సిద్ధమైంది. ఈ మేరకు టీవీకే చీఫ్ విజయ్.. తమ మ్యానిఫెస్టోను ప్రకటించారు. ఇందులో మహిళలకు బంపరాఫర్లు ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం(మార్చి 7వ తేదీ) తన ఎన్నికల హామీలను ప్రకటించారు విజయ్. మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సహాయం, యువతులకు వివాహ బహుమతిగా బంగారపు ఉంగరం, పట్టు చీరలతో పాటు అన్ని కుటుంబాలకు ఉచితంగా ఆరు ఎల్పిజి సిలిండర్లు వంటి అనేక వాగ్దానాలను ప్రకటించారు. తన తమిళగ వెట్రీ కజగం అధికారంలోకి వచ్చినప్పుడు, ప్రభుత్వ ఉద్యోగులకు తప్ప 60 ఏళ్ల వయస్సు వరకు ఉన్న మహిళలందరికీ నెలవారీ సహాయం అందించబడుతుందని విజయ్ స్పష్టం చేశారు.మహిళలపై నేరాలకు సంబంధించి జీరో పారదర్శకత విధానాన్ని అమలు చేయడానికి “రాణి వెలు నాచ్చియార్ ఫోర్స్” అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తమిళనాడులో సుమారు 500 బృందాలను రద్దీ ప్రదేశాల్లో భద్రత కోసం నియమిస్తామన్నారు. ఈ బృంద సభ్యులు బాడీ కెమెరాలతో అందుబాటులో ఉంటారన్నారు.అలాగే, మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను వేగంగా విచారించి న్యాయం అందించేందుకు “అంజలై అమ్మాళ్ సూపర్ ఫాస్ట్ మహిళా కోర్టులు” ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. -
‘పబ్లిసిటీ మాత్రం ఉంటుంది.. ప్రజలకు చేసేదేమీ ఉండదు’
ఏలూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసేదేమీ ఉండదని, కేవలం పబ్లిసిటీ కోసమే తపిస్తూ ఉంటారని ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలతో కాలం గడుపుతారని, ప్రజలకు చేసేది మాత్రం శూన్యమని విమర్శించారు. ఈరోజు(శనివారం, మార్చి 7వ తేదీ) ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి మాట్లాడిన కురసాల కన్నబాబు.. ‘ కాగ్ నివేదిక చూస్తే.. రాష్ట్ర పరిస్థితి ఎంత దిగజారిపోయిందో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెబితే... చంద్రబాబు మాత్రం ప్రజలను అసెంబ్లీలో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకంగా ఆర్థిక వ్యవస్థ నడిపిస్తున్నారు.. అప్పు చేయని రోజు అంటూ లేదు. యుద్ధాలతో సంక్షోభంలో ఉన్న దేశాల కన్నా... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతకన్నా దారుణమైన స్థితిలో ఉంది. ఆర్బీఐ వద్ద అప్పుచేసి 300 కోట్ల పైనే వడ్డీ కట్టారు. వాహనాల పన్ను జీఎస్టీని కేంద్రం తగ్గిస్తే... అది కూడా రోడ్ టాక్స్ కింద మలిచి ప్రజలపై బారాలు మోపుతున్నారు చంద్రబాబు. ఎఫ్ఆర్ఎంబి చట్టం నిబంధనలను ఉల్లంగించారు చంద్రబాబుపరిమితికి మించి అప్పులు చేయడం ద్వారా రాష్ట్ర అధోగతి పాలుఅవబోతున్నది. ఎఫ్ఆర్ఎంబి లోటు 2.7 శాతం ఉండాల్సింది 3.75 గా ఉంది. మూడు లక్షల 18 వేల కోట్లు రూపాయలు అప్పులు చంద్రబాబు చేసి పెద్ద ఘనతగా చెబుతున్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఆటపాటలతో ఎంజాయ్ చేస్తున్నారు.రాజమండ్రిలో కల్తీ పాలతో ప్రజలు చనిపోతే పట్టించుకోవడం లేదు. వేట్లపాలెంలో అనేకమంది చనిపోతే వారి ఊసే పాలకులకు పట్టడం లేదు. శ్రీకాకుళంలో నీరు కలుషితమై ఆరుగురు చనిపోయిన వీరికి పట్టడం లేదు. అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు పేదల సమస్యలు చర్చించకుండా... ఏకపాత్రాభినయాలు, పేదల పెన్షన్లపై కూడా స్కిట్లు చేస్తూ ప్రజలను మభ్యపెట్టి గడిపేస్తున్నారు. చంద్రబాబు అప్పులు చేసిన డబ్బు ఏ సంక్షేమ పథకానికి ఖర్చు చేశారు. సూపర్ సిక్స్ హామీలకు ఖర్చు చేశారా చూపండి’ అంటూ సవాల్ చేశారు.‘జగన్‌మోహన్‌రెడ్డిన తట్టుకోవడం కష్టం అని ఒకే ఒక కారణంతో మీరు కలిసి ఉంటున్నారు. జగన్‌పై ఉన్న భయం ఒకటే మిమ్మల్ని కలిపి ఉంచుతుంది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ నీడ్ శాతం 41.8 శాతం తగ్గిపోయింది. కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాలేకపోతున్నారు. అంచనాలే అందుకోలేని విధంగా.... మీ బడ్జెట్ ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు ఇచ్చే గ్రాంట్లు రూ. 10వేల 620 కోట్లు తగ్గిపోయాయి. మూలధన వ్యయం రూ. 45 కోట్లు చేస్తామని రూ. 16 కోట్లు చేశారు. రాష్ట్రం దివాళా తీసే దిశగా ఆర్థిక వ్యవస్థ ఉందని కాగ్ నివేదిక వేదిక చెప్పింది.రెవెన్యూలో లోటు పెరిగిపోయింది...365 రోజుల్లో 364 రోజులు అప్పులు చేసే పరిస్థితికి.. రాష్ట్రాన్ని దిగజార్చారు’ అంటూ విమర్శించారు. -
బీఆర్ నాయుడికి భూమన కరుణాకర్‌రెడ్డి సవాల్
సాక్షి, తిరుపతి: భగవద్గీతపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ నాయుడు, కిరణ్ రాయల్‌కు లేదని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అసభ్య వీడియోలు తీసే వారితో భగవద్గీత గురించి మాట్లాడించడం దురదృష్టకరమన్నారు. యువతకు సులభంగా అర్థమయ్యే విధంగా భగవద్గీత సారాన్ని సరళమైన భాషలో పుస్తకంగా ప్రచురించామని భూమన పేర్కొన్నారు.టీటీడీ మాన్యువల్ ప్రకారం విద్యార్థులకు భగవద్గీత పుస్తకాలు పంపిణీ చేయాలనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. తాము టీటీడీ నుంచి బయటకు వచ్చిన తర్వాతే ఆ పుస్తకాలు ముద్రించబడ్డాయి. ఆ పుస్తకంలో తన పేరు, అప్పటి ఈవో ధర్మారెడ్డి ముందుమాట ఉండడంతో బీఆర్ నాయుడు అసహనం వ్యక్తం చేసి పుస్తకాన్ని విసిరేశారు. భగవద్గీత సారాన్ని 26 పేజీల పుస్తకంగా అందించాం. పండితులతో చర్చకు సిద్ధమని, ఈ గ్రంథం గీతా భావాలకు విరుద్ధమని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటా’’ అంటూ భూమన సవాల్ విసిరారు.ఈ పుస్తకానికి రూ.50 కోట్లు ఖర్చయ్యాయన్న ఆరోపణలను భూమన కరుణాకర్‌రెడ్డి ఖండించారు. రూ.50 కోట్లు ఖర్చు అయ్యిందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ చేశారు. ఐదు భాషల్లో భగవద్గీత సారాన్ని ముద్రించి భక్తులకు పంపిణీ చేయడం చట్టబద్ధమైన కార్యక్రమం. బీఆర్ నాయుడు చేస్తున్న అన్యాయాలపై పోరాటం కొనసాగుతుందని భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. -
‘మీరు అమలు చేసేది సూపర్ సిక్స్ కాదు. సూపర్ స్కామ్’
తాడేపల్లి : ఏపీ అసెంబ్లీలో కాకి లెక్కలు చెబుతూ కూటమి ప్రభుత్వం కాలం గడిపిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం లెక్కలు వాస్తవాలకు సంబంధంల లేకుండా ఉందని మండిపడ్డారు. సూపర్ సిక్స్ అమలు చేయమంటే.. సూపర్ స్కామ్ చేస్తున్నారని కూటమి ప్రభుత్వ పెద్దల వైఖరిని తప్పుబట్టారు చంద్రశేఖర్.ఈరోజు(శనివారం, మార్చి 7వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన తాటిపర్తి చంద్రశేఖర్.. అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులు మత విద్వేషాలు పెంచేలా మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇందుకేనా అసెంబ్లీని నిర్వహించేది? అంటూ ప్రశ్నించారు. ‘ జనంతో నడిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది జగన్. అదే జనాన్ని పొడిచి ప్రభుత్వంలోకి వచ్చింది చంద్రబాబు. వైఎస్ జగన్‌ని దూషించటం, లడ్డూ ప్రసాదంపై విషం చిమ్మటానికే అసెంబ్లీలో ప్రాధాన్యత ఇచ్చారు. మండలి ఛైర్మన్‌ని మతం పేరుతో అవమాన పరిచారు. లడ్డూ మీద చర్చ జరిగితే వారి పాపాలు బయటకు వస్తాయని భయపడ్డారు. అందుకే ఛైర్మన్‌కి మతాన్ని ఆపాదించారు. మంత్రులేమో కామిడీలు చేస్తుంటే, కామిడీ ఆర్టిస్టులు మంత్రుల్లాగ మాట్లాడుతున్నారు. ఉద్యోగాల కల్పనలో కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందింది. రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన చంద్రబాబు ఇకమీదట దేశ రాజకీయాల్లోకి వెళ్తారట. ఆర్థిక క్రమశిక్షణ లేని వైనం మీద కాగ్ కడిగి పారేసింది. జాబ్ కేలండర్ అడిగితే లోకేష్ డేట్లు మార్చుకుంటూ పోతున్నారు. లూటీ చేసి లాఠీలతో బెదిరిస్తున్నారన్నారు’ అని విమర్శించారు. -
రేవంత్.. రైతుభరోసా ఇచ్చే ఉద్దేశం లేదా?: హరీష్ రావు
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్ నేతలపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుభరోసా ఇచ్చే ఉద్దేశం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. పోలీసులు లేకుండా జనం దగ్గరకు ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్లగలరా?. కాళేశ్వరం కూలిందని చిల్లర మాటలు మాట్లాడుతారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం కొండన్నపల్లి వద్ద ఎండిపోయిన పంటలను శనివారం పరిశీలించారు. అనంతరం, హరీష్ మీడియాతో మాట్లాడుతూ..‘మూడు పంటలకు రైతుభరోసా ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి.. మూడు పంటలకూ డబ్బులు ఎగ్గొట్టాడు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రైతుల దగ్గరకు పోతారు?. పోలీసులు లేకుండా జనం దగ్గరకు ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్లగలరా?. కాళేశ్వరం కూలిందని చిల్లర మాటలు మాట్లాడుతారా?.కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే పంటలు పండుతున్నాయి. హైదరాబాద్‌కు తాగు నీరు కాళేశ్వరం నీల్లే వెళ్తున్నాయి. రేవంత్ రెడ్డి.. ముందు చిల్లర వ్యాఖ్యలు బంద్ చేయండి. కాళేశ్వరం కూలిపోయింది అంటూ ఎన్నికల్లో అడ్డగోలు ఆరోపణలు చేస్తారా?. ప్రాజెక్ట్‌ను ఎండబెట్టాలని చూస్తున్నారా?. ఇప్పటికైనా మేడిగడ్డ పిల్లర్లకు రిపేర్ చేయించండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండేళ్లలో కనీసం పది వేల ఎకరాలకు నీరు ఇచ్చిందా అని ప్రశ్నించారు. -
ఏపీలో ఆర్థిక మందగమనం.. పయ్యావులపై బొత్స సీరియస్
సాక్షి, తాడేపల్లి: ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కి శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ కౌంటరిచ్చారు. మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి.. కాగ్ రిపోర్టు డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేయలేకపోతున్నానని చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఏపీలో ఆందోళనకరమైన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోంది. కల్పిత జీఎస్డీపీ గణాంకాలతో వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రచారం చేస్తున్నారంటూ కాగ్ లెక్కలను బహిర్గతం చేశారు. తప్పుడు లెక్కలపై బొత్స మండిపడ్డారు.విపక్షనేత బొత్స సత్యనారాయణ ట్విట్టర్ వేదికగా..‘ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కి, మూడు సార్లు ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా, అలాగే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన వ్యక్తిగా, మీరు కాగ్ వెబ్సైట్ నుండి డాక్యుమెంట్లు డౌన్లోడ్ చేయలేకపోతున్నానని చెప్పడం నిజంగా ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది. వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు మీరు సిద్ధంగా లేరన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, 23 రాష్ట్రాలకు సంబంధించిన CAG MKI నివేదికలను ఈ ట్వీట్‌కు జతపరుస్తున్నాము. అలాగే వృద్ధి రేట్లు ఎలా గణించారో వివరింగా తెలియజేసే స్లైడ్స్‌ను కూడా ఈ ట్వీట్లో పొందుపరుస్తున్నాం. (https://tinyurl.com/teswmtu2)రాష్ట్రం ప్రస్తుతం ఒక ఆందోళనకరమైన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాల్లో అది స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, మీ ప్రభుత్వం కల్పితమైన GSDP గణాంకాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తూ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందన్న తప్పుడు అభిప్రాయాన్ని కల్పిస్తోంది.2024–25లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 11.75% (నామినల్ GSDP) వృద్ధి సాధించిందదని మీ ప్రభుత్వం చెప్తోంది. కాని అదే సమయంలో దేశ వృద్ధి రేటు 9.8% మాత్రమే. అలాగే 2025–26లోకూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 10.75% వృద్ధి సాధిస్తుందని చెప్తున్నారు. కాని దేశ వృద్ధి రేటు 8.0%గానే అంచనా వేశారు. దీని ప్రకారం 2023–24 నుంచి 2024–25 వరకు రెండు సంవత్సరాల కాలానికి CAGR 11.09%గా వస్తుంది. అదేవిధంగా రియల్ GSDP వృద్ధిలో ఈ సంవత్సరం రాష్ట్రం దేశంలోని అన్ని రాష్ట్రాలలో 3వ స్థానంలో ఉందని మీ ప్రభుత్వం చెప్పుకుంటోంది.అయితే మీ ప్రభుత్వం తరఫున మీరు ఇస్తున్న అంకెలు, గణాంకాలు ఏ స్వతంత్ర సంస్థ విడుదల చేసినవి కావు. ఇవన్నీచంద్రబాబుగారి కార్యాలయం తయారు చేసిన గణాంకాలు, కాకిలెక్కలు. ఈ గణాంకాలు నిజమైతే, అదే స్థాయిలో ప్రభుత్వ ఆదాయాల్లో కూడా వృద్ధి కనిపించాలి. CAG ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి 9 నెలలకు సంబంధించి విడుదలచేసిన గణాంకాలు చూస్తే ఈ విషయం చాలా స్పష్టంగా వెల్లడి అవుతోంది. ఈ రెండు సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వ పన్ను ఆదాయాలు కేవలం 1.97% CAGR మాత్రమే పెరిగాయి.11.09% GSDP వృద్ధి చూపిస్తున్న రాష్ట్రం, కేవలం 1.97% పన్ను ఆదాయ వృద్ధిని మాత్రమే సాధించడం ఎలా సాధ్యమో ప్రపంచంలోని ఆర్థిక శాస్త్రవేత్తలకూ ఆశ్చర్యం కలిగించే విషయం. మీరు చెప్పుకుంటున్నట్టుగా ‘విజనరీ నాయకత్వం’ కింద తయారుచేసిన కల్పిత గణాంకాల వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. దీంతోపాటు ఈ ఆర్థిక సంవత్సరపు మొదటి 9 నెలలకు సంబంధించి 23 రాష్ట్రాలకు వచ్చిన ఆదాయాలకు సంబంధించిన ఖాతాలనుకూడా CAG అప్లోడ్ చేసింది.ఆ రాష్ట్రాలతో పోల్చి చూస్తే పన్ను ఆదాయ వృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. 23 రాష్ట్రాలలో పన్ను ఆదాయ వృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ 22వ స్థానంలో ఉంది — అంటే కిందనుంచి రెండవ స్థానం. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయం అదే కాలంలో 9.64% పెరిగింది, కానీ ఆంధ్రప్రదేశ్ పన్ను ఆదాయాలు కేవలం 1.97% మాత్రమే పెరిగాయి.🚨 #CAGExposedCBNరాష్ట్ర ఆర్థిక శాఖమంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారికి ( @PayyavulaOffl ),మూడు సార్లు ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా, అలాగే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన వ్యక్తిగా, మీరు CAG వెబ్సైట్ నుండి డాక్యుమెంట్లు డౌన్లోడ్… pic.twitter.com/iaDv2RTCSM— YSR Congress Party (@YSRCParty) March 7, 2026కానీ, మీరు ఆర్థిక రంగంలో ఆంధ్రప్రదేశ్ పనితీరు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మించి ఉందని గొప్పలు చెప్పుకుంటున్నారు. బాధ్యత గల విపక్షంగా వాస్తవాలను మేం శాసన మండలిలో ప్రస్తావించినప్పుడు, రాష్ట్రం చూపుతున్న ఈ నిరాశాజనక ఆర్థిక పనితీరుపై ఒక ఆర్థిక మంత్రిగా మీరు ఆత్మపరిశీలన చేసుకోకుండా, మేం సభద్వారా ప్రజలముందు ఉంచిన ఈ గణాంకాలను ఎగతాళి చేస్తూ, వ్యంగ్యంతో వ్యాఖ్యలు చేయడం నిజంగా దురదృష్టకరం. ఇప్పుడు మేము జతపరిచిన అన్ని పత్రాలను మీరు పూర్తిగా పరిశీలించి, మేము చేసిన ఆరోపణలను ఖండించగలరా? అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వంత పన్ను ఆదాయం (State’s Own Tax Revenues) వృద్ధి రేటు CAGR 1.97% కంటే ఎక్కువగా ఉందని మీరు చెప్పగలరా?. పన్ను ఆదాయ వృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ స్థానం 22వది కాదని, అంతకంటే మెరుగైన స్థానంలో ఉందని మీరు నిరూపించగలరా?. ఈ గణాంకాలను మీరు ఖండించకపోతే, బాధ్యతగల పదవిలో ఉన్న వ్యక్తిగా మీరు ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని భావించినట్టే! అని పోస్టులో పేర్కొన్నారు. -
‘శబరిమల’ సెగ ఉధృతం.. పినరయి సర్కారుకు షాక్
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరానికి గడువు సమీపిస్తున్న వేళ, అధికార ఎల్డీఎఫ్ (ఎల్డీఎఫ్)కూటమికి పలు వివాదాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాష్ట్రంలో మరోమారు పాగా వేయాలని భావిస్తున్న పినరయి విజయన్ ప్రభుత్వానికి శబరిమల వివాదం, బంగారం చోరీ ఉదంతాలు పెద్ద అడ్డంకులుగా మారనున్నాయని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి.ప్రముఖ వార్తా సంస్థ 'మాతృభూమి-కోర్' నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది స్టేట్’ సర్వేలో వెల్లడైన గణాంకాలు అధికార కూటమిలో గుబులు రేపుతున్నాయి. సుమారు 28,432 మంది ఓటర్ల అభిప్రాయాలను క్రోడీకరించి రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. సంచలనం సృష్టించిన శబరిమల ఆలయ సంప్రదాయాల వివాదం, దౌత్య కార్యాలయం ద్వారా జరిగిన బంగారం చోరీ కేసులు నేటికీ ఓటర్లపై బలంగా ముద్ర వేశాయి. సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికంగా 52.09 శాతం మంది.. ఈ అంశాలు రాబోయే ఎన్నికల్లో ఎల్డీఎఫ్ విజయవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని అభిప్రాయపడ్డారు.సర్వేలో పాల్గొన్నవారిలో కేవలం 11.33 శాతం మంది మాత్రమే వీటి ప్రభావం యూడీఎఫ్ (యూడీఎఫ్)పై ఉంటుందని భావిస్తుండగా, ఎన్డీఏకు నష్టం వాటిల్లుతుందని నమ్ముతున్న వారు కేవలం 1.31 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. పినరయి విజయన్ నేతృత్వంలోని రెండో విడత ప్రభుత్వ పాలనపై వ్యతిరేకత కంటే, గత వివాదాల నీడ ఎక్కువగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వివాదాలు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా, ప్రభుత్వ నైతికతను ప్రశ్నించే స్థాయికి చేరాయంటున్నారు. సుమారు 19.24 శాతం మంది ఓటర్లు ఈ అంశాలు ఎన్నికల ఫలితాలపై ఎటువంటి ప్రభావం చూపబోవని అభిప్రాయపడినప్పటికీ, సగానికి పైగా జనం ప్రతికూలత వ్యక్తం చేయడం ఎల్డీఎఫ్ అగ్రనేతలను ఆందోళనకు గురిచేస్తోంది. మరో రెండు నెలల్లో జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాల్లోనే అత్యంత కీలకమైనవిగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో, వివాదాలను అధిగమించి హ్యాట్రిక్ విజయం సాధించాలని ఎల్డీఎఫ్ తహతహలాడుతుంటే, ప్రజాభిప్రాయాన్ని తమ వైపు తిప్పుకోవాలని యూడీఎఫ్ శ్రమిస్తోంది.ఇది కూడా చదవండి: Nepal: ‘ఆర్ఎస్పీ’ ప్రభంజనం.. ప్రధానిగా ‘బాలెన్’? -
‘అప్పుడేమో అబద్ధాలతో అధికారంలోకి.. ఇప్పుడేమో బోగస్ లెక్కలు’
తాడేపల్లి: అసెంబ్లీలో కూటమి నేతలు పచ్చి అబద్ధాలు, కాకి లెక్కలు చెబుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. అన్ని బోగస్ లెక్కలే చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఈరోజు(శుక్రవారం, మార్చి 6వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన పేర్ని నాని.. ‘ వైఎస్సార్సీపీ ప్రభుత్వం చంద్రబాబుకు రూ. 8 వేల కోట్ల బడ్జెట్ అప్పచెప్పింది. 2019లో వైఎస్ జగన్‌కు చంద్రబాబు రూ. 100 కోట్ల బడ్జెట్ మాత్రమే అప్పచెప్పారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు అనేక అబద్ధాలు చెప్పారు. వైఎస్ జగన్‌పై విష ప్రచారం చేసి కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చాక మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టింది. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చెప్పాలి. కరెంట్ చార్జీలు తగ్గిస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాబోయే 60 రోజుల్లో 57 వేల కోట్లు సంపద సృష్టిస్తామని తప్పుడు లెక్కలు చెబుతున్నారు’ అని విమర్శించారు. పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే..ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆదాయాలు రాకపోగా, లోటు కనిపిస్తోందిఅంచనాలకు, వాస్తవ పరిస్థితికి చాలా తేడా కనిపిస్తోందిచివరికి బడ్జెట్ కూడా దొంగతనంగా పెడుతున్నారురూ.98 వేల కోట్లు మాత్రమే అప్పు తీసుకుంటామని రూ. లక్షా 3 వేల కోట్లు గతేడాది అప్పు చేశారుఈ ఏడాది రూ. 97 వేల కోట్ల అప్పు తీసుకుంటామని బడ్జెట్ లో చెప్పారువివిధ కార్పొరేషన్ల నుండి తీసుకుంటున్న అప్పులను బడ్జెట్లో చూపటం లేదుఈ విషయాన్ని ఎల్లోమీడియా కూడా రాసిందిరెండు నెలల్లో రూ. 57 వేల కోట్ల ఆదాయం ఎలా వస్తుంది?రాష్ట్రం ఆర్థికంగా కుంగిపోతుంటే గాడిన పెట్టామంటూ అబద్దపు మాటలు ఎందుకు చెప్తున్నారు?చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట ఇల్లు ఎవరిదో ఎందుకు చెప్పటం లేదు?లింగమనేని రమేష్‌దా? సీఆర్డీఏదా? చంద్రబాబుదా?రైతుల భూమిని 22A లో ఎక్కించిన వ్యక్తి చంద్రబాబుదీనిపై రాజకీయ పార్టీలు, మీడియా ఎదుట విచారణకు సిద్దమా?టాటా మోటర్స్ కి ఎకరా రూ.38 లక్షల చొప్పున గుజరాత్ లో మోడీ ప్రభుత్వం ఇచ్చిందికానీ ఎకరం రూపాయికే ఇచ్చారంటూ లోకేష్ పచ్చి అబద్దాలు చెప్పారు1100 ఎకరాలను రూ.400 కోట్లకు టాటా మోటర్స్ కొనుగోలు చేసిందిప్రపంచ వ్యాప్తంగా రూపాయి విలువ పడిపోయిందికానీ విశాఖలో రూపాయి విలువ విపరీతంగా పెరిగిందిఅందుకే విశాఖలో 99 పైసలకే భూములను ఇస్తున్నారురాష్ట్రంలో సెంటు భూమి ఆక్రమించి ఇల్లు కట్టుకున్నా వాటిని కూల్చేశారుకానీ గీతం యూనివర్సిటీ ఆక్రమంచిన వేల కోట్ల విలువైన భూమిని మాత్రం క్రమబద్దీకరిస్తున్నారుఇల్లు కోల్పోయిన పేదల కన్నీటి వరదలో కూటమి ప్రభుత్వం కొట్టుకు పోతుందిగీతం యూనివర్సిటీ ఓనరు నారా లోకేష్ తోడల్లుడు కాబట్టే క్రమబద్దీకరిస్తారా?వెయ్యి కోట్ల విలువైన భూమినే తాను కబ్జా చేసినట్టు గీతం ఓనరు చెప్పారువెయ్యి కోట్ల భూమిని కబ్జా చేయటం అంటే ఈ ప్రభుత్వాన్ని ఏం అనాలి?వైఎస్ జగన్ లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని పవన్ కళ్యాణ్ తిరుపతి సభలో ఆరోపించారుఅసెంబ్లీలోనేమో జగన్ కలిపాడని లేదనీ, టీటీడీ పాలకమండలిదే బాధ్యత అంటూ మాట మార్చారుబోలేబాబా, సంగం డెయిరీ, వైష్ణవి, ఏఆర్ డెయిరీ అన్నీ చంద్రబాబువే4 వేల కోట్ల టర్నోవర్ హెరిటేజ్ కు ఉందని భువనేశ్వరి చెప్పారుతనకు లక్ష కోట్ల ఆస్తి ఉందని చంద్రబాబు ప్రకటించారుఅసెంబ్లీలో మాత్రం కుటుంబ బతుకు తెరువు కోసమే వ్యాపారం చేస్తున్నామని సన్నాయి నొక్కులు నొక్కారుహెరిటేజ్ సంస్థ నుండి కొనుగోలు చేసిన మజ్జిగ ప్యాకెట్లనే ప్రజలకు పంచాలని జీవోలు ఇచ్చారుకానీ తాము ప్రభుత్వానికి అసలు మజ్జిగ అమ్మలేదని పచ్చి అబద్ధం చెప్పారుచివరికి టీటీడీకి కూడా హెరిటేజ్ ద్వారా నెయ్యి సరఫరా చేశారుదీనిపై చర్చించటానికి చంద్రబాబుకు దమ్ముందా?పాలపొడి, నెయ్యి సరఫరా చేయలేదని చంద్రబాబు చెప్పగలరా?ఈ విషయాలన్నీ చెబుతుంటే హిస్టరీ వద్దంటూ పయ్యావుల కేశవ్ మాట్లాడటం సిగ్గుచేటునెయ్యితో చేసిన లడ్డూకి నెయ్యి వాసన రావటానికి నెయ్యిని స్ప్రే చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిది6.28 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు చంద్రబాబు అసెంబ్లీలో పచ్చి అబద్దాలు చెప్పారుఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో ఆ వివరాలను ఆన్ లైన్ లో పెట్టే సత్తా ఉందా?రాష్ట్ర అప్పులు రాకెట్ వేగంతో చేస్తూ, ఆ డబ్బును ఏం చేస్తున్నారో ఎందుకు చెప్పటం లేదు?20 నెలల్లోనే రూ. 3.20 లక్షల కోట్ల అప్పుకు లెక్క చెప్పాలిఅనిత తన శాఖను వదిలేసి జగన్ దూషణ శాఖామంత్రిగా పని చేస్తున్నారుసొంత పార్టీ ఎమ్మెల్యేనే మోంథా తుపాను పరిహారం రైతులకు ఇవ్వలేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పారుమైకులు పని చేయక అసెంబ్లీని వాయిదా వేసిన ఘనత ఈ ప్రభుత్వానిదిఅసెంబ్లీ నడపటం చేతగానీ ప్రభుత్వ పెద్దలు తుపాను తీవ్రతను తగ్గించామని బడాయి మాటలు చెప్పారుప్రతి జనవరిలో జాబ్ కేలండర్ అంటూ లోకేష్ పిట్టలదొర మాటలు చెప్తున్నారుకూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క ఇంటి నిర్మాణం కూడా చేయలేదుజగన్ కట్టించిన ఇళ్లని చంద్రబాబు ఉగాదికి ప్రారంభించబోతున్నారువిమానయాన శాఖ మంత్రి కార్పొరేట్ సేవకుడుసొంత జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఎయిర్ పోర్ట్ ను కనీసం పట్టించుకోవటం లేదుభోగాపురం ఎయిర్ పోర్టు జీఎంఆర్ కడుతుంటే రామ్మోహన్ నాయుడు హడావుడి చేస్తున్నారుప్రభుత్వ ఎయిర్ పోర్ట్ అయిన గన్నవరం ఎయిర్ పోర్టును ఎందుకు పట్టించుకోవటం లేదు?రాగద్వేషాలకు అతీతంగా పని చేస్తామని ప్రమాణం చేసిన మంత్రులు మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారుహిందూ ఆలయాలను ధ్వంసం చేసిన మహమ్మద్ ఘోరీ తర్వాత చంద్రబాబేఆయన హయాంలోనే తిరుమల వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చారుచంద్రబాబు హిందూ మతాన్ని పాటించే వాడైతే ఆ మంటపాన్ని కూల్చుతారా?జంతువుల తోలుతో చేసిన బూట్లు వేసుకుని పూజలు చేసే ఏకైక వ్యక్తి చంద్రబాబుతల్లి, తండ్రి చనిపోతే కనీసం పిండప్రదానమైనా చేశారా?మరి ఏ రకంగా చంద్రబాబు హిందువు?జంతువుల కొవ్వు, టాయిలెట్ యాసిడ్ లను లడ్డూలో కలిపితే జనం బతికేవారా?తిరుమల కొండ మీద కూడా అన్యమత ప్రచారం చేసుకోవచ్చని చంద్రబాబు హామీ ఇవ్వలేదా?రైతులకు రుణమాఫీ అని చెప్పి మోసం చేశారుసూపర్ సిక్స్ అని ఇప్పుడు మోసం చేశారుఇక ఆయన మాటలు విని ఎక్కువ మంది పిల్లల్ని కంటే వారికి పోషణ పరిస్థితి ఏంటి?చంద్రబాబు లాంటి బడాబాబుల ఇళ్లలో పని చేయించుకోవడానికి సామాన్యులు ఎక్కువ మంది పిల్లల్ని కనాలా?11 మంది ఎమ్మెల్యే మాకు ఉన్నా 11వేల మందిలాగా పోరాడుతున్నాంనిజాయతీనే మాకు ధైర్యంలడ్డూ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందునే హెరిటేజ్ అతలాకుతలం అయిందిచంద్రబాబు ఎన్ని పాపాలు చేస్తున్నారో అన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారుఅసలు లడ్డూలో కల్తీ జరిగితే అది చంద్రబాబు హయాంలోనేఅందుకు చంద్రబాబే క్షమాపణ చెప్పాలికాగ్ నివేదికలు ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియని మంత్రులు ఏపీలో ఉన్నారు -
‘అమరావతి పేరుతో వ్యాపారం చేస్తున్నారు’
గుంటూరు: రాజధాని అమరావతి పేరుతో వ్యాపారం చేస్తున్నారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ధ్వజమెత్తారు. సంవత్సరానికి మూడు పంటలు పండే భూములను చంద్రబాబు తీసుకున్నాడని, అలా చేయవద్దని ఆయనకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. రైతుల నుంచి అడ్డగోలుగా భూములు లాక్కున్నారని మండిపడ్డారు. నా సలహాలు, సూచనలను చంద్రబాబు ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. మొత్తం వ్యవసాయ భూములను కాంక్రీట్ తో నింపేశారు. భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలను కాపడాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. భూసేకరణ సమయంలో ఇచ్చిన హామీలకు దిక్కు ఎవరు. అమరావతి రాజధానిని కూడా పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేస్తారా?, అమరావతి రాజధాని పేరుతో వ్యాపారం చేస్తున్నారు. రైతుల నుండి అడ్డగోలుగా భూములు లాక్కున్నారు.రెండో విడత భూ సేకరణకు రైతులు సిద్ధంగా లేరు’ అంటూ విమర్శించారు. -
తప్పు చేస్తే ఎవరికైనా దేవుడి శిక్ష తప్పదు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, ప్రకాశం: తప్పు చేస్తే ఎవరికైనా దేవుడి శిక్ష తప్పదని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి సన్నిధిలో పొరపాటు జరిగితే దేవుడే చూసుకుంటారన్నారు. టీటీడీ ఛైర్మన్‌పై నింద వచ్చింది కాబట్టి తప్పుకుంటే మంచిందన్నారు. కల్తీ నెయ్యి అంశాన్ని కూటమి ప్రభుత్వం వక్రీకరిస్తుందన్నారు. నెయ్యి విషయంలో ఈ ప్రభుత్వంలోనే తప్పు జరిగింది. రిజెక్ట్ చేసిన 4 ట్యాంకర్లు దొడ్డిదారిలో తీసుకున్నారు. సీబీఐ కూడా రిపోర్టులో అదే చెప్పిందని వైవీ అన్నారు.‘‘వెంకటేశ్వరస్వామిపై వైఎస్ జగన్‌కు పూర్తి నమ్మకం ఉంది. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి చిత్తశుద్ధితో మొక్కుకోవడం జరిగిందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ‘‘బాలిలేని మాటలకు నేను స్పందించడం ఏంటి? జిల్లా నాయకులు ఉన్నారు. ప్రస్టేషన్‌తో బాలినేని ఏదో మాట్లాడితే నేనెందుకు దానిపై కామెంట్ చేయాలి’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. -
రఘురామపై టీడీపీ నేత తిరుగుబాటు.. అసెంబ్లీకి పంచాయితీ..
సాక్షి, అమరావతి: డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం అసెంబ్లీ వరకు చేరింది. అసెంబ్లీ ప్రాంగణం బయట ఉండి నియోజకవర్గం వెలివర్రు గ్రామ టీడీపీ నేత వెంకటేశ్వర రాజు నిరసనకు దిగారు. టీడీపీ నుంచి రఘురామను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబును కలిసేందుకు తాను అసెంబ్లీకి వచ్చినట్టు తెలిపారు.ఈ క్రమంలో వెంకటేశ్వర రాజు.. ఎన్టీఆర్ విగ్రహంతో అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు యత్నం చేశారు. తనకు జరిగిన అన్యాయం, నియోజకవర్గంలో రఘురామ కృష్ణంరాజు వేధింపులను చంద్రబాబుకు వివరిస్తాను అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, అసెంబ్లీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత వెంకటేశ్వర రాజు మాట్లాడుతూ..‘పార్టీని నమ్ముకున్నందుకు ఇటువంటి బహుమతి ఇస్తారా?. రఘురామ కృష్ణంరాజు నా పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. నేను 40 ఏళ్లుగా టీడీపీలో ఉన్నాను. సొంత పార్టీ నేతపై కక్ష సాధింపు చర్యలు దిగారు. ఉండిలో రఘురామ కృష్ణంరాజు పార్టీని నాశనం చేస్తున్నారు.అధికారులను, పోలీసులను అడ్డం పెట్టుకొని నా ఇల్లు, నా పార్టీ కార్యాలయాన్ని కూల్చేశారు. నా ఆఫీసుకు అన్ని అనుమతులు ఉంటే కూల్చాల్సిన అవసరం ఏం వచ్చింది?. ఉండిలో చర్చిలు, మసీదులు కూలగొడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మా మోర ఆలకించాలి’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, టీడీపీ నేత వెంకటేశ్వర రాజు అంతకుముందు కూడా రఘురామపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. -
కాషాయ కండువా కప్పుకోనున్న వీరశివా !
