● బీఆర్ నాయుడిని తొలగించాలి
● 4న జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ధర్మాన కృష్ణదాస్
నరసన్నపేట: తిరుమల పవిత్రతను కాపాడే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయు డును వెంటనే పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ డిమాండ్ చేశారు. గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. చైర్మన్‌గా బీఆర్ నాయు డు టీటీడీని అపవిత్రం చేస్తున్నారని మండి పడ్డారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు జిల్లా వ్యాప్తంగా ఈ నెల 4న వైఎస్సార్ సీపీ శ్రేణులు వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు చేయనున్నారని పేర్కొన్నారు. బీఆర్ నాయుడిని ప్రభుత్వం వెనకేసుకురావడాన్ని నిరసిస్తూ పార్టీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.


