పెయింటింగ్‌లా కనిపించే గ్రామం | Travel Advice: Portofino is a small coastal village in the Liguria region Italy | Sakshi
Sakshi News home page

పెయింటింగ్‌లా కనిపించే గ్రామం

Mar 30 2026 12:09 PM | Updated on Mar 30 2026 12:21 PM

Travel Advice: Portofino is a small coastal village in the Liguria region Italy

పోర్టోఫినో అనేది ఇటలీలోని ఒక కోస్టల్‌ గ్రామం. లిగూరియా తీరంపై ఉన్న ఈ గ్రామం ఒక రంగుల చిత్రంలా కనిపిస్తుంది. సముద్రం పక్కనే నిలిచిన పేస్టెల్‌ కలర్స్‌ ఇళ్లు ప్రతీ ఉదయం ఒక సరికొత్త వర్ణంతో మెరిసిపోతాయి. హార్బర్‌లో నిలిచిన బోట్లు, వీచే గాలులు ఇవన్నీ కలిసి ఒక ప్రశాంతమైన రిథమ్‌లా అనిపిస్తాయి. 

మనసుకు ప్రశాంతమైన భావాలను కలిగించే ఒక చక్కని బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌లా అనిపిస్తుంది. విలేజ్‌ స్ట్రీట్స్‌లో నడుస్తూ ఉంటే చిన్న కేఫ్‌ల నుండి వస్తున్న కాఫీ సువాసన, బాల్కనీ గార్డెన్‌లో విరబూసిన పూలు, ప్రతీ మలుపులో కనిపించే సముద్రం వ్యూ ... ఇవన్నీ కలిసి ఒక సినిమాటిక్‌ ఫీల్‌ ఇస్తాయి. ఇక్కడ జీవితం నిజంగా నిదానంగా సాగుతుంది. 

సముద్రం తీరాన కూర్చుని కాఫీ తాగుతూ, అలల శబ్దాన్ని వినడం ఒక మధురమై అనుభూతిని ఇస్తుంది. నేటి ఈ ఫాస్ట్‌ లైఫ్‌ నుండి బ్రేక్‌ కావాలనుకునే వాళ్లకి ఇది పర్ఫెక్ట్‌ ప్లేస్‌.ఇక్కడ ప్రతీ రోజు ఒక స్లో రిథమ్‌లో నడుస్తుంది రష్‌ లేకుండా, టెన్షన్‌ లేకుండా. లోకల్‌ షాప్స్‌లో హ్యాండ్‌మేడ్‌ సోవెనీర్స్, కోస్టల్‌ ఫ్లేవర్స్‌తో తయారైన ఫ్రెష్‌ సీ ఫుడ్‌ డిషెస్, గెలాటో రుచి చూస్తూ గడిపే క్షణాలు ట్రావెల్‌ను మరింత మెమొరబుల్‌గా మారుస్తాయి. ఫోటోగ్రఫీ లవర్స్‌కి ఇది ఒక డ్రీమ్‌ లొకేషన్‌.. ఇలా ప్రతీ కార్నర్‌ ఒక పోస్ట్‌కార్డ్‌లా ఉంటుంది.

సాయంత్రం సమయంలో పోర్టోఫినో మరింత అందంగా మారుతుంది. సూర్యాస్తమ సమయంలో వెలుగు సముద్రంపై పడితే ఆ ప్రతిబింబం గ్రామం మొత్తాన్ని గోల్డెన్‌ షేడ్‌లో మార్చేస్తుంది. ఆ క్షణాల్లో ప్రతీ దృశ్యం ఒక పెయింటింగ్‌లా కనిపిస్తుంది క్యాప్చర్‌ చేయాలనిపించే మూమెంట్స్‌ ఎండ్‌లెస్‌గా ఉంటాయి. 

హైదరాబాద్‌ నుండి మిలాన్‌ లేదా గెనోవా వరకు ఫ్లైట్‌లో చేరుకుని, అక్కడి నుండి రోడ్‌ లేదా ట్రెయిన్‌ ద్వారా పోర్టోఫినోకి చేరుకోవచ్చు. ఈ ప్రయాణంలో మెడిటరేనియన్‌ తీరం దృశ్యాలు, టన్నెల్స్, కోస్టల్‌ కర్వ్స్‌ జర్నీని మరింత అందంగా మార్చేస్తాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement