జనం తరిమికొడతారనే భయం టీడీపీలో కలగాలి. అప్పుడే పను లు చేస్తారు. అభివృద్ధి అంటే.. కిడ్నీ ఆస్పత్రి, సుజలధార, మూలపేట పోర్టు వంటి ప్రాజె క్టులు. బీచ్ ఒడ్డున 150 లైట్లు వేసి రీల్స్ చేయడం అభివృద్ధి కాదు. పోర్టు పూర్తయ్యే వరకు మేం పోరాడుతూనే ఉంటాం. – ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి
సిగ్గు చేటు
వైఎస్ జగన్ కల, ఎన్నో కుటుంబాల త్యాగాల ఫలితమే మూలపేట పోర్టు. డబ్బులు వచ్చే అమరావతి తప్ప చంద్రబాబు అండ్ కోకు ఏమీ అక్కర్లేదు. వైఎస్ జగన్ చేసిన పనుల వద్ద ఫొటోలు దిగితే క్రెడిట్ వచ్చేయదు. – సీదిరి అప్పలరాజు,
మాజీ మంత్రి
కమీషన్ల కోసమే..
టెక్కలి నియోజకవర్గంలో మైనింగ్ నుంచి లిక్కర్ అక్రమ వ్యాపారాల వరకు కింజరాపు కుటుంబం పెద్ద ఎత్తున దోపిడీ చేస్తోంది. కేంద్ర మంత్రికి దమ్ముంటే బహిరంగ సభ పెట్టి మూలపేట పోర్టు చంద్రబాబు కట్టారని చెప్పగలరా.? కమీషన్ల కోసమే పనులు ఆపేశారు.
– పేరాడ తిలక్, వైఎస్సార్ సీపీ టెక్కలి సమన్వయకర్త


