breaking news
Srikakulam
-
ఉపాధి అవకాశాలకు ఇంటర్వ్యూలు
ఎచ్చెర్ల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎచ్చెర్లలోని ప్రభుత్వ ఐటీఐ స్కిల్ హబ్ సెంటర్లో దివీస్ ల్యాబరేటరీస్ ఆధ్వర్యంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ అర్హత కలిగినవారు హాజరవ్వాలని సూచించారు. 18 నుంచి 30 సంవత్సరాల్లోపు యువకులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ బయోడేటా, సర్టిఫికెట్లు, ఆధార్ జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో హాజరవ్వాలన్నారు. చేపల మృత్యువాతపై అధికారుల పరిశీలన రణస్థలం: మండలంలోని నారువ, మెంటాడ పంచాయతీల పరిధి అక్కయ్యపాలెం దగ్గరలోని కందివలస గెడ్డలో చేపలు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కాలుష్య నియంత్రణ అధికారులు గెడ్డలోని నీటిని సేకరించారు. ల్యాబ్‌కు పంపించి నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని కాలుష్య నియంతణ ఏఈ హరీష్ తెలిపారు. ఆటో డ్రైవర్‌కు 6 నెలల జైలు శిక్ష సారవకోట: పాలకొండ గ్రామానికి చెందిన శైలా మన్మధరావుకు సోమవారం పాతపట్నం జూనియర్ సివిల్ జడ్జ్ ఎం.రోషిణి ఆరు నెలల జైలు శిక్ష విధించినట్లు ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. 2022లో సారవకోట గ్రామానికి చెందిన కూన పొట్టెమ్మను ఆటోతో ఢీకొని ఆమె మృతికి కారణమయ్యాడు. దీనిపై అప్పటి ఎస్ఐ లావణ్య కేసు నమోదు చేసి చార్జిషీటు వేశారు. దీనిపై వాదోపవాదనలు జరిగిన తర్వాత సోమవారం శైలా మన్మధరావుకు ఆరు నెలలు సాధారణ జైలు శిక్ష విధించినట్లు ఆయన తెలిపారు. నేడు అరసవల్లిలో సహస్ర ఘటాభిషేకం అరసవల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో దేవదాయ శాఖ ఆధ్వర్యంలో సహస్ర ఘటాభి షేక సహిత వరుణయాగం, జపమహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా ఆలయ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ప్రకటించారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి క్షేత్ర పాలకులైన శ్రీభువనేశ్వరి సహిత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో లోకకళ్యాణార్థం, వర్షాలు కురవాలని కోరుతూ ఈ అభిషేకాన్ని నిర్వహస్తున్నట్లుగా ప్రకటించారు. మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం హిరమండలం: మండలంలోని ఒక గ్రామంలో మానసిక దివ్యాంగురాలైన యువతిపై అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధుసూదనరావు తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. పువ్వల దామోదరావు అనే వ్యక్తి ఇంటింటికీ వెళ్లి కరెంట్ బిల్లులు తీస్తుంటాడు. ఎప్పటిలాగే ఈనెల 4వ తేదీన మధ్యాహ్నం ఒక గ్రామంలోని ఒక ఇంటికి బిల్లు తీసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో ఒక ఇంట్లో మానసిక దివ్యాంగురాలైన యువతిపై దామోదరావు అత్యాచారం చేసినట్లు ఎస్ఐ తెలిపారు. బాధితురాలు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. ‘కరువు జిల్లాగా ప్రకటించాలి’ శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉపాధ్యక్షులు కె.మోహన్‌రావు, జిల్లా అధ్యక్షులు పొందూరు చంద్రరావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెలమల రమణ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలో సుందరయ్య భవన్లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగునీటి వనరులు లేని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించకపోవడం రైతులకు ద్రోహం చేయడమేనన్నారు. పలాస, వజ్రపుకొత్తూరు, నందిగాం మండలాల్లోనూ లోటు వర్షపాతంతో పాటు ఈ భూములకు వంశధార నీరు కూడా అందిన పరిస్థితి లేదన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి కరువు పరిస్థితి పట్టడం లేదని విమర్శించారు. జిల్లాలో కరువు మండలాలు ప్రకటించడంలో శాసీ్త్రయత లోపించిందని, ఇది రాజకీయ ప్రకటనగా ఉందని విమర్శించారు. లోటు వర్షపాతం ఉన్న మందస, ఇచ్ఛాపురం, కవిటి లాంటి మండలాలను కరువుగా ప్రకటించకపోవడం ఏంటని ప్రశ్నించారు. తక్షణం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి సహాయక చర్యలు, రాయితీలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
జవాన్‌కు అన్యాయం
సంతబొమ్మాళి: దేశ సరిహద్దుల్లో జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నా.. సొంతూరులో న్యాయం కోసం పోరాడాల్సి వ స్తోందని సంతబొమ్మాళి మండలం మూలపేట గ్రామానికి చెందిన జవాన్ దీర్ఘాశి చిట్టయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మూలపేట పోర్టు నిర్మాణానికి సానుకూలంగా స్పందించి గ్రామాన్ని, భూములను త్యాగం చేసిన తమకు పరిహారం విషయంలో అన్యాయం చేశారంటూ జమ్మూ కశ్మీర్ నుంచి వీడియో ద్వారా సోమవారం తన అవేదన వ్యక్తం చేశారు. రూ.50లక్షల వ్యయంతో ఇల్లు నిర్మించినప్పటికీ పోర్టు యాజమాన్యం, అధికారులు కేవ లం రూ. 25లక్షలకే ఎస్టిమేషన్ వేశారని చిట్టయ్య తెలిపారు. దీనిపై న్యాయం చేయా లని కోరుతూ రీ ఎస్టిమేషన్ వేయాలని కలెక్టర్, టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, తహసీల్దార్ హేమ సుందర్రావుకు వినతి పత్రాలు అందజేసినట్లు చెప్పారు. వినతి పత్రం ఇచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్నా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మూలపేట గ్రామానికి, తమ ఇంటికి వారం రోజులుగా విద్యుత్ సరఫరా నిలిపివేశారని చిట్టయ్య తెలి పారు. ఎందుకని ప్రశ్నిస్తే టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి నిలిపివేయాలని చెప్పినట్లు సమాధానం ఇచ్చారని తెలిపారు. పోర్టు నిర్మాణం కోసం ఇంత త్యాగం చేసిన తమకు కనీసం న్యాయం చేయకపోవడం బాధాకరమన్నారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు తమ సమస్యలను పట్టించుకోకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. అన్యాయాన్ని సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌లకు సోషల్ మీడియా వేదికగా వీడియో రూపంలో పంపినట్లు జవాన్ చిట్టయ్య తెలిపారు. 16 కిలోల గంజాయితో ఇద్దరు అరెస్టు ఇచ్ఛాపురం: ఒడిశా నుంచి బీహార్‌కి అక్రమంగా 16 కిలోల గంజాయిని తరలించేందుకు ప్రయత్నించిన బీహార్‌కు చెందిన సునీల్‌కుమార్ అలియాస్ మోహిత్ జైస్వాల్, ఒడిశాకు చెందిన సూర్యనారాయణ గౌడ అలియాస్ సిల్లుగౌడ అనే ఇద్దరు వ్యక్తులు పట్టణ పోలీసులకు పట్టుబడ్డారని సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. సీఐ కార్యాలయంలో సో మవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. బీహార్‌కు చెందిన సునీల్‌కుమార్ ఆర్థిక పరిస్థితి బాగులేక డబ్బులు సంపాదన కోసం బీహార్‌లో గంజాయి వ్యాపారం చేసే అమిత్‌ని కలిశాడు. అమిత్ ఒడిశా నుంచి గంజాయిని తీసుకు రావడంలో తనకి సహకరిస్తే రూ.పదివేలు ఇస్తానన్నాడు. దీనికి అంగీకరించిన సునీల్ అమిత్‌తో కలసి ఒడిశాలో లక్ష్మికాంత్ గౌడ అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి చాలా సార్లు బీహార్ తీసుకెళ్లారు. ఈ క్రమంలో మళ్లీ 16 కిలోల గంజాయిని కొనుగోలు చేసి సూర్యనారాయణ గౌడతో కలిసి బైక్‌పై బరంపురం రాగా.. అక్కడ పోలీసు తనిఖీలు ఉండడంతో ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌కు వ చ్చారు. ఇక్కడ పోలీసుల తనిఖీలో ఇద్దరూ దొరికిపోయారు. నిందితుల వద్ద నుంచి గంజాయితో పాటు రెండు సెల్ఫోన్లు, ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని ఇరువురి అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. 100 బస్తాల యూరియా పట్టివేత జలుమూరు: మండల పరిధి చల్లవానిపేట, గుగ్గిలి వద్ద విజిలెన్స్ అధికారులు దాడులు చేసి 100 బస్తాలు యూరియా, ఐదు టన్నుల బియ్యంను సోమవారం సీజ్ చేశారు. చల్లవానిపేట వద్ద తనిఖీలు చేయగా ఒడిశా రాష్ట్రం పర్లాఖిముడి నుంచి వ్యాన్‌తో పోలాకి మండలం డోల గ్రామానికి చెందిన డోల రమణ మూర్తి 4.5 మెట్రిక్ టన్నుల యూరియా తరలిస్తుండగా వాహనాన్ని ఆపి తనిఖీలు చేసి 100 బస్తాలు యూరియా గుర్తించామని విజిలెన్స్ అధికారి రామారావు తెలిపారు. ఎలాంటి ప త్రాలు లేనందున యూరియాను చల్లవానిపేట పీఏసీఎస్‌లో భద్రపరిచి వాహనాన్ని జలుమూ రు పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశామన్నారు. గుగ్గిలిలో రేషన్ బియ్యం పట్టివేత గుగ్గిలి వద్ద విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా అదే గ్రామానికి చెందిన కోరాడ గోవిందరావు ఆటోలో పీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. పరిసర గ్రామాల్లోని రే షన్ కార్డు దారుల నుంచి బియ్యం కొనుగోలు చేసి పర్లాఖిముండి తరలిస్తున్నట్లు తెలిపారు. -
వి.. న.. తి..
● పీజీఆర్ఎస్లో పరిష్కారమవ్వని సమస్యలు ● పలుమార్లు వచ్చినా పరిష్కారం కాని వినతులు ● ఎండార్స్‌మెంట్‌తో సరిపెడుతున్న వైనం తాగునీటి బావిని కప్పేశారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. అలా ఆయన ఫిర్యాదు చేయడం ఇది మూడోసారి. రెగ్యులరైజేషన్ కోసం కాంట్రాక్టు ఉద్యోగులు వినతులిచ్చారు. అలా విన్నవించడం ఇదేమీ మొదటి సారి కాదు. పీజీఆర్ఎస్లో వినతులు ఎక్కువ.. పరిష్కారాలు తక్కువలా పరిస్థితి మారిపోయింది. ఫిర్యాదుదారులు సమస్యలతో విసుగెత్తిపోతున్నా, పరిష్కారం దొరక్క నరకయాతన పడుతున్నా.. అధికారులు మాత్రం స్పందించకుండా తిప్పలు పెడుతున్నారు. ఈ వారమూ అదే పరిస్థితి కనిపించింది. క్షేత్రస్థాయిలో అధికారులు దృష్టి పెట్టకపోవడంతో రెవెన్యూ క్లినిక్ సైతం నిస్సారంగా మారుతోంది. సుగెత్తిపోతున్నా.. రక యాతన పడుతున్నా.. ప్పలు పెట్టే వేదిక శ్రీకాకుళం పాతబస్టాండ్: పేరుకే ప్రజా సమస్యల నమోదు మరియు పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కానీ క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారమవుతున్న పరిస్థితి లేదు. దీంతో వచ్చిన వినతులే మళ్లీ మళ్లీ వస్తున్నాయి. మరోసారి నమోదుకు కూడా అవకాశం కల్పించడం లేదు. దీంతో సమస్యల పరిష్కారం కాకపోవడం, పదేపదే అదే సమస్యలను పీజీఆర్ఎస్ దృష్టికి బాధితులు తీసుకురావడం జరుగుతోంది. అధికారులు లెక్కల్లో మాత్రం పరిష్కారం చూపుతున్నారు. అంతా ఎండార్స్మెంట్తోనే సరిపెడుతున్నారు. ఒక్కోసారి పీజీఆర్ఎస్లో కిందిస్థాయి అధికారులపై కేకల వేయడం, తర్వాత ఆ సమస్యను పూర్తిగా మర్చిపోవడం జరుగుతోంది. ఇలా ప్రతివారం పీజీఆర్ఎస్లో రిపీట్‌గా కొనసాగుతోంది. మరోవైపు రెవెన్యూ క్లినిక్‌లు పెడుతుండగా.. అన్ని వినతులు మండల స్థాయలో పరిష్కారం కావాల్సినవే వస్తున్నాయి. అంటే క్షేత్రస్థాయిలో సమస్యలపై అధికారులు దృష్టి పెట్డకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు పీజీఆర్ఎస్కు 89,497 వినతులు వచ్చాయి. వీటిలో 85,923 సమస్యలు పరిష్కరం జరిగిట్లు అధికారులు లెక్కలు చూపుతున్నారు. ఇంకా పెండింగ్‌లో 3,574 ఉన్నాయని చెబుతున్నారు. కానీ వాస్తవానికి పరిష్కారం అంటే ఎండార్స్మెంట్ ఇవ్వడంతోనే సరిపెడుతుండడం గమనార్హం. ● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని, దీనివలన మరింత మెరుగైన సేవలు పొందగలుగుతారని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక పీజీఆర్ఎస్, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. అర్జీదారులు తమ అర్జీలను నేరుగా పీజీఆర్ఎస్ కార్యక్రమంలో గానీ, లేదా ఆన్లైన్ ద్వారా మీకోసం వెబ్సైట్లో గానీ నమోదు చేసుకోవచ్చని సూచించారు. నమోదైన అర్జీల స్థితిని తెలుసుకునేందుకు 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చన్నారు. కాగా ఈ వారం మొత్తం 253 వినతులు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ సీసీఎల్ఏ శాఖకు సంబంధించి 133 అర్జీలు, పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో 16, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు 14, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్‌కు 12, జలవనరుల శాఖకు 8, సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగంకు 8, స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డుకు 6, సెర్ప్ విభాగంలో 6, కుటుంబ సంక్షేమ శాఖకు 5, టిడ్కోకు 5 అర్జీలు వచ్చాయి. అలాగే సమగ్ర శిక్షకు 4, హౌసింగ్ కార్పొరేషన్‌కు 4, ఈపీడీసీఎల్‌కు 4, వైద్య విద్యకు 3, దేవదాయ శాఖకు 3, ఆర్‌అండ్‌బీకు 2, గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్‌కు 2, స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్‌కు 2 వినతులు వచ్చాయి. అదేవిధంగా పశుసంవర్ధక, ఏపీఎస్ఆర్టీసీ, పాఠశాల విద్య, పోలీసు శాఖ, మత్స్యశాఖ, అటవీ శాఖ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్, రవాణా శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, ఫ్యాక్టరీలు, ఏపీఐఐసీ, సివిల్ సప్లయ్, ఉద్యానవన, ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, ఇంటర్మీడియట్ విద్యాశాఖలకు సంబంధించి ఒక్కొక్కటి చొప్పున వినతులు వచ్చాయి. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జెడ్పీ సీఈవో సీఈవో వెంకట్ రామన్ తదితరులు పాల్గొన్నారు. ● వైఎస్సార్సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి పలు సమస్యలపై వినతిపత్రం అందించారు. శ్రీకాకుళం మండలం వాకలవలస గ్రామంలోని బీసీ కాలనీలో ఉన్న తాగునీటి బావిని రాత్రికి రాత్రి జేసీబీ, ట్రాక్టర్లతో కప్పేసి ప్రభుత్వం స్థలంలో మొక్కలు వేశారని గ్రామ మహిళలు, పెద్దలు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై గత వారం ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని వారు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు బగాది మనోజ్ కుమార్, పేడాడ రామారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం మండలం వాకలవలస గ్రామ రెవెన్యూ పరిధిలో జిరాయితీ భూములను సర్వే అధికారులు గ్రామ కంఠలో చూపించారని, సర్వే సమయంలో కనీసం నోటీసుల కూడా ఇవ్వలేదని ఆ గ్రామానికి చెందిన రైతు కంచరాన గోపి ఫిర్యాదు చేశారు. అంతా ఇష్టారాజ్యంగా వీఆర్వో, సర్వేయర్లు వ్యవహరించి రైతుకు భూమిపై హక్కుల లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో తమతో పాటు పలువురు రైతులు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారని, పలుమార్లు ఫిర్యాదు చేస్తే ఎండార్స్మెంట్ ఇస్తున్నారే తప్ప సమస్యను పరిష్కరించడం లేదని వాపోయారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ – హెల్త్ కాంట్రాక్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ వద్ద ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. రాష్ట్రంలో సుమారు 14,600 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారని వారు తెలిపారు. వీరిలో స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, పారా మెడికల్ సిబ్బంది, ఇతర వైద్యశాఖ సిబ్బంది ఉన్నారు. తమను రెగ్యూలర్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు కె.వేదవతీ లక్ష్మీబాయి, పి.రఽఘు, ఎస్.రమేష్, బి.సంతోష్ కుమార్, ఎం.గోవిందరావు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఇలా ఇచ్చారు.. అలా విరిగింది..!
దివ్యాంగులకు నాసిరకం ట్రైసైకిళ్లు● కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు చేతులు మీదుగా ఆదివారం పంపిణీ ● పంపిణీ చేసిన రోజే విరిగిన ఓ దివ్యాంగుడి ట్రైసైకిల్ ● ఆ దివ్యాంగుడికి తప్పిన ప్రమాదం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కేంద్ర మంత్రి చేతుల మీదుగా తీసుకున్న ట్రైసైకిల్ ఎక్కిన దివ్యాంగుడికి ప్రమాదం తప్పింది. పంపిణీ చేసిన రోజునే ఈ ట్రైసైకిల్ విరిగిపోయింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రూ.కోటిన్నర సీఎస్ఆర్ నిధులతో తయారు చేసిన ట్రైసైకిళ్లలో నాణ్యత లోపాలున్నాయా? వీటి వెనక చేతివాటం ప్రదర్శించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 130 మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, 100 మంది వయో వృద్ధులకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా సీఎస్ఆర్ నిధుల సాయంతో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చేతులమీదుగా ఆదివారం సైకిళ్లు పంపిణీ చేశారు. ఇప్పుడా ట్రైసైకిళ్ల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. జలుమూరు మండలం చల్లవానిపేటకు చెందిన ఢిల్లీరాజు అనే దివ్యాంగుడికి ఆదివారం కేంద్రమంత్రి అందజేసిన ట్రైసైకిల్ ఇంటికి తెచ్చిన రోజే విరిగిపోయింది. ఇంట్లో అలా కూర్చోగానే ఒక చక్రం విరిగిపోయింది. ఇంట్లో జరగడం వల్ల ప్రమాదం తప్పింది. దాని చార్జర్ కూడా పనిచేయడం లేదు. దివ్యాంగులకు ఎంతో నాణ్యమైన పరికరాలు అందజేయాలి. నాణ్యతా ప్రమాణాలను పక్కాగా చూసుకుని, అన్నీ పరిశీలించాక పంపిణీ చేయాలి. నిర్మాణ కంపెనీ జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ, పంపిణీ చేసిన రోజునే ఆ ట్రైసైకిల్ విరిగిపోయిందంటే ఎక్కడో లోపాలు ఉన్నాయన్నది విచారణ చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఆలోచిస్తేనే భయమేసింది నాసిరకం ట్రైసైకిళ్లతో ఎంత మంది ఇబ్బంది పడుతున్నారో ఆలోచిస్తే భయంగా ఉంది. ఇంటి ఆవరణలో జరిగింది కాబట్టి సరిపోయింది. రోడ్డు మీద, ఇంకెక్కడైనా జరిగితే ప్రమాదకరం. దయచేసి మున్ముందు జరక్కుండా, సరిచేసి లేదా కొత్తది ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. – ఢిల్లీరాజు, దివ్యాంగుడు, చల్లవానిపేట, జలుమూరు -
మహాదేవునికి అపచారం
● శ్రీముఖలింగంలో చెత్త బండిలో పూజాద్రవ్యాల తరలింపుజలుమూరు: శ్రీముఖలింగంలో మహాదేవునికి మరోసారి అపచారం జరిగింది. గత నెలలో ఓ శునకం శివలింగం పానపట్టం మీద నిద్రించడంపై ‘సాక్షి’లో కథనం వచ్చిన వెంటనే దేవదా య శాఖ అధికారులు స్పందించి ఆలయ సంప్రోక్షణ, శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు స్వామికి సమర్పించిన పూజా ద్రవ్యాలను చెత్తతో కలిపి నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్టర్‌తో తరలించడంపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నా రు. ప్రధాన దేవాలయంతోపాటు ఆలయ పరిసరా ల్లో ఉన్న శివలింగాలు, ఇతర దేవతా విగ్రహాలు, అష్టగణపతులకు భక్తులు చేసిన పూజలు అనంతరం పూలు, పత్రి, ఇతర పూజా సామగ్రిని పక్కనే ఉన్న వంశధార నదిలో గానీ, ఆలయం చెంతనే ఉన్న ఓ గోతిలో పవిత్రంగా నిమజ్జనం చేయాలి. కానీ ఏకంగా పంచాయతీ చెత్త బండిలో పూజాద్రవ్యాలను ఉంచి ఇళ్ల నుంచి సేకరించిన చెత్త, మాంసం వ్యర్థాలతో కలిపి పారబోస్తున్నారు. భక్తులు స్వామికి సమర్పించిన మారేడు, నేరేడు పత్రి, స్వామి పూ ల దండలతోపాటు సుగంధ ద్రవ్యాలను ఇలా తరలించడాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై ఆలయ ఈఓ కె.ఏడుకొండలును వివరణ కోరగా తన దృష్టికి వచ్చిందని, ఇక నుంచి అలా జరగకుండా చూస్తామన్నారు. మనోభావాలు దెబ్బ తింటాయి ఎంతో విశ్వాసంతో దూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఇలా చేస్తుంటే దేవదాయ శాఖ ఏంచేస్తోంది. ఇది భక్తుల మనోభావాలు దెబ్బ తీయ డమే. – ఎన్.రమణమూర్తి, ధనలక్ష్మి, భక్తులు,విశాఖపట్నం -
యువకుడిపై అట్రాసిటీ కేసు నమోదు
టెక్కలి రూరల్: టెక్కలి మండలం వంగర గ్రామానికి చెందిన గిరిజన యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసగించిన మేఘవరం గ్రామానికి చెందిన వ్యక్తిపై సోమవారం కేసు నమోదు చేసినట్లు టెక్కలి పోలీసులు తెలిపారు. ఇటీవల కాలంలో బాధిత గిరిజన యువతి తనకు జరిగిన అన్యాయంపై హోంశాఖ మంత్రికి, ఎస్టీ కమిషన్‌కి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై రెండు రోజుల క్రితం సాక్షి పత్రికలో ‘నాయ్యం చేయకపోతే చావే శరణ్యం’ అనే శిర్షీకతో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన టెక్కలి పోలీసులు మేఘవరం గ్రామానికి చెందిన వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, రేప్ కేసులను నమోదు చేసినట్లు వెల్లడించారు. కారు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు కాశీబుగ్గ: పలాస మండలం లక్ష్మీపురం టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి ఒడిశా వైపు వెళ్తున్న కారు టోల్ గేట్ సమీపంలో అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొంది. కారు స్టీరింగ్ బిగుసుకుపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో భద్రక్‌కు చెందిన మంగళ్ నాయక్, దీప్తి సాహు, దిలీప్ నాయక్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ప్రాథమిక చికిత్స అనంతరం శ్రీకాకుళం జీజీహెచ్‌కు పంపించారు. కోతి దాడిలో మహిళకు తీవ్రగాయాలు మెళియాపుట్టి: మండల కేంద్రానికి చెందిన జమ్మ గోవిందమ్మ అనే మహిళపై కోతి దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైంది. సోమవారం బండార్లమ్మ వీధిలో కోతి హల్చల్ చేసింది. కోతి వెంబడించి దాడి చేయడంతో జమ్మ గోవిందమ్మ పడిపోయింది. కాలు.. చేయి విరిగిపోయింది. ఆమెను పర్లాకిమిడిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే కోతులు పదేపదే దాడులు చేస్తున్నా అధికారులు నిమ్మకునీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఎస్పీ గ్రీవెన్స్‌కు 73 ఫిర్యాదులు
శ్రీకాకుళం: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో భాగంగా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ప్రజల నుంచి 73 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదులపై చట్టప్రకారం విచారణ చేపట్టి, త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజల నుంచి అందే ప్రతీ ఫిర్యాదుపై సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధతో వ్యవహరించాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. వినతులు పరిశీలిస్తే.. ● తమపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని నందిగాం మండలం జడ్యాడ గ్రామానికి చెందిన రాకోటి సురేష్, తలసముద్రం వసంతరావు, రాకోటి రాకేష్, రాకోటి ఈశ్వరరావులు కోరారు. ● కంచిలి మండలం కేబీనౌగాం గ్రామంలో సర్వే నంబర్ 88/1లో సుమారు 60 సెంట్ల భూమికి సంబంధించి కోర్టులో పెండింగ్ ఉన్నందును తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని రోము ప్రధానో విన్నవించారు. -
మిగులు భూములు పేదలకు ఇవ్వాలి
బూర్జ మండలం అయ్యవారిపేట(టీడీఆర్ రాజుపేట)లో ప్రభుత్వ మిగులు భూములు తరతరాలుగా దళితులు, బీసీలు, వెనుకబడిన పేదలు సాగు చేసుకుంటున్నారని, ఆ భూమిలో పేద బీసీ, ఎస్సీ రైతులకు పట్టాల మంజూరు చేయాలని జిల్లా పరిషత్ వద్ద సాగుదారులతో వ్యవసాయ కార్మిక సంఘం నేతలు ధర్నా నిర్వహించారు. అనంతరం వినతిపత్రాన్ని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌కు అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగరాపు సింహాచలం, కుప్పిలి శ్రీధర్, సింహాచలం, విష్ణుమూర్తి, ఎస్.జనార్ధన, రామచంద్రరావు, కుప్పేశ్వరరావు, ఆదిలక్ష్మి, సరస్వతి, రాములు తదితరులు పాల్గొన్నారు. -
రైతులు లేకుండా ఖనిజ పరీక్షలా..?
● ఆందోళన చెందుతున్న పున్నాం గ్రామస్తులు జి.సిగడాం: తమ అనుమతి లేకుండా తమ భూముల్లో మాంగనీస్ ఖనిజానికి పరీక్షలు కోసం వేదాంత మైనింగ్ కంపెనీ సిబ్బంది ప్రత్యేక సర్వేలు చేస్తోందని పున్నాం గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఆ భూమి లేకపోతే తమ జీవనం కష్టమవుతుందని తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన తెలిపారు. పున్నాం గ్రామ సమీపంలో సుమారుగా 152 ఎకరాల భూమిలో మైనింగ్ ఉందని, రైతుల అనుమతి లేకుండా నేరుగా వేదాంత కంపెనీ సిబ్బంది ప్రత్యేక సర్వే చేస్తున్నారని, వాటిని తక్షణమే నిలుపుదల చేయాలని కోరుతూ పున్నాం, బూటుపేట గ్రామస్తులంతా సోమవారం తహసీల్దార్ కార్యలయం వద్ద నిరసన తెలిపారు. తమ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా సర్వే చేయడం ఎంత వరకు న్యాయమన్నారు. ఇలా చేస్తే పోరాటాలు చేస్తామన్నారు. ఇప్పటికే చుట్టుపక్కల గ్రామాలన్నీ కలుషితమైపోయాయని, మైనింగ్ కంపెనీ పెడితే తమ జీవితాలు నాశనమవుతాయని తెలిపారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ నాయుడుగారు నిర్మలకు వినతి పత్రం అందించారు. అలాగే సోమవారం పీజీఆర్‌ఎస్‌లోనూ ఫిర్యాదు చేశారు. -
వైఎస్సార్సీపీలో చేరిక
పోలాకి: మండలంలోని గాతలవలస గ్రామానికి చెందిన టీడీపీ యువ కార్యకర్త కొమ్మల వేణు సోమవారం వైఎస్సార్సీపీ శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. కూటమి ప్రభుత్వం దళితులు, మైనార్టీలపై చూపుతున్న వివక్ష, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో పార్టీని వీడినట్లు తెలిపారు. ఎప్పటినుంచో టీడీపీకి సపోర్టు చేస్తున్నా గాతలవలస పంచాయతీలో వైఎస్సార్సీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. రాయల మల్లేసు, బొడ్డేపల్లి హరికృష్ణ, మెండ ధర్మారావు, దండుపాటి సూర్యనారాయణ వంటి పార్టీ సీనియర్లతో కలిసి పంచాయతీలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు అందవరపు సూరిబాబు, డీసీసీబీ మాజీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
జనం డబ్బు
సర్కారు డప్పువలంటీర్ల పొట్ట కొట్టారు అధికారంలోకి వస్తే రూ. పది వేలు ఇస్తామని వలంటీర్లను నమ్మించారు. ఓట్లు పడ్డాక ఆ ఊసే ఎత్తలేదు. వలంటీర్ల పొట్ట కొట్టారు. – గేదెల సుధీర్, మాజీ వలంటీర్, తాయిమాంబాపురం, ఎల్ఎన్ పేట ప్రజాధనం దుర్వినియోగం ప్రభుత్వ పథకాల ప్రచారానికి ఇన్ఫ్లుయెన్సర్లకు డబ్బులివ్వడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే. టీడీపీ నేతలకు ఇది సరికాదు. – నరసింహారావు, మాజీ వలంటీర్, ఓండ్రుజోల, ఎల్‌ఎన్‌పేట -
చివరి మజిలీకి చిక్కులు..!
టెక్కలి: మేజర్ పంచాయతీలో వైఎస్సార్ జంక్షన్ సమీపంలోని శ్మశానవాటిక వద్ద అంత్యక్రియలకు అవస్థలు కొనసాగుతున్నాయి. శ్మశానవాటిక మార్గంలో ఉన్నటువంటి మురుగుకాలువ పైకప్పులను ఇటీవల తొలగించారు. ఆ తర్వాత వాటిని యథాస్థానంలో ఏర్పాటు చేయకపోవడంతో, మృతదేహాలతో అంత్యక్రియలకు వచ్చేవారంతా అవస్థలు పడుతున్నారు. సోమవారం ఇదే పరిస్థితి కనిపించింది. మృతదేహానికి సంబంధించిన వ్యక్తులే సొంతంగా కాలువ పైకప్పులను ఏర్పాటు చేసుకుని మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించారు. అయితే గత కొన్నిరోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ అధికారుల్లో చలనం కలగడం లేదని స్థానికులు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికై నా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఇంకా తెలియని యువకుడి ఆచూకీ
చిల్పూరు: జనగామ జిల్లా చిల్పూరు మండలం గార్లగడ్డతండా పంచాయతీ పరిధిలోని మల్లన్నగండి దేవాదుల రిజర్వాయర్‌లో ఆదివారం సాయంత్రం గల్లంతైన శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువకుడు కల్యాణ్ (26) అచూకీ సోమవారం రాత్రి 7 గంటల వరకు కూడా తెలియరాలేదు. కల్యాణ్ సికింద్రాబాద్‌లో ఉంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం ఉదయం స్నేహితులతో కలిసి మల్లన్నగండి రిజర్వాయర్ చూసేందుకు రాగా, ప్రమాదవశాత్తు గల్లంతైన విషయం తెలిసిందే. అదే రోజు రాత్రి వరకు గాలించినా ఆచూకీ తెలియరాలేదు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి రెస్క్యూ టీం సభ్యులు స్థానిక ఎస్సై సిరిపురం నవీన్‌కుమార్ ఆదేశాలతో మరో రిజర్వాయర్‌లో గాలింపు చేపట్టారు. రాత్రి 7 గంటల వరకు ఆచూకీ లభ్యం కాకపోవడం, బాగా చీకటికావడంతో వెనుదిరిగారు. మంగళవారం గాలింపు చేపడుతామని పోలీసులు తెలిపారు. కాగా, తమ కుమారుడు కనిపిస్తాడేమోనని తల్లిదండ్రులు పడాల భాస్కర్–నిర్మల కుటుంబ సభ్యులు కన్నీరుమన్నీరుగా విలపిస్తూ అక్కడే వేచి ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు గార్లగడ్డతండ సర్పంచ్ మాలోతు నవీన్ నాయక్ సొంత ఖర్చులతో వసతితో పాటు భోజన సౌకర్యం కల్పించారు. -
డిప్లమా, ఐటీఐ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ‘స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు’లలో భాగమైన ‘కౌశలం’ ద్వారా నిర్వహిస్తున్న ఉద్యో గ మేళాను జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఈ నెల 6న ఉదయం 9 గంటల నుంచి ఈ నియామకాల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలియజేశారు. ప్రముఖ ప్రీమియర్ ఎనర్జీ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు హాజరై అప్రెంటిసిస్ కోసం అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారని, వార్షిక వేతనం రూ.1,64,806 నుంచి రూ. 4,00,000 వరకు ఉంటుందని స్పష్టం చేశారు. అర్హత కలిగిన డిప్లమా కోర్సులు మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్–కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఐటీఐ ట్రేడ్స్ ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ , మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్, డీజిల్ మెకానిక్, మెయింటెనెన్స్ మెకానిక్ ట్రేడ్లు కలిగిన వారు అర్హులని తెలిపారు. ఎలాంటి పూర్వ అనుభవం లేని వారు కూడా నియామక ప్రక్రియలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఎంపికై న అభ్యర్థులు తిరుపతి సమీపంలోని సంస్థలో పనిచేయాల్సి ఉంటుంది. వేతనంతో పాటు లోకల్ ట్రాన్స్పోర్ట్ సదుపాయం కల్పిస్తారని వెల్లడించారు. స్కూల్ గేమ్స్ అండర్–19 సాఫ్ట్‌బాల్ జిల్లా జట్టు ఎంపిక నరసన్నపేట: స్కూల్ గేమ్స్‌లో భాగంగా రాష్ట్ర స్థాయిలో పాల్గొననున్న అండర్–19 సాఫ్ట్‌బాల్ జిల్లా జట్టును ఆదివారం ఎంపిక చేశారు. అమ్మాయిలు, అబ్బాయిలు వేర్వేరుగా 16 మంది చొప్పున 32 మందిని ఎంపిక చేశారు. స్థానిక పీఎం శ్రీ స్కూల్ ఆవరణలో ఆదివారం ఎంపికలు నిర్వహించారు. ఈ నెల 10 నుంచి వెస్ట్ గోదావరి జిల్లాలో పెద్దవేగిలో రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో వీరు పాల్గొంటారు. కార్యక్రమంలో స్కూల్ ఇన్చార్జి హెచ్ఎం సాయి శ్రీనివాస్, జిల్లా స్థాయి సాఫ్ట్ బాల్ అసోషియేషన్ ప్రతినిధిలు ఎం. తిరుపతిరావు, సత్యనా రాయణ, ఆనంద్ కిరణ్, రాజగోపాల్, రామరా జు, మధు చిన్ని కృష్ణ, గణపతిరావు తదితరులు పాల్గొన్నారు. పాము కాటుకు ఆవు మృతి ఎల్.ఎన్.పేట: ఎల్.ఎన్.పేట గ్రామానికి చెందిన ముగడ వెంకటరమణకు చెందిన ఆవు పా ము కాటుకు గురై మృతి చెందింది. ఆదివారం సాయంత్రం బసరాజుపేట గ్రామానికి వెళ్లే రహదారి వద్ద ఆవు మేత మేస్తుండగా పాము కాటు వేసినట్లు పాడి రైతు వెంకటరమణ తెలిపారు. ఆవు విలువ సుమారు రూ.40 వేలు ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గెడ్డలో చేపల మృత్యువాత రణస్థలం: మండలంలోని నారువ, మెంటాడ పంచాయతీల పరిధిలోని అక్కయ్యపాలెం దగ్గరలో కందివలస గెడ్డలో చేపలు మృత్యువాత పడ్డాయి. పైడిభీమవరం పారిశ్రామికవాడలోని పలు పరిశ్రమలకు చెందిన రసాయన వ్యర్థాల పైపులైన్లు ఈ గెడ్డ పక్కన నుంచే వెళ్తూ సముద్రంలో కలుస్తున్నాయి. ఈ రసాయన పైపులు లీకై గెడ్డ నీటిలో కలిసినప్పడు మత్స్య సంపదకు నష్టం వాల్లితుందని, అలాగే ఇటీవల కూడా రెండు పశువులు ఇలా వ్యర్థ జలాలు తాగి చనిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలుష్య నియంత్రణ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. -
పంట.. నష్టం కనిపించలేదంట!
ఆమదాలవలస రూరల్: వాయుగుండం ప్రభావంతో వందలాది ఎకరాల పంట పొలాల్లో బురద పేరుకుపోయింది. ముఖ్యంగా బూర్జ మండలం అల్లెన వద్ద నాగావళి నది వరద నీరు గట్టెక్కటంతో మండలంలో చీమలవలస, కొరపాం, జి.కె.వలస, కొత్తవలస, కోర్లకోట, తొగరాం, కలివరం తదితర గ్రామాలకు సంబంధించి పంట పొలాలు వరద నీటిలో మునిగి తేలటమే కాకుండా వదర నీరు బురద పట్టి పంట పోయింది. కానీ వ్యవసాయాధికారులు మాత్రం వారం పాటు అన్నీ పరిశీలించి నష్టం ఉండదని తేల్చేశారు. ఇది రైతులకు మింగు డు పడడం లేదు. కరువుకు సంబంధించి మండలం యూనిట్‌గా తీసుకోవటంతో ఆమదాలవలస రూర ల్ మండలంతో పాటు ఆమదాలవలస మున్సిపాలిటీలో పలు గ్రామాలకు సంబంధించిన పంట పొలా లు వర్షాధారంపైనే ఉండటంతో కరువు నష్టం ఎన్నడూ అందని పరిస్థితి నెలకొంది. అయితే కాలువలపై సాగుచేసే భూములకు నిత్యం వరద ప్రమాదం తప్పటం లేదు. అయితే ప్రభు త్వం కనీసం నష్టపరిహారం అందించకుండా చేతులెత్తేయటం అన్నదాతలను సైతం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికై నా క్షేత్రస్థాయిలో కూటమి పాలకులు, పాలనాధికారులు పర్యవేక్షణ చేసి పంట నష్టం గుర్తించి తగిన పరిహారం అందించాలని కోరుతున్నారు. ఆదేశాలే లేవు.. వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల కు సంబంధించి నష్టం గుర్తించేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో పంట నష్టం గుర్తించే అవకాశం లేదు. జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే తప్పకుండా పంట నష్టం గుర్తిస్తాం. – మెట్ట మోహనరావు, మండల వ్యవసాయశాఖాధికారి, ఆమదాలవలస రైతులను ఆదుకోవాలి వరదల కారణంగా ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాల్లో పంట పొలాలు పూర్తిగా ముంపునకు గురైనా యి. దీంతో చాలా మంది రైతులు నష్టపోయారు. ప్రభుత్వం తక్షణమే అన్నదాతలను ఆదుకోవాలి. – చింతాడ రవికుమార్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నష్టాన్ని గుర్తించాలి వరదల వల్ల అనేక ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది. ప్రభుత్వం పంట నష్టం గుర్తించటంలో చేతులేత్తేయటం సరికాదు. వరితో పాటు మొక్కజొన్న తదితర పంటలు వరద ప్రభావానికి గురయ్యాయి. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన నాయకులు రైతుకు నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. – బొడ్డేపల్లి కృష్ణారావు, రైతు, ఇసుకలపేట, ఆమదాలవలస రూరల్ మండలం వరద, బురదలో ధ్వంసమైన వరి పొలాలు పంట నష్టం లేదని అధికారుల మాటలు ఆవేదన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు -
పరాయి సొమ్ముపై దురాశ
● నల్లరాయి కొండపై మైనింగ్ మాఫియా కన్ను ● గ్రానైట్ తవ్వకాలకు సిద్ధమవుతున్న వైనం ● ఇప్పటికే పేలుళ్ల ప్రయత్నాలు అడ్డుకున్న నిరసనకారులు ● ముఖ్యనేత కనుసన్నల్లోనే పనులన్నీ కంచిలి: నల్లరాయి కొండపై మైనింగ్ మాఫియా కన్ను పడింది. ఇప్పటికే భైరిపురం గ్రామంలో పచ్చని పంట పొలాల మధ్యలో ఉన్న కొండలో గ్రానైట్ నిక్షేపాలను అడ్డగోలుగా తవ్వుతూ దోచుకుంటున్నారు. తాజాగా నువాగడ రెవెన్యూ గ్రామం పరిధిలో సర్వే నంబర్ 47లో ఉన్న నల్లరాయి కొండపై మైనింగ్ చేసేందుకు కొందరు పావులు కదుపుతున్నారు. నియోజకవర్గ ముఖ్య నేతతో మైనింగ్ వ్యాపారులు రహస్యంగా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. తర్వాత ఈ పనులు మొదలు పెట్టేందుకు శ్యాంపిల్స్ సేకరణ, తవ్వకాల కోసం బాంబులు పెట్టేందుకు కొండకు డ్రిల్లింగ్ చేయడం ప్రారంభించారు. సమాచారం తెలుసుకున్న స్థానిక రైతులు, గిరిజనులు అప్రమత్తమయ్యారు. వెంటనే మండల సీపీఐ నాయకులను సంప్రదించి ఆ ప్రయత్నాలను అడ్డుకొని ప్రతిఘటించారు. దీంతో వారు అక్కడి నుంచి జారుకున్నారు. దశాబ్దం నుంచి ఏర్పాట్లు ఈ కొండలో విలువైన గ్రానైట్ నిక్షేపాలు ఉన్నట్లు తెలుసుకొని జిల్లాకు చెందిన గ్రానైట్ వ్యాపారులు దశాబ్ద కాలంగా దీనిపైన గురిపెట్టారు. దశల వారీ గా ఆ ప్రాంతంలో ట్రాన్స్పోర్టింగ్కు అవసరమైన రహదారి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కొండ ప్రాంతానికి చేరుకోవడానికి ఇప్పటికే జలంత్రకోట నుంచి గోకర్ణపురం రోడ్డుకు నువాగడ నుంచి శాశ్వత తారు రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డుకు నల్లరాయి కొండ నుంచి కనెక్టివిటీ రోడ్డు నిర్మాణానికి సర్వే చేసి ప్రతిపాదనలు కూడా చేశా రు. హైవే వరకు అవసరమైన రహదారి మార్గాన్ని దశలవారీగా నిర్మిస్తున్నారు. ఇలా ఈ కొండను సొంతం చేసుకొనేందుకు పక్కాగా ప్రణాళిక రచించి ముందుకెళుతున్నారు. దీనికి ప్రభుత్వ యంత్రాంగం కూడా సహకరిస్తూ అవసరమైన పత్రాలు, తీర్మానాలు, అనుమతులు ఒక్కొక్కటిగా మైనింగ్ శాఖకు అందించి వ్యాపారులకు అనుకూలంగా లీ జులు మంజూరు చేస్తూ గిరిజనుల పొట్టకొట్టే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ కొండ చుట్టుపక్కల శాసనాం గ్రామానికి చెందిన 30 మంది రైతులకు బీడీఆర్ పట్టాలను సుమారు పదిహేనేళ్లు కింద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అందజేయడంతో, వారంతా ఈ కొండ చుట్టుపక్కల కంది తదితర పంటల్ని సాగుచేస్తున్నారు. మరోవైపు నువాగడ పంచాయతీ పరిధి రాజాశాంతి నగర్‌కు చెందిన గిరిజనులు కొండకు మరోవైపు ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ, అక్కడే నివాసాలు ఏర్పాటు చేసు కొని దశాబ్దాలుగా జీవిస్తున్నారు. వారంతా ఇక్కడ జరగబోయే విధ్వంసాన్ని తలచుకొని భయపడుతున్నారు. లొద్దాలొద్ది రిజర్వాయర్‌కు దెబ్బ.. నల్లరాయి కొండ నుంచి వచ్చే వరద నీటితో సమీపంలో ఉన్న వివిధ చెరువులుతోపాటు లొద్దాలొద్ది రిజర్వాయర్‌కు కూడా సాగునీటి సేకరణ జరుగుతోంది. తవ్వకాల వల్ల ఈ రిజర్వాయర్ కింద సాగుచేస్తున్న 1100 ఎకరాల పంట పొలాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ నల్లరాయి కొండపై పూరి జగన్నాథస్వామి కొలువై ఉండేవారని స్థానిక గిరిజనులు చెబుతున్నారు. శాసనాం గ్రామంలో గొండు సామాజిక వర్గం కులదైవం దేవత రాతి విగ్రహం ఇక్కడ ఉండటంతో పూజలు చేస్తుంటారు. కూటమి కుట్రలు.. ఈ కొండలో ఖనిజ నిక్షేపాలు తరలించేందుకు ముఖ్య నేత అనుచరులతో కలిసి పన్నాగాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. కొండను సొంతం చేసుకొనేందుకు అవసరమైన అధికారుల మద్దతు కూడా పొందినట్లు భోగట్టా. మైనింగ్ చేపట్టిన తర్వాత గ్రానైట్ రాళ్లు లీజుదారులు వెలికితీసి, తీసుకెళ్లిన తర్వాత అక్కడ మిగిలిపోయిన వేస్ట్ మెటీరియల్‌ను కూడా స్థానిక కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు కూడా నిర్ణయా లు జరిగినట్లు తెలుస్తోంది. గ్రానైట్ లీజుదారులకు, వేస్ట్ మెటీరియల్‌ను ముఖ్యనేత బంధువులుగా చెప్పుకొనే ఇద్దరు వ్యాపారులు వాటాలు ఫిక్స్ చేసుకున్నట్లు ఆయా వర్గాల్లో జోరుగా చర్చించుకుంటున్నారు. ఈ మెటీరియల్ సాయంతో జిల్లాలో జరిగే వివిధ భారీ నిర్మాణాలకు అవసరమైన రాళ్లు తరలించేందుకు ముఖ్యనేత బంధువులు ఇప్పటికే ఆయా నిర్మాణ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొన్నట్లు భోగట్టా. పనులు సజావుగా సాగేందుకు పోలీసుల సాయం కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. కొండ పరిసరాల్లోనే వ్యవసాయం నల్లరాయి కొండ పరిసరాల్లోనే దశాబ్దాలుగా వ్యవసాయం చేసుకొంటూ, ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నాం. ఇక్కడ భూములే మాకు జీవనాధారం. ఈ కొండలో తవ్వకాలు జరిపితే మా ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుంది. – సవర విశ్వనాత్, రైతు, రాధాశాంతి నగర్ ఈ కొండే జీవనాధారం.. నల్లరాయి కొండ చుట్టూ ఉన్న భూమిని శాసనాం గ్రామానికి చెందిన 30 మంది గొండు జాతి వారికి బీడీఆర్ పట్టాలు ఇచ్చా రు. వాటిలో కంది తదితర పంటల్ని సాగుచేసుకొని జీవిస్తున్నాం. మాకు ఈ కొండే జీవనాధారం. – జెన్నాలూచి, రైతు, శాసనాం గ్రామం -
పెన్షన్.. టెన్షన్
శ్రీకాకుళం పాతబస్టాండ్:రెండున్నరేళ్లు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తే కూటమి ప్రభుత్వం ఇప్పటికి కరుణించింది. మంజూరు సంగతి దేవుడెరుగు.. పింఛన్ల కోసం కనీసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. కూటమి అధికారంలోకి వచ్చాక కొత్తగా ఒక్క వృద్ధునికి గానీ, దివ్యాంగునికి గానీ, ఇతర కేటగిరీల వారికెవ్వరికీ కొత్త పింఛన్ అన్నదే ఇవ్వలేదు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొత్త పింఛన్లు ఇస్తామని దరఖాస్తులు ఆహ్వానించా రు. కానీ విధానంలో లోపాలు, అతి తక్కువ సమ యం ఇవ్వడం వల్ల దాదాపు సగం మంది అర్హులు కూడా పింఛన్లకు దరఖాస్తు చేసుకోలేకపోయారు. పైగా దాదాపు సగం మందివి పలు కారణాలతో రిజెక్టు చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పింఛన్లకు 59,051 దరఖాస్తులు రాగా, వీటిలో సగం అంటే 31,292 మాత్రమే అనుమతులు పొందాయి. పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, లేదా తెలుపురంగు రేషన్ కార్డు, వితంతువులకు మరణ ధ్రు వీకరణ పత్రం, ఒంటరి మహిళా పత్రం, సద రం ధ్రువీకరణ పత్రం, మెడికల్ ధ్రువీకరణ పత్రా లు వంటివి అవసరం. వీటిని సమకూర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఆ సమ యం కూడా ఇవ్వకుండా ఆదరాబాదరాగా దరఖాస్తుల స్వీకరణ కానిచ్చేశారు. దీంతో చాలా మంది అర్హులై న వారు కూడా దరఖాస్తు చేసుకునే వీలు లేకుండా పోయింది. మ్యాపింగ్ కాలేదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సవరణకు అవకాశం కల్పించలే దు. దీంతో ఈ మూడేళ్లలో ఉద్యోగం పొందిన వారి కుటుంబాలు, ఇన్‌కంటాక్సు, నాలుగు చక్రల వాహనాలు ఉండే వారు హౌస్ హోల్డ్ జాబితాల్లో కొంతమంది పింఛనుకు అర్హులైన వారి పేర్లు ఉండిపోయాయి. వాటిని విడదీయాలి. అయితే పింఛన్ భారాన్ని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో ఆ విభజనకు అనుమతి ఇవ్వలేదు. దీంతో వేలాదిమంది ఈ సారి పింఛన్‌కు దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఒక కుటుంబంలో ఒక వితంతువు, ఒక దివ్యాంగుడు ఉంటే వారిలో ఒక్కరికే పింఛను వస్తుందని, వీరిలో ఎవరికి పింఛన్ కావాలో వారే దరఖాస్తు చేయాలని స్థానిక నాయకులు పింఛను ఆశావహులకు చెబుతున్నారు. పింఛన్ దరఖాస్తుల స్వీకరణ మొదలైన నాటి నుంచి కూటమి నాయకులు పంచాయతీ పైరవీలు ప్రారంభించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో ఎలాగైనా విజ యం కోసం పింఛను అడ్డం పెట్టుకొని చాలా మంది గ్రామ స్థాయి నాయకులు పైరవీలు చేస్తున్నారని తెలుస్తోంది. అనుకున్న సమయానికి ఈ పింఛన్లు ఇస్తారని ప్రజల్లో నమ్మకం లేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో కొత్త పింఛన్ల కోసం ఇంత ప్రయాస పడలేదు. ఇంటింటా సర్వే జరిపించి, వలంటీర్లు ఇంటికి వెళ్లి వివరాలు తీసుకొని, సకాలంలో అర్హులకు పింఛన్లు ఇప్పించారు. కులం, మతం, వర్గం అనే తేడా లేకుండా అర్హతే ప్రధానంగా అన్ని రకాల పింఛన్లు అందజేశారు. పింఛన్ల సంఖ్యను కావాలని తగ్గించడం, ఒకే పింఛన్ విధానం అన్నవేవీ లేవు. జిల్లాలో కొత్త పింఛన్ల కోసం అనుమతి పొందినవి సగం మాత్రమే సమయాభావంతో దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హులు పింఛన్ల మంజూరుపై వీడని మీమాంస -
● భానుడి ప్రతాపంతో భక్తులు విలవిల
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎండ షాక్ గట్టిగానే తగిలింది. ఆదివారం ప్రత్యేకంగా ఆదిత్యున్ని దర్శించుకునేందుకు అరసవల్లి వచ్చిన భక్తులు స్థానికంగా ఆలయం ఎదుట అధికారులు చేపట్టిన ఏర్పాట్లపై బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. భానుని ప్రతాపం ఉదయం 9 గంటల నుంచి ఎక్కువ కావడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆదిత్యునికి మొక్కులు చెల్లించుకున్నారు.. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో రూ.300 దర్శన టిక్కెట్లతో అంతరాలయ దర్శనం చేయించారు. అలాగే సామా న్య దర్శన భక్తులకు కూడా సజావుగా దర్శనానికి చర్యలు చేపట్టారు. ఆలయ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ పరిసరాల్లో భక్తుల కోసం పలు ఏర్పాట్లు చేసినప్పటికీ ఎండలో మాత్రం భక్తులకు అవస్థలు తప్పలేదు. ఆలయం ముందు టెంట్లు వేయకపోవడంతో ఎండ తీవ్రతకు వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడ్డారు. అలాగే జలప్రసాదం పేరిట మంచినీటిని అందించినా, సరిపడలేదనే విమర్శలు వినిపించా యి. అలాగే కేశఖండన శాలలో మొక్కులకు, మరుగుదొడ్ల వద్ద వినియోగానికి ప్రత్యేకంగా రుసుము వసూలు చేయడంపై భక్తులు తమ ఫీడ్‌బ్యాక్ ద్వారా ఫిర్యాదు చేశారు. అయితే రికార్డుల్లోకి ఫిర్యాదులు చేరకుండా ఆలయ సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే పలువురు ఐఏఎస్ అధికారులు కుటుంబ సమేతంగా ఆదిత్యుడిని దర్శించుకున్నారు. -
ఉత్సాహంగా ఎంపికలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి స్కూల్‌గేమ్స్ ఎంపిక ప్రక్రియ హోరాహోరీగా సాగుతోంది. జిల్లా పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియెట్ విద్య అధికా రులను సమన్వయం చేసుకుని జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సెలక్షన్స్ ట్రయల్స్‌కు ప్రభుత్వం కనీస నిధులను సైతం విదల్చనప్పటికీ.. అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఆదివారం వెయిట్‌లిఫ్టింగ్, హ్యాండ్‌బాల్, బాక్సింగ్, సాఫ్ట్‌బాల్ క్రీడాంశాల్లో వివిధ వేదికలుగా వేర్వేరు విభాగాల్లో ఎంపికలు పూర్తి చేశారు. పోటీలకు క్రీడాకారులు పోటెత్తుతున్నారు. వెయిట్‌లిఫ్టింగ్ ఎంపికలు శ్రీకాకుళం పెద్దపాడులోని శ్రీ రెయ్యమ్మతల్లి వ్యాయామశాల వద్ద, హ్యాండ్‌బాల్ ఎంపికలు శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం మైదానంలో, బాక్సింగ్ ఎంపికలు శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం ప్రాంగణంలో, సాఫ్ట్‌బాల్ అండర్–19 ఎంపికలు నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జూడో ఎంపికలను శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియంలో, రెజ్లింగ్ ఎంపికలు పెద్దపాడులోని నిర్వహించి పూర్తిచేశారు. త్వర లో తుది జట్లను ప్రకటించనున్నట్టు జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు చల్లా జగదీష్, జీఎం జ్యోతిరాణి పేర్కొన్నారు. -
జనం డబ్బు
ఉత్సాహంగా ఎంపికలు జిల్లాస్థాయి స్కూల్‌గేమ్స్ ఎంపికలు హుషారుగా జరిగాయి. క్రీడాకారులు ప్రతిభ చూపారు. –8లోసర్కారు డప్పు నమ్మి మోసపోయాం వలంటీర్లకు వేతనాన్ని రూ.10000 చేస్తామని చంద్రబాబు అంటే నమ్మి మోసపోయాం. వలంటీర్ వ్యవ స్థ వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగం ఉండేది. – పి.అనిల్, ఆదివారం పేట, శ్రీకాకుళం వలంటీర్ల పొట్ట కొట్టారు రూ.5వేల వేతనంతో పనిచేస్తున్న వలంటీర్ల పొట్ట కొట్టారు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లకు వేలకు వేలు ఎలా ఇవ్వగలుగుతున్నారు. – బంగారురాజు, శ్రీకాకుళం -
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు గాయాలు
టెక్కలి రూరల్: మండలంలోని అక్కవరం సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలతో పాటు రెండేళ్ల బిడ్డకు గాయాలయ్యా యి. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. టెక్కలి జిల్లా ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తున్న వై.సుప్రియ తన రెండేళ్ల బిడ్డను పట్టుకుని తన భర్త విష్ణుతో కలసి ద్విచక్రవాహనం పై చాకిపల్లి గ్రామం నుంచి టెక్కలి వైపు వస్తున్న క్రమంలో అక్కవరం వద్ద గుర్తు తెలియని కారు వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలకు గాయాలు కావడంతో హుటాహుటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. చిన్నారికి, విష్ణుకి స్వల్పగాయాలు కాగా సుప్రియకు తీవ్రగాయాలైనట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు వివరాలు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
రైతన్నల శ్రమదానం
ఇచ్ఛాపురం: పురపాలక సంఘం పరిధి బెల్లుప డ గ్రామానికి చెందిన 1050 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్న రైతులంతా కలసి శ్రమదానంతో కాలువను బాగుచేసుకున్నారు. గాయకట్టు బాహుదా చానెల్లో పేరుకుపోయిన చెత్త, గుర్రపుడెక్క, పిచ్చిమొక్కలను తొలగించి పంటపొలాలకు నది నుంచి నీటిని మళ్లించారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తామే శ్రమదానం చేశామని రైతులు తెలిపారు. వివాహిత ఆత్మహత్య శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని సింగుపురం పంచాయతీ పెద్దవీధిలో నివాసం ఉంటున్న ముద్దాడ వెంకటలక్ష్మి (35) ఇంటిలోని ఫ్యాన్‌కు ఉరిపోసుకొని ఆదివారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది. రూరల్ పోలీసులు ఇచ్చిన వివరాల మేరకు.. వెంకటలక్ష్మి మొదటి భర్త కరోనా సమయంలో మృతి చెందడంతో 2025లో పాతపట్నంకు చెందిన సన్యాసిరావుతో రెండో వివాహం జరిగింది. వివాహం అయిన నాటి నుంచి వీరు పాతపట్నంలోనే కాపురం పెట్టుకున్నారు. అయితే గత కొంతకాలంగా వీరు తగాదాలు పడడం, పెద్దల సమక్షంలో రాజీ పడడం జరిగేది. రెండు రోజులుగా గొడవలు ముదరడంతో ఆదివారం వెంకటలక్ష్మి తల్లి పాతపట్నం వెళ్లి తన కూతురిని స్వస్థలానికి తీసుకొచ్చింది. దీంతో మనస్తాపం చెందిన వెంకటలక్ష్మి ఇంటిలోనే ఫ్యాన్‌కు ఉరిపోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి ఎర్రమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘మల్లన్నగండి’లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గల్లంతు
చిల్పూరు: జనగామ జిల్లా చిల్పూరు మండలం గార్లగడ్డతండ గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లన్నగండి రిజర్వాయర్‌లో ప్రమాదశాత్తు ఆదివారం సాయంత్రం సాఫ్ట్వేర్ ఇంజినీర్ గల్లంతయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పడా ల కల్యాణ్ (26) సికింద్రాబాద్‌లో ఉంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం ఉదయం 8 మంది స్నేహితులతో కలిసి భువనగిరి సమీపంలోని స్వర్ణగిరి, యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్లాడు. అనంతరం మల్లన్నగండి రిజర్వాయర్ చూసేందుకు వెళ్లాడు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో పంపింగ్ కొనసాగుతుండడంతో అక్కడ ఆహ్లాదకర వాతావరణం ఉంది. కొద్దిసేపు నీటిలో ఆడి పంపింగ్ దగ్గరకు వెళ్లి సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో కల్యాణ్ ఒక్కసారిగా నీటిలోకి జారిపడ్డాడు. తోడుగా వచ్చిన స్నేహితులు అరవగా చుట్టుపక్కల ఉన్న స్థానికులు వచ్చేసరికే నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో కనిపించకుండా పోయాడు. సమాచారం అందుకున్న ఫైర్, పోలీసు సిబ్బంది అక్కడకు హుటాహుటిన చేరుకుని సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో పంపింగ్ నిలిపివేశారు. రెస్క్యూ టీమ్ గాలించినా ఆచూకీ తెలియలేదు. రాత్రి కావడంతో గాలింపు నిలిపివేశారు. -
ఈ శోకానికి కారణమెవరు.?
● విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి ● పొలంలో పడి ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో ప్రాణాలు కోల్పోయిన వైనం పోలాకి: మండలంలోని దీర్ఘాశి గ్రామంలో విద్యు త్ షాక్‌తో యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన మెండ హేమసుందర్(24) దివిస్ కంపెనీలో పనిచేస్తూ వీకెండ్ కావటంతో ఇంటికి వచ్చాడు. సరదాగా గ్రామంలోని పంట పొలాలు చూసేందుకు ఆదివారం సాయంత్రం వేళ వెళ్లిన కొడుకు చీకటి పడుతున్నా ఇంటికి రాకపోవటంతో అటుగా వెళ్లినట్లు చూసిన స్థానికులు పొలం వైపునకు వెళ్లగా అక్కడ హేమసుందర్ విగతజీవిగా పడి ఉన్నాడు. అక్కడే తెగి పడి ఉన్న విద్యుత్ లైన్‌ను స్థానికులు గుర్తించి ట్రాన్స్‌కో సిబ్బందికి సమాచా రం ఇచ్చారు. గ్రామంలో గతంలో ఒక రైతు కూడా ఇదే విధంగా విద్యుత్ షాక్‌తో మృతిచెందాడు. మరోసారి ఎలుగుబంటి సైతం తెగిన విద్యుత్ లైన్‌కు బలైంది. వ్యవసాయ పొలాల్లో విద్యుత్ తీగలను నిర్లక్ష్యంగా వదిలేయడంతోనే ఇలాంటి ప్రమాదాలు పునరావృతమవుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పోలాకి ఎస్ఐ రంజిత్ కేసునమోదు చేసి, మృతదేహాన్ని నరసన్నపేట పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతి చెందిన హేమసుందర్ (పైల్) -
టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి..
ఆమదాలవలస: బూర్జ మండలం చీడివలస గ్రా మానికి చెందిన 15 కుటుంబాలు ఆదివారం టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి చేరాయి. పార్టీలోకి చేరిన వారిని నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కండువాలు కప్పి సత్కరించారు. పార్టీలో చేరిన వారిలో చీడివలసకు చెందిన పండూరి సూర య్య, దాసరి రమేష్, దాసరి సాయిదుర్గ, ముచ్చు యుగేందర్, పొన్నూరు అప్పారావు, తమ్మిన రామినాయుడు, చిన్ని శివ, దాసరి రెయ్యన్న తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో బూర్జ మండల పార్టీ అధ్యక్షుడు ఖండాపు గోవిందరావు, జెడ్పీటీసి బెజ్జిపురపు రామారావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వావిలపల్లి మురళీ, ముఖ్య అతిథులుగా మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్ కుమార్, మాజీ కౌన్సిలర్ దుంపల శ్యామలరావు, అతులూరి రవికాంత్, అల్లంశెట్టి గిరి, గొలివి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా ఫుట్‌బాల్ మహిళల జట్టు ఖరారు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా మహిళల సీనియర్స్ ఫుట్‌బాల్ జట్టు ఖరారైంది. జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన జిల్లాస్థాయి ఎంపిక పోటీలు ఆద్యంతం హోరాహోరిగా సాగాయి. ఇక్కడ ఎంపికచేసిన జిల్లా జట్టును ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు కర్నూలు జిల్లాలో జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి(అంతర్‌జిల్లాల) సీనియర్స్ మహిళల ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలకు పంపించనున్నట్టు జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముని శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా జట్టు వివరాలు టి.రోహిణి, ఎన్.అమృత, కె.నీరజ, సీహెచ్ దేవిశ్రీ, ఎం.ఝాన్సీ, బి.హారిక, ఏ.కుసుమ, పి.సంగీత ఎం.ప్రసన్న, కే.మనీషా, ఎన్.లలిత, ఎస్వైడి.మహిమ, వి.గ్రేసీ, ఎస్.పావని, జె.మమత, సిహెచ్.మౌనిక, కే.పవిత్ర. స్టాండ్ బైగా డి.విజయలక్ష్మి, పి.హిందూ, సిహెచ్. దివ్య, వి.రమ్య పి.దీపిక ఎస్ .తనుశ్రీ సిహెచ్ యమున ఎంపికై న వారిలో ఉన్నారు. -
వైఎస్సార్ సీపీలోకి సుందరాపురం టీడీపీ కార్యకర్తలు
నరసన్నపేట: సుందరాపురంలో చాలా కాలంగా టీడీపీలో ఉన్న కార్యకర్తలు ఆదివారం వైఎస్సార్ సీపీలో చేరారు. స్థానిక ఆహా ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా తిర్రి శ్రీనివాసరావు, ఉర్జాన గోపి, తలసముద్రం రామారావు, దండుపాటి సింహాచలంలు తమ కుటుంబాలతో సహా వైఎస్సార్ సీపీలో చేరారు. వీరికి పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పోలాకి జెడ్పీటీసీ మాజీ సభ్యులు ధర్మాన కృష్ణచైతన్యలు కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వనించారు. కార్యక్రమంలో సుందరాపురానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు సడగాన రవి, సడగాన సింహాచలం, పంగ నాగభూషనరావు, ముద్దాడ గణపతి తదితరులు పాల్గొన్నారు. -
ఐలు రాష్ట్ర కమిటీకి జిల్లా నుంచి ముగ్గురు ఎన్నిక
ఆమదాలవలస: నెల్లూరులో శని ,ఆదివారాల్లో నిర్వహించిన ఐలు(ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్) రాష్ట్ర మహాసభల్లో జిల్లాకు చెందిన న్యాయవాదులు బొడ్డేపల్లి మోహనరావు, డీడీ రమణరావు, ఎం.అప్పారావులు రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. రాష్ట్ర మహాసభల్లో వివిధ జిల్లాల నుంచి ప్రతినిధులు పాల్గొని సంస్థ కార్యకలాపాలు, కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించినట్లు వారు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీని ఎన్నుకోగా జిల్లా నుంచి ముగ్గురికి చోటు లభించిందని వారు తెలిపారు. జిల్లా అండర్–19 క్రికెట్ జట్టు ఎంపికలు రేపు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా స్కూల్‌గేమ్స్ అండర్–19 బాలుర క్రికెట్ జట్టు ఎంపికలను ఈనెల 6వ తేదీన శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానం వేదికగా నిర్వహించనున్నామని జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు చల్లా జగదీష్, జీఎం జ్యోతిరాణి తెలిపారు. ఆరోజు ఉదయం 8 గంటల నుంచి ఆర్ట్స్ కళాశాల మైదానంలోని జిల్లా క్రికెట్ సంఘం క్రికెట్ నెట్స్‌లో ఈ ఎంపికల ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. ఈ ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు 2008 జనవరి ఒకటి తర్వాత జన్మించి, 9,10 తరగతులతో పాటు ఇంటర్మీడియెట్ చదువుతున్న వారు మాత్రమే అర్హులని స్పష్టంచేశారు. ఇక్కడ ఎంపిక చేసిన జిల్లా బాలురు జట్టును చిత్తూరు జిల్లా నగరిలోని కేవీకే గ్రౌండ్స్ వేదికగా ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు జరగనున్న 70వ ఏపీ రాష్ట్రస్థాయి అండర్–19 బాలుర క్రికెట్ చాంపియన్‌షిప్ పోటీలకు పంపిస్తామన్నారు. అక్కడ రాణించిన క్రీడాకారులను జాతీయ స్కూల్‌గేమ్స్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయడం జరుగుతుందని వారు వెల్లడించారు. ఆసక్తి, అర్హత కలిగిన క్రీడాకారులు తమ జనన ధ్రువీకరణ పత్రం, స్కూల్/కాలేజ్ ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డులతో వైట్ అండ్ వైట్ డ్రస్, షూ ధరించి హాజరుకావాలని వారు సూచించారు. ‘దివ్యాంగులకు అండగా ఉంటాం’ శ్రీకాకుళం: దివ్యాంగులు ఇతరులపై ఆధారపడకుండా స్వశక్తితో ఎదిగి ఆత్మగౌరవంతో జీ వించేలా అవసరమైన ప్రతి సాయాన్ని అందిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం పట్టణంలోని సన్‌రైజ్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మా ట్లాడారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులు రూ.1.50 కోట్లతో, ఆలింకో భాగస్వామ్యంతో 230 మంది దివ్యాంగులు, వయోవృద్ధులకు 130 బ్యాటరీ ట్రైసైకిళ్లు, 100 జాయ్‌స్టిక్ వీల్చైర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో దివ్యాంగులందరికీ అవసరమైన పరికరాలు పూర్తిగా అందే వరకు ఏటా ఈ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి స్వాభిమాన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ కేవలం పరికరాలు ఇవ్వడమే కాకుండా, వీటి ద్వారా వారి జీవితాల్లో వస్తున్న మార్పులపై అధ్యయనం చేసి, చిన్న తరహా వ్యాపారాలు, స్వయం ఉపాధి క ల్పించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. రైతు మోటారు సర్వీస్ వైర్లు చోరీ రణస్థలం: మండలంలోని పాతర్లపల్లి నుంచి దేరసాం వెళ్లే రహదారి మధ్యలో ఉన్న రైతు అప్పలసూరి రెండు మోటార్ సర్వీస్ వైర్లను గుర్తు తెలియని దుండగులు శనివారం అర్ధరాత్రి కట్ చేశారు. ఇలా ఈ ప్రాంతంలోని పలువురు రైతుల మోటార్లకు ఉన్న సర్వీస్ వైర్లను కట్ చేసి ఇటీవల పట్టుకుని వెళ్లిపోయారు. దీంతో రైతులు తెల్లవారుజామున వెళ్లి మోటార్లు ఆన్ చేద్దామని చూస్తే వైరు లేదు. రాగి కోసం, ఇతరులకు సర్వీస్ వైరు దొంగిలించి అమ్మకాలు జరిపేందుకు ఇలా చేస్తున్నారని రైతులు చెప్పారు. ఇటీవల లావేరు మండలంలోని ఇజ్జాడపాలెం, లావేరు, గోవిందపురం, భరిణికాంలో కూడా కొంతమంది రైతుల మోటార్ సర్వీస్ వైర్లు, రాగి పట్టుకుని వెళ్లిపోయిన విషయం తెలిసిందే. -
● కన్నీరే మిగిలింది
మడపాం టోల్గేట్ వద్ద రోడ్డుకు ఆనుకొని ఉన్న షాపులను, షాపుల ముందు నిర్మాణాలను ఎన్‌హెచ్ అధికారులు తొలగించడంతో పలు కు టుంబాలు వీధిన పడ్డాయి. బతుకు తెరువు కోసం చిన్నా, పెద్దా దుకాణాలు, హోటల్స్ పెట్టుకొని 200లకు పైగా కుటుంబాలు ఇక్కడ జీవనోపాధి పొందుతున్నాయి. అయితే వీరంతా రోడ్డు స్థలాలను ఆక్రమించి బడ్డీలు పెట్టుకున్నారని మూడు రోజులుగా నిర్మాణాలు తొలగిస్తున్నారు. గతంలో రోడ్డు విస్తరణకు తమ స్థలాలు ఇచ్చామని, మిగిలిన స్థలాల్లో షాపులు నిర్మించి తోవ కోసం రోడ్డు పక్క స్థలాలను వినియోగిస్తున్నామని బాధి తులు అంటున్నారు. అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించి న్యాయం చేయాలని కోరుతున్నారు. దీనిపై కేంద్ర మంత్రిని కూడా సంప్రదించినట్లు తెలిపారు. – నరసన్నపేట -
ఇవేం పనులు!
జలుమూరు: ఉపాధి హామీ పథకం కొంతమంది కూటమి నాయకులు కాసులు కురిపిస్తోంది. ప్రస్తు తం జిల్లాలోని పలుచోట్ల చెరువుల్లో పూడిక తీత, అంగన్వాడీ కేంద్రాలు, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు, పాఠశాలల వద్ద పిచ్చిమొక్కలు తొలగించడం, పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు చేయించడం వంటివి ఉపాధి వేతనదారులతో చేస్తున్నారు. మరికొన్ని చోట్ల వేసవిలో చేసిన పనులనే మళ్లీ మళ్లీ చేయిస్తున్నారు. పని ఓ చోట చేసి వేతనదారులకు వారి అనుకూలమైన ప్రదేశం వద్ద ఫొటోలు తీసి అప్లోడ్ చేయిస్తున్నారు. గతంలో చేసిన పనులే అయినప్పటికీ వేతనదారులతో ఎక్కువ పనులు చేయించినట్లు చూపించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రూపొందించిన నేషనల్ మస్టర్ మోనటరింగ్ సిస్టమ్(ఎన్‌ఎమ్‌ఎస్) యాప్‌లో వీటి ని పొందుపరుస్తున్నారు. వాస్తవంగా ఈ పనుల వల్ల కనీసం ప్రయోజనం లేదని మండలాధికారులకు తెలిసినా ఉన్నతాధికారులు ఒత్తిడితో చేయి స్తున్నారని సమాచారం. శ్రీకాకుళం రూరల్, పోలాకి, నరసన్నపేట, జలుమూరు, సరుబుజ్జిలి, ఆమదాలవలస, సారవకోట, గార తదితర మండలాల్లో ఈ తరహా పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా వంశధార కాలువలు అధికంగా ఉన్న చోట ఈ పనులు జరిపిస్తున్నారు. టీడీపీ నాయకులకు వరం.. ప్రస్తుతం జరుగుతున్న పనులు స్థానిక టీడీపీ నాయకులకు వరంలా మారాయి. సర్పంచ్ల పదవీ కాలం పూర్తవ్వడంతో ప్రత్యేక అధికారులు పాలన వచ్చింది. ఇదే సందర్భంలో ఆయా పంచాయతీలలో ప్రస్తుతం జరుగుతున్న పారిశుద్ధ్య పనులు, సీసీ రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను వేతనదారులతోనే తొలగిస్తున్నారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణకు ప్రత్యేక నిధులు ఉన్నా పనులు ఉపాధి వేతనదారులతో చేయించి ఆ నిధులు మాత్రం ప్రత్యేక అధికారుల మీద టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చి బిల్లులు చేయించుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధి వేతనదారులతో పూడికలు, చెత్తాచెదారాల తొలగింపు పనులు పని ఒకచోట.. ఫొటో అప్లోడింగ్ మరోచోట కూటమి నాయకులకు కాసులు కురిపిస్తున్న ఉపాధి పనులు -
కరువు ప్రాంతాలకు రూ.2లక్షల కోట్లు కేటాయించాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఎల్‌నినో ప్రభావం వల్ల కరువు కోరల్లో ఉన్న గ్రామీణ ప్రాంత పేదలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే రూ.2 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సిర్ల ప్రసాద్, గంగరాపు సింహాచలం డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం గాంధీ విగ్రహం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీబీజీ రామ్‌జీ పథకం రద్దు చేసి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యథాతథంగా అమలు చేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు కె.ఎల్లయ్య, జి.ఈశ్వరమ్మ, టి.నారాయణరావు, అన్నపూర్ణ, తవిటినాయుడు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఏఆర్ డీఎస్పీగా వెంకటరమణ శ్రీకాకుళం క్రైమ్ : ఎచ్చెర్లలోని ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) విభాగ కొత్త డీఎస్పీగా కె.వెంకటరమణను నియమిస్తూ మంగళగిరి డీజీపీ కార్యాలయం నుంచి శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈయన స్వస్థలం విజయనగరం కాగా విశాఖపట్నం సిటీ ఏఆర్ ఆర్ఐగా పనిచేస్తూ ఇటీవలే డీఎస్పీగా పదోన్నతి పొందారు. మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేసి జిల్లాకు రానున్నారు. జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీగా ఉన్న ఎల్.శేషాద్రినాయుడుని బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చినా పోస్టింగ్‌పై స్పష్టత ఇవ్వలేదు. శేషాద్రినాయుడు 2024 మార్చిలో జిల్లాకు డీఎస్పీగా వచ్చి మూణ్నెళ్ల కిందట ఏఎస్పీగా పదోన్నతి పొందారు. ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలి శ్రీకాకుళం పాతబస్టాండ్ : రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు జి.ధర్మారావు, బి.శ్రీరామ్ రెడ్డి, ఎల్.రవి, పి.కృష్ణారావు, ఎస్.వి.రమణారావు కోరారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.లవరాజులకు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 19 సంవత్సరాలుగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ సరైన వేతనాలు, ఉద్యోగ భద్రత, సంక్షేమ సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు నెలకు రూ.5,745 మాత్రమే చెల్లిస్తుండగా, కనీస వేతనంగా రూ.26,000 చెల్లించాలని కోరారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ, కూలీల హాజరు నమోదు, ప్రభుత్వ ఆదేశాల అమలు వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ తగిన గుర్తింపు లేకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 5 నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కమిటీ నాయకులు శారద, బి.శ్యామలరావు, మోహన్, భాను, కె.కళ్యాణి, వి.రామ్‌జీ, చిట్టి అసిరినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో చోరీ కంచిలి: మండల కేంద్రం కంచిలి పంచాయతీ పరిధిలోని బలియాపుట్టుగ గ్రామంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న పార్వతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. శనివారం ఉదయం ఆలయం తెరవడానికి వచ్చిన అర్చకుడు జనార్దన ఈ విషయాన్ని గమనించి గ్రామస్తులకు సమచారం అందించారు. ఇటీవలే ఈ ఆలయాన్ని ప్రతిష్ట చేయగా, ఇంతలోనే దొంగతనం జరగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఆలయ గర్భగుడి ప్రవేశ ద్వారంలో ఉన్న తలుపుల తాళాలను పగులగొట్టి దుండగులు ప్రవేశించారు. అమ్మవారి మెడలో ఉన్న వస్తువులేవీ దొంగిలించలేదు. పక్కనే ఉన్న స్టోర్ రూమ్ తాళాలు పగులగొట్టి అందులో భద్రపరిచిన భక్తులు విరాళాల హుండీని తెరిచి అందులో ఉన్న సొమ్మును తీసుకెళ్లిపోయారు. -
ప్రయోజనం
ఆమదాలవలస: సుదూర ప్రాంతాలకు ఇళ్లు మారినప్పుడు బైక్‌లను తీసుకెళ్లడం ఓ ప్రహసనం. రైల్వే పార్సిల్ సర్వీసుతో బైక్‌లను సులభంగా ఆయా ప్రాంతాలకు తరలించుకోవచ్చు. ఏ పత్రాలు అవసరం.. ●బైక్ సీబుక్ తప్పనిసరి. ●బైక్ సీబుక్ ఎవరి పేరుమీద ఉంటే వారి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ఉండాలి. ●బైక్ బుక్ చేసే వారే వారు బుక్ చేసే ప్రాంతం నుంచి డెలివరీ తీసుకుంటే వారి ఆధార్ కార్డు సరిపోతుంది. లేదంటే అక్కడ వేరే వ్యక్తులు బైక్‌ను డెలివరీ తీసుకుంటారంటే వారి ఆధార్ కార్డు అడ్రస్ ప్రూఫ్ తప్పనిసరిగా ఉండాలి. ●బైక్ పార్సిల్ చేసుకునే రోజే ఎవరైతే ప్రయాణిస్తున్నారో వారి టికెట్ ఉండాలి. ●ఒక వేళ ఎవరూ ఆ బైక్‌తో ప్రయాణించకపోతే ఏ స్టేషన్‌కు బైక్పార్సిల్ చేశారో ఆ స్టేషన్‌కు జనరల్ టికెట్ తీసుకొని బైక్‌తోపాటు ఇవ్వాలి. ●బుక్ చేసుకున్న వారి బైక్ ఆ ప్రాంతంలో దిగిన తర్వాత 6 గంటలలోపు డెలివరీ తీసుకోవాలి. లేదంటే అదనపు చార్జీలు తప్పవు. రేట్లు ఇలా.. ●బైక్ పార్సిల్ ప్యాకింగ్ చార్జీ కింద రూ.305లు వసూలు చేస్తారు. ●దూరాన్ని బట్టి చార్జీలు మారుతుంటాయి. ఉదాహరణకు శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్ నుంచి తిరుపతికి బైక్ పార్సిల్ చేయిస్తే సుమారుగా రూ.1500 పార్సిల్ కౌంటర్లో చెల్లించాలి. అంటే తిరుపతికి పార్సిల్ చార్జీ రూ.1805. బుకింగ్ ఎక్కడ: బుకింగ్ ప్రక్రియ శ్రీకాకుళంరోడ్(ఆమదాలవలస) రైల్వే స్టేషన్లో అయితే చీఫ్ బుకింగ్ సూపర్ వైజర్ (సీబీఎస్‌ఆర్) శివశంకర్, చీఫ్పార్సిల్ సూపర్ వైజర్ (సీపీఎస్ఆర్) పీవీజీ రెడ్డిల ఆధ్వర్యంలో జరుగుతాయి. మరిన్ని వివరాల కోసం 08912885932 సంప్రదించాలి. -
నేడు స్కూల్‌గేమ్స్ క్రీడా ఎంపికలు
శ్రీకాకుళం న్యూకాలనీ : జిల్లా స్కూల్‌గేమ్స్ షెడరేషన్ (ఎస్జీఎఫ్) ఎంపిక పోటీలు ఆదివారం మరో నాలుగు క్రీడాంశాల్లో నిర్వహించనున్నారు. జిల్లా పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియెట్ విద్య జిల్లా అధికారులను సమన్వయం చేసుకుని జిల్లా ఎస్జీఎఫ్ అధికారులు, జిల్లా కార్యదర్శులు చల్లా జగ దీష్, జీఎం జ్యోతిరాణి ఏర్పాట్లు చేస్తున్నారు. వెయిట్‌లిఫ్టింగ్, హ్యాండ్‌బాల్, బాక్సింగ్, సాఫ్ట్‌బాల్ క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయని వారు పేర్కొన్నారు. వెయిట్‌లిఫ్టింగ్ అండర్–17, 19 బాలబాలికల ఎంపికలు పెద్దపాడులోని శ్రీరెయ్యమ్మ తల్లి వ్యాయామశాల వద్ద ఉదయం 10 గంటలకు మొదలుకానున్నాయి. హ్యాండ్‌బాల్ అండర్ – 14, 17 బాలుర ఎంపికలు శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం మైదానంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమౌతాయి. బాక్సింగ్ అండర్–14 బాలురు, అండర్–17, 19 బాలబాలికలకు కోడిరామ్మూర్తి స్టేడియం ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు షురూ కానున్నాయి. సాఫ్ట్‌బాల్ అండర్–19 బాలబాలికలకు నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానం వేదికగా ఉదయం 10 గంటలకు ఎంపికల ప్రక్రియ ఆరంభమౌతుందని ఎస్జీఎఫ్ అధికారులు చెప్పారు. -
వైఎస్సార్ సీపీలో పలు కుటుంబాల చేరిక
లావేరు: గురుగుబిల్లిలో టీడీపీ, బీజేపీలకు చెందిన 20 కుటుంబాల వారు శనివారం మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ చేరిన వారిలో తోలాపి అసిరయ్య, నేతల రాము, గరికివాడు, గుర్రాల ఉత్తరతో పాటు 20 కుటుంబాల వారు ఉన్నారు. వీరందరికీ గొర్లె కిరణ్ కుమార్ వైఎస్సార్ సీపీ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ పేదల పాలిట వరంలా పని చేసే జగనన్న పార్టీ అంటే తమకెంతో ఇష్టమని చెప్పారు. గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో గురుగుబిల్లి వైఎస్సార్ సీపీ నాయకులు బాడిత వెంకటేశ్వరరావు (దొరబాబు), బాడిత రాంబాబు, నేతల చిన్నారావు, ఇలకల అప్పలగురువులు తదితరులు పాల్గొన్నారు. -
● ఆ దొంగ అడుగు పెడితే ఇంటిలో గొడవలే ● అతడు చెబితే గానీ బయటపడని దొంగతనాలెన్నో ● పోలీసులకు ఆసక్తికరమైన కేసుగా ‘రాంబాబు’ ● కళ్లెదుట ఎంత బంగారం ఉన్నా కొంచెం మాత్రమే దొంగిలించే విభిన్న శైలి
శ్రీకాకుళం క్రైమ్ : అది విశాఖలోని మధురవాడ. ఓ ఇంటిలో భార్యాభర్తలు తరచూ గొడవపడుతున్నారు. భార్య తన నగలను పుట్టింటికి ఇచ్చేస్తోందని భర్త చికాకుపడిపోతున్నాడు. ఈ గొడవ ఆఖరకు పోలీస్‌స్టేషన్ వరకు చేరింది. జి.సిగడాంలో మరో ఇంటిలో కుటుంబ సభ్యులు తరచూ తగువులాడుకుంటున్నారు. కొద్దిపాటి బంగారం నువ్వు తీశావంటే.. నువ్వే తీశావంటూ వారిలో వారే ఘర్షణ పడుతున్నారు. ఈ సారి శ్రీకాకుళం టూ టౌన్‌పోలీస్‌స్టేషన్ పరిధి. ఓ ఇంటి ఇల్లాలు తన బంగారం బ్యాంకులోనే ఉందని, కానీ లేదని మేనేజర్ బుకాయిస్తున్నాడని ఆరోపించింది. ఆఖరకు పోలీసులకూ ఇలాగే చెబుతూ దాదాపు గొడవకు దిగింది. రణస్థలం సమీపంలోని ఊరిలోనైతే ఓ ఉద్యోగిని తన నల్లపూసల హారం కనబడడం లేదని భర్తను అనుమానించడంతో ఇద్దరి మధ్య మాటలు నిలిచిపోయాయి. ఇవేవీ కుటుంబ కలహాలు కావు.. వున్నాన రాంబాబు అనే దొంగ పెట్టిన గొడవలంటే నమ్మి తీరాల్సిందే. హస్త లాఘవం చూపి బంగారం కాజేయడమే కాదు.. ఇంటి వాళ్లపైనే అనుమానం వచ్చేలా దొంగతనం చేయడం ఈ చోరుడి ప్రత్యేకత. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 120 దొంగతనాలకు పాల్పడిన రాంబాబుది విజయనగరం జిల్లా చీపురుపల్లి. దొంగల్లో కలహాల దొంగలు వేరయా అన్నట్టు రాంబాబు పనితీరు చెప్పాలంటే మరో ఉదాహరణ ఉంది. గత ఏడాది జేఆర్ పురం సీఐ అవతారం బృందం రాంబాబును పట్టుకుంది. దాదాపు 1250 గ్రాముల బంగారం రికవ రీ చేశారు. కేశవరావు పేటలోని ఓ ఇంటిలో బంగారం తీశానని రాంబాబు చెబితే.. లేదంటే లేదంటూ ఆ ఇంటి వారు తగువులాడడం విశేషం. కనీసం వారు పోలీసులకు కూడా ఫిర్యాదు ఇవ్వలేదు. అప్పుడు రాంబాబు తాపీగా.. వారు బీరువా తాళాలు ఎక్కడ పెడతారో. ఆ బీరువా రంగు ఏమిటో చెప్పడంతో ఆ ఇంటివారికి దిమ్మ తిరిగిపోయింది. నగలన్నీ పరిశీలించాక దొంగతనం జరిగిందన్న విషయం అప్పుడు తెలుసుకున్నారు. మరోసారి ఏం జరిగిందంటే.. జిల్లా కేంద్రం సమీపంలోని ఓ గ్రామానికి సంక్రాంతి రోజు ల్లో ఓ పోలీసు జీపు వచ్చి ఓ ఇంటి ముందు ఆగింది. ‘మీ ఇంటిలో దొంగతనం జరిగింది. రెండు గాజులు పోయా యి’ అని పోలీసు చెప్పగా.. మా ఇంటిలో దొంగతనం జరగడమేమిటి అని ఆ ఇల్లాలు నిష్టూరమాడింది. వెళ్లి బీరువా చూడండి అని సూచించగా.. సార్ అన్నీ ఉన్నాయి గానీ రెండు గాజులు మాత్రం లేవు సార్ అంటూ ఆందోళనగా చెప్పింది. అదీ రాంబాబు చోరీ తీరు. జనం బలహీనతే అతడి బలం.. సాధారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేటప్పుడు తాళాలు ఇంటిలో ఏదో మూల దాస్తుంటారు. ఆ బలహీనతే రాంబాబు బలం. బాగా సన్నగా ఉండే రాంబాబు ముందుగా గేటుకున్న గ్రిల్స్ మధ్యలోంచి అలవోకగా వరండాలోకి పట్టపగలు ఎవరూ గమనించనప్పుడు ప్రవేశిస్తాడు. షూ ర్యాక్, ఎలక్ట్రికల్ మీటర్ బోర్డు, పూలకుండీలు, కిటికీల్లో మనం పెట్టే తాళాలను పసిగట్టి మెయిన్ డోర్ తలుపు తీసేస్తాడు. ఏ వస్తువునూ ముట్టుకోడు, చిందరవందర అన్నది అస్సలు ఉండదు. కనీసం అతడి వేలిముద్రలు కూడా పడవు. బీరువాలో ఎన్ని నగలున్నా నాలుగైదు తులాలుండే ఒకటి రెండు వస్తువులే తీస్తాడు. అలా తీస్తే.. ఆ చోరీ ఇంటి వారి పనే అయి ఉంటుందని భావిస్తారని అతడి నమ్మకం. అలా అతడు చోరీ చేసినా పోలీసుల వరకు వెళ్లని కేసులెన్నో ఉన్నాయి. ఇలాంటి చోరీ కేసు నమోదైతే పోలీసులకు మొదట గుర్తొచ్చే పేరు రాంబాబే. మాజీ రంజీ ప్లేయర్ క్రికెట్లో నైపుణ్యమున్న రాంబాబు రంజీ జట్టు ఎంపిక విషయంలో కోచ్ మోసం చేయడంతో తట్టుకోలేక వ్యసనాలకు బానిసయ్యాడు. జల్సాలకు, బెట్టింగ్‌లకు దొంగతనాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇటీవల జేఆర్ పురం సీఐ ఎం.అవతారం 10 చోరీ కేసుల్లో భాగంగా అరెస్టు చేయడంతో రాంబాబు మళ్లీ హాట్ టాపిక్ అయ్యాడు. పోలీసులకూ మస్కా కొట్టి.. పోలీసులకు చిక్కినట్టే చిక్కి మస్కా కొట్టి పారిపోవడంలోనూ రాంబా బు దిట్టే. పోలీసులతో అతి చనువు ప్రదర్శించి విచారణలో ఏ ప్రశ్నలడిగినా సహకరించి సిబ్బందికి తనపై అంచనాలకు మించి నమ్మకాన్ని పెంచేస్తాడు. స్టేషన్లో రాత్రి సమయంలో సిబ్బంది నిద్రపోయినా, వాష్‌రూమ్‌కు వెళ్లినా ఇక అంతే.. త్రు టిలో తప్పించుకుని పారిపోతాడు. ఆనందపురం, చీపురుపల్లి, విజయనగరం, ఎచ్చెర్లలో ఇలానే చేశాడు. మీరు తాళాలు ఎక్కడ పెడుతున్నారు.. మీరు బయటకు వెళ్లే క్రమంలో ఇంటి తాళాన్ని పూలకుండీల్లో, షూర్యాక్లలో, కరెంట్ మీటర్ బాక్సుపైన పెడుతున్నారు. ఈ కథనం చదివిన తరువాతైనా అలా చేయడం మానుకోండి. -
10న జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక
● అండర్–14, 16 విభాగాల్లో బాలబాలికలకు పోటీలు ● నవంబర్ 14 నుంచి 16 వరకు హైదరాబాద్ వేదికగా మెగా స్పోర్ట్స్‌మీట్ శ్రీకాకుళం న్యూకాలనీ : ప్రతిభ కలిగిన అథ్లెటిక్స్ క్రీడాకారులకు శుభవార్త. స్టేట్‌మీట్ లేకుండానే నేరుగా ఆలిండియా నేషనల్స్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే సువర్ణ అవకాశం వచ్చింది. ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా జాతీయ అంతర్ జిల్లాల జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు రంగం సిద్ధమైంది. ఈ మెగా స్పోర్ట్స్‌మీట్‌లో పాల్గొనే జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలను ఈ నెల 10న నిర్వహించాలని నిర్ణయించారు. అథ్లెటిక్స్ సంఘం రాష్ట్ర చైర్మన్ కొన్న వెంకటేశ్వరరావు(వాసు) ఆదేశాల మేరకు శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా ఉదయం 9 గంటల నుంచి ఈ ఎంపికల ప్రక్రియ మొదలుకానుంది. ఈ మేరకు అథ్లెటిక్స్ అసోసియేషన్ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అండర్–14, 16 విభాగాల్లో.. డైరెక్ట్ నేషనల్స్ పోటీలు అండర్–14, 16 విభాగాల్లో జరగనుండటంతో రన్స్, త్రోస్, జంప్స్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ఎంపికై న క్రీడాకారులను అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నవంబర్ 14 నుంచి 16 వరకు హైదరాబాద్ వేదికగా జరగనున్న 20వ నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా క్రీడాకారులను పంపించనున్నారు. ఎవరు అర్హులంటే..? అండర్–14 విభాగానికి 2012 నవంబర్ 17 నుంచి 2014 నవంబర్ 16 మధ్య జన్మించిన వారు అర్హులు. అండర్–16 విభాగానికి 2010 నవంబర్ 17 నుంచి 2012 నవంబర్ 16 మధ్య జన్మించి ఉండాలని నిర్వాహకులు స్పష్టంచేస్తున్నారు. జిల్లా ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు తమ జనన ధ్రువీకరణ పత్రం, లేదా టెన్త్మార్క్స్ మెమో, ఆధార్‌కార్డుతో స్టేడియం వద్దకు ఉదయం 8.30 గంటలకు చేరుకోవాలని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు, ప్రధాన కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి పేర్కొన్నారు. పూర్తి వివరాలకు అథ్లెటిక్స్ సంఘ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కె.మాధవరావు (9441570361) నంబర్‌ను సంప్రదించాలని వారు కోరారు. -
ఆలయ స్థలాలపై రగడ
● మూలపేట– విష్ణుచక్రం గ్రామస్తుల మధ్య వాగ్వాదం ● పరిస్థితిని చక్కదిద్దిన అధికారులు సంతబొమ్మాళి: మూలపేట పోర్టు నిర్వాసిత గ్రామాలైన మూలపేట, విష్ణుచక్రం గ్రామస్తులకు నౌపడ ఆర్అండ్ఆర్ కాలనీలో కేటాయించిన స్థలాల్లో ఆలయాల నిర్మాణానికి స్థలాల కేటాయింపు శనివారం వివాదానికి దారితీసింది. తమ కోసం కేటాయించిన పార్కు స్థలాన్ని ఆలయ నిర్మాణానికి కేటాయించాలని గతంలో మూలపేట గ్రామస్తులు కోరగా, అధికారులు ఆ స్థలాన్ని వారికి కేటాయించారు. పార్కు కోసమని చెప్పడం వల్లే ఆ స్థలాన్ని తాము ఆలయ స్థలాల కోసం కోరలేదని, తమ గ్రామానికి చెందిన ఆలయాలకు కూడా స్థలం కేటాయించాలని విష్ణుచక్రం గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో విష్ణుచక్రం గ్రామస్తులు సంబంధిత స్థలంలో జెండాలు ఏర్పాటు చేయడంతో ఇరు గ్రామాల ప్రజల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆలయ స్థలాల కేటాయింపుపై గతంలో పలుమార్లు అధికారులతో సమావేశాలు నిర్వహించినా సమస్య పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో ఐదోసారి తహసీల్ధార్ హేమసుందరరావు సమక్షంలో ఇరు గ్రామాల ప్రజలతో చర్చ జరిగింది. పోర్టు నిర్మాణం కోసం తాము కూడా తమ భూములను త్యాగం చేశామని, తమ గ్రామంలోని ఆలయాలకు స్థలాలు కేటాయించాలని విష్ణుచక్రం గ్రామస్తులు కోరారు. గతంలో ఆలయాలకు చెరువు గట్టు ప్రాంతంలో స్థలాలు కేటాయించారని, చూపించిన స్థలం ఆలయ నిర్మాణానికి అనువుగా లేదని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తహసీల్దార్ ఇరు గ్రామాల ప్రజలతో మాట్లాడి విష్ణుచక్రం గ్రామస్తుల ఆలయాల కోసం మరోచోట 15 సెంట్లు స్థలాన్ని చూపించారు. ఈ స్థల వివరాలను ఆర్డీవోకు తెలియజేసి నిబంధనల ప్రకారం కేటాయించేలా చర్యలు తీసుకుంటామని తహసీల్ధార్ హామీ ఇచ్చారు. దీంతో విష్ణు చక్రం గ్రామస్తులు అంగీకరించి అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ నిర్ణయంతో పార్కు కోసం కేటాయించిన స్థలం మూలపేట గ్రామస్తులకు దక్కగా, విష్ణుచక్రం గ్రామస్తులకు ప్రత్యామ్నయంగా 15 సెంట్లు స్థలం కేటాయించే మార్గం సుగమమైంది. ఇరు గ్రామాల ప్రజలు పరస్పరం అంగీకరించడంతో వివాదానికి తెరపడింది. -
ఏటీఎం.. ఎనీ టైమ్ మస్కా
● ఏటీఎంలో డబ్బులు వెనక్కి వస్తున్న వైనం ● జిల్లాకేంద్రంలోని అరసవల్లి మిల్లు జంక్షన్‌లోని ఏటీఎం వద్ద సంఘటన శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని స్టేట్‌బ్యాంక్ ఏటీఎం మిషన్ల వద్ద ఖాతాదారులు జాగ్రత్తగా మసలుకోవాల్సి వస్తోంది. అరసవల్లి మిల్లు కూడలి సమీపంలోని ఏటీఎం సెంటర్ వద్ద ఓ యువకుడు రూ. 5 వేలు విత్‌డ్రా చేస్తే రాకపోవడం, ఆ తర్వాత వచ్చిన కస్టమర్ అదే మిషన్ వద్దకు వెళ్తే నోట్లు ఉండటం శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఇదే తరహాలో ఇటీవల జీటీరోడ్డులోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచి ఏటీఎం సెంటర్ వద్ద రూ. 17 వేలు డిపాజిట్ చేసిన వంశీకృష్ణ అనే వ్యక్తికి నగదు ఖాతాలోకి జమ కాకపోవడం, తర్వాత వచ్చిన కస్టమర్‌కు నోట్లు రావడం తెలిసిందే. ట్రాఫిక్ సీఐ వి.రామారావు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. సాది లక్ష్మీనారాయణ రెడ్డి అనే వ్యక్తి ఏటీఎం సెంటర్‌కు వెళ్లి ముందుగా ఓ మిషన్‌లో రూ. 5 వేలు విత్‌డ్రా చేశాడు. డబ్బులు రాకపోవడంతో మరో మిషన్ వద్దకు వెళ్లి రూ. 3 వేలు విత్‌డ్రా చేశారు. అదే సమయంలో మొదటి మిషన్ వద్దకు డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లిన హోంగార్డు పట్నాయకుల వెంకటరావుకు రూ. 5 వేలు కనిపించాయి. వెంటనే పక్కనే ఉన్న బ్రాంచి మేనేజర్‌కు విషయం చెప్పగా విత్‌డ్రా చేసిందెవరన్నది ఆన్లైన్లో గుర్తించి (లక్ష్మీ నారాయణరెడ్డిదిగా) వెంకటరావుతో ఆయన అకౌంట్లో రూ. 5 వేలను డిపాజిట్ చేయించారు. అనంతరం లక్ష్మీనారాయణ రెడ్డిని ఫోన్ ద్వారా బ్యాంకుకు రప్పించి విషయాన్ని చెప్పారు. -
సెల్మోహన రంగ
ఒక మొబైల్ సరిగ్గా చూపుడు వేలంత ఉంటుంది.. మరో సెల్‌ఫోన్ చేతిలో ఇమిడిపోయే అద్దం సైజులో ఉంటుంది.. ఇంకో చరవాణి స్మార్టే అయినా షార్ట్ అండ్ స్వీట్‌గా ముచ్చట గొలుపుతుంది. ఐ ఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ల యుగంలో ఈ బుల్లి మొబైళ్లు కూడా మార్కెట్లో సందడి చేస్తున్నాయి. చూసేందుకు బొమ్మల్లాగానే ఉన్నా.. సాధారణ సెల్ఫోన్లలాగానే పనిచేస్తున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం అందంగా అలంకరించిన శునకంమహా భారతమంతా ముగిసి పాండవుల మహాప్రస్థాన యాత్ర మొదలయ్యాక అన్నీ కోల్పోయిన ధర్మరాజు వెంట నడిచింది ఒక్క శునకం. పురుషోత్తముడిగా పేరున్నా.. అయోధ్యకు రారాజైనా సీత జాడ రాముడికి తెలియజెప్పింది జటాయువు. కలియుగ దైవమని కీర్తి ఉన్నా.. మహావిష్ణువు అవతారమే అయినా ఏడుకొండల వాడి ఆకలి తీర్చింది గోమాత. విశ్వ విజేతగా పేరున్నా అలగ్జాండర్ మనసు గెలుచుకున్నది బుసీఫాలెస్ అనే గుర్రం. మానవ జాతితో మూగజీవాల అనుబంధం అనాది కాలంగా వస్తోంది. ఇంత సాంకేతికత పెరిగినా ఇప్పటికీ పెంపుడు జంతువులతో నేస్తరికం పెరిగిందే తప్ప తరగలేదు. ఇంటిలో తిరిగే శునకం, పెరట ముద్దుగా కూసే చిలక, ఇల్లంతా తిరిగే మార్జాలం.. జీవితానికో పరిపూర్ణత తీసుకువస్తున్నాయి. నేడు వరల్డ్ యానిమల్ డే. – శ్రీకాకుళం కల్చరల్ మనకు ముప్పొద్దులూ ముప్పై రకాల తిండి వస్తువులు కనిపిస్తూ నోరూరిస్తుంటాయి. మరి మూగజీవాలకో. వాటికీ న్యూట్రిషన్ ఫుడ్ అవసరమని వెటర్నరీ వైద్యులు సూచిస్తున్నారు. జిల్లా కేంద్రంలో వీటి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పెంపు డు జంతువుల కోసం శాకాహార, మాంసాహార వంటలను 3,4 విదేశీ కంపెనీలు, 5,6 స్వదేశీ కంపెనీ లు మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చాయి.కు క్కలు, పిల్లులు, పక్షులు వీటిని తిని సులువుగా జీర్ణించుకొనేలా సిద్ధం చేశారు. వీటిని చికెన్, మటన్, కూరగాయల మిశ్రమాలతో చేస్తున్నారు. మనకే కాదు పెంపుడు జంతువుల సింగారానికీ వస్తువులున్నాయి. రకరకాల మెడపట్టీలు, దుస్తులు జిల్లా కేంద్రంలో అందుబాటులోకి వచ్చాయి. నెక్ కాలర్ : జంతువుల మెడకు కట్టే పట్టీ. ఇది రకరకాల రంగులు, డిజైన్లలో లభిస్తుంది. లీష్ బెల్ట్ : పెంపుడు జంతువులను బయటకు నడిపించడానికి మెడ పట్టీకి తగిలించే తాడు. హార్నెస్: కేవలం మెడకే కాకుండా ఛాతీ భాగం చుట్టూ అమర్చే పట్టీ. ఇది జంతువులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. పెట్ టీషర్టులు–కోట్లు : చలికాలంలో వేడి కోసం, అలాగే అందం కోసం వేసే చిన్న రంగుల దుస్తులు. బో టై–బంధనాలు: పెంపుడు జంతువుల మెడకు కట్టే రంగురంగుల స్కార్ఫ్‌లు లేదా బో టైలు, ఇవి వాటికి పండగ లుక్‌ని ఇస్తాయి. కుక్కలను పెంచుకునేవారు ఇతర ప్రాంతాలకు గానీ, క్యాంపులకు గానీ వెళ్తే తమ కుక్కల గురించే ఆలోచిస్తుంటారు. అందుకే జిల్లా కేంద్రంలో డాగ్ కేర్ సెంటర్ తెరిచారు. తాత్కాలికంగా వారి వద్ద ఉంచుకోడానికి వారు సిద్ధంగా ఉన్నారు. కుక్క జాతిని బట్టి రోజుకు రూ.300, రూ.400లు వసూ లు చేస్తున్నారు. ఇందుకోసం వారు చిన్న చిన్న గదులను ఏర్పాటు చేశారు. కావాల్సిన వారు 7396859118 (సతీష్)కు సంప్రదించాలి. మూగజీవాలపై ఎంత ప్రేమ ఉన్నా.. వ్యాధుల విషయంలో ముందస్తు జాగ్రత్త తీసుకోవడం శ్రేయస్కరం. కుక్కలు, పిల్లులు, కుందేళ్ల నుంచి మానవులకు ప్రాణాంతక వ్యాధులు సంక్రమిస్తాయి. సకాలంలో టీకాలు వేయడమే ఇందుకు పరిష్కారం. కుక్కకు రెండునెలల వయసులోనే రాబిస్ యాంటీ వ్యాక్సిన్ వేయించాలి. ఏడాదికి రెండు సార్లు వ్యాక్సిన్ వేయించాలి. ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ ఉచితంగానే వేస్తోంది. ఇంటి కుక్కను బయట కుక్కలు కరిస్తే 24 గంటల్లో వ్యాక్సిన్ వేయించాలి. కుక్కల నుంచి రేబిస్, లీష్మినియా, బద్దెపురుగుల వ్యాధి, మీసిల్స్, మంప్స్, హైడాటిడోసిస్, రింగ్వార్మ్, మెంజ్ వ్యాధులు వస్తాయి. పాడి పశువుల నుంచి ఆంత్రాక్స్, బ్రూసిల్లోసిన్, లిస్టిరియోసిస్, రింగ్ వార్ము, మేకల నుంచి ఆంత్రాక్సు, బ్రూసిల్లోసిన్, లిస్టిరియోసిస్, హైడాటిడోసిస్, సార్కోసిస్టిస్, మెంజ్ వ్యాధులు సంక్రమిస్తాయి. పెంపుడు జంతువులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. వాటిని దూరంగా ఉంచాలి. మంచాల మీదకు ఎక్కించుకోవడం, ముద్దులాడడం వంటివి చేయ కూడదు. ఎందుకంటే వాటి వల్ల మనకు తెలియని జబ్బులు వస్తాయి. మనుషులలో 70 శాతం కొత్త జబ్బులు జంతువుల వల్లనే వస్తున్నాయి. – డాక్టర్ ఆర్.హేమంత్‌కుమార్, డాక్టర్ డాగ్ యానిమల్ ఆస్పత్రి, శ్రీకాకుళం -
జనం డబ్బు
సర్కారు డప్పుకూటమి ప్రభుత్వం వలంటీర్లకు ఇచ్చిన హామీలను విస్మరించారు. ఎన్నికలకు ముందు రూ. 10వేలు జీతం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మర్చిపోయారు. సూపర్‌సిక్స్ అంటూ ప్రజలను మోసగించారు. ప్రజాధనాన్ని ఇన్ఫ్లూయెన్సర్ల పేరిట పార్టీ కార్యకర్తలకు దోచి పెట్టడానికి పన్నాగం పన్నారు. – వాదాల దుర్గారావు, మాజీ వలంటీర్, సంతబొమ్మాళి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.5వేలు కాదు రూ.10వేలు ఇస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన కూటమి సర్కార్ వలంటీర్లను తొలగించి మోసం చేసింది. ఇప్పుడేమో ప్రభుత్వ డప్పు కొట్టే ఐటీడీపీ వారికి రూ.15వేల వేతనం ఇస్తామనడం దారుణం.ప్రజాధనం టీడీపీ సోషల్‌మీడియాకు దోచిపెట్టడం సరికాదు. – గంట్యాడ విజయరామరాజు, మాజీ వలంటీర్, తంప, హిరమండలం -
● ఎవరైతే మాకేంటి?