సాక్షి ప్రతినిధి, కడప: మాజీ ఎమ్మెల్యే గండ్లూరు వీరశివారెడ్డి బీజేపీలో చేరికకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. తెలుగుదేశం, బీజేపీలోని ఒక సెక్షన్ నేతలు వీరశివా బీజేపీ చేరికకు మోకాలొడ్డారు. ఎట్టకేలకు అడ్డంకులన్నీ అధిగమించి బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి మరోమారు పార్టీ ఫిరాయింపునకు తెర లేపారు. బీజేపీలో చేరిక వ్యవహారం గత కొంత కాలంగా ఊగిసలాటలో ఉండిపోయింది. రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మొగ్గు చూపగా, తెలుగుదేశం, బీజేపీ నేతలు కొంతమంది ఇప్పుడు ఆయన అవసరం ఏమిటంటూ అడ్డుతగిలారు. అధికారం కోసమే బీజేపీలో చేరుతున్నారని మండిపడ్డారు. అన్నీ అంశాలను పరిశీలించిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. పుత్తాకు పక్కలో బల్లెం... కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డికి మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పక్కలో బల్లెం కానున్నారా...అంటే విశ్లేషకులు అవును అని వెల్లడిస్తున్నారు. బీజేపీలో చేరకముండే కమలాపురం నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణా వ్యవహారంపై స్పందించారు. కోట్లాది రూపాయాల దోపిడీ వ్యవహారం బహిర్గతం చేశారు. పుత్తా కుటుంబానికి నిత్యం రూ.30లక్షలు అక్రమ ఆదాయం లభిస్తోందని మీడియా సమావేశాలల్లో వ్యాఖ్యనించారు. అదే విషయమై చట్ట పరమైన చర్యలకు సిద్ధమైయ్యారు. ఇసుక అక్రమ రవాణా వ్యవహారాన్ని కట్టడి చేసేందుకు అన్నీ రకాల ఎత్తుగడలు అవలంభిస్తున్నారు. ఈపరిస్థితులల్లో బీజేపీలో చేరిన తర్వాత మరింత దూకుడు పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అనుచరగణాన్ని సమీకరించుకున్న తర్వాత వేగంగా రాజకీయ పావులు కదపనున్నట్లు సమాచారం. -
మంత్రి పయ్యావుల కేశవ్‌కు బొత్స స్ట్రాంగ్ రిప్లై
06-03-20265.25PMఏపీ శాసనమండలి నిరవధిక వాయిదా4:19 PMమంత్రి పయ్యావుల కేశవ్‌కు బొత్స స్ట్రాంగ్ రిప్లై ఆదాయంలో ఏపీకి 22వ స్థానం ఎలా వచ్చిందో చూపించిన బొత్సకాగ్ నివేదిక లింక్ ను పయ్యావులకు సభలో పంపిన బొత్సమీకు డౌన్ లోడ్ చేయడం చేతకాకపోతే చేసి పంపిస్తానన్న బొత్సగత ఐదేళ్లలో పంటల కొనుగోళ్ల వివరాలను ఇచ్చిన బొత్సవైఎస్ జగన్ హయాంలో రూ. 7800 కోట్లతో పంటల కొనుగోలు చేశాంపంటల వారీగా కొనుగోలు చేసిన వివరాలు ఇస్తున్నా చూస్కోండిబొత్స డాక్యుమెంట్లు ఇవ్వడంతో ఖంగుతిన్న మంత్రి పయ్యావుల కేశవ్రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు.. వారిని ఆదుకొండిప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అంతా అంకెల గారడీ ఏపీ శాసనమండలి నుంచి వైఎస్సార్సీపీ సభ్యుల వాకౌట్👉అంగన్వాడీలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా వాకౌట్👉అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమంపై వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్న👉సభను తప్పుదోవ పట్టించకండి: విపక్షనేత బొత్స సత్యనారాయణఆనాటి ప్రభుత్వం చాలా హామీలు నెరవేర్చిందిచాలా హామీలకు సంబంధించి అధికారులను పిలిపించి సమాచారం తీసుకోండిలేనిపోని కల్లబొల్లి కబుర్లు చెప్పకండిసమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తున్న వారిని అవమానించకండిమంత్రి సమస్యల పరిష్కారం కోసం ఏ అగ్రిమెంట్ ఏమీ చేసుకోలేదంటున్నారు.ముందు అంతకు ముందు ఏం జరిగిందో తెలుసుకోండి.అంగన్వాడిల పట్ల సానుభూతితో ఈ ప్రశ్నకు సభ నుంచి వాకౌట్ చేస్తున్నాం👉గీతం యూనివర్సిటీ రూ.5 వేల కోట్ల భూ దోపిడీపై సభలో చర్చించాలని కోరుతూ శాసనమండలి వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, పండుల రవీంద్రబాబు, పాలవలస విక్రాంత్‌లు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు.👉దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గీతం యూనివర్సిటీపై చర్చించాల్సిందేనని సభలో వైఎస్సార్సీపీ సభ్యులు నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళనకు దిగడంతో సభకు ఐదు నిమిషాల పాటు ఛైర్మన్ విరామం ప్రకటించారు. అనంతరం ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు.👉తల్లికి వందనం పథకంపై చంద్రబాబు సర్కార్‌ను వైఎస్సార్సీపీ సభ్యులు నిలదీశారు. తల్లికి వందనం పథకం తల్లికి వంచనగా మారిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భరత్ మండిపడ్డారు. ఎన్నికల ముందు ప్రతీ ఇంటి వెళ్లి నీకు 15 వేలు, నీకు 15 వేలు అని ప్రచారం చేశారంటూ దుయ్యబట్టారు.ఇది పెద్ద భూ కుంభకోణం: కుంభ రవిబాబు మండలి మీడియా పాయింట్లో ఎమ్మెల్సీ కుంభ రవిబాబు మాట్లాడుతూ.. గీతంకి ప్రభుత్వ భూములు ఇవ్వడంపై వాయిదా తీర్మానం ఇచ్చామని.. ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. రూ. 5 వేల కోట్ల భూములు గీతంకి ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందని.. ఇది పెద్ద భూ కుంభకోణమని ఆయన అన్నారు.‘‘గీతంకి భూములు ఇవ్వడంపై విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ ఇవ్వాలని తీర్మానం చేసినప్పుడు వ్యతిరేకత వచ్చింది. గీతం ఒక వ్యాపార సంస్థ. విద్యా వ్యాపారం చేస్తున్న సంస్థకి 5000 కోట్లు భూములు ఇవ్వడంపై వైఎస్సార్సీపీ అభ్యంతరం తెలిపింది. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన గీతంకి ఉచితంగా భూములు ఇవ్వడం పరిపాటిగా మారింది. గతంలో ఎకరం 15 లక్షలకు ఇచ్చారు...రుషికొండలో ప్రభుత్వ భవనాలను వైఎస్ జగన్ కడితే కూటమి గగ్గోలు పెట్టింది. ఎన్నికల్లో ప్రచారం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు.51 ఎకరాల 71 సెంట్లు కట్టబట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. అనేక కంపెనీలకి 99 పైసలకే భూములు ఇస్తుంది. భూములు అప్పనంగా కట్టబెట్టడాన్ని వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తుంది. విలువైన భూములను కారు చౌకగా గీతంతో పాటు ఎన్నో సంస్థలకు ఇచ్చేందుకు ప్రభుత్వం పూనుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం’’ అని రవిబాబు తేల్చి చెప్పారు.గీతం కబ్జా చేసిన భూమిని స్వాధీనం చేసుకోవాలి: వరుదు కళ్యాణిగీతం యూనివర్సిటీ కబ్జా చేసిన భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. రెగ్యులరైజేషన్ ఆపాలి. 99 పైసలకు తన బినామీలు అనుచరులకు చంద్రబాబు భూములు కట్టబడుతున్నారు. రూ.5 వేల కోట్ల విలువైన భూములు తన కుటుంబ సభ్యులకు కట్టబడుతున్నారు. విశాఖపట్నం ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటూ దోపిడీ క్యాపిటల్‌లా మార్చారు. బీసీ మహిళా మేయర్‌ని అడ్డగోలుగా పదవి నుంచి దించారు.కబ్జా భూమిని రెగ్యులరైజ్ చేయడం కోసమే మేయర్ ని తప్పించారు. కబ్జా చేసిన భూములపై ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టాలి.. కానీ రెగ్యులరేజ్ చేస్తున్నారు. చిన్న చిన్న బడ్డీ కొట్లు పెట్టుకుంటే ప్రోక్లైన్లతో తొలగించారు. పేదలు చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటే వాటిని తొలగించారు. కుటుంబ సభ్యులకు మాత్రం 5 వేల కోట్లు కట్టబెట్టారు. స్థానిక సంస్థల ఆధీనంలో ఉన్న భూములు ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదంటూ కోర్టు తీర్పులు ఉన్నాయి. సుప్రీంకోర్టు అంటే కూటమి పెద్దలకు చంద్రబాబుకి భయం లేదు. గీతం కబ్జా చేసిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అప్పటివరకు వైఎస్సార్సీపీ పోరాటం ఆగదు. -
ఏపీలో అట్టడుగున లా అండ్ ఆర్డర్: మనోహర్‌రెడ్డి
సాక్షి, నెల్లూరు జిల్లా: రాష్ట్రంలో సమర్థవంతమైన అధికారులు ఉన్నప్పటికీ, ప్రభుత్వం వారిని ప్రత్యర్థి రాజకీయ పార్టీలను వేధించడానికి 'ప్రైవేటు సైన్యం'లా వాడుకుంటోందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం, హోంమంత్రి నియోజకవర్గాల్లో హత్యలు, అత్యాచారాలు, గంజాయి విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా పాలన కాకుండా 'పొలిటికల్ గవర్నెన్స్'(రాజకీయ పాలన) నడుస్తోందని, శిలాఫలకాలను పగలగొట్టడం నుంచి భౌతిక దాడుల వరకు విధ్వంసమే ధ్యేయంగా కూటమి నేతలు ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. నెల్లూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని.. కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, క్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం దేశంలోనే ఏపీ అట్టడుగు స్థానంలో నిలిచిందని మనోహర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలపై కక్షసాధింపు చర్యలు తారాస్థాయికి చేరాయని మండిపడ్డారు.మాజీ మంత్రి కాకాణిపై 20కి పైగా అక్రమ కేసులు బనాయించిన కూటమి ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. చివరకు ప్రెస్ మీట్లు పెడితే వాటిపైనా కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. "సూపర్ సిక్స్ హామీల వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ 'డైవర్షన్ పాలిటిక్స్' చేస్తున్నారని.. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ప్రతి అధికారి పేరును డిజిటల్ డెయిరీలో నమోదు చేసి.. భవిష్యత్తులో ప్రభుత్వం మారిన తర్వాత చట్టపరమైన శిక్షలు తప్పవు" అని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు ఆపి, శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి సారించాలని.. లేనిపక్షంలో న్యాయస్థానాల ద్వారా గట్టి పోరాటం చేస్తామని మనోహర రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే..భక్తులకు సైతం రక్షణ లేని దుస్థితి:దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, క్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణలో అట్టడుగు స్ధానంలో నిల్చింది. చిట్టచివరి స్ధానంలో ఉన్నప్పటికీ శాంతిభద్రతలు మెరుగుపర్చడానికి కానీ, హత్యలు, అత్యాచారాలు, గంజాయి అమ్మకాలు నియంత్రణలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సీఎం, హోంమంత్రి, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి నియోజకవర్గాల్లో ఇవే సంఘటనలు జరుగుతున్నా చీమకుట్టినట్లైనా లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అత్యంత సమర్థవంతంగా శాంతిభద్రతలు నిర్వహణ ఉండేది. ఇవాళ గుడికి వెళ్తున్న భక్తులకు సైతం రక్షణ లేకుండా పోయింది.అధికార పార్టీ కనుసన్నల్లో పోలీసులు..పోలీసులు అధికార పార్టీ నేతలకు సలామ్ కొడుతూ వారి ప్రైవేటు సైన్యంలా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. పోలీస్ స్టేషన్ పైకి వెళ్లి దాడి చేసిన ఘటనలు గతంలో ఎప్పుడూ లేవు. కూటమి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైన దుస్థితి. నెల్లూరు జిల్లాలో వైయస్సార్సీపీ నేతలపై కక్షసాధింపు చర్యలు తారాస్థాయికి చేరాయి. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పెద్ద సంఖ్యలో అక్రమ కేసులు బనాయించారు.మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై అత్యంత దారుణంగా దాడి చేసి... దాడికి పాల్పడిన వారిని వదిలేసి, తిరిగి ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసులు నమోదు చేశారు. మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గూండాలు దాడి చేసి, హత్యాయత్నం చేస్తే, వారిపై బెయిలబుల్ సెక్షన్లు కింది అరెస్టు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. దాడికి గురైన అంబటి రాంబాబు గారిపై నాన్ బెయిల బుల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు.కాకాణిపై కక్ష సాధింపు..కాకాణి గోవర్ధన్ రెడ్డి పై 20 కు పైగా అక్రమ కేసులు బనాయించింది. చివరకు గతంలో ఛార్జిషీట్ ఫైల్ చేసిన కేసుల్లో ముద్దాయి కాకపోయినప్పటికీ.. ఎవరో ఒక నిందితుడో లేక సాక్షిగా ఉన్న వ్యక్తో వాంగ్మూలం ఇచ్చారని... నాలుగైదు సంవత్సరాలు తర్వాత గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసులు నమోదు చేస్తున్నారు. మరికొన్ని కేసుల్లో 2019లో ఎవరో మద్యం పంచారని, ఎవరినో తీసుకొచ్చి బెదిరించి, బలవంతం సాక్ష్యం ఇప్పించి.. అందులో గోవర్థన్‌రెడ్డి ప్రమేయం ఉందని కేసు నమోదు చేస్తున్నారు.సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అనుచరులుతో ఫిర్యాదు చేయించి కేసులు నమోదు చేస్తున్నారు. విలేకరిని బెదిరించిన విషయంపై ప్రశ్నిస్తే.. దాని మీద కేసు నమోదు చేశారు. శ్రీ వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తూ.. ప్రజల మనోభావాలను గాయపరుస్తున్నారు.. దీనికి ప్రాయశ్చిత్తం చేసుకొండి, టీడీపీ నేతలకు ఇప్పటికైనా బుద్ధి రావాలని రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజలకు పిలుపునిస్తూ.. ఆ కార్యక్రమం గురించి మీడియాతో మాట్లాడితే దానిపైనా కేసు నమోదు చేశారు.సోషల్ మీడియాకు సంబంధించి కూడా దాదాపు 8 కేసులు నమోదు చేశారు. ఇటీవల కొవూరులో బాధిత బాలికను పరామర్శించి ప్రెస్ మీట్ పెడుతూ.. శాంతిభద్రతలు కాపాడ్డంలో పోలీసులు విఫలమయ్యారు, పోలీసులు తమ పనితీరు మార్చుకోవాలని మాట్లాడితే దానిపైనా కేసు నమోదు చేశారు. అది కూడా పోలీసుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కూటమి పార్టీ నేతలు ఫిర్యాదు చేస్తే మరో కేసు నమోదు చేశారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి రూ.3 లక్షలు తీసుకొంటున్నారంటూ బీజేపీ నేత శేషాచలం వాట్సప్‌లో వీడియో పెడితే.. దాన్ని ఫార్వార్డ్ చేశారని కాకాణి గోవర్ధన్ రెడ్డి పై మరో కేసు పెట్టారు.చరిత్రలో ప్రెస్ మీట్ పెడితే కేసు నమోదు చేయడం ఇంతవరకు లేదు. తెలంగాణా హైకోర్టు ఇటీవల నల్లబాలు కేసులో రాజకీయ నాయకులు ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు జాగ్రత్తగా పరిశీలించి.. నిరాధారంగా కేసులు పెట్టడానికి వీల్లేదని చెప్పింది. ప్రజాస్వామ్యంలో కనీస భావప్రకటనా స్వేచ్చే లేకపోతే ఎలా అని తీర్పునిస్తే.. సుప్రీం కోర్టు దాన్ని యథాతథంగా అమలు చేయమని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని చెప్పింది. అదే విధంగా బాధితులే కేసు పెట్టాలని స్పష్టం చేసింది.కానీ ఈ రాష్ట్రంలో అందుకు భిన్నంగా జరుగుతోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఆయన ఇంటిపై దాడి చేయడమే కాకుండా.. ఒక ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా 36 కేసులు నమోదు చేసింది. ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసిన ఇదే తరహా కక్ష సాధింపు కేసులు నమోదు చేస్తున్నారు. చివరకు విలేకరులు, న్యాయవాదులపైనా కేసులు నమోదు చేస్తున్నారు.న్యాయవాదులపైనా అక్రమ కేసులు..కడప జిల్లా లీగల్ సెల్ ప్రతినిధి నాగిరెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టారు. వైఎస్సార్సీపీ నేతల తరపున కేసులు టేకప్ చేస్తున్నాడని భయపెట్టడానికి ఆయన మీదే కేసు పెట్టారు. చివరకు నా మీద కూడా కేసు నమోదు చేశారు. దానిపై హైకోర్టు తీవ్రంగా మందలించింది. సాక్షిలో వార్తలు రాస్తున్నారని కేసులు పెడుతున్నారు. అదే టీవీ5, ఈటీవీలో ఎంత అసభ్యకరవార్తలు రాసినా, ప్రచారం చేసినా వారిపై ఏ కేసులు ఉండవు. కూటమి ప్రభుత్వంపై వార్తలు రాస్తే మాత్రం... సాక్షితో పాటు యూట్యూబర్స్ పైనా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. ఈ తరహా విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైంది.అందుకే దేశంలో లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో అట్టడుగ స్ధానానికి దిగజారింది. ఈ నేపధ్యంలో ఇప్పటికైనా పోలీసులు తమ తీరు మార్చుకోవాలని సూచించారు. పోలీసుల తల ఉన్నది టోపీ పెట్టుకోవడానికే తప్ప ఆలోచించడానికి కాదన్న ఓ కవి మాటలను పోలీసులు నిజం చేస్తున్నట్టే కనిపిస్తోంది. సూపర్ సిక్సి హామీలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇలా అక్రమ కేసులు నమోదు చేయడం. .వాటిపై మీడియాలో చర్చలు పెడుతూ తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు.మరోవైపు తమ వైఫల్యాలను ప్రశ్నించిన వారిని అరెస్టు చేస్తూ వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా నిరసిస్తున్నాం. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమై ఇదే తరహాలో వ్యవహరిస్తే.. భవిష్యత్తులో ప్రభుత్వం మారిన తర్వాత వీరి పరిస్థితి ఏంటన్నది ఆలోచన చేసుకోవాలి. అలా చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న అధికారులందరి పేర్లను డిజిటల్ డెయిరీలో నమోదు చేస్తున్నాం. ఇలాంటి అధికారులు ఇప్పటికైనా తమ తీరు మార్చుకోకపోతే... వీరందరినీ భవిష్యత్తులో చట్టపరంగా శిక్షించడం ఖాయమని మనోహర్‌రెడ్డి హెచ్చరించారు. -
‘అచ్చెన్నాయుడిని మంత్రి పదవి నుంచి తొలగించాలి’
విజయవాడ: కులమతాలను రెచ్చగొట్టేలా సభలో మాట్లాడుతున్న అచ్చెన్నాయుడిని మంత్రి పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్పీలు డిమాండ్ చేశారు. అన్ని మతాలను గౌరవించాలని రాజ్యాంగం చెబుతుంటే, అచ్చెన్నాయుడు మాత్రం కులమతలాను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మండిపడ్డారు. ఈరోజు(గురువారం, మార్చి 5వ తేదీ) శాసనమండలి సమావేశాల్లో భాగంగా మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మాట్లాడారు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ.. ‘ అచ్చెన్నాయుడితో మాట్లాడిస్తున్నది చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్. రేపు వ్యవసాయం పై జరగాల్సిన చర్చను డైవర్ట్ చేయడం కోసమే ఇలా చేస్తున్నారు. అచ్చెన్నాయుడిని మంత్రి పదవి నుంచి తొలగించాలి. బీఆర్ నాయుడిని తొలగిస్తారా లేదా?’ అని ప్రశ్నించారు.మరో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘ సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. కులమత రాజకీయాలు చేయడం టీడీపీకి అలవాటు. మమ్మల్ని కాదు.. చంద్రబాబుని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించాలి. వెనక్కి పంపించిన ట్యాంకర్లు ఎందుకు వాడారో చంద్రబాబుని అడగాలి.ఇందాపూర్ కు ఎందుకు నెయ్యి టెండర్లు ఇచ్చారో చంద్రబాబుని అడగాలి. దేవుడి సొమ్మును ఎందుకు పక్కదారి పట్టించారని అడగాలి’ అని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ తిరుపతి లడ్డూ పై అపవిత్రమైన మాటలు మాట్లాడింది చంద్రబాబు. లడ్డు పై మా ప్రశ్నలకు దేవాదాయ శాఖ మంత్రి సమాధానం చెప్పలేకపోయారు. కల్తీ జరిగింది మీ హయాంలోనే. వెనక్కి పంపిన నెయ్యి ట్యాంకర్లు వాడింది మీ హయాంలోనే. ఇందాపూర్ ద్వారా హెరిటేజ్ కు దోచిపెట్టడానికే నెయ్యి ధరలు పెంచారు. దీని వెనుక పెద్ద ఆర్ధిక దోపిడీ కుట్ర ఉంది’ అని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. ‘ లడ్డు పై చర్చను పూర్తిగా కొనసాగనివ్వలేదు. లడ్డు పై మా ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతీసారీ కల్తీ నెయ్యి తిరుమలకు వెళ్తోంది. తమ బండారం బయటపడుతుందని వాస్తవాలను రానివ్వడం లేదు. తిరుమల దర్శనం చేసిన తర్వాతే వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర ముగిసిన తర్వాత కూడా దేవదేవుడిని దర్శించుకున్నారు’ అని స్పష్టం చేశారు. -
‘మూసీ నది బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్’
సాక్షి,హైదరాబాద్: మూసీ నది బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్’అని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. గురువారం కేటీఆర్ నాగోల్ మూసీ పరీవాహక ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘రేవంత్ బుల్డోజర్లకు అడ్డంగా నిలబడుతాం. పేదల ఇళ్ళు కాపాడుతాం. మూసీ పేరుతో రేవంత్ రెడ్డి చేస్తోన్న లూటీని అడ్డుకుంటాం. పేము కట్టిన ఇళ్ళకు పెయింటర్ బాబు రంగులు మార్చుతున్నాడు. రేవంత్ హాయంలో ఒక్క ఇల్లు కట్టినట్లు చూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. రేవంత్ .. చేతకాకుంటే మాకు అప్పజెప్పు ఒక్క ఇల్లు కూల్చకుండా మూసీ ప్రక్షాళన చేసి చూపిస్తాం.మూసీ సుందరీకరణకు పునాది వేసిందే కేసీఆర్. మూసీ ప్రక్షాళనపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. పేదలు కన్నీరు కార్చిన ప్రభుత్వాలు మనుగడలేదు. 16వేల కోట్లతో పోయేదాన్ని లక్షా 50వేల కోట్లకు రేవంత్ పెంచారు. రెండేళ్ళు అయినా మూసీ సుందరీకరణపై డీపీఆర్ లేదు.కూల్చకుండా కూడా అభివృద్ధి చేయొచ్చని కేసీఆర్ నిరూపించారు. కోస్గిలో రేవంత్ రెడ్డి ఇల్లు చెరువులో ఉంది. రేవంత్ రెడ్డి సోదరుడు ఇల్లు దుర్గం చెరువులో ఉంది. పొంగులేటి, వివేక్, కేవీపీ, పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు బఫర్‌లో ఉన్నాయి. ఒక్క ఇల్లు కూల్చకుండా ఆరు కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ చేశాం. 30కోట్లతో ఉప్పల్ లో శిల్పారామాన్ని కూడా నిర్మించా’మని స్పష్టం చేశారు. -
హరీష్ రావుపైనే మా అమ్మ పోటీ.. కవిత కుమారుడు ఆదిత్య
ప్రశాంత్‌నగర్ (సిద్దిపేట): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అమ్మ (కల్వకుంట్ల కవిత) సిద్దిపేట నుంచే పోటీ చేస్తుందని ఎమ్మెల్సీ కవిత కుమారుడు ఆదిత్య అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకుముందు జాగృతి నాయకులు ఘనస్వాగతం పలికారు. మే నెలలో కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు ఆదిత్య తెలిపారు. -
రాజ్యసభకు నితీష్.. బీహార్ సీఎం రేసులో ఇద్దరు?
