గ్యాస్‌ ఇవ్వండి మహాప్రభో.. | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ ఇవ్వండి మహాప్రభో..

Apr 3 2026 7:08 AM | Updated on Apr 3 2026 7:08 AM

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: గ్యాస్‌ కొరత సమయంలో హోటల్స్‌ను మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, తమకు కమర్షియల్‌ గ్యాస్‌ ఇవ్వాలని జిల్లా హోటల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు గురువారం కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. కమర్షియల్‌ సిలిండర్లు బ్లాక్‌లో ఒడిశా వెళ్లిపోతున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. కొందరు డీలర్లు అక్రమంగా కమర్షియల్‌ సిలిండర్లు విక్రయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇచ్ఛాపురంలో ఇండియన్‌ గ్యాస్‌ డీలర్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హోటల్‌ నిర్వహణ భారంగా మారిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement