మెళియాపుట్టి: ఆదివాసీలకు అన్యాయం చేయవద్దని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ ఆల్ ఇండియా కన్వీనర్,అరకు మాజీ ఎంపీ మిడియం బాబూరావు అన్నారు. ఆయన గురువారం చాపరలో గిరిజనుల హక్కులు, వారి సమస్యలు, జీఓ నంబర్ 3 గురించి, మెళియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌పై జరుగుతున్న పోరాటాల గురించి నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. గిరిజన పంటలకు మద్దతు ధర లేదు, గిరిజన గ్రామాలకు మౌలిక సదుపాయాలు లేవు, బెంతొరియాలు గిరిజనులమని చెప్పుకుని ఆదివాసీలను అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజనుల సమస్యలు చెప్పుకోవాలంటే జిల్లాలో ఐటీడీఏ కూడా లేదని తెలిపారు. తక్షణమే మెళియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలన్నారు.
కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర, రాష్ట్ర రైతుసంఘం కార్యదర్శి మోహన రావు, జిల్లా కార్యదర్శి నిమ్మక అప్పన్న, జిల్లా కార్యదర్శి పోలాకి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.


