● పీజీఆర్‌ఎస్‌లో 123 అర్జీల స్వీకరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్జీలు సత్వరమే పరిష్కరించాలని డిప్యూటీ కలెక్టర్ జయదేవి అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో డిప్యూటీ కలెక్టర్లు జయదేవి, డిప్యూటీ కలెక్టర్ పద్మావతిలు 123 అర్జీలు స్వీకరించారు. ప్రధానంగా సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ 31, రెవెన్యూ శాఖ 18, పంచాయతీ రాజ్ 16, రూరల్ వాటర్ సప్లై ఇంజినీరింగ్ 7, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ 6, మున్సిపల్ శాఖ 6, విద్యుత్ శాఖ 4, సర్వే, ల్యాండ్ రికార్‌ుడ్స 4, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ 4, రోడ్లు, భవనాల శాఖ 4, రూరల్ డెవలప్‌మెంట్ 4, వాటర్ రిసోర్స్ 4, వ్యవసాయ శాఖ 2, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 2, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ 2, మార్కెటింగ్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్, కో ఆపరేటివ్ సొసైటీ, సైనిక్ వెల్ఫేర్, సివిల్ సప్లై, ఫైనాన్స్, రోడ్డు రవాణా, ఫారెస్ట్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఒక్కో దరఖాస్తు చొప్పున స్వీకరించారు. ఆయా శాఖలకు సంబంధించి 123 అర్జీలు స్వీకరించారు. అర్జీలు స్వీకరించిన వారిలో జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరావు, డిప్యూటీ కలెక్టర్ లక్ష్మణమూర్తి, కలెక్టరేట్ పరిపాలనాధికారి జీఏ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. యథావిధిగా రెవెన్యూ క్లినిక్ నిర్వహించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ వి.విశ్వేశ్వరరావు, ఆర్డీవోలు సాయిప్రత్యూ ష, కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు. పాత ఆమదాలవలస కుద్దిరాం వద్ద గల పెద్ద చెరువును దౌర్జన్యం చేసి ఆక్రమించారని, పొలాలకు సాగునీరు అందడం లేదని పాత ఆమదాలవలస, కుద్దిరాం గ్రామానికి చెందిన రైతులు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పలుసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. చెరువు విస్తీర్ణంపై సర్వే జరిపించి నిజ వైశాల్యం గల చెరువును రైతులకు సాగు నీటికి అందజేయాలని కోరారు.