పాట్నా: బీహార్ రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోనున్నట్లు నితీష్ కుమార్ అధికారికంగా ప్రకటన చేశారు. తాను రాజ్యసభకు వెళ్తున్నట్టు క్లారిటీ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో తదుపరి బీహార్ ముఖ్యమంత్రి ఎవరు? అనే చర్చ మొదలైంది.అయితే, బీహార్‌లో ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న కారణంగా బీజేపీ నుంచి ముఖ్యమంత్రి స్థానం దక్కించుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో ఇద్దరి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. బీహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టవచ్చని తెలుస్తోంది. అలాగే, నిత్యానంద రాయ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. కాగా, అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక, సామ్రాట్ చౌదరి బీహార్ రాజకీయాల్లో అంతర్భాగంగా ఉన్నారు. పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పటి నుండి ప్రస్తుతం రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వరకు బీజేపీ నాయకుడిగా కీలక పదవులను నిర్వహించారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా రెండవసారి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.సీఎం రేసు కోసం నిత్యానంద్ రాయ్ కూడా పోటీలో ఉన్నారు. రాయ్ ప్రస్తుతం హోంమంత్రిగా పనిచేస్తున్నారు. కేంద్రంలో పని చేయడానికి ముందు, రాయ్ బీహార్‌కు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. రాయ్ హాజీపూర్ నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2015లో రాయ్ పార్లమెంటరీ టికెట్ గెలుచుకుని ఉజియార్పూర్ నుండి ఎంపీగా పనిచేశారు. మరోవైపు.. నితీష్ కుమారుడు నిశాంత్ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.నితీష్ కీలక వ్యాఖ్యలు.. అంతకుముందు సీఎం నితీష్ కుమార్ ట్విట్టర వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.‘గత రెండు దశాబ్దాలకు పైగా మీరు నాపై ఉంచిన విశ్వాసం, మద్దతు నిరంతరం కొనసాగుతోంది. అదే బలంతో మేము బీహార్ రాష్ట్రానికి, మీ అందరికీ సంపూర్ణ నిబద్ధతతో సేవ చేయగలిగాం. మీ విశ్వాసం, మద్దతు వల్లే బీహార్ ఈరోజు అభివృద్ధి మరియు గౌరవానికి కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. ఇందుకు నేను గతంలో కూడా మీ అందరికీ పలుమార్లు కృతజ్ఞతలు తెలిపాను. నా పార్లమెంటరీ జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచే ఒక కోరిక నా మనసులో ఉంది.బీహార్ శాసన మండలి (విధాన మండల) రెండు సభలతో పాటు, పార్లమెంట్‌లోని రెండు సభల సభ్యుడిగా కూడా ఉండాలని ఆశించాను. ఆ క్రమంలో ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా మారాలని కోరుకుంటున్నాను. మీతో నా ఈ అనుబంధం భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగుతుందని నేను పూర్తి నిజాయితీతో హామీ ఇస్తున్నాను. మీ అందరితో కలిసి అభివృద్ధి చెందిన బిహార్ నిర్మాణం అనే సంకల్పం అలాగే కొనసాగుతుంది. కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి నా పూర్తి సహకారం మరియు మార్గదర్శనం ఉంటుంది’ అని ఆయన అధికారిక ప్రకటన చేశారు. -
చిట్టక్క ఎంట్రీతో పరకాల పాలిటిక్స్‌కి కొత్త ట్విస్ట్..!
సాక్షి, వరంగల్: గీసుకొండ నుంచి పరకాల టార్గెట్‌గా ‘కొండా’ వ్యాఖ్యలు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. గతంలోనే పరకాల నుంచి ఎమ్మెల్యే అవుతానని ట్విట్టర్ ద్వారా పోస్టు చేసిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, మంత్రి కొండా సురేఖ దంపతుల కుమార్తె సుస్మితాపటేల్ (చిట్టక్క).. తాజాగా కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతర సాక్షిగా తన తండ్రి మురళీధర్‌రావు దీవెనలు, గీసుకొండ మండల ప్రజల అండతో ఎమ్మెల్యే అవుతానని మాట్లాడడంతో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ కాక రేపినట్లయ్యింది. ఆమె మాటలకు అనుకూలంగానే కొండా కుటుంబాన్ని గతంలో ఆశీర్వదించినట్లుగా భవిష్యత్‌లో కూడా ఆదరించాలని కొండా మురళి మాట్లాడడంతో పొలిటికల్ హీట్ పుట్టించినట్లయ్యింది. ఎవరు అడ్డొచ్చినా కొండా సుస్మిత అదరదు బెదరదని, ఇది అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. తప్పకుండా పరకాల నుంచే తన కుటుంబం రేసులో ఉంటుందని ఆయన విస్పష్టంగా ప్రకటించడంతో మరోసారి పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ వార్ తెరమీదకు వచ్చినట్లయ్యింది. గతంలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ సుస్మితాపటేల్ బ్యానర్లు వెలిసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలా కొండా, రేవూరి వర్గాలతో కాంగ్రెస్ పార్టీ కేడర్‌లో అయోమయ పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొండా చేసిన ఈ వ్యాఖ్యల మర్మం వెనుక రాజకీయ మతలబు దాగి ఉందని, వరంగల్ తూర్పులో కూడా కొండా వ్యతిరేక వర్గాలు ఉండడంతో అదే సిద్ధాంతాన్ని పరకాలలో ప్రయోగించి.. పార్టీలో తమ పట్టు నిలుపుకోవాలన్న ఎత్తుగడలో భాగమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.అప్పుడు దసరా.. ఇప్పుడు హోలీ● 2024 మే 8న గీసుకొండ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు రడం భరత్ విషయంలో మంత్రి, ఎమ్మెల్యే మధ్య జరిగిన ఫోన్లో వాగ్వాదం సోషల్ మీడియాలో వైరలైంది. తన మనిషిని కాదని ఇతరులకు పదవుల్లో ఎలా ప్రాధాన్యమిచ్చారంటూ రేవూరిని ఆమె ప్రశ్నించారు. మా వల్లే మీరు గెలిచారు.. నియోజకవర్గంలోని సొంత మండలం గీసుకొండలో మేం చెప్పినట్లే నడవాలని అప్పట్లో ఫోన్లో మాట్లాడిన మాటలు ఆడియో లీక్ అవడం సంచలనంగా మారింది. అంతకుముందే తనకు తెలియకుండా పలు మండలాలకు చెందిన వారిని పార్టీలోకి తీసుకోవడంపై ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నారు. ఇదే విషయమై గీసుకొండ మండలంలోని కొండా వర్గానికి చెందిన ఒకరిపై పరకాలలో కేసు కూడా నమోదైంది. మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్యపై మంత్రి బాహాటంగానే అప్పుడు విమర్శలు గుప్పించారు.● 2024 అక్టోబర్ 13న దసరా పండుగను పురస్కరించుకొని గీసుకొండ మండలం ధర్మారంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ఫొటో లేదని ఆయన వర్గీయులు దాన్ని ధ్వంసం చేశారు. ఈక్రమంలో కొండా వర్గీయులు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు కొండా వర్గానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గీసుకొండ పీఎస్‌కు వచ్చిన మంత్రి కొండా సురేఖ సీఐ సీటులో కూర్చొని కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొండా వర్గీయులు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకొని, వారిని విడుదల చేయాలంటూ నినాదాలు చేయడంతో హైటెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్లిందని, ఇది పార్టీ అంతర్గత వ్యవహారం కాదని, స్థానికతకు సంబంధించిన విషయమన్న సంగతి తెలిసిందే.● 2026 మార్చి 3న కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతరను పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కుమార్తె, కొండా సుస్మితాపటేల్ మాట్లాడుతూ కొండా కుటుంబాన్ని గీసుకొండ ప్రజలు ఆదరించారని, భవిష్యత్‌లోనూ బాసటగా ఉండాలని సుస్మితాపటేల్ పరకాల నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉంటాననే సంకేతాలను ఇవ్వడం కలకలం రేపింది. దీంతో ఇప్పటికే ఉప్పునిప్పులా ఉంటున్న కొండా, రేవూరి వర్గాలు మరింత దూరమయ్యే పరిస్థితి నెలకొంది. గతేడాది డిసెంబర్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ గీసుకొండ మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలు గెలిచింది. కొండా వర్గం 7 స్థానాలు, రేవూరి వర్గం 9 స్థానాలు దక్కించుకుంది. ఇలా గీసుకొండ మండల కేంద్రంగా అధికార పార్టీలోనే రెండు వర్గాలు తమ ప్రాబల్యాన్ని చూపుతుండడం గమనార్హం. -
శకం ముగిసింది.. బిహార్ సీఎం పదవికి నితిష్ కుమార్ రాజీనామా!
పాట్నా: బిహార్‌లో సీఎం నితీష్ కుమార్ శకం ముగిసింది. సీఎం పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావాలని కోరుకుంటున్నాను. రెండు దశాబ్దాలుగా నాపై నమ్మకం ఉంచారు. అంకితభావంతో బీహార్ అభివృద్ధి కోసం పనిచేశారు’ అని పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాలుగా మీరు నాపై చూపిన విశ్వాసం, మద్దతుతోనే నేను బిహార్ రాష్ట్రానికి, మీ అందరికీ పూర్తి నిబద్ధతతో సేవ చేయగలిగాము. మీ విశ్వాసం, మద్దతు వల్లే బిహార్ ఈరోజు అభివృద్ధి, గౌరవానికి కొత్త దిశను చూపుతోంది. ఇప్పటి వరకు ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ,ఎంపీగా పనిచేశాను. రాజ్యసభ సభ్యుడిగా పనిచేయాలనేది నా చిరకాల కోరిక.అందుకే రాబోయే ఎన్నికల్లో నేను రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టాలని అనుకుంటున్నా. మీతో నా సంబంధం కొనసాగుతుంది. అభివృద్ధి చెందిన బీహార్ కోసం నేను కృషి చేస్తూనే ఉంటా. నేను మీకు హామీ ఇస్తున్నాను. కొత్త ప్రభుత్వానికి నా పూర్తి మద్దతు, మార్గదర్శకత్వం లభిస్తుంది. पिछले दो दशक से भी अधिक समय से आपने अपना विश्वास एवं समर्थन मेरे साथ लगातार बनाए रखा है, तथा उसी के बल पर हमने बिहार की और आप सब लोगों की पूरी निष्ठा से सेवा की है। आपके विश्वास और समर्थन की ही ताकत थी कि बिहार आज विकास और सम्मान का नया आयाम प्रस्तुत कर रहा है। इसके लिए पूर्व में…— Nitish Kumar (@NitishKumar) March 5, 2026 -
ఎర్రబుక్లు, పిచ్చిబుక్లు మమ్మల్ని ఏమీ చేయలేవు: అంబటి
సాక్షి, విశాఖపట్నం: తన ఇంటిపై దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మానిటర్ చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పోలీసుల సాక్షిగా తన ఇంటిపై దాడి జరిగిందన్నారు. కులాలను రెచ్చగొట్టి ఏం సాధించాలనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. భగవంతుడి దయ వల్ల తనను చంపలేదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో కాపు నేతల బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరిగింది. విశాఖలోని కరణం ధర్మశ్రీ నివాసంలో విశాఖ కాపు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఇటీవల పరిణామాలపై కాపు నేతలు చర్చించారు. అలాగే, కూటమి ప్రభుత్వ అక్రమ కేసులు, అరెస్ట్‌లపై కాపు నేతలు చర్చించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు, ఉమ్మడి విశాఖ జిల్లా కాపు నేతలు పాల్గొన్నారు.అనంతరం, మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీకి చెందిన వారు నా ఇంటిపైకి వచ్చారు.. కులం పేరుతో దూషించారు. కులాలను రెచ్చగొట్టి ఏం సాధించాలనుకుంటున్నారు?. గుంటూరు నడి బొడ్డున నా ఇంటిపై దాడి చేశారు. నా ఇంటిపై దాడిని టీవీ చానెల్స్ లైవ్ ఇస్తున్నా ప్రభుత్వం తెలియనట్టుగా ఉంది. భగవంతుడి దయ వల్ల నన్ను చంపలేదు. రెడ్‌బుక్‌ను మా కుక్క లెక్కచేయదంటే లోకేష్‌కు కోపం వచ్చిందేమో.నేను సెంటర్ జైల్లో ఉన్నప్పుడు నా మీద ఎంతో ప్రేమ అభిమానం చూపించారు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు తరలి వచ్చారు. నా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నాపై దాడి చేసి అక్రమంగా జైలుకు పంపారు. నన్ను 18 రోజులు అక్రమంగా జైల్లో పెట్టారు. నాపై జరిగిన దాడి ఒక కులంపై మరొక కులం చేసిన దాడిగా భావించాలి. చరిత్రలో ఎన్నడు ఎప్పుడు జరగని దాడి నాపై జరిగింది. టీడీపీ గుండాలకు అలుపు వచ్చే వరకు దాడి చేశారు. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 12 గంటలకు దాడి జరిగింది. చంద్రబాబు పతనం ప్రారంభమైంది. నాపై చేసిన దాడికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నాను. ఎర్రబుక్కులు, పిచ్చిబుక్కులు మమ్మల్ని ఏమీ చేయలేవు.కులాలను రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నారు. టీడీపీ గూండాలు వంగవీటి రంగాను దారుణంగా చంపారు. పోలీసులు సహకారంతో రంగాను హత్య చేశారు. అదేవిధంగా పోలీసులను అడ్డం పెట్టుకొని నాపై దాడి చేశారు. కాపులను బీసీల్లో చేర్చుతామని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చిన హామీ కోసం ముద్రగడ ఉద్యమం చేశారు. కాపుల కోసం ఉద్యమం చేసిన ముద్రగడను జైల్లో పెట్టారు, చంపాలని చూశారు. పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నాడు కాబట్టి కాపులు మా వైపు ఉన్నారనుకుంటే అది మీ భ్రమ’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
బీఆర్ నాయుడిని వెంటనే తప్పించాలి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్..శాసనమండలి మీడియా పాయింట్..ఉద్యోగాలపై ప్రశ్న..నిరుద్యోగ యువతకు ఆర్ధిక సాయంపై సభలో ప్రశ్నించిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కామెంట్స్..5,72, 280 ఉద్యోగాలిచ్చామని మంత్రి చెబుతున్నారువైఎస్ జగన్ ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసిన ప్రభుత్వం ఇదిపట్టుమని 15 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారురాష్ట్రంలో నిరుద్యోగుల లెక్క ఏమైనా ఉందా?నిరుద్యోగుల కోసం ఏమైనా కమిటీ వేశారా?సాక్షాత్తూ సీఎం చంద్రబాబు 6,28,320 ఉద్యోగాలిచ్చామని చెప్పారుఉద్యోగాలపై సీఎం చెప్పింది అబద్ధమా మంత్రి చెప్పింది అబద్ధమా?ఏపీలో 8.2% శాతం నిరుద్యోగం ఉందని కేంద్రం చెప్పింది20 లక్షల ఉద్యోగాలు, మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి హామీ ఏమైందిఎమ్మెల్సీలు భరత్, తూమాటి మాధవరావు కామెంట్స్..టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడిని తక్షణమే తప్పించాలిబీఆర్ నాయుడి చరిత్ర గురించి ఇందులేఖ అనే మహిళ చంద్రబాబు లేఖరాశారుఅలాంటి వ్యక్తిని చంద్రబాబు ఎలా చైర్మన్ గా నియమిస్తారుబీఆర్ నాయుడు వంటి వ్యక్తి చైర్మన్‌గా కొనసాగడం వల్ల తిరుమల పవిత్ర దెబ్బతింటోందిఎన్నో ఫిర్యాదులు వచ్చినా బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్‌గా నియమించారుఅపవిత్రమైన వ్యక్తిని టీటీడీ చైర్మన్ చేయడం వల్లే తిరుమలలో అపచారాలు జరుగుతున్నాయి30 ఏళ్ల నుంచి ఆ మహిళతో తనకు సంబంధం ఉందని బీఆర్ నాయుడు చెబుతున్నారుభగవద్గీతలో ఏముందని మాట్లాడటానికి నువ్వు అసలు మనిషివేనా?రెండు మీడియా సంస్థల మధ్య జరుగుతున్న యుద్ధంలో వైఎస్సార్సీపీని బలిచేయాలని చూస్తున్నారుసోషల్ మీడియాలో మీ వీడియోలు బయటికి వచ్చాయిహిందూ ధర్మాన్ని కాపాడటం కోసమే మేం పోరాడుతున్నాంబీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పించకపోతే భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం.ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్..బీఆర్ నాయుడు అత్యంత కళంకితుడుఅలాంటి వ్యక్తిని చంద్రబాబు టీటీడీ చైర్మన్‌ను చేశారుచంద్రబాబుకి హిందువులంటే గౌరవం ఉంటే బీఆర్ నాయుడిని వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పించాలిబీఆర్ నాయుడు చాలా నీచంగా మాట్లాడుతున్నారుభగవద్గీత అంటే గౌరవం లేని వ్యక్తి టీటీడీ చైర్మన్‌గా కొనసాగడానికి అర్హుడా?.మీకు వ్యాపారాలే ముఖ్యమైతే తక్షణమే టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయండిబీఆర్ నాయుడిని చైర్మన్‌గా చేసిన తర్వాతే తిరుమల అపవిత్రమైందిలడ్డు కల్తీ ప్రచారంతో కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారువైకుంఠ ఏకాదశి రోజున భక్తులు చావుకు కారణమయ్యారుగోశాలలో భారీగా గోవులు చనిపోయాయిబీఆర్ నాయుడు నైతిక విలువలు లేని వ్యక్తిఅందుకే తిరుమలలో అనేక అపచారాలు జరుగుతున్నాయిహీరోయిన్లకు 15 నిమిషాల్లో దర్శనం చేయిస్తారు.సామాన్య భక్తులను గాలికి వదిలేస్తారు.హిందూ ధర్మం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, పవన్, బీఆర్ నాయుడికి ఉందా? టీడీపీ అంటే టెంపుల్ డెమాలిష్ పార్టీహిందూ మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబులడ్డూ విషయంలో పవన్ దుర్గగుడి మెట్లు కడిగారుసనాతన ధర్మం కోసం పనిచేస్తానన్న పవన్ ఇప్పుడు ఏ మెట్లు కడుగుతారుకళంకిత వ్యక్తిని టీటీడీ చైర్మన్‌గా చేసినందుకు పవన్ తిరుమల మెట్లు కడగరా?. సమావేశాలు ప్రారంభం.. ప్రారంభమైన మండలి సమావేశాలుమండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల వాయిదా తీర్మానంకళంకిత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును తొలగించాలని కోరుతూ వాయిదా తీర్మానంవాయిదా తీర్మానం ఇచ్చిన ఎమ్మెల్సీలు తుమాటి మాధవరావు, వరుదు కల్యాణి, భరత్వైఎస్సార్సీపీ తీర్మానాన్ని తిరస్కరించిన మండలి చైర్మన్వాయిదా తీర్మానంపై చర్చించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల నినాదాలుబీఆర్ నాయుడును తొలగించాలని నినాదాలువైఎస్సార్సీపీ సభ్యుల నినాదాలతో మండలి వాయిదా. -
వీడిన ఉత్కంఠ.. తెలంగాణలో రాజ్యసభకు ఇద్దరు ఎవరంటే?