ఈ చిత్రంలో ఇసుక ఉన్న ప్రాంతం టెక్కలి పోలీస్‌స్టేషన్ ఆవరణ. వివిధ కేసుల్లో పట్టుబడిన ఇసుకను ఇక్కడ డంపింగ్ చేశారు. అయితే కొంతమంది వ్యక్తులు శనివారం దర్జాగా ట్రాక్టర్‌ను తీసుకొచ్చి ఇసుకను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఎందుకు తీసుకెళ్తున్నారని స్థానికులు ప్రశ్నించగా.. పోలీసులే ఇసుకను తీసుకువెళ్లమని చెప్పారని ట్రాక్టర్ సిబ్బంది చెప్పారు. అదంతా అవాస్తవమని, ఇసుకను తరలించే విషయం తమకు తెలియదని పోలీసులు చెప్పడం గమనార్హం. అనంతరం ఆ ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. – టెక్కలి -
ఆల్ ద బెస్ట్ వెంకీ..
వజ్రపుకొత్తూరు: వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానం రామకృష్ణాపురానికి చెందిన అంధ క్రికెటర్ దున్న వెంకటేశ్వరరావు ఢాకాలో జరిగే ఆసియా కప్‌కు ఆడేందుకు పయనమయ్యాడు. దీంతో శనివారం క్రికెటర్ వెంకటేశ్వరరావుకు గ్రామస్తులు క్రికెట్ బ్యాట్ బహూకరించి కప్ గెలిచి రావాలంటూ ఎయిర్‌పోర్టుకు సాగనంపారు. ఈ నెల 5వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు ఆసియా కప్ ఎంపికలు, కోచింగ్ ఉన్నందున బంగ్లాదేశ్‌లోని ఢాకా పయనమయ్యాడు. నవంబర్ 13 నుంచి 20వ తేదీ వరకు ఢాకాలో ఆసియా దేశాలైన ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ దేశాలతో క్రికెట్ అసోషియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా(సీఏబీఐ) ఆధ్వర్యంలో పోటీలు జరగనున్నాయి. కాశీబుగ్గ: పలాస మండలం శాసనాం సమీపం జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి ఓ గుర్తు తెలియని లారీ బీభత్సం సృష్టించింది. పలాస నుంచి కేశుపురం వైపు 70 గొర్రెలతో రాత్రి 12 గంటల సమయంలో వెళ్తున్న మందపైకి అమాంతం దూసుకువచ్చింది. ఈ ఘటనలో 60 మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. తమ జీవాలను మేత అనంతరం స్వగ్రామమైన కేశుపురం తీసుకెళ్తుండగా లారీ ఢీకొట్టి, ఆగకుండా వెళ్లిపోయిందని కాపరులు చెబుతున్నారు. ఈ ఘటనలో కాపరుల్లో ఒకరైన గుమ్మి డి హరికృష్ణ (55) గాయపడ్డాడు. క్షతగాత్రుడిని పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీకాకుళం పరిధిలోని జాతీయ రహదారి సీపాన్నాయుడు పరిసర ప్రాంతంలో శనివారం ఓ అరుదైన బావురు పిల్లి మృతిచెందింది. గుర్తు తెలియని వాహనం ఒక్కసారిగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. సాధారణ పిల్లి కంటే కాస్తా పెద్ద పరిమాణంలో ఉండే ఈ బావుర పిల్లి శరీరంపై చారలు, మచ్చలు ఉండి చిరుతపులి పిల్లలా పోలి ఉంటుంది. ఇది ఎక్కువుగా చిత్తడి నేలలు, పంట పొలాలు, పొదల్లో దాక్కోని ఉంటుందని, రాత్రి సమయాల్లోనే సంచారం ఎక్కువగా చేస్తుందని అటవీశాఖ అధికారులు అంటున్నారు. – శ్రీకాకుళం రూరల్ -
●చుప్పునలవి గాని రుచి
సారవకోట: బస్సులో ప్రయాణిస్తున్న వారైనా, బండిపై వెళ్తున్న వారైనా సారవకోట సమీపించిందంటే చాలు కాసేపు ఆగి చుట్టుపక్కల చూసి తీరుతారు. ఆ సువాసన అలాంటిది మరి. కరకరలాడే ఇక్కడి చుప్పులు, అన్న ఆదరువుగా అదుర్స్ అనిపించే అప్పడాలకు అంతా అభిమానులే. 1947 నుంచి ఇక్కడ చుప్పుల తయారీ అనేది ఒక కుటీర పరిశ్రమగా వర్ధిల్లుతోంది. గతంలో ఎక్కువ కుటుంబాలు ఈ చుప్పులు, అప్పడాల తయారీ పై ఆధారపడి ఉండేవి. అయితే కాలక్రమేణ గ్రామాల్లో సైతం కూలీలు దొరక్కపోవడంతో వీటి తయారీని నిలుపుదల చేసి ఇతర పనుల్లోకి చేరుతున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ తయారు చేస్తున్న చుప్పులు, అప్పడాలకు మంచి గిరాకీ ఉంది. దాదాపు 15 కుటుంబాల వారు ఇదే వ్యాపారంలో ఉన్నారు. ఇక్కడ తయారైన చుప్పులు మండల కేంద్రంలో ఉన్న ప్రతి దుకాణంలో లభ్యమవుతాయి. అంతే కాదు చుట్టు పక్కల గ్రామాలు, పాతపట్నం, జలుమూరు, నరసన్నపేట, టెక్కలి, హిరమండలం, కోటబొమ్మాళి తదితర మండలాలకు వాహనాలతో వెళ్లి అక్కడ దుకాణదారులకూ విక్రయిస్తున్నారు. లోకల్ టేస్ట్ -
రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు
రణస్థలం : రణస్థలం జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. జె.ఆర్.పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎచ్చెర్ల మండలం అజ్జరాం గ్రామానికి చెందిన దంపతులు బురిడీ రమణ, గౌరమ్మ తమ కుమార్తె దేవికతో కలిసి ద్విచక్ర వాహనంపై అత్తవారి గ్రామమైన రణస్థలం మండలం చిల్లపేటరాజం పంచాయతీ బొడ్డపాడు గ్రామానికి బయలుదేరారు. రణస్థలంలో ఫ్లై ఓవర్ పనుల వద్దకు వచ్చేసరికి వీరి ద్విచక్రవాహనాన్ని ట్యాంకర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్సులో శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని జె.ఆర్.పురం ఎస్సై వి.సత్యనారాయణ తెలిపారు. -
వైఎస్సార్ సీపీ నాయకుడిపై దాడి
సారవకోట: మండలంలోని అలుదు పంచాయతీ మాకివలస గ్రామానికి చెందిన రావాడ శ్రీనివాసరావు పై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు శుక్రవారం దాడి చేశారు. మాజీ ఎంపీటీసీ పంచిరెడ్డి జ్ఞానేశ్వరిపై దౌర్జన్యం చేసి ఆమె భర్త శ్రీనివాసరావుపై ఆ గ్రామానికి చెందిన చల్ల ముకుందరావుతో పాటు మరో ముగ్గురు దాడి చేసినట్లు ఆమె స్థానిక పోలీసు స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. శుక్రవారం దాడి చేయగా వెంటనే శ్రీనివాసరావు 112 నంబర్‌కు ఫోన్ చేసి దాడి ఘటనను తెలియజేశారు. దీనిపై శుక్రవారం కేసు పెట్టేందుకు వెళ్తే స్టేషన్లో ఫిర్యాదు తీసుకున్నా.. అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు శరీరంపై గాయాలు లేవని చెప్పి కేసు నమోదు చేయలేదు. దీంతో శనివారం వైఎస్సార్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు వరుదు వంశీకృష్ణ, పలువురు పార్టీ కార్యకర్తలు పోలీసు స్టేషన్‌కు చేరుకుని కేసు నమోదు చేయాలని పట్టుబట్టడంతో ఎస్ఐ అనిల్ కుమార్ కేసు నమోదు చేశారు. తనపై రావాడ శ్రీనివాసరావు దాడి చేసినట్లు చల్ల ముకుందరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పాముకాటుతో ఇద్దరి మహిళలు మృతి నరసన్నపేట : బాడాం ఉన్నత పాఠశాలలో వంట ఆయాగా పనిచేస్తున్న చల్ల రాములమ్మ(45) పాము కాటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత నెల 25న ఇంట్లో పాముకాటుకు గురి కాగా కుటుంబ సభ్యులు శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాములమ్మ భర్త ఆదినారాయణకు రెండేళ్ల నుంచి కళ్లు కనిపించడం లేదు. డిగ్రీ చదువుతున్న కుమార్తె, ఇంటర్ చదువుతున్న కుమారుడు ఉన్నారు. అక్కులపేటలో.. ఆమదాలవలస : అక్కులపేట గ్రామానికి చెందిన బొడ్డేపల్లి సావిత్రి(60) శనివారం పాముకాటుకు గురైంది. పొలం గట్టు చుట్టూ కలుపు మొక్కలు కోసే క్రమంలో పాముకాటు వేయగా గ్రామానికి చేరుకుని స్పృహ తప్పిపడిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమదాలవలస శివారులోని రాధాకృష్ణపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. సావిత్రికి ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. -
ఐలూ రాష్ట్ర మహాసభకు జిల్లా న్యాయవాదులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలూ) 13వ రాష్ట్ర మహా సభలు నెల్లూరులో ఈ నెల 3, 4వ తేదీల్లో జరగనున్న నేపథ్యంలో జిల్లా ప్రతినిధులు శుక్రవారం బయలుదేరి వెళ్లారు. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్, జూనియర్ అడ్వకేట్స్‌కు రూ.పది వేలు స్టయిఫండ్, ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టుల భర్తీ, కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై సభల్లో చర్చించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు ఎస్.అప్పారావు, జనరల్ సెక్రటరీ దుంపల రమణారావు తెలిపారు. కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ పైడి లక్ష్మీపతి, సెక్రటరీ డొంకాన ఈశ్వరరావు, అంధవరపు వెంకటేశ్వరరావు, సాయికిషోర్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం గార: ప్రతి ఖైదీకి ఉచితంగా న్యాయ సహాయం పొందే హక్కు ఉందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. శుక్రవారం అంపోలు జిల్లా జైలులో గాంధీ జయంతి సందర్భంగా ఖైదీల సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెయిల్, ప్లీ బార్గేనింగ్, జైలు అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం గురించి టోల్ ఫ్రీ నెంబర్ 15100 ఉపయోగించుకోవాలన్నారు. అనంతరం ఖైదీలు దేశభక్తి గీతాలు, గాంధీజీ భజనలు ఆలపించారు. వీఆర్ఓల సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఢిల్లీశ్వరరావు శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా సరుబుజ్జిలి మండలం వీఆర్వో గంగు ఢిల్లేశ్వరరావు ఎన్నికయ్యారు. శుక్రవారం విజయవాడలో జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో పదవి దక్కడంతో రెవెన్యూ ఉద్యోగుల తరఫున జేఏసీ ఏపీ అమరావతి శ్రీకాకుళం చైర్మన్ భైరి రాజు, మహిళా విభాగం చైర్పర్సన్ కె.ప్రవల్లిక ప్రియ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు డి.రాజేష్ కుమార్, జిల్లా సెక్రటరీ బి.రాంజీ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడండి శ్రీకాకుళం : మాతృభాష మాధ్యమం కొనసాగింపు ద్వారా మూతపడుతున్న ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు పేడాడ కృష్ణారావు, జిల్లా అధ్యక్షుడు పూజారి హరిప్రసన్న, ప్రధాన కార్యదర్శి ఎన్ని వెంకట ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం డీటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలోని స్మృతివనం వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో డీటీఎఫ్ నాయకులు కోత ధర్మారావు, మిస్కా కృష్ణయ్య, కొమ్ము అప్పలరాజు, కోటిపాత్రుని కొండయ్య, ఎన్ని రమణమూర్తి, గొల్లపల్లి మౌళి, గురుగుబెల్లి రమణమూర్తి, గురుగుబెల్లి భాస్కరరావు, సనపల లక్ష్మణరావు, డి.గణేష్, చింతాడ పార్వతీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పశువుల అక్రమ రవాణా అడ్డగింత కంచిలి : పశువుల అక్రమ రవాణాను కంచిలి పోలీసులు అడ్డుకున్నారు. కోటబొమ్మాళి మండలం నారాయణవలస గ్రామానికి చెందిన ఉరజాన సింహాచలం జాతీయ రహదారి మీదుగా బొలేరో పికప్ వాహనంలో 10 పశువులను తరలిస్తూ, పాతపట్నం మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన ఉరజాన పవన్ ఏడు పశువులను తరలిస్తుండగా పట్టుబడ్డారు. వాహనాలను సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.పారినాయుడు తెలిపారు. ఆకలైన వేళ అమ్మలా.. నరసన్నపేట: నరసన్నపేట పాతబస్టాండ్ వద్ద ఉమామహేశ్వరి ఆలయం సమీపంలో మెయిన్ రోడ్డు పక్కన ఒక ఆవు శునకానికి పాలిచ్చిన దృశ్యం స్థానికుల కంట పడింది. శుక్రవారం వేకువజామున ఆవు చెత్తకుప్ప వద్ద ఆహారం కోసం చూస్తుండగా అటుగా వచ్చిన శునకం నేరుగా ఆవు వద్దకు వెళ్లి పాలు తాగేందుకు ప్రయత్నించగా ఆవు కదలకుండా పాలిచ్చి ఆకలి తీర్చింది. -
ప్రమాదంలో బాల్యం!
● పోషకాహార లోపంతో చిన్నారులు ● ప్రతి ఐదుగురిలో ఒకరు బాధితులు ● నెరవేరని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం ● పౌష్టికాహారం అందిస్తున్నా ఫలితం శూన్యం హిరమండలం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల ఖర్చుతో అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నా లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. ముఖ్యంగా పోషకాహార లోపంతో చిన్నారులు బాధపడుతున్నారు. ఎదుగుదల లోపం, బరువు తక్కువ వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆగస్టులో అంగన్వాడీ కేంద్రాల్లో 79,943 మంది చిన్నారుల ఎత్తు, బరువును కొలిచారు. 15,819 మంది ఎత్తుకు తగ్గట్టు బరువు, వయసు తగినట్టు ఎత్తు, బరువు లేకపోవడాన్ని గుర్తించారు. ఏకంగా 10.81 శాతం మంది తీవ్ర, పాక్షిక ఎదుగుదల లోపాలతో బాధపడుతుండటం గమనార్హం. ప్రతి ఐదుగురి చిన్నారుల్లో ఒకరు పోషకాహార లోపంతో బాధపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రుల్లో అవగాహన లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆరోగ్యకరమైన బాల్యానికి ఎంతో మంది దూరమవుతున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 16 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి పరిధిలో 6,496 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 95,633 మంది ఆరేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా గుడ్లు, పాలు అందిస్తున్నారు. పూర్వ ప్రాథమిక విద్యతో పాటు మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారు. కొత్తగా మెనూలో ఎగ్ ఫ్రైడ్‌రైస్, ఉడికించిన శనగలు వంటి పోషక పదార్థాలను సైతం చేర్చారు. గర్భిణులు, బాలింతలకు రాగిపిండి, బెల్లం, వేరుశెనగ చిక్కీ, ఎండు ఖర్జూరం వంటి పోషకాహారం ఇస్తున్నారు. అయినా సరే కొంతమంది చిన్నారులకు సరైన పోషకాలు అందక తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో 712 మంది ఉన్నట్టు గుర్తించారు. మధ్యస్థ పోషకాహార లోపం ఉన్న బాలలు 2,325 మంది ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. వీరితో పాటు ఉండాల్సిన బరువు కంటే తక్కువగా ఉన్నవారు 4,142 మంది ఉన్నారు. జిల్లాలో చాలా ఐసీడీఎస్ ప్రాజెక్టులపై అనేక రకాల విమర్శలున్నాయి. కొంతమంది అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పెద్ద ఎత్తున సరుకులు పక్కదారి పట్టించినట్టు ఫిర్యాదులు వస్తున్నా యి. ఐసీడీఎస్‌లో ప్రధాన లోపం పర్యవేక్షణ లేకపోవడం, మరోవైపు అంగన్వాడీ కేంద్రాల్లో ఇస్తున్న పోషకాహారాన్ని ఇళ్ల వద్ద చిన్నారులకు ఇవ్వడం లేదు. మేనరికం, బాల్య వివాహాలు కారణంగా జన్యుపరమైన లోపాలు, తక్కువ బరువుతో పుట్టడం పిల్లలకు శాపంగా మారుతోంది. చిన్నారుల చుట్టూ పరిశుభ్రత లేకపోవ డం కూడా ఒక ప్రధాన కారణం. విటమిన్లు, ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్స్‌తో కూడిన ఆహారం అందకపోవడం, జంక్ ఫుడ్ అలవాటు చేయ డం కూడా పోషకాహారం అందక చిన్నారుల్లో ఎదుగుదల లోపిస్తోంది. ఆరేళ్లలోపు ప్రతి చిన్నారికి విధిగా ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు ఉండే సమతుల ఆహారం అందించాలి. అంగన్వాడీ కేంద్రాల్లో సూచించినట్టు పిల్లలకు బాలామృతం, పప్పు దినుసులు, గుడ్లు పెట్టాలి. వయసుకు తగ్గ బరువు, ఎత్తులేని పిల్లలను ఎప్పటికప్పుడు కేంద్రాల్లో తూకం వేయాలి. వారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. శ్రీకాకుళం రిమ్స్‌లో పోషకాహార లోపంతో బాధపడేవారికి ప్రత్యేకంగా ఎంఆర్సీ కేంద్రం అందుబాటులో ఉంది. – బి.ఉమాజానకి, ఐసీడీఎస్ సీడీపీఓ, కొత్తూరు -
కబడ్డీ కూతకు వేళాయె..!
● రేపు జిల్లా కబడ్డీ జట్ల ఎంపికలు ● జూనియర్స్, సబ్–జూనియర్స్ విభాగాల్లో పోటీలు ● శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం ప్రాంగణంలో ఏర్పాట్లు శ్రీకాకుళం న్యూకాలనీ: కబడ్డీ కూతకు వేళయ్యింది. గత కొన్నాళ్లుగా కబడ్డీ క్రీడలో రాణించాలనే కాంక్షతో సాధన చేస్తున్న క్రీడాకారులకు జిల్లా కబడ్డీ సంఘం తీపికబురు అందించింది. రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనేందుకు శ్రీకాకుళం జిల్లా జూనియర్స్, సబ్–జూనియర్స్ విభాగాల్లో బాలబాలికలకు ఎంపికలను నిర్వహించాలని నిర్ణయించారు. ఆదివారం శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం ప్రాంగణంలో ఈ ఎంపికల ప్రక్రియను పూర్తిచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎంపికలు మ్యాట్‌పై నిర్వహించనున్న నేపథ్యంలో క్రీడాకారులంతా తప్పనిసరిగా మ్యాట్ షూ ధరించి హాజరుకావాల్సి ఉంటుంటుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఆసక్తి, అర్హత కలిగిన క్రీడాకారులు తమ జనన ధృవీకరణ పత్రం, ఆధార్‌కార్డుతో ఉదయం 9 ఎంపికలకు క్రీడాప్రాంగణం వద్దకు చేరుకోవాలని జిల్లా కబడ్డీ సంఘం ఛైర్మన్, ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా అధ్యక్షుడు నక్క కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి సాదు ముసలినాయుడు పేర్కొన్నారు. సంఘ కార్యనిర్వాహక కార్యదర్శి సాదు శ్రీనివాసరావు వద్ద రిపోర్ట్ చేయాలని కోరారు. పూర్తి వివరాలకు 94419 14214 నంబర్‌ను సంప్రదించాలన్నారు. జూనియర్స్ ఇలా.. జూనియర్స్ సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనే బాలబాలికల వయస్సు 20 ఏళ్లలోపు ఉండాలి. బాలురు 2006 నవంబర్ 4 తర్వాత జన్మించి, 75 కేజీలులోపు బరువు కలిగి ఉండాలి. బాలికలు 2006 నవంబర్ 29 తర్వాత జన్మించి, 65 కేజీలు లోపు బరువు కలిగి ఉండాలి. ఎంపిక చేసిన జిల్లా జట్లు త్వరలో మార్కాపురం వేదికగా జరిగే ఏపీ రాష్ట్రస్థాయి కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీలల్లో శ్రీకాకుళం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు. సబ్‌జూనియర్స్ ఇలా.. సబ్–జూనియర్స్ సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనే బాలబాలికల వయస్సు 16 ఏళ్లలోపు ఉండాలి. బాలురు 60 కేజీల లోపు బరువు కలిగి 2010 డిసెంబర్ 12 తర్వాత జన్మించి ఉండాలి. బాలికల 55 కేజీలలోపు బరువు కలిగి, 2010 డిసెంబర్ 30వ తేదీ తర్వాత జన్మించి ఉండాలి. ఇక్కడ ఎంపికై న జిల్లా జట్లను పశ్చిమగోదావరి జిల్లా నూజివీడులో జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా తరఫున పంపించనున్నారు. -
రెండో రోజూ నిరాశే
అరసవల్లి: రెండో రోజు కూడా ఆకాశంలో మబ్బులు సూర్యకిరణ దర్శనానికి అడ్డంకిగా నిలిచాయి. శుక్రవారం సూర్యోదయ సమయాన నేరుగా గర్భాలయంలోని స్వామి వారి మూలవిరాట్టును తొలి సూర్యకిరణాలు తాకుతాయని వందలాది మంది భక్తులు ఆదిత్యాలయానికి తరలివచ్చినప్పటికీ రెండో రోజు కూడా నిరాశే మిగిలింది. మబ్బుల చాటు కారణంగా కిరణాలు మరింత ఎత్తులోకి ప్రసరించడంతో గర్భాలయంలోనికి కిరణాలు ప్రసరించలేదు. దీంతో భక్తులు నిరాశతో వెనుదిరిగారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.సునీత తదితరులు ఆదిత్యుని ఆలయంలో అద్భుతాన్ని తిలకించేందుకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ సంప్రదాయం ప్రకారం అంతరాలయ దర్శనంతో పాటు వేదాశీర్వచనాన్ని ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ బృందం అందజేయగా, ఆలయ ఈఓ కేఎన్విడివి ప్రసాద్ ఆదిత్యుని జ్ఞాపికను అందజేశారు. మళ్లీ వచ్చే ఏడాది మార్చి 9,10 తేదీల్లోనే కిరణ స్పర్శ దర్శన సమయాలని ఆలయ ప్రధానార్చకులు శంకరశర్మ ప్రకటించారు. -
బీసీల రిజర్వేషన్లపై రాజకీయ డ్రామాలు
● సుప్రీంకోర్టుకు వెళ్తామనడం కాలయాపనే ● మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమదాలవలస: బీసీల రిజర్వేషన్ల విషయంలో కూటమి ప్రభుత్వం రాజకీయ డ్రామాలకు తెరతీస్తోందని మాజీ స్పీకర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి తమ్మినేని సీతారాం విమర్శించారు. ఆయన శుక్రవా రం ఆమదాలవలసలోని తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేశామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నప్పటికీ ఆ రిజర్వేషన్లకు సంబంధించిన జీఓలను హైకోర్టు కొట్టివేసిందని ఆయన పేర్కొన్నారు. కానీ దీనిపై మళ్లీ సుప్రీం కోర్టుకు వెళ్తామనడం పరిష్కా రం కాదని, కోర్టులో నిలబడని జీఓలను జారీ చేసి, ఆ తర్వాత కోర్టే అడ్డుకుందని చెప్పడం ద్వారా బీసీలకు ఏం ప్రయోజనం కలుగుతుందని ప్రశ్నించారు. కేంద్రంలోనూ టీడీపీ భాగస్వామే అధికారంలో ఉందని రాజ్యాంగపరమైన, చట్టపరమైన మార్పుల కోసం చర్చించాలని సూచించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో బీసీలకు కేవలం చట్టబద్ధమైన రిజర్వేషన్లకే పరిమితం కాకుండా రాజకీయ ప్రాతినిధ్యంలోనూ ప్రాధాన్యం కల్పించారని తమ్మినేని పేర్కొన్నారు. బీసీ వర్గానికి చెందిన తనను శాసనసభ స్పీకర్‌గా అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టి వైఎస్ జగన్ తనకు బీసీలపై ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నారని తమ్మినేని తెలిపారు. టీడీపీలో ఉన్న బీసీ నాయకులు తమ సామాజిక వర్గానికి రిజర్వేషన్ల విషయంలో సమస్య వచ్చినప్పుడు ఎందుకు ప్రశ్నించడం లేదని తమ్మినేని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ ప్రభుత్వం కాలయాపన చేయకుండా ముందుకు రావాలని తమ్మినేని డిమాండ్ చేశారు. బీసీల జీవితాలతో ఆటలు వద్దు.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు నిజంగా అమలు చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే న్యాయపరంగా బలమైన చర్యలు తీసుకోవాలని తమ్మినేని అన్నారు. కోర్టు అడ్డుకుంది.. విపక్షం అడ్డుకుంది అంటూ నిందలు వేస్తే ప్రయోజనం లేదన్నారు. కోర్టులో నిలబడని జీఓలను చూపించి బీసీలను మభ్యపెట్టే రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. బీసీలకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని, బీసీల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. -
జిల్లా స్థాయి సాఫ్ట్‌బాల్ కోచింగ్ ప్రారంభం
నరసన్నపేట: జిల్లా స్థాయి సాఫ్ట్‌బాల్ కోచింగ్‌ను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు గొలివి మోహనరావు, సాఫ్ట్ బాల్ జిల్లా అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.వి.రమణ అన్నారు. నరసన్నపేటలోని పీఎంశ్రీ స్కూల్లో పది రోజుల కోచింగ్ క్యాంప్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూనియర్స్ (అండర్–18 ) విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలు ఈ నెల 13 నుంచి 15 వరకు కడప జిల్లా పుల్లంపేటలో నిర్వహించనున్నట్లు తెలిపారు. దాతల సహకారంతో కోచింగ్ ఇస్తున్నామన్నారు. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి సత్యనారాయణ పది రోజుల క్రీడాకారులకు అవసరమైన ఆహారం అందించేందుకు ముందుకువచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సాయి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ గొద్దు చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. విశ్రాంత జవాన్‌కు ఘన స్వాగతం వజ్రపుకొత్తూరు: పెద్దమురహరిపురం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ గొరకల సోమేశ్వరరావు ఉద్యోగ విరమణ చేసి స్వగ్రామానికి తిరిగి రావడంతో గ్రామస్తులు, సైనిక సేవా సమితి, ఆత్మీయులు, కుటుంబ సభ్యులు శుక్రవారం ఘన స్వాగతం పలికారు. పలాస రైల్వే స్టేషన్ నుంచి స్వగ్రామం వరకు సుమారు 15 కిలో మీటర్లు మేర ఊరేగింపు నిర్వహించారు. సైన్యంలో 24 ఏళ్లు పాటు సేవలందించి అస్సాంలోని మిస్సామారీ రిజమెంట్లో హవల్దార్‌గా రిటైరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు సన్మాన కార్యక్రమంలో సైనికసేవా సమితి అధ్యక్షుడు అప్పారావు మాట్లాడుతూ సోమేశ్వరరావు సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సమితి ప్రతినిధులు ఐ.అప్పారావు, గొరకల విశ్వనాథం, యువ సేవ సంఘం అధ్యక్షుడు బొడ్డు రామారావు, మాజీ, ఎంపీపీ, సర్పంచ్ గొరకల వసంతరావు తదితరులు పాల్గొన్నారు. పాముకాటుతో వృద్ధుడి మృతి వజ్రపుకొత్తూరు రూరల్: శివరాంపురం గ్రామానికి చెందిన దట్టి బోడయ్య(80) పాముకాటుకు గురై మృతి చెందాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు.. బోడయ్య బుధవారం గ్రామానికి దగ్గరలో ఉన్న లంక గ్రామ పరిసరాల్లో గేదెలను మేతకు తీసుకువెళ్లాడు. ఈ సమయంలో పాము కాటు వేయడంతో బోడయ్యను పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. బోడయ్యకు భార్య సరసమ్మ, కుమారుడు హేమసుందర్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
స్కూల్‌గేమ్స్ ఫుట్‌బాల్ ఎంపికలు పూర్తి
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి స్కూల్‌గేమ్స్ ఎంపిక పోటీల్లో ఇటీవలి వాయిదా పడిన ఫుట్‌బాల్ ఎంపికలను శుక్రవారం అధికారులు పూర్తిచేశారు. పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియెట్ విద్య జిల్లా అధికారులను సమన్వయం చేసుకుని జిల్లా స్కూల్‌గేమ్స్ పెడరేషన్ చేపడుతున్న స్కూల్‌గేమ్స్ విడతలవారీ ఎంపికలను నిర్వహిస్తూ వస్తుంది. ఇందులో భాగంగా శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా జరిగిన ఫుట్‌బాల్ ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 300 మంది బాలబాలికలు హాజరయ్యారు. అండర్–14, 17 విభాగాల్లో బాలబాలికలకు వేరువేరుగా ఎంపికలను చేపట్టి ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్రపోటీలకు ఎంపికచేసినట్టు ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ చల్లా జగదీష్ తెలిపారు. డీఈఓతోపాటు పీడీ–పీఈటీ సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.తవిటయ్య, ఎం.వి.రమణ సమీక్షించారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ మహిళా కార్యదర్శి జీఎం జ్యోతిరాణి, గేమ్ ఇన్‌చార్జ్‌లు బి.నిర్మల్ కృష్ణ, టి.లక్ష్మణరావు, రెడ్డి రవి, ఆర్.స్వాతి, ఎస్.శ్రీనివాసరావు, కె.రవికుమార్ పాల్గొన్నారు. -
జనం డబ్బు
సర్కారు డప్పు రాజకీయాలకు ప్రజల సొమ్మా..? మేము రూ.5వేలు గౌరవ వేతనం తీసుకుని ప్రభుత్వ పథకాలు, సేవలు అందించాం. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పని చేశాం. కానీ మేమెప్పుడూ రాజకీయలు చేయలేదు. వలంటీర్లకు రూ.5వేలు జగన్ ప్రభుత్వం ఇస్తే ప్రజా ధనం వృధా చేస్తున్నారంటూ రచ్చరచ్చ చేశారు. ఇప్పుడేమో రాజకీయ ప్రచారానికి కూటమి ప్రభుత్వం రూ.లక్షలు ప్రజాధనం వెచ్చించడం సరికాదు. – తెరుపల్లి రాజు, మాజీ వలంటీరు, దేవునల్తాడ, వజ్రపుకొత్తూరు మండలం మేం ప్రజలకు ఉపయోగపడ్డాం గత ప్రభుత్వంలో రూ.5వేల జీతంతో నిమిషాల్లోనే రేషన్ కార్డులిచ్చాం. ఆరోగ్య సమస్యల నుంచి ప్రభుత్వ సేవల వరకు తీర ప్రాంతంలో ప్రతి ఒక్క కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచాం. మత్స్యకారులకు సేవలు చేశాం. ఆ సేవలకు రూ.5వేలు గౌరవ వేతనం ఇస్తేనే ప్రజాధనం దుర్వినియోగమంటూ ఎల్లోమీడియా డప్పుకొట్టింది. ప్రజా సేవకు ఉపయోగపడని ఒక భజన బృందానికి జనం డబ్బును వాడేందుకు ఇప్పుడు ప్రభుత్వం సిద్ధమైంది. – కారి కామేశ్వరి, మాజీ వలంటీరు, వజ్రపుకొత్తూరు మండలం -
అంతటా నీరుత్సాహం
తీరని దాహం..● మంచినీటికి నోచుకోని ప్రభుత్వ బడుల పిల్లలు ● పాఠశాలల్లో మూలకు చేరిన ఆర్ఓ ప్లాంట్లు ● ఇళ్ల నుంచే నీటి బాటిళ్లు తెచ్చుకుంటున్న విద్యార్థులు ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలో 17 పాఠశాలలకు ఆర్ఓ ప్లాంట్లు సరఫరా చేయగా, వాటిలో 9 పాడైపోయాయి. వాటిని బాగు చేయాలని కోరితే ఇంతవరకు దిక్కూమొక్కూ లేదు. ఇదీ పరిస్థితి.. ● కవిటి మండలంలో విచిత్ర పరిస్థితి. ఇక్కడ ఆరు పాఠశాలలకు ప్లాంట్లు మంజూరైనా నేటికీ ఇన్ స్టాల్ చేయలేదు. ఆర్.బెలగాం, బట్టివానిపాలెం, సిలగాం, దూగానపుట్టుగ, మున్నిపుట్టుగ, పెద్ద మెళియాపుట్టుగలకు ప్లాంట్లు వచ్చాయి. కానీ వాటి వినియోగానికి మోక్షం లేదు. ● సోంపేటలో బారువ, బట్టిగల్లూరు, కొర్రాయిపేట, మామిడిపల్లి, పలాసపురం,సోంపేట రూరల్,బేసిరామచంద్రాపురం, గొనకపాడు, బెంకిలి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, చేపలగొల్లగండి, పీకే వీధి (సోంపేట),రామకృష్ణాపురం ఎంపీయూపీ స్కూళ్లు, జింకిభద్ర, బారువ బాలికల జెడ్పీ పాఠశాలల్లో ప్లాంట్లు పనిచేయడం లేదు. ● పలాసలో కాశీబుగ్గ సాయి కాలనీ, టెక్కలిపట్నం జెడ్పీ హైస్కూళ్లు, రంగోయి, ఈదురాపల్లి ప్రాథమిక, ప్రాథమికోన్నత బడుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ● కంచిలి మండల పరిధిలో పోలేరు ప్రాథమికోన్నత పాఠశాల, ముండ్ల, పురుషోత్తపురం,ఎస్.ఆర్.సి. పురం ప్రాధమిక పాఠశాలల్లోను, పద్మతుల ప్రాథమికోన్నత పాఠశాల, కంచిలి జెడ్పీ ఉన్నత పాఠశాల, ఏపిఎస్డబ్ల్యూఆర్ కంచిలి, కేజీబీవీ జాడుపూడి, మఠం సరియాపల్లి పీఎం శ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాల, జెన్నాగాయి ప్రాథమికోన్నత పాఠ శాల, బి.నారాయణపురం ప్రాథమిక పాఠశాలల్లో ఆర్ఓ ప్లాంట్లు పనిచేయడం లేదు. కంచిలి ఉన్నత పాఠశాలలో ఆర్ఓ ప్లాంటు పనిచేయకపోవడంతో, సంబంధిత సిబ్బంది వచ్చి దాన్ని తీసుకెళ్లిపోయారు. దీంతో ఇక్క డ సుజలధార కనెక్షన్ ఇచ్చి నీటిని వినియోగిస్తున్నారు. ఇక మఠం సరియాపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలోనూ ప్లాంటు రిపేరుకు చేరింది. ● జిల్లాలో అతి పెద్ద మత్య్సకార గ్రామమైన నువ్వలరేవు ప్రాథమిక పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్ మూలకి చేరడంతో పాఠశాలలో చదువుతున్న 230 మంది చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే కాశీనగర్ ప్రాధమిక పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్‌ను ఇన్స్టాల్ చేసి వినియోగం మరిచారు. దీంతో పాఠశాలలో చదువుతున్న 269 మంది చిన్నారులకు వాటర్ బాటిల్ దిక్కుగా మారింది. వజ్రపుకొత్తూరు మండలంలో గోవిందపురం, పొల్లాడ, పల్లిసారథి, యూకేపురం పెద్దబడాం, యూఆర్‌కేపురం, హుకుంపేటతో పాటు 30 పాఠశాలల్లో ఆర్ఓ ప్లాంట్లు పని చేయడం లేదు. ఇదికాక బత్స లవానిపేట, హుకుంపేట, డోకులపాడు పాఠశాలల్లో దాతలు వాటర్ ప్యూరిఫైయర్స్ ఏర్పాటు చేనప్పటికీ నిర్వహణ కొరవడడంతో అవి మూలన పడ్డాయి. పొల్లాడ ప్రాథమికోన్నత పాఠశాలలోనూ ప్లాంటు మూలకు చేరగా.. బల్లి బాలకృష్ణ తన మినరల్ వాటర్ ప్లాంట్ నుంచి రోజుకు ఎనిమిది క్యాన్లు నీరు ఇస్తున్నారు. తెచ్చుకున్న నీళ్లు సరిపోవడం లేదు ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఒక సీసాతో నీళ్లు తీసుకువస్తున్నాం. అవి సాయంత్రం వరకు సరిపోవడం లేదు. ఎండాకాలంలా ఉంది. దాహం వేస్తుంది. – మధు నీహారిక, బెంకిలి, ఐదో తరగతి -
సంక్షేమాన్ని గాలికి వదిలేశారు
● కూటమి మోసాలను ప్రజలకు వివరిద్దాం ● గుర్తింపు కార్డుల పంపిణీలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): సంపద సృష్టిస్తానని హామీ ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు రెండున్నరేళ్లలో నాలుగు లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారో చెప్పాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సూ టిగా ప్రశ్నించారు. శ్రీకాకుళం నగరంలో హయాతినగర్, గుజరాతిపేట, పీఎన్‌కాలనీ, ఫాజుల్‌బాగ్‌పేట, సీపన్నాయుడుపేట 40 నుంచి 45వ డివిజన్ల వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గుర్తింపు కార్డులను ఓ కల్యాణమండపంలో శుక్రవారం అందించారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ సూపర్ సిక్స్ మోసాలను వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ప్రజలకు వివరించాలని తెలిపారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ జెండా ఎగరేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేసి డబ్బులన్నీ అమరావతిలో పెట్టి తన సొంత మనుషుల అభివృద్ధికి చంద్రబాబు పాటు పడుతున్నారని విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చదరపు అడుగుకి నిర్మాణ వ్యయం రూ. 14,500 చెల్లించడం దారుణమన్నారు. తీరా చూస్తే అమరావతికి వెళ్లాలంటే పడవ వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో మందు లు లేవని, కాలేజీకి వెళ్లే వారికి ఫీజులు కట్టడం లేదని, ఎరువులు కూడా ఇవ్వని దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. కార్పొరేషన్లో దోపిడీ శ్రీకాకుళంలో స్థానిక ఎమ్మెల్యే టౌన్‌ప్లానింగ్ అధికారులు కలిపి దోపిడీ చేస్తున్నారని, చిన్న ఇళ్లు కట్టు కున్నా వసూళ్లు చేస్తున్నారని మండిపడ్డారు. గత 70 ఏళ్లుగా ఇక్కడ ఎంతో మంది పాలించినా ఈ స్థాయిలో అవినీతి ఎన్నడూ జరగలేదని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాలు ఎలాగూ లేవు.. ధరలు సైతం సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉన్నా యని విమర్శించారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు సీపానా రామారావు, చీమల తారక్, దున్న గన్నిరాజు, యడ్ల వెంకట్, సీపాన మహేంద్ర, కిల్లంశెట్టి అరుణ్కుమార్గుప్తా, దూసి నాగేశ్వరరావు, గుంట జ్యోతి, రావులపల్లి సురేంద్ర, సాహుకారి శ్రీనివాసరావు, లతో పాటు వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు ఎంవీ పద్మావతి, యువనేత ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు, అంధవరపు సూరిబాబు, ఎన్ని ధనుంజయరావు, కోణార్క్ శ్రీనివాసరావు, అంబటి శ్రీనివాసరావు, చల్ల శ్రీనివాసరావు, ఎం.ఏ భేగ్, సాధు వైకుంఠరావు, తంగుడు నాగేశ్వరరావు, కింజరాపు రమేష్, మూగి రామారావు తదితరులు పాల్గొన్నారు. -
మబగాంలో ఎమ్మెల్యేకు షాక్
● వైఎస్సార్ సీపీలో చేరిన ఎమ్మెల్యే అనుచరులు పోలాకి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమిలో విభేదాలు బయటపడుతున్నాయి. సాక్షాత్తు నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి స్వగ్రా మం పోలాకి మండలం మబగాంలోనే శుక్రవారం క్రియాశీల నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అందులో గ్రామానికి చెందిన మెండ కృష్ణమూర్తి(కిత్తయ్య), పల్లి భైరాగి, జుత్తు రామారావు, శిమ్మ రమేష్, కొప్పుల అప్పారావు, నక్క సూర్యనారాయణ, తెలుగు రామారావు, గొద్దు ప్రసాద్ తదితరులు ఉన్నారు. గత కొంతకాలంగా మబగాంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతోపాటు అనేక విషయాల్లో తమకు అన్యాయం జరిగిందని వారు ఆరోపించారు. ధర్మాన సోదరుల రాజకీయంతోనే మబగాంకు గుర్తింపు వచ్చిందని, మళ్లీ మబ గాంలో పూర్వవైభవం కోసం కృషి చేస్తామని పార్టీలో చేరిన నాయకులు అన్నారు. కృష్ణదాస్‌తోపాటు యువనాయకుడు ధర్మాన కృష్ణచైతన్య వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అన్ని చోట్లా ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఒక్క మబగాంలోనే కాకుండా మొత్తం అన్ని చోట్లా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. వచ్చే స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలు ఆ పరిణామాలను ఎదుర్కోబోతున్నాయి. ఇంత తక్కువ సమయంలో ప్రభుత్వంపై ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం కూడా చూసి ఉండదు. ఇప్పటికీ అధికార పార్టీ నాయకులు మేకపోతు గాంభీర్యం నటిస్తున్నారు. – ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
లారీ బోల్తా
ఎల్.ఎన్.పేట: కోవిలాం కాలనీ సమీపంలో ఏబీ రోడ్డు పక్కన కాలువలో ఓ లారీ బోల్తా పడింది. డ్రైవర్ సూరినాయుడు తెలిపిన సమాచారం మేరకు శుక్రవారం వేకువజామున బత్తిలి నుంచి కర్రల లోడుతో అనకాపల్లి సమీపంలోని అచ్యుతాపురం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లారీని రోడ్డు పక్కన బహిర్భూమి కోసం ఆపామని, తనతో పాటు క్లీనర్ లారీలో ఉండగా ఒక్కసారిగా పక్కకు ఒరుగుతూ కాలువలో పడిపోయిందని డ్రైవర్ చెప్పారు. ఇద్దరికి ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం పులిబంద గ్రామానికి చెందిన సంకిలి అప్పారావు(35) బుధవారం రాత్రి తన ఇంటి శ్లాబ్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పారావుకు 13 ఏళ్ల క్రితం పాతపట్నం మండలం బడ్డుమర్రి గామానికి చెందిన రాజేశ్వరితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. కొద్ది నెలలుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతుండటంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో అప్పారావు గురువారం రాత్రి చీరతో ఉరివేసుకున్నాడు. అయితే కుమారుడి మృతిపై తల్లి కర్రెమ్మ అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. సెంట్రల్ జైలుకు గంజాయి నిందితుడుశ్రీకాకుళం క్రైమ్ : శ్రీకాకుళం నగరం, రూరల్ పీఎస్ పరిధిలో 2 గంజాయి కేసుల్లో నిందితునిగా ఉన్న జలగడుగుల తారావికాస్ అలియాస్ వికాస్‌ను పోలీసులు అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుని విశాఖపట్నం సెంట్రల్ జైలుకు రిమాండ్ నిమిత్తం తరలించారు. ఈ మేరకు రూరల్ సీఐ కె.పైడపునాయుడు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. గంజాయి నేర కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకుని పీఐటీ–ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నిర్బంధానికి పంపించగా సంబంధిత అధికారులు పరిశీలించి ఏడాది కాలం నిర్బంధించేందుకు ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. ఐరన్ చోరీకి యత్నం రణస్థలం: రణస్థలం ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనుల్లో వినియోగిస్తున్న ఐరన్‌ను కొంతమంది వ్యక్తులు నిత్యం దొంగిలిస్తున్నారని గుర్తించిన కాంట్రాక్ట్ కాపలాదారులు నిఘా వేయగా ఓ వ్యక్తిని రెడ్‌హ్యాండ్‌గా శుక్రవారం పట్టుకున్నారు. గతంలో ఇలాగే పలుమార్లు దొంగతనం చేసి తుక్కు దుకాణంలో అమ్మేశారని ఎస్ఈపీఎల్ సూపర్వైజర్ జగదీష్ తెలిపారు. అనంతరం నిందితుడిని జె.ఆర్.పురం పోలీసులకు అప్పగించారు. రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు టెక్కలి రూరల్: నర్శిపురం జంక్షన్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. టెక్కలి ఎన్టీఆర్ కాలనీకి చెందిన వై.శ్రీరాములు తన భార్య చిన్నప్పమ్మతో కలిసి ద్విచక్ర వాహనంపై పలాస నుంచి టెక్కలి వైపు వస్తుండగా నర్శిపురం జంక్షన్ వద్ద కుక్కలు అడ్డుగా రావడంతో కిందపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరూ గాయపడటంతో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం శ్రీకాకుళం ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఫర్నిచర్ షాపులో మంటలు జి.సిగడాం(పొందూరు): పొందూరు మండల కేంద్రంలో సిస్టమ్ కాలేజీ మొయిన్ రోడ్డు సమీపంలో ఫర్నిచర్ షాపులో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో సమారు రూ.4లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని బాధితులు నల్లబారిక పైడిరాజు, నల్లబారిక వెంకటరమణ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం బూర్జ: లాభాం గ్రామ సమీపంలో నాగావళి నది ఒడ్డున మర్రి చెట్టు వద్ద తుప్పల్లో చిక్కుకున్న మృతదేహాన్ని శుక్రవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం పనస నందివాడ గ్రామానికి చెందిన పాలకొండ సుబ్బారావు(62) ప్రతిరోజు ననసనందివాడ నుంచి రేగిడి మండలం కందిస గ్రామాల మధ్య నాగావళి నదిలో పడవ నడుపుతుంటాడు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు రావడంతో సుబ్బారావు తన మిత్రుడు నాగుడు సహాయంతో పడవ తీయగా ఇంజన్ స్టార్ట్ కాలేదు. దీంతో తెడ్డు సహాయంతో పడవ నడుపుతుండగా తెడ్డు జారిపోయింది. సుబ్బారావు తెడ్డుకోసం నదిలోకి దూకి గల్లంతయ్యాడు. ఎట్టకేలకు మృతదేహం లభించడంతో కుటుంబీకులకు సమాచారం అందించారు. ఎస్సై ఎం.ప్రవళ్లిక కేసు నమోదు చేసి మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్రైమ్ కార్నర్ -
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం అర్బన్: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లకు వెంటనే కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె.కళ్యాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గాంధీ జయంతి, ఐసీడీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా శుక్రవారం శ్రీకాకుళంలో నగర మున్సిపల్ కార్పొరేషన్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి అంగన్వాడీలు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కె.జ్యోతి, అప్పలనరసమ్మ, విజయలక్ష్మి, భవాని, అక్కప్ప, రమాదేవి, సునీత తదితరులు పాల్గొన్నారు. రణస్థలం: అంగన్వాడీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో కొండములగాంలో గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు. -
రైళ్లలో మొబైళ్లు చోరీ చేస్తున్న ఇద్దరు అరెస్ట్
కాశీబుగ్గ: రైళ్లలో ప్రయాణికుల మొబైల్ ఫోన్ల ను చోరీ చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు పలాస రైల్వే ఎస్ఐ దుంపల శ్రీనివాసరావు తెలిపారు. వారి దగ్గరి నుంచి మొత్తం 10 ఫోన్ల ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రత కోసం చేపట్టిన తనిఖీల్లో వీరిని పట్టుకున్నామని పేర్కొన్నారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా ఖలికోటకు చెందిన జగన్ బెహరా, బృందాబన్ జాలి అనే ఇద్దరు ఖలి కోట నుంచి వయా పలాస–శ్రీకాకుళం మార్గంలో ప్రయాణికుల రద్దీ ఆసరాగా తీసుకుని ఫోన్లను చోరీ చేస్తున్నట్లు నిర్ధారణ జరిగిందని ఎస్ఐ శ్రీనివాసరావు వివరించారు. గాంధీ జయంతి రోజూ మాంసం విక్రయాలు నరసన్నపేట: మేజరు పంచాయతీ నరసన్నపేటలో శుక్రవారం యథావిధిగా మాంసం విక్రయాలు జరిగాయి. గాంధీ జయంతి రోజున మాంసం విక్రయాలు జరగకూడదని నిబంధనలు ఉన్నా.. స్థానిక మటన్ విక్రయదారులు, చికెన్ షాపుల యజమానులు యథేచ్ఛగా మాంసం అమ్మకాలు చేపట్టారు. ఈ రోజు మాంసం విక్రయాలు చేయకూడదు కదా.. అని ప్రశ్నించగా మాకు తెలీదు.. ఎవరూ చెప్పలేదు అని బదులిచ్చారు. ‘ఆర్థిక పరిస్థితి బాగోలేదు.. ప్రజలు గుర్తించాలి’ నరసన్నపేట: ‘మేజరు పంచాయతీ నరసన్నపేటలో అనేక సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. మెయిన్ రోడ్డు అభివృద్ధి, కాలేజీ రోడ్డు విస్తర ణ, మార్కెట్ వీధి అభివృద్ధి, తాగునీటి సౌక ర్యం అభివృద్ధి వంటి సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతగా లేదు. వచ్చిన ఆదాయం అంతా ఉద్యోగుల జీతభత్యాలకే అయిపోతున్నాయి. ప్రజ లు గుర్తించాలి’ అని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. మేజరు పంచాయతీ నరసన్నపేటలో శుక్రవారం నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అలాగే సంక్షేమ పథకాలకు అధికంగా డబ్బు వెచ్చించాల్సి వస్తోందన్నారు. పరిశుభ్రత, అహింసా మార్గాలే పురోగతికి బాటలు శ్రీకాకుళం పాతబస్టాండ్: మహాత్ముడు బోధించిన పరిశుభ్రత అంటే కేవలం చెత్తను ఎత్తివే యడం మాత్రమే కాదని, మనుషుల ఆలోచనలు, మనస్సులు కూడా శుభ్రంగా ఉంచుకోవడమే నిజమైన పరిశుభ్రత అని కలెక్టర్ స్వప్ని ల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలసి నిర్వహించిన మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి అందించిన హరిత విప్లవం, సరిహద్దు దళాల పటిష్టత అజరామరమని కలెక్టర్ కొనియాడారు. -
అరసవిల్లిలో అద్భుతం కోసం ఎదురుచూపులు.. మళ్లీ నిరాశే!
