పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఎప్పటిలా ఈసారి సోషల్ మీడియా వేదికగా సరికొత్త స్ఫూర్తిదాయకమైన స్టోరీతో మనముందుకొచ్చారు. ఈసారి షేర్‌చేసిన కథ..మనిషి తలుచుకుంటే ఏదైన సాధించగలడు..మందితో పనిలేదని చెప్పే సందేశాత్మక స్టోరీ.
మధ్యప్రదేశ్‌లోని బియోరాకు చెందిన 20 ఏళ్ల బిట్టు తబాహి తీవ్రంగా కలుషితమైన అజ్నార్ నదిని ఒంటరిగా శుభ్రం చేసి రాత్రికి రాత్రికే స్టార్‌గా మారాడు. అతని అద్భుతమైన ప్రయత్నానికి అబ్బురపడటమే గాక అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా. ఈ సోమవారం ఒంటరి యోధుడు బిట్టునే మనకు ప్రేరణ అంటూ అతడి కథను పంచుకున్నారు. సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్‌లో ఆ కుర్రాడి గురించి ఇలా రాసుకొచ్చారు.
బిట్టు నదిలో కొన్ని భాగాలను శుభ్రం చేశానని చెప్పుకున్నందుకు విమర్శలపాలయ్యాడని అన్నారు. కేవలం వ్యూస్‌కే ఇదంతా అని ట్రోల్ చేసినట్లు తెలిపారు. సోషల్‌మీడియా కూడా నిజమైన కృషి కంటే అల్పమైన వాటికే ప్రాధాన్యత ఇస్తుంటుందని విమర్శించారు. పోనీ వాళ్లన్నట్లు బిట్టు లైక్‌లు, వ్యూస్ కోసం చేసినా..అది ప్రపంచాన్ని మార్చే మంచి పనైతే కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే కదా, విమర్శలు దేనికని ప్రశ్నించారు.
ఇక బిట్టు బిట్టు జనవరి 26న కొందరు స్నేహితులతో కలిసి నదిని శుభ్రం చేయడం ప్రారంభించాడని చెప్పారు. అయితే కొన్ని రోజులకే ఒంటరిగా ఆ పని చేయాల్సి వచ్చింది. ప్రాథమిక పనిముట్ల సాయంతో కలుషితమైన నీటిలోకి దిగి, పట్టుదలతో ప్లాస్టిక్ వ్యర్థాలను, నాచు, చెత్త తదితరాలను బయటకు తీశాడు. విమర్శలు వచ్చినా బిట్టు తన ప్రయత్నాన్ని ఎక్కడ విరమించలేదు. పైగా నది సహజ సౌందర్యాన్ని సంతరించుకునేలా పట్టుదలతో పనిచేశాడు.
అతడి కృషి ఫలితంగా ఇప్పుడు స్వచ్ఛమైన నీరు పారుతూ అందంగా మారింది ఆ నది అని చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన దృశ్యాలను కూడా బిట్టు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడని అన్నారు. డిజిటల్ స్టార్‌డమ్ కోసం చేసినా..అది సమాజ హితానికి ఉపయోగపడేదే అయితే మెచ్చుకుందా, ప్రోత్సహిద్దాం అని అన్నారు మహీంద్రా. నెటిజన్లు సైతం ఒంటిరి యోధుడు, రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపించారు. కొందరు మాత్రం ఒక వ్యక్తి నదిని శుభ్రం చేయగలిగితే.. మొత్తం దేశం పరిశుభ్రతను సీరియస్‌గా తీసుకుంటే..కచ్చితంగా స్వచ్ఛ భారత్ కాగలదేమో అని పోస్టులు పెట్టారు.
This young man from Biaora, M.P, was criticised for claiming to have cleaned parts of a river just in order to gain social media views.
Well, we usually complain that social media rewards the trivial rather than the meaningful
So If a desire for ‘likes’ can become a force for… pic.twitter.com/ARgEhphuQN— anand mahindra (@anandmahindra) March 30, 2026
(చదవండి: ఆ బాబా ఇంగ్లీష్ ఫ్లుయెన్స్‌కి మతిపోవాల్సిందే..!)