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు సభ్యుల జాబితాపై ఉత్కంఠ వీడింది. ఏఐసీసీ తాజాగా రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలో తెలంగాణ నుంచి అభిషేక్ సింగ్వి, వేం నరేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. దీంతో, అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్ వీడింది.అలాగే, తమిళనాడు నుంచి క్రిస్టోఫర్ తిలక్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అనురాగ్ శర్మ, హర్యానా నుంచి కరమ్ వీర్ సింగ్, చత్తీస్‌గఢ్ నుంచి ఫులోదేవి నేతంను కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసింది. ఈ మేరకు గురువారం ఉదయం జాబితాను విడుదల చేసింది. కాగా, నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ నేపథ్యంలో నేడు కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేయకుంటే.. ఇద్దరు అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. Congress releases a list of candidates for the Rajya Sabha Biennial elections.Abhishek Manu Singhvi and Vem Narender Reddy from Telangana.Phulo Devi Netam from Chhattisgarh.Karamvir Singh Boudh from Haryana.Anurag Sharma from Himachal Pradesh.M. Christopher Tilak from Tamil… pic.twitter.com/o2JwrC5Ax2— ANI (@ANI) March 5, 2026 -
‘అచ్చో’సిన మతవిద్వేషం
సాక్షి, అమరావతి: కుల మతాలకు అతీతంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో పనిచేస్తామంటూ ప్రమాణం చేసిన మంత్రులే బుధవారం శాసనమండలి సాక్షిగా వ్యక్తులకు మతాలను ఆపాదిస్తూ రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ‘‘మీరు, మీ పార్టీ నాయకుడు క్రిస్టియన్లు కాబట్టే వెంకటేశ్వరస్వామి, హిందుసమాజంపై కక్ష కట్టి వ్యవహరిస్తున్నారు’’ అంటూ మంత్రి కె.అచ్చెన్నాయుడు నేరుగా మండలి చైర్మన్ మోషేన్ రాజు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం తిరుమల లడ్డూపై చర్చ జరుగుతున్న సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేరుగా చైర్మన్ స్థానానికే మతాలను ఆపాదించడంతో సభ ఒక్కసారిగా భగ్గుమంది. మంత్రులమనే బాధ్యత మరిచి మరీ చట్ట సభలోనే ఎస్సీ వర్గానికి చెందిన హిందువైన మోషేన్ రాజు మతాన్ని మార్చే దుస్సాహసానికి టీడీపీ ఒడికట్టింది. తిరుపతి లడ్డూపై చర్చను పక్కదోవ పట్టించే పక్కా ప్రణాళికతో టీడీపీ మంత్రులు సభలో లేని వైఎస్ జగన్మోహన్రెడ్డి మత ప్రస్తావనను పదేపదే తీసుకొచ్చారు. వైఎస్ జగన్‌ను మతం ఆధారంగా నిందించడం, తిరుపతి లడ్డూకు కళంకం తేవడమే లక్ష్యంగా మంత్రులు ప్రవర్తించారు. మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నిరసన తెలిపారు. తక్షణం ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించడంతో పాటు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై చైర్మన్ స్పందిస్తూ ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నన్ను క్రిస్టియన్ అనడానికి మీరు ఎవరు? మీరు ఎలా చెప్పారం’టూ నిలదీయడంతో పాటు క్షమాపణ చెప్పాల్సిందిగా కోరారు. అయినా అచ్చెన్నాయుడు ‘ఆ మాటలకు కట్టుబడి ఉన్నా... క్షమాపణ చెప్పేది లేదం’టూ భీష్మించి కూర్చున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తాను హిందువునని, తన మతాన్ని, కులాన్ని కించపర్చడం సరికాదని గట్టిగా చెప్పారు. మంత్రి వ్యాఖ్యలతో అధికారపక్షం కూడా ఇరుకునపడటంతో పలువురు మంత్రులు అచ్చెన్నాయుడు వద్దకు వచ్చి దీన్ని నుంచి ఎలా బయటడాలన్నదానిపై తీవ్ర తర్జనభర్జనలు చేశారు. అయినా అచ్చెన్నాయుడు తన అహాన్ని వీడకుండా ‘మీరు సభ సాక్షిగా హిందువునని చెప్పినందుకు ఎటువంటి భేషజాలకు పోకుండా ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నా’ అని ప్రకటించారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందానని, ఇక చర్చను కొనసాగిద్దామని చైర్మన్ చెప్పారు. అయితే వైఎస్సార్సీపీ సభ్యులు అచ్చెన్నాయుడు సభకు క్షమాపణ చెప్పాలిందేనంటూ పట్టుపట్టారు. దీంతో సభను అయిదు నిమిషాలు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.తిరిగి అదే మత విద్వేష వ్యాఖ్యలుతిరిగి గంటన్నర తర్వాత మొదలైన తర్వాత కూడా అధికారపార్టీ సభ్యులు అదే విధంగా మత విద్వేష వ్యాఖ్యలను కొనసాగించారు. వెంకటేశ్వరస్వామి మీకు దేవుడు కాదా అంటూ మరింత విద్వేషకర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా చైర్మన్ నిజంగా హిందువైతే వైఎస్సార్సీపీ సభ్యులను కంట్రోల్ చేయాలంటూ మరోమారు చైర్మన్‌కు మతం రంగుపూసే ప్రయత్నం చేశారు. రూ.620లకు కేజీ నెయ్యిని కొనడాన్ని వ్యతిరేకించేవారు హిందువులు కారంటూ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలంటూ వైఎస్సార్సీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తుండటంతో చైర్మన్ సభను గురువారానికి వాయిదా వేశారు. -
దేవుడిపై భక్తి ఉన్నవారు ఇలా చేస్తారా? బాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, అమరావతి: కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి దేవస్థానం నిర్వహణ అత్యంత పవిత్రమైన బాధ్యతని.. సీఎం చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీశారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలిసి కూడా ఆరోపణలున్న వ్యక్తినే టీటీడీ చైర్మన్‌గా నియమించి ఆలయ ప్రతిష్ట, పవిత్రతను చంద్రబాబు కాలరాశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలోనే టీటీడీ ల్యాబ్ నాణ్యత లేదంటూ తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు తిరిగి టీటీడీకి రావడం.. రిజెక్ట్ చేసిన వాటిని అంగీకరించి, అనుమతించడం.. తిరుమల లడ్డూ తయారీలో వాడడం.. ఇదే విషయాన్ని సీబీఐ సిట్ ఛార్జిషీట్లో స్పష్టం చేయడం ఆందోళనకరమన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై రాజకీయ దుమారం రేపుతూ.. నెయ్యి ధరల విషయంలో తప్పుడు ప్రచారం చేసి లాభాలు ఆర్జించడం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందన్నారు. దేవుడిపై భక్తి ఉన్న వారు ఎవరైనా ఇలా చేస్తారా? అని సీఎం చంద్రబాబు నిలదీశారు. ఆలయాల పవిత్రత, భక్తుల విశ్వాసాన్ని కాపాడటం ప్రభుత్వాల తొలి బాధ్యత అని గుర్తు చేశారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు. టీటీడీ నిర్వహణలో చంద్రబాబు సర్కార్ తీరును సాక్ష్యాధారాలతో ఎండగడుతూ తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ బుధవారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..దేవుడిపై బాబుకు భక్తి, శ్రద్ధ, భయం లేదని మరోసారి రుజువైంది..దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం, శ్రీవేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల, తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత. అది అత్యంత నిష్టతో చేయాల్సిన బాధ్యత. అలాంటి టీటీడీ చైర్మన్ పదవిలో నిష్కళంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ట కలిగిన వారే ఉండాలి. కానీ చంద్రబాబు ఈ పవిత్రమైన స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారు. ఆలయ ప్రతిష్టను మంటగలిపేలా వ్యవహరించారు. ఒక బాధిత మహిళ చంద్రబాబు గారికి లేఖ రాస్తూ.. ప్రస్తుత టీటీడీ చైర్మన్ తనను మోసం చేశాడని, తన జీవితంతో ఆడుకున్నాడని, ఏ చిన్న పని కోసం ఆడవారు వచ్చినా వారిని ఇబ్బంది పెడతారంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. బాధ్యత ఉన్న వ్యక్తిగా చంద్రబాబు గారు ఈ ఫిర్యాదుపై విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఇన్ని రకాల ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా, విచారణ, చర్యలన్నవి పూర్తిగా పక్కనపెట్టి, అతన్నే టీటీడీ చైర్మన్‌గా నియమించి, ఆలయ ప్రతిష్ట, పవిత్రతను కాలరాశారు. దేవుడి పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా? ఆలయ పవిత్రతను కాపాడాలన్న ఉద్దేశం ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? చంద్రబాబుకు భక్తీ లేదు.. శ్రద్ధ అంతకన్నా లేదు. దేవుడిపట్ల భయం కూడా లేదని మరోసారి రుజువైంది.టీటీడీకి నెయ్యి సరఫరాను సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు..ఈ రకంగా చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి, దాన్ని వేరొకరిమీదకు నెట్టి, మళ్లీ దానిమీద రాజకీయ దుమారం రేపుతూ, ఆ నెయ్యితోనే స్కాంలు చేస్తున్నారు. మరోవైపు 2014–19 మధ్య టీటీడీ నెయ్యి కొనుగోలు ధర దాదాపుగా రూ.278– రూ.330 ఉంది. 2019–24 మధ్య కూడా నెయ్యి సగటు రేటు దాదాపుగా అంతే ఉంది. చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉంటూ, నెయ్యి విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తూ, దానిపై రాజకీయ దుమారం రేపుతూ.. తన హెరిటేజ్‌కి చెందిన మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇందాపూర్ డెయిరీకి కిలో నెయ్యి రూ.658లకు 2025లో అమ్ముకునేందుకు కట్టబెట్టి, లాభాలు ఆర్జిస్తూ, స్కాంలు చేస్తూ టీటీడీకి నెయ్యి సరఫరాను తన సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు భక్తి లేదు.. శ్రద్ధ లేదు.. నిష్ట లేదు.. నిజాయితీ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ.నాణ్యత లేని నెయ్యిని అనుమతించింది.. లడ్డూ తయారీలో వాడింది బాబు హయాంలోనే..లడ్డూలో వాడే నెయ్యి విషయంలోనూ చంద్రబాబుది అదే నిర్లక్ష్యం. నెయ్యి క్వాలిటీ(నాణ్యత) బాగోలేదని ఈ చంద్రబాబు గారి హయాంలోనే టీటీడీ ల్యాబ్ తిప్పి పంపినా.. మళ్లీ అవే క్వాలిటీ లేని నెయ్యి ట్యాంకర్లు ఆయన హయాంలోనే వేరే వారి పేరిట తిరిగి టీటీడీకి రావడం.. ఆయన హయాంలో వచ్చిన అవే ట్యాంకర్లను టీటీడీ అంగీకరించి, అనుమతించడం.. తిరుమల లడ్డూ తయారీలో వాడడం.. ఇదే విషయాన్ని సీబీఐ–సిట్ మొదటి ఛార్జిషీటు 64, 91 పేజీల్లోనూ, ఫైనల్ ఛార్జిషీటు 44వ పేజీలోనూ చాలా స్పష్టంగా చెప్పింది. చంద్రబాబుకు దేవుడి పట్ల భక్తీ లేదు.. ఆలయాల నిర్వహణపట్ల శ్రద్ధ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ. -
సమాధానం చెప్పలేక సత‘మతం’!