సాక్షి, శ్రీకాకుళం: అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో భక్తులకు మరోసారి నిరాశ ఎదురైంది. ఏడాదిలో రెండుసార్లు జరిగే అరుదైన ఘట్టంగా భావించే సూర్యకిరణాల స్పర్శ కోసం భారీగా తరలివచ్చిన భక్తులు.. ఈసారి కూడా ఆ అద్భుత దృశ్యాన్ని వీక్షించలేకపోయారు. వరుసగా రెండో రోజు సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకకపోవడంతో భక్తులు నిరాశతో వెనుదిరిగారు.శ్రీకాకుళంలోని అరసవిల్లి ఆలయం సూర్యభగవానుడి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏడాది కొన్ని ప్రత్యేక రోజుల్లో ఉదయించే సూర్యకిరణాలు నేరుగా ఆలయంలోకి ప్రవేశించి మూలవిరాట్ పాదాలను తాకుతాయి. దక్షిణాయన కాలంలో అక్టోబరు నెలలో తొలి మూడు లేదా నాలుగు రోజులు, అలాగే ఉత్తరాయణంలో మార్చి 9, 10 తేదీల్లో ఉదయించే సూర్యకిరణాలు నేరుగా ఆలయంలోకి ప్రవేశించి సూర్యభగవానుడి విగ్రహాన్ని తాకుతాయని చెబుతారు. ఆ దృశ్యం సుమారు ఆరు నిమిషాల పాటు కొనసాగి.. ఆనంద పారవశ్యాన్ని కలగజేస్తుంది. ఈ అరుదైన ఘట్టాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. వీక్షించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈసారి కూడా సూర్యకిరణాల స్పర్శను చూసేందుకు శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ప్రత్యేక ఏర్పాట్ల మధ్య స్వామివారి దర్శనం కోసం ఎదురుచూశారు. అయితే అనుకున్న సమయానికి సూర్యకిరణాలు ఆలయంలోకి ప్రవేశించకపోవడంతో భక్తులకు నిరాశ తప్పలేదు. నిన్న కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గంటల తరబడి వేచి చూసిన భక్తులు సూర్యకిరణాల అద్భుత దృశ్యం కనిపించకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. అయితే ఆలయ అధికారులు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే ప్రకృతి పరిస్థితుల కారణంగా సూర్యకిరణాల స్పర్శ కనిపించలేదు. రేపు, ఎల్లుండి కూడా అవకాశం ఉండడంతో.. భక్తుల రద్దీ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అరసవిల్లి సూర్యభగవానుడి ఆలయం అత్యంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. స్థల పురాణం ప్రకారం.. ఓ సందర్భంలో ఇంద్రుడు తన సర్వశక్తులను కోల్పోయి అశక్తుడై కింద పడిపోయాడు. ఆ సమయంలో సూర్యనారాయణుడిని ప్రార్థించగా.. స్వామివారు ప్రత్యక్షమై, తాను పడిన ప్రదేశాన్ని వజ్రాయుధంతో తవ్వాలని సూచించినట్లు చెబుతారు. ఇంద్రుడు అలా చేయగా.. అక్కడ నుంచి సూర్యభగవానుడు, ఉష, ఛాయ, పద్మిని దేవతల విగ్రహాలు వెలుగులోకి వచ్చాయి. అనంతరం ఇంద్రుడు అక్కడ ఆలయాన్ని నిర్మించి, ఆ విగ్రహాలను ప్రతిష్ఠించాడని పురాణ కథనం. అయితే పద్మపురాణం ప్రకారం.. ఈ ఆలయంలోని సూర్యనారాయణ స్వామి విగ్రహాన్ని కశ్యప మహర్షి ప్రతిష్ఠించినట్లు ప్రస్తావన ఉంది. లోకానికి వెలుగును అందించే, సకల జీవరాశికి ఆరోగ్యం, శక్తి, నవచైతన్యం ప్రసాదించే సూర్యభగవానుడికి ఇక్కడ నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులు ఆనందం, హర్షంతో తిరిగి వెళ్లేవారని.. అందుకే ఈ ప్రాంతాన్ని తొలుత ‘హర్షవల్లి’గా పిలిచేవారని, కాలక్రమేణా అదే పేరు ‘అరసవిల్లి’గా మారిందని చెబుతారు.ఇదీ చదవండి: అయ్యారే.. అన్ని వేల కోట్లుఘె ఎగ్గొట్టారే! -
పచ్చికబయళ్లలో.. ఆక్రమణల మేత!
తీర్పు కోసం వేచిచూస్తున్నాం పచ్చికబయళ్ల భూములు ఆక్రమణలకు గురైన మాట వాస్తవమే. ఆక్రమణదారులకు ఇదివరకే ఆరుసార్లు నోటీసులు జారీ చేశాం. ఈలోగా వారు కోర్టుకు వెళ్లారు. న్యాయస్థానం తీర్పు వెలువడాక ఆ భూమిని స్వాధీనం చేసుకుని కంచెవేస్తాం. – బి. శ్రీదేవి, తహసీల్దార్, పలాస కాశీబుగ్గ : పశువులకు గ్రాసం అందించే పచ్చికబయళ్లు ఆక్రమణలు చెరలో చిక్కుకున్నాయి. ఈ స్థలం తమదేనని ఆక్రమణదారులు చెబుతుండగా.. ముమ్మాటికీ సర్కారుదేనంటూ రెవెన్యూ అధికారులు తేల్చిచెబుతున్నారు. భూమి చుట్టూ అధికారులు కంచె వేయకపోవడం వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చిందని స్థానికులు అంటున్నారు. 1.48 ఎకరాల కేటాయింపు.. పలాస మండలం కంబిరిగాం భూముల చెంత పారసంబ రెవెన్యూ పరిధిలో పశువులకు గ్రాసం లభించేందుకు వీలుగా సర్వే నంబరు 183, 2బీలో ప్రభుత్వం రెండెకరాల స్థలాన్ని గతంలో కేటాయించింది. ఈ స్థలాన్ని పచ్చిక బయళ్లుగా పిలుస్తారు. పారసంబ వెళ్లే రహదారికి ఆనుకొని ఈ భూమి ఉంది. గతంలో రెండెకరాలుండగా, జాతీయ రహదారి విస్తరణలో కొంత భాగం పోగా ప్రస్తుతం 1.48 ఎకరాలతో పచ్చిక బయళ్లుగా వదిలేశారు. కొందరు ఈ స్థలాన్ని ఆక్రమించి సాగు చేసుకుంటున్నారు. తమకు వారసత్వంగా వర్తించిందంటున్నారు. రెవెన్యూ అధికారులు మాత్రం ఇది ప్రభుత్వ స్థలమని స్పష్టం చేస్తున్నారు. దీంతో అటు రెవెన్యూ అధికారులు, ఇటు ఆక్రమణదారుల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఆధారాలేవీ..? వివాదం చెలరేగిన నేపథ్యంలో ఆక్రమణదారులకు రెవెనూ అధికారులకు ఓ అవకాశమిచ్చారు. భూములు తమవేనంటూ ఆధారాలు చూపించాలని ఆదేశించారు. ఐదునెలల కిందట రెవెన్యూ అధికారులు ఈ స్థలం విషయమై రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. హక్కులకు సంబంధించి ధ్రువపత్రాలుంటే సమర్పించాలంటూ అందులో పేర్కొన్నారు. నెలన్నర వ్యవధిలో మరో రెండు నోటీసులు జారీ చేశారు. కానీ ఆక్రమణదారుల నుంచి స్పందన కరవైంది. పైగా తమను వేధిస్తున్నారంటూ ఆక్రమణదారుల్లో ఒకరు కోర్టును ఆశ్రయించడం గమనార్హం. వర్తించని ప్రభుత్వ పథకాలు.. పచ్చిక బయళ్ల భూమి తనదేనంటూ సమర్థిస్తున్న వారి దగ్గర సరైన హక్కు పత్రాలు లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రైతులకు వర్తించే పథకాలు వర్తించడం లేదు. రెవెన్యూ విభాగంలో ఓ ఉద్యోగి ఆక్రమణదారులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఇదే భూమిని ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నించారు. అప్పట్లో అధికారులు హడావిడి చేసి అడ్డుకున్నారు. కానీ ఇప్పుడు యథేచ్ఛగా భూమిని ఆక్రమిస్తుంటే మౌనం దాల్చడం ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తోంది. కంచె ఏదీ? ప్రభుత్వ భూముల రక్షణ విషయంలో రెవెన్యూ అధికారులు కొంతమేర ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారన్నది పచ్చిక బయళ్ల భూముల విషయంలో స్పష్టమవుతోంది. ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలుంటే గుర్తించి, వాటికి రక్షణ కంచె వేసి బోర్డును ఏర్పాటు చేయాలి. కానీ ఆ దిశగా సంబంధిత అధికారులు చొరవ చూపడం లేదు. దీంతో విలువైన ప్రభుత్వ భూముల్లో ఆక్రమణదారుల ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. పారసంబ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ స్థలంపై కబ్జాదారుల కన్ను భూమి తమదే అంటున్న ఆక్రమణదారులు ముమ్మాటికీ సర్కారుదే అంటున్న రెవెన్యూ అధికారులు -
జాతీయ తైక్వాండో పోటీలకు ఆరుగురు ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు శ్రీకాకుళం జిల్లా నుంచి ఆరుగురు క్రీడాకారులు ఎంపికై నట్టు తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ప్రధాన కార్యదర్శి కొమర భాస్కరరావు తెలిపారు. ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన ఏపీ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో జిల్లా నుంచి సబ్‌జూనియర్స్, జూనియర్స్ విభాగాల్లో పెద్దిన గగన్, బెండి వేదశ్రీ, కారే మోక్షిత్, తాన్ని ఢిల్లీశ్వరరావు, గుర్రాల హేమచందన్ ఎంపికయ్యారు. ఈ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర బృందానికి కోచ్‌గా కొమర మోహన్‌కృష్ణ నియమితులయ్యారు. వీరిని గురువారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో పలువురు అతిధులు, వైద్యులు అభినందించారు. కార్యక్రమలో గ్యాస్ట్రాలజిస్ట్ డాక్టర్ గొండు గంగాధర్, డాక్టర్ ఇజ్జపు రెడ్డి శిరీష, డాక్టర్ కిరణ్‌కుమార్, డాక్టర్ వాసుదేవరావు, జిల్లా ఉషు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రెడ్డి శివకుమార్, రెడ్డి సాయిరాం, కె.మోహనకృష్ణ, లోకేష్, మురళి, జి.లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. -
మర్యాదపూర్వక భేటీ
మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్రెడ్డిని గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మర్యాదపూర్వకంగా కలిశారు. – హిరమండలం కవిటి: జగతి గ్రామానికి చెందిన దిక్కల అభిమ న్యు జేఆర్ఎఫ్ ఎంట్రన్స్ లో 12వ ర్యాంక్ సాధించాడు. ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం పరిధిలోని బాపట్ల కళాశాలలో అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తిచేసిన అభిమ న్యు ఇటీవల జాతీయస్థాయిలో నిర్వహించిన జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ప్రవేశపరీక్షలో ఈ ర్యాంకు సాధించాడు. అభిమన్యు విజయం పట్ల తల్లిదండ్రులు దిక్కల జగదీష్, సనపల మంజుల(జిల్లాకోర్టు సీనియర్ స్టెనోగ్రాఫర్), గ్రామపెద్దలు పూడి నేతాజీ, పూడి వరప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. రణస్థలం: శ్రీకాకుళం వైపు నుంచి విజయనగ రం వెళుతున్న ఆర్టీసీ బస్సు గురువారం మధ్యా హ్నం కోష్ఠ జంక్షన్లో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న సంచాం గ్రామానికి చెందిన గొర్లె హేమంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని జె.ఆర్.పు రం ఎస్సై వి.సత్యనారాయణ పరిశీలించారు. కోస్టాలో ఆటోలు, ఇతర దుకాణాలు ఫుట్‌పాత్‌పై ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. టెక్కలి రూరల్: రావివలసలో కె.కాంతమ్మకు చెందిన రేకు ఇల్లు గురువారం దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో సామగ్రీ మొత్తం కాలిపోయింది. స్థానికులు మంటలు ఆపే ప్రయత్నం చేసినప్పటికి ఫలితం లేకపోయింది. ఎచ్చెర్ల : మండలంలోని నవభారత్ జంక్షన్ వద్ద వరం కాలనీలో ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్న యతిరాజుల పద్మావతి (41) అనే వివాహిత బుధవారం ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మావతి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. సంతానం కూడా లేదు. దీంతో మనస్థాపానికి గురై భర్త లేని సమయంలో ఉరివేసుకుని మృతి చెందింది. వీరి స్వగ్రామం ఆమదాలవలస కాగా, కొంతకాలంగా వరం కాలనీలో ఉంటున్నారు. ఈమె భర్త శ్రీనివాసరావు రణస్థలం మండలం కొచ్చెర్లలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమె తమ్ముడు బుడుమూరు ప్రభాకరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: సమస్యల పరిష్కారం కోరుతూ రెండో రోజు గురువారం కూడా న్యాయవాదులు విధులు బహిష్కరించారు. జిల్లాకు మంజూరైన కొత్త కోర్టులు జిల్లా కోర్టు ఆవరణలోనే ఏర్పాటు చేయాలని, ఇతర న్యాయపరమైన వృత్తిపరమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నిరసన చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూన రాజారావు, కార్యదర్శి చిట్టి సూర్యనారాయణ, బీసీ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఆగూరి ఉమామహేశ్వరరావు, అసో సియేషన్ సభ్యులు డి.ఈశ్వరరావు, సుభాష్, విజయ్‌కుమార్, ఏఎల్ఎన్, కొమ్ము రమణమూర్తి, భవానీ శంకర్ పాల్గొన్నారు. -
శ్రీకాకుళం డీఎస్పీ వివేకానందకు బదిలీ
శ్రీకాకుళం క్రైమ్ : శ్రీకాకుళం సబ్ డివిజనల్ కార్యాలయ అధికారి (డీఎస్పీ)గా రెండేళ్ల క్రితం వచ్చిన సీహెచ్ వివేకానంద గురువారం బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో మూడు నెలల క్రితం సీఐ నుంచి డీఎస్పీగా ప్రమోషన్ పొంది మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో వెయిటింగ్లో వున్న సీహెచ్ ధనుంజయనాయుడు రానున్నారు. వివేకానందను శ్రీకాకుళం విజిలెన్సు అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీగా నియమిస్తూ డీజీపీ కార్యాలయం నుంచి గురువారం ఉత్తర్వులొచ్చాయి. ధనుంజయనాయుడు వచ్చాక రిలీవ్ అయ్యి మంగళగిరి డీజీ కార్యాలయంలో రిపోర్ట్ చేసి విజిలెన్సు అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ విధుల్లో చేరుతానని వివేకానంద పేర్కొన్నారు. రెండేళ్లగా ఎటువంటి ఒత్తిడి లేకుండా విధులు చేసేలా ఉన్నతాధికారులు సహకరించారని, సీఐలు, ఎస్ఐలు, దిగువస్థాయి సిబ్బంది చక్కని పనితీరు కనబర్చారని పేర్కొన్నారు. ఇన్నాళ్లకు మోక్షం.. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే విజిలెన్సు ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీగా వున్న కిరణ్ బదిలీ అయ్యారు. అప్పటినుంచి మరొకరికి పోస్టింగ్ దక్కలేదు. ఈ విభాగానికి ఎస్పీగా కొన్నాళ్లు బర్ల ప్రసాదరావు కొనసాగినా ఆయన రిటైర్ కావడంతో జిల్లాకు చెందిన మంత్రుల కుటుంబీకుడు కింజరాపు ప్రభాకర్ ఇన్చార్జి ఎస్పీగా కొనసాగుతున్నారు. ఈయన ప్రస్తుతం విశాఖపట్నం విజిలెన్సు అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివేకానంద డీఎస్పీగా ఇక్కడికి రానుండటం మరో వారం రోజుల్లో ఏఎస్పీగా పదోన్నతి దక్కనుందని వార్తలు వినిపిస్తుండటంతో విభాగానికి ఇన్నాళ్లకు మోక్షం లభించనున్నట్లు పలువురు భావిస్తున్నారు. వివేకానంద అటు ప్రజా సమస్యలతో పాటు కీలక కేసుల్లో తన పర్యవేక్షణతో సబ్‌డివిజన్ పరిధి సర్కిల్ అధికారులతోను, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ బృందాల అండతో నేరాల ఛేదనలో కీలక పాత్ర పోషించారు. పోలీసు అధికారిక వ్యవహారాల్లోను, మాదకద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాల్లో కీలకంగా ఉండి ఉన్నతాధికారుల మన్నన పొందారు. -
జనం డబ్బు
సర్కారు డప్పుఎలా మేలు చేస్తుంది..? గత ప్రభుత్వ హయాంలో కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేశాం. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రతి పథకాన్ని వారి ఇంటికి చేరవేశాం. అప్పట్లో ప్రతిపక్ష నాయకులు మాపై గగ్గోలు పెట్టారు. రూ.5వేలు జీతం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇప్పుడు కేవలం ప్రచారం కోసం ఇన్ఫ్లుయెన్సర్లకు ప్రజల డబ్బు పంచేందుకు సిద్ధమయ్యారు. ఇది జనాలకు ఎలా మేలు చేస్తుందో ప్రభుత్వమే చెప్పాలి. – సునీల్, మాజీ వలంటీర్, సోంపేట మేజర్ పంచాయతీ ప్రజాధనం వృథా కాదా.? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వలంటీర్లకు రూ.పది వేలు ఇస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్ల వల్ల ప్రజాధనం వృధా అవుతోందని ఆ వ్యవస్థనే చంపేశారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు రూ. 15వేలు చొప్పున కట్టబెట్టడం ప్రజాధనం వృథా కాదా..? మహంతి రామసత్యం, గొర్లెపేట గ్రామం, రణస్థలం మండలం -
ఏటీఎం మెషీన్లో డిపాజిట్ డబ్బులు వెనక్కి..
● బాధితునికి సొమ్ము అప్పగించిన పోలీసులు శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని జీటీరోడ్డు ఎస్బీఐ మెయిన్ బ్రాంచి ఏటీఎం వద్ద ఓ వ్యక్తి డిపాజిట్ చేసిన రూ. 17 వేలు తిరిగొచ్చేశాయని, ఆ డబ్బులు వేరే కష్టమర్ పట్టుకుపోగా గుర్తించి వెనక్కి ఇప్పించామని ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణ వెల్లడించారు. నగరానికి చెందిన ముద్దాడ వంశీకృష్ణ అనే యువకుడు గత నెల 8న ఎస్బీఐ మెయిన్ బ్రాంచి ఏటీఎం వద్ద క్యాష్ డిపాజిట్ మిషన్‌లో రూ. 17 వేలు డిపాజిట్ చేశాడు. నగదు బ్యాంకు ఖాతాలోకి మళ్లిందని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అక్కడికి కొద్ది సెకెండ్లలోనే మిషన్‌నుంచి నోట్లు తిరిగి రావడంతో వెనకున్న కస్టమర్ తీసుకుని వెళ్లిపోయాడు. ఇంటికెళ్లి చూసుకున్నాక ఖాతాలో సొమ్ము చేరనట్లు ఫోన్ ద్వారా తెలుసుకున్న వంశీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సమక్షంలో సిబ్బంది మ్యాట్రిక్స్ సీసీ కెమెరాల ద్వారా నగదును తీసుకుపోయిన కస్టమర్‌ను గుర్తించి స్టేషన్‌కు పిలిపించి విచారించారు. అతని వద్ద నగదును స్వాధీనం చేసుకున్న ఎస్ఐ హరికృష్ణ బాధితుడైన వంశీకృష్ణను స్టేషన్‌కు పిలిపించి అప్పగించారు. -
ధూపదీప నైవేద్యం భూములు స్వాహా
మల్లికార్జునా నీవే దిక్కు.. ● తాజాగా మల్లికార్జున స్వామి ఆలయ భూములపై వివాదం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కూటమి పాలనలో దేవు డి భూములకూ రక్షణ లేకుండా పోయింది. ఆలయ భూములు రానురాను లేఅవుట్లుగా మారిపోతున్నాయి. తాజాగా పొందూరులో దేవుడి భూములపై కన్నేశారు. మల్లికార్జున స్వామి ఆలయ భూములను కాజేసేందుకు పచ్చనేతలు పథకం ప్రకారం వెళ్తున్నారు. తప్పుడు డాక్యుమెంట్లు చూపించి, విలువైన ఆలయ భూములను కొట్టేసేందుకు ప్లాన్ చేశారు. అధికారులు ఆ భూములు కాపాడడం మీద కంటే ఆక్రమణదారులకు వదిలిపెట్టడంపైనే దృష్టి సారిస్తున్న వింత వైఖరి కనిపిస్తోంది. దర్జాగా కబ్జా... పొందూరులో భూములకు డిమాండ్ ఎక్కువగా ఉంది. వాటి ధర కూడా అంతే ఎక్కువగా ఉంది. ఖాళీ స్థలం కనబడితే చాలు కబ్జా చేసేస్తున్నారు. ఇప్పటికే మండల కేంద్రం పరిధిలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. వాటితో పాటే దేవదాయ భూములను కూడా ఆక్రమణదారుల గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. శాలిహుండం వేణుగోపాలస్వామి ఆలయ భూముల వ్యవహారం అందరికీ తెలిసిందే. ఈ ఆలయ భూములు ఇష్టారీతిన అమ్మేయడం, కొనుగోలు చేయడం, తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ల వరకు వెళ్లాయి. వాటిపై వివాదం నడుస్తూనే ఉంది. వేణుగోపాలస్వామి భూములు అమ్మడానికి, కొనడానికి లేదని దేవదాయ శాఖ అధికారులు తమదైన శైలిలో చెబుతున్నారే తప్ప వాటిని కాపాడేందుకు స్పష్టమైన వైఖరితో వెళ్లడం లేదు. వేణుగోపాలస్వామి ఆలయ భూములే కాదు లక్ష్మీపేట లైన్‌లోని రామలింగేశ్వరస్వామి ఆలయం భూములు, సోమలింగేశ్వరస్వామి ఆలయం భూములు, వెంకటేశ్వరస్వామి ఆలయ భూములు కూడా పెద్ద ఎత్తున కబ్జాకు గురయ్యాయి. పదుల సంఖ్యలో ఆక్రమణలు ఉన్నాయి. ఆలయాలకు చెందిన ఎకరాలకు ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. కోట్లాది రూపాయల విలువైన భూములు చేతులు మారిపోయాయి. ధూపదీప నైవేద్యాల కోసం ఇచ్చిన భూములను కబ్జాదారులు తమ గుప్పెట్లో పెట్టుకుని, ఇష్టారీతిన లావాదేవీలు జరుపుతున్నారు. పక్కనున్న జిరాయితీ భూముల సర్వే నంబర్లు చూపించి, ఆలయ భూముల రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. రిజిస్టార్ అధికారులు సైతం అవేవీ పట్టించుకోకుండా రిజిస్ట్రేషన్ చేసేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఆలయ భూముల్లో రియల్ ఎస్టేట్ లేఅవుట్లు ఏర్పాటవుతున్నాయి. ఇందులో తిలాపాపం–తలా పిడికెడు అన్నట్టు కాపాడాల్సిన అధికార వర్గాలు సైతం చేతివాటం ప్రదర్శించి, ఆక్రమణలను సీరియస్‌గా తీసుకోవడం లేదు. దీంతో దేవదాయ భూములు పరుల పాలవుతున్నాయి. దేవాలయాల భూములు కొట్టేస్తున్న తెలుగు తమ్ముళ్లు పథకం ప్రకారం కబ్జా, ఆపై లావాదేవీలు తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు తాజాగా దేవాంగుల వీధిలో ఉన్న మల్లికార్జున స్వామి ఆలయ భూములను సైతం అదే రకంగా ఆక్రమించి, తప్పుడు డాక్యుమెంట్లతో కొట్టేస్తున్నా రు. ఇప్పటికే దీనిపై ఫిర్యాదులు కూడా వెళ్లా యి. రోడ్డుకు ఆనుకుని సర్వే నంబర్–163లో ఎకరా 30 సెంట్లు వరకు దాంట్లో చాలా వరకు ఆక్రమించడమే కాకుండా క్రయవిక్రయాలు జరుపుతున్నారు. తప్పుడు డా క్యుమెంట్లతో లావాదేవీలు కూడా జరిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతి సారి ఈ భూ ముల బాగోతం నడుస్తోంది. ఆ ప్రభుత్వం అధి కారం లేకపోతే ఎక్కడికక్కడ వ్యవహారాలు నిలిచిపోయాయి. 2017లో ప్రారంభమైన అక్రమాల పర్వం మళ్లీ తాజాగా ఊపందుకుంది. సెంటు రూ.7లక్షలు చొప్పున విక్రయాలు చేపట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఓ కీలక నేత అసిస్టెంట్ కనుసన్నల్లో ఇదంతా జరుగుతోంది. అధికారులను సైతం శాసిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎంతోకొంత ఆలయానికి వదిలేసి, మిగతాది కబ్జాదారులకు వదిలేసేలా ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించకపోతే ఆలయ భూములు పూ ర్తిగా కబ్జాకు గురయ్యే అవకాశం ఉంది. -
ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురికి గాయాలు
సంతబొమ్మాళి: తాళ్లవలస సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతునాయుడుపేట గ్రామానికి చెందిన పరపటి ఆనందరావు తన భార్య గున్నమ్మతో కలిసి ద్విచక్ర వాహనంపై టెక్కలి వెవెళుతున్నారు. అదే రూట్లో కోటపాడుకు చెందిన కొయ్యాని చంటి టెక్కలి నుంచి స్వగ్రామం వస్తుండగా తాళ్లవలస సమీపంలో పరస్పరం ఢీకొన్నారు. ముగ్గురూ గాయపడటంతో 108 అంబులెన్సులో టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. చంటి పరిస్థితి విషమించడంతో రిమ్స్‌కు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వై.సింహాచలం తెలిపారు. -
33 రకాల పరికరాలు..ఇక నేరస్తుల చేతికి సంకెళ్లు
శ్రీకాకుళం క్రైమ్ : నేర దర్యాప్తులో శాసీ్త్రయ ఆధారాల సేకరణను బలోపేతం చేయడంతో పాటు నేరస్థలానికి ఫోరెన్సిక్ సేవలను వేగంగా అందుబాటులోకి తెచ్చే మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్ వాహనాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం వాహనంలో ఆధునిక శాసీ్త్రయ పరికరాలను పరిశీలించి వాటి వినియోగ విధానం, నేరస్థలంలో ఆధారాల సేకరణ, డాక్యుమెంటేషన్, భద్రపరిచే ప్రక్రియల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 33 రకాల ప్రత్యేక పరికరాలతో.. నేర స్థలికి చేరుకుని అక్కడ లభించే భౌతిక, జీవ, ఫింగర్‌ప్రింట్, ట్రేస్, గన్‌షాట్ రెసిడ్యూ, మాదక ద్రవ్యాలు, అగ్ని ప్రమాదాలకు సంబంధించి ఆధారాలతో పాటు డిజిటల్ ఆధారాలను శాసీ్త్రయ పద్ధతిలో గుర్తించి సేకరించి వాటిని భద్రపరిచేందుకు ఈ వాహనం ఉపయోగపడుతుంది. సైబర్ ఫోరెన్సిక్ టూల్స్, ఫోరెన్సిక్ లై ట్స్, బ్లడ్, డీఎన్ఏ శాంపిల్స్ సేకరణ, నార్కోటిక్, ఎక్స్‌ప్లో, జివ్ స్క్రీనింగ్ కిట్, ఫొటోగ్రఫీ, డాక్యుమెంటేషన్ తదితర 33 రకాల ప్రత్యేక పరికరాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. నేర దర్యాప్తులో శాసీ్త్రయ ఆధారాలు అత్యంత కీలకమని, ఈ వాహనం ద్వారా ఆధారాలు పాడవ్వడం లేదా నష్టపోయే అవకాశాలు తక్కువన్నారు. ఆధారాలను సేకరించి సరైన చైన్ ఆఫ్ కస్టడీతో భద్రపర్చడం ద్వారా కేసుల దర్యాప్తు నాణ్యత మరింత మెరుగుపడుతుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ త్వరితగతిన నేరాలు ఛేదించి న్యాయస్థానాల్లో శాసీ్త్రయ ఆధారాల ప్రాముఖ్యత పెంచేందుకు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో ఫింగర్ ప్రింట్ విభాగం ఇన్స్పెక్టర్ పి.భరత్‌కుమార్, క్లూస్‌టీమ్ సిబ్బంది పాల్గొన్నారు. మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్ వాహనమిదే.. ప్రత్యేక పరికరాలివే.. -
వివాదాస్పద భూముల పరిశీలన
ఎచ్చెర్ల: ఎస్‌ఎస్‌ఆర్‌పురం గ్రామంలోని సర్వే నంబరు–1లో ఉన్న మూడు వందల ఎకరాల స్థలాన్ని జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ గురువారం పరిశీలించా రు. ఈ స్థలం 22–ఏ జాబితాలోకి వెళ్లి పోయి నిషేధిత జాబితాలోకి వెళ్లిపోయిందని, అడవి పోరంబోకుగా ఉందని, ఈ భూముల్లో రీసర్వే చేయడం లేదని సాగు చేస్తున్న రైతులంతా గతంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యా దు చేశారు. ఈ నేపథ్యంలో జేసీ స్థలాన్ని పరిశీలించారు. పూర్తి స్థాయిలో రికార్డులు పరిశీలించి నిర్ణ యం తీసుకుంటామని రైతులకు తెలియజేశారు. అదే విధంగా, పెయ్యిలవానిపేటలో చెరువు ఆక్రమణకు గురవుతోందన్న ఫిర్యాదు మేరకు అక్కడ కూడా పరిశీలించారు. ఈయనతో పాటు తహసీల్దా ర్ బి.గోపాలరావు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. -
‘స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి’
నరసన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తోందని, దీనికి సన్నద్ధం కావాలని, అవసరమైన ఎన్ఓసీ పత్రాలు ముందుగానే రెడీ చేసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. మున్సిపల్, కార్పొరేషన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ పదవులకు పోటీ చేసే ఆసక్తి గల అభ్యర్థులు అవసరమైన పత్రాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. కుల ధ్రువీకరణ పత్రం, ఇంటి పన్ను రసీదు, ఇతరత్రా ఎన్ఓసీ పత్రాలు వెంటనే తీసుకొని భద్రపరచుకోవాలని కృష్ణదాస్ సూచించారు. కవిటి: మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఎస్వీజే విద్యాసంస్థల ఎదురుగా ఉన్న రోడ్డు పక్కన గడిచిన 4 రోజులుగా దుర్భర పరిస్థితుల్లో పడి ఉన్న వృద్ధుడి పరిస్థితిని గుర్తించిన ఆ సంస్థ విద్యార్థులు చేయూతను అందించారు. గురువారం అతడి పరిస్థితిని గమనించి కంచిలి మండలం తలతంపర సమీపంలో నిర్వహిస్తున్న సీతయ్య ఫౌండేషన్ వారికి సమాచారం అందించి వారి సంరక్షణ కేంద్రానికి తరలించే ఏర్పాట్లు చేశారు. సీతయ్య ఫౌండేషన్ వాహనంలో ఎస్వీజే సంస్థ ఉపాధ్యాయులు, బాలబాలికలు అందరూ ఆ వృద్ధుడిని పంపించారు. ఉద్దానం తాగునీరు పైప్‌లైన్ లీక్ పాతపట్నం: పాతపట్నం ఆల్ఆంధ్రరోడ్డు సమీపంలో మహేంద్ర డిగ్రీ కళాశాల ముందు రోడ్డు పక్కన ఉద్దానం ప్రాజెక్టు ద్వారా హిరమండలం నుంచి మెళియాపుట్టి వెళుతు న్న తాగునీరు పైప్‌లైన్ లీక్ కావడంతో తాగునీరు వృథాగా పోతోంది. గురువారం మధ్యా హ్నం పైప్‌లైన్ లీకై ంది. అధికారులు స్పందించడం లేదని, గతంలో కూడా పైప్‌లైన్ లీకై నీరు వృథా అయిందని స్థానికులు చెబుతున్నారు. వర్సిటీలో ఇద్దరు బోధకుల సస్పెన్షన్ ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వ విద్యాలయం న్యాయ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు బోధకులను సస్పెండ్ చేశారు. నేటి నుంచి వీరి సస్పెండ్ అమలు చేయనున్నారు. నెలరోజులు పాటు వీరిని సస్పెండ్ చేశారు. బుధవారం న్యాయ కళాశాలను వీసీ కేఆర్ రజనీ ఆకస్మికంగా తనీఖీ చేసినప్పుడు క్లాస్‌రూంలో విద్యార్థులు తప్ప బోధకులు లేకపోవడంతో పాటు సమయ పాలన పాటించకపోవడంతో వీరిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. దీంతో సంబంధిత శాఖ వారు నాన్‌టీచింగ్ బోధకుడు, సబ్జెక్ట్ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీలను సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ స్థాయిలో సిక్కోలు అమ్మాయి ప్రతిభ నందిగాం: మండలంలోని కాపుతెంబూరుకు చెందిన మౌనిక మిశ్రో జాతీయ స్థాయి లాంగ్ జంప్ పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచి సత్తా చాటింది. బుధవారం తిరుపతిలో జరిగిన జాతీయ స్థాయి లాంగ్ జంప్ పోటీల్లో సత్తా చాటిన మౌనిక టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతుంది. మౌనిక తండ్రి శ్రీనివాసరావు మిశ్రో విశ్రాంత ఆర్మీ ఉద్యోగి కాగా తల్లి చిన్ని మిశ్రో గృహణి. కుమార్తె సాధించిన ప్రతిభపై శ్రీనివాస మిశ్రో హర్షం వ్యక్తం చేశారు. ఆల్‌ఆంధ్రా రోడ్డు సమీపంలో ఉద్దానం పైప్ నుంచి లీక్ అవుతున్న తాగునీరు -
బీసీలను ఇంకెంత కాలం మోసం చేస్తారు..?
● సర్కారుకు ధర్మాన కృష్ణదాస్ సూటి ప్రశ్న నరసన్నపేట: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇంకా బీసీలకు మోసం చేసేందుకు, మభ్య పెట్టేందుకు చూడటంపై మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మండి పడ్డారు. బీసీ రిజర్వేషన్లు 34 శాతం అమలు చేస్తున్నట్లు ఒక జీఓను కూటమి ప్రభుత్వం తీసుకువచ్చినప్పుడు ఇది మోసమని వైఎస్సార్సీపీ చెప్పిందని, ఇప్పుడు 34 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు చంద్రబాబు చేసిన 105,1065 జీఓలు సరైనవి కాదని హైకోర్టు కొట్టివేయడంతో చంద్రబాబు డ్రామా బట్ట బయలైందని ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, దానికి విరుద్ధంగా చట్టబద్ధత లేని జీఓలు ఇచ్చి బీసీలకు చంద్రబాబు తీవ్ర గందరగోళానికి గురి చే శారని కృష్ణదాస్ ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో భాగస్వామ్యంలో ఉండీ రిజర్వేషన్లపై చట్టబద్ధం చేసే చర్యలు తీసుకోలేదని, సుప్రీంకోర్టుకు వెళ్తున్నట్లు ప్రకటించడం కూడా మోసమేనని అన్నారు. -
మభ్య పెడుతున్నారు...
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై కూటమి ప్రభుత్వం మభ్యపెట్టే విధానాన్ని అవలంబిస్తోంది. 50 శాతం రిజర్వేషన్ల పరిమితిపై సుప్రీం కోర్టు తీర్పులు అమల్లో ఉండగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ జీఓలు ఇవ్వడం ఏంటి. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సవరణ చేసి రిజర్వేషన్లకు చట్ట రక్షణ కల్పించాలి. తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి. ఏ జీఓలూ లేకపోయినా వైఎస్సార్సీపీ బీసీలకు స్థానిక సంస్థల్లో 40 శాతం వరకు ప్రాతినిథ్యం క ల్పించింది. – నర్తు నరేంద్ర యాదవ్, వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి -
● హెచ్చరిస్తున్నా.. వినేవారేరీ?
