● నేడు నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ధర్మాన కృష్ణదాస్
నరసన్నపేట: చేసిన తప్పునకు క్షమాపణ చెప్పకపోగా మరింత దిగజారి ఏబీఎన్ రాధాకృష్ణ ప్రవర్తిస్తున్నందుకు నిరసనగా గురువా రం జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదా స్ పిలుపు నిచ్చారు. జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లలో రాధాకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ కొత్త పలుకు కార్యక్రమంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ నాయకుల భార్యలపై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒక మీడియా సంస్థ అధినేత రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులను, ఆడ బిడ్డలను నీచమైన భాషతో దూషించడం దురదృష్టకరమన్నారు. రాధాకృష్ణ ప్రవర్తనపై కృష్ణదాస్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
‘రాధాకృష్ణ తీరు ఆక్షేపణీయం’
కంచిలి: ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ పత్రిక అధినేత రాధాకృష్ణ తీరు ఆక్షేపణీయంగా ఉందని ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. ఆయన ఈ విషయమై బుధవారం సాయంత్రం ‘సాక్షి’తో మాట్లాడారు. చంద్రబాబు, లోకేష్‌ల మెప్పు పొందడం కోసం, వారి నుంచి పొందిన ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. తన ఎల్లో మీడియాలో ఎన్నిరకాలుగా తప్పుడు ప్రచారాలు చేయించినా కూడా ప్రజలకు వాస్తవాలు తెలుసని రామారావు అన్నారు. మహిళలను కించపరిచే విధంగా వారి మనోభావాలు దెబ్బతీసేలా, అసభ్యకర రీతిలో, సభ్య సమాజం తలతదించుకునేలా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలపై నర్తు రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అవి కొత్త పలుకులు కావని, చెత్త పలుకులు అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏ మహిళను దూషించినా చర్యలు తీసుకుంటామని పలుమార్లు డైలాగులు కొట్టిన నారా లోకేష్, హోం మంత్రి అనిత ఏబీఎన్ రాధాకృష్ణపై ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
ఎచ్చెర్ల: ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీలో గత ఐదురోజులుగా నిర్వహిస్తున్న ఫేర్‌వెల్ డే వేడుకలను బుధవారం ఘనంగా ముగించారు. ఈసీఈ ఇంజినీరింగ్ విభాగం వారు ఈ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రొఫెసర్ సండ్ర అమరేంద్రకుమార్ మాట్లాడుతూ ఐదు రోజులు పాటు వినోద కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పరిపాలనాధికారి డాక్టర్ మునిరామకృష్ణ, డీన్ శివరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి వాసు, వెల్ఫేర్ డీన్లు సింహాచలం, యోగీశ్వరి, గగనదీప్ తదితరులు పాల్గొన్నారు.