సాక్షి, అమరావతి: పవిత్ర తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ సీఎం చంద్రబాబు చేసిన దుష్ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని చార్జిషీట్లో సీబీఐ తేల్చేసినా, కేంద్ర ప్రభుత్వ ల్యాబ్‌లు నిర్ధారించినా పశ్చాత్తాపం లేదు..! కనీసం చట్టసభలోనూ కూటమి సర్కారు స్పందించలేదు! 2014–19 మధ్య టీటీడీకి కిలో రూ.278కే నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డెయిరీకి ఇప్పుడు ఏకంగా కిలో రూ.658 చొప్పున సరఫరా కాంట్రాక్టు అప్పగించడంపైనా జవాబు లేదు! ఇటీవల వరకు హెరిటేజ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా చూపించిన ఇందాపూర్ డెయిరీని గుట్టు చప్పుడు కాకుండా కో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా మార్చేయడంపైనా నోరు విప్పలేదు! చంద్రబాబు అధికారంలోకి వచ్చాక టీటీడీ రిజెక్ట్ చేసిన నెయ్యి ట్యాంకర్లను దొడ్డి దారిన రప్పించి తిరిగి అవే ట్యాంకర్ల నెయ్యిని లడ్డూల తయారీకి వాడినట్లు సాక్షాత్తూ సీబీఐ తేల్చేసినా సమాధానం లేదు! ప్రభుత్వ టెండర్లలో హెరిటేజ్ ఎప్పుడూ పాల్గొనలేదంటూ చంద్రబాబు చెబుతున్న మాటల్లో నిజం లేదని.. మండలి సాక్షిగా విపక్షం ఆధారాలను బహిర్గతం చేస్తే సమాధానం అంతకంటే లేదు!!చర్చకు భయపడి పక్కదారి పట్టించేందుకేతిరుమల లడ్డూపై చంద్రబాబు దుష్ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కేంద్ర ప్రభుత్వ ల్యాబ్‌లు, సీబీఐ చార్జిషీట్లో తేల్చేయడం.. ఇందాపూర్ డెయిరీతో హెరిటేజ్ వ్యాపార అనుబంధం.. నెయ్యిపై రాజకీయ, ఆర్థిక కుట్రలు బహిర్గతం కావడం.. ఇదంతా చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్‌కు లబ్ధి చేకూర్చేందుకేనని తేటతెల్లం కావడం.. టీడీపీ కూటమి సర్కారుకు దుర్బుద్ధి లేకుంటే దీనిపై చట్టసభలో చర్చకు ఎందుకు జంకుతోందని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా చర్చించుకోవడం.. శాసన మండలి చైర్మన్ న్యాయం వైపు గట్టిగా నిలబడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చర్చకు ఒప్పుకున్నట్లు నటిస్తూనే చంద్రబాబు సర్కారు డ్రామాలాడటం పట్ల హైందవ ధార్మిక సంస్థలు, హిందూ సమాజం తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇన్ని రోజులూ మొహం చాటేసిన చంద్రబాబు సర్కారు కుట్ర బుద్ధితో టాపిక్ డైవర్షన్ రాజకీయాలకు తెర తీసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్వయంగా అధికార పక్షమే ఇన్ని రోజులు సభను అడ్డుకున్న దాఖలాలు దేశ చరిత్రలో లేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. లడ్డూపై శాసన మండలిలో బుధవారం చర్చ మొదలు కాగానే మంత్రులు అడ్డుపడటం.. మతం ప్రస్తావన తేవడం.. ఎస్సీ వర్గానికి చెందిన మండలి చైర్మన్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం అంతా వ్యూహం ప్రకారం లడ్డూపై చర్చకు భయపడి పక్కదారి పట్టించేందుకేనని మండలి సాక్షిగా బహిర్గతమైందని పేర్కొంటున్నారు. లడ్డూపై సభలో చర్చ జరిగితే చంద్రబాబు రాజకీయ, ఆర్థిక కుంభకోణం కుట్రలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో టీడీపీ తనకు అలవాటైన రీతిలో డైవర్షన్ పాలిటిక్స్‌ను ఎంచుకుందని స్పష్టం చేస్తున్నారు. వెబ్సైట్లో తీసేస్తే హెరిటేజ్‌కు, ఇందాపూర్‌కు ఉన్న సంబంధాలు తెగిపోతాయా? ఒక పరిశ్రమ మరో పరిశ్రమతో కలసి వ్యాపారం చేస్తోందంటే వెబ్సైట్లో తీసేస్తే అయిపోతుందా? అంటూ వ్యాఖ్యానించిన మంత్రి అచ్చెన్న దీన్ని కవర్ చేసుకునేందుకే ‘మతం’ ప్రస్తావన తెచ్చారని విశ్లేషిస్తున్నారు. వైఎస్సార్ సీపీ సభ్యుడు చంద్రశేఖర్‌రెడ్డి మొత్తం 19 నిమిషాలు మాట్లాడితే అందులో 12 సార్లు అడ్డుపడ్డారంటే అధికారపార్టీ ఏ స్థాయిలో భయపడిందో చెప్పేందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు.బాబూ.. హిందూ సమాజం నిన్ను క్షమించదు..!రాజకీయ కుట్రతో ప్రారంభమైన నెయ్యి వ్యవహారం ఆర్థిక కుట్రగా ఎలా మారిందో విపక్ష సభ్యులు చంద్రశేఖర్‌రెడ్డి, తూమాటి మాధవరావు సాక్ష్యాధారాలతో శాసన మండలిలో ఎండగట్టారు. పరమ పవిత్రమైన తిరుమల లడ్డూలో పంది కొవ్వు, చేప కొవ్వు కలిసిందంటూ దుష్ప్రచారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబును హిందూ సమాజం క్షమించబోదని చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు నియమించిన సిట్‌పై నమ్మకం లేకనే వైవీ సుబ్బారెడ్డి సీబీఐ దర్యాప్తు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారని, ఇది తమ చిత్తశుద్ధికి నిదర్శనమని గుర్తు చేశారు. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌కు ఇందాపూర్ డెయిరీతో ఉన్న సంబంధాలను సాక్ష్యాధారాలతో వివరించారు. హెరిటేజ్ వెబ్సైట్లో ఇన్నాళ్లూ తమ తయారీ సంస్థగా చూపించిన ఇందాపూర్ డెయిరీని ఆరోపణలు రాగానే హఠాత్తుగా కో–మాన్యుఫాక్చర్గా మార్చడంతో పాటు మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్‌తో రాజీనామా చేయించిన వైనాన్ని వివరించారు. 2016లో టీటీడీ నాణ్యత పరీక్షల్లో ఇందాపూర్ డెయిరీ ఫెయిల్ అయ్యిందని, ఇప్పుడు అదే ఇందాపూర్కి రూ.680కి నెయ్యి సరఫరా అప్పగించడం వెనుక పెద్ద ఆర్థిక కుంభకోణం దాగి ఉందన్నారు. ఏఆర్ డెయిరీ, బోలేబాబా డెయిరీలను టీడీపీ ప్రభుత్వమే అనుమతించిందని, వారి హయాంలోనే ఏఆర్ డెయిరీ నెయ్యి సరఫరా చేసిందన్నారు. నాణ్యతా ప్రమాణాలు లేనందున నాలుగు నెయ్యి ట్యాంకర్లను తిరస్కరిస్తే వాటిని ఎవరి ఒత్తిడి మేరకు సంగం డెయిరీతో సంబంధం ఉన్న వైష్ణవీ డెయిరీ ద్వారా అనుమతించారో చెప్పాలంటూ నిలదీశారు. కల్తీ నెయ్యి సరఫరా టీడీపీ హయాంలో జరిగితే వైఎస్సార్ సీపీకి ఏం సంబంధమంటూ ప్రశ్నించారు. ఎన్డీడీబీ రిపోర్టు, సీబీఐ చార్జిషీటులో ఎక్కడా కూడా జంతుకొవ్వు కలిసిందని లేకపోయినా 120 కోట్ల మంది హిందువుల విశ్వాసాన్ని హేళన చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడటం దారుణమన్నారు. సీబీఐ చార్జిషీటులో టీటీడీ జీఎం ఫిర్యాదును ప్రస్తావిస్తే, అదే నివేదిక అంటూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విమర్శించారు. హెరిటేజ్ ప్రభుత్వ టెండర్లలో ఎప్పుడూ పాల్గొనలేదంటూ శాసన సభను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. టీటీడీకి పాలపొడి సరఫరా టెండర్లలో పాల్గొందని పేర్కొన్నారు. ఒకసారి టీటీడీకి హెరిటేజ్ పాలపొడి సరఫరా చేయగా బిల్లులు ఆగిపోతే ఒత్తిడి తెచ్చి ప్రత్యేకంగా రిజల్యూషన్‌తో డబ్బులు తీసుకున్న వైనాన్ని ఆధారాలతో వివరించారు. హెరిటేజ్ మజ్జిగ సరఫరాకు సంబంధించి కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాలను కూడా సభ ముందుంచారు. చంద్రబాబు కుటుంబంతో కలసి గత ఐదేళ్లలో పలుదఫాలు తిరుమల వెళ్లి ప్రసాదం తిన్నారని మరి ఎప్పుడైనా లడ్డూ కల్తీ జరిగిందని ఫిర్యాదు చేశారా? అని ప్రశ్నించారు. అయోధ్యకు వెళ్లి బాగుందంటూ తిరుమల లడ్డూలు తిన్న కూటమి నేతలు ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారంటూ నిలదీశారు. ఇందాపూర్ కోసం నిబంధనలు మార్చామని స్వయంగా మీ పార్టీ ఎమ్మెల్యే, టీటీడీ ప్రొక్యూర్మెంట్ కమిటీ సభ్యుడే స్వయంగా శాసనసభలో వెల్లడించారని గుర్తు చేశారు. కేవలం గేదె పాలను మాత్రమే సేకరిస్తున్న సంగం డెయిరీ ఆవు నెయ్యి ఎలా సరఫరా చేస్తుందని ప్రభుత్వాన్ని నిలదీశారు. ⇒ ఒకానొక దశలో తమ సభ్యుడు చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలని కోరిన తూమాటి మాధవరావుపై మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి దాడి చేసే యత్నం చేశారు. ఇంత గందరగోళ పరిస్థితుల మధ్యలో కూడా విపక్ష వైఎస్సార్ సీపీ సభ్యులు పూర్తి ఆధారాలతో చంద్రబాబు కుట్రను మండలి సాక్షిగా బయటపెట్టారు.⇒ అంతకుముందు స్వల్పకాలిక చర్చ కంటే ముందు మంత్రి స్టేట్మెంట్ ఇస్తారంటూ అధికారపార్టీ సభ్యులు చర్చ జరగకుండా అడ్డుకున్నారు. అయితే సభలో కొత్త సంప్రదాయాలకు అవకాశం లేదని, నిబంధనల ప్రకారమే చర్చ తర్వాత ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుందంటూ చైర్మన్ చర్చను ప్రారంభించారు. టీడీపీ తరపున అనురాధ మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో పాటు వైఎస్ జగన్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. -
పెద్దలు 'వేం' చేశారు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై గత కొద్దిరోజులుగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఎన్నో మల్లగుల్లాలు, సుదీర్ఘ చర్చల అనంతరం కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ నుంచి బరిలో నిలిచే ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది అభిõÙక్ మను సింఘ్వీతోపాటు, రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత వేం నరేందర్‌రెడ్డికి అవకాశం ఇచ్చింది. అభ్యర్థుల ఎంపిక వ్యవహారం కొలిక్కిరాగానే, కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు స్వయంగా వేం నరేందర్‌రెడ్డికి ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేయడంతోపాటు అభినందనలు తెలిపారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఖరారైన అభ్యర్థులు గురువారం తమ నామినేషన్లను దాఖలు చేస్తారు. ఆ మూడు పేర్ల చుట్టే తిరిగిన చర్చ అభ్యర్థుల ఖరారుకు ముందు ఢిల్లీ వేదికగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అభ్యర్థి ఎంపికకు సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఢిల్లీకి చేరుకున్నా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితర కీలక నేతలు అందుబాటులో లేరు. దీంతో సీఎం వారితో జూమ్ యాప్ ద్వారా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ వర్చువల్ మీటింగ్‌లో ప్రధానంగా మూడు పేర్ల చుట్టే సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. వేం నరేందర్‌రెడ్డి, దొమ్మాటి సాంబయ్య, వినయ్‌కుమార్ పేర్లను అధిష్టానం తీవ్రంగా పరిశీలించింది. నెగ్గిన రేవంత్ పట్టు ! ఈ జూమ్ మీటింగ్‌లో అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్టానానికి, రాష్ట్ర నాయకత్వానికి మధ్య చర్చ జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. వినయ్‌కుమార్‌కు అవకాశం ఇస్తే బాగుంటుందనే వైఖరితో ఆయన వైపు మొగ్గు చూపినట్టు తెలిసింది. అయితే, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం తనకు అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్‌రెడ్డికి ఈసారి ఎలాగైనా అవకాశం ఇవ్వాల్సిందేనని గట్టిగా పట్టుబట్టారు. రాష్ట్ర రాజకీయ సమీకరణాలు, పార్టీలో ఆయన సీనియారిటీని ఈ సందర్భంగా సీఎం వివరించినట్టు సమాచారం. సుదీర్ఘ చర్చల అనంతరం సీఎం పట్టుదలకే అధిష్టానం గౌరవం ఇచ్చింది. వేం నరేందర్‌రెడ్డి వైపే మొగ్గుచూపి, జాతీయ కోటాలో అభిషేక్ మను సింఘ్వీతో కలిపి ఆయన పేరును ఖరారు చేసింది. అభ్యర్థుల బయోడేటా: వేం నరేందర్‌రెడ్డి జననం: 1960 తల్లిదండ్రులు: వేం వెంకటమ్మ– చెన్న కృష్ణారెడ్డి విద్యార్హతలు: బీఏ కుటుంబ నేపథ్యం: భార్య విజయలక్ష్మి, ఇద్దరు కుమారులు (కృష్ణ భార్గవ్, కృష్ణ కీర్తన్) రాజకీయ ప్రస్థానం: ఉమ్మడి ఏపీలో 2004 నుంచి 2009 వరకు మహబూబూబాద్ ఎమ్మెల్యేగా సేవలందించారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంటూ, పార్టీలో ట్రబుల్ షూటర్‌గా, ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తుడిగా గుర్తింపు పొందారు. అభిషేక్ మను సింఘ్వీ జననం: 24 ఫిబ్రవరి 1959 స్వస్థలం: జోధ్‌పూర్ (రాజస్తాన్) తల్లిదండ్రులు: లక్ష్మీమాల్ సింఘ్వీ, కమల్ సింఘ్వీ కుటుంబ నేపథ్యం: ఇద్దరు పిల్లలు విద్యార్హతలు: ఢిల్లీలోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో బీఏ, కేంబ్రిడ్జిలోని ట్రినిటీ కాలేజీ నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. దేశంలోనే అత్యుత్తమ న్యాయవాదుల్లో ఒకరిగా గుర్తింపు. రాజకీయ ప్రస్థానం: గతంలో పశ్చిమ బెంగాల్, రాజస్తాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన అపార అనుభవం ఉంది. కె.కేశవరావు రాజీనామాతో తెలంగాణలో ఖాళీ అయిన స్థానం నుంచి 2024 ఆగస్టు 28న రాజ్యసభకు వెళ్లారు. -
పట్టు పట్టి.. సన్నిహితుడికి ‘పట్టం’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సన్నిహితుడైన వేం నరేందర్‌రెడ్డికి రాజ్యసభ స్థానం ఇప్పించుకోవడంలో సఫలీకృతులయ్యారు. వాస్తవానికి, ఈ దఫా రాష్ట్రం నుంచి ఇద్దరికి రాజ్యసభకు వెళ్లే అవకాశం లభించింది. ఈ రెండు స్థానాల్లో ఒకటి అధిష్టానం కోటాకు వెళుతుందని, మరొకటి తెలంగాణ నాయకత్వానికి వస్తుందనే చర్చ మొదటి నుంచి జరిగింది.అయితే తెలంగాణకు వచ్చే ఒక స్థానం విషయంలో సామాజిక వర్గాల వారీగా సమీకరణలు తెరపైకి వచ్చాయి. అధిష్టానం కోటాలో అగ్రవర్ణాలకు చెందిన సింఘ్వీ కేటాయించాల్సి ఉన్నందున మరో స్థానాన్ని బీసీ లేదా ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలన్న ప్రతిపాదన బలంగా వినిపించింది. అయితే, ఇదే సామాజిక వర్గ కోణాన్ని సీఎం రేవంత్‌రెడ్డి అధిష్టానం ముందు పెట్టి తన మాట నెగ్గించుకోగలిగారని పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం దిశగా కాంగ్రెస్ పార్టీ అనేక అడుగులు వేస్తోందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలకు ఇప్పటికే పలుసార్లు ప్రాధాన్యం ఇచ్చామని, ఈసారి తెలంగాణలో బలమైన సామాజిక వర్గానికి చెందిన రెడ్డి నేతకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని ఆయన అధిష్టానం ముందు తన ఆలోచనను వెలిబుచ్చారని చెబుతున్నాయి.. ఈ కోణంలోనే తనకు చేదోడువాదోడుగా ఉండే అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డిని ఆయన మొదటి నుంచి చర్చల్లో ఉంచగలిగారని, ఆయనకు ఇవ్వడం వల్ల జరిగే ప్రయోజనాన్ని సీఎం అధిష్టానానికి స్పష్టంగా వివరించగలిగారని గాందీభవన్ వర్గాలు చెబుతున్నాయి. పోయిన సారే అనుకున్నా... అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దొరకకపోవడంతో తన సన్నిహితుడైన వేం నరేందర్‌రెడ్డిని ఎలాగైనా రాజ్యసభకు పంపాలని సీఎం రేవంత్ అనుకున్నారు. అందులో భాగంగా పార్టీ అధికారంలోకి వచ్చి న తర్వాత తొలిసారి జరిగిన రాజ్యసభ ఎన్నిక సమయంలోనే వేం నరేందర్‌రెడ్డి పేరును ప్రతిపాదించారు. అయితే అగ్రవర్ణాలకు చెందిన రేణుకాచౌదరికి ఒక స్థానం ఇవ్వాల్సి రావడంతో బీసీ వర్గానికి చెందిన అనిల్‌కుమార్‌యాదవ్‌కు అవకాశం లభించింది. మధ్యలో వచ్చిన మరో స్థానాన్ని అధిష్టాన కోటాలో సుప్రీంకోర్టు న్యాయవాది సింఘ్వీకి కేటాయించారు. తమిళనాడు తికమక త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి డీఎంకే కేటాయించే స్థానాలు, అక్కడ పోటీ చేసే అభ్యర్థుల విషయం తేలడంలో జాప్యం జరిగింది. పరిస్థితిని బట్టి సింఘ్వీ తమిళనాడుకు వెళ్లే అవకాశం ఉందనే చర్చ కూడా జరిగింది. దీంతో అధిష్టానం కోటాకు ఒక స్థానం వెళుతుందా లేదంటే రెండు స్థానాలు తెలంగాణ నాయకులకే వస్తాయా అనే మీమాంస మంగళవారం వరకు కొనసాగింది. ఒకవేళ తెలంగాణకు రెండు స్థానాలు కేటాయించాల్సి వస్తే ఒకటి ఓసీకి మరొకటి బీసీకి ఇస్తారనే చర్చ జరిగింది. అయితే తమిళనాడు నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీకి ఒకటే స్థానాన్ని ఇచ్చేందుకు డీఎంకే అంగీకరించడంతో సింఘ్వీ తెలంగాణకు ఖరారయ్యారు. మిగిలిన ఒక స్థానాన్ని నరేందర్‌రెడ్డికి కేటాయించారు. నేడు నామినేషన్లు రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున గురువారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలోని రాజ్యసభ ఎన్నికల కార్యాలయంలో తమ నామినేషన్లను వారు సమర్పిస్తారు. ఈ నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు హాజరుకానున్నారు. ఇతర నామినేషన్లు దాఖలు కాని పక్షంలో ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం ఈ ఇద్దరి ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటిస్తుంది. -
‘రాజ్యసభ’కు బీఆర్ఎస్ దూరం ?