ఆమదాలవలస పట్టణంలో సర్వే నంబర్ 118లో 1, 2, 3, 4, 5 సర్వే నెంబర్లలో 5.58 ఎకరాలు ప్రభుత్వ, సుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన భూమి ఉంది. అయితే ఈ భూ ములను కొంతమంది ఆక్రమణ చేసి ఆ స్థలాల్లో గృహనిర్మాణాలు చేపడుతున్నారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు పరిశీలించి హెచ్చరిక బోర్డులు పెట్టారు. కానీ ఈ హెచ్చరిక బోర్డులు సైతం లెక్క చేయకుండా ఆ క్రమణదారులు యథేచ్ఛగా నిర్మాణాలు సాగిస్తున్నారు. అక్కడకు వెళ్లి ఆక్రమణ దారులను ప్రశ్నిస్తుంటే ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తమకు ఈ నిర్మాణాలు చేపట్టుకోమన్నార ని చెబుతున్నారు. ఈ నిర్మాణాల విషయంలో రెవెన్యూ అధికారులను కూడా నొక్కిపెట్టి ఆదేశాలు జారీ చేసినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. – ఆమదాలవలస -
విజయవంతంగా 500 ప్లస్ రోబోటిక్ సర్జరీలు
ఎంవీపీకాలనీ (విశాఖ): విశాఖ జిల్లా ఎంవీపీ కాలనీలోని మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో 500 రోబోటిక్ క్యాన్సర్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేసినట్లు మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘనత సాధించిన తొలి క్యాన్సర్ హాస్పటల్‌గా ఎంజీ క్యాన్సర్ హాస్పటల్ నిలిచిందన్నారు. కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ బి.మురళీధర్ మాట్లాడుతూ శరీరంలోని ఇరుకై న భాగాల్లో మరింత కచ్చితత్వంతో శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు రోబోటిక్ సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ సత్య విజయ్ చిగురుపాటి, యూరో ఆంకాలజిస్ట్–రోబోటిక్ సర్జన్ డాక్టర్ రాహుల్ తేజ్, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ ప్రేమ్ కమల్ పట్నాల, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ గుడ్ల అనంత సాయికుమార్, కన్సల్టెంట్ గైనెక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ హరిత మద్దిరాల తదితరులు రోబోటిక్ సర్జరీల ద్వారా క్లిష్టమైన కేసుల్లో అందించిన వైద్య సేవల అనుభవాలను వివరించారు. -
బీసీలకు వెన్నుపోటు
బీసీల వెన్నుపోటుదారు డు చంద్రబాబు అని మ రో సారి నిరూపించారు. సాధ్యం కాని రిజర్వేషన్ జీఓలతో కోర్టులను ఆశ్రయించి మరో సారి బీసీలను రాజకీయంగా దొంగ దెబ్బ తీశారు. 34 శాతం రిజర్వేషన్ సాధ్యం కాదని తెలిసినప్పటికీ మభ్యపెట్టేందుకు కోర్టులను ఆశ్రయించారు. వృత్తి పనిముట్లు తీసుకోవడానికే బీసీలు అనే భావన చంద్రబాబుకు ఉంది. ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీలను అణచివేయడమే ఆయన నైజం. – పేరాడ తిలక్ , వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త తిరుగుబాటు చేయాలి బీసీలను మోసగిస్తున్న చంద్రబాబు పై తిరుగుబాటు చేయాలి. ఎన్నికల మనుపు సాధ్యం కాని హామీలతో బీసీలతో పాటు మిగిలిన వర్గాలను మోసం చేశారు. ఇప్పుడు 34 శాతం రిజర్వేషన్ పేరుతో మరో సారి బీసీలను భంగపాటుకు గురి చేశారు. చంద్రబాబు పై బీసీలు తిరుగుబాటు చేయాలి. – జి.గురునాథ్ యాదవ్, వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టెక్కలి -
బీసీ రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు డ్రామాలు: ధర్మాన
సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పేరుతో కూటమి ప్రభుత్వం ఆడుతున్న రాజకీయ క్రీడలు, మోసపూరిత వైఖరిపై వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ తీరును నిలదీశారు.సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పులు స్పష్టంగా ఉన్నప్పటికీ, కేవలం రాజకీయ లబ్ధి కోసమే మళ్లీ జీవోల పేరుతో బీసీలను మోసం చేసే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. న్యాయపరమైన అంశాలపై స్పష్టత లేకుండా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు మాయ మాటలతో మభ్యపెట్టి మోసం చేసే కుట్రకు తెరలేపాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు నిజంగా 34 శాతం రాజకీయ ప్రాతినిథ్యం కల్పించాలనే చిత్తశుద్ధి ఉంటే, కేవలం జీవోలు, ప్రకటనలకే పరిమితం కాకుండా ఎన్నికల్లో పార్టీ తరఫున బీసీలకు అదే స్థాయిలో అవకాశాలు కల్పించాలని సవాల్ విసిరారు.స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు తీర్పులను ప్రభుత్వం గౌరవించాల్సిందే అన్నారు. 34 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన న్యాయపరమైన ఆధారాలు, రిజర్వేషన్ పరిమితిని ఎలా సమర్థిస్తారన్న అంశాలపై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని వివరాలు కోరిందని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు కల్పించిన రాజకీయ ప్రాతినిధ్యాన్ని ధర్మాన ప్రసాదరావు గణాంకాలతో సహా వివరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...కోర్టు తీర్పులు తెలిసే డ్రామాలు:సుప్రీంకోర్టులో ఉండే తొమ్మిది మందితో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం.. వివిధ కేటగిరీల రిజర్వేషన్లు అన్నీ కలిపి 50 శాతం మించకూడదు అనేది అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన అత్యున్నత తీర్పు. ఇది దేశంలో అమల్లో ఉంది. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా బాగా తెలుసు. అయినప్పటికీ, ఏపీలో మళ్లీ 34శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ జీవో ఇచ్చి అమలు చేస్తామని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి?ఈ జీవో ఇచ్చిననాడే మేము స్పష్టంగా చెప్పాం.. ఇది రాజ్యాంగ ధర్మాసనం తీర్పునకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి కోర్టులో నిలబడదని, కొట్టేస్తారని ముందే చెప్పాం. ఇది తెలిసి కూడా ఇలాంటి అసాధ్యమైన జీవోలు ఇచ్చి హడావుడి చేయడం కేవలం ప్రజలను, ముఖ్యంగా బీసీలను మోసగించే చర్య కాక వేరే ఏమవుతుంది? రేపో మాపో సుప్రీంకోర్టు కూడా దీన్ని కొట్టేస్తుందని తెలిసినా కావాలనే ఈ నాటకాలు ఆడుతున్నారు. అమాయకులైన బీసీలను మోసం చేయడానికి ఇదొక ఆయుధంగా వాడుకుంటున్నారు.నిజమైన ప్రేమ ఉంటే ఇప్పుడు అమలు చేసి చూపించండి:మీకు నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే, 34శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఉంటే.. ఇప్పుడు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేసి చూపించండి! మీకంటే ముందు ఐదు సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన వైఎస్ జగన్ గారు బీసీలకు ఏకంగా పదవుల్లో ఎలా పెద్దపీట వేసి చూపించారో చూడండి.వైఎస్సార్సీపీ హయాంలో బీసీలకు రాజ్యాధికారం:రాష్ట్రంలోని మొత్తం 13 మేయర్ స్థానాల్లో ఏకంగా 9 స్థానాలు (69%) బీసీలకే కేటాయించి వైఎస్సార్సీపీ చరిత్ర సృష్టించింది.13 జెడ్పీలలో 6 (46%) బీసీలకు ఇవ్వడం జరిగింది.14 రాజ్యసభ స్థానాల్లో 4 (36%), అలాగే లోక్‌సభ పోటీల్లో 25 స్థానాలకు గాను 11 (44%) బీసీలకే కేటాయించారు.ఎమ్మెల్సీలలో 48%, మున్సిపల్ చైర్పర్సన్లలో 53%, మండల పరిషత్తులలో 68% మేర బీసీలకు ప్రాతినిధ్యం కల్పించిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదే.చంద్రబాబువి కేవలం మాటలే.. చేతలు శూన్యం:మంత్రివర్గంలోనూ, ఉన్నత పదవుల్లోనూ బీసీలను ఎప్పుడైనా సమానంగా గౌరవించారా? కేవలం మాటలు చెప్పడం, జీవోల పేరుతో కాలయాపన చేయడం తప్ప బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదు. నిజమైన సామాజిక న్యాయం కేవలం వైఎస్సార్సీపీ అధినాయకుడు వైఎస్ జగన్ గారి హయాంలోనే సాధ్యమైంది. మోసపూరిత మాటలతో మిమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తున్నవారి పట్ల బీసీ సోదరులు ఐక్యంగా అప్రమత్తంగా ఉండాలి. మనల్ని వంచించే వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. చంద్రబాబు వరుస డ్రామాలు! -
జనం డబ్బు
సర్కారు డప్పు ఇదెక్కడి న్యాయం..? గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చిత్తశుద్ధితో ప్రజలకు సేవలందించాం. సర్కారుకు, జనాలకు మధ్య వారధిగా ఉంటూ ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించాం. కేవలం రూ.5వేల గౌరవ వేతనంతో అహర్నిశలు శ్రమించాం. అలాంటి మమ్మల్ని కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది. వలంటీర్లను కొనసాగించకపోగా ఇప్పుడు సోషల్ మీడియాలో తమకు వంత పాడేవారికి ప్రభుత్వం ఖజానా నుంచి నిధులు మంజూరు చేయాలని చూస్తోంది. ఇది ప్రభుత్వానికి భారం కాదా?..మాకూ న్యాయం చేయాలి. – కొంక్యాన నాగరాజు, మాజీ వలంటీర్, సత్యవరం, నరసన్నపేట ప్రజాధనంతో ప్రచారమా? సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ల పాలసీ పథకం పెట్టి కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేసే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారు? గత వైఎస్సార్ ప్రభుత్వంలో వలంటీర్లుగా ప్రజలకు ఎంతో సేవ చేసిన మాకు ప్రభుత్వం పారితోషికం అందజేస్తే ఆనాడు ప్రజాధనం దుర్వినియోగంటూ.. ఎల్లో మీడియా, టీడీపీ నాయకులు విమర్శించారు. ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ల ద్వారా ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో ప్రభుత్వం చెప్పాలి. – పిన్నింటి ఫల్గుణరావు, కోటగుడి కాలనీ, పాతపట్నం -
‘ప్రసాద్’ పోయే.. ‘స్వదేశ్ దర్శన్’ వచ్చే..!
● ఆదిత్యాలయానికి స్వదేశ్ దర్శన్ కింద నిధులు మంజూరు ● రూ.100 కోట్లు అంటూ ప్రచారాలు చేసి రూ.55.74 కోట్లతో సరిపెట్టిన వైనం ● కింజరాపు ప్రచారాలపై పెదవి విరుస్తున్న స్థానికులు అరసవల్లి: ‘ప్రసాద్’ స్కీం తెచ్చేస్తున్నాం..రూ.100 కోట్లు మన అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధి కోసం నిధులు తెచ్చేస్తున్నాం’ అంటూ కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడులు వరుస పర్యటనలు, ప్రచార ప్రకటనలతో హోరెత్తించారు. రెండేళ్లుగా ఇదే పాట పాడుతూ.. అరసవల్లికి ‘ప్రసాద్’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించేస్తుందంటూ ఊదరగొట్టారు. తీరా చూస్తే ‘ప్రసాద్’ పథకం ఇకరాదంటూ స్వదేశ్ దర్శన్ 2.0 పేరిట పర్యాటకశాఖ ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వ పథకానికి అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని ఎంపిక చేయించారు. ఈ పథకం కింద రూ. 55.74 కోట్ల నిధులను మంజూరు చేయించినట్లుగా కేంద్ర పర్యాటకశాఖ మంత్రి గజేంద్ర షకావత్ నుంచి ప్రకటన వచ్చినట్లుగా అధికారులతో పాటు మంత్రులు ప్రకటించారు. రూ.100 కోట్ల ప్రసాద్ పథకం అంటూ ఊదరగొట్టి ఇప్పుడు రూ.55 కోట్లతో స్వదేశ్ అంటూ మాట తప్పారేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రసాద్ స్కీం పేరిట ఆలయం ముందున్న పదుల సంఖ్యలో వ్యాపారుల కడుపు కొట్టి వారి దుకాణాలతో పాటు దాతలు నిర్మించిన అన్నదాన మండపం, టీటీడీ కల్యాణ మండపం, వసతి గదులను కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే కూల్చేసిన సంగతి తెలిసిందే. పలు నిర్మాణాలకు కేటాయింపు.. స్వదేశ్ దర్శన్ నిధులతో సన్ ఎక్స్పీరియన్స్ సెంటర్ రూ.31.96 కోట్లుతోనూ, రెస్టారెంట్ బ్లాక్‌కు రూ. 1.31 కోట్లు, షాపింగ్ ఏరియాకు రూ.1.43 కోట్లు కేటాయించారు. మిగిలిన నిర్మాణాలను కూడా ప్రతిపాదించారు. వీటికి ఇప్పటివరకు స్థలాలను గుర్తించలేకపోవడం గమనార్హం. ఇటీవల ప్రైవేటు యజమానుల నుంచి భూ బదలాయింపు పథకం కింద సేకరించిన 1.22 ఎకరాల స్థలంను వీటికి వినియోగించాలని కలెక్టర్ భావించినట్లు సమాచారం. ఈ భూములనే ఆలయ భూములుగా రిజిస్టర్ చేసిన అనంతరం ఎన్వోసీ జారీ చేయించాలని ఆలయ ఈవోపై ఇటీవల ఒత్తిడి తెచ్చిన సంగతిని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన సంగతి విదితమే. ఈ స్థలాల వివాదం ఇంకా కొలిక్కి రాకముందే తాజా అంశం వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది. -
సచివాలయ ఉద్యోగులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, అక్రమ కేసులు, సస్పెన్షన్లను వెంటనే ఎత్తివేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి డిమాండ్ చేశారు. స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ఖండిస్తూ అక్రమ కేసులు, సస్పెన్షన్లను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ సీఐటీ యూ ఆధ్వర్యంలో బుధవారం శ్రీకాకుళంలో అంబేడ్కర్ కూడలి వద్ద నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు నిర్వహించిన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం శతవిధాల ప్రయత్నించిందని, ఎక్కడికక్కడ అరెస్టులు చేయించిందని, ముందుగానే అనుమతి కోరినా ఇవ్వకపోవడం దారుణమన్నారు. నిరసన కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మణికొండ ఆదినారాయణమూర్తి, బండారు మురళి, ఎం.గోవర్దనరావు, ఆల్ పెన్షనర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బొడ్డేపల్లి జనార్దనరావు, ఐద్వా నగర కార్యదర్శి టి.ప్రవీణ, గ్రామ వార్డు సచివాలయం వైద్య ఆరోగ్య కార్యదర్శులు యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్.వెంకటలక్ష్మి, సి.హెచ్.రాధిక, వై.ప్రభావతి పాల్గొన్నారు. ప్రాణం తీసిన మద్యం మత్తు శ్రీకాకుళం క్రైమ్ : వ్యసనాలకు బానిసైన వారిని ఆ వ్యసనాలే ఎప్పుడో ఒకప్పుడు బలి తీసుకుంటాయనడానికి తాజా నిదర్శనం శ్రీకాకుళం ఓ వృద్ధుడు నిద్రలోనే కాలిపోయిన ఘటన. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాకేంద్రంలోని వాంబేకాలనీ మూడో బ్లాక్‌లో పాలిశెట్టి నర్సింహమూర్తి (65) అలియాస్ రమణ ఒంటరిగా నివాసముంటున్నాడు. ఇతని తండ్రి గతంలో పోలీస్ శాఖలో పనిచేశారని, తల్లిదండ్రులతో కలసి తుమ్మావీధిలో వుండేవాడని తెలిసింది. సొంతగ్రామం సరుబుజ్జిలి మండలం రొట్టవలస. వివాహం కాకపోవడం, తల్లిదండ్రులు చనిపోవడంతో మనస్థాపానికి గురైన నర్సింహమూర్తి కొన్నాళ్లుగా భిక్షాటన చేస్తున్నట్లు సమాచారం. బుధవారం వేకువజామున మద్యం మత్తులో తాగి పడేసిన సిగరెట్టు పీక తాను పడుకునే బొంతకు అంటుకోవడంతో నర్సింహమూర్తి సజీవ దహనమయ్యాడు. అతనితో పాటు ఇంట్లో వస్తువులకు మంటలు అంటుకున్నాట్లు ఫైర్ విభాగం, పోలీసులు భావిస్తున్నారు. వేకువఝామున మంటలు కనిపించడంతో అప్రమత్తమైన మొదటి అంతస్థులోని స్థానికులు చూసి ఫైర్ సిబ్బందికి, ఒకటో పట్టణ పోలీసులకు సమాచారమందించారు. వెంటనే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణ సిబ్బందితో పాటు వెళ్లి స్థానికులను వివరాలడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో వరండాలో పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనం సైతం మంటలకు దగ్ధమైనట్లు గుర్తించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు నిలిపివేయాలి అరసవల్లి : రాష్ట్రపతి ఉత్తర్వులు–2025 పేరిట సెటిల్డ్ అయిన ఉద్యోగుల సర్వీసులను అన్సెటిల్ చేసే ప్రక్రియను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా సంఘ సర్వసభ్య సమావేశానికి హాజరై అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణను కారణంగా చూపి 95 శాతం స్థానిక రిజర్వేషన్‌తో కొత్త జోనల్ వ్యవస్థను తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించారు. తెలంగాణలో 10 జిల్లాలను 30 చేసి అమలు చేసిన విధానాన్ని ఏపీలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేసి అదే విధానాన్ని కేంద్రానికి పంపించారని ఆరోపించారు. చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో 12 మంది ఐఎఎస్‌లతో కమిటి వేశామని చెప్పినా...ఆ జీవో పబ్లిక్ డొమైన్లో లేదని గుర్తుచేశారు. ఈ నెల 12 నుంచి ప్రతి జిల్లాలో మేధావులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, జర్నలిస్టులతో కలిసి చర్చావేదికలను నిర్వహిస్తామని ప్రకటించారు. సమావేశంలో ఏపీజీఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి కోసపురెడ్డి శ్రీనివాస్, జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి పైడి నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరి కింజరాపు నరిసింహమూర్తి తదితరులున్నారు. -
తైక్వాండో, ఉషూ ఎంపికలు పూర్తి
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి స్కూల్‌గేమ్స్ ఎంపిక పోటీల్లో భాగంగా బుధవారం తైక్వాండో, ఉషూ ఎంపికలను అధికారులు పూర్తిచేశారు. పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్ విద్య జిల్లా అధికారులను సమన్వయం చేసుకుని జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేడపతున్న జిల్లా స్కూల్‌గేమ్స్ మలివిడత ఎంపిక పోటీలను బుధవారం నిర్వహించారు. శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా తైక్వాండో పోటీలను, శ్రీకాకుళం డీఎస్ఏ స్విమ్మింగ్ వేదికగా ఉషూ ఎంపికలను చేపట్టారు. అండర్–14, 17, 19 వయో విభాగాల్లో బాలబాలికలకు వేరువేరుగా ఎంపికలను నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రపోటీలకు ఎంపిక చేశారు. పోటీలను ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి చల్లా జగదీష్, పీడీలు పర్యవేక్షించారు. -
జంట పట్టణాల్లో..
కాశీబుగ్గలోని ఓ లాడ్జికి ఓ వ్యక్తి మహిళతో సహా బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో వచ్చాడు. గది కావాలని అడగగా చిరునామా ధ్రువీకరణ నిమిత్తం నిర్వాహకులు ఆధార్ అడిగారు. అందుకు తన భార్య ఆధార్ ఉందంటూ ఇచ్చాడు. వివరాలు నమోదు చేసుకున్న లాడ్జి నిర్వాహకులు ఓరూమ్ కేటాయించారు. సరిగ్గా 11.15 గంటల సమయంలో ఆ వ్యక్తి బయట వేరే వ్యక్తిదగ్గర తన ఆధార్ కార్డు ఉందని తీసుకువస్తానని చెప్పి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం సమయంలో రూమ్‌లో ఉన్నవారికి భోజనం ఏమైనా కావాలా? అని అడిగేందుకు సిబ్బంది పలుమార్లు వారున్న రూమ్‌కు ఫోన్ చేశారు. పలుమార్లు వెళ్లి తలుపులు తట్టారు. స్పందన లేకపోయింది. అనుమానం రావడంతో మధ్యాహ్నం 3 గంటల సమయంలో వెళ్లి బలవంతంగా తలుపులు తెరిచి చూడగా గదిలో మహిళ విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారమందించారు. మాస్కుతో వచ్చాడు..మట్టుబెట్టాడు గదిలో హత్యకు గురైన మహిళ టెక్కలి సర్వమంగళవీధికి చెందిన గోడుపు లక్ష్మి గా గుర్తించారు. ఈమెకు ఐదుగురు పిల్లలు. ఒడిశా రాష్ట్రం ఖరగ్‌పూర్‌లో ఉండేది. భర్తతో విభేదాలు తలెత్తడంతో టెక్కలి వచ్చేసింది. ఈలోగా విజయవాడకు చెందిన ఓ వ్యక్తితో పరిచయమై, ఆయనతో కలిసి కాశీబుగ్గ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆమెతో వచ్చిన వ్యక్తి లాడ్జికి సమీపంలోనే మాస్కు ధరించి ఎవరికీ తన ముఖం తెలియకూడదనే జాగ్రత్తపడ్డాడు. ఆధార్ కార్డును తనదికాకుండా లక్ష్మిది మాత్రమే ఇచ్చాడు. ఇవన్నీ చూస్తే హంతకుడు ముందస్తుగానే పథకం ప్రకారం ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఉలిక్కిపడింది. మరోవైపు లాడ్జిలో బసచేసేందుకు వచ్చిన సిక్కిం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన కొందరు బెంబేలెత్తిపోయారు. బిక్కుబిక్కుమంటూ ఆరుబయటే ఉండిపోయారు. లాడ్జి నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ డీఎస్పీ భవాని, ఎస్ఐ దుర్గాప్రసాద్‌లు ఘటనాస్థలికి వెళ్లి విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.కాశీబుగ్గ లాడ్జిలో మహిళహత్య? పలాస–కాశీబుగ్గ జంట పట్టణాల్లో బుధవారం ఓ చోట దారుణం చోటుచేసుకుంటే.. మరో ప్రాంతంలో విషాదం అలముకుంది. కాశీబుగ్గ పట్టణం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఆనుకుని ఉన్న ఓ లాడ్జిలో జరిగిన హత్యలో మహిళ ప్రాణాలు కోల్పోగా.. పలాస పురుషోత్తపురం ఎర్ర చెరువులో ఓ వ్యక్తి నీట మునిగి మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. –కాశీబుగ్గ స్నానానికి దిగి తనువు చాలించాడు పలాస–కాశీబుగ్గ పురపాలక పరిధి పురుషోత్తపురం ఎర్రచెరువులో ఓ వ్యక్తి చెరువులో మునిగి తనువు చాలించాడు. అల్లంశెట్టి హేమసుందర్ (40) స్నానానికి దిగుతుండగా ప్రమాదవశాత్తూ జారి పడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి అతడ్ని కాపాడే ప్రయత్నంలో చెరువులోంచి బయటకు తీయ గా, అప్పటికే హేమసుందర్ మరణించాడు. అనుకోని సంఘటనతో హేమసుందర్ కుటుంబసభ్యులుశోకసంద్రంలో మునిగిపోయా రు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించిన కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గోడుపు లక్ష్మి(ఫైల్) -
డుమ్మా కొట్టిన అధ్యాపకురాలికి జీతం!
ఎచ్చెర్ల: బీఆర్ఏయూలో రోజుకో విచిత్రం వెలుగు చూస్తోంది. అధ్యాపకులు విధులకు హాజరు కాకుండా హాజరైనట్లు సంతకం చేసి వేతనం పొందారని వర్సిటీలో ప్రచారం జరుగుతోంది. వర్సిటీలో ఇంజినీరింగ్ కళాఽశాలలో హెచ్‌పీఎస్ అండ్ హెచ్ఎస్ఎస్ విభాగంలో ఇంజినీరింగ్ కెమిస్ట్రీ బోధించే ఓ అధ్యాపకురాలు ఆగస్టు నెలలో పూర్తిగా సెలవు పెట్టారు. సెలవు వల్ల వేతనం నిలిచిపోయింది. ఈ పరిస్థితిలో వేతనం కోసం అడ్డదారులను వెతికి చడీచప్పుడు కాకుండా సీఎల్‌గా ఉన్న హాజరు పట్టికలో సీఎల్‌ను సంతకంగా దిద్ది వేతనం పొందినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రాజశేఖర్‌ను వివరణ కోరగా ఆయన ఇదంతా అవాస్తవమని, అలాంటిదేదీ జరగలేదని చెప్పారు.హాజరు పట్టిక -
మహిళ ఆత్మహత్య
సంతబొమ్మాళి: మండలంలోని నౌపడ గ్రామానికి చెందిన గిన్ని పద్మావతి (57) అనే మహిళ బుధవారం తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతిరాలి భర్త ఇదివరకే చనిపోవడంతో అప్పటినుంచి మతిస్థిమితం కోల్పోయి చిన్న కుమారుడు కోటేశ్వరరావు దగ్గర ఉంటుంది. ఎప్పటికప్పుడు వీధిలో కేకలు వేస్తూ ఉండేది. ఎక్కడికెళ్లినా రెండు, మూడు రోజుల తర్వాత ఇంటికి వచ్చేది. ఇటీవల గ్రామంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా గ్రామస్తులు రక్షించారు. కాగా బుధవారం కుమారుడు కోటేశ్వరరావు పని నిమిత్తం బయటకు వెళ్లగా.. కోడలు గాయత్రి పలాసలోని బంధువుల ఇంటికి వెళ్లింది. దీంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న పద్మావతి చెరువుకి వెళ్లి స్నానం చేసి ఇంటికొచ్చి అపస్మారక స్థితిలో పడి ఉంది. వీధిలో ఉన్నవారు చూసి కుమారుడికి సమాచారం ఇవ్వడంతో ముందు నౌపడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి టెక్కలి జిల్లా అస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. బ్లేడుతో చేయి కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావం అయిందని, సూపర్ వాస్మల్ 33 అయిల్ తాగి ఉండవచ్చునని కుమారుడు ఫిర్యాదులో తెలిపారు. ఎవరిపైనా అనుమానం లేదని పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నౌపడ ఎస్ఐ నారాయణస్వామి వెల్లడించారు. -
మైనింగ్ తవ్వకాలు విరమించుకోవాలి
కంచిలి: రిజర్వ్డు ఫారెస్ట్ ప్రాంతంలో మైనింగ్ తవ్వకాలను విరమించుకోవాలని సీపీఐ పార్టీ నేత అయినింటి లోకనాథం డిమాండ్ చేశారు. మండలంలోని నువాగడ పంచాయతీ పరిధి సర్వే నంబర్ 47లో నల్లరాయి కొండను తవ్వేందుకు ఏర్పాట్లు చేస్తున్న ప్రక్రియను సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక గిరిజనులు బుధవారం అడ్డుకున్నారు. తమకు అనుమతులున్నాయంటూ కొందరు వ్యక్తులు కొండరాళ్లను పేల్చడానికి రంధ్రాలు చేయడం గ్రామస్తులు గమనించారు. దీంతో సీపీఐ నేతలకు సమాచారం ఇవ్వడంతో.. గ్రామస్తులతో కలిసి ఆ కొండలో రంధ్రాలు వేసిన ప్రదేశానికి వెళ్లి తవ్వకాలను అడ్డుకున్నారు. గతంలో కూడా పలుమార్లు ఈ కొండను తవ్వడానికి ప్రయత్నించినప్పటికీ సీపీఐ ఆధ్వర్యంలో స్థానికులు అడ్డుకున్నారు. తాజాగా మళ్లీ అనుమతులున్నాయంటూ తవ్వకాలు జరపడానికి ప్రయత్నం చేయడం ఏంటని అక్కడ ఆ పనులు చేస్తున్న వ్యక్తుల్ని నిలదీశారు. కొండ తవ్వకాలు చేసే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని, మైనింగ్ అధికారులు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గిరిజనులు, రైతులు, ప్రకృతితో ఆటలాడడం మానుకోవాలని సూచించారు. దీంతో వారు అక్కడి నుంచి ఉడాయించారు. -
తప్పిన పెను ప్రమాదం
సోంపేట: ఒడిశా, ఆంధ్ర రాష్ట్రాల్లో నడుపుతున్న కనకదుర్గా ప్రైవేటు సర్వీసు బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బస్సు సిబ్బంది, ప్రయాణికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి నుంచి అదే రాష్టం బరంపురం వరకు పలాస, సోంపేట, ఇచ్ఛాపురం మీదుగా కనక దుర్గా బస్సు సర్వీసు నడుపుతున్నారు. బుధవారం బస్సు డ్రైవర్ బస్సును సోంపేట వరకు సక్రమంగా తీసుకొచ్చాడు. సోంపేట బస్టాండ్ వద్ద బయల్దేరిన తర్వాత 20 అడుగులు వెళ్లే సరికి బస్సు డ్రైవర్ సాయికు గుండెపోటు, ఫిట్స్ వచ్చాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును రహదారి పక్కన నిలుపుదల చేసి సీటుపై కూలిపోయాడు. వెంటనే బస్సు సిబ్బంది, అక్కడే ఉన్న కనకదుర్గా ఆటో యూనియన్ సభ్యులు డ్రైవర్‌ను సామాజిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతనికి ప్రథమ చికిత్స అందజేశారు. ప్రాణాపాయ స్థితిలో బస్సును డ్రైవరు పక్కకు నిలిపివేయడంలో బస్సులో ప్రమాణిస్తున్న సుమారు 40 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
లక్ష్యాల వైపు అడుగులు వేయాలి
శ్రీకాకుళం కల్చరల్: విద్యార్థులు కేవలం మార్కుల రేసులోనే పరిగెత్తకుండా, ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె.చెన్నకేశవరావు పిలుపునిచ్చారు. భారత్ వికాస్ పరిషత్ శ్రీకాకుళం శాఖ ఆధ్వర్యంలో స్థానిక జీటీ రోడ్డులోని చంద్రమహల్ ఎదురుగా ఉన్న సంస్థ కార్యాలయంలో ‘భారత్ కో జానో’ క్విజ్ పోటీలు–2026 బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్విజ్ పోటీలు విద్యార్థుల్లో సరికొత్త ఆసక్తిని, విజ్ఞానాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా సమాజంలో తమ బాధ్యతలను గుర్తు చేసుకోవాలని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత నేటితరంపై ఉందన్నారు. పోటీల్లో పాల్గొనడం వల్ల విద్యార్థులకు భవిష్యత్‌లో ఉండే అనేక అవకాశాలపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతుందన్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులు విజయవాడలో జరగనున్న అంతర్ జిల్లాల క్విజ్ పోటీలకు ఎంపికయ్యారని నిర్వాహకులు తెలిపారు. సంస్థ అధ్యక్షుడు కెప్టెన్ బుర్రా ఆదినారాయణ శాస్త్రి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్ పి.వి.రమణమూర్తి, ఎంఈవో రెడ్డి సీతంనాయుడు, గురజాడ సంస్థల డైరెక్టర్ సంయుక్త, శార్వాణి స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రేఖ, విశ్రాంత ప్రిన్సిపాల్ కోసూరు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ కార్యాలయ సిబ్బందికి ఏఐపై శిక్షణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: పరిపాలనలో ఏఐ వినియోగించడం ద్వారా పని సులభతరం కావడమే కాకుండా, వేగవంతమవుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో టైపిస్టులు, జూనియర్ సహాయకులు, సీనియర్ సహాయకులు, సెక్షన్ సూపరింటెండెంట్లు తదితర పరిపాలనా సిబ్బందికి ఏఐ పరిజ్ఞానంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కత్రిమ మేధ (ఏఐ) యాప్‌ల వినియోగంపై అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకుంటూ పనితీరును మెరుగుపరచుకోవాలని సూచించారు. కార్యాలయాల్లో పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు మరింత మెరుగ్గా, వేగవంతంగా సేవలు అందించడానికి ప్రతి ఒక్కరూ తగిన శిక్షణ పొంది నిరంతరం ప్రాక్టిస్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్యా, డీఆర్వో విశ్వేశ్వరరావు, ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ ఇంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
పల్లె పండుగ పనులకు శ్రీకారం
జి.సిగడాం(పొందూరు): పొందూరులోని చేనేత శిక్షణ కేంద్రం ప్రాంగణంలో రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ నిర్మాణ పనులకు ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం భూమిపూజ చేశారు. పల్లె పండుగ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్, ఎంపీడీఓ వాసుదేవరావు, ఏఎంసీ చైర్పర్సన్ చిగిలిపల్లి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. నేలకొరిగిన తోటలు పరిశీలన నరసన్నపేట: గాలులు, వర్షాలకు నష్టం కలిగిన అరటి, కొబ్బరి, పూల తోటలను హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ పెద్దపేటకు చెందిన ప్రధాన శాస్త్రవేత్త నరసింహమూర్తి, స్థానిక ఉద్యానవన అధికారి కె.సునీతలు బుధవారం నరసన్నపేట, పోలాకి మండలాల్లో పర్యటించి పరిశీలించారు. కోమర్తి, మబగాం, కొల్లివలస తదితర గ్రామాల్లో రైతులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక పంపామని అధికారులు వివరించారు. ప్రస్తుతం సస్యరక్షణ చర్యలు పాటించాలన్నారు. కార్తీక మాసోత్సవాల ఏర్పాట్లకు బహిరంగ వేలం టెక్కలి: మండలంలోని రావివలస ఎండల మల్లిఖార్జునస్వామి దేవస్థానంలో కార్తీక మాసంలో నిర్వహించనున్న ఉత్సవాలకు సంబంధించి వివిధ ఏర్పాట్లుకు బుధవారం బహిరంగ వేలంపాట నిర్వహించినట్లు ఈవో జి.గురునాథరావు ఒక ప్రకటనలో తెలిపారు. క్యూలైన్ ఏర్పాట్లుకు సనపల రాజు రూ.1,45,000లకు వేలంపాట పాడినట్లు వెల్లడించారు. విద్యుత్ అలంకరణకు రూ.1,20,000లకు, షామియానాలు, పెండాల్స్కు రూ.3,30,000లకు నర్తు గణపతి వేలంపాట పాడినట్లు తెలిపారు. అలాగే తల నీలాలు వసూళ్లు చేసుకునే లైసెన్స్ హక్కుకు గత సంవత్సరం రూ.2,20,000లకు వేలంపాట ఉండగా, ఇప్పుడు రూ,3,70,000లకు గిరిజా శంకర్ అనే వ్యక్తి వేలంపాట పాడినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో గ్రూప్ దేవస్థానం కార్యనిర్వాహణాధికారి టి.పి.మనస్వి పాల్గొన్నారు. గాలింపు ముమ్మరం శ్రీకాకుళం క్రైమ్: జిల్లాకేంద్రంలోని డే అండ్ నైట్ సమీప నాగావళి వంతెన పైనుంచి ఇటీవల దూకి గల్లంతైనవారి కోసం ఫైర్ రెస్క్యూ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. గతేడాది ఇదే వంతెనపై నుంచి భార్య చనిపోయిందని మనస్థాపానికి గురైన ఆటో డ్రైవర్ దువ్వు మోహనరావు గతనెల 25 అర్ధరాత్రి నదిలోకి దూకేసి గల్లంతయ్యాడు. అక్కడికి 3 రోజుల్లో అనారోగ్యానికి గురైన వృద్ధురాలు కొమ్మనాపల్లి భారతి ఇదే డే అండ్ నైట్ వంతెనపై నుంచి దూకేసింది. దీంతో వీరికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సర్‌తో ప్రజాస్వామ్యం అపహాస్యం శ్రీకాకుళం పాతబస్టాండ్: సర్ పేరుతో అక్రమంగా ఓట్లను తొలగించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం వినతిపత్రాన్ని ఆర్డీవో కె.సాయి ప్రత్యూషకి అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 13.4 కోట్ల ఓట్లను తొలగించి బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని విమర్శించారు. దీనికి బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ కిల్లి రామ్మోహన్రావు, డాక్టర్ బీవీ శ్యామరావు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు రెళ్ల సురేష్, డీసీసీ మాజీ అధ్యక్షుడు అంబటి కృష్ణారావు, ఉపాధ్యక్షుడు దేవేళ్ల గోవింద మల్లిబాబు, కరిమజ్జి మల్లేశ్వరరావు, బచ్చు కృష్ణవేణి పాల్గొన్నారు. -
మరో జీవితానికి కొత్త ఉదయం..!
స్వచ్ఛంద రక్తదానం.. ● రక్తదానం ప్రాణదానంతో సమానం ● ప్రతి వ్యక్తి జీవితంలో 168 సార్లు రక్తదానం చేయవచ్చు ● నేడు జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం ● రక్తదానానికి ముందురోజు సరిపోయినంత నిద్రపోవాలి. ● ఆరోగ్యకరమైన భోజనం తినాలి. ● పుష్కలంగా నీరు తాగాలి. శ్రీకాకుళం కల్చరల్: ప్రమాదంలో కొట్టుమిట్టాడుతున్న ప్రాణానికి.. ఆపదలో ఉన్న రోగికి.. ప్రసవ సమయంలో తల్లికి రక్తం అవసరమైన వేళ అందించే ప్రతి రక్తపు బొట్టూ ఒక కొత్త ఆశను నింపుతుంది. ప్రతిఫలం ఆశించకుండా రక్తదానం చేసే దాత.. తన రక్తంతో తెలియని వ్యక్తికి జీవితాన్ని అందించే నిజమైన ప్రాణదాత. రక్తం శరీరంలో సరిపడినంతలేక ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్లు ఎందరో ఉన్నారు. రూ.కోట్లు ఖర్చు చేసినా రక్తం దొరకని పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటి ఆపద సమయాల్లో ఆదుకునే రక్తదాతల కోసం ఐక్యరాజ్య సమితి ఒకరోజును కేటాయించింది. అక్టోబర్ 1న జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవంగా గుర్తింపునిచ్చింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లాలో పరిస్థితి... మన జిల్లాకు అవసరమైన రక్త సేకరణ కావాల్సినంతగా జరగడం లేదు. జిల్లాలో 25 లక్షలకుపైగా జనాభా ఉండగా.. కనీసం 25 వేల యూనిట్ల రక్తం ప్రతి ఏడాది అవసరం అవుతుంది. కానీ జిల్లాలోని అన్ని బ్లడ్ బ్యాంకుల ద్వారా కేవలం 8 వేల నుంచి 10 వేల యూనిట్లు మాత్రమే సేకరణ జరుగుతోంది. గతేడాది కంటే రక్త సేకరణ శిబిరాలు పెరిగినా అవసరానికి సరిపోవడం లేదు. రెడ్‌క్రాస్‌లో గత ఏడాది డిసెంబర్ వరకు 4,800 యూనిట్లు సేకరించగా, ఈ ఏడాది జనవరి నుంచి ఈనెల వరకు 81 రక్తదాన శిబిరాల ద్వారా 3,500 యూనిట్లు సేకరించడం జరిగింది. రక్త నిల్వ కేంద్రాలు రక్తాన్ని సేకరించేందుకు ప్రత్యేకంగా బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. జిల్లాలో అతి పెద్ద రక్త నిల్వకేంద్రంగా శ్రీకాకుళం రెడ్‌క్రాస్ నిలుస్తుంది. రక్తదాతలు ఎవరైనా ముందుకు వస్తే 91330 08585 నంబరుకి కాల్ చేయాలి. వీరు సేకరించిన రక్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్, పాతపట్నం, టెక్కలి, పాలకొండల ప్రభుత్వ ఆస్పత్రులకు అందిస్తున్నారు. అపోహలు వీడాలి చాలా మందికి రక్తదానం అంటే భయం, అపోహలు ఉన్నాయి. రక్తం గురించి తెలుసుకుంటే ఆ భయం పోతుంది. రక్తదాన ప్రక్రియలో కేవలం మన శరీరం నుంచి 300 మి.లీ మాత్రమే స్వీకరిస్తారు. సాధారణంగా మనిషిలో సరాసరి 5 లీటర్ల నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. కేవలం 300 మి.లీ రక్తం దానం చేయడం వలన ఎటువంటి ప్రమాదం లేదు. ప్రమాదం జరిగినప్పుడు లీటరు వరకు రక్తం పోతుంది. సుఖ ప్రసవంలో తల్లి 700 మి.లీ రక్తం కోల్పోతుంది. ఆరోగ్యంగా ఉన్న 18 ఏళ్లు పైబడినవారందరూ రక్తదానం చేయవచ్చు. 18 ఏళ్లు నుంచి క్రమం తప్పక రక్తదానం చేయగలిగితే జీవితకాలంలో మొత్తం 168 సార్లు రక్తదానం చేయవచ్చు. నేను సామాజిక బాధ్యతగా ప్రతీ మూడునెలలకొకసారి రక్తదానం చేస్తుంటాను. మొదట్లో నాకు రక్తదానం చేయడం అంటే చాలా భయం వేసేది. తర్వాత నుంచి రక్తదానం చేసేందుకు ముందుకు ఉంటున్నాను. ఇప్పటివరకు మొత్తం 36 సార్లు రక్తదానం చేశాను. – శాసనపురి మధుబాబు, పాతపట్నం మధుమేహ వ్యాధిగ్రస్తులు. గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్నవారు. క్యాన్సర్ శస్త్ర చికిత్స చేయించుకున్నవారు. గుండెపోటుకు గురైనవారు. మూర్చవ్యాధి ఉన్నవారు. ఎయిడ్స్, హెపటైటిస్–బీ, హెపటైటిస్–సీ, సిఫిలిస్ లాంటి అంటువ్యాధులు ఉన్నవారు. దీర్ఘకాలిక కిడ్నీవ్యాధి ఉన్నవారు. ఆటో ఇమ్యూస్ డిజార్డర్స్ ఉన్నవారు. -
ఎచ్చెర్ల ఎమ్మెల్యేను నిలదీసిన గ్రామస్తులు
లావేరు: మండలంలోని బుడుమూరు పంచాయతీ పరిధి సెగిడిపేట గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావును మురుగు నీటి కాలువ ఏర్పాటు చేయాలని కోరుతూ ముట్టడించి నిలదీశారు. బుధవారం సెగిడిపేట వద్దనున్న జాతీయ రహదారి నుంచి కూనపువానిపేట మీదుగా ఆరంగిపేట వరకు నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించడానికి ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా తమ గ్రామంలో కాలువ విషయమై సెగిడిపేట గ్రామస్తులు నిలదీశారు. గ్రామంలో మురుగు, వరద నీరు బయటకు పోవడానికి కాలువ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఆక్రమణలను తొలగించి మురుగు, వరద నీరు బయటకు తరలిపోయే మార్గం చూపాలన్నారు. దీంతో సమస్యను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని గ్రామస్తులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్వశిక్షాభియాన్ ఏపీసీ పి.వేణుగోపాల్, ఎంపీడీవో పి.వెంకటరాజు, తహసీల్దార్ జీఎల్ఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆదుకోండయ్యా..!
● రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న యువకుడు ● ఆస్పత్రి ఖర్చుల కోసం కుటుంబ సభ్యుల ఆవేదన వజ్రపుకొత్తూరు: మండలంలోని అమలపాడు పంచాయతీ పెద అంగవానిపేటకు చెందిన అంగ ధర్మారావు రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం సాయంత్రం తన బైక్‌పై వెళ్తున్న అంగ ధర్మారావు పెద్ద మురహరిపురం గ్రామం సమీపంలోకి వెళ్లేసరికి శిథిలమైన రహదారిలో ఉన్న గోతిలో నుంచి బైక్ వెళ్లడంతో అదుపుతప్పి పడిపోయాడు. దీంతో అతని కుడి కాలికి బలమైన గాయమైంది. హుటాహుటిన స్థానికులు పలాసలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. చికిత్స చేసిన వైద్యులు కుడికాలు దెబ్బతిందని.. మెరుగైన వైద్యం కోసం వైజాగ్ తీసుకెళ్లాలని సూచించారు. అక్కడికి తీసుకెళ్లగానే వైద్యులు తక్షణమే ఆపరేషన్ చేసి కాలు తీసేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. నిరుపేద కుటుంబం కావడంతో ఆస్పత్రికి అయ్యే ఖర్చుల కోసం దాతల సహకారం కోరుతున్నారు. దాతలు కనికరించి 63097 94409 నంబర్‌ను సంప్రదించాలని కోరుతున్నారు. -
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని చాపురం పంచాయతీ సిద్ధిపేట గ్రామానికి చెందిన ఏగాటి రామారావు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇటీవల విధి నిర్వహణలో భాగంగా గ్రామంలో చెత్త సేకరణ చేస్తుండగా అదే గ్రామానికి చెందిన గొండు శిమ్మయ్యతో చెత్త తీస్తున్న విషయంలో గొడవ జరిగింది. దీంతో ఒకరుకొకరు కొట్టుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మూడు రోజులు క్రితం పంచాయితీ పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు అల్లు నర్సయ్య ఈ తగాదాలో కలుగజేసుకొని తమ పార్టీ సానుభూతిపరుడైన సిమ్మయ్య తప్పిదం ఉన్నప్పటికీ దాన్ని పక్కదారి పట్టించాడు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు రామరావుపై లేనిపోని చాడీలను మున్సిపల్ అధికారులకు చెబుతూ విధులు నుంచి తొలగిస్తామంటూ భయబ్రాంతుకు గురిచేశాడు. దీంతో మనస్థాపం చెందిన రామారావు బుధవారం సాయంత్రం ఇంట్లో ఉన్న ఫినాయిల్ తాగేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అత్యవసర చికిత్స విభాగంలో వైద్య సేవలందుతున్నాయి. దీనిపై కేసు నమోదయ్యింది. -
స్థానిక సంస్థల్లో విజయ పతాకం ఎగరేద్దాం
● పార్టీకి బద్ధులై పనిచేయడమే విజయవంతమైన పాలన ●మాజీ జెడ్పీటీసీ, ఎంపీపీల అభినందన సభలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వైఎస్సార్ సీపీ హయాంలో 2021లో జెడ్పీటీసీలు, ఎంపీపీలుగా ఎన్నికై న వారు ఐదేళ్ల పాటు ఎలాంటి మచ్చ లేకుండా పాలించారని మాజీ మంత్రి ధర్మా న ప్రసాదరావు అన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జెండా ఎగరేద్దామని ఆయన పిలుపునిచ్చారు. పదవీ కా లం పూర్తి చేసిన ఎంపీపీలు, జెడ్పీటీసీలకు మాజీ ఎంపీపీ అంబటి శ్రీనివాసరావు అధ్యక్షతన మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ శ్రీకాకుళం నియోజకవర్గంలో 1952 నుంచి 2024 వరకు సుమారు 70 ఏళ్లుగా పాలించినవారంతా నిజాయితీగా ఉన్నారని, సొంత ఆస్తు లు అమ్ముకుని పాలించి ప్రజల మన్ననలు పొందారన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్న గొండు శంకర్ ఇసుక, మట్టి, గ్రావెల్ వంటివి అమ్ముకుని కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్‌లు నేర్పించిన దోచుకో...దాచుకో అనే సిద్ధాంతాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు పాటిస్తున్నారని దుయ్యబట్టారు. కూటమి నేతల అబద్ధాలను నిజాలుగా చూపించేందుకు ఇన్ఫ్లుయెన్సర్లకు రూ.15 వేలు జీతం ఇస్తున్నారని మండిపడ్డారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఉత్తరాంధ్రకు ఒక్క చెప్పుకోదగ్గ ప్రాజెక్టు అయినా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్‌లకు కేవలం తన కులానికి చెందినవారికి లాభం చేకూర్చడమే తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు వారికి ఏ మా త్రం పట్టవన్నారు. కేంద్ర ప్రభుత్వం, విభజన కమిటీ, వైఎస్సార్సీపీ వంటి పార్టీలన్నీ అమరావతిలో రాజధాని కరెక్ట్ కాదు చిన్న వర్షం కురిసినా మునిగిపోతోందని చెప్పినా చంద్రబాబు వినలేదన్నారు. అమరావతికి వెళ్లాలంటే మనందరం ఈత నేర్చుకోవాలని, పడవలు కొనుక్కోవాలన్నా రు. ఇచ్ఛాపురం, పలాస, ఆమదాలవలస, శ్రీకాకుళం మున్సిపాలిటీల్లో 150 డివిజన్లకు ఎన్నికలు జరుగుతాయని అన్నిచోట్లా అభ్యర్థుల్ని నిలబెట్టి గెలిపిస్తే గౌరవం పెరుగుతుందన్నారు. ● పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదురైనా ప్రజల పట్ల బా ధ్యతతో తమ పదవులను నిర్వర్తించిన ఎంపీపీలు, జెడ్పీటీసీలను అభినందించారు. ప్రజా సేవలో వారు సంపాదించిన అనుభవం, ప్రదర్శించిన అంకితభావం భవిష్యత్‌లో మరింతగా ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ● జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ పిరియా విజయసాయిరాజ్ మాట్లాడుతూ తాను జెడ్పీటీసీగా మాత్రమే అనుకున్నానని, వైఎస్ జగన్మోహన్రెడ్డి దయవల్ల ఏకంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వ వచ్చాక అనేక ఇబ్బందులు పెట్టినప్పటికి వైఎస్సార్సీపీ జెడ్పీటీసీలు సభలు, సమావేశాల్లో ఉండటం దిగ్విజయంగా పదవీ కాలాన్ని పూర్తిచేసుకోగలిగానన్నారు. ● పోలాకి జెడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్య, జిల్లాపరిషత్ జిల్లా ఉపాధ్యక్షురాలు పాలిన శ్రావణి, ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, డిజిటల్ బుక్ సభ్యులు నర్తు నరేంద్రయాదవ్లతో పాటు ఎంపీపీలు, జెడ్పీటీసీలు మా ట్లాడుతూ పదవులు ముఖ్యం కాదని, పార్టీ చాలా ముఖ్యమని మా పదవుల్ని విజయవంతంగా పూర్తిచేసుకునేందుకు సహకరించిన ప్రజలందరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, పార్టీ రాష్ట్ర సీఈసీ మెంబర్ అంధవరపు సూరిబాబు, మున్సిపల్ మా జీ చైర్ పర్సన్ ఎంవీ పద్మావతి, రాష్ట్రకార్యదర్శులు, నియోజకవర్గాల పరిశీలకులు ఎన్ని ధనుంజయరావు, చల్ల రవికుమార్, పిన్నింటి సాయికుమార్, జిల్లాప్రధానకార్యదర్శి గేదెల పురుషోత్తం, డిజిటల్ బుక్ చైర్మన్ శిమ్మ రాజశేఖర్, ఉలాల దివ్యభారతి, ముత్తా విజయ్‌కుమార్, మార్పు పృథ్వీ, కోణార్క్ శ్రీను, ఎం.ఏ భేగ్, దువ్వాడ వాణి, గొండు రఘు రాం, మూకళ్ల తాతబాబు, సాధు వైకుంఠరావు, పాలిన శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ముప్పేట ఆక్రమణలు
శ్రీకాకుళంబాటలు.. ప్రాణాలతో ఆటలుగిరిజన దారులు ప్రాణాంతకంగా మారాయి. వానలు పడ్డాక రాళ్లు తేలాయి. –8లో● యథేచ్ఛగా చెరువుల కబ్జా ● కాలువలనూ వదలని టీడీపీ నాయకులు ● పట్టించుకోని అధికారులు బుధవారం శ్రీ 30 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026ఎస్ఎస్సీ పరీక్షలకు ఏర్పాట్లు శ్రీకాకుళం పాతబస్టాండ్: ఈ నెల 30 నుంచి అక్టోబరు 28 వరకు జరగనున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ప్రథమ విడత పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. డెంటల్ కాలేజీ సర్వీస్ రోడ్డు, సిద్ధిపేట అండర్ పాస్ జంక్షన్ సమీపంలో ఉన్న సహస్ర డిజిటల్ సెంటర్‌ను జిల్లాలో ఏకై క పరీక్షా కేంద్రంగా కేటాయించినట్లు వెల్లడించారు. రోజుకు మూడు విడతల్లో జరిగే ఈ పరీక్షలకు సంబంధించి మొదటి విడత ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, రెండో విడత మధ్యాహ్నం 1.30 నుండి 2.30 గంటల వరకు, మూడో విడత సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. నిర్దేశిత పరీక్ష సమయానికి గంటన్నర ముందుగా లోని కి అనుమతిస్తారు. అభ్యర్థులు నిర్దేశిత సమ యానికి ముందే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఈ పరీక్షల జిల్లా నోడల్ అధికారిగా విద్యాశాఖ సహాయ కమిషనర్ జీపీ చంద్రభూషణరావును నియమించినట్లు, కేంద్రం వద్ద నలుగురు పోలీసులతో భద్రత కల్పించి, తోపులాటలు జరగకుండా చూడాలని ఎస్పీని కోరారు. రాజీ ద్వారానే కేసులకు శాశ్వత పరిష్కారం శ్రీకాకుళం పాతబస్టాండ్: కోర్టుల్లో సుదీర్ఘంగా పేరుకుపోయిన సివిల్, క్రిమినల్ కేసులకు మధ్యవర్తిత్వం ద్వారానే త్వరితగతిన శాశ్వత పరిష్కారం లభిస్తుందని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.హరిబాబు స్పష్టం చేశారు. నల్సా, సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ, సయోధ్య ప్రాజెక్టు కమిటీ ఆదేశాల మేరకు అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు 90 రోజుల పాటు నిర్వహించనున్న ‘మీడియేషన్ ఫర్ ది నేషన్ క్యాంపెయిన్ 3.0’ ప్రత్యేక ప్రచారంపై మంగళవారం ఆయన అధ్యక్షతన న్యాయవాదులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో నిర్వహించిన మొదటి, రెండో విడత క్యాంపెయిన్లలో జిల్లా మంచి ఫలితాలు సాధించిందని, ఈ మూడో విడతలో అంతకుమించి గరిష్ట సంఖ్యలో కేసులను పరిష్కరించి శ్రీకాకుళం జిల్లాను ముందంజలో ఉంచాలని పిలుపునిచ్చారు. రాజీ విధానంలో కేసులు పరిష్కరించుకోవడం వల్ల సమయంతో పాటు ధనం ఆదా అవుతుందని, చెల్లించిన కోర్టు ఫీజు కూడా తిరిగి వస్తుందని హరిబాబు వివరించారు. వివరాలకు 15100 టోల్ ఫ్రీ నంబరును సంప్రదించాలని కోరారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నరసన్నపేట నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు బరితెగించేశారు. కళ్ల ముందు అక్రమాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఒకవైపు మందుబాబులను దోచేస్తున్నారు. మరోవైపు ఎక్కడికక్కడ ఇసుక మింగేస్తున్నారు. ఇంకోవైపు ప్రభుత్వ స్థలాలు, చెరువులు కబ్జా చేసేస్తున్నారు. తెలుగు తమ్ముళ్లు ఎక్కడా తగ్గడం లేదు. దోపిడీకి లైసెన్స్ ఇచ్చినట్టు చెలరేగిపోతున్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ చెరువులు ఆక్రమించేస్తున్నారు. దర్జాగా చదును చేసి సొమ్ము చేసుకుంటున్నారు. నియోజకవర్గ కీలక నేతల కనుసన్నల్లోనే అక్రమాలు జరుగుతున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయిన టీడీపీ నాయకులు ఎవరికి వారు దొరికిన కాడికి దోచుకుంటున్నారు. కబ్జాలకు పాల్పడుతున్నారు. జిల్లా పెద్ద నేత వర్గమంటూ కొందరు, నియోజకవర్గ పెద్ద నేత వర్గమంటూ మరికొందరు బరితెగించేసి దందాలు సాగిస్తున్నారు. మద్యం దుకాణాలన్నీ టీడీపీ నాయకుల చేతిలో ఉండటంతో క్వార్టర్ బాటిల్‌పై రూ. 20నుంచి రూ.50కు పెంచి విక్రయిస్తున్నారు. తద్వారా వచ్చే సొమ్మును పంచుకుంటున్నారు. ఇసుకను సైతం అదే విధంగా దోచేస్తున్నారు. ఎవరి పరిధిలో వారు చెలరేగిపోయి ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టి, అక్రమ రవాణా సాగిస్తున్నారు. పైసా పెట్టుబడి లేకుండా రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రభుత్వ స్థలాలు, చెరువుల ఆక్రమణలకై తే అడ్డు అదుపూ లేదు. ముఖ్యంగా చెరువులను కళ్లముందే కబ్జా చేసి, చదును చేసి అనుభవిస్తున్నారు. కొన్నిచోట్లయితే అమ్ముకుంటున్నారు. ఇటీవల రాజుల చెరువు, నరసన్న చెరువు, రాతికర్ర చెరువు, పాలకర్ర చెరువు ఆక్రమణల బాగోతం నియోజకవర్గమంతా గగ్గోలు పెడుతోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కబ్జా రాయళ్లు రెచ్చిపోయి చెరువులను ఆక్రమిస్తున్నారు. తాజాగా సత్యవరం పరిధిలోని సర్వే నంబర్ 412/4లో గల 1.55 ఎకరాల విస్తీర్ణం గల వట్టి బసవన్న చెరువును కళ్లముందే చదును చేసి, కబ్జా చేసేస్తున్నారు. జేసీబీతో చెరువును చదును చేయడమే కాకుండా ఆ చెరువుకు మురుగునీరు, వర్షపు నీరు వచ్చే డ్రైన్ మార్గాన్ని కప్పేశారు. కళ్లముందే ఇదంతా జరుగుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. పలాస–కాశీబుగ్గ ప్రాంతంలో గంజాయి గుప్పుమంటోంది. రెండు వారాల కిందట పర్లాఖిముండి నుంచి విజయవాడకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్న ఇద్దరిని పట్టుకున్న పోలీసులు, మంగళవారం ఓ మహిళ నుంచి 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పలాస రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాయి. ఆ సమయంలో రెండో నంబరు ప్లా ట్ ఫారంలో ఓ మహిళ అనుమానాస్పదంగా సంచరించడాన్ని పోలీసులు గమనించారు. ఆమెను అదుపులోకి తీసుకుని, రెండు బ్యాగులను తనిఖీ చేయగా 11 కిలోల గంజాయి బయటపడింది. గంజాయి కలిగిన మహిళను పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన నౌబహార్ బీబీ (34)గా గుర్తించారు. రైల్వే ఎస్ఐ దుంపల శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. – కాశీబుగ్గ వరద తగ్గింది.. బురద మిగిలింది బూర్జ మండలంలో ఇటీవల తుఫాన్ తాకిడికి నాగావళి ఉగ్రరూపం దాల్చి చేలు నీటమునిగిన విషం తెలిసిందే. నీరు తగ్గినప్పటికి వరి చేలుపైన ఏటి బురద మట్టి పట్టడంతో వరి పంట కుళ్లిపోతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. – బూర్జ నరసన్నపేట మండలం సత్యవరం రెవెన్యూ పరిధిలోని 412/4లో గల వట్టి బసవన్న చెరువును జేసీబీ ద్వారా పట్టపగలు చదును చేస్తున్న దృశ్యమిది. ఎకరా 55 సెంట్లు విస్తీర్ణం గల ఈ చెరువు ప్రభుత్వ రికార్డుల్లో ప్రభుత్వ పోరంబోకుగా ఉంది. అయినప్పటికీ అక్రమంగా చదును చేసి, ఆక్రమిస్తున్నారు. నరసన్నపేట టౌన్ నుంచి వట్టి బసవన్న చెరువుకు వెళ్లేందుకు నిర్మించిన డ్రైన్‌ను అక్రమంగా కప్పేసిన దృశ్యమిది. టౌన్‌కు చెందిన వర్షపు నీరు, మురుగు నీరు వెళ్లేందుకు రూ. 30లక్షలతో ప్రత్యేక డ్రైన్ నిర్మించారు. ఈ డ్రైన్ ద్వారా చెరువులోకి మురుగు నీరు, వర్షపు నీరు వెళ్తుంది. దీనికి ప్రస్తుతం కప్పేయడంతో వర్షం పడితే డ్రైన్లో నీరు వెళ్లే పరిస్థితి ఉండదు. ఫలితంగా నరసన్నపేట టౌన్ మరింత ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. -
● నాన్నకు ప్రేమతో..
ఈ సెల్యూట్.. వేల ఉద్వేగాలకు ప్రతిరూపం. ఈ పలకరింపు.. ఏళ్ల శ్రమకు ప్రతిఫలం. కల నెరవేరిన సమయాన ఓ తండ్రి కన్నబిడ్డ ఎదురుగా తన భావోద్వేగాన్ని ప్రదర్శించారు. బిడ్డకు కూడా ఖాకీ యూనిఫారం వేసి ‘నేను విజయం సాధించాను’ అని సెల్యూట్ చేస్తూ చెమర్చిన కళ్లతో చెప్పారు. పోలీస్ పాసింగ్ అవుట్ పరేడ్‌లోని దృశ్యమిది.–సాక్షి ఫొటో గ్రాఫర్, శ్రీకాకుళం -
కొట్లాటపై కేసు నమోదు
కంచిలి: ఎస్.ఆర్.సి.పురంలో సోమవారం రాత్రి కొట్లాట జరిగింది. గ్రామానికి చెందిన పాలిన కోదండరావు, సోదరుడు ధనుంజయ్‌పై అదే గ్రామానికి చెందిన డొక్కర బలరాం తదితరులు దాడిచేసి గాయపరిచినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ పి.పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉపాధి వేతనదారుడు మృతి టెక్కలి రూరల్: సంతబొమ్మాళికి చెందిన జి.బికారి(55) గ్రామ సమీపంలోని కొండ వద్ద ఉపాధి పనులు చేస్తుండగా మస్టర్ వేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన ఏపీఓ మూర్తి తోటి వేతనదారులు సహాయంతో హుటాహుటిన కోటబొమ్మాళి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మహిళపై దాడి టెక్కలి రూరల్: కొండభీంపురం గ్రామంలో ఓ మహిళపై పొరిగింటి వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. బాధితుల కథనం మేరకు..తోనంగి విజయలక్ష్మి తన ఇంట్లో భోజనం చేశాక మిగిలిన వ్యర్థ పదార్థాలను ఇంటి వెనకభాగం పారబోసింది. ఈ విషయమై ప్రశ్నిస్తూ పాత ఆస్తి గొడవల కక్షతో పక్కింటి వారు మహిళ తలపై కత్తితో దాడిచేశారు. ఈ ఘటనలో ఆమె భర్త పోలయ్యకు సైతం గాయాలయ్యాయి. బాధితులను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరించారు. కూలీ రేట్లు పెంచాలని వినతి ఎచ్చెర్ల : పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా ఎచ్చెర్ల డిపోలో పనిచేస్తున్న హమాలీలకు ప్రస్తుతం ఉన్న ఎగుమతి కూలీ రేటు పెంచాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ ఎచ్చెర్ల హమాలీల యూనియన్ నాయకులు డి.బంగార్రాజు, టి.రామారావు డిమాండ్‌చేశారు. ఈ మేరకు ఎచ్చెర్ల డిపో మేనేజర్ కె.జయసింహా చౌదరికి మంగళవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బేవరేజ్ డిపోల్లో పనిచేస్తున్న హమాలీలు ఎగుమతి పనులు నిర్వహిస్తూ లైసెన్స్‌దారులకు సేవలు అందిస్తున్నారని చెప్పా రు. ఎగుమతి కూలీ రెండేళ్లకోసారి పెంచాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో ఎన్.శ్రీను, ఎన్.రమణ, ఎల్.రాము, సీతారాం పాల్గొన్నారు. ఐతం స్టార్టప్‌కు డీపీఐఐటీ గుర్తింపు టెక్కలి: సేంద్రియ వ్యవసాయానికి సాంకేతికతను జోడిస్తూ రైతులకు ఉపయోగకరంగా ఉండేలా టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు పాత్రుని వేణుగోపాలరావు, కొల్లి సందీప్‌కుమార్‌లు రూపకల్పన చేసిన బయోసిప్లెన్ స్టార్టప్‌కు కేంద్ర ప్రభుత్వం పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం నుంచి గుర్తింపు లభించింది. ఈ మేరకు మంగళవారం కళాశాల డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గుర్తింపు పత్రంతో విద్యార్థులను అభినందించారు. నేల సారాన్ని కాపాడుకోవడం, పెట్టుబడి వ్యయం తగ్గించడంలో సాంకేతిక పరిష్కార మార్గాన్ని చూపుతూ ఈ స్టార్టప్‌ను రూపొందించారు. కార్యక్రమంలో ఐతం రైజ్ సీఈఓ బి.మనోజ్‌కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
బడిలో బెదిరింపుల పర్వం
దారుణం ఎస్ఎంసీ ఎన్నికల్లో నాకు 5 ఓట్లు పడ్డాయి. ఇతరులకు 7 ఓట్లు పడ్డాయి. నేను ప్రమాణ స్వీకారం కూడా చేశాను. కానీ మధ్యాహ్నం అయ్యేసరికి ఎన్నిక వాయిదా పడిందని హెచ్ఎం తెలిపారు. నేను సంతకం చేసిన ఎస్ ఎంసీ పత్రం అడిగినా ఇవ్వలేదు. ఇది దారుణం. – మజ్జి పాపారావు, అంబుగాం జెడ్పీహెచ్ఎస్లో ఎస్ఎంసీ చైర్మన్‌గా గెలిచిన వ్యక్తి ఉదయం నుంచి నిరీక్షించాం పాఠశాలలో ఎస్ఎంసీ ఎన్నికలు అని చెబితే వచ్చాం. ఉదయం 7 గంటల నుంచి నిరీక్షించాం. నాతో పాటు సుమారు 18 మంది సభ్యులు కోరం సభ్యులుగా ఉన్నప్పటికీ ఎన్నికలు నిర్వహించలేదు. చివరకు వాయిదా వేసేశారు. – వి.దాసునాయుడు, విద్యార్థి తండ్రి, దంత గ్రామం, కోటబొమ్మాళి మండలం టీడీపీ ప్రభుత్వంపైన, స్థానిక ఎమ్మెల్యేపైన ఎంత వ్యతిరేకత ఉందో తెలియజేసే సాక్ష్యమిది. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సొంత మండలమైన పొందూరు మండలం కోటిపల్లి, మజ్జిలిపేట స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలను విద్యార్థుల తల్లిదండ్రులు బహిష్కరించారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ గెలిచి రెండున్నర సంవత్సరాలైనా పాఠశాల అభివృద్ధిని గాని, గ్రామ అభివృద్ధిని గాని పట్టించుకోలేదని వీరంతా ఎన్నికలను బహిష్కరించారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ అడ్డదారులు తొక్కింది. ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనబడటంతో అధికార యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకుని, బెదిరింపులతో గెలవాలని చూసింది. అయినప్పటికీ చాలా చోట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురుతిరిగారు. ఎంత భయపెట్టినా వెరవకుండా వైఎస్సార్సీపీ మద్దతుదారులను గెలిపించారు. ఎన్ని చేసినా గెలవలేకపోతున్నామన్న అక్కసుతో అధికారులపై టీడీపీ నాయకులు ఒత్తిడి చేసి, ఎన్నికలను రద్దు చేయడం, వాయిదా వేయించడం వంటివి చేశారు. రాజకీయాలకు సంబంధం లేని ఎస్ఎంసీ ఎన్నికలను సైతం టీడీపీ నాయకుల సాధారణ ఎన్నికల మాదిరిగానే తీసుకున్నారు. కానీ వారి కుయుక్తులను విద్యార్థుల తల్లిదండ్రులు తిప్పికొట్టారు. తమకు కావాల్సిన వారిని గెలిపించుకున్నారు. ఇంత ఉద్రిక్తలు, భయాందోళనలు, బెదిరింపుల మధ్య వైఎస్సార్సీపీ మద్దతుదారులు గెలిచారంటే అధికార పార్టీపై ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమైంది. ఆఖరికి చేసేదేమీ లేక టీడీపీ నాయకులు గెలిచిన వాళ్లను తమవాళ్లే అని చెప్పుకోవాల్సి వచ్చింది. దాదాపు ఎన్నికలన్నీ ఆ పార్టీ నాయకుల సమక్షంలోనే జరిగాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడు సొంత మండలం కోటబొమ్మాళి మండలం మాసాహెచ్పేట పంచాయతీ పరిధిలోని కమలనాభపురం ప్రాధమిక పాఠశాల మేనేజ్మెంట్ కమి టీకిజరిగిన ఎన్నికల్లో టీడీపీమద్దతుదారుడికి ఒక్కరూ ఓటు వేయలేదు. పాఠశాలలో 8 ఓట్లకు గాను వైఎస్సార్సీపీ మద్దతుదారు బగాది ఉషాకి సభ్యులంతా మద్దతు పలికారు. అధికార పార్టీకి చెందిన మద్దతుదారు బర్ల రాముకు ఒక్కరూ మద్దతు పలకలేదు. టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి మండలం దంత ప్రాథమికోన్నత పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు అధికార దర్పం ప్రదర్శించారు. 30 మంది ఓటర్లకు గాను 19మంది ఓటర్లు వైఎస్సార్ సీపీ మద్దతుదారులుగా ఉండటంతో టీడీపీ ఏకగ్రీవ ప్రయత్నాలు సాగలేదు. ఒత్తిళ్లు, బెదిరింపులకు దిగినప్పటికీ లెక్క చేయలేదు. ఎలాగైనా ఏకగ్రీవం చేసుకుందామని కుట్రలు పన్నినా పారకపోవడంతో అధికారుల ద్వారా చివరికీ వాయిదా వేయించారు. కొర్లకోట గ్రామంలో పోస్ట్ మాస్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సనపల అప్పలనాయుడు అనే వ్యక్తి, విధి నిర్వహణలో ఉన్న సమయంలోనే నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలకు చేరుకున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. మైక్ పట్టుకుని ఎవరు ఏం చేయాలో ఆదేశించారని ఆరోపించారు. సారవకోట మండలంలోని సారవకోట, అలుదు, చిన్నకిట్టాలపాడు పాఠశాలల్లో టీడీపీ నాయకులు తరగతి గదుల్లోనే తిష్ట వేసుకుని కూర్చున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో బయటకు వెళ్లారు. మందస మండలం పొత్తంగిలో ఫలితాలు తమకు అనుకూలంగారాలేదని ఎన్నికను వాయిదావేశారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కోటబొమ్మాళి మండలం నీలంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తాము అనుకున్నది జరగలేదని అధికార పార్టీ మద్దతుదారులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఏకంగా తీర్మానం పుస్తకాలను చించివేసి రణరంగం సృష్టించారు. అయితే పోలీసులు చేరుకున్నప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. చివరకు ఎన్నికను వాయిదా వేశారు. మందస మండలం అంబుగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మజ్జి పాపారావు చైర్మన్‌గా ఎంపికయ్యారు. ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. కానీ మధ్యాహ్నం దాటాక హెచ్ఎం వచ్చి ఎన్నిక వాయిదా పడిందని చెప్పారు. కూటమి నాయకులు గెలవలేదని కుట్రతో ఎన్నిక రద్దు చేశారని చైర్మన్ పాపారావు తెలిపారు. ఎస్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ పిల్లిమొగ్గలు గెలుపు కోసం అడ్డదారులు స్కూల్ ఎన్నికల్లోనూ బెదిరింపులు, ప్రలోభాలు గెలవని చోట అధికార జులుం -
రైతు భూమిపై బీజేపీ నేత కన్ను
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో తమ్మినేని చల్లన్న అనే రైతుకు చెందిన 75 సెంట్ల భూమిపై బీజేపీ నేత కన్ను పడిందని మాజీ డీజీపీ, సీఎఫ్ఎల్(సెంటర్ ఫర్ లిబర్టీ) చైర్మన్ ఏబీ వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. ఎప్పుడో 45 ఏళ్ల కిందట తమ్మినేని చల్లన్న అనే వ్యక్తికి ప్రభుత్వం ఇచ్చిన డీపట్టా భూమిలో రాత్రికి రాత్రి గ్రావెల్ వేశారని ఆయన మనవడు తమ్మినేని అజయ్, మిగతా కుటుంబ వారసులు జిల్లా కలెక్టర్‌కు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేస్తే.. విచారణకు వచ్చిన ఎచ్చెర్ల తహసీల్దారు ‘భూమి ఎవరికో మీరు అమ్మేశారు.. ప్రభుత్వం అందుచేత తిరిగి తీసుకుంటుంది’ అని చెప్పి తప్పుడు నోటీసులు పంపడం దారుణమన్నారు. ఎచ్చెర్ల మండలం కింతలిమిల్లు జంక్షన్ సమీప ఎన్‌హెచ్–16 సర్వీసు రోడ్డును ఆనుకుని ఉన్న 75 సెంట్ల డీపట్టా స్థలం వద్ద రైతు తమ్మినేని చల్లన్న తరఫున మాజీ డీజీపీ వెంకటేశ్వర్లు మీడియాతో మంగళవారం సాయంత్రం మాట్లాడారు. హైవేను ఆనుకుని ఉన్న స్థలం కావడంతో బీజేపీ నేత కన్ను పడిందని, స్థానిక ఎమ్మెల్యే అండదండలతో రెవెన్యూ, పోలీస్ విభాగాలను అడ్డం పెట్టుకుని ఏకంగా చంపేస్తామని రైతు కుటుంబ సభ్యులను బెదిరించే స్థితికి వచ్చారంటే కూటమి ప్రభుత్వం, స్థానిక బీజేపీ నేతలు, ఎమ్మెల్యే ఎంతకు తెగించారో స్పష్టమవుతుందని ఆయన అన్నారు. ఇంత అన్యాయం జరుగుతుంటే అధికారులు, పాలకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తమ భూమిలో గ్రావెల్ వేశారని రైతు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే.. తిరిగి ఎమ్మార్వో వారికి నోటీసులు ఇచ్చారని, ఆ నోటీసులో అన్నీ తప్పులే ఉన్నాయని తెలిపారు. అనంతరం ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి రైతు కుటుంబీకులకు ప్రాణహాని నేపథ్యంలో రక్షణ కల్పించాలంటూ ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు సీఎఫ్ఐ ప్రెసిడెంట్ నల్లమోటు చక్రవర్తి, డైరెక్టర్ అజయ్ మల్లారెడ్డి, డైరెక్టర్ ఎం.జితేంద్ర, ఎద్దుల పుల్లయ్య, సురేష్ ఉన్నారు. -
బ్బులిస్తాం ప్పు కొట్టండహో..
నిరుద్యోగులు భృతి అడిగితే నో మనీ.. 50 ఏళ్లు దాటిన వారు పింఛన్లు అడిగితే నో మనీ.. మహిళలు ఆడబిడ్డ నిధి అడిగితే నో మనీ.. వలంటీర్లను నియమించమంటే నో మనీ.. కానీ డప్పు కొట్టించుకోవడానికి మాత్రం ప్రభుత్వం దగ్గర దండిగా డబ్బులుంటాయి. ప్రభుత్వాన్ని తెగ పొగిడేందుకు సర్కారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు జీతాలు ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ మేరకు ప్రతిపాదన కూడా చేసింది. దీనిపై అన్ని వర్గాల వారూ మండిపడుతున్నారు. –ఎల్.ఎన్.పేటరాజకీయ ప్రచారానికి ప్రజల సొమ్మా..?సేవ చేస్తున్న వలంటీర్లకు రూ.5వేలు వేతనం ఇస్తే ప్రజాధనం దుర్వినియోగం అన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు ప్రజాధనంతో ప్రోత్సాహకాలు ఇస్తామంటున్నారు. రాజకీయ ప్రచారానికి ప్రభుత్వ సొమ్ము వినియోగించడం సరికాదు. – దుర్గాసి భాస్కరరెడ్డి, మాజీ వలంటీర్, మశాఖపురం, ఇచ్చాపురం మండలం హామీ మరిచారు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు వలంటీర్లకు రూ.10వేలు జీతం ఇస్తామని చెప్పింది. కానీ మర్చిపోయింది. అధికారం దక్కాక వలంటీర్ల ఊసెత్తడమే మానేసింది. ఇప్పుడు ప్రచారం కోసం ఇన్ఫ్లుయెన్సర్లకు జీతాలిస్తామంటోంది. – బోసి దుర్గయ్య, మాజీ వలంటీర్ -
ఉత్సాహంగా పోలీస్ పాసింగ్ అవుట్ పరేడ్
శ్రీకాకుళం రూరల్: నూతనంగా ఎంపికై న పోలీసు కానిస్టేబుళ్లు రాజ్యాంగానికి విధేయులుగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపు నిచ్చారు. జిల్లాలోని తండేవలసలో గల జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో 142 మంది సివిల్ పోలీసు కానిస్టేబుల్స్ (2025–26 6వబ్యాచ్) ప్రాథమిక శిక్షణ ముగించుకొని మంగళవారం నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్ (దీక్షాంత్ పరేడ్) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముందుగా మంత్రి గౌరవవందనం స్వీరించగా, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరెడ్డిలతో కలిసి కవాతును పరిశీలించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌పుండ్కర్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని చట్టపరిధిలో తక్షణం స్పందించాలన్నారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ 9నెలలు పాటు కఠిన శిక్షణ పొందిన 142 మంది క్యాడెట్లు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారన్నారు. ఉన్నత విద్యార్హతలు కలిగి ఈ బ్యాచ్ సభ్యులు సీసీటిఎన్ఎస్తో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నేర దర్యాప్తులో రాణించాలని కోరారు. -
బస్ షెల్టర్ స్థలం కబ్జా
● నిర్మాణానికి సిద్ధమైన టీడీపీ నాయకుడు ● రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, స్థానికులు టెక్కలి : డివిజన్ కేంద్రమైన టెక్కలి బ్రాహ్మణవీధి జంక్షన్లో పాత జాతీయ రహదారికి ఆనుకుని దశాబ్దాలుగా ఉన్న బస్ షెల్టర్ స్థలాన్ని టీడీపీ నాయకుడు కబ్జా చేశాడు. ఆ స్థలంలో నిర్మాణ పనులు చేయడానికి మంగళవారం సిద్ధం కాగా ఆ ప్రాంతానికి చెందిన స్థానికులతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. తక్షణమే బస్ షెల్టర్ స్థలం కబ్జాను ఆపాలని ఆర్డీఓతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్నేళ్ల క్రితం షెల్టర్ శిథిలావస్థకు చేరుకోగా ఆ స్థలంలో మరళా బస్ షెల్టర్ నిర్మాణం చేయాలని స్థానికులు గతంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఇంతలో ఆ స్థలంపై అధికార టీడీపీకి చెందిన ఓ నాయకుడి కన్ను పడింది. దీంతో ఆ ప్రాంతానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు నర్సింగ్నాథ్ సాబతో, బర్ల కార్తీక్, ప్రసాద్ ప్రధానో, స్థానికులు డి.గిరి, కె.శ్రీను, కె.శంకర్, శివపండా తదితరులు నిర్మాణం పనులను అడ్డుకున్నారు. అధికారులు స్పందించి ఇప్పటికై నా కబ్జా ప్రయత్నాలు ఆపకపోతే స్థానికంగా నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. -
10 నుంచి జూనియర్ రెడ్‌క్రాస్ శిక్షణ
శ్రీకాకుళం కల్చరల్: విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించి భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి రాష్ట్రస్థాయి జూనియర్ రెడ్‌క్రాస్ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ పి.జగన్మోహన్రావు అన్నారు. అక్టోబర్ 10 నుంచి 12 వరకు చిలకపాలెంలోని శ్రీశివానీ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి జూనియర్ క్రాస్ శిక్షణ, లెర్నింగ్ కార్యక్రమంపై మంగళవారం జిల్లా రెడ్‌క్రాస్ పరిపాలన భవనంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. షెడ్యూల్, నిపుణుల ఎంపిక, వసతి, రవాణా, ఇతర ప్రాథమిక వసతుల కల్పనకై చర్చించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ డాక్టర్ కె.సుధీర్, కోశాధికారి కె.దుర్గ శ్రీనివాస్, కార్యదర్శి బి.మల్లేశ్వరరావు, పాలకవర్గ సభ్యులు బి.చిన్మయ్రావు, పి.శ్రీకాంత్, నిక్కు అప్పన్న, నూక సన్యాసిరావు, పి.వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. -
బాటలు.. ప్రాణాలతో ఆటలు
● వర్షాలకు దారుణంగా తయారైన రహదారులు ● కనీసం అంబులెన్స్‌లు వెళ్లక నరకయాతన మెళియాపుట్టి: కొండ దారులకు వాన దేవుడు శాపం పెట్టినట్టు ఉన్నాడు. ఇటీవల కురిసిన వానలకు మెళియాపుట్టి మండలంలోని గిరిజన గ్రామాల రహదారులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ముఖ్యంగా ఆంపురం నుంచి ఎగువరింపి గ్రామం వరకు 2 కిలోమీటర్ల రహదారి రూ.1.72 కోట్ల నిధులతో పనులు ప్రారంభించారు. అయితే కాంట్రాక్టర్ బోర వెంకట ప్రసాద్ మట్టి తవ్వి మెటల్ వేసి విడిచిపెట్టారు. వర్షాలు పడిన ప్రతి సారి జేసీబీతో చదును చేసి విడిచి పెట్టేస్తున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ రహదారి బురద, గుంతలతో రాకపోకలకు వీలుకాకుండా తయారైంది. ● చింతల పోలూరు నుంచి అచ్చనాపురం వెళ్లే రహదారికి (5 బిట్లు) రూ.సుమారు 5కోట్లతో పనులు మంజూరయ్యాయి. మెటల్ వేసి విడిచి పెట్టారు. ప్రస్తుతం రహదారి కాలువను తలపిస్తోంది. ● చప్టా కొట్టుకుపోవడంతో డేగల పోలూరు గ్రామానికి రాకపోకలకు గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఆ గ్రామానికి చెందిన ఓ మహిళ శనివారం రాత్రి అస్వస్థకు గురైంది. 108 కు ఫోన్ చేశామని వాహనం గ్రామానికి రాలేకపోవడంతో మోసుకుంటూ ఆస్పత్రికి తరలించామని గ్రామస్తులు చెబుతున్నారు. ఆదివారం స్థానికులు మెటల్ వేసి కాలినడకకు ఉపయోగించే విధంగా రహదారికి మరమ్మతులు చేశారు. -
విద్యార్థుల సమస్యలపై ‘స్కూల్ బచావో’ ఉద్యమం
శ్రీకాకుళం: విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతర పోరాటాలు నిర్వహిస్తామని ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా అధ్యక్షుడు ఆదర్శ్ ఎం.సాజీ అన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీకాకుళం నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో ‘జెన్–జెడ్ సెమినార్’ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డి.చందు అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాజీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ‘స్కూల్ బచావో’ ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామమోహన్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై భవిష్యత్తులో మరింత కేంద్రీకృతంగా పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఇటీవల టెక్కలి మండలం రావివలస సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో నలుగురు ఇంటర్మీడియట్ విద్యార్థులు మృతి చెందడం తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి.ఖగేష్, బాలికల కన్వీనర్ పి.దివ్య, జిల్లా కమిటీ సభ్యులు మురళి, జగన్, దివాకర్, వందన, కీర్తి, ధరణి, పార్ధు, హేమంత్, కార్తీక్, అజిత్ పాల్గొన్నారు. -
యువకుడు అనుమానాస్పద మృతి
నరసన్నపేట: స్థానిక పచూరి కాలనీలో నివాసముంటున్న గరికి అనిల్‌కుమార్ (34) అనుమానాస్పదంగా మంగళవారం వేకువజామున మృతి చెందాడు. ఇళ్లరికం వచ్చిన అనిల్‌కుమార్ భార్య పార్వతితో కలిసి పచూరికాలనీలో నివాసముంటున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో నిద్రపోయిన అనిల్ రాత్రి వరకూ లేవకపోవడంతో భార్య గమనించి స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారాన్ని శ్రీకాకుళం రెడ్డికివీధిలో ఉంటున్న తల్లి గరికి లక్ష్మికి తెలియజేయగా ఆమె వచ్చి కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా తల్లి మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న కుమారుడు ఒక్కసారిగా చనిపోవడం ఏంటని ఆందోళన చెందారు. కోరుకున్న అమ్మాయితో వివాహం చేశానని, పెళ్లయిన ఏడాది వరకూ అందరం కలిసే ఉన్నామని, తరువాత భార్య ఇంటికి వచ్చేశాడని తెలిపింది. నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడని, ఇంతలో అనిల్ చనిపోవడం దారుణమని వాపోయింది. పోస్టుమార్టం చేసేందుకు అవస్థలు.. అనిల్‌కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక షెడ్ వద్దకు తీసుకురాగా పీఎం చేసే సిబ్బంది, బంధువులు అవస్థలు పడ్డారు. రోడ్డంతా బురదమయంగా మారడంతో దూరంలోనే అంబులెన్స్ నిలిపి షెడ్ వరకూ మృతదేహాన్ని మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వీసీగా వైకుంఠరావు సారవకోట : స్థానిక వండానవలసకు చెందిన వెలమల వైకుంఠరావు తిరుపతిలోని ప్రతిష్టాత్మక శ్రీవేంకటేశ్వరా పశువైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమితులయ్యారు. దీంతో స్వగ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 1993లో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన వైకుంఠరావు పాడి రైతులకు విశేష సేవలు అందించారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పశు వైద్యాధికారిగా అవార్డు పొందారు. -
విషాదాలకు వంతెన..!
శ్రీకాకుళం క్రైమ్: శ్రీకాకుళం జిల్లాకేంద్రంలోని డే అండ్ నైట్ కూడలి సమీప నాగావళి నది వంతెన వరుస విషాదాలకు వేదికవుతోంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ముగ్గురు వ్యక్తులు వంతెన పైనుంచి దూకడం స్థానికంగా కలకలం రేపుతోంది. నది పరవళ్లు వీక్షిస్తున్న స్థానికులు చూస్తుండగానే ఒక వృద్ధురాలు సోమవారం నదిలోకి దూకి గల్లంతయ్యింది. ఇటీవల గల్లంతైన వారి కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మద్యం సేవించిన మత్తులో ఉండడం, కొందరి మానసిక స్థితి, ఆందోళనలే నదిలో దూకేందుకు ప్రేరేపిస్తున్నాయని పోలీసులు భావిస్తున్నారు. అనారోగ్య కారణంతోనే..? జిల్లాకేంద్రంలోని ఫాజుల్‌బేగ్‌పేటకు చెందిన కొమ్మనాపల్లి భారతి అనారోగ్య కారణాలతో నడుచుకుంటూ వచ్చి నదిలో దూకేసినట్లు రెండో పట్టణ పోలీసులు పేర్కొన్నారు. ఈమె భర్త కొమ్మనాపల్లి నాగరాజు కర్రీ పాయింట్లో పనిచేస్తుండగా.. ఈమె ఇంటివద్దనే ఉంటుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడున్నారు. అందరికీ వివాహాలయ్యాయి. కొడుకు మెడికల్ రిప్రెజింటేటివ్ కాగా.. కోడలు పైడిభీమవరంలో పనిచేస్తుంది. బీపీ, షుగర్, కీళ్లనొప్పులు ఉన్న భారతి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం విధులు నుంచి రాగానే హాస్పిటల్‌కు వెళ్దామని భర్త నాగరాజుకు చెప్పారు. ఈలోగా ఏం నిశ్చయించుకుందో ఏమో.. సాయంత్రం కిమ్స్‌కు నడుచుకుంటూ వెళ్లే యత్నంలో మార్గమధ్యలో డేఅండ్‌నైట్ వంతెన పైనుంచి అక్కడ ఉన్నవారు చూస్తుండగానే అకస్మాత్తుగా దూకేసింది. దీనిపై మిస్సింగ్ కేసుగా రెండో పట్టణ ఎస్ఐ బొడ్డేపల్లి హైమావతి కేసు నమోదు చేశారు. జల్లెడ పడుతున్న బృందాలు గల్లంతైన వారి ఆచూకీ కోసం 4 రోజులుగా ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, మరోవైపు ఒకటో, రెండో పట్టణ, రూరల్, గార పోలీసులు గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఏడీఎఫ్‌వో శ్రీనుబాబు ఆదేశాలతో రెస్క్యూ బోట్లలో నదీతీర ప్రాంతాలతో పాటు గణగళ్లవానిపేట సముద్రం వైపు బృందాలు వెళ్లాయి. ఈనెల 25, 27 తేదీల్లో గల్లంతైన గుజరాతీపేట వేంకటేశ్వరనగర్కు చెందిన దువ్వు మోహనరావు, పెద్ద రెల్లివీధికి చెందిన మాడుగుల షణ్ముఖశ్రీను (36)ల కోసం రెస్క్యూ బోట్లలో సిబ్బంది సోమవారం ఉదయం కల్లేపల్లి బీచ్ నుంచి వెదకడం ఆరంభించారు. వీరితో పాటు షణ్ముఖశ్రీను బంధువులు సైతం మరో బోట్లో వెళ్లారు. సాయంత్రం వరకు అలా వెదుకుతుండగా డేఅండ్‌నైట్ వంతెన పైనుంచి యువతి దూకినట్లు సమాచారం రావడంతో సిబ్బంది వెనుదిరిగారు. అప్పటికే ఆమె ప్రవాహంలో కొట్టుకుపోయింది. షణ్ముఖ శ్రీను మృతదేహం గుర్తింపు ఈ క్రమంలో షణ్ముఖ శ్రీను బంధువులు పొన్నాడ వంతెన సమీప లంకదిబ్బ వైపు ఒక మృతదేహం తేలియాడినట్లు కనిపిస్తుందని చెప్పడంతో సిబ్బంది బోట్‌పై వెళ్లారు. నీటి ప్రవాహం తక్కువ వున్న వైపు సిబ్బంది, శ్రీను బంధువులు ఈదుకుంటూ వెళ్లి మృతదేహం వద్దకు చేరి ఆ మృతదేహం షణ్ముఖ శ్రీనుదిగా గుర్తించి సమీప డచ్‌బంగ్లా వైపు తీసుకొచ్చారు. దీనిపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. నాగావళి వంతెన పైనుంచి దూకి వృద్ధురాలు గల్లంతు వరుసగా 4 రోజుల్లో 3 ఘటనలు గాలింపు చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, పోలీసు బృందాలు ఒకరి మృతదేహం లభ్యం -
అగ్నిమాపక కేంద్రం నూతన భవనం ప్రారంభం
సోంపేట: పట్టణంలోని అగ్నిమాపక కేంద్రానికి నూతనంగా నిర్మించిన భవనాన్ని జిల్లా అగ్నిమాపక అధికారి జె.మోహనరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హోం మంత్రి వి.అనిత విజయనగరం జిల్లా అగ్నిమాపక అధికారి కార్యాలయం నుంచి సోంపేట అగ్నిమాపక కేంద్రం నూతన భవనాన్ని వర్చువల్‌గా ప్రారంభించినట్లు పేర్కొన్నారు. భవన నిర్మాణం పూర్తి కావడంతో సిబ్బందికి ఇబ్బందులు తప్పాయన్నారు. ఈ ప్రాంతంలోని ప్రజలకు సోంపేట అగ్నిమాపక శాఖ సిబ్బంది పూర్తిస్థాయి సేవలు అందిస్తున్నారని తెలిపారు. పలాస, సోంపేట అగ్నిమాపక శాఖాధికారులు సోమేశ్వరరావు, సూర్యారావు, సోంపేట, ఇచ్ఛాపురం, పలాస అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. -
సర్వర్ డౌన్...!
