ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదురుగా నిరసన వ్యక్తం చేసిన వైఎస్సార్ సీపీ నాయకులు
ఏబీఎన్ రాధాకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పాలి
అడుగడుగునా ఆంక్షలే..
శాంతియుతంగా ఆందోళన చేసేందుకు వచ్చిన నాయకులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. పోలీస్ క్వార్టర్స్ వద్దకు చేరుకున్న నాయకులను పోలీసులు ధర్నాకు వెళ్లకుండా అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ జోక్యం చేసుకుని.. అక్కడ ఎలాంటి అంతరాయం కలిగించబోమని శాంతియుతంగా నిరసన తెలుపుతామని, ఏదైనా జరిగితే తనను అరెస్ట్ చేయవచ్చని తెలిపారు. దీంతో వీరిని నిరసనకు పంపించారు. ర్యాలీ చేయకూడదని నివారించారు. దీంతో వైఎస్సార్‌సీపీ నాయకులు ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదురుగా ప్లకార్డులు ప ట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఆ సందర్భంలో యువ నాయకుడు ధర్మాన కృష్ణ చైతన్య తన వర్గంతో ఇక్కడకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. వీరిని పోలీసులు రోప్ సాయంతో ఇక్కడ నుంచి పక్కకు తరలించారు. హైవేపై మోహరించిన పోలీసులు ఎవరినీ ఇటువైపు రానీయకుండా అడ్డుకున్నారు. డీఎస్పీ వివేకానంద, సీఐ అవతారంతోపాటు జిల్లాలో పదిమంది ఎస్‌ఐలు, సంఘటనా స్థలానికి చేరుకుని ధర్నాను శాంతియుతంగా ముగించి పంపించారు.
ఆమదాలవలసలో చింతాడ రవికుమార్‌ను అడ్డుకుంటున్న పోలీసులు
వైఎస్సార్‌సీపీ నేతల వాహనాలను అడ్డుకుంటున్న పోలీసులు
ఎచ్చెర్ల:
మహిళలపై అవమానకర వాఖ్యలు చేసిన ఏబీఎన్, అంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్‌చేశారు. ఎచ్చెర్లలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదురుగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్యలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన రాధాకృష్ణ రాష్ట్ర మహిళలందరికీ తలవంచి క్షమాపణ చెప్పాల్సిందేనని వైఎస్సార్ సీపీ నేతలు కోరారు. మహిళలకు గౌరవం ఇస్తామని చెప్పుకునే కూటమి నాయకులు ఈ ఘటనపై స్పందించకపోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు.
మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన రాధాకృష్ణపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇచ్ఛాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, విజయనగరం పార్లమెంట్ పరిశీలకులు కిల్లి వెంకట సత్యనారాయణ, అసెంబ్లీ నియోజక వర్గ పార్టీ పరిశీలకులు దుంపల లక్ష్మణరావు, అంధవరపు సూరిబాబు, పిన్నింటి సాయికుమార్, కరిమి రాజేశ్వరరావు, ఎన్ని ధనుంజయ్, తూర్పు కాపు, కాళింగ, వెలమ సామాజిక విభాగాల రాష్ట్ర అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, ఆరంగి మురళీధర్, అంబటి శ్రీనివాస్, ఎంపీపీ పైలా వాసుదేవరెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ సెక్ర టరీ నర్తు నరేంద్ర, పార్టీ నాయకులు తడక జోగారావు, బొడ్డేపల్లి పద్మజ, సనపల నారాయణరావు, చింతాడ సూర్య నారాయణ, జరుగుళ్ల శంకరరావు, లావేరు జెడ్పీ టీసీ మీసాల సీతంనాయుడు, మేధావుల ఫోరం ప్రతినిధి పిల్లల రామక్రిష్ణ, పైడి శ్రీనివాసరావు, ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, పొందూరు మండల పార్టీ అధ్యక్షులు బోర సాయిరాం, దన్నాన రాజీనాయుడు, గొర్లె శ్రీనివాసరావు, కొంచాడ రమణమూర్తి, లండ కిరణ్‌కుమార్, గొర్లె ప్రభాకరనా యుడు, మీసాల శ్రీనివాసరావు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గురాన మానస, కెల్ల రామకృష్ణ, అల్లు కన్నబాబు, మాడుగుల జగదీష్, డొంక రమణ, తండ్యాన లక్ష్మణ, మహంతి విజయలక్ష్మీ, గుదే శారద, వెంకన్నగారి శ్రీను, సివిల్‌ప్రసాద్, రౌతు శంకరరావు, గుమ్మడి రాంబాబుపాల్గొన్నారు.
కాశీబుగ్గలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు హౌస్ అరెస్ట్