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న రెండు స్థానాలకు గురువారంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగుస్తుంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు నామినేషన్ల ప్రక్రియ ముగిసేంత వరకు పార్టీ అభ్యర్థిని బరిలోకి దించే అంశంలో గోప్యత పాటించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. తెలంగాణలో 120 మంది శాసనసభ్యులు ఉండగా ఇద్దరు మాత్రమే పోటీ చేస్తే ఎన్నిక ఏకగ్రీవమవుతుంది. సిట్టింగ్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీతోపాటు మరో అభ్యర్థిని అధికార కాంగ్రెస్ పార్టీ పోటీలో నిలుపుతోంది. అయితే బీఆర్ఎస్ మూడో అభ్యర్థిని బరిలోకి దించితే ఎన్నిక అనివార్యం అవుతుంది. ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తే కనీసం 40 ఓట్లు సాధించే అభ్యర్థులు రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధిస్తారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేల మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 37 స్థానాలకు పడిపోయింది. మరో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటుండగా, వారిపై అనర్హత వేటు కోరుతూ బీఆర్ఎస్ స్పీకర్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 27 మందికే పరిమితమైంది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని నిలిపితే పర్యవసానాలు ఎలా ఉంటాయనే కోణంలో పార్టీలో చర్చ జరుగుతోంది. ఒకవేళ పార్టీ అభ్యర్థిని పోటీలో నిలిపితే తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని చెబుతున్న పది మంది ఎమ్మెల్యేలు ఎటు వైపు ఓటు వేస్తారనే ఆసక్తి నెలకొంది. మూడో అభ్యర్థిని పోటీలో పెడితే ఉన్న 27 మంది ఎమ్మెల్యేల్లో ఎవరైనా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడితే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందనే ఆందోళన కూడా బీఆర్ఎస్ వర్గాల్లో కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన మీడియా ఇష్టాగోష్టిలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు స్పందించారు. రాజ్యసభ ఎన్నిక బరిలో బీఆర్ఎస్ అభ్యర్థిని నిలపడంపై పార్టీ పరంగా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యానించారు. అదే సమయంలో చివరి నిమిషం వరకు తమ పార్టీ వ్యూహం గోప్యంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీ సీఈసీ సభ్యునిగా పామిరెడ్డిగారి పెద్ద నాగిరెడ్డి(నంద్యాల), ఎస్ఈసీ సభ్యునిగా వైసి గోవర్ధనరెడ్డి(మడకశిర), పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కంగాటి ప్రదీప్ రెడ్డి (పత్తికొండ), పార్టీ రాష్ట్ర సెక్రటరీ (పార్లమెంటు) పోరెడ్డి నరసింహారెడ్డి (ప్రొద్దుటూరు) నియమితులయ్యారు.కాగా, వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ల నియామకం జరిగిన సంగతి తెలిసిందే. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు బొత్స సత్యనారాయణ, ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు కురసాల కన్నబాబు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు బూడి ముత్యాలనాయుడు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు గుడివాడ అమర్నాథ్ నియమితులయ్యారు. -
‘అంగన్వాడీ వర్కర్లపై పోలీసుల దాడి అమానుషం’
సాక్షి, తాడేపల్లి: అంగన్వాడీ వర్కర్లపై పోలీసుల దాడి అమానుషమని, ఎన్నికల హామీలు అమలు చేయాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న అక్కచెల్లెమ్మలను దారుణంగా వేధించిందని వైఎస్సార్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ అక్కచెల్లెమ్మలకు వేతనాలు పెంచుతానని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన చంద్రబాబు, రెండేళ్లుగా మభ్యపెడుతూ వచ్చారని వివరించారు.టెంట్లో ఉండి నిరసన వ్యక్తం చేస్తున్న ఉన్న మహిళలను వేకువ జామున ఒక్కసారిగా ఈడ్చి వ్యాన్లలోకి తరలించడం హేయమని చర్యగా పేర్కొన్నారు. అంగన్వాడీ వర్కర్లకు వైయస్సార్సీపీ అండగా ఉంటుందని, ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ తరఫున పోరాడుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని నలమారు చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..రెండేళ్లుగా మభ్యపెడుతున్నారుఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న అంగన్వాడీల పట్ల ప్రభుత్వం అత్యంత అమానుషంగా వ్యవహరించింది. ప్రభుత్వంతో చర్చలకు పిలుస్తామని ముందురోజు రాత్రి నమ్మబలికి వేకువజామున టెంట్లు కూల్చేసి అక్రమంగా అరెస్టు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ అక్కచెల్లెమ్మలకు వేతనాలు పెంచుతానని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది.. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అనేక దఫాలు శాంతియుతంగా నిరసనలు తెలిపిన అంగన్వాడీలను చంద్రబాబు ప్రతిసారీ మభ్యపెడుతూ వచ్చారు.ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టక పోవడంతో సోమవారం నిర్వహించిన ‘ఛలో విజయవాడ’ కార్యక్రమానికి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు భారీగా పోటెత్తారు. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు అందరూ నిద్రిస్తుండగా వందలాది మంది మగ పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడి అంగన్వాడీ మహిళలను ఈడ్చి పారేశారు. వారు తేరుకునేలోగా టెంట్లు పడేసి, ప్లెక్సీలు చించేసి, ప్లకార్డులు విసిరేసి, అంతా చిందరవందర చేసేశారు. అంగన్వాడీల పట్ల ప్రభుత్వం పోలీసులు వ్యవహరించిన తీరును వైయస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. వారికి పార్టీ అండగా ఉండి వారి తరఫున ఉద్యమిస్తుంది.హామీ అమలు చేయాలని కోరడం తప్పా?శాంతియుతంగా ఉద్యమించిన మహిళలపై కర్కశంగా వ్యవహరించింది. రోడ్డు పైనే సొమ్మసిల్లిన అంగన్వాడీలపై చంద్రబాబు సర్కారు పోలీసులను ప్రయోగించి విరుచుకుపడింది. అంగన్వాడీలు తేరుకుని ఏం జరుగుతోందో గ్రహించేలోపే మహిళలని కూడా చూడకుండా ఈడ్చి పారేసి పోలీసు వ్యాన్లలోకి ఎక్కించేశారు. గతంలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన నీచ చరిత్ర చంద్రబాబుది. అంగన్వాడీలు బయటకు వెళ్లే అవకాశం లేకుండా చుట్టూ రోప్ పార్టీతో పోలీసులు దిగ్బంధించారు.రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన వారిని కనీసం బ్యాగులు, సెల్ఫోన్లు కూడా తీసుకోనివ్వకుండా నిర్బంధించారు. చేతికి దొరికిన వారిని దొరికినట్లు అరెస్టు చేసి వ్యాన్లలోకి తోసేశారు. తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారు..? ఎక్కడికి తీసుకెళ్తున్నారు..? అని ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పకుండా గెంటేశారు. ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో పలువురు అంగన్వాడీ వర్కర్లు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. తమను అక్రమంగా అరెస్ట్ చేసి కనీసం టాయిలెట్స్‌కు వెళ్లడానికి కూడా అనుమతించలేదని అంగన్వాడీ వర్కర్స్ వాపోతున్నారు. అంగన్వాడీ వర్కర్ల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు చూసి దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది.మూల్యం చెల్లించుకోక తప్పదుఅంగన్వాడీలు మాత్రమే కాదు.. టీచర్లు, ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు, పెన్షనర్లు ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఇప్పటికే అనేకసార్లు వినతులు, నిరసనలు తెలియజేశారు. అయినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన ఉండటం లేదు. వైయస్సార్సీపీ హయాంలో ఉన్న పీఆర్సీ చైర్మన్ తో రాజీనామా చేయించిన చంద్రబాబు.. రెండేళ్లుగా కొత్త పీఆర్సీ కమిషన్ వేయకుండానే కాలయాపన చేస్తున్నారు.కనీసం ఒకటో తేదీన జీతాలు ఇస్తామన్న హామీని కూడా నిలబెట్టుకోలేదు. ఉద్యోగులకు రావాల్సిన దాదాపు రూ. 35 వేల కోట్ల బకాయిలు ఇవ్వకుండా వేధిస్తున్నారు. బినామీ కంపెనీలకు 99పైసలకు వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టడానికి ఉత్సాహం చూపిస్తున్న ప్రభుత్వం... ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం లేదు. ప్రభుత్వం తక్షణం స్పందించి ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకపోతే దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోకతప్పదని నలమారు చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. -
మండలి ఛైర్మన్‌ను అవమానించడం దారుణం: శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మండలి చైర్మన్‌కి మతం, పార్టీ ఆపాదిస్తూ మాట్లాడిన సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని, సభలో అడుగుపెట్టకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.రాజకీయ లబ్ధి కోసం ఇన్నాళ్లు దేవుడిని రాజకీయాల్లోకి లాగి ఆలయ ప్రతిష్టను మసకబార్చిన కూటమి నాయకులు.. మాట్లాడాల్సిన సబ్జెక్టుని పక్కన బెట్టి శాసనమండలి చైర్మన్‌ని చర్చలోకి లాక్కురావడమే కాకుండా ఆయన్ను కులమతాల పేరుతో కించపరచడం దారుణమని ఆయన ఆక్షేపించారు. రాజ్యాంగ వ్యవస్థలో ఈరోజును చీకటిరోజుగా చూడాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రెస్మీట్లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:కల్తీ నెయ్యి పేరుతో టీటీడీ నిధుల దోపిడీకి పాల్పడిన హెరిటేజ్ అంశం మండలిలో చర్చకు రావడంతో దానికి సమాధానం చెప్పలేక సభలో లేని వైఎస్ జగన్, మండలి చైర్మన్లు క్రిస్టియన్లు అని మాట్లాడుతూ సభను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం అత్యంత హేయమైన చర్య. పైగా మీ నాయకుడు జగన్ అంటూ మండలి చైర్మన్‌కు పార్టీని ఆపాదించి అవమానించారు. ఇది దారుణం. ఇందాపూర్ డెయిరీ ముసుగులో హెరిటేజ్ చేసిన టీటీడీ నిధుల దోపిడీపై వైఎస్సార్సీపీ సభ్యులు ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం చెప్పుకోలేని ప్రభుత్వం సభను పక్కదోవ పట్టించడానికి చైర్మన్‌ని రాజకీయాల్లోకి లాగి మతాన్ని, పార్టీని ఆపాదించింది.అధికార పక్ష సభ్యుల అనైతిక ప్రవర్తన:అధికార పార్టీ సభ్యులం అన్న విషయమే మరిచిపోయి వైఎస్సార్సీపీ సభ్యులు మాట్లాడుతుండగా ప్రసంగానికి పదులసార్లు అడ్డుతగలడమే కాకుండా మంత్రులంతా పోడియం చుట్టుముట్టి సభలో ఆందోళన చేయడం సిగ్గుచేటు. నేను ఫలానా మతం అని మండలి చైర్మన్ చెప్పుకునే దుస్థితి కల్పించినందుకు ప్రభుత్వం సిగ్గుపడాలి. పరిస్థితులు తమకు అనుకూలంగా లేకపోతే ఎవరికైనా కులమతాలు అంటగట్టి దిగజారుడు రాజకీయాలు చేస్తామని కూటమి నాయకులు చెప్పకనే చెబుతున్నారు.అచ్చెన్నాయుడిపై చర్య తీసుకోవాలి:ఇప్పటికైనా సీఎం చంద్రబాబు కలగజేసుకుని మంత్రి కె.అచ్చెన్నాయుడిని రాబోయే మూడేళ్లపాటు సభలో అడుగుపెట్టకుండా శాశ్వతంగా సభ నుంచి సస్పెండ్ చేయాలి. మంత్రి అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటిస్తే సరిపోదు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలి. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన్ను సస్పెండ్ చేయాలి. శ్రీవారిని రాజకీయాల్లోకి లాగినందుకు కూటమిని ప్రజలు అసహ్యించుకుంటుంటే దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కులమతాలతో రాజకీయాలు చేయడం అత్యంత హేయమైన చర్య అని శ్రీకాంత్‌రెడ్డి అభివర్ణించారు. -
మండలి చరిత్రలోనే ఇది చీకటి రోజు: వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: తిరుపతి లడ్డూ, కల్తీ నెయ్యి, హెరిటేజ్ ఇందాపూర్ డెయిరీ మధ్య సంబంధాలపై శాసనమండలిలో లఘు చర్చ సందర్బంగా సభలో రగడ చోటుచేసుకుంది. అధికార పక్షం అడుగడుగునా అడ్డుకోవడంతో చివరకు సభ వాయిదా పడింది. అనంతరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు.. మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.విలువలు మంటగలిపేలా అచ్చెన్న వ్యాఖ్యలు: లేళ్ల అప్పిరెడ్డిశాసనమండలి చరిత్రలో ఇవాళ జరిగిన ఘటనలు చీకటి రోజుగా నిలిచిపోతాయి. తిరుమల లడ్డూ ప్రసాదంపై చర్చ జరపాలని వైఎస్సార్సీపీ.. సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచీ నాలుగుసార్లు వాయిదా తీర్మానాలు ఇచ్చింది. మండలిని కూడా స్తంభింపజేశాం. ఎట్టకేలకు బీఏసీలో 23వ తేదీన మండలిలో చర్చకు అంగీకరించిన తర్వాత కూడా మంత్రులు చర్చ రాకుండా అడ్డుకున్నారు.తిరిగి వైఎస్సార్సీపీ సభ్యుల ఒత్తిడి మేరకు చర్చ ప్రారంభించినా.. మంత్రులు అడుగడుగునా మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్య చరిత్రలోనే మండలికి ఉన్న గౌరవాన్ని మంటగలిపేలా సాక్ష్యాత్తు ఛైర్మన్‌పైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన అధికారాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఛైర్మన్ మతాన్ని ఉద్దేశించి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువల్ని మంటగలిపేలా ఉన్నాయి.మంత్రులు ఆరోపణలు చేస్తున్నా ఆధారాలు ఉండట్లేదు. దీంతో వారు కంగుతిన్నారు. అందుకే ఏదో విధంగా సభను డైవర్ట్ చేసి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగానే సభలో లేని జగన్మోహన్ రెడ్డిగారితో పాటు ఛైర్మన్ మతాల ప్రస్తావన తెచ్చారు. లడ్డూ కల్తీ ఆరోపణలు చేసిన ప్రభుత్వం.. ఇందాపూర్ లింకులు బయటపడే సరికి ఆత్మరక్షణలో పడిపోయింది. చివరికి హెరిటేజ్ కోసమే లడ్డూ కల్తీ వ్యవహారం తెరపైకి తెచ్చారని తేలిపోయింది. మా సభ్యులు చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఛైర్మన్ కు ఇచ్చాం. దీనికి సమాధానాలు చెప్పలేక ఛైర్మన్ మత ప్రస్తావన తీసుకురావడం దారుణం. మోషేను రాజు ఛైర్మన్ గా ఉండటం మీకు ఇష్టం లేదా, ఎందుకు ఆయనపై అడుగడుగునా వివక్ష చూపుతూ అవమానిస్తున్నారు?.చంద్రబాబు తీరును ఆధారాలతో ఎండగట్టాం: పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితిరుమల లడ్డూ నెయ్యిపై వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలనే 14 రోజులుగా ప్రయత్నిస్తున్నాం. ఇవాళ మండలిలో చర్చ ప్రారంభమయ్యాక ప్రతీ అంశంపై ఆధారాలు సమర్పించి మాట్లాడాం. ఇన్ని ఆధారాలతో రాజకీయ కుట్రను బయటపెట్టేందుకు ప్రయత్నిస్తే.. అధికార పక్షం వ్యవహరించిన తీరు దుర్మార్గంగా ఉంది. సభలో లేని వైఎస్ జగన్ ప్రస్తావన తెచ్చి ఆయనపై విమర్శలు చేశారు. తన కుమారుడి పట్టాభిషేకం కోసం వైఎస్ జగన్‌ను అడ్డు తొలగించుకోవాలన్న రాజకీయ కుట్రే ఇందులో ఉంది.మీ హయాంలో టీటీడీలో నాలుగు నెయ్యి ట్యాంకర్ల నెయ్యిని కల్తీ పేరుతో వెనక్కి పంపి, తిరిగి వైష్ణవీ డెయిరీ ద్వారా లోపలికి పంపుకున్నారు. కల్తీ జరిగితే అది జరిగింది మీ ప్రభుత్వంలోనే, దాన్ని మాకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో దాదాపు కిలో నెయ్యి రూ.300కు తీసుకుంటే, మీ హెరిటేజ్ అనుబంధ సంస్థ ఇందాపూర్ డెయిరీకి కిలో రూ.600 కు ఇచ్చేలా టెండర్ కట్టబెట్టారు. భోలేబాబా, ప్రీమియర్ డెయిరీ కూడా మీ హయాంలోనే 95 శాతం నెయ్యి సరఫరా చేసింది, ఇప్పుడు అదే ప్రీమియర్ డెయిరీ సరఫరా చేసిన నెయ్యి నాణ్యత లేకపోతే వైఎస్సార్సీపీకి అంటగట్టి ఆరోపణలు చేస్తున్నారు. భోలేబాబాకు అనుమతులు ఇచ్చింది మీ హయాంలోనే. ప్రజలకు మేం చెప్పాలనుకున్నది సభలో చెప్పాం. ప్రజలే దీనిపై నిర్ణయిస్తారు.హెరిటేజ్‌పై దొరికిపోయిన ప్రభుత్వం: తూమాటి మాధవరావుగత వారం అసెంబ్లీలో జరిగిన తిరుమల లడ్డూ చర్చలో హెరిటేజ్‌కు టీటీడీతో సంబంధాలు లేవని, కేజీ నెయ్యి కూడా సరఫరా చేయలేదని, టెండర్లలో పాల్గొనలేదని చంద్రబాబు ప్రకటించారు. కానీ 1998లో టీటీడీకి కేజీ రూ.70 చొప్పున టెండర్ లేకుండానే హెరిటేజ్ పాల పౌడర్ సరఫరా చేసిందని మేం ఆధారాలు బయటపెట్టాం. నిబంధనలకు విరుద్దంగా టెండర్ లేకుండా ఎలా డబ్బులు చెల్లిస్తారని టీటీడీ ఆపేస్తే.. తిరిగి బోర్డుకు పంపి ఆమోదం తీసుకుని చెల్లింపులు చేసారు. అదే విషయం ఇవాళ ప్రశ్నిస్తే 1998 విషయం ఎందుకు మాట్లాడుతున్నారని ఎదురు దాడి చేశారు. పాల పౌడర్ తిరుమలలో దేనికి వాడారో చంద్రబాబు సమాధానం చెప్పాలి.2008లో కాంగ్రెస్ ప్రభుత్వంలో టీటీడీ టెండర్లలో పాల్గొని ఎల్–3గా వచ్చారని కూడా ఆధారాలు చూపించాం. కేజీ రూ.117.75 చొప్పున టిన్నుల్లో సరఫరా చేస్తామని టెండర్ వేశారు కదా అని అడిగితే మేం ఎల్–1కాదని బుకాయించారు. దీనిపై నిలదీస్తే మాపై దాడికి ప్రయత్నించారు. మా సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతుంటే ఆర్ధికమంత్రి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అనుమతించాలని మండలి ఛైర్మన్ ను అడుగుతుంటే నన్ను అడ్డుకున్నారు. మా గొంతు నొక్కేందుకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను వెనక్కి తగ్గేది లేదు.అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలి: తోట త్రిమూర్తులులడ్డూపై చర్చించాలని పది రోజులుగా కోరుతున్నా వెనక్కి పారిపోయిన ప్రభుత్వం.. ఎట్టకేలకు ఒప్పుకున్నట్లు చూపించి డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్ కూ ఉన్న సంబంధం, వీళ్ల అవినీతి బయటపెట్టే సరికి జీర్ణించుకోలేకపోయారు. అందుకే సభను పక్కదారి పట్టించేలా సభలో లేని జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన తెచ్చి ఆయనపై ఓ ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. వైఎస్ జగన్ పలుమార్లు తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న సందర్భాలు ఉన్నాయి.కడప జిల్లాలో తాజాగా నందేశ్వర ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. అయినా ఆయన హిందూ మతానికి వ్యతిరేకం అని ముద్ర వేసేందుకు కుట్ర చేస్తున్నారు. వైఎస్సార్ హయాంలో రెండు కొండలుగా ఉన్న తిరుమలను ఏడు కొండలంటూ జీవోలు ఇచ్చిన చరిత్ర ఉంది. వైఎస్సార్ ఇచ్చిన జీవోల్ని రద్దు చేస్తామని చెప్పిన వ్యక్తి చంద్రబాబా కాదా అనేది ప్రజలు గమనించాలి. ఎప్పుడూ తిరుమల వేంకటేశ్వరస్వామి అంటే భక్తి ఉందని చెప్పుకునే చంద్రబాబు ఎప్పుడైనా ఆయనకు తలనీలాలు సమర్పించారా చెప్పాలి. లడ్డూ నెయ్యిపై చర్చ పెట్టి తిరుమల ప్రతిష్టను దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు. సభలో లేని వైఎస్ జగన్ ప్రస్తావన తెచ్చినందుకు మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలి.లడ్డూ నెయ్యిపై వాస్తవాలు చెప్పేశాం: వంకా రవీంద్రనాథ్ఇవాళ మంత్రులు తొలిసారి మండలిలో సభ్యులపై అనుక్షణం దాడికి ప్రయత్నించారు. మా వాదన వినిపించకుండా అడ్డుకున్నారు. ఈ సభ ద్వారా ప్రజలకు వాస్తవాలు చేరడం వారికి ఇష్టం లేదు. అయినా మా సభ్యులు లడ్డూ నెయ్యి మీద ప్రజలకు ఆధారాలతో వాస్తవాలు చెప్పారు. ఇది మంచి పరిణామంగా భావిస్తున్నాం. ఇప్పుడు రాష్ట్రంలో పాలు, ఇతర కల్తీల మీద ప్రభుత్వాన్ని నిలదీస్తాం. వచ్చే మూడు రోజుల్లో ప్రజా సమస్యలపై చర్చించాలని కోరుకుంటున్నాం.ఛైర్మన్‌ను మతం పేరుతో అవమానిస్తారా?: వరుదు కల్యాణిపది రోజులుగా లడ్డూ నెయ్యి మీద చర్చ అడుగుతుంటే ఇవాళ్టికి ఒప్పుకున్నారు. కానీ మా సభ్యులు మాట్లాడుతుంటే అధికార పక్షం దిగజారిపోయి ఛైర్మన్ ను కూడా మతం పేరుతో టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది. మనం ప్రజాస్వామ్యదేశంలో ఉన్నామా లేమా అనే పరిస్ధితిని కూటమి మంత్రులు కల్పించారు. లౌకిక దేశంలో ఇలాంటి ఘటనలు దురదష్టకరం. దీన్ని బట్టి ఈ చర్చకు మీరు ఎంత భయపడుతున్నారో అర్థమవుతోంది.లడ్డూ నెయ్యి మీద అనవసర ఆరోపణలు చేసి చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. దీనిపై సమాధానం అడిగితే చెప్పరు. తిప్పిపంపిన నెయ్యి ట్యాంకర్లు మళ్లీ ఎందుకు వాడారని అడిగితే సమాధానం లేదు. పాల ధర 2 రూపాయలు పెరిగితే నెయ్యి ధర 250 రూపాయలు ఎక్కడైనా పెరుగుతుందా చెప్పాలి. హెరిటేజ్, ఇందాపూర్ బంధాన్ని మా సభ్యులు బయటపెడితే సమాధానం చెప్పలేకపోయారు. ఈవోను ఎందుకు మార్చారంటే చెప్పరు. చర్చ జరగడం ఇష్టం లేదు కాబట్టే మిమ్మల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకున్నారుఆధారాలు బయటపడే సరికి అడ్డుకునే యత్నం: ఎంవీ రామచంద్రారెడ్డిబడ్జెట్ సమావేశాలు పెట్టినప్పటి నుంచీ చంద్రబాబు లడ్డూపైన చేసిన వ్యాఖ్యలపై చర్చ అడుగుతుంటే ఇవాళ స్వల్ప చర్చకు అనుమతించారు. ఇవాళ హెరిటేజ్, ఇందాపూర్ బంధంపై మా సభ్యులు ఆధారాలు బయటపెడుతుంటే మంత్రులు అడుగడుగునా అడ్డుకున్నారు. రాష్ట్రంలో పాలతో పాటు అన్నీ కల్తీ అవుతున్నాయి. వీటిపై ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. వీటిని అడ్డుకోవాల్సిన అధికారులు ఎక్కడున్నారు. సభలో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. కులమతాలకు అతీతంగా పూజించే శ్రీవారి జోలికి రావొద్దని, మీ తప్పులకు పశ్చాత్తాపం చెందాలని అధికారపక్షాన్ని కోరాం.ప్రజలకు వాస్తవాలు అర్థమయ్యాయి: కల్పలతారెడ్డిలడ్డూ నెయ్యిపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై ప్రజలకు వాస్తవాలు తెలియాలనే వాయిదా తీర్మానాలు ఇచ్చాం. ఎట్టకేలకు చర్చకు ఒప్పుకున్నా వైఎస్సార్సీపీ సభ్యులు మాట్లాడకుండా అడ్డుపడ్డారు. తిరుమల లడ్డూ కల్తీపై వాళ్లు చేసిన తప్పుడు ఆరోపణలకు ఎక్కడ కౌంటర్ ఇస్తామో అని భయపడి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా మా సభ్యులు మాత్రం ఆధారాలతో అన్ని విషయాలు బయటపెట్టారు. ప్రజలకు ఈ విషయాలు తెలిసేలా చేశారు. మంత్రుల తీరునూ ప్రజలు గమనించారు.ఈ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు: మొండితోక అరుణ్కుమార్ఎస్సీ,ఎస్టీ పారిశ్రామిక వేత్తలను ఈ ప్రభుత్వం బిచ్చగాళ్లుగా మార్చింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఈ ప్రభుత్వం మోసం చేసింది. టీడీపీ కండువా కప్పుకున్న వారికి 40%, సానుభూతి పరులకు 20% మాత్రమే ప్రోత్సాహకాలు ఇచ్చారు. ఇన్సెంటివ్‌లు ఇవ్వాలంటే టీడీపీ ఎమ్మెల్యేల సంతకాలు కావాలని వేధించిన ప్రభుత్వం ఇది. తమకు న్యాయం చేయండని ధర్నా చేసినందుకు లాఠీఛార్జి చేశారు. టీడీపీ బడా నేతల కంపెనీలకు ఇన్సెంటివ్‌లు ఇస్తారు. కానీ ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు.సుమారు 500 మంది నారా లోకేష్‌ను కలవడానికి వస్తే కుదరదన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ను కలిసేందుకు కేవలం ఐదుగురికే అనుమతిచ్చారు. ఎంఎస్ఎంఈలపై మండలిలో మా ప్రశ్నకు మంత్రి తప్పుడు సమాచారం ఇచ్చారు. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు మంత్రిపై ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం. కోర్టుకు వెళతాం. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు మేం అండగా ఉంటాం. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఇన్సెంటివ్‌లు విడుదల చేయాలి. -
అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మండలి ఛైర్మన్ ఆగ్రహం
సాక్షి, అమరావతి: మండలి ఛైర్మన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మండలి ఛైర్మన్‌ను క్రిస్టియన్ అంటూ అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలపై మండలి ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నన్ను క్రిస్టియన్ అనడానికి నువ్వు ఎవరు?’’ అంటూ మండిపడ్డ మండలి ఛైర్మన్.. తాను క్రిస్టియన్ కాదని స్పష్టం చేశారు. తాను హిందువునని.. క్రిస్టియన్ కాదని మండలి ఛైర్మన్ తెలిపారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ సభ్యులు డిమాండ్ చేశారు. బాబూ.. మీ మంత్రులకు ఇదేనా నేర్పింది?: బొమ్మి ఇజ్రాయెల్శాసనమండలి మీడియా పాయింట్లో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ మాట్లాడుతూ.. కులాల మధ్య కుంపటి పెట్టిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు బాటలోనే మంత్రులు నడుస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘సభ సాక్షిగా మంత్రి అచ్చెన్నాయుడు.. ఛైర్మన్‌ను అవమానించారు. ఛైర్మన్ దళితుడనే కారణంతో ఆయన్ని అవమానించారు. మీ నాయకుడు, మీ ఛైర్మన్ క్రిస్టియన్ అంటూ మంత్రి అవమానించారు. అయ్యా చంద్రబాబు.. మీ మంత్రులకు ఇదేనా మీరు నేర్పింది?..దళితులు, క్రిస్టియన్ల పట్ల మీకెందుకు అంత వివక్ష. లోకేష్ సమక్షంలోనే అచ్చెన్నాయుడు మాట్లాడారు. మంత్రి అచ్చెన్నాయుడితో లోకేష్ ఇలా మాట్లాడించారా?. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదు. చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు క్రిస్టియన్లకు క్షమాపణ చెప్పాలి. హెరిటేజ్, ఇందాపూర్, సంఘం డెయిరీలు, వైష్ణవి కంపెనీలను కాపాడుకోవడానికే మీ ప్రయత్నం. కచ్చితంగా దేవుడే మీకు బుద్ధి చెబుతాడు. తిరుమల లడ్డూపై చర్చకు రావాలని మేం వారం రోజుల నుంచి కోరుతున్నాం. చర్చకు రాకుండా పారిపోతున్నారు. ఈరోజుకి ఎట్టకేలకు చర్చకు అంగీకరించారు. చర్చకు పదే పదే మంత్రులు అడ్డుపడ్డారు’’ అంటూ బొమ్మి ఇజ్రాయెల్ మండిపడ్డారు. -
వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. కొండా సుస్మిత సంచలన ప్రకటన
సాక్షి, వరంగల్: తెలంగాణలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో పరకాల నుండి పోటీకి సిద్ధం అవుతున్నట్టు సుష్మిత క్లారిటీ ఇచ్చారు. దీంతో, పరకాల రాజకీయంపై ఆసక్తి నెలకొంది.మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత.. బుధవారం వరంగల్ జిల్లాలోని కొమ్మాల జాతరకు వచ్చారు. జాతర వేదికగా కొండా సుస్మితా మాట్లాడుతూ..‘నా తల్లిదండ్రుల రాజకీయ ప్రస్థానం కొమ్మాల జాతర నుండి ప్రారంభమైంది. నేను కూడా రాజకీయాల్లోకి వస్తాను. నా రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడి నుంచే మొదలవుతుంది. కొండా మురళీ ఇప్పటికే ముగ్గురు నలుగురు గుండెల్లో నిద్ర పోతున్నాడు. నేను పరకాలకు వస్తా మీ బాధలు తీరుస్తాను. మీరంతా బాధల్లో ఉన్నారని నాకు అర్థం అవుతోంది. పరకాలలో ప్రతీ కార్యక్రమానికి వెళ్తాను.తెలంగాణ రాజకీయాల్లోకి నేను వస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో నేను తప్పకుండా పోటీ చేస్తాను. పరకాల నుంచి పోటీ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మీకు సేవ చేసేందుకు నేను రెడీగా ఉన్నాను. పరకాల నుంచి ఎమ్మెల్యేగా తప్పకుండా గెలుస్తాను. మా నాన్న కొంచెం ప్రశాంతంగా మాట్లాడమన్నారు. అందుకే నెమ్మదిగా మాట్లాడుతున్నా.. లేకపోతే మరోలా ఉండేది అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
కుటుంబంలో సంక్షోభం.. కుర్రాళ్లకు సందేశం
చెన్నై: విడాకుల వార్తల నడుమ టీవీకే అధినేత విజయ్ విజయ్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్టు చర్చనీయాంశంగా మారింది. తన పాతికేళ్ల ఏళ్ల వైవాహిక బంధం కోర్టు మెట్లెక్కిన వేళ.. విజయ్ తన వ్యక్తిగత వేదన కంటే రేపటి పౌరుల భవిష్యత్తుకే ప్రాధాన్యతనిచ్చారు. 12వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులను ఉద్దేశించి ఆయన పంచుకున్న ఒక సందేశం ఇప్పుడు వైరల్‌గా మారింది.‘తమిళనాడు, పుదుచ్చేరిలో 12వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న నా ప్రియమైన తమ్ముళ్లకు, చెల్లెళ్లకు శుభాకాంక్షలు. రేపటి సంపన్నమైన సమాజాన్ని నిర్మించబోతున్న మీరందరూ, ఈ పరీక్షను ఎటువంటి ఆందోళన లేకుండా, భయం లేకుండా, ధైర్యంతో ఎదుర్కోండి. ఉన్నత విద్యలో మీరు రాణించాలని ముందుస్తు (అడ్వాన్స్) శుభాకాంక్షలు.. మంచే జరుగుతుంది!.. విజయం నిశ్చయం!’ అని దానిలో విజయ్ పేర్కొన్నారు. 1996లో విజయ్‌కు ఒక అభిమానిగా పరిచయమై, 1999లో అర్ధాంగిగా మారిన సంగీతతో విజయ్ వైవాహిక ప్రయాణం ఆదర్శప్రాయంగా సాగింది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ జంట మధ్య 2021 నుండి విభేదాలు మొదలైనట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ నటితో సంబంధమే ఈ విడాకులకు కారణమని సంగీత తన పిటిషన్లో పేర్కొన్న ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. தமிழ்நாடு மற்றும் புதுச்சேரியில் 12ஆம் வகுப்புப் பொதுத் தேர்வு எழுதும் என் அன்புத் தம்பிகளுக்கும் தங்கைகளுக்கும் வாழ்த்துகள்.நாளைய வளமான சமுதாயத்தை உருவாக்க உள்ள நீங்கள் அனைவரும் இந்தத் தேர்வினைப் பதற்றமின்றி, அச்சமின்றி, துணிவுடன் எதிர்கொள்ளுங்கள். உயர்கல்வியில் சிறந்து…— TVK Vijay (@TVKVijayHQ) March 2, 2026సినిమాలకు గుడ్ బై చెప్పి ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) ద్వారా ప్రజా సేవకు అంకితమైన తరుణంలో పలు వివాదాలు ఆయనను చుట్టుముట్టాయి. రాజకీయంగా పార్టీని బలోపేతం చేస్తూ, సభ్యత్వ నమోదులో బిజీగా ఉన్న విజయ్.. ప్రస్తుత పరీక్షల వేళ విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని నూరిపోస్తున్నారు. ‘భయం వద్దు.. విజయం మీదే’ అంటూ ఆయన ఇచ్చిన పిలుపు వెనుక, తన వ్యక్తిగత వైఫల్యాల నీడలు పడకుండా చూసుకోవడం ఆయన రాజకీయ పరిణతికి నిదర్శనం.ఈ సంక్షోభం విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు, మరోవైపు ప్రత్యర్థుల విమర్శలు వచ్చే అవకాశం ఉన్నా.. విజయ్ మాత్రం ప్రజాక్షేత్రంలోనే తన బలాన్ని నిరూపించుకోవాలని చూస్తున్నారు. తన చుట్టూ జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోకుండా, విద్యార్థుల పరీక్షల పై దృష్టి సారించడం ద్వారా తన ప్రాధాన్యతలు ఏంటో విజయ్ స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ‘ఆస్పత్రి మాఫియా’ ఇక లగెత్తాల్సిందే! -
పవన్‌కు మొండిచేయి.. అందుకే పక్కనపెట్టారా?
రాజ్యసభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే శివేష్ కుమార్ బిహార్ నుంచి బరిలో ఉన్నారు. అసోం రాష్ట్రం నుంచి తేరాష్ గోవాల్లా, జోగెన్ మోహన్‌లను అభ్యర్థులుగా ప్రకటించింది. మన్మోహన్ సమల్, సుజీత్ కుమార్‌లను ఒడిశా తరపున రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికయ్యారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్ నుంచి రాహుల్ సిన్హాకు అవకాశం దక్కింది. లక్ష్మీవర్మ (ఛత్తీస్‌గఢ్), సంజయ్ భాటియా(హరియాణా)లకు కూడా రాజ్యసభ అభ్యర్థిత్వం దొరికింది. ప్రఖ్యాత భోజ్‌పురి నటుడు, గాయకుడు పవన్ సింగ్‌కు కమలం పార్టీ మొండిచేయి చూపింది. ఎంపీ కావాలకున్న ఆయన ఆశలపై బీజేపీ అధినాయకత్వం నీళ్లు చల్లింది. దీంతో ఆయనను రాజ్యసభకు పంపిస్తారని వస్తున్న ఊహాగానాలకు తాజాగా తెరపడింది. బిహార్ నుంచి నితిన్ నబీన్‌తో పాటు సీనియర్ నాయకుడు శివేష్ కుమార్ (Shivesh Kumar) అవకాశం దక్కించుకున్నారు.తీరని పవన్ కలఎంపీగా పార్లమెంట్లో అడుగు పెట్టాలన్న పవన్ సింగ్ కోరిక ఇంకా ఫలించలేదు. ఈసారైనా తనకు ఎంపీ దక్కుతుందని భావించినా ఆయనకు నిరాశే మిగిలింది. రెండోసారి కూడా అవకాశం దక్కినట్టు దక్కి చేజారిపోయింది. ఎంపీ కావాలన్న ఉద్దేశంతోనే బిహార్ ఎన్నికలకు ముందు ఆయన రెండోసారి బీజేపీలో చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లోని అసన్‌జోల్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎంపీగా పోటీలో నిలిచారు. అయితే తన పాటల్లో బెంగాలీ మహిళలను అభ్యంతకరంగా చిత్రీకరించారనే విమర్శలు రావడంతో పోటీ నుంచి ఆయనను తప్పించింది. దీంతో మనస్తాపం చెందిన పవన్ సింగ్.. బిహార్‌లోని కరకట్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఫలితంగా బీజేపీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అయితే పవన్ సింగ్ కారణంగా పలుచోట్ల ఎన్డీఏ అభ్యర్థులు ఓటమిపాలయ్యారన్న అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి.'ఎమ్మెల్యే కాదు.. ఎంపీయే'గతేడాది అక్టోబర్ 1న తిరిగి కమలం గూటికి వచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ బిహార్ ఇన్ఛార్జ్ వినోద్ తవ్డే, కరకట్‌లో ఆయన ప్రత్యర్థి ఉపేంద్ర కుష్వాహా సమక్షంలో బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి రావడంతో.. పవన్ సింగ్ శాసనసభకు పోటీ చేస్తారని మీడియాలో ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే పవన్‌కు ఎమ్మెల్యేగా పోటీ చేసే ఉద్దేశం లేదని, ఎంపీ కావాలన్నది ఆయన కోరిక అని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ వెల్లడించారు. బిహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ తరపున పవన్ సింగ్ ప్రచారం సాగించారు.చదవండి: రాజ్యసభ బరిలో నితీశ్ కుమార్ తనయుడు?అందుకే ఇవ్వలేదా?ఎన్డీఏ కూటమి బంపర్ మెజారిటీతో విజయం సాధించడంతో ఆయనకు కచ్చితంగా రాజ్యసభ సీటు దక్కుతుందని బాగా ప్రచారం జరిగింది. అయితే బిహార్‌కే చెందిన నితిన్ నబీన్ (Nitin Nabin) బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో పరిస్థితి మారినట్టు తెలుస్తోంది. నబీన్ పార్లమెంట్‌కు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో పవన్‌ను పక్కన పెట్టాల్సివచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు పవన్ సింగ్ వ్యక్తిగత జీవితంపై తీవ్ర విమర్శలు రావడంతో ఆయనకు ఎంపీ సీటు దక్కలేదన్న వాదనలు కూడా వినబడుతున్నాయి. మరోవైపు ఎప్పటికైనా తమ హీరో ఎంపీ అవుతారని పవన్ సింగ్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.BJP announces its candidates for the upcoming Rajya Sabha elections.Nitin Nabin, Shivesh Kumar from Bihar.Terash Gowalla, Jogen Mohan from Assam.Laxmi Verma from Chhattisgarh.Sanjay Bhatia from Haryana.Manmohan Samal, Sujeet Kumar from OdishaRahul Sinha from West Bengal. pic.twitter.com/jM3afnPLLi— ANI (@ANI) March 3, 2026