● నిత్యం నిలిచిపోతున్న భూ రిజిస్ట్రేషన్లు ● అవస్థలు పడుతున్న క్రయ, విక్రయదారులు ఆమదాలవలస రూరల్: రిజిస్ట్రేషన్ల శాఖకు గడ్డుకాలం పట్టింది. ప్రభుత్వానికి అత్యంత లాభాలు తెచ్చిపెడుతున్న శాఖలో సర్వర్లు నిత్యం మొరాయిస్తుండడంతో ఆమదాలవలస సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే కాకుండా.. జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోతున్నాయి. ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు. శనివారం ఉదయం నుంచి సర్వర్ల సమస్య ఉండడంతో భూ క్రయ, విక్రయాలకు సంబంధించి ఎటువంటి రిజిస్ట్రేషన్లు కూడా అవ్వలేదు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలోనూ సర్వర్లు పనిచేయపోవడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏమాత్రం ముందుకు సాగక క్రయ, విక్రయదారులు నానా అవస్థలు పడ్డారు. మొత్తంమీద ప్రభుత్వానికి ఆదాయం వచ్చే రిజిస్ట్రేషన్ శాఖపై దృష్టి సారించకపోవడంతో ఇబ్బందులు నిత్యకృత్యమయ్యాయి. అక్రమ ఇసుక రవాణాపై పెట్టిన దృష్టి, రిజిస్ట్రేషన్లపై కూటమి ప్రభుత్వం పెట్టడం లేదని పలువురు మండిపడుతున్నారు. ప్రతిరోజూ ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనే విషయం ఆన్లైన్లో చూపుతుందని, అయితే ఈ విషయం ప్రభుత్వ పెద్దల కళ్లకు కనిపించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా రిజిస్ట్రేషన్ల శాఖపై ప్రభుత్వం దృష్టిసారించాలని కోరుతున్నారు. -
కృత్రిమ వేషం
కమీషన్ల కోసం.. కాశీబుగ్గ : జంట పట్టణాల్లో కమీషన్ల పర్వం కొనసాగుతోంది. సామాన్యులకు అత్యంత అవసరమైన నోటరీ, అఫిడవిట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే ప్రజలకు పలాస–కాశీబుగ్గలో కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందుబాటులో ఉండాల్సిన రూ.10, రూ. 20ల విలువ చేసే ఇ–స్టాంపులు ప్రస్తుతం అందుబాటులో లేవు. ఓ రకంగా చెప్పాలంటే విక్రయదారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అదనుగా భావించి సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. కేవలం రూ.10, రూ. 20 ఖర్చుతో సరిపెట్టాల్సిన చోట రూ. 50, రూ. 100ల విలువైన స్టాంపులను అధిక ధరలకు అంటగడుతూ దోపిడీకి పాల్పడుతున్నారు. కమీషన్లే పరమావధిగా.. ఇ– స్టాంపుల కృత్రిమ కొరత వెనుక పెద్ద తంతే నడుస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రూ.10, రూ. 20 స్టాంపులను అమ్మితే కమీషన్ తక్కువ వస్తుందని వెండర్లు వాటి జోలికి పోవడం లేదు. అదే అధిక విలువ కలిగిన రూ. 50, రూ. 100 స్టాంపులను విక్రయిస్తే ఎక్కువ లాభం ఆర్జించవచ్చనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. పైగా రూ. 50ల స్టాంపును రూ. 70లకు, రూ. 100 స్టాంపును రూ. 120కు అంటగడుతున్నారు. ఇ–స్టాంపులొచ్చినా.. గతంలో మాన్యువల్ స్టాంపు పేపర్లను విక్రయించేవారు. అవి నిరంతరం అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యేవి. దీన్ని అధిగమించేందుకు ఆన్లైన్లో అందుబాటులో ఉండేలా ఇ–స్టాంపులను విక్రయించే విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. వాస్తవంగా ఈ పద్ధతిలో ఏ ధర స్టాంపయినా అందుబాటులో ఉంటుంది. కానీ విక్రయదారులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా తక్కువ ధర స్టాంపులను బ్లాక్ చేసి అధిక ధరల స్టాంపు పేపర్లను అమ్ముతున్నారు. చట్టపరమైన అఫిడవిట్లు, చిన్నపాటి దస్తావేజులు, నోటరీ అవసరాలకు రూ. 10, రూ. 20 స్టాంపులు సరిపోతాయి. కానీ పలాస–కాశీబుగ్గ జంట పట్టణాల్లో ఎక్కడ వెతికినా ఈ తక్కువ ధర స్టాంపులు లభించని పరిస్థితి. అదేంటని వెండర్లను అడిగితే అందుబాటులో లేవు, జనరేట్ అవడం లేదంటూ సమాధానం ఇస్తున్నారు. ఇంకొందరైతే సర్వర్లు మొరాయిస్తున్నాయంటూ సాకులు చూపుతున్నారు. ఇవన్నీ తెలియని సగటు ప్రజలు అవసరం లేకున్నా రూ. 50, రూ. 100 స్టాంపులను కొనాల్సి వస్తోంది. పలాస–కాశీబుగ్గలో అందుబాటులో లేని రూ.10లు, రూ.20ల ఇ–స్టాంపు పత్రాలు జంట పట్టణాల్లో లైసెన్స్‌దారుల దోపిడీ పర్వం చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే స్టాంపు విక్రయదారులు ఇలా వ్యవహరిస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తక్కువ ధర స్టాంపులను ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న విక్రయదారులపై చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. -
విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలి
టెక్కలి: ఇటీవల రైలు ఢీకొని మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ నిరుద్యోగ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు టి.సూర్యం కోరారు. సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో పాటు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. అనంతరం మృతి చెందిన విద్యార్థులకు నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందజేయాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దళిత చైతన్య వేదిక అధ్యక్షుడు బి.గోవిందరావు, జి.శ్రీనివాస్, ఎల్.రామచంద్రుడు, కె.జగ్గారావు, జె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
విపత్తు నిర్వహణ వ్యవస్థ పటిష్టం
● రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ● ఐదు అగ్నిమాపక కేంద్రాలు ప్రారంభంవిజయనగరం టౌన్: అగ్నిమాపకశాఖలో పనిచేసే ఫైర్మెన్లకు అత్యాధునిక శిక్షణతో పాటు ఆధునిక పరికరాలు, మౌలిక సదుపాయాలు కల్పించి రాష్ట్రంలో విపత్తు నిర్వహణ వ్యవస్థను పటిష్టం చేస్తున్నట్టు రాష్ట్ర హోం మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విజయనగరం జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రం భవనాన్ని ఆమె సోమవారం ప్రారంభించి, అక్కడ ఏర్పాటుచేసిన స్టాల్స్, అత్యాధునిక ఫైర్ పరికరాల పనితీరును పరిశీలించారు. పూసపాటిరేగ, బొబ్బిలి అగ్నిమాపక కేంద్రాలను ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల చేతుల మీదుగా వర్చువల్‌గా ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలలో నిర్మించిన అగ్నిమాపక కేంద్రాలను ఇక్కడ నుంచే వర్చువల్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ఎన్డీఆర్ఎఫ్, ఏఐఆర్ఎఫ్ సిబ్బందితో సమన్వయం చేసుకుని, పనిచేసే విధంగా ఫైర్‌సిబ్బందికి ఆధునిక శిక్షణ ఇస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సంపూర్ణంగా వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందువరసలో ఉందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, ఎమ్మెల్యేలు ఆర్‌విఎస్‌కెకె.రంగారావు, లోకం నాగమాధవి, పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, అగ్నిమాపకశాఖ డిజీ పీవీ.రమణ, ఏడి జి.శ్రీనివాస్, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి పీవీ.రాజేష్, ఎడిఎఫ్ఓ సోమేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అక్టోబర్ 4న చదరంగం పోటీలు
టెక్కలి: స్థానిక అల్ఫాజెన్ పాఠశాలలో అక్టోబర్ 4న జిల్లాస్థాయి స్కూల్ ర్యాంకింగ్ చదరంగం పోటీలు నిర్వహించనున్నట్లు ఆలిండియా చెస్ ఇన్ స్కూల్స్ కమిటీ సభ్యుడు ఎస్.భీమారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 13 ఏళ్లలోపు వయసు కలిగిన బాలబాలికలకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 99125 59735 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. విద్యుత్ షాక్‌తో గేదె మృతి సంతబొమ్మాళి: మండలంలోని నౌపడ గ్రామానికి చెందిన జమ్మ ఎర్రమ్మకు చెందిన పాడిగేదె విద్యుత్ షాక్‌తో సోమవారం సాయంత్రం మృతి చెందింది. చేపల మార్కెట్ వెనుక మేత మేస్తుండగా మోటారుకు చెందిన విద్యుత్ వైరు తగలడంతో మృతి చెందిందని బాధితురాలు తెలిపారు. సుమారు రూ.60 వేల విలువ ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం నష్ట పరిహారం అందజేయాలని కోరారు. వ్యక్తి ఆత్మహత్య శ్రీకాకుళం రూరల్: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల కారణంగా ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని కనుగులవానిపేటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కనుగుల అప్పలనాయుడు (67) సోమవారం రాత్రి పురుగుల మందుతాగి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హటాహుటిన శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య సీతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్‌ను ఢీకొన్న ఆటో ● ఇద్దరికి గాయాలు ఆమదాలవలస: పాలకొండ వైపు నుంచి విశాఖపట్నం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిని ఆటో ఢీకొనడంతో గాయాలపాలైన ఘటన సోమవారం ఉదయం మున్సిపాలిటీ పరిధిలోని పార్వతీశ్వరునిపేట జంక్షన్ వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నంకు చెందిన ఉప్పాడ బైరవ్ కృష్ణకుమార్ తన స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై పాలకొండ వైపు నుంచి విశాఖపట్నం వెళ్తుండగా.. పార్వతీశ్వరునిపేట జంక్షన్ వద్ద ఆమదాలవలస వైపు నుంచి ఎదురుగా అతివేగంగా వచ్చిన ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో బైరవ్ కృష్ణకుమార్‌తో పాటు అతని స్నేహితుడికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సమన్వయంతో పరేడ్ నిర్వహించాలి
● జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి శ్రీకాకుళం రూరల్: జిల్లా కేంద్రంలోని తండేవలస శిక్షణ కేంద్రంలో 9 నెలల ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్న 142 మంది స్టైఫెండియరీ క్యాడెడ్ ట్రైనీ పోలీసు కానిస్టేబుల్స్ (ఎస్‌సీటీపీసీఎస్)ను ఎస్పీ కేవీ మహేశ్వరెడ్డి సోమవారం కలిశారు. ముందుగా అవుట్ పరేడ్ రిహార్సల్స్ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గౌరవవందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కవాతు, డ్రిల్, మార్చ్‌పాస్ట్, కమాండింగ్ గౌరవ వందనం, అడుగుల సమన్వయం, వరుసలు, దూరాల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి పేరేడ్‌లో పూర్తిస్థాయి క్రమశిక్షణ, ఏకరూపత, సమన్వయం, ఆత్మవిశ్వాసం ప్రతిబింబించేలా చూసుకోవాలని పిలుపునిచ్చారు. దీక్షాంత్ పెరేడ్‌ను ప్రతీ ఒక్కరూ నిబద్ధతతో విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ ఎల్.శేషాద్రి, డీఎస్పీ సీహెచ్ వివేకానంద తదితరులు పాల్గొన్నారు. -
అనారోగ్యంతో కానిస్టేబుల్ మృతి
ఎచ్చెర్ల/ఆమదాలవలస: ఎచ్చెర్ల పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బగాది తవిటినాయుడు (40) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం రాత్రి మృతి చెందారు. ఆమదాలవలస మండలం పూజారిపేట గ్రామానికి చెందిన ఈయన 2009 బ్యాచ్ ద్వారా కానిస్టేబుల్‌గా ఎంపికై పలు స్టేషన్లలో పనిచేశారు. ఈయన గత కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతూ.. శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల పోలీసులు ఆయన స్వగ్రామంలో సోమవారం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె ఉంది. -
నైరా కళాశాల సందర్శన
శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం పరిధిలోని నైరా వ్యవసాయ కళాశాలను ఏఎన్జీఆర్ఏయూ ఉప కులపతి డా.పీవీ సత్యనారాయణ సోమవారం సందర్శించారు. కళాశాల అసోసియేట్ డీన్ డా.డి.చిన్నంనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల విద్యాభ్యాసం, కళాశాలలోని విద్యా వాతావరణం తదితర అంశాలపై వివరించారు. అనంతరం కళాశాలలో వివిధ విభాగాలు, సౌకర్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఓఎస్ఏ డా.ఎస్.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. అలరించిన నృత్య ప్రదర్శన శ్రీకాకుళం కల్చరల్: న్యూఢిల్లీలో ఉన్నటువంటి 530 సంవత్సరాల చరిత్ర కలిగిన అద్భుతమైన చారిత్రక కట్టడం నీమ్రానా ఫోర్ట్ ప్యాలెస్‌లో నగరానికి చెందిన ప్రఖ్యాత నాట్య గురువు రఘుపాత్రుని శ్రీకాంత్ శిష్యుడు రామ కౌండిన్య కూచిపూడి నాట్యం ప్రదర్శించి ఆహుతులను అలరించారు. నీమ్రానా ఫోర్ట్ ప్యాలెస్ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం రామ కౌండిన్య కొలువై ఉన్నాడే, గోవర్ధనగిరి ధార, వినరోభాగ్యము విష్ణుకథ అను కూచిపూడి నాట్య అంశాలను ప్రదర్శించి విదేశీ పర్యాటకులను అలరించారు. మన రాష్ట్రం నుంచి రామ కౌండిన్య ఒక్కరికే ఆ ఫోర్ట్ ప్యాలెస్‌లో నృత్య ప్రదర్శన చేసే అవకాశం వచ్చింది. కార్యక్రమం అనంతరం ఆయనను నీమ్రానా ఫోర్ట్ ప్యాలెస్ అధినేత అమన్నాథ్, ఫోర్ట్ ప్యాలెస్ జీఎం అంకుష్‌లు సత్కరించారు. అప్పుడు హామీలిచ్చి.. ఇప్పుడు అణచివేస్తారా..? ఇచ్ఛాపురం రూరల్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విజయవాడలో నిరసన వ్యక్తం చేస్తే వారిపై కూటమి ప్రభుత్వం లాఠీచార్జ్ చేయించడం ఎంత వరకు సబబు అని ఎమ్మెల్సీ నర్తు రామారావు ప్రశ్నించారు. ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరితే.. ఇంత దౌర్జన్యం చూపడం ఏమిటని నిలదీశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యోగులు తమ గొంతు వినిపించడమే నేరమా అని ప్రశ్నించారు. వర్షాలకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. గత ఏడాది వచ్చిన మోంథా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు నయా పైసా కూడా పరిహారం అందివ్వలేదని, అప్పటి బాధితులకు సైతం పరిహారం అందివ్వాలని కోరారు. ఫ్యాన్ల ఏర్పాటుకు నిర్ణయం అరసవల్లి: ‘శ్రీసూర్యనారాయణా మేలుకో...’ అన్న కథనంపై దేవదాయ శాఖాధికారులు స్పందించారు. సోమవారం ‘సాక్షి’లో భక్తుల మనోభావాలు దెబ్బతినే వ్యవహారాలపై ప్రచురించిన కథనానికి ఆలయ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్ స్పందించి సూపరింటెండెంట్ కె.వెంకటేశ్వరరావును ప్రసాదాల విభాగానికి వెళ్లి పరిస్థితులపై చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లుగా సమాచారం. ఈమేరకు సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు ప్రసాదాల తయారీ విభాగానికి వెళ్లి.. లడ్డూలను ఆరబెట్టేందుకు వీలుగా అదనంగా ఫ్యాన్లును ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టనున్నట్టుగా వివరించారు. ● ఎమ్మెల్సీ నర్తు రామారావు -
● జలమా.. గరళమా..?
అదేంటి ఇంజిన్ ఆయిల్‌ను వాటర్ బాటిల్లో పట్టుకుని చూపిస్తున్నారు అనుకుంటున్నారా..? అదేమీ ఇంజిన్ ఆయిల్ కాదు అచ్చంగా ప్రభుత్వం వారు కుళాయిల ద్వారా బొంతలకోడూరుకు సరఫరా చేసిన ‘మంచినీరు’. ఈ బాటిల్ పట్టుకున్న వ్యక్తి ఆ ఊరి వాసి రాజన్న. ఇక్కడ కుళాయిలకు వచ్చే పైపులైన్‌ను కాలువ కింద నుంచి వేశారు. ఈ పైపులైన్ లీక్ కావడంతో కాలువ నీరు కలిసిపోయి ఇళ్లకు మురికి నీరు వస్తోంది. దీంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. – ఎచ్చెర్ల గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో లలితా రాణి స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో టీమ్ వర్క్‌తో 12.18 కిలోమీటర్ల పొడవైన భారత జాతీయ జెండాలను క్రోషేతో అల్లి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నట్లు చల్లా లలితా రాణి ఓ ప్రకటనలో తెలిపారు. 2026 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించామని, ఈ ప్రత్యేక ఘనతకు గుర్తింపుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కడం విశేషంగా నిలిచింది. – శ్రీకాకుళం కల్చరల్ -
కనిపెడతాం.. మీ పని పడతాం
కాశీబుగ్గ: కూటమి నేతలు సచివాలయ ఉద్యోగుల వెనుక పడుతున్నారు. మెరుపు సమ్మెతో నాయకులకు షాకిచ్చిన ఉద్యోగులపై బదులు తీర్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కంచిలి, కవిటి మండలాల్లో స్థానిక అధికార పార్టీ నాయకులు కొందరు ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యం చేసుకున్నారు. తమకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వారి జాబితాను సేకరించే పనిలో పడ్డారు. ఆదివారం విజయవాడలో జరిగిన పోరుబాటలో పలాస మండలంతోపాటు కాశీబుగ్గ పట్టణానికి చెందిన కొందరు ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ ప్రాంతాల నుంచి ఎవరెవరు నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు? ఆవివరాల సేకరణలో ఉన్నారు. వజ్రపుకొత్తూరు మండలంలో కూటమి నాయకులతోపాటు ‘గ్లాస్ బాస్’లు కొందరు సచివాలయ ఉద్యోగులను లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. వారిని వైఎస్సార్సీపీ అనుకూలురంటూ ఉద్యమానికి ఉసి గొల్పడంలో కీలక పాత్ర పోషించారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వస్తే అన్నీ చెల్లిస్తామంటూ హామీఇచ్చిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు కాలయాపన చేస్తూ నెట్టుకొస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదంటూ తమకు రావాల్సిన ఐఆర్, పీఆర్సీ ఐదు డీఏలు మొత్తంగా రూ. 40వేల కోట్ల బకాయిలు చెల్లించాలంటూ నినదించిన ఉద్యోగుల గళం పాలకులకు గరళంగా మారింది. ఎక్కడికక్కడ నిరంకుశంగా వ్యవహరించిన ప్రభుత్వం ఉద్యోగులపై ఉక్కుపాదం మోపాలని చూసింది. అయినా ఉద్యోగుల ఐక్యత ముందు అవన్నీ తేలిపోయాయి. పోలీసు ముందస్తు ఆంక్షలను సైతం లెక్కచేయలేదు. దీంతో ఇప్పుడు ఉద్యోగులపై వేధింపులకు సిద్ధమవుతున్నారు. విజయవాడ వెళ్లిన సచివాలయ ఉద్యోగుల వివరాల సేకరణ వేధింపులకు సిద్ధమవుతున్న కూటమి నాయకులు -
కేశ దానం
ఆడపిల్ల కట్టు బొట్టును ఎంత పద్ధతిగా చూసుకుంటుందో జుట్టును కూడా అంతే మురిపెంగా చూసుకుంటుంది. తాహతకు తగ్గట్టుగా కేశ సంరక్షణ చేసుకుంటుంది. కానీ ఇక్కడ ఓ అమ్మాయి ఒత్తుగా ఎదిగిన జట్టు ను వేదికపైనే కత్తిరించి దానం చేసింది. ఆమె పేరు జోషిత. ఆదివారం సిక్కోలు సింగర్స్ నిర్వహించిన బాలు స్వరనీరాజనం వేదికపై తన జుట్టును ఇలా కత్తిరించి కేన్సర్ పేషెంట్ల కోసం దానం చేసింది. కేన్సర్‌తో బాధపడే వారు కేశాలను కోల్పోతుంటారు. వారి కోసం కేశాలను దానం చేసే పద్ధతి మెట్రోపాలిటన్ సిటీల్లో కనిపిస్తూ ఉంటుంది. తన ఇంటిలోనే ఇద్దరు కేన్సర్‌తో బాధ పడుతూ జుట్టును కోల్పోవడం చూసిన జోషి త ఇలా కేశదానం చేసి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. నగరంలోని జెడ్పీ వెనుక ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసముంటున్న జోషిత తల్లిదండ్రులు పుల్లేటి కుర్తి మురళీకృష్ణ, హేమలత. వారి సహకారంతోనే ఇంటర్ చదువుతున్న జోషిత ఈ కార్యక్రమానికి పూనుకుంది. సాధారణంగా కనీసం 10 నుంచి 12 అంగుళాల పొడవున్న జుట్టును దానం చేయవచ్చు. జుట్టు పొడిగా, శుభ్రంగా, రంగులు వేయనిదై ఉండాలి. జుట్టును రబ్బరు బ్యాండ్‌తో గట్టిగా కట్టి, ఆ బ్యాండ్‌కి కింద లేదా పైన కత్తెరతో కట్ చేయాలి. 9666406586, 9390324177 నంబర్లను సంప్రదించవచ్చు. – శ్రీకాకుళం కల్చరల్ -
● కదిలిన డీ పట్టాదారులు
● ‘ప్రభుత్వ భూమి ఆక్రమిస్తున్నారు’ ● న్యాయం చేయండి ● జగన్నాథ స్వామి భూములకు శఠగోపం కవిటి: కొజ్జీరియా పంచాయతీలో వెలసిన జగన్నాథ స్వామి భూములు అన్యాక్రాంతమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో యాజమాన్యం పేరు మార్పిడి జరిగిందని పంచాయతీ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం కవిటి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వి.రవివర్మకు, తహసీల్దార్ టి.కల్యాణచక్రవర్తికి వేర్వేరుగా వినతిపత్రాల్ని అందించారు. కొజ్జీరియా రెవెన్యూలో 175/14 ,178/15 నుంచి వరుసగా 175/22 వరకు కలిపి మొత్తం 2.80 ఎకరాల భూమి జగన్నాథ స్వామి దేవాలయానికి ఉంది. దీనికి సంబంధించి ఎల్పీఎం నంబర్ 1956, 1682, 2048గా రెవెన్యూ శాఖ అధికారులు రీసర్వే ద్వారా మార్పిడి చేశారు. క్రయ విక్రయాలు జరిగినట్లు కూడా తమకు సమాచారం వచ్చిందని స్థానికులు తెలిపారు. సమస్య పరిష్కరించకుంటే నిరాహార దీక్షకు సైతం సిద్ధమని తెలిపారు.సంతబొమ్మాళి: వడ్డితాండ్ర రెవెన్యూ గ్రామంలో డీపట్టా భూములకు వారసులుగా టీడీపీ నాయకుల పేర్లను నమోదు చేయడమే కాకుండా తాకట్టు పెట్టి అక్రమంగా రుణాలు మంజూరు చేయించుకునేందుకు కారకులైన అధికారులపై కేసులు నమోదుచేయాలని వడ్డితాండ్ర డీ పట్టాదారులు కోరారు. వారంతా కలిసి సో మవారం పీజీఆర్ఎస్కు వెళ్లి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సమస్యపై సోమవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో డీపట్టాదారులంతా కదిలి వెళ్లారు. టెక్కలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజు నంబర్ 2227/2004,2382/2004, 1552/2005 ద్వారా రూ.11 లక్షలు రుణాన్ని ముగ్గురు అక్రమంగా పొందారని వివరించారు. డీ పట్టా భూములు సర్వే నంబర్ 179–5లో 1.50 ఎకరాలు, 180–3లో 1.95 ఎకరాలు, 178–1లో 1.55 ఎకరాలు, 178–5లో 1.25 ఎకరాలు, 178–2లో 1.35 ఎకరాలు, 179–4లో 1.40 ఎకరాలు, 179–1లో 1.10 ఎకరాలు, 183–2లో 2.50 ఎకరాలు, 178–3లో 1.42 ఎకరాలు, 178–4లో 1.40 ఎకరాలు దళితులు, బీసీలకు సంబంధించినవని, ఆ భూములకు సంబంధం లేని టీడీపీ నాయకులు అట్టాడ తిరుపతిరావు, రవణమ్మ దంపతులతో పాటు మరికొందరు నకిలీ పత్రాలు సృష్టించి రెవెన్యూ, సబ్‌రిజిస్ట్రార్ అధికారుల సాయంతో వివిధ బ్యాంకుల్లో రుణాలు పొందారని ఆరోపించారు. దీనిపై విచారణచేయాలన్నారు. కార్యక్రమంలో డీ పట్టాదారులు సామ భాస్కరరావు, మునకాల కామమ్మ, ఇచ్చాపు రం రమణారావు, అనపాన కూర్మనాధ్, రాజాపు చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు. మద్యం మత్తులో మహిళలపై వేధింపులు.. అధికార మదంతో భూ కబ్జాలు.. ఆస్తిని సాగు చేసుకోనివ్వకుండా బెదిరింపులు.. అప్పు తీర్చలేదని ఆక్రమణలు.. సైబర్ మోసానికి గురయ్యామంటూ ఆక్రందనలు.. వెరసి సోమవారం ఎస్పీ గ్రీవెన్స్ సెల్లో సమస్యలు ఏకరవు పెట్టారు. అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు బాధితుల నుంచి మొత్తం 72 ఫిర్యాదులు స్వీకరించారు. అందరితో ముఖాముఖి మాట్లాడారు. – శ్రీకాకుళం క్రైమ్ క్రెడిట్ కార్డు మోసం క్రెడిట్ కార్డు మోసంపై మరో ఫిర్యాదు వచ్చింది. మూడు నెలల కిందట ఫేక్ వెబ్‌సైట్‌కు క్లిక్ చేయడంతో రూ.1.75 లక్షలు మోసానికి గురయ్యానని, ఈ విషయమై ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌లోను, ఆన్లైన్ సైబర్పోర్టల్లోను, ఎస్పీ కార్యాలయానికి సైతం ఫిర్యాదులిచ్చినా నేటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఎచ్చెర్ల మండలం చిలకపాలేనికి చెందిన ఎం.శ్రావణి సోమవారం మరో మారు ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. తాగి రెచ్చిపోతున్నారు పట్ట పగలు కొందరు తమ ఆస్తిలోకి ప్రవేశించి మద్యం సేవిస్తున్నారని, అడిగితే మరింత రెచ్చిపోతున్నారని గార మండలం రామచంద్రాపురానికి చెందిన వృద్ధురాలు నీలాపు లీలావతి ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. సిమ్మపేట శ్రీనగర్ కాలనీకి చెందిన జి.అనిల్ మరికొందరు తమ ఆస్తిలోకి ప్రవేశించి మద్యం సేవించి న్యూసెన్సు చేస్తుండటంతో కోడలు సుమిత్రతో కలసి అడిగానని, దీంతో అతడు కుటుంబాన్ని గ్రామం నుంచి తరిమేస్తామని బెదిరించారని ఫిర్యాదు చేశారు. తన కొడుకులిద్దరూ దేశ సేవలో ఉన్నారని తెలిసినా తమతో ఇలా అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు చేయనివ్వడం లేదు.. ఎచ్చెర్ల మండలం కొంగరాం రెవెన్యూ పరిధిలో వారసత్వంగా వచ్చి, నాలుగేళ్ల నుంచి సాగులో ఉన్న భూమిని నక్క సూర్యనారాయణ, నక్క తవిటమ్మ, రావాడ లక్ష్మి మరో నలుగురు సాగు చేయకుండా అడ్డుకుంటున్నారని కొంగరాంకు చెందిన నక్క లక్ష్మీనారాయణ ఎస్పీ గ్రీవె న్సులో ఫిర్యాదు చేశారు. మాపైకి కర్రలతో, కత్తులతో, కొడవళ్లతో వచ్చి సాగు చేయనివ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. కబ్జా కాండ తప్పుడు సర్వే నంబర్‌తో తనకు రిజిస్ట్రేషన్ చేసి ఇప్పించడమే కాక తమ సాగులో ఉన్న భూమిని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఎచ్చెర్ల మండలం చిలకపాలెంకు చెందిన బరాటం లక్ష్మణరావు ఎస్పీ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. 22 ఏళ్ల కిందట పొన్నాడ సత్యనారాయణ, దుర్గాప్రసాద్ వెంకటరమణ, కృష్ణమూర్తి తప్పుడు సర్వే నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయించారని, దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తుంటే సహకరించకపోగా.. మళ్లీ డబ్బులు అడుగుతున్నారని తెలిపారు. ఇటీవల కాలంలో చిలకపాలెంకు చెందిన మిర్తిపాటి వసంతరావు, వారి బావ అటకేశ్వరరావు తమ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించి తమను చంపుతామని బెదిరిస్తున్నారన్నారు. వీరిపై ఫోర్జరీ, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులో కోరారు. స్థలం ఆక్రమణ పలాస రంగోయికి చెందిన ఓ మహిళ 30 సెంట్ల స్థలాన్ని రూ.30 లక్షలకు ఓ రియల్టర్‌కు విక్రయించారు. కానీ ఆయన ఆ స్థలం మొత్తాన్ని దాదాపు రెండెకరాలు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నార ని ఆమె గ్రీవెన్స్‌ను ఆశ్రయించారు. రూ.30 లక్షలు అప్పుగా తీసుకున్నామని, అప్పు ఇచ్చిన వ్యక్తితో కలిసి రియల్టర్ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. గ్రీవెన్స్ శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 86 ఫిర్యాదులు నమోదయ్యాయి. అందిన వినతులలో అత్యధికంగా రెవెన్యూ (సీసీఎల్ఏ) శాఖకు సంబంధించి 34 అర్జీలు రాగా, పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో 10, సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో 8, సెర్ప్ విభాగంలో 8 వినతులు నమోదయ్యాయి. అలాగే స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు కింద 7, విద్యుత్ శాఖ పరిధిలో 3 అర్జీలు వచ్చాయి. జలవనరుల శాఖ, హౌసింగ్ కార్పొరేషన్, గ్రామీణ నీటి సరఫరా ఇంజనీరింగ్, పోలీసు శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలకు చెరో 2 చొప్పున ఫిర్యాదులు అందాయి. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుతూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సైకిల్ తొక్కుకుంటూ కార్యక్రమానికి వచ్చారు. అంతకుముందు ఆయన సైకిల్‌పైనే ఎచ్చర్ల వీధిలోని ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలకు వెళ్లి నులి పురుగుల మాత్రలు పంపిణీ చేశారు. ● శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో అరసవల్లి రోడ్డులో కాలువను ఆక్రమించి భవన నిర్మాణాలు చేపడుతున్నారని ఆ గ్రామానికి చెందిన ప్రజలు ఫిర్యాదు చేశారు. ● రాష్ట్రంలో దళితులపై మారణకాండ జరుగుతోందని బీఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ వద్ద నిరసన తెలిపారు. దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ● కోవిడ్–19 మహమ్మారి సమయంలో నిలిపివేసిన సీనియర్ సిటిజన్ల రైల్వే చార్జీల రాయితీని తక్షణమే పునరుద్ధరించాలని శ్రీకాకుళం సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం నాయకులు కలెక్టర్‌ను కోరారు. వయోధికుల కోసం సీనియర్ సిటిజన్స్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని విన్నవించారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: జలుమూరు మండలం గొటివాడ గ్రామ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ సోమవారం పీజీఆర్ఎస్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను కోరా రు. గొటివాడ గ్రామంలో గ్రామకంఠ మైన సర్వే నంబర్ 69–3లో సుమారు 30 సెంట్ల భూమిలో గత ప్రభుత్వ హయాంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం భవనాల నిర్మాణానికి పునాదులు, పిల్లర్లు వేసి పనులు ప్రారంభించారని, ప్రభుత్వం ఆ పనులకు గాను రూ.11 లక్ష ల నిధులు విడుదల చేసిందని ఆయన తెలిపారు. కానీ కొందరు కూటమి నాయకులు నిర్మాణంలోని భవనాలను మట్టితో కప్పి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు చూస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు నవిరి పోతయ్య, మాజీ ఎంపీటీసీ సోమినేని కృష్ణ, మొయ్యి సింహాచలం, బాన్న శ్రీనివాస్ దామ శ్రీనివాస్ పాల్గొన్నారు. కలెక్టర్ గ్రీవెన్స్‌కు వచ్చిన వినతుల సంఖ్య 86ఎస్పీ గ్రీవెన్స్‌కు వచ్చిన వినతుల సంఖ్య 72 -
మభ్యపెట్టి టీడీపీ కండువాలు కప్పారు
● మేమంతా వైఎస్సార్ సీపీ పక్షానే ఉన్నాం ● స్పష్టం చేసిన సీతాపురం పంచాయతీ ప్రజలు టెక్కలి: ఉపాధి పనులకు సంబంధించిన పని ఉందంటూ ఫీల్డ్ అసిస్టెంట్ నమ్మబలికి మమ్మల్ని మంత్రి అచ్చెన్నాయుడు దగ్గరకు తీసుకువెళ్లి మభ్యపెట్టి మరీ టీడీపీ కండువాలు వేయించారని టెక్కలి మండలం సీతాపురం గ్రామస్తులు స్పష్టం చేశారు. సీతాపురం, తిర్లంగి నుంచి సుమారు 500 కుటుంబాలు మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో టీడీపీలో చేరినట్లు ప్రచారం జరగడంతో.. సోమవారం ఆయా గ్రామాల ప్రజలంతా టెక్కలి వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త పేరాడ తిలక్‌తో మాట్లాడారు. అసలు తమ గ్రామంలో 500 కుటుంబాలే లేకుండా టీడీపీ నాయకులు ఎలా ప్రకటనలు చేస్తారని తప్పుపట్టారు. తామంతా ఎప్పటికీ వైఎస్సార్సీపీ పక్షానే ఉంటామని వెల్లడించారు. ఓటమి భయంతోనే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే మంత్రి అచ్చెన్నాయుడు ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని పేరాడ తిలక్ మండిపడ్డారు. ఆయన సీతాపురం పంచాయతీ ప్రజలతో కలిసి మీడియాతో మాట్లాడారు. సీతాపురం గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ మొట్టమొదటి చైర్మన్ బెండి కూర్మన్న, అదే ప్రాంతంలో సంపతిరావు రాఘవరావు, దువ్వాడ వాణి, చింతాడ మంజు ఎంతో మంది కీలకమైన పదవులు చేపట్టారని తిలక్ గుర్తు చేశారు. మొదట కాంగ్రెస్, ఆ తర్వాత వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్న సీతాపురం రాజకీయ చరిత్రను భ్రష్టుపట్టించే విధంగా మంత్రి అచ్చెన్నాయుడు పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆ పంచాయతీలో టీడీపీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థి లేకపోవడంతో ఇలా ప్రజల్ని మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో సుమారు 187 మందిపై అక్రమంగా కేసులు నమోదు చేసినప్పటికీ ఏ ఒక్క వైఎస్సార్సీపీ కార్యకర్త బెదరకుండా పార్టీ కోసం పనిచేస్తున్నారని గుర్తు చేశారు. సమావేశంలో మాజీ జెడ్పీటీసీ దువ్వాడ వాణి, మాజీ ఎంపీటీసీ బెండి దేవయాని, బెండి ఉదయ్, బెండి గిరి, కర్నిక జీవన్, బెండి శ్రీను, పి.సోమేష్, కె.రాంబాబు, వై.కోదండ, వై.ధనుంజయరావు, డి.ఎండువాడు, డి.రాజేష్, బి.భుజంగరావు, పాపారావు, బి.బలుసాకు, బి.రాజేష్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సత్తారు సత్యం, టెక్కలి టౌన్ అధ్యక్షుడు తమ్మన్నగారి కిరణ్, నాయకులు కె.అజయ్, జి.మోహన్‌రెడ్డి, బి.కార్తీక్ పాల్గొన్నారు. -
ముంపు ప్రాంతాల పరిశీలన
నరసన్నపేట: మామిడివలస, కంబకాయ, చిక్కాలవలస ప్రాంతాల్లో వర్షం నీటి ముంపు పొలాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం పరిశీలించారు. నీటి ముంపునకు కారణాలను ఆయన డ్రోన్ కెమెరా సాయంతో తెలుసుకున్నారు. వంశధార ఈఈ మురళీధర్‌కు పలు సూచనలు చేశారు. అలాగే కంబకాయకు చెందిన రైతు పాగోటి అప్పలనాయుడు కలెక్టర్‌కు ముంపు రైతుల పరిస్థితి వివరించా రు. నీరు సజావుగా వెళ్లిపోయేందుకు వీలుగా యాక్షన్ ప్లాన్ రెండు రోజుల్లో ఇవ్వాలని కలెక్టర్ వంశధార అధికారులను ఆదేశించారు. రైల్వే ట్రాక్ కింద ఉన్న కల్వర్టుల్లో పూడిక అధికంగా ఉండటం, గుర్రపు డెక్క అడ్డుకోవడంతో నీరు కిందకు వెళ్లకుండా నిలిచిపోయిందని కలెక్టర్ గుర్తించారు. రైల్వే ట్రాక్‌పై కిలోమీటరు దూరం వరకూ కలెక్టర్ కాలినడకన వెళ్లి ముంపు పొలాలను పరిశీలించారు. చిక్కాలవలస, నర్శింగపల్లి, మామిడి వలస ,కుద్దాం, బసివలస, కర గాం, కంబకాయ, గుండవలస తదితర గ్రామాల పరిధిలో 400 ఎకరాల వరకూ నీరు నిలిచి పోవడంతో వరి మొక్కలు జీవం లేని విధంగా తయారయ్యాయని రైతులు కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్ వెంట అసిస్టెంట్ కలెక్టర్ హరిహోం పాండియా తో పాటు వ్యవసాయాధికారిణి వై. సూర్యకుమారి, తహసీల్దార్ టి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
స్థలం చూశారు.. ఒడిసి పట్టారు
● డీ పట్టా భూములను కబ్జా చేసిన టీడీపీ నాయకుడు ● వారసులమంటూ రికార్డుల్లో నమోదు ● కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బాధితులు సంతబొమ్మాళి: వడ్డితాండ్ర రెవెన్యూ పరిధిలో డీ పట్టా భూముల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. వడ్డితాండ్రకు చెందిన 38 కుటుంబాలకు సుమారు 70 ఎకరాల వరకు భూమికి ఇందిరా గాంధీ హయాంలో డీపట్టాలు ఇచ్చారు. ఇందులో అనపాన కురుమయ్యకు చెందిన 2.50 ఎకరాలు, ఇచ్ఛాపురం బారికవాడుకు చెందిన 1.89 ఎకరాలు, రాజాబొడ్డుకు చెందిన 2.50 ఎకరాల స్థలంపై టీడీపీ నాయకుల కన్ను పడింది. ఈ భూమికి తామే వారసులమంటూ వడ్డితాండ్ర తాజా మాజీ సర్పంచ్ అట్టాడ రమణమ్మ, ఆమె భర్త అట్టాడ తిరుపతిరావు పేరున రెవెన్యూ రికార్డులో నమోదు చేసుకున్నారు. సర్వే నంబర్ 179–5, సర్వే నంబర్లు 183–1, 183–2ను రెడ్డిక, రజక కులానికి చెందిన పేదవారికి ప్రభుత్వం కేటాయిస్తే వారసులంటూ అట్టాడ తిరుపతిరావు, రమణమ్మల పేరున రెవె న్యూ అధికారులు ఏ విధంగా నమోదు చేశారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులను కూడా సంప్రదించామని, తహసీల్దార్ హేమసుందరరావును ప్రశ్నిస్తే.. తమనే తిరిగి బెదిరిస్తూ మాట్లాడారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆగస్టు 8వ తేదీన జిల్లా కలెక్టర్‌కు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. డీ పట్టా భూములను తమ పేరున నమోదు చేసుకోవడమే కాకుండా మార్ట్గేజ్ చేసి పలు బ్యాంకుల్లో సుమారు రూ. 11లక్షలు రు ణాలను పొందారని బాధితులు అంటున్నారు. ఇంత అన్యాయం జరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అధికారులను సస్పెండ్ చేయాలి టెక్కలి: సంతబొమ్మాళి మండలం వడ్డితాండ్ర గ్రామంలో డీ పట్టా భూములను అక్రమంగా తా కట్టు పెట్టేందుకు పత్రాలను మంజూరు చేసిన అధికారులను సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాల నాయకులు ఎన్.షణ్ముఖరావు, ఎ.షణ్ముఖరావు డి మాండ్ చేశారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో మాట్లాడుతూ డీ పట్టా భూములకు పత్రాలను సృష్టించి వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకుని కోటబొ మ్మాళి కొన్ని బ్యాంకుల్లో రుణాలు పొందారని పేర్కొన్నారు. దీని పై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
నిర్లక్ష్యం వహిస్తే షాక్ తప్పదు
హిరమండలం: ఇటీవల కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు విద్యుత్ పరికరాలు తడిచిపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇళ్లు, రోడ్లు, కార్యాలయాలు, వ్యవసాయ బావుల వద్ద ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణ,ఆస్తి నష్టాలు తప్పవు. ముఖ్యంగా పొలాల్లో వ్యవసాయ పనులు చేసే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలి. వర్షం ధాటికి వైర్లు తెగిపడినట్లు గుర్తిస్తే వాటి దగ్గరకు వెళ్లకుండా ఆ శాఖ వారికి సమాచారం ఇవ్వాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. ● తడిచేతులతో వైర్లు, స్విచ్‌లు తాకొద్దు. ● విద్యుత్ సంబంధిత మరమ్మతులు సొంతంగా చేయవద్దు. ● విద్యుత్ సిబ్బంది సెల్‌ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచుకోవాలి. ● వీధులు, పొలాల్లో తడిచిన స్తంభాలను తాకవద్దు. ● తోటలు, పొలాలు వంటి ప్రదేశాల్లో విద్యుత్ తీగలు తెగిపడితే 1912కు కాల్ చేయాలి. ● తీగలు తాకిన చెట్లను ముట్టుకోవద్దు. ● విద్యుత్ తీగలను ఆనుకుని దుస్తులు ఆరబెట్టకూడదు. ● విద్యుత్ షాక్‌కు గురైతే వెంటనే సరఫరా నిలిపివేయాలి. బాధిత వ్యక్తిని ప్లాస్టిక్ లేదా ఎండిన కర్రతో వేరుచేయాలి. వర్షాకాలంలో విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు బారిన పడే అవకాశాలున్నాయి. విద్యుత్ తీగలు తెగిపడితే వెంటనే సమాచారం అందించాలి. మరమ్మతులు చేయిస్తాం. – జి.ప్రసాదరావు, డీఈఈ, పాతపట్నం సబ్ డివిజన్ వర్షాల నేపథ్యంలో ప్రమాదకరంగా విద్యుత్ పరికరాలు అప్రమత్తతంగా లేకుంటే ప్రాణాలకే ప్రమాదం జాగ్రత్తలు పాటించాలని అధికారుల సూచన -
ఉద్రిక్తంగా చలో విజయవాడ
● జిల్లా నుంచి 900 మంది సచివాలయ ఉద్యోగుల హాజరు ● మార్గమధ్యంలో జిల్లా ఉద్యోగ సంఘ నేతలను వేర్వేరు ప్రాంతాలకు తరలించిన పోలీసులు ● ఉద్యోగం చేస్తాం.. ఊడిగం చెయ్యబోమంటూ నినాదాలు అరసవల్లి: సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ఉద్య మ వేడి కూటమి ప్రభుత్వానికి ఘాటుగానే తగిలింది. ఉద్యోగులకు పదోన్నతులు, నోషనల్ ఇంక్రిమెంట్లు కల్పించాలంటూ వేలాది మంది గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు ఆదివారం విజయవాడలో తీవ్ర ఉద్రిక్తతల నడుమ ధర్నాకు దిగారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి ఉద్యోగులంతా శనివారం సాయంత్రానికే విజయవాడ చేరుకోవడంతో ప్రభుత్వ ఆంక్షలకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి జిల్లాలో సచివాలయ ఉద్యోగుల సంఘ నేతల ఊర్లకు వెళ్లి మరీ విచారణ చేపట్టినట్లుగా తెలుస్తోంది. అలాగే శనివా రం రాత్రి వేళలో విజయవాడ శివార్లకు చేరుకున్న ఉద్యోగుల సంఘ నేతలు, ఉద్యోగులపై పోలీసులు ప్రతాపం చూపించారు. ధర్నాచౌక్‌కు చేరకుండా పలువురిని నియంత్రణ చేశారు. దీంతో జిల్లాకు చెందిన సుమారు రెండు వందల మంది ఉద్యోగులను వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. జిల్లాకు చెందిన రాష్ట్ర నేతలతో పాటు ఉత్తరాంధ్ర జేఏసీ నేతలంతా ధర్నాచౌక్‌కు చేరుకున్నాక.. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాల నుంచి వచ్చిన సచివాలయ ఉద్యోగులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు ఏకంగా లాఠీ చార్జికి దిగడంతో జిల్లాకు చెందిన ఉద్యోగులకు కూడా లాఠీ దెబ్బలు తగిలాయి. దీంతో ‘ఉద్యోగం చేస్తాం...ఊడిగం చెయ్యబోము’ అంటూ నినాదాలు చేశారు. అనుమతులు లేకుండా ధర్నాకు దిగడం, ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించిన కారణంగా సచివాలయ సర్వేయర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుబాబును విధుల నుంచి సస్పెండ్ చేశారు. అలాగే ఈ ధర్నాలో ఉత్తరాంధ్ర జేఏసీ నేత కూన వెంకట సత్యనారాయణ, అబ్దుల్ రజాక్, సీపాన గోవింద, అయ్యప్ప, అప్పలనాయుడు, సుధీర్, బలివాడ రాజశేఖర్ తదితరులు హాజరయ్యారు. సచివాలయ ఉద్యోగులపైనా రెడ్‌బుక్ రాజ్యాంగమా..! లాఠీచార్జి, అరెస్టులను ఖండించిన ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట: తమ హక్కులు, సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా విజయవాడలో ర్యాలీ చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరును మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా ఖండించారు. సచివాలయ ఉద్యోగులపై లాఠీచార్జి, అరెస్టులు చేయడం సరైంది కాదని కృష్ణదాస్ అభిప్రాయపడ్డారు. కూటమి రెడ్‌బుక్ రాజ్యాంగానికి అంతు లేదా. అని ప్రశ్నించారు. గర్భిణులు, పిల్లలతో ఉన్న తల్లు లు అని చూడకుండా పోలీసులు జుట్లు పట్టుకొని ఈడ్చుకెళ్లడంపై కృష్ణదాస్ మండి పడ్డారు. 15 రోజులుగా అనుమతులు కోరుతున్నా ఇస్తాం.. ఇస్తాం అని పోలీసులు అంటూనే ఎక్కడికక్కడ నిర్బంధాలు చేయడం ఏమిటని అన్నా రు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని ఈ సందర్భంగా కృష్ణదాస్ ప్రభుత్వాన్ని కోరారు. -
సొంత ఖర్చుతో ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు
టెక్కలి: టెక్కలి మండలం పోలవరం గ్రామంలో ఎత్తిపోతల పథకం కొద్ది రోజులుగా సాంకేతిక సమస్యతో మూలకు చేరింది. దీంతో ఎగువ ప్రాంతాల రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి ట్రాన్స్ఫార్మర్ బాగు చేసేందుకు అయ్యే ఖర్చును భరించేందుకు గ్రామానికి చెందిన ప్రగడ సాయిరామ్ ముందుకు వచ్చారు. ఈ మేరకు ఆదివారం గ్రామంలో రైతులు, గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. సుమారు రూ.3.20 లక్షలను అందజేసేందుకు అంగీకరించారు. ఈ సందర్భంగా సాయిరామ్‌ను గ్రామస్తులు అభినందించారు. సమావేశంలో మాజీ సర్పంచ్ జి.బాలకృష్ణ, మాజీ ఎంపీటీసీ బి.కూర్మారావు, మెట్ట అవినాష్, మెట్ట విశ్వనాధం, మెట్ట వెంకట్రావు, డి.లక్ష్మణ, నాగార్జున, కిషోర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
నూతన కార్యవర్గ ఎన్నిక
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): మాల గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జంగం విజయానంద్ తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం ఇలిసిపురంలోని అంబేడ్కర్ విజ్ఞాన మందిర్‌లో సంఘ జనరల్ బాడీ సమావేశం, నూతన కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. గౌరవ అధ్యక్షుడిగా బడియా కామరాజు, అధ్యక్షులుగా కె.ప్రవళ్లిక ప్రియ, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎల్.అప్పన్న, ఉపాధ్యక్షులుగా కె.రాము, బి.వి.వి.ఎస్.దొర, ప్రధాన కార్యదర్శిగా జి.నాగరాజు, జాయింట్ కార్యదర్శి కె.పున్నయ్య, మహిళా కార్యదర్శి బోనెల లావణ్య, కోశాధికారి కె.నారాయణరావు, ఈ.సి.మెంబర్లుగా వై.వనప్రసాద్, శివాజీ హరీష్, రెయ్య రమణ, గోగరాజులను నియమించారు. కార్యక్రమంలో పోలకటి రామకృష్ణ (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), వెంకటేశ్వరరావు (రాష్ట్ర కోశాధికారి), నగిరి కాళిదాసులు, రాష్ట్ర ఎన్జీజీవో వైస్ ప్రెసిడెంట్ రాయి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. సిక్కోలు కవులకు గురజాడ పురస్కారాలు శ్రీకాకుళం కల్చరల్ : రాజమహేంద్రవరంలోని గ్లోబల్ యూనివర్సిటీలో చైతన్య సారస్వత పరిషత్, హైదరాబాద్‌కు చెందిన తెలుగు భాషా చైతన్య సమితి, కుసుమ ధర్మాన పీఠం ఆధ్వర్యంలో మహాకవి గురజాడ అప్పారావు జయంతోత్సవాల సందర్భంగా జాతీయ తెలు గు శతకవి సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిక్కోలు నుంచి 16 మంది కవులకు గురజాడ పురస్కారాలు ప్రదా నం చేశారు. కవులు భోగెల ఉమామహేశ్వరరావు, రుష్యశృంగుని ఢిల్లేశ్వరరావు, ఇద్ధి పాప య్య, ఎం.లింగరాజు, ఐఎన్డీ ప్రసాద్, వాడా డ శ్రీనివాసరావు, తాళ్లూరి విజయ లక్ష్మణ్, కిల్లన శ్రీనివాస్, శాంతారావు, కుప్పుని వెంకట రాజారావు, పల్లె తేజేశ్వరి, గణస్వామి తదితరులు పురస్కారాలు అందుకున్నారు. గురజాడ సాహిత్యంపై కవితలు చదివి వినిపించారు. జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలి శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): కేంద్ర ఎన్నికల అధికారి జ్ఞానేశ్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కోనారి మోహన్‌రావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలోని క్రాంతి భవన్లో ఆదివారం వామపక్షాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈసీఐ స్వతంత్ర సంస్థగా కాకుండా బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారిందని విమర్శించారు. జ్ఞానేష్ కుమార్ పదవిలో కొనసాగే హక్కును కోల్పోయారని చెప్పారు. ఈ నెల 28న షహీద్–ఎ–ఆజం భగత్ సింగ్ జయంతిని పాటిస్తూ మహాత్మా గాంధీ జయంతితో ముగిసేలా, సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 2 వరకు వారం రోజుల పాటు నిరసనలు చేపట్ట నున్నట్లు తెలిపారు. సమావేశంలో వామపక్ష నాయకులు కె.మోహన్‌రావు, ఎస్.కృష్ణవేణి పాల్గొన్నారు. 2న జిల్లా ఖోఖో జట్ల ఎంపికలు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా జూనియర్స్ బాలబాలికల ఖోఖో జట్ల ఎంపికలు అక్టోబర్ 2న జరగనున్నాయని జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు చిట్టి నాగభూషణం, కార్యదర్శి సీహెచ్ ఫల్గుణరావు ఆదివారం తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని పీఎస్ఎన్ఎం హైస్కూ ల్ వేదికగా ఉదయం 9 గంటల నుంచి ఎంపికల ప్రక్రియ మొదలువుతుందని పేర్కొన్నారు. 2008 డిసెంబర్ ఒకటో తేదీ తర్వాత జన్మించిన బాలబాలికలు అర్హులని స్పష్టంచేశారు. -
నేడు రెవెన్యూ క్లినిక్ రద్దు
● యథావిధిగా ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం యథావిధిగా జరుగుతుందని, రెవెన్యూ క్లినిక్‌ను మాత్రం రద్దు చేశామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. శ్రీకాకుళంలో ఆదివారం ప్రకటన విడుదల చేస్తూ వరద ప్రభావిత ప్రాంతాల్లో రెవెన్యూ సిబ్బంది సహాయక చర్యలు పంట నష్టం అంచనాలు కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నందున రెవె న్యూ క్లినిక్‌ను రద్దు చేసినట్లు తెలియజేశారు. 60 మూగజీవాల దుర్మరణం హిరమండలం: రసాయనాలు చల్లిన గ్రాసా న్ని తిని 60కుపైగా మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. ఈ విషాదకర ఘటన హిరమండలం మండలంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నా యి. మర్రిగూడ పంచాయతీ పరిధిలోని వంశధార ఫేజ్–2 రిజర్వాయర్ మిగులు భూ ములు, ఎగువ ప్రాంతాల్లో పాతపట్నం మండలం కొరసవాడ గ్రామానికి చెందిన బతకల లక్ష్మీనారాయణకు చెందిన గొర్రెల మంద 40 రోజులుగా ఈ ప్రాంతంలో సంచరిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం మేకల మంద మర్రిగూడ పరిధిలో వంశధార రిజర్వాయర్ పరిధిలో నీలగిరితోటల్లో మేతకు దిగగా.. ఒక్కో గొర్రె అస్వస్థతతో నేలకొరిగింది. కళ్లెదుటే మూగజీవాలు నేలకొరుగుతుండడంతో కాపరులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మేత మేసే సమీప దూరంలో రైతులు వరి మళ్లకు గాబు నియంత్రణకుగాను రసాయనాలు చల్లారు. దాని ప్రభావంతో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. ఏకంగా 60 గొర్రెలు చనిపోయాయి. ఈ విషయం తెలియడంతో గొర్రెల పెంపకందారుల కుటుంబాలు అక్క డకు చేరుకున్నాయి. వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పంట సంరక్షణకుగాను సస్యరక్షణ చేపట్టినట్టు రైతులు చెబుతున్నారు. ఈ విషయం తెలియక గొర్రెల పెంపకందారులు నష్టపోయారు. -
ఆక్వా రైతుల్లో.. ధరదడ!
