బనశంకరి : ప్రశస్తమైన బెంగళూరు కరగ మహోత్సవాల్లో ద్రౌపదీ దేవికి వహ్నికుల క్షత్రియ మహిళలు భక్తిశ్రద్ధలతో హారతి దీపాలు సమర్పించారు.
సోమవారం ఉదయం నుంచి మహిళలు, బాలికలు మల్లెపూలతో తీర్చిదిద్దిన దేవతల హారతి దీపాలను ఊరేగింపుగా తిగళర పేటేలోని ధర్మరాయస్వామి ఆలయానికి వచ్చారు. ద్రౌపదీ దేవికి సమర్పించి పూజలు నిర్వహించారు. కరగ పూజారి జ్ఞానేంద్ర పాల్గొన్నారు.


