శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార వేదిక (గ్రీవెన్సు) కార్యక్రమంలో ప్రజల నుంచి 44 వినతులు అందాయి. అదనపు ఎస్పీ (క్రైమ్) పి.శ్రీనివాసరావు వినతులు స్వీకరించి బాధితులకు సకాలంలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
ఇసుక లారీని ఢీకొన్న
ట్యాంకర్
రణస్థలం: లావేరు మండలంలో బొంతుపేట గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ముందు వెళ్తున్న ఇసుక టిప్పర్ లారీని వెనుక నుంచి వచ్చిన ట్యాంకర్ ఢీకొంది. దీంతో ట్యాంకర్‌లో ఉన్న డ్రైవర్ అబ్దుల్లా షేద్‌కు తీవ్రగాయాలయ్యాయి. హైవే పోలీసులు, లావేరు పోలీసుల సాయంతో క్రేన్ సాయంతో క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ను బయటకు తీశారు. కాగా ఇసుక టిప్పర్ లారీ ఆగకుండా వెళ్లిపోయింది. క్యాబిన్‌లో ఇరుకుపోయిన డ్రైవర్ అబ్ధుల్లా షేద్‌ను 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. ఇతను ఉత్తరప్రదేశ్ చెందినవాడు. దీనిపై ఇంకా లావేరు పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉంది.