● పెరుగుతున్న రొయ్యల మేత బస్తా ధరలు ● సిండికేట్ వ్యాపారంతో కుదేలు ● ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు సంతబొమ్మాళి: ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సాగు చేస్తున్న ఆక్వా రైతులకు కష్టాలు తప్పడం లేదు. రొయ్యల మేత ధరలు పెరుగుతుండటం.. రొయ్య ధరలు తగ్గుతుండటంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడులు లక్షలు దాటుతున్నా లాభాలు మాత్రం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంతబొమ్మాళి మండలంలో నౌపడ, సీతానగరం, సెలగపేట, మర్రిపాడు, భావనపాడు, మూలపేట, కె.లింగూడు, సున్నాపల్లి, వడ్డీతాండ్ర, పోతునాయుడుపేట, యామలపేట, జగన్నాథపురం, ఉమిలాడ, ఆర్‌హెచ్‌పురం, ములగాం, కొల్లిపాడు, మరువాడ, మేఘవరం తదితర గ్రామాల్లో సమారు 1500 ఎకరాల్లో ఆక్వా సాగును చేపడుతున్నారు. జిల్లాలో 3300 ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ప్రారంభంలో ఆక్వా సాగు ఆశాజనకంగా ఉన్న తరువాత పరిస్థితులు మారాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రొయ్యల మేత కేజీకి ఒకసారి రూ.9, మరోసారి రూ. 8లు చొప్పున మొత్తం రూ.17 పెంచిన తయారీ సంస్థలు మరోసారి పెంచడానికి సిద్ధమవుతుండడంపై ఆక్వా రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడి అధికం కావడం దానికి తోడు మేత, మెడిసిన్ రేట్లు పెరిగాయని, అదే సమయంలో రొయ్యల ధర మాత్రం తగ్గుతున్నాయని వాపోతున్నారు. కలవరపెడుతున్న ధరలు.. సుమారు 15 సంవత్సరాల క్రితం మేత బస్తా రూ.850 ఉంటే 100 కౌంట్ కిలో రొయ్య ధర రూ.240 నుంచి రూ.260 మధ్యన ఉండేది. ఇప్పడు అదే మేత బస్తా రూ.2500 నుంచి రూ.2830కు పెరిగింది. 100 కౌంటు ధర మాత్రం రూ.210 నుంచి రూ.270 మధ్యే ఉండిపోయింది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు రొయ్యల మేత బస్తా ధర రూ.2500 ఉండేది. మే, జూన్ రూ.2528, జూలై, ఆగస్టు, సెప్టెంబరులో రూ.2830 మేత థర ఉంది. జిల్లాలో రోజుకు రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభైవేలు కేజీల మేతను ఆక్వా రైతులు వినియోగిస్తున్నారు. దీని విలువ మార్కెట్లో రెండు కోట్ల నుంచి మూడు కోట్ల రూపాయల మధ్య ఉంటుందని ఆక్వా సంఘ నాయకులు చెబుతున్నారు. రొయ్యల మేత ధరలు విపరీతంగా పెంచేసి సిండికేట్ వ్యాపారం చేయడంతో ఆక్వా రైతులు కుదేలవుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆక్వా బ్రహ్మయాప్ ద్వారా ఎప్పటికప్పుడు రొయ్యల ధరలు ఆన్లైన్ ద్వారా తెలిసేవి. ఇప్పుడు ఆ యాప్‌ను కూటమి ప్రభుత్వం ఆపేయడంతో రొయ్యల ధర ఎంత ఉన్నది తెలియడం లేదు. మేత ధరలు విపరీతంగా పెరగడంతో కుదేలవుతున్నాం. – పాల వసంతరెడ్డి, ఆక్వారైతు, హెచ్‌ఎన్‌పేట, సంతబొమ్మాళి మండలం రొయ్యల మేత ధరలు కేజీకి రూ.17 పెంచారు. మేత ధరలు నిలుపుదలపై హైకోర్టు తాత్కాలికంగా స్టే ఇచ్చినా ప్రభుత్వం మాత్రం ధరలను నియంత్రించలేదు. మూడు నెలలుగా విద్యుత్ సబ్సిడీ కూడా ఇవ్వలేదు. క్వాలిటీ రొయ్యల మేత అందించాలి. మేతక్వాలిటీ లేకపోవడంతో వైరస్ వ్యాప్తి చెంది ఆక్వా సాగుపై తీవ్ర ప్రభావం పడుతోంది. – కెళ్లి జగన్నాయకులు, ఆక్వా రైతు, డోకి కామన్నపేట, సంతబొమ్మాళి మండలం రొయ్యల మేత ధరలు పెంపును నిరసిస్తూ ఆక్వారైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మేత ధర పెంపుపై తాత్కాలికంగా స్టే ఇచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం ధరల పెంపు నియంత్రణపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రొయ్యల మేత ధరల పెంపుపై అసోసియేషన్ తరఫున జిల్లా కలెక్టర్‌కు కూడా ఆక్వా రైతులు వినతి పత్రం అందజేశారు. -
స్కూల్‌గేమ్స్ పోరు ఆరంభం
శ్రీకాకుళం న్యూకాలనీ : జిల్లాస్థాయి స్కూల్‌గేమ్స్ ఎంపిక ప్రక్రియ మొదలైంది. జిల్లా విద్యాశాఖ పరిధిలోని జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్కూల్‌గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్‌కు క్రీడాకారులు పోటెత్తారు. మొత్తం 34 క్రీడాంశాల్లో భాగంగా రాష్ట్రస్థాయి పోటీల షెడ్యూల్‌కు అనుగుణంగా తొలుత ఆరు క్రీడాంశాల్లో ఎంపికలు నిర్వహించారు. ఆదివారం జూడో, రెజ్లింగ్, గట్కా, లాన్‌టెన్నిస్, రగ్బీ క్రీడాంశాల్లో ఎంపికలను పూర్తిచేశారు. చెస్ అండర్–19 బాలబాలికల ఎంపికలు సోమవారం ఎచ్చెర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేదికగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. జూడో ఎంపికలను శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియంలో, రెజ్లింగ్ ఎంపికలు పెద్దపాడులోని ఓ వ్యాయామశాలలో, గట్కా ఎంపికలను నరసన్నపేట మండలం సత్యవరం జెడ్పీహెచ్‌స్కూల్ వేదికగా, రగ్బీ ఎంపికలు టెక్కలి ప్రబుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో, లాన్‌టెన్నీస్ శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలోని టెన్నీస్ కోర్టు వేదికగా ఎంపికల ప్రక్రియను నిర్వహించి పూర్తిచేశారు. త్వరలో తుది జట్లను ప్రకటించనున్నట్టు జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి చల్లా జగదీష్ పేర్కొన్నారు. శ్రీకాకుళంలో లాన్‌టెన్నీస్, జూడో, రెజ్లింగ్ ఎంపికలను ఎస్జీఎఫ్ సెక్రటరీ చల్లా జగదీష్ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. డీఈఓ ఎ.రవిబాబు సెలక్షన్ ట్రయల్స్ తీరును ఎప్పటికప్పుడు నిర్వహన కమిటీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఎంపికల ప్రక్రియలో ఆయా క్రీడాంశాల ఇన్చార్జిలతోపాటు సాధు శ్రీనివాసరావు, కె.రవికుమార్, పీడీ సంఘ ప్రతినిధులు, ఆయా క్రీడాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. టెక్కలిలో జరిగిన రగ్బీ ఎంపికల్లో జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు, కార్య నిర్వాహక కార్యదర్శి సిహెచ్.జగదీష్, జి.ఎం.జ్యోతిరాణి, అసోషియేషన్ అధ్యక్షుడు డి.రామకృష్ణ, నిర్వాహకులు బి.నారాయణరావు, కె.రఘనాధరావు, ఎన్.జనార్ధన్‌రావు, కె.కె.రామిరెడ్డి, ఎస్.లక్ష్మణరావు, జి.శ్రీనివాసరావు, ఎన్.రమేష్, కె.ప్రకాశ్, ఆదిశేషు, సుజాత, నీలకంఠేశ్వర్రావు, అలివేణి, సీతయ్య పాల్గొన్నారు. ● జిల్లాలో మొదలైన జిల్లాస్థాయి ఎంపిక పోటీలు ● తొలుత ఐదు క్రీడాంశాల్లో సెలక్షన్లు -
గేదెకు తప్పిన ప్రాణాపాయం
సోంపేట: పట్టణంలోని యూనియన్ బ్యాంక్ వెనుక ఇంటి నిర్మాణం కోసం తీసిన పెద్ద గొయ్యిలో ఆదివారం ఓ గేదె పడింది. నీరు ఉండటంతో బయటకు వచ్చే వీలు లేక రైతులు అగ్నిమాపక శాఖాధికారులను సంప్రదించారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రోప్ సహాయంతో గేదెను సురక్షితంగా బయటకు తీసి యజమానికి అప్పగించారు. అగ్నిమాపక శాఖాధికారి సూర్యారావు, సిబ్బంది విజయ్ కుమార్, నరేష్,బాబురావు, ఈశ్వరరావు పాల్గొన్నారు. కాష్యూ స్టార్టప్‌కు ప్రభుత్వ గుర్తింపు టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు అభివృద్ధి చేస్తున్న కాష్యూ హబ్ స్టార్టప్‌కు డీపీఐఐటీ స్టార్టప్ ఇండియా గుర్తింపు లభించింది. ఐతం రైజ్ ఇంక్యుబేటర్ సీఈఓ బి.మనోజ్‌కుమార్ మార్గదర్శకత్వంలో విద్యార్థులు కె.విష్ణువర్ధన్, జి.అరవింద్‌స్వామి, డి.తరుణ్‌కుమార్ తదితరులు ఈ స్టార్టప్‌కు రూపకల్పన చేశారు. జీడి పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు సులభతరంగా జీడి ప్రాసెసింగ్ చేసేందుకు వీలుగా రూపొందించిన ఈ స్టార్టప్‌కు భారత ప్రభుత్వం గుర్తింపు ఇచ్చినట్లు డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. స్టార్టప్‌ను మరింత అభివృద్ది చేసేందుకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆర్కేవీవై రాప్టర్ కార్యక్రమం కింద రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే జాతీయ స్థాయి స్టార్టప్ కార్యక్రమాల్లో త స్టార్టప్‌కు ప్రత్యేక గుర్తింపు లభించినట్లుతెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, కళాశాల యాజమాన్యం ఆదివారం విద్యార్థుల బృందాన్ని అభినందించారు. -
అమెరికాలో పెళ్లి.. ఆన్లైన్లో దీవెనలు
నందిగాం: సాంకేతిక పరిజ్ఞానం పెరిగాక పరిణయ క్రతువులూ వినూత్నంగా జరుగుతున్నాయి. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న జంట వీసా సమస్యతో స్వదేశానికి రాలేకపోవడం, అలాగే అమ్మాయి, అబ్బాయి తల్లిదండ్రులు వీసా సమస్యతో అమెరికా వెళ్లలేకపోవడంతో ఆ జంట అక్కడ వివాహం చేసుకోగా తల్లిదండ్రులు ఆన్లైన్లో వివాహం చూసి ఆశీర్వదించిన ఘటన నందిగాం మండలం పోలవరం గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. నందిగాం మండలం బెజ్జిపల్లి పంచాయతీ పోలవరానికి చెందిన కూను జోసెఫ్, సుజాతల కుమారుడు మనష్సె అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. హైదరాబాద్ హైకోర్టులో పనిచేస్తున్న పాల్ప్రకాష్, సునీతల కుమార్తె హెప్సిబాతో యువకుడికి వివాహం నిశ్చయమైంది. హెప్సిబా కూడా అమెరికాలోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. అయితే వివాహ సమయానికి వీరికి వీసా సమస్య వచ్చి పడింది. స్వదేశానికి రాలేకపోయారు. వధూవరుల తల్లిదండ్రులు కూడా వీసా సమస్య వల్ల అక్కడకు వెళ్లలేకపోయారు. దీంతో వివాహం అమెరికాలోనే చేసుకోవాలని నిశ్చయించారు. అమెరికాలోని కెంటకీ స్టేట్ ల్యూయిస్విల్లే గ్రామంలో బెథనీ చర్చిలో శనివారం రాత్రి 8 గంటలకు క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. వరుడి తండ్రి జోసెఫ్ ఇంటిలోనూ బంధువర్గమంతా ఆన్లైన్లో వివాహాన్ని వీక్షించారు. భావోద్వేగానికి గురై ఆన్లైన్లోనే వారికి దీవెనలు అందజేసి సంతోషపడ్డారు. -
ఇటు వరద.. అటు అవినీతి బురద
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని పొన్నాం, బైరి, బట్టేరు ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఓ వైపు వరదలతో నదులు పొంగి పొర్లుతుంటే.. నిల్వ ఉంచిన ఇసుకపై కూటమి నేతల కళ్లు పడ్డాయి. దీంతో చాపకింద నీరులా ఇసుకను పెద్ద పెద్ద జేసీబీ మిషన్లు పెట్టి ఎక్కడికక్కడే తోడేస్తున్నారు. గడిచిన వారం రోజులుగా పడిన వర్షాలు కారణంగా పూర్తిగా నదులన్నీ జలమయమయ్యాయి. దీంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం నిల్వ ఉంచిన ఇసుకపై అధికార పార్టీ నేతలు దండిగా సొమ్ము చేసుకునేందుకు సమాయత్తమయ్యారు. బైరి తోటల్లోనూ, పొలాల్లోనూ, కళ్లా ల్లోనూ, వంశధార బ్రిడ్జి కింద దాచుకున్న ఇసుకను సైతం మూడో కంటికి కనిపించకుండా లారీలకు ఎత్తేస్తున్నారు. ఒక్కో ట్రాక్టరు ఇసుక రూ.2వేలకు గాను, సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు లారీకై తే రూ.పదిహేను వేలకు పైగా అమ్ముతున్నట్లు తెలుస్తోంది. పట్టించుకోని యంత్రాంగం యథేచ్ఛగా ఇసుక రవాణా అక్రమంగా జరుగుతున్నప్పటికీ మైన్స్, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం చూసీచూడనట్లుగానే వదిలేస్తున్నారన్న ఆరోపణ లు వినిపిస్తున్నాయి. మండలంలో పలుచోట్ల తనిఖీలు చేశామని చెప్పడమే గానీ ఎక్కడా ఇసుకను సీజ్ చేసిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. ఇప్పటికే బైరి, బట్టేరు, పొన్నాం ప్రాంతాల్లో నిల్వ ఉంచిన ఇసుక కొన్ని వేల క్యూబిక్ టన్నులు ఎక్కడికక్కడే కనిపిస్తోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమంగా ఇసుక రవాణా సాగిస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు. బైరిలో ఎక్కడికక్కడే ఇసుక పోగులు బైరి గ్రామంలో ఎక్కడికక్కడే ఇసుక పోగులు ఉన్నాయి. వరద లు, తుఫాన్లు వచ్చినా ఇసుక రవాణా ఇక్కడ ఆగడం లేదు. నిత్యం వందలాది ట్రాక్టర్లు, లారీలు సైతం ఇసుకను అక్రమంగా తరలించుకు పోతున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం కూటమి నేతలంతా కలిసి తమ గ్రామంలోని తోటల్లోనూ, ప్రధాన రహదారులకు ఇరువైపులా ఇసుక నిల్వ చేసుకున్నారు. – ఎండి అసిరినాయుడు, మాజీ సర్పంచ్ -
నాన్నా వద్దంటున్నా వినకుండా..
● ఈత వచ్చు దూకుతానంటూ నాగావళిలో దూకిన వ్యక్తి ● కూతురి కళ్లెదుటే ఘటన ● ఇప్పటివరకు జాడ తెలియని వైనం శ్రీకాకుళం క్రైమ్ : పదమూడేళ్ల కుమార్తె.. వినా యక నిమజ్జనంలో తండ్రి చిందులేస్తుంటే ముచ్చటపడింది. హుషారుగా సందడి చేస్తుంటే ఆనంద పడింది. కానీ మద్యం మత్తులో తండ్రి చేసిన పని ఆ కుమార్తెను నిశ్చేష్టురాలిని చేసింది. ‘నాకు ఈత వచ్చు.. నదిలో దూకుతా’ అన్న తండ్రిని ‘నాన్నా వద్దు నాన్నా..’ అని ఎంతో బతిమలాడింది. కానీ ఉత్సవ ఉత్సాహం, మద్యం మత్తు ఆ వ్యక్తిని ఊరుకోనీయలేదు. మొబైల్, షర్టు తీసి కుమార్తెకు ఇచ్చి అమాంతం నదిలో దూకేశాడు. అంతే ఆ ప్రవాహంలో ఇక అతను కనిపించనే లేదు. జిల్లాకేంద్రంలో జరిగిన ఈ ఘటన సంచలనం రేకె త్తించింది. రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దరెల్లివీధిలో నివసిస్తున్న షణ్ముఖ శ్రీను(36), భార్య అనితతో కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. వీరికి 13 ఏళ్ల జాహ్నవి, 11 ఏళ్ల మోహన్ సంతానం ఉన్నారు. పెద్దరెల్లివీధిలో శనివారం రాత్రి 8 గంటలకు వినాయక నిమజ్జన ఊరేగింపు ప్రారంభమైంది. డీజేలు, డ్యాన్సులతో హోరెత్తించారు. ఈ క్ర మంలో షణ్ముఖశ్రీను కుమార్తెను నడిపించుకుంటూ తనవెంటే తీసుకెళ్లాడు. అప్పటికే అతను మద్యం సేవించి ఉన్నాడు. వంతెన సమీపానికి వచ్చేసరికి సరిగ్గా 12 గంటలకు కుమార్తెతో తనకు ఈతవచ్చని, నదిలో దూకి ఒడ్డుకు చేరుకుంటానని చెప్పి మొబైల్‌ఫోన్, షర్టు తీసి ఇచ్చాడు. జాహ్నవి వద్దని వారించినా వినలేదు. తన తండ్రి దూకేందుకు ప్రయత్నిస్తున్నాడని నిర్వాహకులకు చెప్పేలోగానే షణ్ముఖ శ్రీను దూకేశాడు. ఆ ప్రవాహానికి దూకిన వ్యక్తి ఆనవాలైనా కనిపించలేదు. దీనిపై అదృశ్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఈశ్వరరావు చెప్పారు. నిమజ్జనాలు రాత్రి 10 నుంచి 11గంటల్లోగా ముగించాలని పోలీ సులు ఆంక్షలు పెట్టినా అర్ధరాత్రి వరకు ఉత్సవాలు కొనసాగించారు. చిన్న పిల్లలను నిమజ్జన ప్రదేశాలకు తీసుకెళ్లకూడదన్నా పెడచెవిన పెట్టారు. ఊరేగింపుల్లో మద్యం మత్తులో డ్యాన్స్‌లు వేయకూడదని తెలిసినా పట్టించుకోలేదని విమర్శలు వినిపించాయి. -
జాతీయ సమైక్యతకు హిందీ దోహదం
శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ సమైక్యతకు జాతీయ భాష హిందీ ఎంతో అవసరమని డీఈఓ ఏ.రవిబాబు అన్నారు. హిందీ మంచ్ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని న్యూ సెంట్రల్ స్కూల్లో హిందీ పక్షోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ హిందీ సలహా మండలి సభ్యులు కోనే శ్రీధర్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో 15 రోజులు పాటు హిందీ పక్షోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని తెలిపారు. విశ్రాంత డీఈఓ బలివాడ మల్లేశ్వరరావు మాట్లాడుతూ జాతీయ భాష హిందీ పట్ల విద్యార్థులకు ఉన్న అభిరుచి ప్రశంసనీయమన్నారు. విశ్రాంత సెట్‌శ్రీ సీఈఓ సురంగి మోహనరావు మాట్లాడుతూ జాతీయ భాష హిందీ ప్రచారానికి ఎక్కడా జరగని కృషి శ్రీకాకుళం జిల్లాలో గత 20 ఏళ్లుగా జరుగుతోందని కొనియాడారు. హిందీ ప్రచార సభ రాష్ట్ర అధ్యక్షులు సి.ఎల్.నాయుడు, పండిత పరిషత్ రాష్ట్ర మహిళా కార్యదర్శి కనిమెట్ట పద్మావతి, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్ డబ్ల్యూజే) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.వి.మల్లేశ్వరరావు, న్యూ సెంట్రల్ స్కూల్ డైరెక్టర్ పి.శ్రీకాంత్, కార్యక్రమ కన్వీనర్ బాడ మంజుల, హిందీ మంచ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కనుగుల సత్యం, రొంపివలస రామారావు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్టీపీ శిరీష, సీనియర్ ఉపాధ్యాయ సంఘ నేత దొంతం పార్వతీశం, హిందీ మంచ్ పూర్వ అధ్యక్షులు సూరంపల్లి బ్రహ్మాజీ తదితరులు ప్రసంగించారు. అనంతరం డీఈఓ ఏ.రవిబాబు (విద్యారంగం), పోలుమహాంతి శ్రీకాంత్ (విద్యారంగం), ఎం.వి.మల్లేశ్వరరావు (జర్నలిజం), సురంగి మోహనరావు (సమాజ సేవ), సి.ఎల్ నాయుడు (హిందీరంగం), ముద్దాడ ఆదినారాయణ ( హిందీ ఉపాధ్యాయులు), పివీఎస్ఎన్ మూర్తి (హిందీ ప్రచారక్)లను ఘనంగా సత్కరించారు. హిందీ సులేఖన్ (హ్యాండ్ రైటింగ్), హిందీ దోహా రీడింగ్, ప్రియ కవి పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. -
మేలుకో !
‘ధర’దడఆక్వా రైతులకు దిగులు పట్టుకుంది. మేత ధరలు పెరుగుతున్నాయి. –8లోప్రసాదాల పవిత్రత కాపాడుకో.. గాలి లేక ఆరకపోవడమే సమస్య వర్షాల వాతావరణం కారణంగా తయారు చేసిన లడ్డూలు గాలి సరిపడక ఆరలేదని గుర్తించాం. రుచి నాణ్యతలో ఎలాంటి రాజీ లేదు. కానీ చెమ్మ కారణంగా భక్తులు కొంత మంది అడిగారు. దీంతో ఈఓ అనుమతితో వెంటనే కొత్తగా లడ్డూలను తయారు చేసి విక్రయించాం. – డి.వెంకటరమణ, ప్రసాదాల సెక్షన్ సూపరింటెండెంట్. భక్తుని చేతిలో తేమతో ఉన్న లడ్డూ -
విజయమ్మ సేవలు అభినందనీయం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): కిడ్నీ రోగులకు డయాలసిస్ చేసేందుకు ఉచితంగా అంబులెన్స్ అందించి ఉద్దాన ప్రాంతాన్ని ఊపిరిగా భావించిన విజయసాయిరాజ్ సేవలు అభినందనీయమని వక్తలు కొనియాడారు. కాళింగ సామాజిక వర్గం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో జెడ్పీ తాజా మాజీ చైర్పర్సన్ పిరియా విజయను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్, మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణిలు మాట్లాడుతూ విజయమ్మ గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. తాగునీరు, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులు కేటాయించి తనదైన ముద్ర వేసుకున్నారని ప్రశంసించారు. అనంతరం పిరియా విజయ మాట్లాడుతూ జిల్లా ప్రజలంతా తనను ఆదరించారని, చైర్మన్ పదవిని అప్పగించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కూన రవికుమార్, పిరియా సాయిరాజ్, సూర శ్రీనివాసరావు, రిటైర్డ్ జిల్లా జడ్జి సింగూరు మోహనరావు, రోణంకి కృష్ణంనాయుడు, తమ్మినేని వాణమ్మ, తమ్మినేని చిరంజీవినాగ్, బల్ల గిరిబాబు, మార్పు పృథ్వీ, దానేటి శ్రీధర్, మొదలవలస రమేష్, పూడి తిరుపతిరావు, పైడి వేణుగోపాలరావు, డాక్టర్ సింధూర, డాక్టర్ పి.జె నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
పిట్ట కొంచెం.. వ్యూస్ ఘనం
ఇచ్ఛాపురం రూరల్: రీల్స్.. జెన్ జీ, జెన్ ఆల్ఫాలను విపరీతంగా ఆకట్టుకుంటున్న సాధనం. తమ ప్రతిభను నిరూపించుకోవడానికి రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం అలవాటు చేసుకుంటున్నారు. ఇచ్ఛాపురం మండలం బిర్లంగి ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న శివానీ కూడా రీల్స్‌తో అదరగొడుతోంది. పైగా తండ్రి ధర్మరాజు శెట్టి దగ్గరుండి కూతురితో ఇలా సందేశాత్మక రీల్స్ చేయిస్తుండడం విశేషం. ఇప్పటికి 1131 రీల్స్ రూపొందించిన బాలిక.. నిత్యం ఏదో ఒక కొత్త అంశంతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా వచ్చిన ‘ఇరుముడి’ చిత్రంలోని ‘కట్టుకట్టు ఇరుముడి’ పాటకు, అలాగే ‘సన్నాఫ్ విశ్వనాథం’ సినిమాలోని ‘నేనో బటర్‌ఫ్లై’ పాటలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి చికిరీ’ పాటకు చేసిన నృత్యానికి ఆ చిత్ర దర్శకుడు బుచ్చి బాబు సైతం ముగ్ధుడై అభినందించారు. ఇప్పటి వరకు 200కు పైగా కామెడీ రీల్స్ చేసి నెటిజన్లను నవ్విస్తోంది. -
మహిళల రక్షణకు హెల్ప్‌లైన్ నంబర్లు
శ్రీకాకుళం క్రైమ్ : జాగ్రత్తమ్మా.. ప్రతి ఇంటిలో వినిపించే డైలాగు ఇది. అమ్మాయి ఊరికి వెళ్లినా, బడికి వెళ్లినా, ఫంక్షన్‌కు వెళ్లినా.. ఆఖరికి గుడికి వెళ్లినా సరే గడప దాటిన ప్రతిసారీ జాగ్రత్త చెప్పి తీరుతాం. అమ్మానాన్నలే కాదు ప్రభుత్వ శాఖలు కూడా అమ్మాయిల భద్రత కోసం నిరంతరం శ్రమిస్తుంటా యి. ఆయా నంబర్లకు కాల్ చేస్తే చాలు.. ఇట్టే వచ్చి వాలిపోతాయి. ఈ నంబర్లు అమ్మ, నాన్న, అన్న దగ్గర, తమ్ముడి దగ్గర ఉండి తీరాలి. మన ఇంటి మహాలక్ష్మిని కాపాడుకునేందుకు ఆ మాత్రం అవగాహన పెంచుకుని తీరాలి. పోక్సో చట్టం : 18 ఏళ్ల లోపు బాలికలపై లైంగిక దాడులు, వేధింపుల నుంచి రక్షణ కల్పించే అత్యంత కఠినమైన చట్టం. నిర్భయ చట్టం : మహిళలపై జరిగే యాసిడ్ దాడులు, లైంగిక వేధింపులు, స్టాకింగ్ (వెంబడించడం), వోయరిజం (ఫొటోలు రహస్యంగా తీయడం) వంటి నేరాలకు ఈ చట్టం వర్తిస్తుంది. కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పోష్ యాక్ట్): ఉద్యోగం చేసే ప్రదేశాల్లో మహిళల కు, యువతుకు సురక్షిత వాతావరణం కల్పించడం, లైంగిక వేధింపులను అరికట్టడం ఈ చట్టం పని. జీరో ఎఫ్ఐఆర్ : ఒక మహిళపై నేరం జరిగేటప్పుడు పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లోనైనా క్షణాల్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. ఆ తర్వాత దానికి సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేస్తారు. వరకట్న నిషేధ చట్టం : వరకట్నం తీసుకోవడం, ఇవ్వడం రెండూ నేరమే. ఈ చట్టం ప్రకారం కఠిన శిక్షలు పడతాయి. గృహహింస నిరోధక చట్టం : ఇంట్లో భర్త లేదా ఇతర కుటుంబసభ్యుల నుంచి ఎదురయ్యే శారీరక, మానసిక, ఆర్థిక వేధింపుల నుంచి మహిళలకు రక్షణ క ల్పించే చట్టమిది. -
ఐజీ సమీక్షలో ఎస్పీ
శ్రీకాకుళం క్రైమ్ : స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, నేర నియంత్రణ, మహిళల భద్రత, రోడ్డు భద్రత గంజాయి నిర్మూలన, సైబర్ నేరాల నియంత్రణపై విశాఖపట్నం రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) గోపినాథ్ జెట్టి రేంజి పరిధి ఎస్పీలతో శనివారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. మెళియాపుట్టి: మండలంలోని గంగరాజ పురం గ్రామానికి చెందిన మానసిక దివ్యాంగుడు కై లాష్ (25) శనివారం అదే గ్రామంలోని చెరువులో పడి మృతి చెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. యువకుడు ఉదయం నుంచి కనిపించలేదు. కుటుంబ సభ్యులు ఎంతగా గాలించినా లాభం లేకపోయింది. సాయంత్రం చెరువులో తేలుతూ కనిపించడంతో బయటకు తీసి ఒడిశా గారబంద ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కవిటి : ముత్యాలపేటకు చెందిన సన్నకారు రైతు రెయ్యి అప్పలస్వామి(100) శనివారం తన స్వగృహం వద్ద వయోభారంతో మృతిచెందారు. చనిపోయే వరకు తన దైనందిన కార్యక్రమాలను సొంతంగానే చేసుకునే వారని కుటుంబ సభ్యులు తెలిపారు. నరసన్నపేట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ శనివారం నరసన్నపేట ఏరియా ఆసుపత్రి వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బగ్గు జయలక్ష్మి, సుజాత, జ్ఞానేశ్వరి, గిరిజ, శైలజ, కల్పనలు మాట్లాడుతూ సిబ్బందిని వెంటనే రెగ్యులర్ చేయాలని, వంద శాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలని, ట్రాన్స్ఫర్ సదుపాయం కల్పించాలని, మరణించిన వారికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, కుటుంబాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కాశీబుగ్గ : పలాస కిడ్నీ పరిశోధన ఆస్పత్రి వైద్యులు విధులకు సకాలంలో హాజరుకాకపోవడంపై ఎమ్మెల్యే గౌతు శిరీష తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు ఆస్పత్రికి వెళ్లిన ఎమ్మెల్యే అక్కడ రోగులు వైద్యుల కోసం నిరీక్షించడాన్ని గమనించారు. ఆరా తీస్తే 17 మందికి ఇద్దరు వైద్యులు మాత్రమే అందుబాటులో ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన ఆస్పత్రిలో సేవలందించడంలో జాప్యం వహించడం సరికాదన్నారు. విధులకు ఆలస్యంపై తగిన కారణాలతో నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం పలాస రైల్వే గేటువద్ద చేపడుతున్న ఆర్వోబీ పనులను పరిశీలించారు. గార : జైలులో ఉన్న ప్రతీ ఖైదీకి రాజ్యాంగం కల్పించిన న్యాయం సహాయం అందిస్తామని, నిరుపేద ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందేలా చూడటం న్యాయ వ్యవస్థ భాధ్యత అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికారి సంస్థ అధ్యక్షురాలు సునీత కొండబోలు స్పష్టం చేశారు. శనివారం అంపోలు పరిధిలోని జిల్లా జైలును సంస్థ కార్యదర్శి కె.హరిబాబుతో కలిసి సందర్శించారు. ఖైదీలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. -
పక్షి పిల్లల సంరక్షణకు చర్యలు
ఇచ్ఛాపురం రూరల్: భారీ వర్షాలు, ఈదురుగాలులకు తేలుకుంచి గ్రామంలోని చెట్లపై గూళ్లో ఉండాల్సిన విదేశీ పక్షి పిల్లలు నేలపై పడి గాయపడటం, మరణించడం జరుగుతుందంటూ శనివారం ‘సాక్షి’లో ‘ఆపదలో అతిథులు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. శనివారం అటవీశాఖ సిబ్బంది గ్రామానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టారు. గాయపడిన పక్షి పిల్లలను ప్రత్యేక గదికి తీసుకువెళ్లి చికిత్స అందజేశారు. పక్షి పిల్లలు నేలరాలితే స్థానికంగా ఉంటున్న తమ సిబ్బందికి సమాచారం అందించి, చికిత్సాలయానికి తీసుకువచ్చేందుకు సహాయపడాలని స్థానికులను కోరారు. పక్షులను పరిశీలించిన వారిలో మందస డీఆర్వో టి.దేవరాజు, బీట్ అధికారులు భానుమూర్తి, సురేష్ ఉన్నారు. -
గంగమ్మ ఒడికి గణనాథుడు
చవితి వేడుకలు పరిపూర్ణంగా ముగియడంతో గణపతి విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుకున్నాయి. శనివారం రాత్రి వినాయక నిమజ్జనాలు ఉత్సాహంగా జరిగాయి. ఆటపాటలతో భక్తులు స్వామిని ఊరేగించి అనుపు ఉత్సవం నిర్వహించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం శాలిహుండంలోని బౌద్ధ స్థూపాలునిమజ్జనానికి తరలివెళ్తున్న గణపయ్యశ్రీకాకుళం అర్బన్: ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంక్‌లు ఆదివారం పనిచేయనున్నాయి. ఈ నెల 28, 29, 30 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా జిల్లాలోని దాదాపు అన్ని బ్యాంకు శాఖలు మూసిసే అవకాశం ఉంది. ఈ మూడు రోజుల్లో ప్రజలకు బ్యాంకింగ్ సేవలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్స్), రిజర్వ్ బ్యాంక్ అనుమతులతో ఆదివారం అన్ని బ్యాంకులు సాధారణ పని దినం మాదిరిగా పనిచేయనున్నాయి. అత్యవసరమైన బ్యాంకింగ్ అవసరాలు ఉన్న ప్రజలు ఆదివారం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని శ్రీకాకుళం జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ పి.శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. -
తల్లి గర్భంలో ఉన్నప్పుడే చంపేయాలన్నంత వివక్ష ఒకనాడు చూపారు.. కార్యదీక్షతో వివక్షలను దాటుకుని మహాలక్ష్మిగా నవ్వుతూ నిలబడింది. పది దాటి చదివితే గొప్పే అని హేళన చేశారు.. ఉన్నత ఉద్యోగాలను అవలీలగా సాధించి సరస్వతీ మాతకు ప్రతిరూపమై ఎదిగింది. ఆడపిల్ల అంటే గుండెలప
కాశీబుగ్గ: కడుపులో బిడ్డ అమ్మాయి అని తెలిసి బలవంతంగా అబార్షన్లు చేయించిన ఘట్టాలు అనాదిగా వింటూనే ఉన్నాం. కానీ ఈ తరం అలా లేదు. కంటే కూతుర్నే కనాలని చెబుతోంది. కూతు రు పుడితే భారం అనుకున్న రోజులు దాటి అమ్మాయి పుడితే వరం అనే భావన బలపడుతోంది. ఈవిషయమై వివిధ వర్గాల నుంచి సాక్షి అభిప్రాయాలు సేకరించగా అమ్మాయికే తమ తొలి ప్రాధాన్యమంటూ అభిప్రాయం వెలిబుచ్చారు. టెక్కలి: లింగాలవలసలో ఓ షిర్డీసాయి మందిరం కనిపిస్తుంది. మందిరంలో ఓ యువతి సాయిని పూ జిస్తున్నట్టుగా విగ్రహం ఉంటుంది. ఇది ఓ తండ్రి తన కూతురిపై పెంచుకున్న ప్రేమకు నిదర్శనం. లింగాలవలస గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ సంపతిరావు రాఘవరావు కుమార్తె రూప 27 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె షిర్డీసాయి భక్తురాలు కావడంతో కుమార్తెను మర్చిపోలేక ఇలా గుడిలో ఆమె రూపాన్ని ప్రతిష్టించారు. నిత్యం కుమార్తెను స్మరిస్తూ ఆమె జ్ఞాపకాలకు ఊపిరి పోస్తున్నారు. -
జల దిగ్బంధం
ఆమదాలవలస రూరల్: నాగావళి నది ఉగ్రరూపం దాల్చడంతో పలు గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే చిక్కుకున్నా యి. బూర్జ మండలం అల్లెన గ్రామం వద్ద గట్టుపైకి వరద నీరు చేరడంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. జి.కె.వలస, కొరపాం, నిమ్మతొర్లివాడ, పాత నిమ్మ తొర్లివాడ, కొత్తవలస, చీమలవలస, కొర్లకోట, తొగరాం, కలివరం తదితర గ్రామాలకు వరద ముప్పు తప్పడం లేదు. పంట పొలాలన్నీ జలమయంగా మారడంతో రైతు లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అల్లెన వద్ద నాగావళి వరద నీరు గట్టుపైకి చేరి ప్రవహించడంతో గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. సుమా రు 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని మోపసుబందరు, కిల్లిపాలెం, కళ్లేపల్లిలో ముంపు ప్రాంతాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం పరిశీలించారు. అధికారులు చేపట్టిన చర్యలను ఆయన పరిశీలించి బాధితులకు తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదే విధంగా, రాగోలు గ్రామంలో ముంపునకు గురైన పంట పొలాలను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాలం, జిల్లా అధ్యక్షుడు ఎస్.తేజేశ్వరరావు పరిశీలించారు. ముంపు పొలాల పరిశీలన కవిటి: మండలంలోని బొరివంక, బిగొనపపుట్టుగ రెవెన్యూ గ్రామాల్లో ముంపునకు గురైన పంట పొలాలను జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ హరి ఓం పాండ్యా శనివారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారితో పాటు ప్రత్యేకాధికారి సీహెచ్ చంద్రశేఖర్, తహసీల్దార్ టి.కల్యాణచక్రవర్తి, వ్యవసాయాధికారి పి.శ్రీదేవి, మండలపరిషత్ ఏఓ కె.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పంట నష్టాన్ని నివారించండి: కలెక్టర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: వరద ముంపునకు గురైన వ్యవసాయ పొలాల్లో పేరుకుపోయిన నీటిని తక్షణమే బయటకు పంపి పంట నష్టాన్ని నివారించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ వరద ప్రభావిత రైతుల వివరాలను నమోదు చేసి, వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల ప్రకారం వారికి అవసరమైన యూరియా, పొటాష్ ఎరువులను అందించేందుకు జాబితాలు సిద్ధం చేయాలని సూచించారు. నివాస ప్రాంతాలు, ఇళ్లలోకి చేరిన బురదను యుద్ధ ప్రాతిపదికన శుభ్రం చేయించాలన్నారు. పైప్లైన్లు మునిగిపోయిన ప్రాంతాల్లో నీటి నాణ్యతా పరీక్షలు పూర్తి చేసి, స్వచ్ఛత ధ్రువీకరణ పొందిన తర్వాతే తాగునీటి సరఫరా పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. తుఫాన్ నష్టాల గుర్తింపు శ్రీకాకుళం పాతబస్టాండ్: తీవ్ర వాయుగుండం ప్రభావంతో జిల్లాలో నాలుగు రోజులపాటు కురిసిన వర్షాలకు వివిధ విభాగాలకు భారీగా నష్టం వాటిల్లింది. వ్యవసాయానికి సంబంధించి వరి, ఇతర పంటలు 11973.2 హెక్టార్లు, హార్టీకల్చర్‌లో 762.6 హెక్టార్లలో నష్టం వాటిల్లగా ఆయిల్‌పామ్ చెట్లు 255, కొబ్బరి చెట్లు 920 కూలిపోయాయి. 177 గృహాలు ప్రభావితమయ్యాయి. రెండు పశువులు, పది వరకు గొర్రెలు, మేకలు చనిపోయాయి. ఆర్అండ్బీ రోడ్లు 382 కిలోమీటర్ల మేర పాడయ్యాయి. పంచాయతీరాజ్ రోడ్లు నాలుగు చోట్ల, మున్సిపల్ రోడ్లు 1.3 కిలోమీటర్ల మేర పాడయ్యాయి. 305 వీధి లైట్లు పాడయ్యాయి. మైనర్ ఇరిగేషన్ పనులు 189 నాశనమయ్యాయి. చేనేత సామగ్రికి రూ.40 వేలు నష్టం వాటిల్లింది. విద్యుత్ శాఖకు సంబంధించి 33–11కేవీ ఫీడర్లు 55, 11కేవీ ఫీడర్లు 409, 33/1 కేవీ సబ్ స్టేషన్లు 96, 33 కేవీ పోల్స్ 8, 11కేవీ పోల్స్ 244, ఎల్టీ పోల్స్ 284, డీటీ ట్రాన్మ్‌ఫార్మర్లు 84 దెబ్బతిన్నాయి. రహదారులు ఛిద్రం బూర్జ: నాగావళి నది ఉగ్రరూపం దాల్చడంతో తీర గ్రామాల రోడ్లు అతలాకుతలమయ్యాయి. శనివారం నాటికి ఇంకా వరి పొలాలు వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. వరద ప్రభావంతో అల్లెన, లక్కుపురం, బూర్జ, గిరడపేట, కాఖండ్యాం, లంకాం తదితర గ్రామాల రోడ్లు ఛిద్రమయ్యాయి. అల్లెన, లక్కుపురం, బూర్జ, గిరడపేట, కాఖండ్యాం, లంకాం గ్రామాల్లో పంట పొలాలు వరద నీటలోనే ఉన్నాయి. -
రైతులకు పరిహారం అందించాలి
బూర్జ: రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని మాజీ స్పీకర్, శ్రీకాకుళం వైఎస్సార్సీపీ పార్లమెంటరీ సమన్వయకర్త తమ్మి నేని సీతారాం డిమాండ్ చేశారు. నాగావళి ఉగ్రరూ పం దాల్చి వరద ముంపునకు గురైన అల్లెన, జి.బి.పురం, పనుకపర్త, లక్కుపురం గ్రామాల్లో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లెన గ్రామంలో వరద రక్షణ గోడ వరద తాకిడికి గురైందన్నారు. ఈయనతో పాటు యువ నాయకుడు తమ్మినేని వెంకట చిరంజీవి నాగ్, మాజీ ఎంపీపీ కర్నేన దీప, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బెజ్జిపురం రామారావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుమ్మడి రాంబాబు, జిల్లా ఐటీ విభాగం కార్యదర్శి తొత్తడి సురేష్, నాయకులు జడ్డు మహేశ్వరరావు, వి.కృష్ణ, వి.గోవిందరావు, ఎం.శ్రీనివాసరావు, జి.వెంకటరావు, కరణం అనిల్‌కుమార్, జడ్డు హరి, జడ్డు రమానంద, గిరి బాబు, ఎస్. శ్రీనివాసరావు ఉన్నారు. -
మనీ ఎక్స్చేంజ్ పేరుతో దారి దోపిడీ
ద్వారకానగర్ (విశాఖ): మనీ ఎక్స్చేంజ్ పేరుతో నిందితులు ముగ్గురు బాధితులను బురిడీ కొట్టించి రూ.68 లక్షల నగదు, పది తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. టెక్కలి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న రమేష్‌కు, అతని స్నేహితుడికి ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తుల ద్వారా డాలర్ల మార్పిడి వ్యవహారం ఏర్పడింది. డాలర్లు అందజేస్తే అందుకు సమానమైన భారత కరెన్సీ చెల్లించేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి డైమండ్ పార్క్ నుంచి హైవే వైపు వెళ్లే మార్గంలో రమేష్, అతని భార్య, స్నేహితుడు కారులో నగదుతో వేచి ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ద్విచక్ర వాహనంపై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. ఆన్లైన్లో పరిచయమైన రాజు అనే వ్యక్తి తమను పంపించాడని చెప్పి బాధితులను నమ్మించారు. అనంతరం కారులో ఉన్న వారిపై దాడి చేసి రెండు బ్యాగులను ఎత్తుకెళ్లారు. వాటిలో రమేష్ స్నేహితుడి బ్యాగులో రూ.50 లక్షల నగదు, రమేష్ బ్యాగులో రూ.18 లక్షల నగదు, 10 తులాల బంగారు ఆభరణాలు ఉన్నట్లు బాధితులు తెలిపారు. ద్వారకనగర్ క్రైమ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రాజు బృందం ముందుగానే వేసిన స్కెచ్‌గా ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చారు. శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని డేఅండ్‌నైట్ సమీప నాగావళి వంతెన పైనుంచి దూకి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. గుజరాతిపేట వెంకటేశ్వరనగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ దువ్వు మోహనరావు శుక్రవారం రాత్రి నుంచి కనిపించడం లేదని, డేఅండ్‌నైట్ వంతెన వద్ద కొందరు వ్యక్తులు మోహనరావు వేసుకునే వస్త్రాలను పోలికపట్టి నదిలో దూకేసినట్లు తనతో చెప్పారని మోహనరావు కుమార్తె లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతేడాది ఆర్థిక సమస్యలతో మోహనరావు భార్య రాజ్యలక్ష్మి ఇదే వంతెనపైనుంచి దూకి గల్లంతై గనగళ్లవానిపేటలో మృతదేహమై తేలిందని, ఆ మనస్థాపంతో మోహనరావు ఎప్పుడూ దిగాలుగా ఉండేవారని కుటుంబసభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. రాత్రి భోజనం చేసిన మోహనరావు 8.30 గంటల నుంచి కనిపించలేదని పేర్కొనడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. -
రైలు ప్రమాద బాధితుడికి పరామర్శ
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): టెక్కలి వద్ద బుధవారం జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇంటర్ విద్యార్థి సాల్మన్రాజుని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ శనివారం పరామర్శించారు. తల్లిదండ్రులతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా కల్పిస్తూ కొంత ఆర్థిక సాయం అందించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. వారితో పాటు వైఎస్సార్సీపీ కాళింగ కుల బీసీ విభాగం అధ్యక్షుడు ఆరంగి మురళీధర్, కూరాకుల, పొందరకుల బీసీ విభాగం అధ్యక్షుడు రాజాపు అప్పన్న, పంచాయతీరాజ్ ఉపాధ్యక్షులు నడుపూరు శ్రీరామ్మూర్తి, నూక సత్యరాజు, రాష్ట్ర ఐటీ విభాగం కార్యదర్శి కిల్లి అజయ్‌కుమార్, టెక్కలి ఆర్టీఐ విభాగం అధ్యక్షుడు బడ్డ రాజేష్, ఆట్ల రాహుల్‌కుమార్, కొండపల్లి రాకేష్, మురళిరెడ్డి తదితరులున్నారు. -
పిల్లలు చనిపోయినా ఐటీడీఏ పట్టించుకోలేదు
టెక్కలి: గిరిజన హాస్టల్లో చదువుతూ తమ పిల్లలు చనిపోతే ఐటీడీఏ అధికారులు కనీసం పట్టించుకోలేదని, ఇప్పటి వరకు గ్రామాలకు రాలేదని బాధిత కుటుంబ సభ్యులు ఐటీడీఏ పీఓ పవార్ స్వప్నిల్ ఎదుట వాపోయారు. శనివారం ఐటీడీఏ పీఓతో పాటు డీడీ అన్నాదొర తదితరులు టెక్కలి మండలం డమర, చిన్నభీంపురం గ్రామాల్లో బాధిత విద్యార్థుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బి.రాకేష్ మాట్లాడుతూ రైలు ప్రమాదంలో గిరిజన విద్యార్థులు చనిపోతే అంత్యక్రియలకు ఇచ్చే సాయం కూడా అందజేయలేదని పీఓ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన డీడీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం టెక్కలి గిరిజన పోస్టుమెట్రిక్ వసతి గృహాన్ని పీఓ సందర్శించగా విద్యార్థులు సమస్యలను ఏకరువు పెట్టారు. -
బాధిత కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలి
టెక్కలి: ఇటీవల రైలు ఢీ కొని మృతి చెందిన ఇంటర్ విద్యార్థులకు సంబంధించి బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, డీహెచ్‌పీఎస్ సంఘాలు శనివారం టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేశారు. వసతి గృహం అధికారులు నిర్లక్ష్యంగా ఉండడంతో ఈ సంఘటన చోటు చేసుకుందని గుర్తు చేశారు. ప్రమాదంలో గాయపడిన సాల్మన్‌రాజుకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనలో గిరిజన శాఖ డీడీతోపాటు ఐటీడీఏ పీఓపై విచారణ చేపట్టాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎం.యుగంధర్, ఎల్.వెంకట్రావు, సిహెచ్.రవి, బి.సంతోష్, కె.శ్రీనివాస్, జస్వంత్, లలిత్, వసంతరావు, కిరణ్, వెంకటేష్, లవకుమార్, ఎస్.కృష్ణ, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
నరసన్నపేట: జిల్లా వ్యాప్తంగా ముంపు బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నరసన్నపేట మండలం బడ్డవానిపేట, మామిడివలస, చిక్కాలవలస, సుందరాపురం గ్రామాల్లో శనివారం పర్యటించి ముంపు పొలాలను పరిశీలించి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షంతో పాటు ఈదురు గాలులకు వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయని ప్రధానంగా అరటి పంటకు నష్టం వాటిల్లిందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం మేల్కొని ఉచిత పంటల బీమాను అమలు చేయాలన్నారు. 72 గంటలు వరి మొక్కలు నీట మునిగి ఉంటే కుళ్లిపోయే ప్రమాదం ఉందని, ఇటువంటి వాటికి ఎన్యూమరేషన్ చేసి రైతులను ఆదుకోవాలని కోరా రు. ఆయన వెంట పార్టీ నాయకులు ఆరంగి ముర ళి, రాజాపు అప్పన్న, పోలాకి నర్శింహమూర్తి, బగ్గు రమణయ్య, బొబ్బాది ఈశ్వరరావు, మొయ్యి లక్ష్మునాయుడు, కింతలి చలపతిరావు పాల్గొన్నారు.


