ఆ బాబా ఇంగ్లీష్‌ ఫ్లుయెన్స్‌కి మతిపోవాల్సిందే..! | Sadhu Baba Fluently Reads English In Viral Video | Sakshi
Sakshi News home page

ఆ బాబా ఇంగ్లీష్‌ ఫ్లుయెన్స్‌కి మతిపోవాల్సిందే..!

Mar 30 2026 3:22 PM | Updated on Mar 30 2026 3:37 PM

Sadhu Baba Fluently Reads English In Viral Video

సాధువులు చూడగానే..ఆధ్యాత్మికంగా చాలా జ్ఞానం ఉన్నవారనే భావనే ఉంటుంది. వారికి ఆధునికత, వివిధ భాషలు తెలిసి ఉండటం అత్యంత అరుదు అని అందరి భావన. గతేడాది కుంభమేళలో మేధావులైన బాబాలను చూసే వరకు అందరి భావన ఇలానే ఉండేది.  అయితే మన చుట్టుపక్కల పరిసరాల్లో తరుచుగా కనిపించే బాబాలు విద్యావంతులేనా అనేది సంశయాత్మక ప్రశ్నే. అయితే ఈ బాబాను చూస్తే ఆ అభిప్రాయం కూడా మారిపోతుందేమో..

అందుకు సంబంధించిన వీడియని వాసుదేవ్ కచ్ఛవా అనే యూజర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఆ వీడియో క్లిప్‌లో సాధుబాబా సమీపంలో పుస్తకాల షాపు వద్ద బల్లపై ఉంచిన పుస్తకాలను తిరగేస్తూ కనిపిస్తారు. వీడియో రికార్డు చేస్తున్న వ్యక్తి ఈ పుస్తకాలన్నీ ఇంగ్లీష్‌లో ఉన్నాయి. మీకు ఇంగ్లీస్‌ వచ్చా అని ప్రశ్నిస్తాడు. 

దానికి ఆ సాధు బాబా ఒక పుస్తకాన్ని తీసుకుని చదవి ఇది రెండొవ అధ్యాయం అని స్పష్టంగా చెబుతాడు. మీకు ఇంత ఇంగ్లీష్‌ ఎలా వచ్చు అని అడగగా..తాను ఇంగ్లీష్‌ చదువుకున్నట్లు చెబుతాడు. ఆ తర్వాత మరో పుస్తకాన్ని ఇస్తూ..చదవమని కోరతాడు. ఆ పుస్తకం వైపు చూస్తూ..'ది సైలెంట్ పేషెంట్'' అని  బదులు ఇస్తాడు. మాకు కూడా ఇంత ఇంగ్లీష్‌ రాదు అనగా, అందుకు ఆ సాధువు వ్యగ్యంగా మీర అంత చదువు చదువుకుని ఉండరు అని కౌంటరిస్తాడు. 

అందుకు సదరు వ్యక్తి మీరు ఎంత వరకు చదువుకున్నారు అని అడుగుతాడు..దానికి బాబా..తాము సాధువులమని దాన్ని బహిర్గతం చేస్తే తమ సర్టిఫికేట్‌లు విలువని కోల్పోతాయని అంటూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు సైతం బాబా క్లాస్‌టాపర్‌..అదరగొట్టేశారు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.

 

 

(చదవండి: నేచర్‌ లవర్స్‌కు డ్రీమ్‌ డెస్టినేషన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement