సిగ్గు లేదా..
మూలపేట పోర్టు కట్టామని చెప్పుకోవడానికి టీడీపీకి సిగ్గు లేదా. జిల్లా ప్రజల చిరకాల వాంఛ మూలపేట పోర్టు. ఈ కలను సాకారం చేసిన ఘనత వైఎస్ జగన్‌దే.
– కుంభా రవిబాబు, ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ పరిశీలకులు
నిలదీయాలి..
జిల్లాకు ఎందుకు ప్రాజెక్టులు తీసుకురావడం లేదని కేంద్ర, రాష్ట్ర మంత్రులను నిలదీయాలి. అసలు 40 ఏళ్ల టీడీపీ పాలనలో జిల్లాకు చేసిందేమిటి..? వైఎస్‌ఆర్.. ఆ తర్వాత వైఎస్ జగన్‌మాత్రమే జిల్లాకు ప్రాజెక్టులు తీసుకువచ్చారు.
– చింతాడ రవికుమార్, నియోజకవర్గ ఇన్‌చార్జి, ఆమదాలవలస
అదే టీడీపీ భయం
మూలపేట కీలకం
జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడులు ఉన్నా ఏమీ లాభం లేదు. మూలపేట పోర్టు నిర్మాణానికి వైఎస్సార్‌సీపీ శ్రీకారం చుడితే మిగిలిన పనులు పూర్తిచేయడం కూడా చేతకాని అసమర్థ ప్రభుత్వం టీడీపీది.
– బూడి ముత్యాలనాయుడు,
వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో–ఆర్డినేటర్
పునాది రాయి కాదు మైలు రాయి..
మూలపేటకు వైఎస్ జగన్ వేసింది సాధారణ పునాది రాయి కాదు. జిల్లా చరిత్రలో ఓ మైలురాయి. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర తీరాన్ని వాడుకోవాలన్న ఆలోచన చేసిన ఏకై క నేత వైఎస్ జగన్. – పిరియా విజయ, జెడ్పీ చైర్ పర్సన్
సీఎం అంటే వైఎస్ జగన్
సీఎం అంటే వైఎస్ జగనే. మాటిస్తే నిలబెట్టుకుంటారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు కనీసం రైతాంగానికి ఒక్క యూరియా బస్తా ఇవ్వలేదు. మంత్రి రామ్మోహన్‌నాయుడు విమానాల్లో తిరుగుతూ ఉంటే ప్రజల సమస్యలు అర్థం కావు.
– రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే
కూటమికి చెంపదెబ్బ
మూలపేట పోర్టు కార్యక్రమం కూటమి ప్రభుత్వానికి చెంపదెబ్బ. చంద్రబాబు అమరావతి తప్ప రాష్ట్రంలో ఇంకేమీ పట్టవు. కూటమి అరాచకాలను కార్యకర్తలు ప్రశ్నించాలి. – సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వైఎస్సార్‌సీపీఇచ్ఛాపురంసమన్వయకర్త
క్రెడిట్ చోరులపై
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/టెక్కలి/ శ్రీకాకుళం పీఎన్‌కాలనీ : చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ నిప్పులు చెరిగింది. పోర్టుకు సపోర్టు ఇవ్వలేని అసమర్థ వైఖరిని జన సభ సాక్షిగా ఎండగట్టింది. మూలపేట పోర్టుపై చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ సోమవారం ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ పేరిట పోరాటానికి పిలుపునిచ్చింది. దీనికి భయపడిన ప్రభుత్వం అడుగడుగునా ఆంక్షలు విధించింది. నేతలు పోర్టుకు వెళ్లకుండా అడ్డుకుంది. దీంతో వైఎస్సార్ సీపీ నేతలు నౌపడ మూడు రోడ్ల జంక్షన్‌లో సభ నిర్వహించి అధికార పక్షంపై మాటల తూటాలు పేల్చారు.
