నేచర్‌ లవర్స్‌కు డ్రీమ్‌ డెస్టినేషన్‌ | Travel Tips: Kalpa is this the most beautiful village in Himachal | Sakshi
Sakshi News home page

నేచర్‌ లవర్స్‌కు డ్రీమ్‌ డెస్టినేషన్‌

Mar 30 2026 1:55 PM | Updated on Mar 30 2026 5:15 PM

Travel Tips: Kalpa is this the most beautiful village in Himachal

హిమాచల్‌ ప్రదేశ్‌లోని కల్ప అనే చిన్న గ్రామం ఒక నేచురల్‌ వండర్‌లా అనిపిస్తుంది. చుట్టూ కిన్నోర్‌ కైలాష్‌ పర్వతాలు గర్వంగా నిలబడిన తీరు, ఈ సీన్‌ చాలా అందంగా ఉంటుంది. మార్నింగ్‌ సమయంలో పీక్స్‌పై పడిన భానుడి కిరణాల వెలుగు చూస్తే ఒక నిర్మలమైన, దివ్యమైన దృశ్యంలా అనిపిస్తుంది.మబ్బులు కొంచెంగా పర్వతాల మధ్య తిరుగుతూ ఉంటే ఈ సీన్స్‌ ఒక పెయింటింగ్‌లా కనిపిస్తుంది. ప్రకృతితో కలిసిన ఈ ప్రదేశం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది.

జీవితం చాలా సింపుల్‌
ఇక్కడ జీవితం చాలా సింపుల్, నిధానంగా ఉంటుంది. చిన్న ఇళ్లు, ఆపిల్‌ తోటలు, తాజా గాలుల మధ్య ఒక కామ్‌ రిథమ్‌ ఉంటుంది. ప్రతీ రోజు ఒక రొటీన్‌ లైఫ్‌ స్టైల్లా కాకుండా ఒక భిన్నమైన అనుభూతిలా అనిపిస్తుంది. లోకల్‌ వీధుల్లో నడుస్తూ ఉంటే గ్రామ జీవితంలో ఉన్న సింప్లిసిటీ, మంచి మనసులు కనిపిస్తాయి.

ఇక్కడ సమయం కొంచెం స్లోగా నడుస్తుందనే భావన కలుగుతుంది. సిటీ జీవితం నుండి దూరంగా ఉన్న ఒక పీస్‌ఫుల్‌ వరల్డ్‌లా ఉంటుంది. ∙సాయంత్రం సమయంలో పర్వతాల వెనక సూర్యాస్తమం చూస్తే ఆ ఆకాశం ఆరెంజ్, పింక్‌ షేడ్స్‌తో మారిపోతుంది. ఆ క్షణంలో కలిగే సైలెన్స్‌, ప్రశాంతత ట్రావెల్‌ ఎక్స్‌పీరియెన్స్‌ని మరింత ప్రత్యేకంగా మార్చేస్తాయి.

ఎలా చేరుకోవాలంటే..
హైదరాబాద్‌ నుండి ముందుగా ఢిల్లీ నుంచి ఫ్లైట్‌లో చేరుకొని, అక్కడి నుండి రోడ్డు మార్గంలో కల్పకు చేరుకోవచ్చు. ఈ ప్రయాణంలో హిమాలయన్‌ దృశ్యాలు, నదులు, లోయలు చూస్తూ సాగుతుంది. దీంతో ఈ జర్నీ ఓ మరపురాని అనుభూతిగా నిలిచిపోతుంది. 

కూనూరు: ఫాస్ట్‌ లైఫ్‌కుబ్రేక్‌
కూనూర్‌లో ఉదయం అనగానే పచ్చని టీ తోటలపై నిదానంగా కదిలే తొలి మంచు కళ్లముందు నిలుస్తుంది. వాటి మీదుగా గాలులు చల్లగా, తాజాగా వీస్తాయి. ప్రతీ ఆకుపై ఉండే తడి ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుంది. ఇక్కడి నేచర్‌ రీఫ్రెష్‌ బటన్‌లాంటి ఫీల్‌ ఇస్తుంది. మార్నింగ్‌ వాక్‌లో ఈ ఫ్రెష్నెస్‌ ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది.

టీ తోటల మధ్య ఉదయం
టీ గార్డెన్స్‌ మధ్య నడుస్తూ ఉంటే అన్ని వైపులా పచ్చని రంగుల లేయర్స్‌ కనిపిస్తాయి. వర్కర్స్‌ను నిదానంగా టీ లీవ్స్‌ సేకరిస్తూ ఉండడం చూస్తే ఆ దృశ్యం ఒక డాక్యుమెంటరీలా అనిపిస్తుంది. చిన్న దారుల్లో నడిచే ప్రతీ స్టెప్‌లో సైలెన్స్‌ , ప్రకృతి మధ్య ఒక కనెక్షన్, ఇక్కడ టైమ్‌ స్లోగా మూవ్‌ అవుతుందనే భావన కలుగుతుంది.

నీలగిరి పర్వతాల రిథమ్‌
నీలగిరి పర్వతాల మధ్య నడుస్తూ ఉంటే ప్రతీ టర్న్‌లో ఒక కొత్త దృశ్యం కనిపిస్తుంది. చిన్న రైలుమార్గాలు, వుడెన్‌ హౌసెస్, వీటితో పాటు ప్రకృతి.. ఇవన్నీ ఒక ప్రశాంతమైన జీవితం ఎలా ఉండాలో లైవ్‌లో చూపిస్తాయి. కొన్ని ప్రదేశాల నుండి వ్యాలీస్‌ చూస్తే మేఘాలు కింద తిరుగుతున్నట్టుగా కనిపిస్తాయి. ఆ అనుభవం మరింత మేజికల్‌గా ఉంటుంది.

హైదరాబాద్‌ నుండి ప్రయాణం
ముందుగా కోయంబత్తూరు వరకు ఫ్లైట్‌ లేదా ట్రైన్‌ లో చేరుకుని, అక్కడి నుండి రోడ్‌ మార్గంలో కూనూర్‌కి చేరుకోవచ్చు. ఆ ఘాట్‌ రోడ్స్‌లో తిరుగుతూ వెళ్తే పర్వత దృశ్యాలు ప్రయాణాన్ని నిధానంగా, ఆనందంగా మార్చేస్తాయి. 

(చదవండి: పెయింటింగ్‌లా కనిపించే గ్రామం)

Advertisement
 
Advertisement
Advertisement