జి.సిగడాం:
మండలంలోని వాండ్రంగి గ్రామంలో ఉపాధి పను లు చేస్తూ గుండెపోటుతో పప్పల భాస్కరరావు (59) ఒకేసారి కుప్పకూలిపోయారు. తోటి వేతనదారులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని కొత్త చెరువులో బుధవారం ఉదయం 7 గంటల నుంచి ఉపాధి పనులు చేస్తున్నారు. సుమారుగా 10.30 గంటల సమయంలో భాస్కరరావు ఉన్నట్టుండి పని చేస్తున్న ప్రదేశంలోనే కుప్పకూలిపోయారు. 108 వాహనం వచ్చే సరికే ఆయన మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతి చెందిన విషయం తెలుసుకుని ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బూరాడ వెంకటరమణ, ఏపీఓ చోళ్ల సత్యనారాయణ, వీఆర్‌ఓ శివనారాయణ సంఘటన స్థలం చేరుకుని వివరాలు సేకరించారు. వేతనదారు కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని తోటి వేతనదారులు కోరారు.