వైఎస్ జగన్ హయాంలోనే 70 శాతం పనులు పూర్తి కాగా.. టీడీపీ రెండేళ్లలో ఆ 30 శాతం పనులు చేయలేకపోయింది. పైగా మొత్తం ఘనత తమదే అన్నట్లు డబ్బాలు కొడుతోంది. ఈ పోర్టును పూర్తి చేస్తే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి క్రెడిట్ వస్తుందని ఉద్దేశపూర్వకంగా పనులు జాప్యం చేస్తూ వస్తోంది. దీనిపైనే వైఎస్సార్ సీపీ ఉద్యమానికి సిద్ధమైంది. అర్ధంతరంగా ఆగిపోయిన మూలపేట పోర్టు పనుల పరిశీలనకు నడుం బిగించింది. దీనికోసం పోలీసులను అనుమతి కోరితే సభ ఏర్పాటుకు తప్ప పోర్టు సందర్శనకు అనుమతి నిరాకరించారు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్న ఉద్దేశంతో మూలపేట పోర్టుకు సమీపంలో నౌపడ జంక్షన్ వద్ద సభ నిర్వహించారు. సభకు తరలివచ్చిన వేలాది మందితో నౌపడ జంక్షన్ జనసంద్రమైంది. టెక్కలి, కోటబొమ్మాళి నుంచి నౌపడ జంక్షన్ వైపు వెళ్లే రహదారులన్నీ కిటకిటలాడాయి. వేలాది కార్లతో ర్యాలీగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు వచ్చాయి. దీంతో దారులన్నీ వాహ నాల జాతరను తలపించాయి. విపరీతమైన రద్దీ ఏర్పడింది. వాహనాలన్నీ మూలపేట పోర్టు వైపు వస్తుండటంతో పోలీసులు ఆంక్షలు పెంచారు. అయినప్పటికీ ఆంక్షలను చేధించుకుని నౌపడ జంక్షన్ వద్ద జరిగిన సభ కు రకరకాల మార్గాల ద్వారా వేలాదిగా తరలి వచ్చారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలు ప్రసంగాలతో అదరగొట్టారు. పోర్టు లెక్కలన్నీ కళ్లకు కట్టినట్టుగా వివరించారు. టీడీపీ అలసత్వాన్ని వివరిస్తూ మాటల తూటాలు పేల్చారు. క్రెడిట్ చోరీకి యత్నిస్తున్న కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, చంద్రబాబు అండ్‌కోపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మన మూలపేట పోర్టుకు పోదాం పదండి...మన పోర్టు మన కృషి అంటూ పిలుపుతో నిర్వహించిన నిరసన సభ విజయవంతమైంది. ప్రజల నుంచి అశేష స్పందన రావడంతో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తేటతెల్లమైంది.
ఈ కార్యక్రమంలో రాజాం నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త తలేరాజేష్, శ్రీకాకుళం జిల్లాలోని వివిధ నియోజకవర్గ పరిశీలకులు దుంపల లక్ష్మణరావు, అంధవరపు సూరిబాబు, ఎన్ని ధనుంజయ్, చల్లా రవికుమార్, పిన్నింటి సాయి, కరిమి రాజేశ్వరరావు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, అంబటి శ్రీనివాస్, ఆరంగి మురళీధర్, రాజాపు అప్పన్న, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ స్వరూప్, విజయనగరం పార్లమెంట్ పరిశీలకులు కేవీజీ సత్యనారాయణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఉలాల దివ్యభారతి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్, పార్టీ యువజన నాయకులు ధర్మాన కృష్ణచైతన్య, ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు, తమ్మినేని చిరంజీవి నాగ్, ఇంటలెక్చువల్ ఫోరమ్ రాష్ట్ర నాయకులు పిల్లల రామకృష్ణ, పార్టీ నాయకులు దువ్వాడ వాణి, వైవీ శ్రీధర్, పొన్నాడ రుషి, చిట్టి జనార్ధనరావు, మండవల్లి రవి, శ్రీరామ్మూర్తి, బుక్కూరు ఉమామహేశ్వరరావు, పాలవసంత రెడ్డి, మార్పు అశోక్‌కుమార్, గద్దిబోయిన కృష్ణయాదవ్, చింతాడ వరుణ్, ఆట్ల సుజనమ్మ, కోణార్క్ శ్రీను, ఇప్పిలి కృష్ణారావు, కడియాల శ్రీహరి, ఎంఏ భేగ్, డాక్టర్ దాస్, పిలక రాజ్యలక్ష్మిలతో పాటు జిల్లాలో అన్ని నియోజకవర్గాల వైఎస్సార్‌సీపీ శ్రేణులు వేలాదిగా హాజరయ్యారు.


