పలాస: పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ‘ఎ’ గ్రేడ్ గుర్తింపు లభించింది. ఈ కళాశాలలో గురువారం అకడమిక్ ఆడిట్ నిర్వహించారు. అకడమిక్ అడ్వైజర్‌గా నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇంగ్లిష్ విభాగం లెక్చరర్ ఎం.శాంతి, రాజాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇంగ్లిష్ లెక్చరర్ డాక్టరు బి.వేణుగోపాలరావులు సందర్శించి బోధన విధానాలు, విద్యా ప్రమాణాలు, అకడమిక్ పనితీరును నిశితంగా పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె.వెంకటలక్ష్మి, ఐక్యూఏసీ కోఆర్డినేటరు పి.వెంకటరమణ వీరికి సహకరించారు. ఈ సందర్భంగా అకడమిక్ అడ్వైజర్ శాంతి మాట్లాడుతూ విద్యా ప్రమాణాలు, నిర్వహణ విధానాలు ఉన్నతంగా ఉన్నాయని ప్రశంసించారు. అధ్యాపకులను, అధ్యాపకేతర సిబ్బందిని అభినందించారు. ప్రభుత్వ కళాశాలకు ‘ఎ’ గుర్తింపును ప్రధానం చేశారు.


